గౌతమీ మాహాత్మ్యం-8 పదకొండవ అధ్యాయం –కపోత తీర్ధం

       గౌతమీ మాహాత్మ్యం-8

పదకొండవ అధ్యాయం –కపోత తీర్ధం

బ్రహ్మ నారదునికి కుశావర్తపు మాహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు ‘’గౌతమమహర్షి దర్భాలచే త్రిప్పిన తీర్ధమే కుశావర్తం .ఇందులో స్నాన తర్పణ,దానాలు శ్రేష్టం. బ్రహ్మగిరిలో ఒక కిరాతుడు బ్రాహ్మణ, సాధు ,యతులను, గోవులను ,పక్షి మృగాలను విపరీతంగా హింసించేవాడు .వాడి ఆకారం, మాట భీకరం వికృతాకృతి కలవాడు .వాడిభార్యాపిల్లలూ అలాంటి వాళ్ళే .ఒక రోజు కొన్ని పక్షులను పట్టి పంజరం లో బంధించాడు.వేటకు వెళ్లి అలసి ఇంటికి వస్తున్నాడు  .అనుకోకుండా రాళ్ళ వర్షం గాలి తో అల్లకల్లోలమైంది  .దారి తెలియలేదు .ఒక చెట్టు దగ్గరకు చేరి ,తన పనే ఇలాఉంటే ఇంటిదగ్గర పెళ్ళాం పిల్లలు ఏమి అవస్తపడుతున్నారో అనుకున్నాడు .ఆ చెట్టుపై ఒక కపోతం అంటే పావురం సంతానం తో ఉంటోంది .అతడిభార్యకూడా ఉత్తమగుణాలుకలది .కపోత జంట ఆహారానికి వెళ్ళాయి .మగపావురం తిరిగి వచ్చింది ఆడపావురం  వేటగానికి చిక్కింది..మగపావురం పిల్లల్ని జాగ్రత్తగా  చూసుకొంటోంది .చీకటి పడింది .ఆడపావురం ఏమైందో భర్తకు తెలియదు .భార్యను గురించి ఆలోచిస్తున్నాడు,ఆమె మంచితనాన్ని పొగుడుతున్నాడు .వేటగానికి చిక్కిన ఆడపావురం తాను కిరాతుని బందీగా ఉన్నానని ,తనభర్త తనను మెచ్చటం ఆమెకెంతో ఊరట కలిగించి౦దని  చెప్పింది .భర్తతో భార్యపావురం ‘’నువ్వే నాకు రక్షా నువ్వే వ్రతం ,పరంబ్రహ్మ౦, మోక్షం .నేను చనిపోతానని విచారించకు .నీబుద్ధిని ధర్మ౦పై ఉంచు .నీవల్ల అన్ని భోగాలు అనుభవించాను ‘’అనగా విని కిందకు దిగి మగకపోతం .’’అలసిన కిరాతుడు బాగా నిద్రపోతున్నాడు .పంజరం నుంచి నిన్ను విడిపిస్తాను ‘’అనగా భార్య ‘’భార్యాభర్తల సంబంధం  అస్థిర మైంది .లుబ్ధులకు పక్షులు ఆహారం .ఒకప్రాణి మరోదానికి ఆహారం .వీడి తప్పేమీ ఉన్నట్లు నాకు అనిపించలేదు .బ్రాహ్మణులకు అగ్ని దైవం. స్త్రీలకూ పతి దైవం.వీడు మన అతిధి .అభ్యాగతికి అన్నదానం చేస్తే ఇంద్రుడు సంతృప్తి పొందుతాడు. అతనిపాదాలుకడిగితే పితరులు ,అన్నం పెడితే ప్రజాపతి ,ఉపచారాలు చేస్తే లక్ష్మీనారాయణులు పడుకొనే చోటిస్తే సర్వ దేవతలు  తృప్తి చెందుతారు.అతిధి దేవుడే అతనిసేవ అన్ని క్రతువులవలన లభించే ఫలానికి సమానం .అపకారికి ఉపకారం చేసి న వాడే సజ్జనుడు’’అని చెప్పింది. మగపావురం’ధర్మబద్ధమైన మాటలు చెప్పావు .నేనుఇప్పుడు ఏమి చేయాలో చెప్పు ‘’అని అడిగాడు.ఆమె ‘’  నిప్పు, నీరు, మంచిమాట, గడ్డి, కట్టెలు అర్ధికి ఇవ్వతగినవి ‘’అని చెప్పగా దూరంగా కనిపించే అగ్నిని ముక్కుతో తెచ్చి అగ్నిని రాజేసి ఎండుపుల్లలు ఏరి తెచ్చి వేసి మంటపెంచి మగపక్షి వాడి చలి తీర్చింది .ఆడపావురం భర్తతో ‘’నన్ను విడిపించవద్దు .నా శరీరం తో వీడి ఆకలి తీర్చి పుణ్యం పొందుతాను ‘’అని భర్తకు చెప్పగా మగపావురం ‘’నేనుండగా అలా కానివ్వను .నేనే అగ్నికి ఆహుతి అయి, వాడి ఆకలి తీరుస్తా’’ అంటూ అగ్నికి మూడు ప్రదక్షిణాలు చేసి మహా విష్ణువును ధ్యాని౦చి అగ్నిలో దూకగా లుబ్ధకుడు ‘’మనిషినైన నా జీవితం వ్యర్ధం .ఈ పక్షి ఎంతో సాహసం చేసింది నాకోసం .అనుకోగా ఆడపక్షి ‘’నాభర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు .నన్ను వదిలిపెట్టు ‘’అంటే వదిలేశాడు. అది కూడా అగ్ని ప్రదక్షణం చేసి నిప్పులో దూకబోతూ .తామిద్దరంస్వర్గానికి వెడుతున్నామని దయతో తమ పిల్లలను  ఏమీ చేయక వదిలిపెట్టమనిబోయను  ప్రార్ధించగా వాడు ఆశ్చర్యపోయి పిల్లలజోలికి పోలేదు .వెంటనే  అగ్నిలోదూకింది  . జయాయధ్వానాలు మిన్ను ముట్టాయి .ఆకశం లో దివ్యవిమానం అందులో కపోతజంటకనిపించాయి. ఆనందంతో ఆజంట’’మాకు స్వర్గం రావటానికి కారణమై అతిధి వైన నీకు ధన్యవాదాలు .సెలవివ్వు ‘’అన్నాయి .ఈ సన్నివేశంతో మనసు మారి కిరాతుడు విల్లు అమ్ములు వదిలేసి ‘’అజ్ఞానినైన నాకు బుద్ధిచెప్పారు .నిజంగా మీరే నాకు అతిధులు .నాకు నిష్కృతి చెప్పతగినవారు ‘’అని ప్రార్ధించగా ‘’గౌతమీనదిలో 15రోజులు స్నానం చేస్తే నీపాపాలన్నీ పోతాయి .గౌతమి స్నానం అశ్వమేధయాగ ఫలిత సమానం .నీపాపాలు తొలగాగానే స్వర్గానికి చేరగలవు ‘’అన్నాయి .వాడు అలాగే గౌతమీ స్నానం చేసి పాపాలు పోగొట్టుకొని దివ్య పురుషుడై,దివ్యవిమానం లోస్వర్గం చేరాడు.గౌతమిప్రభావం వలన కపోతద్వయం, వ్యాధుడూ పావనమై స్వర్గం చేరారు .అప్పటిను౦చే ఇది  కపోత తీర్ధంగా ప్రసిద్ధి చెందింది .ఇక్కడ స్నాన, దాన ,తర్పణాదులన్నీ ఉత్తమ ఫలితాలనిస్తాయి ‘’అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-18-ఉయ్యూరు         

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-7 తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం- 2

గౌతమీ మాహాత్మ్యం-7

తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం- 2

రాక్షసులు కపిలుని ప్రభావం తెలిసి ,మాయతో సగరకుమారులను చంపే ప్రయత్నం చేశారు .గుర్రాన్ని  ఆయన తల భాగానకట్టేసి దూరం వెళ్లి జరుగబోయేది చూశారు .సాగరపుత్రులు రసాతలనం చేరి అక్కడ నిద్రిస్తున్న మనిషిని ప్రక్కనే యాగాశ్వాన్ని చూసి ,తమ క్షాత్ర తేజం చూపాలని పాదాలతో మహర్షిని తన్నారు .నిద్రలేచిన ఆయన వాళ్ళను చూడగానే కాలి బూడిద అయ్యారు ..సగరునికి ఈవార్త తెలియలేదు .నారదుడు ఆయనకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు .ఏమి చేయాలో తోచక మిన్నకుండి పోయాడు .మిగిలిన ఒకే ఒక్క పుత్రుడైన అసమ౦జసుడుపేరుకు తగ్గట్టే  మూర్ఖుడు ,చిన్నపిల్లలను బావిలోకి తోసి వినోది౦ చేవాడు .ప్రజలు  రాజుకు ఫిర్యాదు చేశారు. ఆయనకు కోపమొచ్చి కొడుకునకు  దేశ బహిష్కార శిక్ష విధించాడు .ఇతనికొడుకు అంశుమంతుడు .అతన్ని పిలిపించి విషయం చెప్పాడు .అతడు కపిలమునిని ఆరాధించి యాగాశ్వాన్ని తెచ్చి, తాతగారికి అప్పగించాడు .సగరుని క్రతువు పూర్తయ్యిది .

   అంశు మంతుని కుమారుడు దిలీపుడు ధార్మికుడు. ఇతనికొడుకు భగీరధుడు .ఇతడు తనతాతల దుర్గతినివిని దుఃఖించి వారికి నిష్కృతి ఎలాకలుగుతుందని సగరుని అడిగాడు .కపిలమహర్షికి అంతాతెలుసునని ఆయన దర్శనం చేయమని చెప్పాడు. పాతాళానికి వెళ్లి కపిలుని ప్రసన్నం చేసుకొని వచ్చిన విషయం చెప్పాడు .శంకరుని ధ్యానించి శివ జటాజలం తో పితరులను ముంచితే కృతార్దులౌతారని ,కైలాసానికి వెళ్లి పరమేశ్వరుని మెప్పించి కార్యం సాధించమన్నాడు .అలాగే కైలాసం చేరి శుచియై  తపస్సు ప్రారంభించాడు .శివుడు ప్రత్యక్షమై కావలసింది అడగమన్నాడు .’’మా పితరులను పావనం చేయటానికి నీ  జటాజూటంలోని గంగను నాకిస్తే చాలు ‘’అనగా చిరునగవుతో గంగను స్తుతి౦చమనగా  గంగకై  తీవ్ర తపస్సు చేయగా ,ఆమె అనుగ్రహం తో , మహేశ్వరుని నుంచి గంగను పొంది ,రసాతలానికి తీసుకు వెళ్లి కపిలమునికి విన్నవించి ,ఆయన చెప్పినట్లుగా గంగకు ప్రదక్షిన చేసి చేతులు జోడించి తనపితరులకు సద్గతి కలిగించమని కోరగా ఆమె ప్రీతితో కపిలుని శాప౦తో దగ్దులై ముంచేసిన గుంటలన్నిటినీ నింపేసింది .పితరులకు ముక్తికలిగింది గంగాజలం తో ..గంగను భాగీరధ బాలుడు ‘’అమ్మా !నువ్వు మేరుపర్వతం మీదకాకుండా కర్మభూమి యందు ఉండాలి ‘’అని కోరగా గంగానది హిమాలయం చేరి ,అక్కడనుండి ,భరతవర్షం చేరి మధ్యనుండి పూర్వ సముద్రందాకా వ్యాపించింది .ఇలా క్షత్రియ బాలుడైన భగీరధుని వలన గంగ భూమిని ,రసాతలాన్ని చేరింది .వింధ్యకు దక్షిణంలో ఉన్నగంగ’’గౌతమి ‘’,వింధ్యకు ఉత్తరంగా ఉన్నది భాగీరధి అని పిలుస్తారు .

పదవ అధ్యాయం –వారాహీ తీర్ధ వర్ణన

నారదుడు బ్రహ్మను అన్ని తీర్దాల వివరాలు చెప్పమని కోరగా అన్నీ చెప్పటం ,వినటం కష్టం కనుక  శ్రుతులలో  ప్రసిద్ధమైనవాటిని మాత్రమే చెబుతానన్నాడు   .త్ర్యంబకుడు ఎక్కడున్నాడో అది త్రయంబక క్షేత్రం .భక్తీ ముక్తీ ఇస్తుంది .వారాహ తీర్ధం ముల్లోకాలలో  ప్రసిద్ధం .పూర్వం సింధు సేనుడనే రాక్షస రాజు దేవతలను ఓడించి ,యజ్ఞాన్నితీసుకొని పాతాళానికి వెళ్ళాడు . భూమిపై యజ్ఞయాగాదులు లేవు .దీనితో భూ సువర్లోకాలు నాశనమవగా ,సురలు రసాతలం చేరి ,వాడితో యుద్ధం చేసి జయించలేక విష్ణువుకు మొరపెట్టగా ,విష్ణుమూర్తి ‘’ఆదివరాహ మూర్తిగా’’ పాతాళానికి వెళ్లి అక్కడ దానవ సంహారం చేసి ‘’మహా యాగ ముఖం ‘’తో అంటే ‘’యజ్న వరాహ స్వామి ‘’గా భూమిపైకి వచ్చి గంగ దగ్గర రక్త సిక్తాలైన శరీరాన్ని కడుక్కున్నాడు .ఇక్కడ వారాహ కుండం ఏర్పడింది .తనముఖం లోని ‘’మఖం ‘’అంటే యజ్ఞాన్ని బ్రహ్మగిరిలో ఉన్న దేవతలకు అందించాడు .ముఖం నుండి యజ్ఞం పునరుత్పత్తి చెందింది .అప్పటినుంచి స్రువము ప్రధాన యజ్ఞా౦గ మైంది .కారణానతరం లో వరాహ రూపం దాల్చింది .ఈ వరాహ క్షేత్రం మిక్కిలి పుణ్యప్రదం .ఇక్కడ స్నాన దానాలు చేస్తే అన్ని క్రతువుల ఫలితం లభిస్తుంది ‘’అని బ్రాహ్మ నారదునికి చెప్పాడు.

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-18-ఉయ్యూరు  

 

image.png
image.png
image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-5 ఎనిమిదవ అధ్యాయం –గౌతమీ మహత్వం

       గౌతమీ మాహాత్మ్యం-5

ఎనిమిదవ అధ్యాయం –గౌతమీ మహత్వం

మునులమధ్యఉన్న  గౌతముని త్ర్యంబకేశ్వరుడు ‘’తీర్ధాలు రెండు గజముల పొడవున వ్యాపించి ఉంటాయి .అన్నిట్లో నేను ఉండి కోరికలు తీరుస్తాను .గంగా ద్వారం ,ప్రయాగ ,సాగర సంగమం ల వద్ద భాగీరధి పుణ్యం, ముక్తి ఇస్తుంది .యమునానది అమర కంటకం లో సరస్వతీ నడదితోకలిసి అధిక పుణ్యం యిస్తుంది .కృష్ణా తుంగభద్రా భీమరధీ సంగమించేచోటు ముక్తిప్రదం.పయోష్ణీనది ఏనదితోకలిస్తేఅక్కడ ముక్తిలభిస్తుంది .గౌతమి ఎక్కడైనా    పుణ్యప్రదమే .ఒక్కొక్కనది దేవతలువచ్చినప్పుడే పుణ్యం యిస్తాయి .కాని గౌతమి సకలకాలాలలో సకలజనాలకు పుణ్యమిస్తుంది .200యోజనాల పరిధిలో 3 కోట్ల 50వేల తీర్దాలున్నాయి .మహేశ్వరుని నుంచి ఉద్భవించిన గంగ గౌతమి అనీ ,వైష్ణవీ అని బ్రాహ్మీ ,గోదావరి నందా ,సునందా అని పిలువబడుతోంది .బ్రహ్మ తేజస్సుతో భూలోకాని తీసుకు రాబడింది కనుక కోరికలు తీర్చి పాపాలను హరిస్తుంది .స్మరిస్తే చాలు గంగ పాపాలు హరిస్తుంది .గంగ నాకు  (బ్రహ్మకు ) ప్రియమైనది. పంచభూతాలలో నీరు శ్రేష్టం. తీర్ధాలలో భాగీరధి సర్వ శ్రేష్టం .భాగీరధ్యాదులకంటే గౌతమీ శ్రేష్టమైనది .శివుజి జటతోసహా నేలకు చేరింది .స్వర్గ మర్త్య పాతాలలలో గౌతమీ తీర్ధం సర్వార్ధాలను ఇస్తుంది .

తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం

నారదుడు బ్రహ్మా ను ‘’ఒకటే గంగ రెండు ఐనట్లు చెప్పావు .గౌతముని చే భూమికి తేబడిన గంగ వృత్తాంతం చెప్పావు .శివజతాజూటం లోని గంగ క్షత్రియులచే తేబడింది అంటారు ఆ వివరాలు చెప్పు ‘’అన్నాడు .బ్రహ్మ ‘’వైవస్వత మన్వంతరంలో ఇక్ష్వాకు వంశం లో పుట్టిన సగరుడు అనే రాజు యజ్ఞయాగాదులు చేసి దాన బుద్ధితో దాతగా కీర్తి౦పబడ్డాడు .ధర్మ చి౦తనా పరుడు .కాని సంతానం లేక విచారం లో ఉన్నాడు .కుల పురోహితుడు వసిస్ట మహర్షి ని పిలిపించి తనకు సంతతికలిగే ఉపాయం చెప్పమని వేడుకొన్నాడు  .మహర్షి కాసేపు సమాధి నిస్తు  నిస్టుడై భార్యతో నిరంతరం రుషి పూజ చేయమన్నాడు .కొంతకాలానికి ఒక తపోధనుడు రాగా సత్కరించి  మనసులోమాట చెప్పుకొన్నాడు .పుత్రులుకావాలని కోరాడు .అప్పుడు ఆయన  ఒకభార్యవలన వంశ దీపకుడైన కొడుకు ,మరొక  భార్య లన 60వేలమంది కొడుకులు కలుగుతారని చెప్పాడు .ముని వెళ్ళాక ఆయన చెప్పినట్లే వేలాది పుత్రులు కలిగారు .సగరుడు అనేక అశ్వమేధ యాగాలు చేయటానికి దీక్షా బద్ధుదయ్యాడు .పుత్రులను, సైన్యాన్ని అశ్వ రక్షణకు యేర్పాటు చేశాడు .ఇంద్రుడు ఊరుకుంటాడా ! యాగాశ్వాన్ని ఎత్తుకుపోయాడు .సగర పుత్రులు యెంత వెదికినా కనపడలేదు .రాక్షసులు యాగాశ్వాన్ని రసాతలం లో బంధించారు .పుత్రులు దేవాదిలోకాలు వెతికినా గుర్ర్రం జాడ కనిపించలేదు .ఒకరోజు వారికియాగాశ్వం పాతాళలోకం లో బంది౦పబడింది అన్న అశరీర వాణి వినిపించింది .రసాతలానికి వెళ్లగా, రాక్షసులు భయపడి కపిలముని  దగ్గరకు వచ్చారు  .ఆయన ఒకప్పుడు దేవకార్యానికి సహాయపడి అలసి పోగా దేవతలు పాతాళం లో నిద్రించమన్నారు .ఒక వేళ ఎవరైనా తనకు నిద్రాభంగం కలిగిస్తే వాళ్ళు భస్మం అవుతారు అని చెప్పి నిద్రపోయాడు .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -7’

ధ్వని కోణం లో మను చరిత్ర –7

చంద్రుని ఉదయ కాల ఆరోహణాన్నివర్ణించే పద్యం ‘’స్ఫుట సౌగంధిక రాగ రక్త రుచియై బూనె౦ జపాసన్నిధి ‘’పద్యం లో చంద్రునికి ప్రభాతకాల అరుణకాంతి స్వాభావికంకాదు సంక్రమించినదే ,అతని అసలు ధర్మం  తెల్లదనమే అని చెప్పే ‘’ప్రకృతిసచ్చుండైన సన్మార్గిఎన్నటికింగూటమి వంక వచ్చు వికృతిన్ మగ్నుండు గా నేర్చునే ‘’లోస్వభావం చేత నిష్కల్మషుడైన సత్ప్రవర్తనకలవాడు  అనీ ,తెల్లనికా౦తితో నక్షత్రమార్గం లో ప్రయాణం చేసే చంద్రుడు అని అర్ధాలు  కలవాడుఅని అర్ధాలున్నాయి .ఇది  అర్ధాంతరన్యాసం .ప్రకృతివర్ణన తర్వాత ప్రవరుని గురించి ‘’సన్మార్గి ‘’అని రావటం తో అతడు వికారాదులకు లొంగని సచ్చీలుడుగా చెప్పబడ్డాడు .కనుక ఇది శబ్దశక్తిమూలధ్వని .’’తరుణి ననన్యకాంతన్’’ పద్యం లో కవి వరూధిని శీలాన్ని పొగిడి ,ప్రవరుడిని ‘’మహీసురాధముడు ‘’అని నిందించాడు .తప్పు సవరించుకోవటానికి ‘’నభోమణి ‘’అనే మాటతో పైమాట జడుడికి మాత్రమె వర్తిస్తు౦దికాని ,ప్రవరుడికి కాదు అని వ్యన్జించాడు .’’ఎక్కడియూరు కాల్నిలువకి౦ టికీ బోయెద’’పద్యం లో రత్నకందరాలు మొదలైన విహార స్థలాలువదిలి పూరిగుడిసె కుపోతానంటావేమిటి’’అనటం లో తనతో ఇక్కడి దివ్యభోగాలు అనుభవించమని వస్తుధ్వని ఉంది .’’ఎక్కడివాడో యక్ష తనయే౦దు ‘’పద్యం లో అతనిపై ఆమెఅభిలాష కనిపించి అర్ధ శక్తిమూల వస్తుధ్వని అయింది .మరోపద్యం లో వరూధిని తల్లీ అని సంబోధించటం లో దారితప్పిన కొడుకుని ఇల్లు చేర్చటం తల్లులధర్మం అని ధ్వనిస్తోంది .

 రాక్షస రూపం లో ఇందీవరాక్షుని ధాటికి ఆగలేక పారిపోయే తన సైనికులను చూసి స్వరోచి ‘’చావు దలపోసి మానవు –డేవగ దుష్కీర్తి నోరయకే దినములు పొం-దైవెడలునట్లు నడవగ-దైవం బటమీదమేలు తాన ఘటించున్ ‘’అన్నపద్యం లో శత్రువులకు వెన్నిచ్చి పారిపోవటం కంటే ,స్వధర్మం అని భావించి ఎదురు నిల్చిధైర్యం తో పోరాడితే,దేవుడు ధర్మపక్షం వహించి విజయం చేకూరుస్తాడు అనే వస్తు ధ్వని ఉందన్నారు రాజన్న శాస్త్రిగారు  ఇది ప్రస్తాన వైశిష్ట్య౦ తో ఏర్పడిన ధ్వని అంటారు.వరూధిని ప్రవరునితో’’ఎన్నిభవంబుల౦గలుగు ,నిక్షు శరాసన సాయక వ్యధా ఖిన్నతవాడి –‘’అనే పద్యం లో ‘’ఎన్ని భవంబులన్గలుగు ‘’మాటలోఅలాంటి తనలాంటి దాని పొందుదొరకటం దుర్లభం అనే ధ్వని ఉంది .ఇది వాచ్యార్ధ వైశిష్ట్య ధ్వని అంటారు శాస్త్రిగారు .’’ఎవ్వతె వీవు భీత హరిణేక్షణ  ‘’పద్యం లో ప్రవరుడు చెప్పినది ఒకటి వరూధిని అర్ధం చేసుకొన్నది వేరొకటి  .మొదటిది వక్త్రు వైశిష్ట్య ధ్వని .రెండవది బోద్ధవ్య వైశిష్ట్య ధ్వని .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-11-18-ఉయ్యూరు    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-5 ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం  

       గౌతమీ మాహాత్మ్యం-5

ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం  

గౌతముడు కైలాసం చేరి దర్భలు పరచుకొని వాక్కును నియంత్రించి  శుచియై మహేశ్వర స్తుతి చేయగా పుష్పవర్షం  కురిసింది  .ప్రీతి చెందిన ఉమాపతి పార్వతీ గణేశులతో ప్రమధగణ౦  తో సహా ప్రత్యక్షమై ‘’నీ స్తోత్రానికి పరవశంకలిగింది .ఎలాంటి కష్టమైన కోరికనైనా తీరుస్తాను ‘’అన్నాడు ఆనందబాష్పాలతో గౌతముడు ‘’మహేశ్వరా !నీ జటాజూటం లో ఉన్న గ౦గను నాకు ఇవ్వు’’అనగానే ముల్లోకాలకు ఉపయోగపడేట్లు కోరిన నీకోరిక సమంజసం .నీకోసం ఏదైనా కోరుకో ‘’అన్నాడు .తాను  చేసిన శివ స్తోత్రం చదివిన వారి కోరికలు తీరి ,సకల సంపన్నులయ్యేట్లు చేయమని కోరాడు .తధాస్తుఅని ఇంకేదైనా కోరుకోమన్నాడు శంకరుడు .  ‘’జగన్నాథా సదాశివా !లోక పావని అయిన గంగాదేవిని బ్రహ్మగిరిలో వదిలిపెట్టు .ఈ గంగానది సముద్రం చేరేదాకా స్నాన మాత్రం చేత సకలపాపాలు ,బ్రహ్మ హత్యాది పాతకాలు నాశన మయ్యేట్లు ,ఇతర పుణ్య తీర్దాలలో చంద్రగ్రహణ ,సూర్యగ్రహణ,ఉత్తరాయణ ,దక్షిణాయణ,విషువత్ ,సంక్రాంతి ,నైద్రుతి యోగం మొదలైన అన్ని పర్వదినాలలో ఎలాంటి పుణ్యఫలం కలుగుతుందో ,అలాంటి ఫలం గంగా స్మరణమాత్రం చేత కలిగేట్లు వరమివ్వు .ద్వాపరం లో యజ్న్ దానాలు, కలియుగం లో దానం ఒక్కటే గొప్పగా చెప్పబడ్డాయి .సకల యుగ, దేశ ధర్మాలు ,స్నాన దాన తపస్సులవలన వచ్చే పుణ్యం ఈ గౌతెమీనదిని స్మరించిన మాత్రం తో లభించేట్లు చెయ్యి .గౌతమీనదీ ప్రవాహం ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ నువ్వుఉండాలి .గౌతమిలో స్నానం చేసినవారు మహాపాతకులైనా సరే ,లేక పది యోజనాల దూరం లో చనిపోయినా వారి పితరులు ముక్తిపొందాలి .స్వర్గ మర్త్య పాతాళ తీర్దాలలన్నిటికంటే గంగా తీర్ధం శ్రేష్టమై ఉండాలి .ఇంతకంటే నాకోసం ఏమీఅక్కర్లేదు ‘’అనగానే పరమాన౦ద౦  తో పరమ శివుడు అలాగే అని చెపి అంతర్ధానమయ్యాడు .గౌతముడు శివానుగ్రహం తో పూర్ణబలుడై శివుని జటను,అందులోని గంగను తీసుకొని బ్రహ్మగిరి చేరాడు .ముని గణం విప్రజనం జయజయ ధ్వానాలతో స్వాగతం పలికి అర్ఘ్య పాద్యాలతో పూజించారు .

   ఏడవ అధ్యాయం –15రూపాలుగా గంగ గమనం  

  గౌతముడు బ్రహ్మగిరిపై శివ జటాజూటాన్ని ఉంచి శివుని ,గంగను స్మరిస్తూ ‘’త్రిలోచ జటాజూటం నుండి పుట్టిన గంగామాతా !సకలకోర్కేలను తీర్చే తల్లీ క్షమించు , శాంతించు .సుఖంగా ప్రయాణం చేయి లోకహితం కలిగించు .’’అని ప్రార్ధించాడు గంగాదేవి దివ్య రూపం లో కనిపించి ‘’నేను దేవలోకానికి వెళ్ళనా ?బ్రహ్మ కమండల౦ లోకి మళ్ళీ చేరనా,రసాతలం లోకి వెళ్ళనా సత్య వాక్  సంపన్నుడవైన నువ్వే చెప్పు ‘’అన్నది .గౌతముడు ‘’మూడులోకాలకు ఉపకారం చేయటానికే శంకరుని అనుమతితో నిన్ను తెచ్చాను’’అన్నాడు  .గంగా దేవి  సంతోషించి మూడుభాగాలుగా మారి అందులో స్వర్గం వైపు నాలుగు ప్రవాహాలుగా ,భూలోకం లో ఏడు ప్రవాహాలుగా ,రసాతలం లో నాలుగు పాయలుగా ఉండేట్లుమొత్తం 15రూపాలు ధరించి బయల్దేరి చేరింది .

  అన్ని చోట్లా సర్వ ప్రాణికోటి కోర్కెలను తీరుస్తూ ,వేద వినుతయైనది. మానవులు  భూలోకం లోని గంగమాత్రమేచూడగలరు .సముద్రం చేరేవరకు దేవ స్వరూపిణిగానే కీర్తి౦ప బడుతోంది .గౌతముడు శివుని పూజించి ‘’గోదావరీ తీర్ధ స్నాన విధి ‘’వివరించమని కోరాడు. ‘’శివుడు ‘’ముందు  నాందీముఖ శ్రాద్ధం పెట్టి, దేహ శుద్ధి చేసుకోవాలి. తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారి అనుజ్ఞతో పతితుల వార్తలను మాట్లాడకుండా బ్రహ్మ చర్యం తో, గోదావరీ యాత్ర ప్రారంభించాలి  .ఈ యాత్రలో  సర్వే౦ద్రియాలు వశం లో ఉండాలి అహంకార మమకారాలు తొలగించుకోవాలి ,,మనసులో దుస్టభావన లేకుండా ధర్మం పైనే పూర్తి శ్రద్ధతో ,దారిలో అలసిపోయిన వారికి సేవలు చేస్తూ ,వీలునిబట్టింనదానాలు చేస్తూ ,దరిద్రులకు ,సాధువులకు వస్త్రాలు కంబళ్ళు అందిస్తూ,హరి గానంతో, హరికి సంబంధించిన కథలు గంగోద్బవ కథలు  వింటూ ప్రయాణం చేస్తే సంపూర్ణంగా గంగా తీర్ధ ఫలం పొందుతారు ‘’అని శివుడు గౌతమునికి బోధించాడు’.  

సశేషం

నాగపంచమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-11-18-ఉయ్యూరు   .    

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -6

ధ్వని కోణం లో మను చరిత్ర –6

ఈ ప్రబంధం లో పెద్దనకవి ప్రకృతివర్ణనలు తాను చేయకుండా పాత్రలతో చేయించి కావ్యానికి అందాలు చేకూర్చాడు .వరూదినీతో  చెలికత్తె చంద్రాస్తమయాన్నివర్ణిస్తూ –అతనిడికి వరూధిని ముఖాన్నిపోలుస్తూ–‘’దరస్మిత విలాసపు చంద్రిక డొంకి వాడుటం-దేట దొరంగి విన్ననగు నీ మొగమో ?యన మాసి చంద్రుడో పాటలగంధి,వ్రాలె నదె భాను రుచిం దనకందుమీరగన్ ‘’అనటం లో ‘’నిన్ను ఏడిపించిన పాపం ఊరికే పోలేదు .అతడి పతనం ప్రారంభమైందని ప్రతీపాల౦కార౦ తో  ధ్వనించింది .ఈ వర్ణన కవే చేసి ఉంటె ఆధ్వనికి అవకాశం  ఉండేది కాదు అంటారు  రాజన్న శాస్త్రిగారు .

