మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –218
218-వాహినీ చిత్రాల సంగీత దర్శకుడు ,సువర్ణమాల అదృష్ట దీపుడుసినిమా ల మ్యూజిక్ డైరెక్టర్ –అద్దేపల్లి రామారావు
-అద్దేపల్లి రామారావు అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన ఓగిరాల రామచంద్రరావు, సాలూరి రాజేశ్వరరావు వద్ద కొన్ని చిత్రాలకు ఆర్కెస్ట్రా నిర్వాహకునిగా పనిచేశాడు, అదీ ఎక్కువగా వాహినీ వారి చిత్రాలకు. అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్.పి.కోదండపాణి రామారావు సంగీతం అందించిన నా యిల్లు (1953) చిత్రంతో బృందగాయకునిగా చిత్రసీమకు పరిచయమయ్యాడు.[1]లనాటి సంగీత దర్శకుడు –అద్దేపల్లి రామారావు
సంగీతదర్శకునిగా
· సువర్ణమాల (1948)
· అదృష్టదీపుడు (1950)
· నా యిల్లు (1953)
· బంగారు పాప (1954)
· చింతామణి (1956)
ఆర్కెస్ట్రా నిర్వాహకునిగా
· గుణసుందరి కథ (1949)
· పేరంటాలు (1951)
· మల్లీశ్వరి (1951)
· పెద్ద మనుషులు (1954)
· మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –219
· 219-కవి ,రోషనారా ,తారా శశాంకం నాటక రచయిత,సినీ మాటలరచయిత ,బారిష్టర్ పార్వతీశం ,పత్ని సినీ సంగీత దర్శకుడు –కొప్పరపు సుబ్బారావు
జననం
ఈయన గుంటూరు జిల్లా అన్నవరం (పె.నం.)లో జన్మించాడు.
నాటకరంగ ప్రస్థానం
1921లో ఈయన వ్రాసిన చారిత్రక కల్పనాత్మక నాటకం రోషనార బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఇది వివాదాస్పదమై సామాజిక వర్గాలలో ఉద్రిక్తలకు దారితీయటం వలన దీన్ని ప్రభుత్వం నిషేధించింది.[1] సుబ్బారావు హెచ్.ఎం.వి. వారి తెలుగు సంగీత విభాగానికి అధినేతగా పనిచేస్తూ ఒకేసారి పెక్కుమంది కళాకారులను ఆహ్వానించి ప్రజాదరణ పొందిన నాటకాలను, గేయాలను రికార్డు చేయిస్తుండేవారు.[2]
రచనలు
నాటకాలు
· తారా శశాంకం
· రోషనార
· నేటి నటుడు
· చేసిన పాపం[3]
· వసంతసేన
· నూర్జహాన్
· అల్లీ ముఠా (1944)
· శాస్త్రదాస్యం (1944)
· ఇనుపతెరలు[4]
సినిమారంగం
ఇతడు కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.[5]
· పత్ని (1942) (సంగీత దర్శకుడు)
· భక్తిమాల (1941) (సంగీత దర్శకుడు)
· బారిష్టరు పార్వతీశం (1940) (సంగీత దర్శకుడు)
· చండిక (1940) (సంగీత దర్శకుడు, మాటల రచయిత)
· మాతృభూమి (1939) (సంగీత దర్శకుడు)
· . మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –220
· 220-మొదటి టాకీ భక్త ప్రహ్లాద సంగీత దర్శకుడు ,సుశీలను గాయనిగా పరిచయం చేసిన తొలితరం సంగీత దర్శకుడు – హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
· అలనాటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన సెప్టంబర్ 1914 వ సంవత్సరాన, కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట అనే ఊరిలో జన్మించారు. ఈయన పూర్తి పేరు “హోస్పేట రామశేష పద్మనాభ శాస్త్రి”. తొలుత ఈయన ఒక హార్మోనియం వాద్యకారుడు, రంగస్థల సంగీతదర్శకుడు. ఆయన మొట్టమొదటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. తెలుగులో మొట్టమొదటి టాకీ భక్త ప్రహ్లాద (1931)కు ఈయనే సంగీతదర్శకుడు. తెలుగే కాక ఇతర దక్షిణభారతీయ భాషా చిత్రాలకు కూడా ఈయన పనిచేశారు. కన్నడ రంగస్థల, చలనచిత్ర నటుడు ఆర్.నాగేంద్రరావు తొలి కన్నడ టాకీ సతీ సులోచన (1934) కి పద్మనాభశాస్త్రిని సంగీతం సమకూర్చడానికి కుదుర్చుకున్నారు, కానీ తర్వాత నాగేంద్రరావే ఆ పనిని చేశాడు, పద్మనాభశాస్త్రి అయనకు సహాయకునిగా పనిచేశాడు. మన తెలుగు సినిమా సంగీతానికి పునాది రాయి వేసిన వ్యక్తి హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి. ఈయన పూర్వీకులు పదహారణాల తెలుగువారు. అయితే తాత ముత్తాత లంతా హోస్పేటలో స్థిరపడిపోయారు. తమిళ చిత్రం కంకణమ్ (1947) తో గాయని పి.లీలను చలనచిత్ర రంగానికి పరిచయం చేశారు. శ్రీకృష్ణ తులాభారం (1955) చిత్రంలో సత్యభామ వేషం ధరించిన నటగాయని ఎస్.వరలక్ష్మి ఈయన సంగీతదర్శకత్వంలో స్థానం నరసింహరావు రచించిన సుప్రసిద్ధమైన మీరజాలగలడా నాయానతి పాట ఆలపించింది. 1970 వ సంవత్సరం వరకు కూడా ఈయన సంగీత విభాగంలోనే పనిచేసారు. కె.వి.మహదేవన్ కొన్నాళ్లపాటు పద్మనాభ శాస్త్రిని తన దగ్గరే పెట్టుకున్నారు. ఎంతో మంది సంగీత దర్శకులకు, సంగీత కళాకారులకు శిక్షణ ఇచ్చిన తొలితరం సంగీత దర్శకుడీయన. ఈయన సెప్టెంబర్ 14, 1970 వ సంవత్సరంలో కన్నుమూశారు.ద్మనాభ శాస్త్రి
చిత్రసమాహారం
- భక్త ప్రహ్లాద (1931)
- చిత్రనళీయం (1938)
- తెనాలి రామకృష్ణ (1941)
- ఘరానా దొంగ (1942)
- సుమతి (ఎన్.బి.దినకర రావుతో) (1942)
- [::kn:ರಾಧಾರಮಣ|రాధా రమణ] (1942)
- తాసిల్దార్ (1944)
- కంకణం (తమిళం) (1946)
- బిల్హణ (తమిళం) (1946)
- రక్షరేఖ (1949)
- నిర్దోషి (1951)
- పేద రైతు (1952)
- మంజరి (1953)
- శ్రీకృష్ణ తులాభారం (బాబు రావుతో) (1955)
- నాగపంచమి (ఎస్.వి.వెంకట్రామన్ తో) (1956)
- ప్రేమే దైవం (విజయభాస్కర్ తో) (1957)
- [::kn:ಪ್ರೇಮದ ಪುತ್ರಿ (ಚಲನಚಿತ್ರ)|ప్రేమద పుత్రి] (1957)
- అన్బే దైవం
- సతీ సావిత్రి (మరో ఏడుగురు సంగీత దర్శకులతో) (1957)
- భక్త రామదాసు (నాగయ్య, ఓగిరాల, అశ్వత్థామతో) (1964)
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-4-22-ఉయ్యూరు
·