స్వర్గీయ బాపు కు బాష్పాంజలి
సరసభారతి 68వ ప్రత్యెక సమావేశం గా ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు లిపికి సృజన కర్త స్వర్గీయ బాపు గారికి బాష్పాంజలి కార్యక్రమాన్ని ఈ రోజు6-9-14-శనివారం సాయంత్రం 6గం లకు శాఖా గ్రంధాలయం లో నిర్వహించింది . గబ్బిట దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా ,శ్రీ పి విజయ సారధి ,శ్రీ జి వేణుగోపాల రెడ్డి ,శ్రీ భవాని శంకర రావు లు బాపు బహుముఖీన ప్రజ్ఞను వివరించారు ..
దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ‘’బాపు అంటే చిత్ర కళా విశ్వ రూపం .’’creative par excellence ‘’ అని హిందూ పత్రిక రాసింది .’’నా అంతటి వాడు నేను ‘’అన్నాడు బాపు .స్వయం కృషిలో ఎదిగిన బాపు .ప్రముఖ చిత్ర కారులు రవి వర్మ ,దామెర్ల రామా రావు ,మొక్కపాటి కృష్ణ మూర్తి ,వడ్డాది పాపయ్యలకు దీటైన వాడేకాదు ఇంకో అడుగు ముందుకు వేసిన వాడు .ఆయన సృజనకు గీటు రాళ్ళు ‘’సీ గాన పెసూనాంబ ‘’’,బుడుగు ‘’,రాధాగోపాలం ‘’ బామ్మ అంటే బాపు గీసే కన్నె పిల్ల బొమ్మ . లెక్కలేనన్ని పుస్తకాలకు ముఖ చిత్ర శిల్పి బాపు .బాపు చిత్రం ఉంటె చాలు హాట్ కేకులే అయ్యేవి బుక్స్ .అనేక భాషల్లో విదేశీ భాషల్లో రష్యా ,యూరప్ భాషా పుస్తకాలకు కూడా అక్కడి సంప్రదాయాన్ని జీర్ణం చేసుకొని బొమ్మలు గీసి తన అవగాహనకు పట్టాభి షేకం చేయిన్చుకొన్నారు .ఆయన గీసిన కార్టూన్లు ముసి ముసి నవ్వులే కాక అట్టహాసపు నవ్వులూ పూయించాయి .స్పెషల్ గా ఆంధ్రపత్రిక వారపత్రిక లో బాపు చిత్రించిన ‘’కార్ట్యూన్లు’’ఆయా ప్రముఖుల కారికేచర్లు గా నభూతో నభవిష్యతి అనిపించాయి .ఇది తెలుగులో ప్రత్యెక ఒరవడి దీనికి ఆద్యుడు బాపుయే’’
‘’బాపు సంతకమేఓ ప్రత్యేకత .చెరగని సంతకం అనిపించింది .నా దృష్టిలో బాపు అంటే ‘’బాగా చిత్రించి పులకింప జేసేవాడు ‘’అని అర్ధం .మనకు ఆ బాపు ఈ బాపు ప్రత్యేకమైన వారు .ఇద్దరూ చిరంజీవులే. వారికి మరణం లేనేలేదు .బాపు తీసిన .సీతా కల్యాణం లండన్ చికాగో సాన్ రీగో లలో ప్రత్యెక ప్రదర్శన పొందింది .’’బ్రిటిష్ ఫిలిం ఇన్ ష్టి ట్యూట్’’లో సీతా కల్యాణం పై కోర్సు ఏర్పాటు చేశారు అంటే ఆయన మేధా యెంత గొప్పదో తెలుస్తోంది .దర్శకత్వం లో ఏ మాత్ర్తం అనుభవం లేక పోయినా మొదటి సినిమా ‘’సాక్షి ‘’కి దర్శకత్వం చేసి తన ప్రతిభా వ్యుత్ప్త్తులకు సాక్షి గా చేశాడు .బంగారుపిచ్చుక హాస్య రస బంధురం గా తీశాడు. దీనినే చాలాకాలం తర్వాత ‘’పెళ్ళికొడుకు ‘’గా తీశాడు. కాని బాక్సా ఫీజు దగ్గర బోల్తా కొట్టింది .
