శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీమైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో  ”బాపు -రమణ ”ల స్మారక పురస్కారం -ప్రఖ్యాత చిక్త్రకారులు కవి కదా, నవలా రచయిత -శ్రీ శీలా వీర్రాజు గారికి ప్రదానోత్సవ దృశ్యమాలిక -21-9-14-ఆదివారం -మచిలీపట్నం -మహతికళా  వేదిక

 

శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారి సౌజన్యం తో –సరసభారతి ఆధ్వర్యం లో

శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు –రమణ ‘’ల  స్మారక నగదు పురస్కారప్రదాన మహోత్సవం

సరస భారతి ఆధ్వర్యం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యం తో ప్రముఖ చిత్రకారులు కవి కదా నవలా రచయిత   శ్రీ శీలా వీర్రాజు గారికి ‘’బాపు -రమణ ‘’ల స్మారక నగదు పురస్కార ప్రదానోత్సవ సభ మచిలీ పట్నం లో మహతి కళావేదికపై  21-9-14-ఆదివారం సాయంత్రం  ఆరుగంటలకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగింది . .ముఖ్య అతిధి మరియు బహుమతి ప్రదాత న్యాయమూర్తి శ్రీ ఏం రామ శేషగిరిరావు గారిని పురస్కార స్వీకర్త   శ్రీ శీలా వీర్రాజుగారిని ,వారి సతీమణి శ్రీమతి సుభద్రా దేవి గారిని ,ఆత్మీయ అతిధులుగా  కృష్ణా  జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారిని, ముఖ్య కార్య దర్శి డా జి.వి .పూర్ణ చంద్ గారిని శీలావి పరిచయ కర్త శ్రీ సవరం వెంకటేశ్వర రావు గారిని సరసభారతి  కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి వేదికపైకి ఆహ్వానించగా సాహితీ ప్రియులు పుష్ప గుచ్చాలు సమర్పించారు .శ్రీమతి కిరణ్మయి గారి’’ మా తెలుగు తల్లికి ‘’ప్రార్ధనా గీతం తో సభ ప్రారంభమైంది .బాపు రమణ ల మృతికి అందరూ నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కి ఆత్మ శాంతి కలగాలని ప్రార్ధించారు .

శ్రీ దుర్గా ప్రసాద్ ‘’సరసభారతి స్తాపించి ఇంకా అయిదేళ్ళు కాలేదని ఇప్పటికి పదమూడు పుస్తకాలు ముద్రించామని ,అందులో నేను రాసినవి ఎనిమిది .ఇందులో సిద్ధ యోగిపున్గవులు ,మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు శ్రీ మైనేని వారి సౌజన్యం తో నే ముద్రించాం .మైనేని గారు ఉయ్యూరులోని ఏ సి లైబ్రరీకి భూరి విరాళం ఇచ్చారు. మచిలీ పట్నం లోని కృష్ణా యూని వర్సిటి కి,  ఉయ్యూరులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ,భగవద్గీత లో రాణిస్తున్న ఛి బిందు దత్తశ్రీ కి ,డెబ్భై ఏళ్ళక్రితం తమకుచిన్న తరగతులలో విద్య నేర్పిన స్వర్గీయ కోట సూర్య నారాయణ మాస్టారి జ్ఞాపకార్ధం ఉయ్యూరులో ఒక పేద ప్రతిభ గల విద్యార్ధికి ధనసాయం చేసిన వదాన్యులు .ఆయన కస్టపడి పైకొచ్చారు .దనం విలువ తెలిసిన వారు .ఉయ్యూరు అంటే యెనలేని అభిమానం .సరసభారతికి పరమ ఆత్మీయులు .