  తనదారి కడ్డమున్న వరూధినీతో తనూరికి వెళ్ళే ఉపాయం చెప్పమని –ఎవ్వతె వీవు భీత హరి ణేక్షణ ‘’అనే ప్రసిద్ధ పద్యం లో ప్రవరుని అభిప్రాయం ఒకటి ఆమె అభిప్రాయం వేరోకటిగా కనిపిస్తుంది .’’ఎవ్వతే వీవు భీత హరి ణేక్షణ’’అనటం లో ప్రవరుడు స్త్రీ సహజమైన లజ్జ వదిలి సంభ్రమం తో తన దారికి అడ్డమై ,ఏదో ఆపదలో చిక్కు  కొన్నావు  నీబిత్తర చూపులు విలక్షణం ఆమె భీతకాదు భీత హరిణేక్షణ అనిపించింది .’’ఒంటి జరించె దోట లేకివ్వనభూమి ‘’అనటం లో మానవ మాత్రుడికి చొరరాని భయంకర ప్రదేశం అని ధ్వనిస్తోంది .ఆమె సామాన్య మానవ కా౦త కాదని , ఆపరిసరాలన్నీ బాగా తెలిసిన అమ్మాయే అని ,తనప్రశ్నకు జవాబు చెప్పగలిగినవారెవరూ లేకపోవటం తో ఆమె చెప్పాలని ప్రవరుని భావం..’’భూసురుడ నే బ్రవరాఖ్యుడ’’అనటం లో ఆమె బిత్తర చూపు స్వాభావికమేనని పించక ఏదో భావం కనిపిస్తోందని తన ప్రవర చెప్పుకున్నాడు పిచ్చి బాపడు .’’త్రోవ త్రప్పితిన్ గ్రొవ్వున నిన్నగా రాగ్ర మునకున్  జనుదెంచి ‘’అనటం లో కిందా మీదా  తెలీకుండా ఆబగా వచ్చి ఆపదలో చిక్కు కొన్నాను అనే అర్ధం ధ్వనిస్తోంది .’’పురంబు జేర —శుభంబు నీకగున్ ‘’అనటం లో ‘’ఇంకెవ్విధి గాంతు’’మాటలో ఊరు చేరేఉపాయం తెలియని వాడినని ,’’తెల్పగదవే ‘’ పదం ఆపద గట్టేక్కించ  టానికి ఆమే దిక్కు అనీ ,’’శుభంబు నీకగున్ ‘’మాటలలో తన పరాదీనత సాకుగా తనదగ్గరకోరదగింది ఏమీ లేదనీ ,తానిచ్చే బ్రాహ్మణ ఆశీర్వడమే ప్రతిఫలంగా భావించమని ధ్వని ఉన్నది .

 ఈమాటలే వరూదికి వేరే విధంగా అనిపించాయి.అతని అభీష్టానికి ఒంటరి ప్రదేశం అనువైనదాని ,సురకా౦త కు సుపర్వుడు తగినవాడే అని ,రూపలావణ్యాలలో  తాను  ఎవరికీ తీసిపోని దాని ననీ , ,బ్రాహ్మణ్యం స్వైర విహారానికి అంతరాయం కాదు అంటున్నాడని ,వొళ్ళు అంతా క్రొవ్వి కోవ్వి ఉన్న అతడు ఆమె లావణ్యాన్ని దోచుకోకుండా ఎలా వెడతాను  అనుకొంటున్నాడనీ ,ఆసుఖం మరగి ఇక అతను  తన ఊరు కు వెళ్ళలేనని అంటున్నాడని ,అతనిది అంతా మన్నింపు, వేడికోలు ,అతని కోర్కె తీరిస్తే, అతడి ప్రాణాన్ని కాపాడినట్లే అంటున్నాడని ఆమె భావించింది .ఇది అకాముడైన ప్రవరుని అభిప్రాయంకాదు .సకామి అయిన వరూధిని భావనమాత్రమే .కనుక దీన్ని ‘’బోద్ధవ్య వైశిష్ట్యం తో ఏర్పడిన ధ్వని అన్నారు శాస్త్రి గారు .

  తనకథ అంతా ఏకరువుపెట్టినా ప్రవరుని నమ్మని వరూధిని ‘’ఇంతలు కన్ను లుండ దెరువెవ్వరి వేడెడుభూసురేంద్ర ‘’అనే మరో శిల్పంలాంటి పద్యం లో ‘’ఇంతలు కన్నులు ‘’మాట ఇంతటి కన్నులున్న నావంటి సౌందర్య రాశి ఇంకెవరూ లేరనీ ,అతనికి తగిన దానినితానే అనీ ,అతడు సురేంద్రుడని,అతడు తన్ను అర్ధించటం ఆమె భాగ్యమే అనీ ,తానున్నది ఏకాంతమైన విహార స్థలమే అనీ తారుణ్య లావణ్యాదులలో అతన్ని స్వర్గ సుఖాలలో తేల్చగలననీ ,’’నెపంబిడి పలకరించు లాగింతయు కాక ‘’అన్నదానిలో అతడు తనపై మక్కువ పడటం తనకు తెలియనిదికాదని ,వచ్చినదారి తెలియదనటం గడుసుతనమనీ ,సంకోచం లేకుండా అడగటం లో లాఘవం ఏదీ లేదనీ ,’’మాటలేటికిన్ ‘’ అన్నమాటలో మాటలతో వృధా కాలక్షేపం ఎందుకు ముగ్గులోకి దిగుదాం అనే అభిప్రాయం ఉందని ఆమె చెప్పక చెప్పింది .ఈ నిగూఢతను ‘’నర్మ గర్భంబున పలికిన ‘అన్నకవి వాక్కు గుణీభూతవ్యంగ్యమే కాని ధ్వని కాదనీ అయినా రామణీయకత్వానికి లోటేమీ రాలేదని అంటారు  శాస్త్రీజీ  .ఇలా వ్యంగ్య మర్యాదతో కొత్త విషయాలు చెబుతూ మను చరిత్ర ప్రబంధ కావ్యాన్ని ధ్వనికావ్యంగా పెద్దన మహాకవి తీర్చి దిద్దాడు అంటారు .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-11-18-ఉయ్యూరు

 

 

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అధ్యయనం డా.శ్రీమతి మంగళగిరి ప్రమీలా దేవి గారి ఆరోప్రాణం

డా మంగళగిరి ప్రమీలాదేవి విశిష్ట విద్వన్మణి ప్రఖ్యాత రచయిత్రి. పద సాహిత్యం ఆమెకు అభిమాన విషయం. అంతేకాదు, పదసాహిత్యం – సంకీర్తనా సౌరభాలను లోతుగా అధ్యయనం చేసిన విదుషీమణి. పద సంగీత సాహిత్యాల సుస్వరూపం తెలిసిన పద సంగీతవేత్త. నిరంతర పరిశోధనాశీలి. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషలలో పండితులు. గురుముఖతా శాస్ర్తియ సంగీతాన్ని అధ్యయనం చేసిన వీరు సంగీత శాస్త్ర పట్టభద్రులు. విద్యారంగంలోను అసోసియేషన్ ప్రొఫెసర్‌గా చాలా సంవత్సరాలు పనిచేసి ఉత్తమ విద్యార్థులను తయారుచేసిన ఘనత డాక్టర్ ప్రమీలాదేవిది. విద్యారంగానికి,విద్యార్థులకు చేసిన సేవకు ఉత్తమ ఉపన్యాసకులు (బెస్ట్ లెక్చరర్)గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి స్వర్ణపతక గౌరవాన్ని పొందారు.

వీరు రచించిన’’ తెలుగులో పద్యగేయ నాటికలు’’ అనే విమర్శనాత్మక గ్రంథం పద్యగేయ నాటికా విమర్శనారంగంలో మొట్టమొదటిది. ఈ గ్రంథం 1971వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని పొందింది.
ఈ సంవత్సరం 2018 నాటి సరస్వతీ వరం ప్రఖ్యాత రచయిత్రి, పద సాహిత్య పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవికి లభించింది. భోపాల్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ‘అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం’ వారు జూలై 29వ తేదీన డా మంగళగిరి ప్రమీలాదేవికి ‘సరస్వతీ సమ్మాన్’ పురస్కారాన్ని అందజేశారు.. డా మంగళగిరి ప్రమీలాదేవి తెలుగులో అనేక పరిశోధనాత్మక రచనలు చేశారు. ‘’డా జి.వి.కృష్ణారావు నాటికా సాహిత్య సమాలోచనం’’ అనే విషయం మీద పరిశోధన చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ఎంఫిల్ పట్టా పొందారు. ప్రథమాంధ్ర వాగ్గేయకారులైన’’ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలలోని జానపద సంగీత రీతులు, ఫణుతుల’’పై విశేషంగా పరిశోధన చేసి, ఈ విషయంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి డిగ్రీ పొందారు. అంతటితో ఆగక నిత్య నిరంతరం సంకీర్తనా, వివిధ రీతులు, సంకీర్తనాకారులు అనే విషయాలపై పరిశోధన చేస్తూనే ఉన్నారు. చరిత్ర ఎరుగని పదకర్తలను 50 మందిని వెలికితీసి వారి సంగీత సాహిత్యాలకు ఈ తరం గాయనీ గాయకులకు పరిచయం చేశారు. టాంక్‌బండ్‌మీద క్షేత్రయ్య విగ్రహం నెలకొల్పినపుడు పదకర్త క్షేత్రయ్య జీవిత చరిత్రను తెలుగు విశ్వవిద్యాలయం వారి కోరిక మేరకు రచించారు. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణల సందర్భంగా వీరు వ్రాసిన’’ గేయ అధ్యాత్మ రామాయణాన్ని’’ గూర్చిన గ్రంథాన్ని తెలుగు అకాడమీవారు ప్రచురించారు. 2016వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారాన్ని స్వీకరించారు. పద సాహిత్య పరిషత్తుకు అనుబంధంగా ప్రచురణ విభాగాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 35 పుస్తకాలను ప్రచురించారు.
డాక్టర్ ప్రమీలాదేవిని బాగా తెలిసిన పెద్దలు ‘’వాగ్గేయకారుల ప్రమీలాదేవి’’గా పిలుస్తారు. దీనిని గూర్చి మంగళగిరి ప్రమీలాదేవిని ప్రశ్నించగా ఆ పిలుపును తాను గొప్ప గౌరవంగా భావిస్తానన్నారు.
తాను రచించిన షిరిడీ సాయినాథ నామ వైభవం’’ హైదరాబాదు, త్యాగరాయగానసభలో నాట్య గురు శ్రీమతి ఝాన్సీరామ్ దర్శకత్వంలో ప్రదర్శించడం జరిగిందనీ, ఆ ప్రదర్శనకు తాను, నాట్య గురు ఝాన్సీ రామ్ కలిసి పాట పాడామని ఆనాటి గీత గాన అనుభూతి తనను ఇంకా సంతోషం కలిగిస్తూనే ఉన్నదనీ చెప్పారు ‘సరస్వతి సమ్మాన్’ గౌరవ స్వీకర్త డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి.
డాక్టర్ మంగళగిరి 2012లో అమెరికాలోని హూస్టన్, డల్లాస్ నగరాలలో జరిగిన సాహిత్య సభలలో ప్రసంగించి ఆయా సంస్థల చేత సత్కారాన్ని పొందారు. 2014లో జార్జియా అట్లాంటాలో జరిగిన నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) వారి తెలుగు సభలలో పాల్గొని గేయ అధ్యాత్మ రామాయణాన్ని గురించి సోదాహరణ ప్రసంగం చేసి ఆ సభలో సత్కారాన్ని పొందారు.
కృష్ణలీలా తరంగిణిలోని తరంగాలంటే తనకు చాలా ఇష్టమనీ, తాను పాడి, కొందరు మహిళా బృందాలకు నేర్పించి పాడించాననీ, అది తనకు సంతృప్తిని కలిగించిన విషయమని తెలియజేశారు.
ఇటీవల ప్రచురితమైన సంగీత, నృత్య నాటికలు ‘నారీ మంగళ మహాశక్తి’ ప్రథమ గణ్యమని అంటారు ఆమె. భారతజాతి గర్వించదగిన మహోన్నత  స్త్రీ మూర్తులు, వారి గాధలను వివరిస్తూ నృత్య గేయ రూపంలో వచ్చిన పుస్తకమిది.
ఇదే సంపుటిలోనున్న ‘కలువభామ- విమల ప్రణయం’ అనే నృత్య నాటికను గురించి ఒక విషయం చెప్పాలి. ఇది ఆసాంతం భావ ప్రధానంగా నడిచిన భావ నాటిక. హిందీలోను కొన్ని గ్రంథాలను రచించి ఔత్తరాహులకు కూడా ఆంధ్ర వాగ్గేయకారులను పరిచయం చేశారు.
అనేక ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవికి అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ వారి ‘సరస్వతీ సమ్మాన్’ గౌరవం దక్కడం అభినందనీయం.

ఆమె సంస్కృత, తెలుగు, హిందీ భాషల్లో పాండిత్యం గడించి దాదాపు 40కి పైగా గంథ్రాలను రచించారు. అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగ పాణి, భక్త కవుల రచనలలో సంగీత సాహిత్యాలపై విశేష పరిశోధన చేశారు. తెలుగులో పద్యగేయ నాటికలు రచించిన ఆమెకు 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.’’ పదసాహిత్య పరిషత్’’ అనే సాహిత్యసేవా సంస్థను స్థాపించి సేవలందించారు. ఆకాశవాణి దూరదర్శన్‌ల ద్వారా బహుళ ప్రజాదరణ పొందిన అనేక గేయాలను, సంగీత రూపకావ్యాలను రచించారు.

ప్రముఖ రచయిత్రీ సాహిత్య రత్న డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి(75) అనారోగ్యంతో 1-11-18 గురువారం మృతిచెందారు . మల్కాజిగిరి సర్కిల్ పరిధి మిర్జాల్‌గూడలో నివాసముంటున్న ప్రమీలాదేవి గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు . నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో  చికిత్స పొందుతూ గురువారం గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలు మల్కాజిగిరి స్మశానవాటికలో జరిగాయి. పలువురు సంతాపం తెలిపారు. జేశారు  .

ఆధారం –ఆంధ్రభూమి లో ఆగస్ట్ 7న ప్రచురింపబడిన వ్యాసం

శ్రీమతి ప్రమీలాదేవిగారి సోదరులు ,హైదరాబాద్ ఆకాశవాణి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ,ప్రముఖ సంగీత విద్వాంసులు, అపర ఘంటసాల, సరసభారతికి, నాకు అత్యంత ఆత్మీయులు  మాన్యశ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు ఆమె మరణ వార్తను వెంటనే నాకు తెలియ జేశారు  .నేను వెంటనే అందరికి తెలిపాను .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-11-18-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-4 అయిదవ అధ్యాయం –గంగ రెండురూపాలు

గౌతమీ మాహాత్మ్యం-4

  అయిదవ అధ్యాయం –గంగ రెండురూపాలు

నారదమహర్షి బ్రహ్మ దేవుని గంగ ఎలా భూలోకం చేరిందో వివరించమని కోరగా ఆయన’’శివుని జటలో ఉన్న గంగను గౌతమహర్షి ,భగీరధుడు అనే మహారాజు శివుని ఆరాధించి భూమిమీదకు తెచ్చారు .ఇలా ఇద్దరి ప్రయత్నాలవలన గంగ రెండు రూపాలుగా భూమిని చేరింది .శివ పార్వతీ కళ్యాణం తర్వాత గంగాదేవి కూడా ఆయన జటాజూటం చేరింది .ఉమామహేశ్వర శృంగార  రస ప్రవృత్తిలో శివుడు రసము అంటే గంగను సృష్టించాడు .ఈమెపైనే అధికప్రేమభావం చూపాడు .చివరకు తన జటాజూటం లో గంగను దాచిపెట్టాడు .ఇది తెలిసిన ఉమాదేవి సహించలేక పోయింది .ఎన్నోసార్లు గంగను వదిలెయ్యమని కోరింది .ఆయన ఆపని చేయలేదు వినాయకుడు  భార్య జయ , స్కందులతో సంప్రదించి పార్వతి ,వినాయకుడితో శివుడు ఎవరిమాటా వినటం లేదు కనుక తాను  మళ్ళీ హిమాలయాలకు వెళ్లి తపస్సు చేస్తాను ,లేకపోతె పవిత్ర విప్రుడు ఎవరైనా గంగను బయటికి పంపే మార్గం చేయాలి అన్నది .

