కృష్ణా పుష్కరాలు –కొన్ని విశేషాలు
కృష్ణ వేణీ నది సాగర సంగమం అంత తేలిక గా జరి గిందా ?
అంటే జరగలేదనే చెప్పాలి .క్రిష్ణవేణీ నదికి సుమారు 20 ఉపనడదులున్నాయి .అవే తుంగ భద్ర ,భీమ ,పంచ గంగ ,ఘట ప్రభ ,పాలేరు ,మున్నేరు మొదలైనవి .వీటి జలకాలతో సంపూర్ణమై బిల బిలా కృష్ణమ్మ పరుగులిడుతూ బంగాళాఖాతం వైపుకు పరుగు పరుగున వస్తోంది .బెజవాడ దగ్గరకు రాగా ఇంద్ర కీలాద్రి ప్రవాహాన్ని ఆపేసింది .ఇక అంగుళం ముందుకు కదిలే వీలు లేక పోయింది.దీనికో కధ ఉంది .కీలుడు అనే కొండ అమ్మవారికోసం తపస్సు చేయగా ఆమె ప్రత్యక్షమైంది .వరం కోరుకో మంటే అమ్మవారిని హృదయ స్థానం లో నిలిచి పొమ్మని వేడుకొన్నాడు .అలానే అని కనక దుర్గమ్మ తల్లి కీలును హృదయ కుహరం స్వయంభువు గా నిలిచి పోయింది .సహ్యాద్రి నుండి ప్రవహిస్తూ అనేక ఓషధులను తనతో మోసుకొచ్చిన కృష్ణ వేణీ నది వలన భూములన్నీ సారవంతమై బంగారు పంటలు పండి కృష్ణా పరీవాహక ప్రాంతమంతా సశ్యశ్యామలమైంది .అదొక దివ్య క్షేత్రమైంది .అదే కీలాద్రి .ఇంద్రుడు మొదలైన దేవతలు కృష్ణ వేణీ నదిలో పవిత్ర స్నానాలు చేసి కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించి పూజించారు .కనుక అది అప్పటి నుండి ‘’ఇంద్ర కీలాద్రి ‘’అయింది .సముద్రుని చేరాలన్న కృష్ణానది తపన కీలుని వలన తీరకుండా ఆగి పోయింది .మళ్ళీ దేవతలందరూ కీలుడిని ప్రార్ధించి కృష్ణ వేణీ నదికి దారి ఇమ్మన్నారు .సరే అన్న కీలుడు తన కొండలో ఒక సొరంగం ఎర్పడేట్లు చేసి నదీ ప్రావాహాన్ని దానిగుండా సాగి పొమ్మన్నాడు .అప్పటికే చాలాకాలంగా నిలిచి పోయిన కృష్ణ నీరు మహోద్రుతంగా సొరంగం ద్వారా ప్రవహించటం తో దానికి తట్టుకో లేక పెద్ద కొండ చరియ విరిగి తేలుకొంటూ సుమారు రెండు మైళ్ళు నదీ ప్రవాహం పై తేలుతూ కొట్టుకు పోయింది .దీనినే ‘’తేలు కొండ ‘’అన్నారు .అది విజయవాడ సమీపం లో ‘’యనమల కుదురు ‘’వద్ద ఆగి పోయి అక్కడ ఒక దివ్య క్షేత్రం వెలసింది .దీన్ని ‘’ఫల్గుణ తీర్ధం’’అంటారు .ఇక ఉత్సాహంగా ప్రవహిస్తూ హంసల దీవి వద్ద పాయలుగా చీలి సాగర సంగమం పొంది తరించింది .
‘’కృష్ణా పరీ వాహక ప్రాంతం లో మొత్తం 138 పవిత్ర క్షేత్రాలు ఏర్పడి ప్రసిద్ధి చెందాయి .
క్రష్ణానదీతీరాన్ని పాలించిన రాజులు –విశేషాలు
కృష్ణానది తూర్పు భాగ దేశాన్ని క్రీ శ.3 ,4 శతాబ్దాలలో ఇక్ష్వాక రాజులు పాలించారు .వీరి రాజధాని విజయపురి అంటే నేటి నాగార్జున సాగర్ .క్రీ శ.4 వ శతాబ్దిలో మచిలీ పట్నం దగ్గరున్న ‘’కూడూరు ‘’అంటే నేటి గూడూరు బృహత్పలలాయనుల రాజధాని .అప్పుడు అది గొప్ప రేవు పట్టణం కూడా .బందరు ఓడ రేవు నుండి యూరోపియన్ దేశాలకు ‘’మజ్లిన్ ‘’అనే చా సున్నిత సుందర వస్త్రాలు ఎగుమతి అయ్యేవి .అందుకే దానికి మచిలీ పట్నం అనే పేరు వచ్చిందని చరిత్రకారుల ఉవాచ .
తరువాత శాలంకాయన , ఆనంద గోత్రీక రాజులు కృష్ణకు రెండు వైపులా పాలించారు .వీరి తరువాత పాలించిన విష్ణు కుండిన రాజులు మొగల్రాజ పురం ఉండవల్లి గుహలను నిర్మించారు .7 వ శతాబ్దం లో విష్ణు కుండిన రాజుల రాజ దాని బెజవాడ .వారి పాలనలో కళా ,సాంస్కృతిక వికాసం సమృద్ధిగా జరిగింది .ఇంతటి చారిత్రకల కృష్ణా నదికి పుష్కర శోభ కొద్దిరోజులలో వస్తోంది .అందుకే కృష్ణ వేణీ మాతకు –
‘’కన్యా గతే గురౌ యద్య –సప్త కోట్యఘ నాశనం –స్నాన మాత్రేణ సర్వేషాం-తావత్పుణ్య వివర్ధనం ‘’అని నమస్కరిస్తూ పుష్కర పుణ్య స్నానం ఆచరించాలి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-8-8-16 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్