బాపు –రమణ ల మేగ్నం ఓపస్ ‘’ముత్యాల ముగ్గు చిత్రం .సినిమాలలో కొత్త ఒరవడి సృష్టించింది .కాంట్రాక్టర్ పాత్రలో రావు గోపాల రావు ను జీవింప జేశాడు .హలానికి ఒక ప్రత్యెక పాత్రనిచ్చి లిఫ్ట్ ఇచ్చాడు .ఎవరికీ మేకప్ లేకుండా ప్రయోగాత్మకం గా తీసిన సినిమా .ఇందులో పొగడ్తకు అడ్డు పడే భజంత్రీలు ఆ సృజనకు పరాకాష్ట .శేషేంద్ర శర్మ గారితో రాయించిన పాట అన్ని విధాలా అద్భుతమే .ఆరుద్ర ,మహదేవన్ బాపు ,రమణ తెలుగు సినిమాకు నాలుగు మూల స్తంభాలు .వీరి కాంబినేషన్ హిట్ మీద హిట్ అయి రుజువైంది .ఏ సినిమా అయినా తెలుగుదనానికి ఆట పట్టు .సంస్కృతీ నిలయం. కట్టు బొట్టు అంతా దేశీయమే .రామాయణ రహస్యం తెలిసిన వాడు బాపు .ఏ సినిమా అయినా అదే అంతస్సూత్రం గా తీశాడు. రామాయణాన్ని మించిన కద లేదని బాపు విశ్వాసం .సంగీతం మీద గొప్ప అభిరుచి ఉన్న వాడు .మాండలీన్ ,గిటార్ వాయించేవాడు .పర్వీన్ సుల్తాన ,బడే గులాం సంగీతానికి పరవశించేవాడు .రమణ రాసిన ఆ నాటికధకు బాపు బొమ్మ వేస్తె విద్వాన్ విశ్వానికి ఆకధ ఇచ్చాడు రమణ .చూసి ‘’ఇడ్లీ కంటే చట్నీ బాగుంది ‘’అని బాపు బొమ్మ బాగుంది కనుక కద పత్రికలో వేస్తున్నానన్నాడు విశ్వం .
విస్తృత సాహిత్యాధ్యయనం బాపు సొమ్ము .ఆంగ్ల భాషా సాహిత్యాన్ని పుడిసిలి పట్టాడు .ఆయన చదవనని ఇంగ్లీష్ పుస్తకం లేదంటారు .తన సమర్ధతపై నమ్మకం ఉండటం వలన ‘’పొగరు గానే జీవించాడు .వినయం బాపు ఆభరణం .సభలూ సమావేశాలకు దూరం .ఒంటరి తనం రమణ తో జంటరి తనం ,తుంటరి తనం ఇష్టమైన వాడు .సినిమా తీయటానికి డబ్బు లేక అప్పులు తెచ్చి తర్వాత తల తాకట్టు పెట్టి అయినా పువ్వుల్లో పెట్టి ఇచ్చే జంట ఆది.కన్నప్ప ను యధాలాపం గా తీస్తే సూపర్ హిట్ .సీతా కల్యాణాన్ని తన ప్రతిభా సర్వస్వం గా తీస్తే బాక్సాఫీస్ దగ్గర దెబ్బతింది .కాని అత్యద్భుత రికగ్నిషన్ తెచ్చుకోంది.చిత్రకారుడిగా దేశవ్యాప్తం గా గుర్తింపు రాలేదు .కార్తూనిస్ట్ గా బాగా పేరొచ్చింది .తెలు చిత్ర నటులందరితో సినిమా తీశాడు .