  ఇంతలో భూలోకం లో 22ఏళ్ళు అనావృస్టి కలిగి ,గౌతమమహర్షి ఆశ్రమం తప్ప అంతా కరువుకోరల్లో నలిగి పోయింది .దీనికొక కారణం ఉంది .పూర్వం బ్రహ్మ దేవ యజనం అనే పర్వతం పై యజ్ఞం చేశాడు . అందుకే దీన్ని ‘’బ్రహ్మ గిరి ‘’అంటారు .ఇక్కడే గౌతమమహర్షి ఉండేవాడు .మహా శక్తివంతుడైన ఆయన ఆశ్రమ వద్ద ఆధి వ్యాధులు,దుర్భిక్షం అనావృస్టి భయ శోకాలు ,దారిద్ర్యం ఉండవు .అందుకే అందరూ ఇక్కడికే చేరారు .ఆయన పితరులకు పిండప్రదానం చేస్తే ,దేవతలగూర్చి యజ్ఞాలు చేస్తే పితృదేవతలు దేవతలు స్వీకరించి తృప్తి చెందేవారు  ఇతర ప్రాంతాల నుండి వచ్చిన మునులు కూడా ఆయనను తండ్రిలాగా గౌరవించి సేవించేవారు .ఇక్కడే ఓషధులు కూడా ఆరాది౦పబడి చక్కగా వృద్ధి చెందాయి . .త్రిమూర్తులను ఆయన పూజించేవాడు  .గౌతమఖ్యాతి ముల్లోకాలకు ప్రాకింది .

  ఈ విషయాన్ని తల్లికి గణేశుడు వివరించి శివుని  గంగను వదిలేసేట్లు గౌతముడు చేయగలడని నమ్మకంగా చెప్పి ,సోదరుడు, భార్య తోకలిసి విఘ్నేశ్వరుడు విప్ర వేషాలలో గౌతమ ఆశ్రమం చేరి కొన్ని రోజులు అక్కడ ఆతిధ్యం పొంది కొంతకాలం తర్వాత అక్కడి మునులతో ఇప్పటికే చాలాకాలంగా ఇక్కడ ఉన్నాం కనుక వేరే చోటకు వెడితే మంచిదనే ఆలోచన చెప్పి మునికి విన్నవి౦చేట్లు చేశాడు  .ఆమాటవిన్న మహర్షి ఒప్పుకోక పొతే ,ఆయన మనసు కరిగించే ఉపాయం ఆలోచించాడు . భార్య జయను గో రూపం ధరించి గౌతముడిదగ్గరకు వెళ్ళని చెప్పగా, ఆమె అలానే చేసి అక్కడున్న పొలాలలోపడి ఇష్టం వచ్చినట్లు తింటూ తొక్కుతూ భీభత్సం చేసింది .విప్రగౌతముడు గడ్డి పరకతో దాన్ని వారించాడు .ఆవు అరుస్తూ పడిపోయింది .దాని హాహాకారాలకు వినాయకుడు మునులు పరిగెత్తుకొచ్చి ,గౌతముడు చేసింది సరైనదికాదని తామంతా ఆశ్రమం వదిలి వెళ్లి పోతున్నామని చెప్పారు .దీన్ని తట్టుకోలేక గౌతముడు పడిపోయాడు .అప్పుడు విప్రులు ఆయనతో ‘’తీర్ధ –దేవ స్వరూపం అయిన గోవు నేలపై పడిపోయింది .మేమిక్కడ ఉంటె ఇప్పటిదాకా చేసిన తపస్సు ఫలం అంతా క్షయమైపోతుంది .మేము తపోధనులము మాత్రమే ‘’అన్నారు .పాపం గౌతముడు డీలాపడి,నమస్కరిస్తూ ‘’మీరే నాకిప్పుడు శరణం నన్ను పవిత్రుడిని చేయగలిగిందికూడా మేరే ‘’అన్నాడు వినాయకుడు ‘’దీనికి  నివారణ మార్గం ఒకటి ఉంది ‘’అనగా చెప్పమని ఆయన కోరగా,బ్రాహ్మణ వేషం లో ఉన్న వినాయడే పరిష్కారం చెప్పగలడు అన్నారు. ఆయన ‘’  మునులు, గౌతముడు నా మాట మన్నించాలి .శివుని జటాజూటం లో, బ్రహ్మ కమండం లో గంగ ఉన్నది .గౌతముడు వెళ్లి  ఆ  గంగాజలాలను  తేవాలి .అప్పుడే మేము ఈ ఆశ్రమలో ఉంటాం ‘’అన్నాడు .దేవతలు సంతోషించి పుష్పవృష్టి కురిపించారు .

  గౌతముడు నమస్కరిస్తూ తపస్సు అగ్ని ,దేవతల ,బ్రాహ్మణుల  అనుగ్రహం తో తాను గంగను  సాధించగలను అని చెప్పి ,ఒక్కసారి దివ్య దృష్టితో చూసి దేవకార్యం, లోకోపకారం శివ ప్రీతి  ,గౌరీ దేవి సంతోషం కోసమే ఈ కార్యం అని తనవలన ఏ లోపమూ జరగలేదని గ్రహించాడు .అందరి వద్దా సెలవు తీసుకొని గంగావతరణం కోసం కైలాసానికి వెళ్ళాడు గౌతమ మహర్షి .

  సశేషం

నేడు నాగులచవితి ,రేపు నాగపంచమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-11-18-ఉయ్యూరు .

 

image.png
image.png

   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   గౌతమీ మాహాత్మ్యం-3 నాలుగవ అధ్యాయం –బలిప్రసంశ

         గౌతమీ మాహాత్మ్యం-3

నారదుడు బ్రహ్మను ఆకమండలం లో గంగా దేవి ఎలాచేరింది ,ఈలోకం లోకి ఎలావచ్చింది సవివరంగా తెలియజేయమని కోరాడు .బ్రహ్మ ‘’దేవ శత్రువు బలిరాక్షసుడు ధర్మ వీర ప్రజారక్షణ ,గురుభక్తి సత్య ,వీర్య బల,త్యాగ క్షమా గుణాలతో జగజ్జేత అయ్యాడు.ఇతడిని చూసి దేవతలు అసూయపడి ,అతడిని ఎలా జయించగలం అని మీమా౦స పడ్డారు.ముల్లోకాలలో కల్లోలాలు లేవు ,శత్రువులులేరు వ్యాధి అనావృస్టి మనోవ్యధ లేనేలేవు ప్రజలకు’’నాస్తి’’ అనేది లేదు .అని తలచి ,అతని కీర్తితోనే ఓడించాలి అని నిశ్చయించి విష్ణువును చేరి తము దైత్యబలి ని ఎలాకీర్తి౦చగలం,ఇప్పుడు నువ్వే  మాకు దిక్కు అని వేడుకున్నారు .కరగిన కరి రక్షకుడు ‘’బలి నా భక్తుడు అతనినిజయించటం ఎవరి తరమూ కాదు .యుక్తితో అతడిని జయించి మీ స్వర్గం మీకు అప్పగిస్తానని అభయమివ్వగా సంతోషించి వాళ్ళు వెళ్ళిపోయారు .

  తర్వాత విష్ణువు అదితి గర్బం లో ప్రవేశింఛి జన్మించగా దేవతలు ఉత్సవాలు చేశారు .యజ్ఞేశుడు యజ్నపురుషుడు వామనుడిగా జన్మించాడు .బలపరాక్రమాలలో  శ్రేష్టుడైన బలి’హయ మేధయాగానికి పూనుకొని ,రాక్షసగురువు శుక్రాచార్యుని ఆధ్వర్యం లో యాగం మొదలుపెట్టాడు .హవిర్భాగం పొందటానికి దేవ గాంధర్వ ,పన్నగులు చేరారు .ఎవరికి ఏదికావాలో అది ఇచ్చాడు ,షడ్రసోపేత భోజనాలు పెట్టాడు ,బ్రాహ్మణులను పూజించి దానాలు విశేషంగా చేశాడు .ఇంతలో వామన బ్రహ్మ చారి చిత్రకు౦డలదారియై రాగా ,వచ్చినవాడు మారువేషంలో ఉన్న విష్ణువే అని గ్రహించి శుక్రాచార్యుడు శిష్యునితో ‘’వచ్చిన వాడు విప్రుడు కాదు .యజ్న పురుషుడు నారాయణుడే .అతడేదదైనా యాచిస్తే నాతొ సంప్రదించి నేను ఔనంటేనే దానమివ్వు ‘’అని హెచ్చరించాడు .దీనికి బలి’’యజ్నపురుషుడే యాచి౦చటానికి వస్తే మీతో సంప్రదించాల్సిన పనేముంది ?’’అని భార్యతో సహా వామనుని చేరి ‘’ఎందుకోసం యాచకుడవైనావు “”?అని చేతులు జోడించి అడిగాడు ‘.’’పదత్రయభూమి’’ఇమ్మని కోరాడు ..మళ్ళీ ‘’రాజేంద్రా !భూమే ఇవ్వు ఇంకేమీవద్దు ‘’అనగా అలాగే అన్నాడు బలి .మహర్షులు పురోహితుడైన శుక్రుడు ,లోకనాథులు,దైత్య సంఘం  చూస్తుండగా,నానా రత్నఖచిత కలశం నుండి నీరు ధారగా పోస్తూ జయజయ ద్వానలమధ్య బలి మూడు అడుగుల భూమి వామనుడికి దానం చేశాడు .తనకు దానమిచ్చిన భూమి ని వెంటనేస్వాదీనం చేయమన్నాడు వామనుడు .సరే అనగా వామనుడు విపరీతంగా పెరిగిపోయాడు .ఆశ్చర్య పడిన బలి’’లోకేశ్వరా !నీశక్తికొద్దీ విజ్రు౦భించు .’’అనగానే విప్రబాలుడు ‘’అన్ని విధాలా నేనే జయించాను దైత్యేశా !’’అంటూ ఇంకా పెరిగిపోయాడు .విక్రముడైన వామనుడు తాబేలు వీపుపై ఒకపాదం ఉంచి, రెండవపాదం యజ్ఞవాటికలోపెట్టి, మూడవ పాదం పెట్టటానికి చోటులేక బలినే అడిగాడు ఎక్కడ పెట్టాలని .చిరునగవుతో బలిభార్యతో సహా కృతజ్ఞత గా నమస్కరించి ,’’జగద్రూపా !మూడవపాదం నా వీపు మీద పెట్టు’’అని కోరాడు .బలిభక్తికి సంతోషించి వామనరూప విష్ణువు వరం కోరుకోమన్నాడు ,దానికి బలి’’నీకు దానంగా భూమి అంతాఇచ్చేసి , నేను మళ్ళీ నిన్ను ఏదో కోరితే దానం వ్యర్ధమౌతుంది ‘’అనగా మరింత సంతోషించి  అడగకపోయినా బలికి రసాతలాదిపత్యం ,భవిష్యత్తులో ఇంద్రపదవిని,ఏకచ్చత్రాదిపత్యాన్ని ,అనశ్వరమైన యశస్సు అనుగ్రహించాడు .భార్యతో సహా బలిని రసాతలానికి తీసుకు వెళ్లి ,ఇంద్రునికి మళ్ళీ ఇంద్రపదవి కట్టబెట్టాడు విష్ణువు .

  బ్రహ్మలోకాన్ని చేరిని విష్ణు పాదాన్ని శంకరుడు ఇచ్చిన కమండలం లోని గంగాజలం తో పూజించాలని భావించి మంత్ర పూత౦ గంగాజలాన్ని విష్ణుపాదం పై చల్లాడు .తర్వాత ఆ జలం మేరు పర్వతం పై పడి నాలుగు పాయలై భూమికి చేరే ప్రయత్నం లో పూర్వ ,దక్షిణ ,పశ్చిమ,ఉత్తర దిశగా బయల్దేరగా,దక్షిణ దిశా ప్రవాహాన్ని శంకరుడు తన జటా జూటం లో బంధించాడు .పశ్చిమమవైపు జలం మళ్ళీ బ్రహ్మ కమండలం లోకే చేరింది .ఉత్తరానికి పారిన నీటిని విష్ణువు గ్రహించాడు .తూర్పు దిశా ప్రవాహాన్ని దేవతలు పితరులు ,లోకపాలురు గ్రహించారు .దక్షిణ దిశకు ప్రవహించిన విష్ణు పాదోదకమైన గంగ లోక మాతృక బ్రహ్మ సంబంధమైన లోకమాతలు .శివజటాజూటం  లోని గంగా ఇవన్నీ శుభోదయాలే వీటిని స్మరిస్తేనే కోరికలు తీరుతాయి .  

  రేపు నాగుల చవితిశుభాకా౦క్షలతో  

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-11-18-ఉయ్యూరు         

image.png
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -5’

ధ్వని కోణం లో మను చరిత్ర -5’

ఉత్తమ ధ్వనికావ్యం మను చరిత్ర అని ము౦దే చెప్పుకొన్నాం .ఈ ప్రబంధం లో పదాలలో ,పద్యాలలో ,పాత్ర స్వరూప స్వభావ చిత్రణలో ,సంభాషణలలో ,ప్రకృతి వర్ణనలలో ,ఏదో ఒక రసమో, భావమో ,అలంకారమో ,వస్తువో వ్యంగ్య వైభవంగా దర్శనమిస్తుంది అంటారు శ్రీ రాజన్న శాస్త్రి గారు .మొదటి ఆశ్వాసం లో ప్రవరుని వర్ణిస్తూ ‘’మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి ‘’అనే ఒక్కమాటే చెప్పాడు కవి పెద్దన .అవయవ వర్ణన చేయలేదు .కాని వరూధిని ముఖతహా రెండు సార్లు ఇతని సౌందర్య వర్ణన చేయించాడు .’’ప్రవరుని వదనం లావణ్య వారాశి .విశాలమనోజ్నమైన ముఖ శోభను ఇనుమడిస్తున్నాయి .భుజాలు ఉన్నతాలు .ఉదర వైశాల్యం ఆశ్లేష ఇచ్ఛ ను కలిగిస్తుంది .పదాలు చిగురాకు సౌకుమార్యాలు .శరీర కాంతి తో కనులలో అమృతం కురుస్తున్నట్లు ఉన్నాడని వరూధిని వర్ణన .’’నేరెటేటియనల్ తెచ్చి ,నీరజాప్తు –సానబెట్టిన రాపొడి చల్లి ,మెదపి-వదను సుధ నిడిచేసెనో  పద్మభవుడు -వీని గాకున్నగలదెఈ మేనికాంతి !’’అదీ ప్రవరుని  లావణ్యకాంతి.దీనికే పడిపోయింది వరూధిని .ఇక్కడ ప్రవరుడు ఆలంబన విభావం .అతని లోకోత్తర సౌందర్యం ఉద్దీపనవిభావం .ఈ వర్ణన అనుభావం .వితర్కించటం వ్యభి చారీభావం .వీటివలన వరూదినిలో రతి అభి వ్యక్తమై శృంగార రస ధ్వని ఔతోంది అని చక్కని ఆలంకార భాషలో విశ్లేషించి చెప్పారు శాస్త్రిగారు .ప్రవరుని అవయవ లావణ్యం లోకోత్తరం అని ఆమె ‘’కాకున్నకలదె ఈమేనికాంతి ‘’అనటం లో నిశ్చయమై వితర్కంవ్యభిచారీ భావం శృంగార రస పరిపోషకమై ధ్వనిస్తోంది ‘’ప్రాదాన్యేనవ్యవ దేశా భవంతి ‘’అనే న్యాయం వలన దీన్ని  రసధ్వని అనటం కన్నా ,భావ ధ్వని అనటం సమంజసం అన్నారు శాస్త్రీజీ .

