పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -12
జగన్నాధ పండితరాయలు –భామినీ విలాసం -3
జగన్నాధుడు కరుణ రసాన్నికూడా మర్మాలను తాకేట్టు చెప్పాడంటారు పుట్ట పరి వారు .ఉదాహరణకు –‘’ఒక సింహం గుహలో ఉందేది . దాని ముందు మధుదారలతో ఝన్కారం చేస్తే తుమ్మెదలున్న ఏనుగులు కూడా తిరగటానికి జంకేవి .ఇప్పుడా సింహం చనిపోయింది దాని గుహ ద్వారం ముందు గుంటనక్కలు గట్టిగా అరుస్తూ సందడి చేస్తున్నాయి .ఇందులో గూడార్ధం ఉంది .ఒకప్పుడు జగన్నాధుని ఎదుట పడటానికి పెద్ద పెద్ద బిరుదులున్నపండితులు కూడా జంకేవారు .ఆ పండితుడు మరణిస్తే శుష్క పండితులంతా కోలాహలం చేస్తున్నారని తన్ను గురించే చెప్పాడు .చమత్కారానికీ పండితుడు పెద్ద పీట వేస్తాడు .
‘’హారం పక్షసి కేనాపి –దత్త మజ్నేన మర్కతః –లేఢి జిఘ్రతి సంక్షిప్య –కరోత్యున్నత మాసనం ‘’
బుద్ధి హీనుడొకడు కోతి మెడలో ముత్యాల హారం వేశాడు .అది కాసేపు దాన్ని నాకింది ,వాసన చూసింది .చివరికి ముక్కలు చేసి ముడ్డి కింద వేసుకొని ఇకిలించింది .
రస గంగాధరం లో షాజహాన్ పై చాలా కవితలు చెప్పాడు –
‘’మహాత్మ్యస్య పరోవదిర్నిజ గృహం గంభీరతాయా పితా –రత్నా మాహమే కమేవ భువనే కోవా పరో మాద్రుశః
ఇత్యేవం పరిచిన్తయ మసమ సహసా గర్వాంధ కారంగమో-దుగ్దాబ్దే !భవతా సమో విజయతే ధిల్లీ ధరా వల్లభః ‘’
కవి పాల సముద్రాన్ని ప్రశ్నిస్తున్నాడు –‘’మహాత్వానికి నెలవు .గాంభీర్యానికి ఇల్లు .రత్నాలకు తండ్రి అని నీకు గర్వం గా ఉందికదా !నీకా గర్వం అక్కర్లేదు .మా షాజహాన్ చక్ర వర్తి అన్నిట్లో నీతో సమానుడే ‘’
జగన్నాదుడిలో సహజ ధారా శుద్ధి కొట్టొచ్చినట్లు కని పిస్తుంది.తాను డబ్బు అనే ఆసవం చేత కళ్ళు మీదికోచ్చిన రాజుల్ని అనుసరించి పరిగేత్తి పరిగెత్తి అవస్త పడ్డానని చెప్పుకొన్నాడు .తాను గడిపిన జీవితాన్ని గురించి ఇలా చెప్పుకొన్నాడు –
‘’శ్వవ్రుత్తి వ్యాసంగో నియత మధ మిధ్యాః ప్రలపనం –కుతుర్కేష్వభ్యాసః సతత పరపై శూన్య మననం
అపిశ్రావం శ్రావం మమటు పునరేవం గుణ గణాన్ –రుతే త్వత్కో నామ క్షణమపి నిరీక్షేత వదనం ‘’
గంగానదికి చెప్పుకొంటున్నాడు ‘’నేను ఇంత వరకు ఆశ్ర యించింది శ్వ వ్రుత్తి .చెప్పిన వన్నీ అబద్ధాలు .చేసినవి దుర్మార్గాలు .ఎప్పుడూ వాడు డబ్బివ్వ లేదే ,వీడు డబ్బివ్వ లేదే అని తిట్టుకోవటమే నా పని .తల్లీ !నువ్వు తప్ప నా మొహం ఎవడు చూస్తాడు ?’’అని చివరికి ‘’జగన్నాధ స్యాయం సురధుని సముద్దార సమయం ‘’అని చేతులు జోడించి గంగమ్మకు నమస్కరించాడు .అంటే తనను రక్షించే సమయం వచ్చిందని కాపాడమని వేడికోలు .