ఆయన సార్వకా లిక చిత్రాలుగా పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళాం నిలిచిపోతాయి .స్త్రీ అంటే ఆడే బొమ్మ కాదని వ్యక్తిత్వం ఉన్న మనిషని అన్ని సినిమాలలో రుజువు చేశాడు .’’సిఫాసరులతో కాపురాలు చక్క బడవు ‘’అని ముత్యాల ముగ్గులో చెప్పించిన డైలాగ్ బాపు మనస్తత్వానికి దర్పణమే. బాపు తీసిన యే సినిమా అయినా రామాయణ భావం అంతర్లీనం గా ఉంటుంది .ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో వందేళ్ళ సినిమా సంబరాలలో బాపును సన్మానిస్తే ఆయన్ను మాట్లాడమంటే ఒక కాగితం మీద ‘’ఇంత వెన్నెల ను నేనేమి చేసుకోను?’’అన్న సంస్కారి బాపు . భమిడి పాటి వారి శతజయంతి ని విజయ వాడ పుస్తక మహోత్సవం లో జరిపితే ఈ జంట రాసిన కైమోడ్పు అనితర సాధ్యం .బాపు –రమణల ‘’స్నేహ షష్టి పూర్తి’’ని హైదరాబాద్ లో నిర్వహించిన అదృష్టం శ్రీ చిట్టెన్ రాజు దక్కించుకొన్నాడు .ఆ జంట స్నేహం అందరికీ ఆదర్శ ప్రాయం జీవికా జీవుల్లా మెలిగారు కడదాకా .ఆ కుటుంబాలూ అంతే సన్నిహితం గా ఉంటాయి . ఆంధ్రజ్యోతిలో రోజూ తిరుప్ప్పావై ను రమణ రాత బాపు గీత తో వేశారు .బాగుందని నేను రాసిన కార్డుకు స్పందించి ‘’సిరి నోము ‘’పుస్తకం పంపిన సహృదయుడు బాపు .టంగుటూరి సూర్య కుమారి పై యాభై ఏళ్ళుగా లండన్ లో ఉంటున్న శ్రీ గూటాల కృష్ణ మూర్తి తెచ్చిన ప్రత్యెక పుస్తకం గురించి ఊరికే మా మైనేని వారితో ఎప్పుడో అంటే దానికాపీలు ఇద్దరి వద్దమాత్రమే ఉన్నాయని బాపు గారు అని ,తన వద్ద ఉన్న ఆ మూడు వేల రూపాయల ఖరీదైన పుస్తకాన్ని రిజిస్టర్ పోస్ట్ లో పంపిన బాపు సౌజన్యానికి ఏమి విలువ కట్టగలను ? అందాల రాముడిని ఒక పిక్నిక్ సినిమాగా ,సంపూర్ణ రామాయణాన్ని చిత్రకావ్యం గా చిత్రించినా బుడ్డి మంతుడిని బుద్ధి మంతుడిని చేసినా ,కుంభ కర్ణుడిని నిద్ర లేపే సన్నీ వేశాన్ని చిత్రించినా ,సీతాకల్యాణం లో గంగావతరణాన్ని నయన మనోహరం గా తీసినా ,బాపు మాత్రమె తీయాలి అనిపించాడు .
ముఖ్య మంత్రి రామా రావు కోరిక పై చిన్న తరగతులకు నయనానందమైన పుస్తకాలు తయారు చేసి ఈ జంట తెలుగు విద్యను రుణ గ్రస్తుల్ని చేశారు .హాయిగా బాసిం పట్టు వేసుకొని బద్ధకం గా కూర్చున్న తెలుగు అక్షరాలను నిలబెట్టి వంకర టింకర నడకలు నేర్పి చలన శక్తి శక్తి కలిగించి బాపు లిపి సంస్కరణ తెచ్చి తన పేరుతొ ఒక ఫాంట్ కు సృస్తికర్తయై ప్రపంచం లో ఎవరికీ దక్కని గౌరవాన్ని దక్కించుకొన్నాడు .ఇవన్నీ మన ప్రభుత్వాల దృష్టికి రాక పోవటం వాళ్ళ ద్రుత రాష్ట్ర తత్వానికి నిలు వెత్తు నిదర్శనం .బాపు హిందీ సినిమాలు ‘’ప్రేమ –ప్రతిజ్ఞా ‘’,హం పాంచ్ ‘’,సీతా స్వయం వర్ ,ఆనోఖి భక్త బేజుబాన్ ,ఓ శత్ దిన్’’,ప్యారి బెహనా ‘’,మెహబూబ్ ‘’,మేరె ధీరం జమానా ‘’లకు దర్శకత్వం వహించాడు .తమిళం లో ‘’నీతి దేవన్ ‘’,’మాయ గుసిరాన్ ‘’లను డైరెక్ట్ చేశాడు .
శ్రీ రామాంజనేయ యుద్ధం లో ఈలపాట రఘురామయ్యచేత ఆంజనేయ స్వామికి పాడించిన పద్యాలు పాటలు చిరస్మరణీయాలు . ఆ ప్రతిభ బాపు దే.రఘురామయ్య గొంతులో ఎంతటి ఆర్ద్రతను భక్తిని పలికించారో వింటే ఆశ్చర్యమేస్తుంది ..’’రామ నీల మేఘ శ్యామా !కోదండ రామా ‘’ఒక్క పాట చాలు రఘురామయ్య పాత పాటలూ పద్యాలు దీనికి బలాదూరు .శంకరమంచి సత్యం రాసిన101 ‘’అమరావతికధలు ‘’కు తన చిత్రాలతో అమరత్వం కల్పించాడు బాపు .అలాగే సీతారామా రావు రాసిన ‘’గోదావరి కధలకు ‘’కూడా .ఇలా ఎన్నని చెప్పను బాపు గురించి ? వారి ఆత్మకు పరమ శాంతి, వారి కుటుంబానికి ధైర్యం ఓదార్పు కలగాలని ప్రార్ధిస్తున్నాను ‘’అని చెప్పారు .చివరగా శ్ర ఆచార్య యెన్ గోపి రాసి ఈరోజు ఆంద్ర జ్యోతిలో వచ్చిన కవిత-ను దుర్గా ప్రసాద్ చదివి వినిపించారు .