   రెండవ సారి ప్రవరుని వరూధిని వర్ణించిన సందర్భం –ఆతడు తిరస్కరించగా పరితపించే టప్పుడు .

‘’కమ్మని కుందనంబు కసుగందని మేనెల దేటిదాటులన్ –బమ్మెర వోవ దోలు దెగబారెడువెంట్రుక లిందు బి౦బముం  

గిమ్మన నీదు మోము గిరి క్రేపులు ,మూపులు కౌను గానరా –దమ్మక చెల్ల!వాని వికచా౦బ కముల్ శతపత్ర జైత్రముల్ ‘’.

ఇక్కడ చింతా విశేషం విభావం .’’అమ్మక చెల్ల’’అనటం లో భ్రువువు వగైరా అనుభావాలు .దీనివలన ‘’స్మృతి ‘’అనే వ్యభిచారభావం విప్రలంభ శృంగారం ప్రధానంగా ధ్వనిస్తోందన్నారు శాస్త్రి గారు .కవి ఈ రకమైన వర్ణను ముందే చేసిఉంటే ఈ భావధ్వని ఉండేదికాదు .చెలికత్తెలు వరూదినితో పలికినమాటలలో ‘’చంద్రుడు నిన్నుఇలా చేసిన పాపం ఊరికే పోదు .అది అతని పతనానికి కారణమయింది చూశావా ‘’అనే ఊరడింపు ధ్వనిస్తోంది .ఈ వర్ణన కవే చేసిఉంటే ఈ  ధ్వని ఉండేదికాదు .

  చంద్రుడు అస్తమిస్తుంటే సూర్యుడు ఉదయించటం వర్ణించిన పద్యం లో విరహం పోయి ,ప్రియ సమాగమం జరుగుతుంది అనే ఊరడింపు ధ్వనిస్తోంది .ప్రతీయమాన ఛాయకవి వాక్కుకు అందం కూర్చింది –‘’కాలపు హొంత కాడు చరమాగమ స్కంధముం జేర్చు ,నిబ్బరపున్ సంగడ మో యనన్, శశి డిగెం బ్రాగ్భూమి భ్రుత్కైత వేతర బాహాగ్రపు సంగడంబనగమార్తాండుండు దోచెన్ దివిన్ ‘’ .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-11-18-ఉయ్యూరు

 

 

 



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  గౌతమీ మాహాత్మ్యం-2 మూడవ అధ్యాయం  -శివ పార్వతీ కళ్యాణ వైభోగం  

   గౌతమీ మాహాత్మ్యం-2

మూడవ అధ్యాయం  -శివ పార్వతీ కళ్యాణ వైభోగం  

అనేకరకాలైన రాత్నాలచే వివిధ రంగులు కలిగి ,బహు పక్షి ,వృక్ష ,లతా వ్యాప్తమైన హిమవత్పర్వత౦  నదీ నద సరః ,కూప ,తటాకాదులచేత ,దేవ గ౦ధర్వ యక్ష కిన్నర సిద్ధ చారణ సమూహాలతో ,సహజ పరిశుద్ధవాయువుతో , ఆనందానికి  కారణాలైన మేరు మందార,మైనాకాది పర్వతాలతో కూడి ,వసిష్ట ,అగస్త్య పౌలస్త్య ,లోమశాదిమునులచే కూడిన ఆనంద  ఉత్సాహాలమధ్య పార్వతీ పరమేశ్వరుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది .,వజ్రమాణిక్య వైడూర్యాదులతో కూడిన స్తంభాలపైఉన్న సువర్ణ రత్నమయ వేదిక పై,జయా ,లక్ష్మీ ,శుభా ,కాంతీ కీర్తి ,పుష్టి మొదలైన దేవతలు,మేరు ,మందార ,కైలాస రైవతాది పర్వతాలు , పరివేష్టితులై ఉండగా లోకనాధుడు విష్ణువు చే పూజితుడై ,హిరణ్మయుడైనమైనాకుడనే పర్వతశ్రేస్టంప్రకాశామానంగా కనిపించింది .లోకపాలకులు మహర్షులు ,మరుద్గణాలతో ఆదిత్యుడుకళ్యాణ వేదికను సిద్ధం చేశారు .దేవ శిల్పి విశ్వకర్మ తోరణాల వేదిక తీర్చి దిద్దాడు.సముద్రాలు నదులు,పర్వతాలు ,ఓషధులు ,లోకమాతలు ,వనస్పతులతో ఉన్న బీజాలు అంటే సకల చరాచర ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తూ ఉండగా లోకమాత పార్వతీదేవి వివాహం పరమేశ్వరునితో జరిగింది .ఈవివాహ వేడుకలో ఇలాదేవి ఊడవటం అలకటం ముగ్గులు పెట్టటం చేస్తే ,ఓషధులు వంట సామాను సిద్ధం చేస్తే ,వరుణుడు నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే ,,కుబేరుడు దక్షణ ,దానాదులు నిర్వహించాడు .అగ్నిదేవుడు ఆది దంపతులకు ఇష్టమైన ఆహార పదార్ధాలు వండాడు .విష్ణుమూర్తి వివాహోచిత పూజాదికాలు చేశాడు. వేదాలు గానం చేశాయి  నవ్వాయి .అప్సరసలు నృత్యం చేశారు .గ౦ధర్వ కిన్నరులు గానం తో తన్మయుల్ని చేశారు .మైనాకుడు శుభప్రదాలైన ‘’లాజలు’’ అంటే పేలాలు చల్లాడు .లోపల పుణ్యాహవాచన కార్యంజరిగింది .విధి విధానంగా అగ్నిని ,శిలను ప్రతిష్టించి పేలాలను హవనం చేసి ,అగ్నికి ప్రదక్షిణం చేశారు .

  విష్ణు మూర్తి సాయం తో శివుడు గుండ్రాయిని తొక్కటానికి పార్వతీదేవి కుడి పాద బొటన వ్రేలిని చేతితో స్పృశించాడు .శివుని దగ్గర హోమం చేస్తున్న బ్రహ్మ చూసి దుస్ట చాపల్యం తో నవ్వగా వీర్యం కారిపోయింది  .సిగ్గుపడి దాన్ని చూర్ణం చేశాడు .దీనినుంచి ‘’వాలఖిల్యులు ‘’జన్మించారు .అప్పుడు దేవతలంతా హాహాకారాలు చేశారు .సిగ్గుపడి బ్రహ్మ అక్కడనుండి లేచి వెళ్ళిపోయాడు .దేవగణ౦ మౌనం వహించాయి .శివుడు నందితో ‘’బ్రహ్మను వెనక్కి పిలు .నేను ఆతనిని పాపరహితుడిని చేస్తాను .తప్పు చేసిన వారి యెడల సజ్జనులు దయ చూపించటంలోక సహజం  .విషయవాంఛ విద్వా౦సులనూ మోసగిస్తుంది  .దాని శక్తి అంత గొప్పది  ‘’అన్నాడు .

  ఉమానాధుడు బ్రహ్మపై జాలితో నారదుడితో జరిగింది చెబుతూ భూమి ,నీరు పాపుల పాపాలను తొలగించే శక్తికలవి .ఈ రెండిటి సారాన్ని గ్రహిస్తాను ‘’అని చెప్పి వాటి సారాన్ని గ్రహించి ,భూమిని  కమండలంగా చేసి ,దానిలో నీరు పోసి ,పవమాన్యాది సూక్తాలతో అభి మంత్రించి  దానినుండి జగత్పావనమైన శక్తి కలిగేట్లు స్మరింఛి ఆ కమండలాన్ని బ్రహ్మకిచ్చాడు .జలం మాతృదేవత .భూమికూడా తల్లి యే.ఈ రెండిటికి సృష్టి యొక్క స్థితి ,ఉత్పత్తి ,వినాశ హేతుత్వం ఉన్నది .వీటిలోనే ధర్మం ప్రతిష్టితమై ఉంటుంది  .ఇక్కడే సనాతన యజ్ఞం కూడా ప్రతిష్టింప బడింది ..భుక్తి ముక్తి వీటిలోనే ఉన్నాయి సకల స్థావర జంగమాలు వీటిలోనే ఉన్నాయి .వీటిని స్మరిస్తే పాపాలు నశిస్తాయి వీటిని ఉచ్చరిస్తే వాచికమైన పాపాలు పోతాయి .స్నాన పాన అభిషేకాలవలన శరీర పాపాలు తొలగుతాయి .లోకం లో ఇదే’’ అమృతం’’.దీనికంటే పవిత్రమైనది లేదు .దీనిలోని జలాన్ని ఎవరు స్మరించినా పఠించినా కోరిన కోరికలు తీరతాయి ‘’అని చెప్పి తనచే అభిమంత్రి౦ప బడిన  కమండలాన్ని శివుడు బ్రహ్మకు ఇచ్చాడు .

  పంచభూతాలలో జలం గొప్పది .లం లోని సారమంతా దీనిలో గ్రహింప బడింది కనుక ఈ కమండలజలం  అభీష్ట సిద్ధి నిస్తుంది ఈ నీరు శుభప్రదం పుణ్యదాయకం ,పావనం .దీన్ని తాకితే నీపాపాలన్నీ పటాపంచలౌతాయి ‘’’అని బ్రహ్మకు శివుడు కమండలాన్నిచ్చాడు.   .అక్కడున్న దేవ ముని గణమంతా పరమేశ్వరుని కీర్తించి జయజయ ధ్వానాలు చేశాయి .బ్రహ్మ దేవుడు జగన్మాత పార్వతీదేవి పదాగ్రాన్ని చూసి ,దుర్బుద్ధి కలిగిన పాపంతో పతితుడయ్యాడు .జగత్పిత పరమేశ్వరుడు దయతో పుణ్య ప్రదమైన స్మరణమాత్రం చేత పవిత్ర౦ చేసే  గంగా జలమున్న కమ౦డలాన్నిబ్రహ్మదేవుడికి ప్రసాదించాడు  .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-11-18-ఉయ్యూరు

 

image.png

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 గౌతమీ మాహాత్మ్యం-1

    గౌతమీ మాహాత్మ్యం-1

    సాహితీ బంధువులకు పవిత్ర  కార్తీకమాస శుభాకాంక్షలు –ప్రతికార్తీకం లో శివపరమైనది ఏదో ఒకటి ధారావాహికగా రాయటమలవాటై, కాశీఖండం, భీమఖండం ,శివానందలహరి శివమహిమ్న స్తోత్రం ,రుభు గీత మొదలైనవి రాసి మీకు అందజేశా. ఈ కార్తీకం లో  డా శ్రీ కొరిడెవిశ్వనాథ శర్మగారు ,డా  వెల్మకంటి హనుమాన్ శర్మగారు కలిసి ఆంద్రీకరించిన  శ్రీ బ్రహ్మ పురాణా౦తర్గత ‘’గౌతమీ మహాత్య్మం ‘’ను  ధారావాహికగా అందజేసే ప్రయత్నం చేస్తూ ,ఆ ద్వయానికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ ,ఈ అమూల్య గ్రంథాన్ని నాకు కానుకగా అందజేసిన  శ్రీ విశ్వనాథ శర్మగారికి నమస్సు లందజేస్తున్నాను  –దుర్గాప్రసాద్

     ప్రథమ అధ్యాయం

ఒకప్పుడు బ్రహ్మదేవుని నారద మహర్షి తీర్ద భేదాలగురించి   అడిగితే బ్రహ్మ ‘’అన్ని క్షేత్రాలలో ,తీర్ధాలలో జప తప  వ్రత దాన హోమాదులు చేస్తే వచ్చే ఫలితం పురుషోత్తమ క్షేత్రం లో చేసే దానికి సాటి రావు .’’పురుష ‘’అనే క్షేత్రం చాలా గొప్పది . సముద్ర జలాలతో శోభించే ఆ క్షేత్రాన్ని ఒక సారి సందర్శిస్తే పునర్జన్మ ఉండదు .అక్కడ ఒక ఏడాది ఉండాలి .కనీసం నెల అన్నా ఉండాలి .అలాంటి వాడు యోగేశ్వరుడైన హరి ఉండే పరమస్థానం పొందుతాడు .ఇదివరకే చాలా తీర్దాలు క్షేత్రాలగురించి వివరంగా తెలిపాను .పురుషోత్తమ పురాణం సంసార బంధాలను తెగగోడుతుంది’’అన్నాడు మునులకు సంతృప్తికలగక  అన్నిటిలో సర్వ శ్రేష్ట తీర్ధాన్ని గురించి వివరించమని కోరారు .అప్పుడు బ్రహ్మ ‘’ఈ విషయాన్నీ పూర్వం నారడుడుఅడిగితే చెప్పాను .ఎలాగంటే –అనగా నారదుడు ‘’తండ్రీ !నీ నుండి అన్నీ పొందాను .ఎన్ని తీర్దాలున్నాయి వాటి విశేషాలు ఇప్పుడు చెప్పు .’’అని అడిగాడు .బ్రహ్మ ‘’స్వర్గ ,మర్త్య ,రసాతలలో ఉండే తీర్దాలు దైవములు ,ఆసురాలు ,ఆర్షాలు ,మానుషాలు అని నాలుగు రకాలు .మానుష తీర్ధం కంటే ఆర్ష తీర్ధం, దానికంటే ఆసురం , దీనికంటే దైవ తీర్ధం పుణ్య ప్రదాలు .జనుల కోర్కెలు తీర్చేవి .బ్రహ్మ విష్ణు శివులచే నిర్మించబడినవి దైవతీర్ధాలు ముల్లోకాలలో తీర్ధం పవిత్రమైనది అనే చెప్పబడింది .కాని జంబూ ద్వీపం లోని తీర్దాలు ఎక్కువ ఫలితాలిస్తాయి. అందులోనూ భారత వర్షం లోని తీర్దాలు ముల్లోకాలలో ప్రసిద్ధం- కారణం భారత దేశం కర్మభూమి కనుక .హిమాలయ –వింధ్య పర్వతాలమధ్య ఉన్న ఆరు నదులు దేవ సంభవాలు .వింధ్య –దక్షిణ సముద్రం మధ్య ఉన్న ఆరునదులు కూడా దేవ సంభావాలే .అంటే ఈ 12నదులు ప్రాధాన్యం పొంది ,భారతవర్షం కర్మభూమిగా సుప్రసిద్ధమైంది ..ఆర్ష తీర్దాలు ,కొన్ని దైవజ తీర్దాలు రాక్షసులచేత ఆక్రమి౦చ బడ్డాయి .వీటినే ఆసుర తీర్దాలంటారు .దేవ భూములలో మహర్షుల తపో మహిమచేత నిర్మించబడినవి ఆర్ష తీర్దాలు .మానవులు ముక్తి ,పూజ ,ఐశ్వర్యం అభీష్ట సిద్ధికోసం ఏర్పాటు చేసుకొన్నవి మానుష తీర్దాలు .ఇలా తీర్దాలు నాలుగు రకాలు .ఈ తీర్దాల పూర్తి వివరాలు తెలియజేయమని నారదుడు పితామహుని కోరాడు .అప్పుడు బ్రహ్మ దేవుడు ‘’వింధ్య పర్వత దక్షిణ దిక్కు లో గోదావరి భాగీరధి ,భీమరదీ ,తుంగభద్రా  వేణికా ,తాపీ ,పయోష్ణీ నదులున్నాయి .హిమవత్పర్వతం నుంచి భాగీరధీ ,నర్మదా ,యమునా ,సరస్వతీ ,విశోకా,వితస్తా నదులు పుట్టాయి .వీటివలన ఏర్పడినవే దేవ తీర్దాలు .