శ్రీ గోపాల కృష్ణ గారు బాపు రమణ ల తోనూ వారి  కుటుంబా లతోను యాభై ఏళ్ళుగా పరిచయం ఉన్నవారు .వారానికి ఒకటి రెండుసార్లు అయినా వారిద్దరితో ఫోన్ లో మాట్లాడే చనువున్నవారు .వారికి కావాల్సిన పుస్తకాలు పంపేవారు .వీరి పుస్తకాలు ,పెయిం టింగులు  వారికి పంపే వారు .బాపు రమణ లిద్దరూ స్వర్గస్తులవటం మైనేని గారు జీర్ణించుకోలేక పోయారు .అందుకని వారి పేర స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు .బహుశా ఆంద్ర దేశం లో వారిద్దరి పేరిట ప్రస్కారాం ఏర్పాటు చేయటం ఇదే మొదలు. కీర్తి మైనేని వారికి దక్కితే సరసభారతి మీదుగా అందజేసే అదృష్టం సరస భారతికి దక్కింది . సరిగ్గా వారం క్రితం 14-9-14ఆదివారం బెజవాడలో రమ్యభారతి సరసభారతి మల్లెతీగ సాహిత్య సంస్థల ఆధ్వర్యం లో శ్రీ చలపాక ప్రకాష్ గారి నేతృత్వం లో జరిగిన శ్రీ పాల గుమ్మి పద్మ రాజు గారి శతజయంతి కార్యక్రమం లో ప్రముఖ రచయిత శ్రీ వేదగిరి రాం బాబు గారికి మొదటిసారిగా మైనేని వారి సౌజన్యం తో బాపు –రమణ ల స్మారక నగదు పురస్కారం అయిదు వేల రూపాయలు సరసభారతి ద్వారా అంద  జేయబడింది .ఈ రోజు ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారికి బాపు రమణ ల స్మారక పురస్కారం గా మైనేని వారి వితరణ తో పది వేల రూపాయలు నగదు పురస్కారాన్ని సరస భారతి ద్వారా అందజేయ  బడుతోంది .దీన్ని స్వీకరించటానికి వీర్రాజు గారు అంగీకరించటంఆనందం గా ఉంది .

శ్రీ వీర్రాజు గారు ‘మంచికవి –ఎప్పుడో ‘’నీ ఇంటి కోసం నువ్వేం చేసినా త్యాగం కాదు ,స్వార్ధమే

అవసరానికి మించి ఏం సమకూర్చినా అక్షరాలా అది భోగమే

నువ్వు చేసే త్యాగం నీ ఇంటి ఆవరణ దగ్గరే ఆగి పోనివ్వకు ‘’అని సమాజహితం గా రాశారు .మరో కవిత లో

‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే

మన కీరి ప్రతిష్టలు ,సుఖ సంతోషాలు హోదాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని నేటి సమాజ స్తితిని తూర్పార బట్టారు .ఇంకొక కవితలో

‘’మన బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొంటే –ఇంత అసంబద్ధం గా ,కృత్రిమం గా ఇంత రాక్షసం గా

జీవించం కాక జీవించం ..అని మన కృత్రిమ సంస్కృతిని ఎత్తి చూపారు .

చిన్నతనం నుంచి చిత్ర కళపై మక్కువ .లేపాక్షి శిల్ప రేఖా చిత్రాలతో ‘’శిల్ప రేఖ ‘’అనే గ్రంధం రాశారు .నీటి రంగులు తైల వర్ణాల చిత్రాలతో ‘’చిత్రకారీయం ‘’పుస్తకం రాశారు .జర్మనీతో సహా చాలా చోట్ల చిత్ర  కళా ప్రదర్శనలు నిర్వహించారు .నాలుగు నవలలు రాశారు .అందులో మైనా నవలకు రాష్ట్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది .ఆవంత్స సోమ సుందర్ ఏర్పాటు చేస్సిన ‘’రాజ హంస –కృష్ణ శాస్త్రి ‘’పురస్కారం ‘’బతుకు బాట ‘’కు పొందారు. పులికంటి ,,,యగళ్ళపురస్కారాలు ,తెలుగు విశ్వ విద్యాలయం నుండి ‘’శిలావి కధలు ‘’కు ఉత్తమ కదా సంపుటి పురస్కారం ,ప్రతిభా పురస్కారం అందుకొన్నారు .ఫ్రీవేరర్స్ కదల  సంపుటులు ఆత్మా కద కావ్యం గా ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’రాశారు ఇలాంటి ఉత్తమ కళాకారునికి, రచయితకు బాపు రమణ ల స్మారక పురస్కారం అందజేయటానికి సంతోషం గా ఉంది .

బాపు రమణలు జీవికా జీవులు. స్నేహానికి నిర్వచనమైన వారు .శ్రీ కృష్ణ కుచేలురు .గీతా రాత గాళ్ళు .బాపు ‘’creative par excellence ‘’అన్నది హిందూ పత్రిక. చిత్రకళా విశ్వ రూపం .’’నా అంతటి వాడు నేను ‘’అన్నాడు బాపు .’’బాపు అంటే బాగా పులకింప జేసేవాడు’’అని నాఅర్ధం  .దాదాపు అరవై అయిదేళ్ళ స్నేహం. వారి స్నేహ షష్టిపూర్తిని ఘనం  గా హైదరాబాద్ లో అమెరికా చిట్టెం రాజుగారు నిర్వహించారు .అనుభవం లేకుండా సినిమా తీసిన వాళ్ళు .బాపు సీతాకల్యాణం బ్రిటన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోర్స్ బుక్ .కార్త్యూన్లు ,కార్టూన్లు పండించిన వాడు ముళ్ళ పూడి అనితర సాధ్యమైన హాస్యాన్ని వ్యంగ్యాన్ని కురిపించాడు .దేశ బాపు ,చిత్ర బాపు చిరంజీవులు .’’అని చెప్పాను .ఈ సభ ఏర్పాట్లకు శ్రీ సుబ్బారావు గారిచ్చిన హార్దిక సహకారం మరువలేనిది అన్నాను