మహోన్నతుడికి నివాళి
తెలుగు వాకిళ్ళలో
ముగ్గులాంటి వాడు బాపు
మూడు తరాలుగా
పత్రికలకు ప్రాణం పోసిన
అక్షరాల వేల్పు.
అతడు మాట్లాడడు
బొమ్మలే మాట్లాడుతాయి
సంగీతాన్ని పీల్చుకున్న
గీతల విన్యాస మాయనది
ఎంత అమాయకంగా నవ్వుతాడు!
అంతర్ముఖంగా వికసిస్తాడు
రామున్ని ఎన్ని విధాలుగా దర్శించాడో!!
అతని కెమెరా ఫ్రేమ్
దృశ్యపరిమళాల ధూంధామ్.
ఊపిరిని తీగలుగా మార్చుకున్న
చిత్రకుంజ మతడు
హృదయాల్లో వ్యాపించి మధూళి
ఆ మహోన్నతుడికి నా నివాళి
– డా. ఎన్. గోపి
ను చదివి వినిపించారు దుర్గా ప్రసాద్
శ్రీ విజయ సారధి బాపు జీవితం ,రమణతో స్నేహం ,ఆరుద్ర కూనలమ్మ పదాలలో బాపు పై రాసిన పదాన్ని వినిపించి ఇంతకూ మించి ఎవరూ ఆయన్ను వర్ణించ లేరని అన్నారు .శ్రీ వేణు గోపాల్ బాపు దర్శకత్వ ప్రతిభను ప్రస్తుతిస్తే ,శ్రీ భవానీ శంకర్ జంట స్నేహాన్ని గుర్తు చేసుకొన్నారు .బాపు బొమ్మల పుస్తక ప్రదర్శన నిర్వహించి సరసభారతి సరసమైన నివేదన అందించింది .కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి బాపు ను స్మరించటం పుణ్యం అని ఆయన అచ్చతెనుగు చిత్రకారుడు దర్శకుడు అని ఆయన లేని లోటు తీర్చలేమని అంజలి ఘటింఛి వందన సమర్పణ చేయాగా జనగణ మణ తో సభ సమాప్తమైంది .
ఉయ్యూరు వాసి ప్రస్తుత అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ‘’బాపు-రమణ స్మారపురస్కారం గా ఏటా అయిదు వేల రూపాయలను సరసభారతి చేతుల మీదుగా అందిస్తానని తెలియ జేసినట్లు దుర్గాప్రసాద్ చెప్పి సమర్ధులకు ఆ నగదు బహుమతిని త్వరలో అందజేస్తామని చెప్పారు .మైనేని వారి ఔదార్యాన్ని సభ్యులు మెచ్చు కొని కృతజ్ఞత తెలియ జేశారు .
సాహితీ బంధువులకు శుభకామనలు – బాపు -రమణ లకు చిరకాల మిత్త్రులు ,ఆ కుటుంబాలతో అనునిత్య సన్నిహిత్వం ఉన్న అమెరికాలో ఉంటున్న మనస్వి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ”బాపు -రమణ స్మారక పురస్కారం ”గా 5,000రూపాయల నగదు ను సాహిత్య చిత్రలలేఖనాలలొ అర్హులైన వారికి సరసభారతి ద్వారా ప్రతి ఏడాది అందజేయనున్నట్లు తెలియ జేశారు .వారికి సరసభారతి కృతజ్ఞతాభి నందనలు అందజేస్తోంది .త్వరలోనే ఈ పురస్కారాన్నిసరసభారతి అర్హులకు అందజేస్తుందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను .దుర్గాప్రసాద్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-9-14-ఉయ్యూరు




శ్రీ దుర్గాప్రసాద్ గారూ : నమస్తే! ఇదివరలో ఇవిమీకు పంపినట్లు గుర్తు .
