సాహితీ బంధువులకు శుభ కామనలు -ఊహించని విధం గా సరస భారతి ఒక నెల రోజుల లోపు అయిదు కార్యక్రమాలను నిర్వహించింది అందులో మూడిటిని మూడు వేర్వేరు చోట్ల జరపటం మరీ విశేషం . ఆగస్ట్ 28 శనివారం ఉయ్యూరు డిగ్రీకాలేజి లో ”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ”పుస్తకావిష్కరణ జరిపాం . ఆగస్ట్ 31ఆదివారం కాటూరు గ్రామం లో ఆ గ్రామ నివాసి ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతి సభ ను కాటూరు లైబ్రరీలో గ్రామస్తుల సహకారం తో జరిపాం . సెప్టెంబర్ ఆరవ తేది ప్రముఖ చిత్రకారులు ,చలన చిత్ర దర్శకులు స్వర్గీయ బాపు గారికి మృతికి బాష్పాంజలి కార్యక్రమం ఉయ్యూరు ఏ సి లైబ్రరి లో నిర్వహించాం . ఆ రోజే సరసభారతికి ఆత్మీయులు అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు బాపు-రమణ లతో ,వారి కుటుంబాలతో అత్యంత స్నేహ సంబంధం ఉన్నందున ”బాపు -రమణ ”ల స్మారక నగదు పురస్కారం ”ను అందజేయ బోతున్నట్లు తెలియజేసిన విషయాన్ని బాపుగారి బాష్పాంజలి కార్యక్రమం లో ప్రకటించాం .ఆంద్ర దేశం లో బాపు -రమణ ల స్మారక పురస్కారం ఏర్పాటు చేసిన ప్రధములు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారే నని మనవి చేస్తున్నాను . ఈ పురస్కార ప్రదానం సరసభారతి చేతుల మీదుగా వారు జరిపించటం సరసభారతి అదృష్టం అని విన్న విన్చుకొంటు న్నాను .
సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో స్థానిక రమ్య భారతి ,మల్లెతీగ ఉయ్యూరులోని సరసభారతి సాహిత్య సంస్థలు సంయుక్తం గా ”పాల గుమ్మి పద్మ రాజు ”గారి శత జయంతిని ఘనం గా నిర్వహించాం అదే వేదిక పైన ప్రఖ్యాత కదా రచయిత శ్రీ వేదగిరి రామ్ బాబు గారికి మొదటి సారిగాసాహిత్యం లో మైనేని వారు ఏర్పాటు చేసిన ”బాపు -రమణ ”ల స్మారక పురస్కారం గా అయిదు వేల రూపాయలు నగదును సరసభారతి అందజేసింది .
సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేది ఆదివారం సరసభారతిఆధ్వర్యం లో మచిలీ పట్నం లో మహతి వేదిక పై శ్రీ గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ”బాపు-రమణ ల స్మారక నగదు పురస్కారం రెండవ సారిగా చిత్రలేఖనం లో పది వేల రూపాయలను ప్రఖ్యాత చిత్రకారులు ,కవి ,కదా నవలా రచయితా, గ్రంధ కర్త శ్రీ శీలా వీర్రాజుగారికి అంద జేయ బడింది . ఈ విధం గా వారం వ్యవధిలో ఈ రెండు పురస్కారాలను అంద జేశామని మనవి చేస్తున్నాను . ఇలా మూడు గ్రామాలలో అందులో రెండు పట్టణాలు విజయవాడ ,మచిలీపట్నాలలో ,మూడవది కాటూరు గ్రామం లో జరగటం విశేషం . అంటే ఒక నెల రోజులు లోపే ఈ అయిదు కార్యక్రమాలు జరిగాయని ఇది ఒక రికార్డు గా భావిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాము .
బాపు రమణ ల స్మారక పురస్కారం ఏర్పరచి సరసభారతి ద్వారా అందజేసిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి సరసభారతి కృతజ్ఞతలను తెలియ జేస్తోంది . ఇది వారి సహృదయతకు ,సంస్కారానికి ప్రతీక .. అంతే కాదు ”ముచ్చట్లు ”పుస్తక ముద్రణకు సౌజన్యం తో ఆర్ధిక సాయం చేసినందుకు ,ఆవిష్కరణ సభకు చేదోడుగా నిలిచి రచయితనైన నన్ను ఘనం గా సత్కరించటానికి చూపిన శ్రద్ధకు ,వారి ప్రేమాస్పద హృదయానికి మైనేని వారికి కృతజ్ఞత తెలుపుకొంటున్నాను . ఈ రకమైన సహాయ సహకారాలు శ్రీ గోపాల కృష్ణ గారు ఇక ముందుకూడా సరసభారతికి అంద డ జేస్తారని ఆశిస్తున్నాను .
బెజవాడ సభలో సరస భారతి పాత్ర ఉన్నా ఆర్ధికం గా మా పై ఏ భారమూ వేయకుండానిర్వహించిన శ్రీ చలపాక ప్రకాష్ గారికి సరసభారతి కృతజ్ఞత తెలియ జేస్తోంది .
మ చిలీ పట్నంలో సరసభారతి సభకు ఏర్పాట్లు ,అల్పాహార విందు ,వేదిక ఖర్చు ,పురస్కార గ్రహీతనుదంప ద్యుక్తం గా హైదరాబాద్ నుండి మచిలీ పట్నానికి రాను పోను రైలు ఖర్చులు వసతి భోజనాది ఏర్పాట్లు స్వయం గా చూసి సరసభారతికి ఏ ఖర్చూ లేకుండా భారం అంతా వహించి ఘనం గా నిర్వహించి విజయ వంతం చేసిన ఆత్మీయులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి ,వారికి అండగా నిలిచిన శ్రీ పూర్ణ చంద్ గారికి సరసభారతి సహృదయ కృతజ్ఞతలు అందజేస్తోంది .
కాటూరు సభకు సహకరించిన గ్రామస్తులకు లైబ్రేరియన్ గారికి బాబ్జీగారికి మా కృతజ్ఞతలు
ఇన్ని సభలు నెల రోజుల్లో నిర్వహించటానికి సహకరించిన సరసభారతి గౌరవాధ్యక్షులుశ్రీ జోశ్యుల శ్యామలాదేవి గారికి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి కి ,కోశాధికారి ,ఛి గబ్బిట వెంకట రమణ కు,ప్రచార సారధి శ్రీ వీరమాచనేని బాల గంగాధర రావు గారికి మిగిలిన కార్య వర్గ సభ్యులకు సరస భారతి తరఫున కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను .
ఇప్పటికి సరసభారతి అయిదేళ్ళ లోపలనే 70 కార్య క్రమాలు నిర్వహించి మరో రికార్డు నెల కోల్పిందని మనవి చేస్తున్నాను -ఇదంతామా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల ఆశీస్సులు సహృదయ సాహితీ బంధువుల సహకారం వల్లనే నని మనవి చేస్తూ -మీ దుర్గా ప్రసాద్ – 22-9-14-సోమవారం రాత్రి -9-30
—
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D