  గయుడు ,కొల్లాసురుడు ,వృత్రుడు,త్రిపురాసురుడు ,అన్ధకుడు ,హయగ్రీవుడు ,లవణాసురుడు ,నముచి ,శృంగాకుడు ,యముడు ,పాతాలకేతువు ,మయుడు ,పుష్కరుడు అనే అసురులచేత ఆక్రమి౦ప బడినవి ఆసుర తీర్దాలు .ఇవీ శుభప్రదాలే .ప్రభాస ,భార్గవ ఆగస్తి  ,నర,నారాయణ ,వసిష్ట ,భరద్వాజ ,గౌతమ ,కశ్యప మను మొదలైన మునులచే సేవి౦పబడినవి రుషి తీర్దాలు . ,అంబరీష , ,హరిశ్చంద్ర ,మా౦ధాతృ,మనువు ,కురు ,కనఖల ,భద్రాశ్వ ,సాగర ,అశ్వ యూప ,నాచికేత ,వృషాకపి ,అరిందమ మొదలైన మానవులచే కీర్తి ఐశ్వర్య లబ్ధికి నిర్మింపబడిన శుభ ప్రదమైనవి  మానవ తీర్దాలు .స్వతస్సిద్ధంగా ఏర్పడిన పుణ్య తీర్దాలనే దైవ తీర్దాలంటారు .

  రెండవ అధ్యాయం –గంగోత్పత్తి

నారద మహర్షి ‘’త్రిమూర్తుల చే నిర్మింపబడినది తీర్ధ రాజ౦  అని చెప్పారు కదా దాని స్వరూప  భేదాలను వివరించండి ‘’అని బ్రహ్మను కోరగా ఆయన ‘’దైవ తీర్థాలను దర్శించనంతవరకు మిగిలినవి గొప్పవి .అన్ని నదుల్లో గంగానది  శ్రేష్టమైనది . కోరికలు తీర్చేది .దీన్ని’’ త్రి దైవత్యం ‘’అంటారు .దీని పుట్టుక గురించి చెబుతా .10వేల సంవత్సరాలకు పూర్వం తారకాసురుడు నేనిచ్చిన వర గర్వంతో దేవతల సంపద లాక్కొనగా దేవతలు విష్ణు మూర్తి ని దర్శించి స్తోత్రం చేసి ,శరణం లేని తమను ఎందుకు ఉపేక్షించావని  తారకాసుర వధతక్షణ కర్తవ్యమని   వాపోయారు .దానికి  ఆయన వివరంగా చెప్పమని అడిగితె వాళ్ళు ‘’వాడు యుద్ధం, తపస్సు శాపాలతో చచ్చేవాడు కాదు .పది రోజులపిల్లవాడి వలననే వాడి మరణం .దీనికి ఉపాయం ఆలోచించు ‘’అన్నారు .దానికి విష్ణువు ‘’నేను దేవతలు వాడిని చంపలేము ఈశ్వరుని వలన సాధ్యం కావచ్చు .ఆయనకు బలశాలి కుమారుడుగా పుడితే తారక వధ సుసాధ్యం  అందరం కలిసి వెళ్లి శివుడి వివాహ ప్రయత్నం చేద్దాం ‘’అని చెప్పి  వాళ్ళతో తోకలిసి హిమవంతుని భార్య మేనకాదేవిని దర్శించి ఆమెను స్తుతించి ‘’జగన్మాత దేవతలకార్యం తీర్చటానికి మీ గర్బం లో ప్రవేశించింది .ఆమె జన్మించి జగన్మాత అయి శివుని అర్ధాంగి అవుతుంది ‘’అన్నారు హిమవంతుడుకూడా సరే అన్నాడు .జగద్ధాత్రి గౌరీ గా మేనకా హిమవంతులకు జన్మించింది .శివునిపైనే ఆమె మనసు లగ్నమైంది .దేవతలు ఆమెను శివుని అనుగ్రహం కోసం తపస్సు చేయమని ప్రార్ధించారు .అలాగే హిమాలయం పై ఘోర తపస్సు చేసింది .

 దేవతలకు మహర్షులకు శివుడికి గౌరిమీద ప్రేమ ఉందా  అనుమానం వస్తే బృహస్పతి ‘’మన్మధుడి పరాక్రమం ముందు ఎవరూ ఆగలేరు .కనుక అతడిని ఒప్పించి , శివునిమనసులో మన్మధ తాపం కలగ జేయమని కోరండి ‘’అనగా మదనుని ప్రేరేపించగా అతడు భార్య రతీ దేవితో వచ్చి ముందు సందేహించినా దేవకార్యం కదా అని సిద్ధమై శివునిపై పుష్పబాణ౦  వేయటం ఆయన కంటిమంటకు భస్మమై పోవటం క్షణాలలో  జరిగిపోయాయి .దేవతలు శివుడిని ప్రార్ధించి’’ తారకాసుర సంహారానికి మేము చేసిన ప్రయత్నం ఇది నువ్వు హిమవత్పుత్రికను వివాహమాడాలి .మీకు జన్మించిన కుమారుడు తారక సంహారం చేయగలడు’’అనగా శివుడుకూడా  అంగీకకరించగా అరుంధతీ వసిస్టమహర్షి లను ,బ్రహ్మ విష్ణువు లను ఒప్పించి హిమవంతునికి నచ్చ చెప్పి శివ పార్వతుల కల్యాణం దగ్గరుండి జరిపించారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-11-18-ఉయ్యూరు   

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కార్తీకమాస శుభాకాంక్షలు

ఈ రోజు 8-11-18 గురువారం నుండి ప్రారంభమయి పవిత్ర కార్తీకమాస శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మనుచరిత్ర -4

ధ్వని కోణం లో మనుచరిత్ర –4

స్వరోచి దక్షిణ నాయకత్వం పలు పోకడలు పోయింది .ఆడ లేడి రూపం లో వనదేవత ఆలింగన సౌఖ్యం పొంది ,ఆపని కాగానే స్త్రీగామారి ‘’రాజా !నేను వనదేవతను. సమస్త భూత వన రక్షణాదక్షుడవైన మనువును నీ వలన పొందాలనే కోరికతో నిన్ను చేరాను .నా అనురాగంతో కుమారుని పొంది ,పుణ్యలోక ప్రాప్తి పొందు .’’అని అభ్యర్ధించింది .వెంటనే ఒప్పుకోవటం ఆమె వలన స్వారోచి ని కొడుకుగా పొందటం జరిగిపోయాయి .స్వారోచిషుడు శమదమాలతోతపస్సు చేసి ,భగవదనుగ్రహం తో మనువు అయ్యాడు .ఈయన పాలనలో ప్రజలు సుఖించారు అనే విషయంతో మనుచరిత్ర కావ్యం ముగుస్తుంది .స్వారోచిష మను సంభవం అనే ఈ కథాంశం మొత్తం ప్రభంథానికే కథామూలమై ,శృంగార రస ప్రధానమై సఫలమైంది అంటారు రాజన్న  శాస్త్రిగారు .భోగ లాలసుడైనా, స్వరోచి అనురాగానికి అధర్మం జరగనందున శృంగారం ధర్మమే అయి౦ద౦టారు శాస్త్రిగారు .దక్షిణ నాయకత్వం సర్వ సంప్రతి పన్నం అని రసార్ణవం చెప్పింది కనుక రసాభాసం కాదు .లోక వ్యవహారం,శాస్త్ర మర్యాద అతిక్రమించినప్పుడే అనౌచిత్యమౌతుంది .నిజానికి స్త్రీకి బహుపురుషాసక్తి రసాభాసమే కాని ద్రౌపదీ దేవి కి పంచ భర్తలు ధర్మమే అన్నారు వ్యాసాది మహర్షులు   .స్వరోచి వేటలో, రాక్షస రూప  ఇందీవరాక్షుని తో యుద్ధం లో వీరరసం ,రాక్షసబారి పడిన మనోరమ ‘’హా వనిత, ననాథ,,నబల ,నార్త విపన్నం గావరే ‘’అని విలపించినప్పుడు భయానక ,కరుణ రసాలు ,రాక్షసుడు గంధర్వుడు గా మారినప్పుడు ,హరిణి  వనదేవతగా మారినప్పుడు అద్భుత రసం ,ఇందీవరాక్షునితో యుద్ధం లో రౌద్ర రసం ,రాక్షస  రూప వర్ణ నలో భయానక రసం,స్వారోచిషుని యందు శాంతరసం పోషి౦పబడ్డాయి  .

స్వరోచి కథలో  మనోరమాదుల శాపం ,ఇందీవరుని శాపం ,కళావతి  వృత్తాంతం అనే మూడు ఉపకథలున్నాయి .మనోరమను శపించి ,నాగబెత్తం తో కొట్టే ప్పుడు ,వంచనతో విద్యపొంది ‘’గుండ్రా డాచిన పెండ్లి ఏమిటికి జిక్కుం గష్టముస్టింపచా ‘’అని నవ్వే ఇందీవరుని శపించే బ్రహ్మ మిత్రునిలో రౌద్రరసం ,దేవాసి అనే గంధర్వుని దేహ వర్ణనలో ,వాడు పారర్షి ని చంపేటప్పుడు  భీభత్స రసం ,పుంజికస్థల అనే అప్సరస పారర్షి తపో భంగం చేసేటప్పుడు శృంగారరసం ,పోషింప బడ్డాయి.కాని  ఈ శృంగారం  తలిదండ్రుల దగ్గర  కళావతి వర్ణించి చెప్పటం ఔచిత్య భంగమై రసాభాసమయ్యిందని ,’’జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ‘’అని పించుకున్న ఆది దంపతుల శృంగారాన్ని వర్ణించటం కాళిదాస మహాకవికి ఒక్కడికే చెల్లిందని రాజన్నశాస్త్రి గారు వాక్రుచ్చారు .దీనికి ‘’కావ్యాను శాసనం కు వృత్తి లో చెప్పబడిన శ్లోకాన్ని ఉదాహరించారుకూడా –

‘’కింతు రతిః  సంభోగ శృంగార రూపా ,ఉత్తమ దేవతా విషయా న వర్ణనీయా –తద్వర్ణనం హి పిత్రోః సంభోగ వర్ణనమివాత్యంత మనుచితం .యత్తు కుమార సంభవే హర గౌరీ సంభోగ వర్ణనం తత్కవి శక్తి తిరస్కృత తత్వాత్ భూమ్నా న దోషత్వేన ప్రతిభాసతే ‘’.

  ఏతావాతా మనుచరిత్ర ప్రబంధం లో వరూధినీ ,స్వరోచి ల వృత్తా౦తాలే ప్రధాన ఇతి వృత్తం .స్వారోచిష మను సంభవమే కథా ఫలం .శృంగారమే ప్రధాన రసం అని తేల్చిమళ్ళీ  మళ్ళీ చెప్పారు డా .రాజన్న శాస్త్రిగారు .

  సశేషం

  దీపావళి శుభాకాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-18-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  ధ్వని కోణం లో మనుచరిత్ర -3

  ధ్వని కోణం లో మనుచరిత్ర -3

వరూదినికి ప్రవర సమాగమే లేకపోతే కరుణ రసమే ప్రాధాన్యం పొందేది .ఆమె ప్రత్యాశను ‘’ధరణీసురవరుడరగిన చొప్పరయుట లోనూ’’,చెలులపలుకులతోను ,తొనణికిసలాడేట్లుపెద్దన చేశాడు .గంధర్వకుమారుడికి వరూధిని యెడల రతి ఉండటం ,ప్రవరుడు వరూధినీ మనోగతమైన రతి భావాన్ని తిరస్కరించటం నిజాలే అయినా ,గంధర్వుడు ప్రవర రూపం లో వరూధినికి ప్రేమపాత్రుడు అయ్యాడే కాని ,తనంత తాను కాకపోవటమూ గమనించాల్సిన విషయమే .నటుడు పాత్రను పోషించేటప్పుడు కనబరచే అనుభావాదులు అన్నీతనకు కాక , ఆ పాత్రకే చెందినట్లుగా ,గంధర్వుని అనుభావాదులన్నీప్రవరుడికి చెందినట్లే భావిస్తారు భావుకులు .,వరూధిని దృష్టిలో వాడు ప్రవరుడే అవట౦ వలన ,భావుకుల దృష్టిలోనూ ప్రవర పాత్ర ధారియే అవటం వలన ,వరూధినీ ప్రవర రతి’’  శృంగారమే ‘’అవుతు౦దికాని వేరేదీకాదంటారు రాజన్న శాస్త్రి గారు .

  ఈ శృంగారరసం ,వరూధిని ప్రవరుని యెడ స్వాభిలష ప్రకటన సమయం లో ‘’అభిలాష హేతుక విప్రలంభ ‘’రూపం లోను ,ప్రవరుడు తిరస్కరించగా ,’’తదీయ విరహ దోదూయ మానస యై ‘’తనను తాను నిందించు కొనే సందర్భం లో ,ఉద్దీపకాలైన చంద్ర ,మలయ పవనాదులను ఉపాలంభించే సమయం లో , ‘’ఏకతరానను రాగ జన్య విరహ హేతుక విప్రలంభ రూపం లో ,శా౦బరీ మహిమచేవచ్చిన ప్రవరుని రూపు రేఖా విలాసంతో పాటు అతని దేహ సమిద్ధ శిఖి దీప్తి ని సంగ్రహించి ప్రవర రూపం లో ఉన్న గ౦ధర్వ కుమారుని  కలయిక సందర్భం లో సంభోగ శృంగారంగా పోషించబడింది .

 ఉపక్రమణికలో ప్రవరునిలో సద్ధర్మాచరణ ఉత్సాహ స్థాయి అయిన ధర్మవీరం ,హిమాలయాన్ని సందర్శించి, దాని వైభవాన్ని’’తలమే బ్రహ్మకు నైన నీ నగమహత్వంబెన్న ‘’అని చెప్పినపుడు అద్భుత రసం ,వరూదినితో ‘’బ్రాహ్మణుడు ఇంద్రియ గతి చరించిన  ,బ్రహ్మానందాది రాజ్యపదవికి దూరమగును ‘’అని చెప్పేటప్పుడు శాంతరసం ,తన ఊరు  వెళ్ళాలన్న కోరిక ఉన్నా పసరు కరిగి పోవటంతో అడుగు ముందుకు వేయలేక వగచినపుడు కరుణ రసం ,,సిద్ధుని పలుకులతో ,గంధర్వుడు ప్రవరుడు ఐన సందర్భం లో అద్భుత రసమూ పోషించబడ్డాయన్నారు శాస్త్రి గారు .

  దీని తర్వాతది వరూధిని కొడుకు స్వరోచి కథ .ఇతడు ఆర్తత్రాణ పరాయణుడు ,భూత దయాపరుడైన ఉదాత్త గుణాలున్న వీరుడు . వేట కండూతి మెండు .. దుష్టమృగాల బారి నుండి కాపాడమని ప్రజలుకోరగా చేసే వేటకాదుఇది . వేట సప్తవ్యసనాలలో ఒకటి .చతుఃషష్టి కళలలో ఒకటి కూడా .కనుక యితడు దీనివలన కళాప్రియుడయ్యాడు.దీనికి తోడు తల్లి నుంచి సంక్రమించిన భోగలాలసత ఉండనే ఉంది.దీనితో భోగపరాయణుడనిపించాడు..అతని బహుభార్యా తత్వాన్ని హంసీ ,హరిణి తీవ్రంగా విమర్శించాయి .అయినా లెక్కచేయకుండా చాలాకాలం భోగలాలసత తోనే జీవించాడు .అయినా కూడా ‘’ముగ్గురుభార్యలముద్దుల మొగుడు’’ కనుక అది ధర్మ విరుద్ధం కాదంటారు శాస్త్రి గారు .మృగయా వినోది ,నిశ్చిం  తనుడు  ,భోగ పరాయణుడు అయిన స్వరోచి శృంగార ప్రధానుడు కనుక ‘’ధీర లలితుడు ‘’అని తీర్పు చెప్పారు అలంకార శాస్త్రాన్ని పుక్కిటపట్టిన రాజన్న శాస్త్రి గారు .అంతేకాదు మనోరమ మొదలైన ముగ్గురు భార్యలయడ సమాన అనురాగం తో ఉన్నాడు కనుక స్వరోచి ‘’దక్షిణ నాయకుడు ‘’కూడా అన్నారు .