తర్వాత న్యాయ మూర్తి శ్రీ రామ శేష గిరిరావు గారు ఇలాంటికార్యక్రమం లో పాల్గొనటం తన అదృష్టం అని .బాపు రమణలు తెలుగు దేశానికి వరం అని వారిని మించి ఎవరూ ఏదీ సాధించలేరని ,మైనేని గారు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయటం వారి సహృదయతకు నిదర్శనమని ,వీర్రాజు గారికివ్వటం ఎంతో సముచితం గా ఉందన్నారు .తరువాత శ్రీ ఎస్ వెంకటేశ్వర రావు వీర్రాజు గారిని పరిచయం చేస్తూ ‘’డెబ్భై అయిదేళ్ళవీర్రాజు గారు అన్నిటా సమర్ధులు .రాజమండ్రి లో జన్మించారు .దామెర్ల ఆర్ట్ గేలరీ పెట్టిన పోటీలో బహుమతిసాధించారు హైస్కూల్ లో చదువు తూనే .తూ.గో.జి .స్టూడెట్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలో  మొదటి బహుమతి పొందారు. విశాఖ యూని వర్సిటి సాంస్కృతిక ఉత్సవ పోటీల్లో ,మైసూర్ దక్షిణ రాష్ట్ర  అంతర్ విశ్వ విద్యాలయ పోటీలలో’’ నిరీక్షణ చిత్రానికి ‘’ప్రధమ బహుమతి నందుకొన్నారు .కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు.1963నుండి ఇరవై ఏడేళ్ళు ఆంద్ర ప్రదేశ్ సమాచార శాఖలో స్క్రిప్ట్ రైటర్ గా ,అనువాదకులుగా ,సంపాదకులుగా పని చేసి స్వచ్చంద పదవీ విరమణ పొందారు .

శీలావి గారు దేశం లోని చిత్ర శిల్ప కేంద్రాలన్నీ సందర్శించి స్కెచెస్ గీశారు .హైదరాబాద్ బెంగళూర్ మొదలైన చోట్ల ప్రదర్శనలు పెట్టారు .దాదాపు  వెయ్యి పుస్తకాలకు ముఖ చిత్రాలు గీశారు .వీరి ప్రతిభకు తగిన పురస్కారాలందు కొన్నారు .’’కోడి గట్టిన సూర్యుడు ‘’కు 1969 లో ‘’ఫ్రీ వేర్స్ ఫ్రంట్ అవార్డ్ ,ఆంద్ర ప్రదేశ్  సాహిత్య అకాడెమి అవార్డ్ మొదలైనవి ఎన్నో పొందారు ‘’అని చెప్పారు .

పిమ్మట శ్రీ వీర్రాజు దంపతులను ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం పుష్పమాల, శాలువాలతో న్యాయ మూర్తిగారి చేత కప్పించి సత్కరించారు .సరసభారతి తరఫున మా దంపతులం వారికి శాలువా కప్పి  పుష్ప మాల   వేసి ‘’శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ‘’బాపు రమణ ‘’ల స్మారక నగదు పురస్కారం పది వేల రూపాయలను అందజేసి బాపు రమణ జ్ఞాపికను అంద జేశాము .దంపతులు పరమానందం పొందినట్లు వారి ముఖ కాంతి తెలియ జేసింది .

