గాంధీజీ –ఆధునికత -2
సంప్రదాయేతరుడికి ,లేక ఆధునిక వ్యతిరేకికి ఒకదానితో ఒకటి సమంధమున్న రెండు వ్యూహాలు సంప్రదాయ౦పాటించటానికి లేక ఆధునికతలో ఉండటానికి కనిపిస్తాయి .1-మేధోస్థాయిలో ఆధునిక భావజాలం ,విధానాల సంప్రదాయాదిక్యాన్ని గొప్పగా చెప్పుకోవటానికి పనికొస్తుంది .ఆధునికత చట్టబద్ధమైనదని ,సంప్రదాయం అలాకాదని కనుక అందులోని లోపాలను లక్ష్యపెట్టక గుడ్డిగా అనుకరించటం ,సంప్రదాయం అనుస్యూతంగా వచ్చిందని ,దీనికి సాక్ష్యాలు వగైరాలు అక్కర్లేదని చెప్పచ్చు ,2-ఆచరణ స్థాయిలో గాంధి సంప్రదాయం లోని సతీ సహగమనం వంటి మూఢ విశ్వాసాలను వ్యతిరేకించి కొత్త అర్ధాలు చెప్పాడు .ఇవి తాత్కాల వర్తమానానికి ,రెండోది సుదూర భవిష్యత్తుకు చెందినది .మొదటి దానిలో సంప్రదాయ వర్గాలు సంప్రదాయానికి దూరమై ,చట్టబద్ధం కాని ఆధునికతను కోరేవారు .కనుక వీరు దాని స్వయం ప్రతిపత్తిని అడ్డుకొంటారు .కాలం గడిచినకొలది సంప్రదాయ పునాదులపై కొత్తసమాజం నిర్మింప బడాలి ,తప్పక నిర్మి౦పబడుతుంది అని భావిస్తారు .కాని గాంధి ఈ రెండు వ్యూహాలను ఆచరించలేదు .ఆయనకు కులం ,మతం ,మతవర్గాల పై ఆసక్తిలేదు . సమాజాన్ని నైతికతగల స్థానిక విభాగాలుగా (యూనిట్స్ ) ఆయనభావించాడు .కనుక ఆదర్శ గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఎంచుకొని ‘’ఆశ్రమాలు ‘’నిర్మించి ,సమాజం లో కులం ప్రాధాన్యత తగ్గించాడు .మొదట్లో ఆయన హిందూ సమాజం, కుల వ్యవస్థపై పై పెద్దగా విమర్శలు చేయలేదు .కాలక్రమం లో దీనికి దూరమై నాడు .కులం పై విమర్శ చేయని దశలో దక్షిణాఫ్రికాలో ఆశ్రమం నిర్మించి అభి వృద్ధి చేశాడు .కనుక సమాజానికి కులం ఆధార భూతం కాదని చెప్పకనే చెప్పాడు .ఇక్కడే గాంధీజీ సంప్రదాయ వాదులకంటే భిన్నంగా గోచరిస్తాడు .