నరక చతుర్దశి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-11-18-ఉయ్యూరు    

 

 

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కవనశర్మ

కవనశర్మ

వికీపీడియా నుండి

Jump to navigationJump to search

కవనశర్మగా ప్రసిద్ధి చెందిన కందుల వరాహ నరసింహ శర్మ (జ. సెప్టెంబర్ 231939) స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి చాల దేశాల్లో ఉపన్యాసకులుగా తిరిగేరు. బెంగుళూరువిశాఖపట్నంల మధ్య తిరుగుతూ ఉంటారు. తెలుగులో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. రచన (మాస పత్రిక)కి సలహాదారులలో ఒకరు.

ఈయన రచనలలో కవనశర్మ కథలుసైన్సు నడచిన బాటవ్యంగ్య కవనాలు మరియు పరిధి ఉత్కృష్టమైనవి. వ్యంగ కవనాలు పేరులోనే తెలిపినట్లుగా వ్యంగ్య భరితమైన కథలు. పరిధి ఉమ్మడి కుటుంబము యొక్క పరిమితులను, కష్టనష్టాలను, మంచి చెడ్డలను పరిశీలిస్తుంది.[1]

కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ 2018 అక్టోబరు 25న మరణించాడు.

రచనలు

  1. సైన్సు నడచిన బాట
  2. సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి (అనువాదం)
  3. వ్యంగ్య కవనాలు
  4. కవనశర్మ కథలు
  5. పరిధి
  6. బంగారు రోజులు
  7. ఇరాక్ డైరీ
  8. కోతిరాతలు

కవన శర్మగారితో నా పరిచయం శ్రీ మైనేని గోపాక్రిష్ణ గారి వితరణత్వం వలన కలిగింది మచిలీ పట్నం లో కృష్ణా విశ్వ విద్యాలయం ఏర్పడ్డప్పుడు అక్కడ తెలుగు శాఖకోసం కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు కార్య దర్శి డా జివి పూర్ణ చ౦ద్గార్లు శ్రీ బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యం లో గొప్ప కృషి చేశారు 2008డిసెంబర్ లో ఉయ్యూరువాసి .,అప్పుడు  అమెరికాలో ఉంటున్న ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక శాస్త్ర వేత్త డా శ్రీ ఆరిగపూడి ప్రేంచంద్ గారిని ఉయ్యూరు ఆహ్వానించి వారికి ఘన సన్మానం చేయించే బాధ్యత నాపై పెట్టారు శ్రీ మైనేని గోపాలకృష్ణగారు . ఆయన కోరిన విధంగా నభూతోగా కార్యక్రమం జరిపాం . దానికి ఖర్చులకోసం ఇబ్బడి ముబ్బడిగా నాకు డబ్బుపంపారు మైనేనిగారు  సభ జరుగుతుండగానే వారికి ఫోన్ చేసి 20వేల రూపాయలు ఆయన పంపిన దానిలో మిగుల్తున్నాయని ,కొత్తగా ఏర్పడిన కృష్ణా యూని వర్సిటికి,దానిని ఆయన పేరిట విరాళంగా అంద జేస్తే బాగుంటుందని చిన్న సూచన చేశా. క్షణం ఆలోచించకుండా  ”మంచి ఆలోచన వేదికపై ప్రకటించండి” అనటం, నేను ప్రకటి౦చేయటం జరిగి పోయింది.  వేదికపై గుత్తికొండ .,పూర్ణ చ౦ద్   విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గార్లు కూడా ఉన్నారు
  ఈ డబ్బును 2009ఫిబ్రవరి 10న బందరు బందరు కృష్ణా  యూని వర్సిటీ లో జరిగిన ఒక కార్యక్రమం లో నేను గుత్తికొండ వారి ఆలోచన మేరకు వైస్ చాన్సలర్ శ్రీ మైనేని కేశవ దుర్గా ప్రసాద్ ,గారికి వేదికపై ఉన్న బుద్ధ ప్రసాద్ గారి సమక్షం లో డ్రాఫ్ట్ రూపం లో అందజేశాను
 ఆ రోజు భోజన విరామ సమయం లో మాతోపాటు భోజనం చేస్తున్న కవన శర్మ గారు పరిచయమయ్యారు  భేషజం లేకుండా చాలా సరదాగా మాట్లాడారు నాతో . ఆయన రచనలు అప్పటికే చాలా చదివి ఆయనపై మంచి అభిప్రాయంఏర్పరచుకొన్నాను . అక్కడికి ఆ కధ. సమాప్తం .
  కొన్నేళ్ళతర్వాత అంటే సుమారు రెండేళ్ళ క్రితం మైనేనిగారు ”రచన ”మాసపత్రికకు నా పేర రెండేళ్ళచందా కట్టి నాకు తెలియజేశారు . పత్రిక ప్రతినెలా వస్తూనే ఉంది.  అందులో కవన శర్మగారి జ్ఞాపక శకలాలు నన్ను బాగా ఆకర్షించాయి  వాటిలో  ముఖ్యంగా కేరెక్టర్ యాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు .. డైరెక్టర్ కేవిరావు ,అలాగే రాజమండ్రి విశాఖ లోని కొందరు సాహితీ పరులపై రాసినవి బాగా నచ్చి ఆయన మెయిల్ అడ్రస్ కు ,రచన సంపాదకుడు సాయిగారికి మెయిల్స్ రాశాను. శర్మగారు ఎప్పటికప్పుడు వెంటనే జవాబు రాస్తూ తమ సౌజన్యాన్ని చూపారు.  కొన్ని మెయిల్స్ రచనలో లో కూడా ప్రచురితమయ్యాయి  ఇలా మళ్ళీ కవన శర్మ గారితో కలం స్నేహం చేసే అదృష్టం కూడా మైనేనిగారి వల్లనే నాకు దక్కింది .
  కారామాస్టారు శ్రీకాకుళం లో ఏర్పరచిన ”కధానిలయం ”కు శర్మగారు  సలహాదారు కూడా .మాస్టారి పై గొప్ప గౌరవమున్నవారుశర్మగారు. ఈ కధానిలయం కు సరసభారతి ద్వారా 15వేలరూపాయలు విరాళం పంపించిన ఉదార హృదయం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారిది అని ఈ సందర్భంగా తెలియ జేస్తున్నాను ..
  కవన శర్మ అనే శ్రీ కందుల వరాహ నరసింహ శర్మ గారి నిర్యాణం సాహితీ లోకానికి ,ముఖ్యంగా ఆలోచనా పరులైన వారికి అందరికీ తీరని లోటు . వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ఊరట కలగాలని .,కోరుతున్నాను -దుర్గాప్రసాద్
image.png
Posted in సమీక్ష | Tagged | Leave a comment

దీపావళి శుభాకాంక్షలతో

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మనుచరిత్ర -2

ధ్వని కోణం లో మనుచరిత్ర -2

స్వారోచి నాయనమ్మ వృత్తాంతం మనుచరిత్ర మొదటి మూడు ఆశ్వాసాలలోను ,మిగిలినవాటిలో తండ్రి స్వరోచి వృత్తాంతం  వర్ణించాడు పెద్దనామాత్యుడు .మనోరమ మొదలైన వృత్తాంతాలు స్వరోచి కి సంబంధించినవి .వనదేవతా గర్భం లో స్వారోచి జన్మించటం ,మనుత్వం పొందటం తో ఈ ప్రబంధం పూర్తవుతుంది .తల్లీ తండ్రీ అయిన వనదేవత ,స్వరోచుల వలన దైవత్వం ,ప్రజాపాలన ,క్షాత్రధర్మాలు ,తాత అని పించుకొనే ప్రవరాఖ్యునిలోని ధర్మ మార్గం శమదమాది సద్గుణాలు సంక్రమించి స్వారోచి మనువు అయ్యే అర్హత పూర్తిగా పొందాడు .ధర్మమార్గాన ప్రజాపాలన చేసి ప్రజలకు సుఖ శాంతులు చేకూర్చాడు .కనుక ప్రబంధానికి ముఖ్యంగా ఉండాల్సిన ఏక వాక్యత అనే ధర్మం విచ్చిన్నం కాలేదు .ఈ చరిత్ర మార్క౦ డేయ పురాణం లోనిదే .కాని ఈ ప్రబంధం లో రసోచితమైన కథా సంవిధానం తో ,కొత్త తళుకులతో ఆంద్ర కవితా పితామహుడు పెద్దన లోకోత్తర సంవిధాన నైపుణ్యంతో ఈ ప్రబంధం తలమానికమైనది .

 ఒకసారి ప్రవరుని గుణగణ గానం చూద్దాం .శమదమాదులున్నవాడు,వేలిమి ,సురార్చన,విప్రులను  ,ఇంటికి ఆహ్వానించే ధర్మాలు పుష్కలంగా ఉన్నవాడు .ఊరు వదలి వెడితే  భంగం కలుగుతుందేమో నని ఇల్లు వదలని ఆహితాగ్ని .అతిదులెవరైనా వచ్చారని తెలిస్తే యెంత దూరమైనా వెళ్లి ,ఇంటికి ఆహ్వానించి ఇస్టాన్నం తో సంతృప్తి పరచే అభ్యాగత సేవా తత్పరుడు .సద్బ్రాహ్మణుడు .ఇంద్రియాలకు వశమైతే బ్రహ్మాన౦దాని కి దూరమైపోతాడు అనే స్పృహ బాగా ఉన్నవాడు .తుచ్చమైన స్వర్గాది సుఖాలు మీసాలపై తేనెలు అని నమ్మినవాడు .ఇంద్రియ నిగ్రహం పుష్కలంగా ఉన్న జితేంద్రియుడు .అంతే స్ప్రుహణీయ మూర్తి .అంద చందాల విషయం లో ‘’యక్ష తనయే౦దు ,జయ౦త ,వసంత ,క౦తులనే  గెలువజాలిన వాడు .వీతరాగుడే ,కాని ధర్మ పత్ని యందు మాత్రమె అనురక్తి కలవాడు .ఇన్ని సద్గుణాలప్రోవు ప్రవరుడు ధీర శాంతుడు .దానం ధర్మవీరం శాంతగుణం ఉన్నవారినే ధీర శాంతుడు అంటారు .

  శాంతానికి శృంగారానికి పొసగనే పొసగదు..ఇవి పరస్పర విరుద్ధాలు .కాని ఒకే నాయకుడికి ఈ రెండు ఉండటం లో అనౌచిత్యం లేదు ,శాంతరసాశ్రయుడు ఒక్కోసారి శృంగార రసాశ్రయుడు కావచ్చు ,కాని ఈ రెండురసాలకు మధ్య కొంత వ్యవధి మాత్రం ఉండాలి ,అప్పుడు విరోధం ఉండదు అన్నారు డా రాజన్న శాస్త్రి గారు .ఉదాహరణగా జీమూతవాహనుడు శాంత రాసాశ్రయమూర్తి ,కాని మలయవతి అనురాగం తో శృంగార రసాశ్రయుడయ్యాడు  .ఈ రెంటికి మధ్య అద్భుత రసాన్ని ప్రవేశ పెట్టి శాంత ,శృంగారాలకున్న వైరుధ్యాన్ని పరిహరించాడు కవి .కానీ , ఇక్కడ ప్రవరుడు శృంగార రసాశ్రయుడు అవటానికి వీలు లేదు. కారణం అతడు ఏకపత్నీ వ్రతుడు అవ్వటమే .దీనిపై చాలా స్ట్రెస్ చేసి పెద్దన ఒక పద్యం లో చక్కగా చెప్పాడు

‘’వాని చక్కదనము వైరాగ్యమున జేసి –కాంక్ష సేయు జార (వార )కామినులకు

భోగ బాహ్యమయ్యె , బూచిన సంపెగ –పొలుపు మధుకరా౦గనలకు  బోలె’’’

అంటే అతని చక్కదనం వరకా౦తలకు కాదు కేవలం అర్దా౦గికే స్వంతం అని వ్యంగ్యంగా చెప్పాడు .దీనితో ప్రవరుని ఏకపత్నీ వ్రతనిష్ట తెలుస్తోంది .కనుక ఇతని శాంతానికి శృంగారం పొసగదు కనుక వేరొకఉపాది భేదం  అవసరమై ,మాయా ప్రవరునితో ఆ లోటు తీర్చాడు కవి .దీన్ని రసగంగాధరకర్త జగన్నాధ పండితరాయలు ఒక శ్లోకం లో చెప్పాడు –

‘’సురా౦గనాభి రాక్లిస్టాః వ్యోమ్ని వీరా,విమానగాః-విలోకంతే నిజాన్ దేహాన్ ఫేరు నారీ భిరావృ  తాన్ – అంటే స్వర్గం లో శృంగార భీభత్సాలమధ్య స్వర్గ లాభం అయిన వీర రసం కలిసి ఉంది .అంటే వీరు చనిపోయి స్వర్గం చేరి అక్కడ సురా౦గనలతో శృంగారం చేస్తూ ,తమ మృత శరీరాలను చూస్తున్నారు .అంటే చచ్చాక ఉపాధి భేదం కలిగి శృంగారానికి ఇబ్బంది రాలేదు .

  మనుచరిత్రలో  వరూధిని పూత పసిడి వంటి వలపులతో గంధర్వకులంలో పుట్టినా  ఆజాతి స్వభావానికి విరుద్ధంగా ,బ్రాహ్మణుడైన ప్రవరుడినే వరించింది .ఆతడు అంగీకరించని తనమనసు శరీరం నిష్ప్రయోజనం అని స్పష్టంగా చెప్పింది .కనుక ఈమె’’ ఏకాయత్త’’.అనన్య కాంత ఐన ఈ వరూధిని అనురాగం ఫలించాలి అంటే నాయకుడికి ఉపాధి భేదం ఉండటమే పరిష్కారమార్గం .కేవలం రసాంతర సమావేశం లో విరోధాన్ని పరిహారం చేయాలని ప్రయత్నిస్తే అది ప్రవరుని శీలానికి మచ్చ అవుతుంది ,అనౌచిత్యమౌతుంది అంటారు శాస్త్రిగారు .ఆ అనౌచిత్యాన్ని ,రస విరోధాన్ని పెద్దనకవి ఎలా పరిష్కరించాడో చూద్దాం –

‘’అర్ధచంద్రుని తేట నవఘళించు లలాట –పట్టి దీర్చిన గంగామట్టి తోడ –జెక్కు టద్దముల౦దు ,జిగి వెల్లువలు జిందు ,రమణీయ మణికుండలములతోడ

బసిడి వ్రాత  చెరంగు,మిసిమి దోవ జెలంగు –నరుణా౦శు కోత్తరీయంబు తోడ –సరిలేని రాకట్టు ,జాలువా మొలకట్టు –బెడగారు  నీర్కావి పింజ తోడన్

ధవళ ధవళములగు జన్నిదములతోడ –గాశికాముద్ర యిడిన యుంగరము తోడ

శా౦తరసమొల్కు బ్రహ్మ తేజంబు తోడ –బ్రవరుడయ్యె వియచ్చర ప్రవరుడపుడు.’’

