బొట్టు పెట్టనివాడు
తుపాకి నెక్కు బెట్టి
బొట్టికాయల ఉసురుతీసి
పైశాచికా నంద మనుభవించి
నెత్తుటిబొట్టు పెట్టినాడు .
వీర తిలకమ్మని వాడు పొంగిపోవ
బుద్ధి చెప్పగ బుద్ధి జీవులంత
ప్రతిన బూనుడయ్య ఒట్టు వేసి
నాగరక సీమలొ రాక్షస విహారమ్ము
మట్టు బెట్ట బొట్టు పెట్టి మనము
ఉద్య మించి గట్టిగ కదల వలయు
గబ్బట దుర్గా ప్రసాద్

