కలిపూర్వం 64యువ సంవత్సరం లో సత్యాపతికి 62ఏళ్ళు ,63ధాతలో63,62ఈశ్వరలో 64 నిండాయి .కృష్ణార్జునులు యమునా నదీ తీర విహారం చేసి ,అగ్ని దేవుడు ప్రత్యక్షమై ,గాండీవం ,అక్షయ తూణీరాలు ,స్వేతాశ్వ రధం ప్రసాదించి ‘’గాండీవి’’ ని చేసి ,అగ్ని కోరికపై ఖాండవ వన దహనం చేసి ప్రీతి చెందించి, ఈదహనం నుంచి తనను కాపాడిన క్రీడికి కానుకగా పాండవులకు మయుడు అద్భుత సుందర హర్మ్యాన్ని మయ సభను నిర్మించి ఇచ్చాడు .ఇంద్రుడు అనేక అస్త్రాలు అర్జునునికి ప్రసాదించాడు .61బహుదాన్యకు బహురూపధారికి ,65,60ప్రమాదికి 66,59 విక్రమకు 67,58వృష కు 68,57చిత్రభానులో 69,56స్వభానులో 70,55తారణ సంవత్సరానికి 71ఏళ్ళు నిండాయి .నరకాసురుని వలన బాధకలుగుతోందని ఇంద్రుని నుంచి ఇందీవర శ్యామునికి వార్త రాగా,సత్యాపతి అర్ధాంగి తోకలిసి ప్రాగ్జ్యోతిష పురం వెళ్లి, నరకుని సత్యసాయంతో వధించగా అదితి కుండలాలు మళ్ళీ ఇవ్వగా,ఇంద్ర స్తోత్రం తో ప్రీతి చెంది ,అమరావతికి వెళ్లి ,జయించి ,పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చి ,నరకుని బందీలై, వాడి సంహారంతో విముక్తులైన న స్త్రీల లో తనవరించినవారిని ద్వారకకు పంపి ,మిగిలినవారిని వారివారి స్వగ్రామాలకు పంపించేసి ,తనలాగా వేషం వేసుకొని తానె వాసుదేవుడిని అని బుకాయిస్తున్న పౌ౦డ్రక వాసుదేవుడిని ,కాశీ రాజు నూ జయించాడు వసుదేవ సుతుడు .
54పార్ధివ కు పార్ధ సారధికి 72,53వ్యయకు 73నిండాయి .కృష్ణకుమారుడు అనిరుద్ధుని బాణాసురునికూతురు ఉష ప్రేమించి,తనమందిరానికి తీసుకురాగా తండ్రి అతడిని బంధించగా ,యదుభూషణుడు వచ్చి ,బాణునిఓడిచి ,ఉషానిరుద్ధులను ద్వారకకు తీసుకు వెళ్లి పెళ్లి జరిపించాడు .52 సర్వ జిత్తుకు 74,నిండి అభిమన్యు జననం జరిగి ,51 సర్వధారికి 75,నిండగా ఉపపాండవ జననం జరిగి ,50విరోది 76 ఏళ్ళు నిండాయి నారద గాన వినోడుడికి . నారద ప్రోద్బలంతో ధర్మరాజు కార్తీక శుద్ధ పాడ్యమినుంచి చతుర్దశి వరకు రాజసూయ యాగం సంకల్పించగా ,కృష్ణార్జున భీములు లు ముందుగా గిరివ్రజం చేరి భీముడు జరాసంధుని సంహరించగా ,జరాసంధుడు బంధించిన రాజులందరూ కార్తీక పౌర్ణమినాడు విడుదల చేయించాడు వెన్నుడు .కార్తీక శుద్ధ పంచమినాడు జరాసంధునికొడుకు సహదేవుడు పట్టాభి షిక్తుడయ్యాడు.50 విరోధి లోనే వృష మర్దనుడికి 76ఏళ్ళు నిండగా కురుక్షేత్ర సంగ్రామ సూచకమైన సూర్య గ్రహణం ఏర్పడింది .అప్పుడే యాదవ ,పాండవ ముఖ్యుల సమావేశం కురుక్షేత్రం లో జరిగింది ..సమస్త మహర్షులు దేవతలు విచ్చేసి ,యమునాతీర విహారి శ్రీ కృష్ణ పరబ్రహ్మను సేవించి తరించారు .కురుక్షేత్రం నుంచి ద్వారకకు తిరిగివచ్చి కృష్ణమూర్తి తల్లి దేవకీ దేవి కోరికపై తనకంటే ముందు జన్మి౦చి మేనమామ కంసుని చే చంపబడిన 6గురు సోదరులను బ్రతికించమని కోరగా ,సుతలలోకం వెళ్లి ,బలి చక్రవర్తిని మెప్పించి వారిని తెచ్చి తల్లికి చూపించాడు దేవకీ నందన శౌరి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-8-19-ఉయ్యూరు
—

