డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబు (డిం .టిం.ప్ర.జ .)-2
డింగిరి –జగన్ నరకాసుర వధ అని మూడు రోజుల ఉద్యమం చేశాడేమిటి గురూ ?
టింగిరి –‘మూడు రొజుల ముచ్చటే అయింది కదరా శిష్యా .మూర్ఖులు తప్ప ఎవ్వరూ కదలలేదు .భస్మాసుర హస్తం అని చేస్తే బాగుండేది .వెర్రి తగ్గింది రోకలి తలకు చుట్టమన్నాట్ట ఒకడు .అదీ తీరు .
డిం-కెసిఆర్ ఎంసెట్ విద్యార్దుల ప్రవేశానికి అడ్డ పుల్ల వేస్తున్నాడెంటి స్వామీ ?
టిం –ఏదో ఒక సమస్య లేంది ఆయనకు తిన్నది జీర్ణం కాదు .పూర్వం శుక్రాచార్యుడు బలి చక్రవర్తి వామనుడికి భూమి దానం చేస్తుంటే నీళ్ళ చెంబులో దాక్కొని అడ్డు పడితే వామన స్వామి దర్భ పుల్లతో పొడిచి ఒక కన్ను లేకుండా చేశాడు గుర్తుందా?
డిం –సోనియాకు లోక్ సభలో ప్రతి పక్ష హోదా ఇవ్వలేదు మోడీ ?
టిం –ప్రభుత్వ పక్షం లో పదేళ్ళు చక్రం తిప్పి ఏం పొడి చేసిందినాయనా ఆబిడ ?ఇప్పుడు హోదా ఇస్తే అంతకంటే వెలగ బెట్టేదేమిటి ?పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పారేస్తుందని మోడీ అనుకోని ఉండచ్చు .
డిం –చంద్ర బాబు ది ఐరన్ లెగ్ అన్నారు ?
టిం –కరువు తీరా వర్షాలు కురుస్తుంటే ఇంకా ఎప్పటి పాత మాటో పట్టుకు వేళ్ళాడుతావేమిట్రా ?ఇప్పుడు అందరూ గోల్డెన్ లెగ్ అని సంబర పడుతుంటే ?
డిం –బీహార్ లో నితీష్ ,లాలూ సోనియా జతకట్టారట?
టిం –అదా !మోడీ బాధిత సంఘం .ముగ్గురు మూర్ఖులు సినిమా చూశావా ? ఓట్లు అడుక్కోవటానికి ఇదో వేషం .నమ్మేదేవరురా ?
డిం –మామ కెసిఆర్ లా మేనల్లుడు హరీష్ జనాన్ని రెచ్చ గొడుతున్నాడు ?
టిం –మామకు మొగుడు కావాల్సిన వాడు మామకు తగ్గ అల్లుడయ్యాడు .ఇద్దరికీ ఇంకా ఉద్యమ స్పిరిట్ పోలేదు .ప్రభుత్వం లో ఉన్నామన్న స్పురణ రావటం లేదు .అందుకే ఈకారు కూతలు .
డిం –మరికొడుకు మాటేమిటి స్వామీ ?
టిం –ఏ మాటకు ఆ మాటే చెప్పు కోవాలి .కే టి ఆర్ .ఆ అబ్బకు పుట్టాల్సిన కొడుకు కాదు .సంస్కారం తెలిసిన వాడు .తెలంగాణా బాగు పడాలంటే యెంత త్వరగా ‘’గులాబీ రాజును’’ దింపి ,’’చిన్న గులాబిని ‘’ఎక్కిస్తే అంతమంచిదని జనం అనుకొంటున్నట్లు వేగుల వాని వార్త.
డిం – మాటలు చెప్పినంత తేలిగ్గా మోడీ మన రాష్ట్రానికి ఏమీ విదల్చలేదేంటి గురవా ?
టిం –రోడ్డు రోలర్ మెజారిటీ ఉంటె అంతే శిష్యా .ఎలక్షన్ ముందు బాబు అవసరం ఉంది మోడీకి .ఇప్పుడు మోడీ అవసరం బాబుకి .తిరగాలి వెంటపడాలి ఒత్తిడి చేయాలి ,తెచ్చుకోవాలి .మధ్యలో ఎవరూ అడ్డు పడకుండా చూసుకోవాలి .డిం –గవర్నర్ ఇఫ్తార్ విందుకు కెసిఆర్ డుమ్మా కొట్టాడెంటి?అంత బిజీనా ?
టిం –బిజీనా పాడా!కాళ్ళూపు కుంటూ కూచునే వాడికి బిజీ ఏంది? పిల్లలు బస్ ప్రమాదం లో చచ్చినా చీమ కుట్టినట్లు గాపలకరించటానికో చూడటానికో వెళ్ళని వాడు ,గడీల చుట్టూ ప్రదక్షిణం చేయటానికి ,దొరల్తో విందులు కుడవటానికి టైం ఉందికాని వీటికి సమయం లేదు దొర గారికి అని రేవంత్ రెడ్డి అన్నది అక్షరాలా నిజం .అదే చూడు బాబు ఆఘ మేఘాల మీద ప్రమాద స్థలాలకు చెన్నై వెళ్లి ఓదార్చి సాయం అందించాడు .బ్లడ్ లో ఉండాలి రా ఏదైనా –ఇక చాలు వెళ్లిరా .
-మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-14-ఉయ్యూరు

