పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు –
శ్రీశైలం విశేషాలు
శేశాచలానికి నికి శ్రీశైలం అనే పేరుంది .అహోబిల క్షేత్రం కూడా ఇందులో భాగమే .బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు వసించిన కొండ శ్రీ పర్వతం .ఈ పేరుతొ శాసనమూ ఉంది .ఇక్కడి మల్లికార్జున స్వామి జగత్సంరక్షకుడు .ఒకరకం గా తూర్పుకనుమలన్నిటినికలిపి శ్రీపర్వతం అనచ్చు నెమో అన్నారు పుట్టపర్తి వారు .శ్రీశైల క్షేత్రం వయసు నూరు కోట్లసం వత్సరాలట..కాశీ క్షేత్రం దీనికన్నా కోటి ఏళ్ళు ప తర్వాతది అని శైవుల భావనత .ఇక్కడ కాపాలికులు ,క్షపణకులు ,మొదలైన వివిధ సంప్రదాయాల వారున్దేవారట .శాక్తేయులకు మొదటినుంచి నిలయం .ఆడి శంకరులు శ్రీశైలానికి వచ్చినపుడు ‘’కాపాలిక భైరవుడు ‘’ఒకడు చంప టానికి ప్రయత్నించాడు .శిష్యుడైన పద్మ పాదునిపై ఉగ్ర నరసింహ మూర్తి ఆవేశించి వాడిని చీల్చి చంపేశాడు .శంకర భగవత్ పాదులు క్షేత్ర స్తుతి లో ప్రత్యేకం గా క్షేత్రం పేరు చెప్పరు .కాని మల్లికార్జున స్వామిని రెండు మూడు చోట్ల పేర్కొన్నారు .స్వామిపై అంతటి భక్తీ ప్రపత్తులు వారికి .
శ్రీశైలం వీర శైవులకు ఆట పట్టు .వీరందరూ మల్లికార్జునుని మహా భక్తులు .కన్నడ వీర శైవులూ ఆరాధించారు .ఇక్కడి దేవాలయ అర్చన జంగములదే.నన్నెచోడకవి గురువు పండితారాధ్యుడు ఇక్కడే ఉండేవాడు. అక్కడ ఆయన సమాదికూడా నేటికీ దర్శ్శనీయ క్షేత్రమే .పాండవులు అర్చించిన లింగం ఇది .శ్రీరాముడు ఈ అరణ్యాలలో సంచరించాడు .ఇక్కడ అనేక సత్కార్యాలు జరిగాయి అన్ని కాలాలో .అదేవిధం గా చెడ్డ పనులూ కూడా .వామాచార తత్పరులకు ఆవాస భూమి .మధ్య యుగం లో శ్రీశైలం ఒక మహా నగరం .జైన ,బౌద్ధులు ఇక్కడే ఉండేవారు .ఒకరితో ఒకరు పోట్లాడుకొని ఈ మహా పట్నాన్ని సర్వ నాశనం చేసే వరకు నిద్రపోలేదు వారు .చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈ క్షేత్రాన్ని నగరాన్ని గొప్పగా వర్ణించాడు .అంతకు ముందే ఇద్దరు విదేసీరాయ బారులు వచ్చారు .
శ్రీశైల భ్రమరాంబికా ఆలయం వెనుక అయిదారు చిన్న చిన్న రంద్రాలున్నాయి .వాటిపై చెవి పెట్టి వింటే తుమ్మెదల ఝన్కారం విని పిస్తుంది .ఇక్కడ ఉన్నది భ్రామరీ శక్తి అని అర్ధమౌతుంది .అమ్మవారి అలంకారాలు తీసేస్తే మూల మూర్తి ‘’మహిషాసుర మర్దిని ‘’యే.ఆలయానికి ప్రక్కనున్న అగన్నేరు చెట్టు వయసు కనీసం ఆరు వందల ఏళ్ళు .దాని వేరుకింద పెద్ద బావి ఉంది . దీని మూలాన్ని చూసిన వారు ఇంతవరకూ ఎవరూ లేరట .’’ఏదో ఒక నక్షత్రం వారం రోజు అర్ధ రాత్రి కి చంద్ర బింబం ఆ నీటిలో రెండు మూడు నిమిషాలు మాత్త్రమే ప్రతి ఫలిస్తుందని అప్పుడు ఆ నీటిని తాగితే ఆయుస్సు పెరుగుతుందని ‘’బెల్లం కొండ సన్యాసి ‘’అనే మహాను భావుడు తానూ త్రాగి నూట ఏభై ఏళ్ళు బతికానని చెప్పేవారట ఆయన్ను చూసిన వారిలో నారాయణా చార్యుల వారి మిత్రులనేకులున్నారట .ఆయన అక్కడే సమాధి అయ్యాడట .’’నవనాధ సిద్ధులు ‘’ఇక్కడే ఉండేవారు .వారు బంగారాన్ని ఇక్కడ అనేక చోట్ల దాచారట .దానికోసం కొందరు తవ్వకాలూ చేశారట .