మనసుకు తాకేట్లు రాశాడు పండితుడు .’’సర్వేపి విస్మృతి పధం విషయాః ప్రయాతాః –విద్యాపీ ఖేదగలితా విముఖీ బభూవః –సా కేవలం హరిన శావక లోచనా మే –నైనా –పయాతి హృదయాడది దేవతేవ ‘’
ఇది రాసే టప్పటికి జగన్నాధుడి వయసు పండి పోయి ఉంటుంది .యవ్వనం లో సాధించిన విజయాలన్నీ మరుగున పడుతున్నాయి .మేధ తగ్గింది .షాజహాన్ మరణం తో దరిద్రమూ పెరిగింది కొడుకు చానిపోయిన దుఖమూ వేధిస్తోంది .ఇంకా మనసులో ఏవేవో దొర్లుతున్నాయి .అయినా తన ప్రేయసి ‘’లవంగి ‘’మాత్రం గుండెలో గూడుకట్టుకొనే ఉంది .ఆ తలపులు దూరం కావటం లేదు .తనను ఆమె వెంటాడుతూనే ఉందట .అదీ పై శ్లోక భావం .దీన్ని కొన సాగిస్తూ
‘’ఉపనిషదః పరి పీతాః –గీతా –పిచ హంత!మతి పధం నీతా-తదపిన హా!విదు వదనా –మానసన దనాద్బహిర్యాతి’’
‘’ఉపనిషత్తులన్నీ పానం చేశాను .గీత ను బుద్ధితో ఆరగించాను .దానిపై అనేక వ్యాఖ్యానాలూ చదివాను .కాని ఏం ప్రయోజనం ? ఆ ప్రియురాలు నా మనసులో ఇల్లు కట్టుకొని ఉంది కదటమే లేదు. నే నోక్కడినే ఇలా ఉన్నానా ?ఇం కెవ్వరూ ఇలా ప్రవర్తించరా?’’
భామినీ విలాసం లో ఎన్ని శ్లోకాలున్నాయో ఎవరికీ తెలియదన్నారు నారాయణా చార్యుల వారు .తాను వేదం వెంకట కృష్ణ శర్మ గారు అనువదించిన ప్రతి ఆధారం గానే రాశానని చెప్పారు .అప్పయ్య దీక్షితులు అవతలివాడిలోని గొప్ప తనాన్ని గుర్తించే సంస్కారం ఉన్నవాడు. ఆ ఓర్పు నేర్పూ లేనివాడు జగన్నాధుడు .దీక్షితులు ‘’మీమాంసా మూర్దన్యుడు ‘’అని పించుకోన్నా ‘’యాద వాభ్యుదయానికి’’ వ్యాఖ్యానం రాస్తూ ‘’కవి తార్కిక సింహుడు ‘’అని దేశికులను పొగడటం దీక్షితుల సంస్కారాన్ని తెలియ జేస్తుంది అన్నారు .దీక్షితులు మహా శివ భక్తుడే కాని విష్ణు పారమ్యంఎరిగిన వాడు .ఒక సారి శ్రీరంగం లో రంగ నాద స్వామిని శివుని రూపం లో దర్శనం అనుగ్రహించ మని ప్రార్దించాడట .స్వామి అలానే దర్శనమిచ్చి అనుగ్ర హించాడట.అదీ నిజమైన భక్తీ అంటారు పుట్టపర్తి వారు .అప్పయ్య దీక్షితులు సార్ధక జీవి. గోవింద దీక్షితుల ప్రేరణ తో ‘’కువలయానందం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .రెండవ గ్రంధం గా ‘’చిత్ర మీమాంస ‘’రాశాడు .ఇంతటి పండితుడిని పట్టుకొని పండిత రాయలైన జగన్నాధుడు ‘’కుతర్క వ్యాసంగం ‘’చేయటం జగన్నాదునికి సంస్కారం కాదు అని నిర్మోహ మాటంగా చెప్పారు సరస్వతీపుత్ర శ్రీ పుట్ట పర్తి నారాయణాచార్యుల వారు .
జగన్నాద పండితరాయలు –భామినీ విలాసం సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-14-ఉయ్యూరు
.

