గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి
2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి
దండి కవి కాలాన్ని ఇద మిద్ధం గా చెప్పలేక పోతున్నారు .కాని ఆరు ,ఏడు శతాబ్ద కాలం వాడని భావిస్తారు .కొందరు భారత దేశం పై ముస్లిం ల దండయాత్రకు ముందే దండి జీవిన్చిఉన్నడని అంటారు .దండం చేతిలో ఉన్న వాడిని దండి అంటారని మనకు తెలుసు .ముగ్గురు దండి లున్నారని మరో కధనం .దండి అనేది అసలు పేరుకాక పోవచ్చు .అయిదవ శతాబ్దికి చెందినా‘’సేతు బంధ ‘’కావ్యం లో కావ్యాదర్శాన్ని గురించి ఉన్ది కనుక అయిదు ఆరు శతాబ్దాల మధ్యకాలమే దండి జీవించిన కాలం అని గట్టిగా చెబుతున్నారు .పదవ శతాబ్దము వరకు దశకుమార చరిత్రను ఎవరూ పేర్కొనక పోవటం విచిత్రమే .మరికొందరు కాళిదాసు సమకాలీనుడు అన్నారుకాని అది నమ్మ శక్యం కాని విషయమే .వచన కావ్యాలు ,అలంకార శాస్త్రమూ రాసి పేరుపొందాడు .సృజన కు మారుపేరుగా ఆయన రాసిన ‘’దశ కుమార చరిత్ర ‘’నిలబడింది . దండి ని పదలాలిత్యానికి ఉదహరిస్తారు ‘’.కావ్యాదర్శం’’ అనే గొప్ప అలంకార శాస్త్రాన్నికవిత్వం గా సృష్టించాడు .ఇది మొదటి అలంకార శాస్త్రం గా గుర్తింపు పొందింది .తమిళ నాడులోని కాంచీపుర వాసి .భట్టి కావ్యాలకు ఈ అలంకార శాస్త్రం ప్రేరణ నిచ్చింది .ముప్ఫై ఆరు రకాల అలంకారాల గురించి చర్చించాడు .అలంకారాలు కావ్యానికి నిజమైన అలంకారాలని వాటి వలన శోభ కలుగుతుందని దండి భావన .సంక్లిష్ట సమాస రచన దండి ప్రత్యేకత .సుదీర్ఘ వాక్య విన్యాసం తో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు .ఒక్కోసారి వాక్యం అరపేజీ దాకా ఉండేట్లు రాసిన సందర్భాలున్నాయి ..అనేక సంయుక్తపదాలను అలవోకగా వాడి నిండుదనాన్ని తెచ్చాడు .
దశ కుమార చరిత్రలో పది మంది యువరాజులు ప్రేమ ,రాజరిక అధికారం కోసం చేసే ప్రయత్నాల కధలుంటాయి .ఆ నాటి సమాజం లోని వివిధ అంశాలకు ప్రతి రూపం గా కమనీయమైన సంస్కృత వచన శైలితో దీనిని తీర్చిదిద్దాడు .సామాన్య జన జీవితాన్ని ప్రదర్శించాడు ఆ కధల్లో .ఇందులో పూర్వ పీఠిక ,దశ కుమార చరిత్ర ,ఉత్తర పీఠిక అని మూడు భాగాలున్నాయి .ముందే చెప్పినట్లు పదలాలిత్యానికి పట్టాభిషేకం చేశాడు దండి .అందుకే ‘’దండినః పదలాలిత్యం ‘’అంటారు .(Dandi is the master of playful words ).దండి దశకుమార చరిత్రను ఆంగ్లం లో ‘’హిందూ టేల్స్’’అని ‘’అడ్వెంచర్స్ ఆఫ్ టెన్ ప్రిన్సెస్ “’అనీ1927లో అనువదించారు .దశ కుమార చరిత్రలో మొదటి చివరి భాగాలలో కొన్ని పేజీలు లభ్యం కాలేదు .రాజవాహన ,విశ్రుత రాజకుమారుల చరిత్రలు అసంపూర్ణం గా ఉన్నాయి .మొదటి ,మూడు భాగాలలో కొంత ఇతరులు రాసిన చేర్పులున్నాయి .అందుకే బహుక్రుతం అనే పేరొచ్చింది .అయితే ఆసాంతం కద ఏక రీతిగానే నడిచింది .