శ్రీశైలం అడవుల్లో అనేక దివ్య వనమూలికలున్నాయి ఇక్కడ ఉండే చెంచులకు వాటి రహస్యం బాగా తెలుసు .వాటి ప్రభావాలను వారే బాగా వర్ణించి చెప్పా గలరు .హటకేశ్వరుడు ,సిద్ధేశ్వరుడు ,సారంగేశ్వరుడు ,శిఖరేశ్వరుడు మొదలైన లైన వారెందరో ఇక్కడ వెలశారు .హాట కేశ్వరం దగ్గర ‘’భోగ వతి ‘’అనే కాలువ ఉంది .ఇది కిందున్న పాతాల గంగ అన బడే కృష్ణమ్మ లో కలుస్తుంది .అది పాతాళం లో ఉండే నది అని అందరి నమ్మకం .హాటకేశ్వర మూర్తి భూమికి చాలా లోతులో ఉండేదట .శిఖరేశ్వరాన్ని చూస్తె పునర్జన్మ ఉండదని నమ్మకం .పాతళ గంగలో ‘’సరస్వతి ‘’అనే చిన్న ప్రవాహం కూడా కలుస్తుంది .శ్రీశైలం ఆన కట్ట భూలోక వింత .మనశాస్త్ర వేత్తల బుద్ధికి ప్రమాణం అని మెచ్చుకొన్నారు సరస్వతీ పుత్రులు .ప్రకృతిపై మానవ విజయానికి సంకేతం అంటారు వారు .ఈ మధ్య ఒక చోట త్రవ్వగా ఒక బిలం కన్పించిందట .రెండు మూడు ఫర్లాంగులు దానిలో ప్రయాణం చేసినా దాని అంతూ దరి కనిపించలేదట .ఆ మార్గం ‘’త్రిపురాంతకం ‘’కు దారి మార్గం అట .ఆనకట్ట కట్టేటప్పుడు దాన్ని పూడ్చేశారట .
ఇక్కడి శివ లింగాన్ని అందరూ తాకి అభిషేకం చేసుకొనే వీలుండేది .ఇక్కడి కల్యాణోత్సవం తమాషా గా ఉంటుంది .’’పేటా’’అనే పెద్ద వస్త్రాన్ని ‘’దేవాం గుడు ‘’స్వయం గా పరగడుపున ఉదయమే నేసి తెస్తాడు .ఉత్సవం రోజున దాన్ని స్వామికి అర్పిస్తాడు .అతనికి భక్తులు కానుకలు సమర్పిస్తారు .సాలె వారు కూడా అనేక పేటాలను నేసి తెస్తారు .శివరాత్రి నాడు ఒక భక్తుడు గుడిని దీనితో అలమ్కరిస్తాడు .అంటే పేటా అలంకరణ దేవాలయానికే ,దేవుడికి కాదు మొదట కలశానికి చుట్టి తర్వాత గుడికి చుట్టూ ఉన్న నంది కేశ్వరుల మెడలకు చుట్టుతాడు .ఆ చుట్టేటప్పుడు ఆతను ‘’దిగంబరం ‘’గా మొలత్రాడుకూడా లేకుండా ఉండటం విశేషం .ఒక్క ఇంటి వారికే దీని అధికారం ఉంది. పరంపరగా సాగే ఆచారం ఇది .ఇది వీరశివాచారం ఏమో అని ఆచార్యుల వారి సందేహం .ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జున మూర్తులు తప్ప అన్నీ మారిపోయాయి అంటారు హాట కేశ్వరంహాత లో జాతి జాతి నాగ సర్పాలు ఉంటాయి .అవి ఎవరి జోలికీ రాక పోవటం వింత .శ్రీశైలం కొండ మీద తేలు ,కాని పాము కాని కరిచి చని పోయిన వారెవ్వరూ లేరని పుట్టపర్తి వారు ఘంటా పధం గా చెప్పారు .’’డాం’’ కట్టేటప్పుడు ఏంతో మందిని ఆచార్యుల వారు విచారించారట .అందరూ అది నిజమే అన్నారట .ఇలా శ్రీశైల గధ లేన్నేటినో తవ్వి తీసి మనకు అందించారు పుట్టపర్తి వారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-14-ఉయ్యూరు