శ్రీ పూర్ణ చంద్ ‘’బాపు గారి ఫాంట్’పై గొప్ప పరిశోధన చేయాలని ,వారిద్దర్రిలో తెలుగు ఉట్టిపడుతుందని ,సంస్కృతికి నిలయం గా వారు మసలారని ,వీర్రాజు గారితో చాలా ఏళ్ళ అనుబంధం ఉందని ఒక రకం గా తమను తీర్చిదిద్దింది వారేనని ,వారి చిత్రాలు స్పూర్తి దాయకాలని ఈ అవార్డు వారికి అందజేయటం అందరికి  ఆనంద  దాయకం అని చెప్పారు .శ్రీ సుబ్బారావు ‘’స్వాతి పత్రికకు మొదట వీర్రాజు గారే ఎడిటర్ అని వారిల్లు తమకు సాహితీ కేంద్రమని తానూ వారింటి వాడినేనని ఆ దంపతుల సౌజన్యం మరువ లేనిదని ,స్వాతి ముద్రణలో ప్రూఫులు దిద్దానని జ్ఞాపకం చేసుకొన్నారు .బందరులో ఈ వేడుక జరగటం అందరి అదృష్టమన్నారు .

తనకు జరిగిన సత్కారం పురస్కారాలకు సమాధానం చెబుతూ శ్రీ వీర్రాజు ‘’మొన్న హైదరాబాద్ లో తెలుగు యూని వర్సిటిలో సన్మానం జరిపి లక్ష రూపాయలు ఇచ్చారని ,కాని బందరులో ఈరోజు జరిగింది ఆత్మీయ సత్కారమని , దీని ముందు అది చాల పేలవమని అక్కడ ఆప్యాయతలు ఉండవని మొక్కుబడి గా జరపటం అలవాటని ,ఇందరు సాహితీ ప్రముఖుల సమక్షం లో తనకు బాపు రమణ ల స్మారక పురస్కారం అందజేయటం జీవితం  లో మరువ లేని అనుభవమని దీన్ని ఎరాటు చేసిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సౌజన్యం మరువ లేనిదని .సరసభారతి తన్ను గుర్తించి ఈ అవార్డ్ ఇచ్చినందుకు ఆనందానికి అవధులు లేవన్నారు .బాపు రమణల పేరిట ఒక స్మారక అవార్డ్ ఏర్పాటు చేయటం ఆంద్ర దేశం లో ఇదే ప్రధమని ఇంతవరకు ఎవరూ చేయలేదని ఎవరికీ ఈ ఆలోచన రాలేదని ఆలోచన వచ్చి తక్షణం వారం రోజుల లో రెండు పురస్కారాలు శ్రీ వేదం గిరి రాం బాబు గారికి   ఈ రోజు తనకు ఇవ్వటం గొప్ప అడ్వెంచర్ అన్నారు .బాపు రమణ లతో తనకు అంతగా పరిచయం లేదని వారి ప్రతిభ తెలుసనీ కలిసే అవకాశం రాక పోవటమే కారణమని అన్నారు .

తర్వాత తొమ్మిది కవితా సంపుటాలు ,రెండు కదా సంపుటాలు ,రాసి తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం ,ఏండో మెంట్ అవార్డ్ ,కడప సాంస్కృతిక సంస్థ చే ‘’గురజాడ ‘’పురస్కారం పొందిన శీలా వీర్రాజు గారి ధర్మ పత్ని శ్రీమతి సుభద్రా దేవి  మాట్లాడుతూ ఇలాంటి ఆత్మీయత, ఆదరణా తానెప్పుడూ ఎక్కడా చూడలేదని అందరూ బంధుప్రేమ చూపారని  బందరు తో తనకు పరిచయం ఉందని సుబ్బారావు పూర్ణ చంద్ లు చిరాకాల పరిచితులని తనను వేదిక పైకి ఆహ్వానించి కూర్చోబెట్టటం అవధి లేని ఆనందం కల్గించిందని  సరసభారతి వారు ఆడపడుచుగా తనను భావించి చీరా సారే పెట్టి గౌరవించటం తీర్చుకోలేని ఋణమని ఈ అనుభూతి కలకాలం ఉండిపోతుందని మహదానందం తో పరవశించి చెప్పారు .న్యాయ  మూర్తిగారికి సరస భారతి  ప్రచురణలు ,ఆంజనేయ స్వామిజ్ఞాపిక అంద జేసి శాలువా కప్పి సత్కరించాం .తరువాత శ్రీ సుబ్బా రావు, పూర్ణ చంద్ వెంకటేశ్వర రావు ,శ్రీ శిలార్  ఆత్మీయ మిత్రులు శ్రీ పసుమర్తి  ఆంజనేయ శాస్త్రి గార్లను సరసభారతి శాలువాలతో సత్కరించింది.శ్రీ సిలార్ దుర్గాప్రసాద్ ను శాలువా కప్పి సత్కరించారు .మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు ఇక్కడి ఆత్మీయులకు అంద జేశాము సిలార్ గారి వందన సమర్పణ తో, జనగణ మన గీతం తో సభ సమాప్తం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-14-ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.