మరల ఇపుడు పంపటానికి కారణం బాపుగారి మిత్రుత్వంలో ఉన్న తీపి , వారి
simplicity , egolessness ప్రతిబింబిచే జ్ఞాపకాలకు చిహ్నo గా
గుర్తుకొచ్చింది . వారు సినిమా షూటింగ్లో ఉన్నా , నా ఫోన్ కాల్ ను ఎన్నడూ
తీసికోకుండా ఉండలేదు . ఒకసారి వారు, రమణ గారూ హైదరాబాదు పోడియం మీద
సన్మానంలో ఉన్నపుడు కూడా , వారు మాట్లాడి,మరల రమణ గారికి కూడా ఫోన్ ఇచ్చి
మాట్లాడిoపజేశారు. ఎపుడు మాట్లాడినా రమణ గారితో కూడా (దగ్గరలో ఉంటె)
నేను కుడా ,అడగక పోయినా, రమణ గారితో మాట్లాడకుండా ఫోను పెట్టేసేవారుకాదు
. వారు పిలిసినపుడు నేను ఇంటివద్ద లేకుంటే సత్యవతితో కాసేపు మాట్లాడ
కుండా ఉండేవారుకాదు . నే ను వర్జీనియా లో మా చిన్నబ్బాయి రవి వద్ద
ఉన్నపుడు , శ్రీ గురజాడ వెంకటేశ్వర రావు గారి వియ్యంకునితో నాకు శ్రీ
రామరాజ్యం స్క్రిప్ట్ బుక్ , seen- by- seen sketches వేసినది , పెద్ద
బౌండ్ బుక్ పంపారు . నేను ఆపుస్తకం ఒకచేత్తో మరోచేత్తో కాఫీ కప్పు
పట్ట్టుకుని మెట్లు దిగుతూ , కాలు జారి కుప్పకూలి ఆఖరు మెట్టుమీద
పైనుండి పడ్డాను . మేజర్ fracture జరగాల్సింది , మరియూ skull damage
తప్పిపోయింది. హిప్ బోన్స్ విడి వడాల్సింది. అదంతా తప్పిపోయి
అదృష్టవశాత్తు muscle pains కొన్నిరోజులు బాధపడటంతో సర్డుకుపోయింది . నా
భార్య, కోడలు(emergency physician) ఇద్దరూ చాలా కంగారు పడి ambulance
పిలుస్తామంటే వద్దని మొరాయించాను . ఒకవేళ ఏమైనా చిన్న fracture ఉన్నా అది
ట్రీట్ చెయ్యకపోతే సీరియస్ complications (infection ) అవుతుందన్నా నెను
విను పించుకొలేదు, మూర్ఘంగా .
ఉపోద్ఘాతమంతా ఎందుకు చెబుతున్నానంటే , ఈ విషయం తెలిసిన బాపుగారు వెంటనే
ఆ incident చిత్రిస్తూ స్కెచ్ వేసి (నా పోర్ట్రైట్ స్కెచ్ తో బాటుగా
“రామబాణం” నన్ను మెట్లమీద major accident అవకుడా ఎలా కాపాదిండీ graphic
గా తెలియచెప్పారు . అటువంటిది , ఆయన గారి రామభఖ్తి , విశ్వాసానికి
తార్కాణం . As you notice all his written communications whatever
and to whomever are headed by the three sacred letters: “శ్రీ రామ”
ఇన్ హిస్ ట్రేడ్ మార్క్ –unique universal ఫాంట్ .
His motto: “Your friend is my friend” . ఆ moto తోనే , శ్రీ ప్రేమ్చంద్
గారి పుస్తకానికి, అన్నిపనులూ ఆపుకొని(పుస్తక publication కు అంతగా
వ్యవధి లేనందున) అంతా చదివి , ప్రతి chapter కూ స్కెచెస్ వేసి విజయవాడ
వారి ఇంటికి ఎక్ష్ప్రెస్స్ మెయిల్ చేశారు . ప్రేమచంద్ గారు 10వేల రూపాయల
చెక్ ఇవ్వబోతే వద్దనేశారు , మీరు గోపాలకృష్ణ గారి స్నేహితులు , నాకూ
స్నేహితులేగా అని. కావలసివస్తే వారిని పుస్తకాలు అడుగుతా లెండి అన్నారట
. తీరా , ఆ newjersy publishers బాపుగారు వేసిన స్కెచెస్ eliminate
చేశారు. అది తెలిసినా బాపుగారేమీ బాధపడలేదు , శ్రమంతా వృధా అయిందని .