సంప్రదాయం –అత్యాధునిక నాగరకత
ఇప్పటి ప్రస్తుత సమకాలీన ఆసక్తికర ప్రపంచం లో సంప్రదాయ౦ అత్యధిక వేగంగా ఆత్యాదునికం గా పరివర్తనం చెందింది .అత్యాధునిక ఆలోచన సంప్రదాయం ,సంప్రదాయ విధానాలను గౌరవిస్తుంది .అత్యాదునిక విధానం ఆధునికత అంతమైనట్లు భావించటమే కారణం .మరి ఇప్పుడు ఆధునికతను తిరస్కరించాలంటే ,అత్యాదునికతా తర్వాత తిరస్కరింప బడేదే అవుతుందికదా .ఈ విధానం లో ఆధునిక సంప్రదాయ వాది, దీనికి కజిన్ అయిన అత్యంత ప్రీతికరమైన అత్యాదునికత సిద్దా౦త రీత్యా తప్పక బంధుత్వం నెరపాల్సిందే .ఈరెండూ గాంధీ నుంచే బలం ,శక్తి పొందాయని తెలుసుకోవాల్సిందే .గాంధి ఆ అభిప్రాయవాది అని నమ్మాల్సిందే .కాని గాంధి ఎప్పుడూ అత్యాధునిక ప్రపంచ భావన కలిగి లేడు.కాని ఆయన విశ్వ ప్రేమ ,విశ్వ మానవ సౌభాగ్యం ,విశ్వ సంస్కృతీ, విశాల విదానాలను ఉత్తమ విలువలను నమ్మినవాడు .ఆయన సూచనలు ప్రత్యేక సంస్కృతికి చెందినవికాని భారతీయ లేక పాశ్చాత్య సంస్కృతికి చెందినవి కానీ కానే కావు .వీటికి అతీతమైనవి .ఆయన దృష్టిలో మానవ ప్రకృతి సాపేక్షమైనదికాదు.అందుకే ఆయన భావాలు సత్యాహింసల విలువలపై ఏర్పడి విశ్వభావనలనిపించాయి .బ్రిటిష్ ఇండియాలోకూడా ఇండియాలో పేదలు ,మాస్ అనే సామాన్య ప్రజానీకం ,ప్రజలు అనే వర్గాలు ఉండాల్సిందే అన్నాడు .కాని భిన్న సమాజాలను ఒప్పుకోలేదు .ప్రాతినిధ్య హక్కు కావాలని కోరటమూ ఆయన విశ్వభావనలో భాగమే .ప్రజల జాతీయ భావన దేశీయ ఉద్యమలో ప్రాతినిధ్యం వహిస్తు౦దన్నాడు .
అందుకే భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ వాదులకు ప్రాతినిధ్యం వహించి ప్రజాభిమానం పొందింది .గాంధీ ప్రాతినిధ్య భావనలను ఆయన వ్యతిరేకులైన జిన్నా ,అంబేద్కర్ లు మాత్రమేకాక స్వాతంత్ర్యానంతర చరిత్రకారులు విద్యావేత్తలు లు కూడా వ్యతిరేకించారు .ఆయన భావన వలన ఇండియాలోని వివిధ బృందాల, సంఘాల ఆశలపై నీళ్ళు చల్లిందని విమర్శించారు .ఇలా అన్నవారు అత్యాధునిక భావాలున్నవారే అని వేరుగా చెప్పక్కరలేదు .దక్షిణాఫ్రికాలో ఉండగా ఆయన అక్కడి మొత్తం ఇండియన్ల హక్కులకై పోరాటం చేశాడు .ఇండియాకు తిరిగి వచ్చాక చాంపరాన్ కూలీలకోసం,ఖిలాఫత్ సమస్యపైనా పోరాడాడు .జాతీయోద్యమ నాయకుడిగా గాంధీ పేదల ,ఉద్యోగుల తో కూడిన , ప్రజలందరి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశాడు .ఆయనకు సామూహిక కార్యక్రమంపై నమ్మకం జాస్తి .మానవాళి జీవన విధానం ,భౌతిక ,ఆధ్యాత్మిక సుఖం లో నాణ్యత ,విలువ ఆశించాడు .అన్యాయం ,అసమానత్వం లను సామూహిక శక్తితోనే ఎదిరించి తొలగించాలని భావించాడు .కను సమర్ధవంతమైన పటిష్టమైన వ్యూహాత్మకమైన సామూహిక శక్తివంతమైన వ్యవస్థ ఉండాలని చెప్పాడు .విధి విధానాలు నిర్వాహకులే ఏర్పాటు చేసుకోవాలన్నాడు .ఈ అంశం లో గాంధీ ఆలోచనలు అత్యాధునిక భావలహరి ను౦చి దూరం చేశాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-10-19-ఉయ్యూరు