విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఉయ్యూరు సరస భారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు మరియు శ్రీ శ్రీనివాస విద్యా సంస్థల సంయుక్త నిర్వహణలో “సరస భారతి” యొక్క168వ,కార్యక్రమంగా ఉయ్యూరు శ్రీ శ్రీనివాస విద్యా సంస్థల ప్రాంగణంలో ప్రముఖ నాటక,రేడియో,బుల్లి తెర,సినిమా రంగ ప్రముఖులు శ్రీ ఉప్పులూరి సుబ్బారాయ శర్మ గారికి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు హాజరయ్యారు.విశిష్ట అతిధిగా కవి పండితులు,వక్త, విశ్లేషకులు,ప్రసార కళాప్రవీణ,దూరదర్శన్ ఎక్సిక్యూటివ్ ఓలేటి పార్వతీశం గారు, ఆత్మీయ అతిధులుగా కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బరావు గారు, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జి.వి.పూర్ణచంద్ గారు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ గారు, ఉయ్యూరు జాగృతి కో – ఆపరేటివ్ సొసైటి అధ్యక్షురాలు పామర్తి రాజీవి గారు,శ్రీనివాసా విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ పరుచూరి శ్రీనివాస్ గారు,శ్రీ శ్రీనివాసా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి పరుచూరి నీలిమ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సరస భారతి అధ్యక్షులు గబ్బిట దుర్గా ప్రసాద్ సభాధ్యక్షత వహించగా,శ్రీ శ్రీనివాసా విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ పరుచూరి శ్రీనివాస్ గారు ముగింపు సందేశాన్ని అందించారు.
నేను సహితం ఈ కార్యక్రమానికి హాజరై,అశేష ప్రజ్ఞా మూర్తుల ప్రత్యక్ష దర్శన భాగ్యమూ మరియు వారి అమృత తుల్యమైన మధుర వాక్కులను వినే అవకాశం కలిగినందుకు ధన్యుడను.మా గురు సమానులైన శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారి దాతృత్వ గుణం,వారి ఉత్తేజం,ఉత్సాహం, సహృదయతను మరో మారు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలిగినందుకు మరింత సంతోషం.శ్రీనివాస్ గారి దంపతులు స్వయంగా వారి గృహానికి మా అందరిని ఆహ్వానించి షడ్రుచోపేతమైన తొలి కార్తీక మాసపు విందును పసందుగా అందించినందులకు వారికి నా హృదయ పూర్వక నమస్సులు తెలియజేస్తున్న.విద్యార్థులు సభా సమావేశం అదియంతమునంతనూ చాలా ఆసక్తిగా విని వారి కరతాళ ధ్వనులతో మనోల్లాస జల్లులను కురిపించినందుకు వారికి అభినందనలు,ఆశీస్సులను అందజేస్తూ… ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక నమస్సులను తెలియజేస్తున్న!
🙏🙏🙏🙏🙏🙏🙏
మాధవరావు మోకా
తెలుగు విషయ సహాయకుడు
కడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కాటూరు