దశకుమార చరిత్రం లో మొదటి రెండు అధ్యాయాల్లో ఉపోద్ఘాతం గ కధను చెప్పాడు .ముసలి రాజు రాజహంస తన కుమారులు చాలాకాలం కనిపించక పోవటం తో ఒక మునీశ్వరుడిని అర్ధిస్తే, వాళ్లు పదహారేళ్ళ తర్వాత తిరిగి వస్తారని ఆయన సెలవి విచ్చాడు .అలాగే వారు చేరుకొని పెద్ద సైన్యం తో వచ్చి శత్రురాజు ‘’మనసార ‘’ను ఓడించి ,అనేక దేశాలను జయించి సుస్తిరం గా దేశసంచారం లో లభించిన విజ్ఞానం తో ప్రజారంజకం గా రాజ్య పాలన చేశారు .
కేతన కవి తెలుగులోకి పద్య కావ్యం గా దశ కుమార చరిత్రను 1250లో అనువదించాడు .సంస్కృత మూల కావ్యాన్ని అగాశే ,కాలే గాడ్ బోలె మొదలైన వారు సేకరించి ముద్రించారు .ఆంగ్లం లోకి హస్కర్ ,కాలే ,జాకబ్ మున్నగు వారు అనువదించారు .అజంతా గుహల నిర్మాణాన్ని దశ కుమార చరిత్ర ఆధారం గా అధ్యయనం చేశారు .అవి అయిదవ శతాబ్దికి చెందిన వాకటక వంశ రాజుల కాలం నుండి ఏడవ శతాబ్దానికి చెందిన పల్లవ రాజుల కాలం వరకు విస్తరించాయని తేల్చారు .వాకటక రాజుల కాలం లో దండికి ముఖ్య పాత్ర ఉండి ఉండేదని తెలిపారు పరిశోధకులు .ఈకాలం లో వ్యాపించిన ‘’వింధ్య వాసిని ‘’గురించికూడా దండి రచనలో ఉందని భావించారు .
దశ కుమార చరిత్రను స్పెయిన్ దేశపు ‘’పికారేస్క్యు ‘’ కావ్యం తో పోలుస్తారు .మొదటి దానిలో ఆరవ శతాబ్దపు రాజకీయ అస్తవ్యస్తత ఉంటె రెండో దానిలో స్పెయిన్ దేశం లోని రాజకీయ కల్లోలం కనిపిస్తుందని అన్నారు .మొదటి దానిలో దొంగలు వ్యభిచారులు సంఘ విద్రోహులుమొదలైన సమాజ తిరస్క్రుతులే ఎక్కువ గా కనిపిస్తారని అంటారు ,.ఇందులోని ముఖ్య కదా భాగాన్ని దండి ‘’బృహత్కధ ‘’నుండి గ్రహించినట్లు అనిపిస్తుంది .ఆ నాటి ప్రజలు, సంఘం ఎలా ఉన్నారో చెప్పాడుకాని ,దండి ఎలా ఉడాలో చెప్పలేదు అనే విమర్శా అంటించు కొన్నాడు .
దండి రాసిన అలంకార శాస్త్ర కావ్యం లో మూడు అధ్యాలున్నాయి .660శ్లోకాలున్నాయి .’’గుణ ప్రస్తాన ‘’భావాన్ని దండి వ్యాపింప జేశాడు .కవిత్వం లో శ్లేష ,ప్రసాద గుణం ,సమతా గుణం ,మాధుర్యం ,అర్ధ వ్యక్తీ ,ఓజా అనే గుణాలు లేక లక్షణాలు ఉంటె నే అది గొప్ప కావ్యం అవుతుందని ఈ శాస్త్ర తాత్పర్యం .
మరోకవి తో రేపుకలుద్దాం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -8-9-14-ఉయ్యూరు

