|
దేవుడెలా ఉంటాడు ?
|
|
దేవుడెలా ఉంటాడనే ప్రశ్న అనాదిగా మనిషి వేసుకుంటున్నదే. దీనికి మనిషే సమాధానం చెప్పాలి. పోతే.. దేవుడు నాకు చెప్పాడనో, దేవుని తరఫున మరొకరు చెప్పారనో లేదా మా మతగ్రంథం ఇలా చెపుతుందనో చెప్పాలి.
లేకుంటే ఇతరులు నమ్మరు. దేవుడు ఆకాశంలోనూ, మనం భూమిపైనా ఉన్నామని సాధారణంగా ఎవరైనా చెప్పగల్గిన విషయమే. దానికి మన ఊహను జోడించి దేవుడున్న లోకంలో మనం ఈ లోకంలో ఎదుర్కునే కష్టాలేమీ ఉండవనీ, అక్కడంతా బంగారు ఇండ్లు, రోడ్లు,పేవ్‌మెంట్లు ఉంటాయనీ, దేవుడి శక్తిసామర్థ్యాలని అంచనా వేయలేమనీ చెప్పవచ్చు. వివేకానందుడు చెప్పినట్లు చీమకు ఆలోచనాశక్తి ఉంటే దేవుణ్ణి వేలకొద్దీ తలలు, అవయవాలూ ఉన్న గొప్ప చీమరూపంలో ఊహించుకుంటుంది. అలాగే మన కల్పనా సామర్థ్యాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి మన దేవుళ్ళు ఉంటారు. మన శత్రువులే దేవుడికి శత్రువులు. మనమే దేవుడికి అతి ప్రేమపాత్రులైన జాతి అని కూడా చెప్పుకోవచ్చు. దేవుడికి తన భక్తుల్ని అన్ని విధాలా ఆదుకునే స్వభావం. భక్తులను కానివాళ్ళను అనేక కష్టాలకు గురిచేసే స్వభావం ఉంటుంది అని కూడా కొన్ని మతాలు చెబుతాయి. మనిషి గుణాలలాగానే దేవుడికి కూడా కొన్ని గుణాల్ని మనం అంటగడతాం. ఈ స్థాయిలో వర్ణించబడే దేవుడిని సుగుణస్థాయి అంటారు. ఇంగ్లీషులో దీన్నే (personal god) అంటారు.
అయితే ఈ సుగుణస్థాయి రెండు విధాలుగా చూడగలం. దేవుణ్ణి అనేక గుణగణాలున్న వ్యక్తిగా మనం భావించినపుడు ఆ గుణగణాలను ఒక రూపం ద్వారా తెలియజేయడం. ఉదాహరణకు మనం సైన్సులో అనేక సంజ్ఞల్ని (symbols) వాడుతుంటాం. అలాగే సృష్టి అనే ప్రక్రియకు తెలివి అవసరం కావున సృష్టికర్తకు నాల్గువేదాలు తెలుసని చెప్పడానికి నాలుగు తలల్ని ఊహిస్తాం. తెలివి అనే శక్తిని సీ్త్ర రూపంలో భావించి అతనికి భార్యగా ఊహిస్తాం. ఇదే విధంగా మన పురాణాల్లో అనేక దేవతారూపాలకు సాంకేతికమైన అర్థాల్ని చూడగలం. ఇలాగ ఒకానొక రూపమున్న దేవుడు సుగుణం అనే కేటగిరీలో ఉన్నా సాకార(ఆకారం ఉన్న)అనే స్థాయికి చెందుతాడు. మన సంప్రదాయంలో ఉన్న శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, లక్ష్మి, గణేశుడు మొదలైన అనేక దేవతారూపాలు ఈకోవకు వస్తాయి. ఇదే సుగుణస్థాయికి ఎలాంటి రూపాన్నీ ఇవ్వకుండా కూడా చెప్పవచ్చు.మన సంప్రదాయంలో వైశేషికులు, పతంజలి యోగులు మొదలైనవారు ఇలాంటి దేవుడి గురించి చెప్పారు. ఈ దేవుడు సుగుణం అనే స్థాయిలో ఉన్న నిరాకారుడు అనే కోవకు వస్తాడు. పాశ్చాత్యమతాలు కూడా ఈ కోవకు వస్తాయి. వారి మతగ్రంథాల్లో దేవుడు కూడా అనేక పనుల్ని చేస్తూ తన భక్తుల్ని రక్షిస్తూ, భక్తులుకాని వారిని దండిస్తూ కనిపిస్తాడు. దేవుడు తన ప్రతిరూపంలోనే మనిషిని చేశాడని చెబుతూనే, అతనికి ఆకారం లేదని అంటారు. పైన చెప్పిన సుగుణ, సాకార అనే స్థాయి, సుగుణ, నిరాకార అనే స్థాయి – ఈ రెండూ ఞ్personal god అనే నిర్వచనం కిందకే వస్తాయి. మనిషి తన కల్పనాశక్తిని ఉపయోగించి నిర్మించిన స్థాయి. |
వీక్షకులు
- 1,120,039 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,721)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