దానికి సరియైన విలువనివ్వలేదని . అంతటి patience, tolerance , విశాలహృదయం
ఎందరిలో చూస్తాం . Acceptance without expectation is his కోడ్ అఫ్ life.
As the saying goes, “Serenity is directly proportionate to acceptance”
and “inversely prop
ortionate to expectation” in life.
“శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనేది” మా అమ్మ గారు పదే , పదే చెప్పేవారు .
ఇక ఆపుతానండీ నా సోది , మీ కాలం చాలా విలువైనది . క్షమించాలి .
బాపు, రమణ గారల స్మారక బహుమతికి మీరు ప్రతిపాదించిన plan/project నాకు
బాగా నచ్చింది . Thanks for listening .–Yours, Gopalakrishna
(P.S.: ఈసందర్భంలో నాకు ఎప్పటినుoడో ఒక గుర్తు మీకు తెలియజేయా లనుకుoటూ
నే మరచా . అదేమంటే , నేను పుట్టిన కుమ్మమూరు లో రాములవారి గుడి బయట
ఎదురుగా శ్రీరాములవారిని face చేసేటట్లు గ మా తాత , తాతయ్య గారు శ్రీ
హనుమoతుల వారి విగ్రహాన్ని ప్రతిష్టపింపజేశారు చాలా కాలంక్రితం . ఆ
విష్యం నాకు , మా పెద్దబ్బాయి కృష్ణ వివాహా నంతరం పూజచేయిo చే సమయంలో
ఆచార్యులవారు (90 పైచిలుకు సంవత్సరముల వయసు)
చెప్పారు . అప్పటికే వారి కుమారుడు పూజారిగా భాద్యతలు తీసికొన్నారు.
తతంద్రిగారిమీద ,ఆస్తంతా దావలలో పాడుచేశావని విసుక్కుo టూ ignore చేశాడు
. అది నాకెంతో బాధ వేసింది. ఎందువల్ల నంటే , మా ఇంట్లో ఏ ఆరోగ్యవిషయంలో
అవుశర మొచ్చినా , మా అమ్మ గారు కబురు చేస్తే వచ్చి కషాయమో , గుళికలో
ఇచ్చివెళ్ళె వారు. అవి పనిచేసేవికూడా . ఇపుడు ఆ కుమారుడు, వుయ్యురులో
LMP చదివి practice చేస్తున్నాడు . పూజారిగా కుడా కుమ్మమూరు
రాములవారిగుడికి ఉంటున్నారు. ఇది 1990 నాటి సంగతి . ఇంటికివెళ్ళి మరీ మన
లైబ్రరీ ప్రారంభోస్త్సవానికి పిలిచాను . కానీ వచ్చినట్లు లేరు.
ఈ పై para లో ముఖ్యవిషయ మేమంటే మా తాత గారి అడుగుజాడలలో నేను కూడా
లైబ్రరీ తో బాటుగా , శ్రీ, శ్రీ, శ్రీ, సువర్చలంజేనేయస్వామీ భక్తునిగా
initiation తీసికోవాలనే కోర్కె బలీయంగా కొన్నాళ్లుగా మనసులో తొ లు
స్తోంది. నన్ను కూడా మీ భక్త బృందంలో ఒకరిగా స్వీకరిస్తారనే కోరికతో ,
ఇది తెలియజేయట మైనది .
పూర్వలో ,1968 లో bangalore లో మహర్షి మహేష్ యోగి గారి ప్రధమ శిష్యుల్లో
ఒకరైన , అయ్యర్ గారు (బెజావాడ పాత బస్ స్టాండ్ వద్ద నున్న దుర్గావిలాస్
ప్రోప్రైటర్ గారి వద్ద initiation తీసికొని (శ్రీ రాములవారి భక్తునిగా
) మంత్రోపాసనం పొందాను. దానికి , ఇపుడు నేను ఆసిన్చేదానికీ conflict
లేకపోగా ఆంజనేయస్వామి భక్తునిగా ఇమిదిపొతున్దనె నమ్మకంతో ఉన్నాను. మీ
ఉద్దేశ్యం, దీనిలో చేయవలసినవి, భాద్యతలు, తెలియజేయగలరు . –ఇప్పటికే చాలా
,చాలా వ్రాశాను . ఇక శెలవు. మీకు తీరుబడి ఉన్నపుడు స్పందించండి .
అప్పటివరకూ వేచిఉంటా . తొందరలేదు .–మీ గో
—
LikeLike