  ఒక్కసారిగా గ౦ధర్వ కుమారుడు అచ్చంగా ప్రవరుడు అవ్వటం అద్భుత రసా విష్కారమే .ఈవిధంగా శాంత ,శృంగారాల మధ్య అద్భుత రసం ప్రవేశపెట్టి రసభేదాన్ని, ఉపాధి భేదం చేత అనౌచిత్యాన్ని పోగొట్టి , ‘’టుబర్డ్స్ ఎట్ వన్ షాట్’’ గా పరిష్కరించాడు పెద్దనకవి .ఒరిజినల్ ప్రవరుడు వరూధిని ప్రణయాన్ని తిరస్కరించి ,తన గుణ సంపత్తిని పెంచుకొన్నాడు .ప్రవరుడు గంధర్వునిలో ప్రవేశించటం లో ప్రవరాఖ్యుని ప్రమేయం అస్సలు యేమీ  లేదు .గంధర్వుడికి ఉన్న’’ శా౦బరీ మహిమ’’ప్రవరుని రూపు రేఖా విలాసాలతోపాటు దేహ సమిద్ధ శిఖి దీప్తి కూడా అతనికి సంక్రమించింది .వరూధిని డూప్లికేట్ ప్రవరుడినే తనమనో నాయకుడిగా భావించి రతి సౌఖ్యం అనుభవించింది .ఆమె మనసంతా ప్రవరుడే ఉన్నాడుకనుక ఆభావంతోనే పొందుసుఖం పొందింది .అందుకనే ఈమె పౌత్రుడికి ప్రవరాఖ్యుని శమదమాది సద్గుణాలు సంక్రమించాయి. ఇదే భావనాబలానికున్నఅద్భుత శక్తి .కనుక ఈ గంధర్వుడు చీకటి తప్పు చేయటానికి మాత్రమే పనికొచ్చాడు , కాని వాడికి ప్రత్యేక అస్తిత్వం అంటూ ఏమీ లేదు .కనుకనే కవి’’ అతడి పేరు కూడా ‘’ఎక్కడా ప్రస్తావించలేదు .అతడొక భభ్రాజమానం ,భజగోవిందంమాత్రమే. పులిహోరలో కరేపాకు . మొత్తం మీద ఈమొదటి కథలో అంటే వరూధినీ వృత్తాంతం లో ప్రవరాఖ్యుడే కథానాయకుడు .ప్రధానరసం శృంగారమే అని తేల్చి చెప్పారు డా .కొరిడె రాజన్న శాస్త్రి గారు .

దీపావళి శుభాకాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-18-ఉయ్యూరు      

image.png

 

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మనుచరిత్ర

ధ్వని కోణం లో మనుచరిత్ర

సంస్కృత సాహిత్య రత్న డా.కొరిడె రాజన్న శాస్త్రి గారు తమ పరిశోధన గ్రంథం గా ‘’ధ్వని –మనుచరిత్ర ‘’రచించి ఉస్మానియా యూని వర్సిటీ నుండి పి.హెచ్ .డి.పొందిన సాహితీ మూర్తి .ఈ గ్రంథం తొమ్మిది ప్రకరణాలుగా ఉంది .ప్రఖ్యాత ఆలంకారికుడు ఆనందవర్ధనుడు ప్రవచించిన ధ్వని సిద్ధాంతాన్ని మొదటి 7ప్రకరణాలలో విపులంగా చర్చించి ,8వ  ప్రకరణం లో మను చరిత్ర లోని ధ్వనిని కూలంకషంగా చర్చించి వివరించారు .ఈ ప్రకరణం లోని అతి ముఖ్య విషయాలను సరళంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను .

  ముందుగా సూక్ష్మం గా ధ్వని అంటే ఏమిటో తెలుసుకొందాం .అర్దా౦తరాన్ని తెలియ జేసే వ్య౦జనమే ధ్వని .అంటే ఒక శబ్దం వలన ,లేక అర్ధం వలన కలిగే వేరొక అర్ధాన్ని ధ్వని అని అన్నాడు ఆనందవర్ధనాచార్యుడు .అనగా ధ్వని అంటే వ్యంగ్యార్ధం .ధ్వని ఉన్నకావ్యమే ఉత్తమకావ్యం అని దాదాపు అందరూఅంగీకరించారు . ధ్వని శబ్దం లో, అర్ధం లో అనేక రకాలుగా ఉంటుంది .మనం ధ్వని కీకారణ్యం లోకి ప్రవేశించకుండా మనుచరిత్ర ప్రబంధం లో పెద్దనామాత్యుడు ప్రదర్శించిన ధ్వని విశేషాలనే తెలుసుకొందాం .

  మను చరిత్రకు ‘’స్వారోచిత మను సంభవము ‘’అనే పేరుంది .ఈ ప్రబంధ ఫలం స్వారోచిష మనువు జన్మించటమే.ఉత్తమ గుణ సంపన్నుడైన మనువు జన్మించటానికి పెద్దన  గారు  రెండు తరాల కథ రాశాడు .ఈ స్వారోచిషుడు శాంతి దా౦తి ,దయా సత్య శౌచ నిరతుడు ,అకాముడు ..కనుకనే మనువు అయ్యే అర్హత పొందాడు .కాని విచిత్రం ఏమిటంటే ఇలాంటి పుత్రుని కన్న తండ్రి స్వరోచి భోగలాలసుడు ,బహు స్త్రీ కాముకుడు .కనుక ఇతనిలో  శాంతి దయాదులు మృగ్యాలు .స్వరోచి తలిదండ్రులు వరూధిని అనే  దేవలోకకాంత  ,గ౦ధర్వ కుమారుడు .వీళ్ళిద్దరూ భోగ లాలసులే ,జితే౦ద్రియులు అసలేకారు .మరి ఇలాంటి వంశం లో జితే౦ద్రియుడైన స్వారోచిషుడు ఎలా జన్మించాడు ?ఈ సందేహం తీర్చటానికే ప్రవరాఖ్యుడు అవసరమయ్యాడు .ప్రవరుని గుణగణాలు వర్ణనాతీతాలు .జితే౦ద్రి యుడు ,నిత్యాగ్ని హోత్రి ఏకపత్నీ వ్రతుడు .ఇతడు ఒక సన్యాసి రాసిన పాద లేపన ప్రభావం వలన   హిమాలయం చేరి ,దారికానక వరూధిని కనిపిస్తే దారి అడిగి ,ఆమె వలపు రవ్వలు రువ్వితే లొంగక ,తన పావక ప్రభు ప్రసాదం వలన మళ్ళీ తన అరుణాస్పద పురం చేరాడు .ఇంతటితో ప్రవరుని కథ సమాప్తం .తర్వాత కథలో అతని ప్రమేయం ఏమీలేదు .కాని వరూధిని ప్రవరుడిని వదలలేదు అతని రూపును తనమనసు మందిరం లో స్థిరంగా ప్రతిష్టించు కొన్నది .అతనికోసమే పరితపించింది .ఇదే అదను అనుకొని  ,ఎప్పటినుంచో అమెను ప్రేమిస్తున్న  ఒక గంధర్వుడు ముమ్మూర్తులా’’ ప్రవర దేహ సమిద్ధిత శిఖి దీప్తితో ,ఆతని రూప లావణ్యాది గుణగణాలతో  శా౦భ రీ మహిమతో పొంది , వచ్చి ,ఆమెకు ప్రవరుడు అనే  భ్రమకలిగించి ,ఆతనితో పొందు సౌఖ్యం అనుభవించి ,వాడి వంచన తెలియక ,అదే వరప్రసాదమై ,ఆమె మనస్సులో ప్రవరునితో సుఖిస్తున్న భానతోనే ఉండిపోవటం తో ,ఆ భావనకు పటిష్టత కలిగి ,ఆభావనా బలం తో ప్రవరుని శమదమాది గుణాలు ఆయన పౌత్రుడైన స్వారోచిషునికి సంక్రమించాయి .భావనా బలమే కీటకాన్ని భ్రమరంగా మారుస్తుందని మనకు తెలుసు .జన్యు సిద్ధాంతం ప్రకారం కూడా సెకండ్ జనరేషన్ లో ఉత్తమ ఫలితం కలుగుతుంది .

  పై విషయాన్ని పెద్దనగారు ‘అనిమేషత్వము  మాన్చెబిత్తరచూప స్వేద తా వృత్తిమా –న్చె,నవ స్వేద సమృద్ధి ,బోదకళమాన్చెన్మోహ విభ్రాంతి ,తో

డనె,గీర్వాణ వదూటికిన్,భ్రమర కీటక న్యాయ మోప్పన్ ,మను –ష్యుని భావించుట మానుషత్వమె మెయిం జూపట్టెనా నత్తరిన్ ‘’

  ఈ విధంగా స్వారోచిషుడు శాంతి దాంతి మొదలైన గుణ గరిస్టుడవ్వటానికి ,వరూధిని మనసంతా నిండిఉన్న ప్రవరుడే కారణం .కనుక మనువుకు పితామహుడు ప్రవరాఖ్యుడే .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-11-18-ఉయ్యూరు

 


Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -61 ఉయ్యూరు బ్రాహ్మణ సంఘానికి వెన్నెముక శ్రీ మంత్రాల రాదా కృష్ణమూర్తి

ఊసుల్లో ఉయ్యూరు -61

ఉయ్యూరు బ్రాహ్మణ సంఘానికి వెన్నెముక శ్రీ మంత్రాల రాదా కృష్ణమూర్తి

27-10-18 శనివారం ఉయ్యూరులో సుమారు తొంభై ఏళ్ళ వయసులో మరణించిన శ్రీ మంత్రాల రాధాకృష్ణమూర్తి గారి తో నామొదటి  పరిచయం 1950-51లో .అప్పుడే మేము హిందూపురం నుంచి ఉయ్యూరు వచ్చేశాము .ఆయన ఉయ్యూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో గుమాస్తాగా పని చేస్తున్నట్లుజ్ఞాపకం .సన్నగా పొడవుగా పాంటు షర్ట్ తో ఉండేవారు .ఆయన స్థితిపరులు, ఎరువుల వ్యాపారి మానాన్నగారి శిష్యుడు అయిన  శ్రీ యడవల్లి శ్రీరామమూర్తి గారి పెద్దల్లుడు .శ్రీమతి మంగమ్మగారి భర్త . ఆకాలం లో రాదాకృష్ణమూర్తిగారిని మగవాళ్ళందరూ’’ యడవల్లి వారల్లుడు ‘’అనీ ,ఆడవాళ్ళంతా ‘’మంగమ్మగారి మొగుడు ‘’అనే పిలిచేవారు .ఆతర్వాత పాలిటెక్నిక్ కాలేజి  బెజవాడ తరలి వెళ్ళిపోవటం తో ,ఈయనకూడా అక్కడికే వెళ్లి పనిచేశారని జ్ఞాపకం .తర్వాత ఉద్యోగం మానేసి ,ఉయ్యూరులోనే ఉంటూ వ్యవసాయం చూసుకొనే వారు .విష్ణ్వాలయం వెనక బజారులో యడవల్లి వారి లోగిలి  ఉండేది .శ్రీరామమూర్తిగారి తమ్ముడు కూడా ఎరువులకోట్లో వ్యాపారం చూసేవారు .వాళ్ళ కొట్లోనే మా నాన్నగారికాలం లోనూ , ,నేను వ్యవసాయం చూసేమొదటి రోజుల్లోనూ  అరువు తీసుకొని ఎరువులు కొనేవాళ్ళం .ఆయనకు మొహమాటం అస్సలు  ఉండేదే కాదు . నిక్కచ్చిమనిషి .అక్కడే శ్రీ చిలుకూరి వెంకటేశ్వర్లుగారు గుమాస్తాగా పని చేస్తూ ,మా బజారులోనే అద్దెకుండేవారు .మా ఇంట్లో తద్దినాలకు భోక్తగా యడవల్లి వారి పర్మిషన్ తో వచ్చేవారు .వీరి కుటుంబం,  వీరబ్బాయిలు, అమ్మాయిల తో మాకు చాలా సాన్నిహిత్యం ఉండేది .

  నేను వ్యవసాయం చేసే రోజుల్లో గౌండ్ల కుర్రాడు ఎర్రగా ఉండే కృష్ణ అనేవాడు పాలేరు తనానికి వచ్చాడు .వాడు అప్పుడే మంత్రాలవారి చిన్నపాలేరుగా  మానేసి ,మాదగ్గర చేరాడు . . మా శ్రీ సువర్చలాంజ నేయస్వామి బజారులో అంటే రావి చెట్టు బజారు లో మంత్రాలవారు డాబా కట్టుకొని ,పశువుల శాలను ప్రక్కనే ఏర్పాటు చేసుకొని ఎడ్లు ,బండీ ,పెద్దపాలేరు ,చిన్నపాలేరు లను  మైంటైన్ చేసేవారు . ఆయన వ్యవసాయం గురించీ ,యాజమాన్యం గురించీ పాలేరు కృష్ణ కథలు గాథలుగా  నాకూ, మా అమ్మకు వర్ణించి చెప్పేవాడు . ఈయన పెద్దపాలేరు  నిఘామాను చాకలి అతను .చాలా శ్రద్ధగా వ్యవసాయం చేసేవాడు .ఇతని తమ్ముడు హైస్కూల్   లో నా క్లాస్ మేట్.అంతకు మించి మాద్దరికీ పెద్దగా పరిచయం లేదు .గురజాడ డొంకలో కాలవ చివరి భూములు మావి .మాకు కాలవ నీళ్ళు రావాలంటే మంత్రాల వారి తడుపు అయ్యాకే వాళ్ళు వదిల్తే మధ్యలో వాళ్ళ తడుపులు పూర్తయితేనేకాని మాచేలో నీళ్ళు అడుగు పెట్టేవికావు .మంగమ్మగారి చెల్లెళ్ళలో ఒకరిద్దరు హైస్కూల్ లో నాక్లాస్ మేట్లని ,అందులో ఒకమ్మాయి భర్త కాకినాడ పాలిటెక్నిక్ లో లెక్చరర్ అనీ తర్వాత ప్రిన్సిపాల్ అయ్యారని గుర్తు .ఒకావిడ ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో మా కోడలు శ్రీమతి సమత తోపాటు  టీచర్ గా పనిచేస్తోంది మంత్రాలవారబ్బాయిలు హైస్కూల్ లో నా స్టూడెంట్స్ .ఒకతను మా అబ్బాయికి మంచి దోస్తు .ఇద్దరూ క్రికెట్ ఆడేవారు ఇక్కడి కాలేజిలో . మంగమ్మగారు చాలా పెద్దమనిషి తరహా గా వ్యవహరిస్తారు .ఈ దంపతులు మా ఇంట్లో జరిగిన శుభాకార్యాలన్నిటికీ తప్పక వచ్చేవారు .

                       బ్రాహ్మణ సంఘం పునరుద్ధరణ

 ఉయ్యూరు లో బ్రాహ్మణ సంఘం నామ మాత్రంగా పని చేసేది .అప్పుడు నా సహాధ్యాయి మా గురువుగారు శ్రీ వేమూరి శివరామకృష్ణయ్యగారి కుమారుడు  దుర్గయ్యగారు అనే  శ్రీ వేమూరి దుర్గా ప్రసాద్ ధర్మపురి సంస్కృత కాలేజీ నుంచి మానేసి ఇక్కడికొచ్చి స్థిరపడి ,మొదట్లో కొంచెం ఇబ్బందులు పడినా కెసీపి వాళ్ళ స్కూల్ ఆర్. కే .ఎం .లో తెలుగు పండిట్ ఉద్యోగం సంపాదించి అక్కడే రిటైరయ్యాడు  అందరితో చాలా చనువుగా ఉండేవాడు .అప్పుడు మేమందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణసంఘాన్ని పునరుద్ధరించాలని సంకల్పించాం .అప్పటికి ప్రెసిడెంట్ కం సెక్రెటరి’’ టైప్ మాస్టారు ‘’గా అందరు పిలిచే  శ్రీ సీతం రాజు సత్యనారాయణ గారు .నేను మంత్రాల రాధాకృష్ణగారు, దుర్గయ్య ,గోవిందరాజు వెంకటేశ్వర్లుగారు ,కొలచల చలపతి,వేగరాజు బ్రదర్స్ ,కోట బ్రదర్స్ ,చావలి ఆంజనేయులుగారు  మొదలైనవారందరం కలిసి దుర్గయ్యగారిని బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షునిగా, నేను వైస్ ప్రెసిడెంట్ గా ,రాదాక్రిష్ణమూర్తిగారు  సెక్రెటరిగా  గోవిందరాజు వెంకటేశ్వరరావు గారు కోశాధికారిగా ,సత్యనారాయణగారు గౌరవాధ్యక్షులుగా ,మిగిలినవారిని సభ్యులుగా చేసి ఒక ఎడ్ హాక్ బాడీఏర్పాటు చేశాం .సంఘాన్ని రిజిస్టర్ చేయించే బాధ్యతదుర్గయ్య , మంత్రాల , గోవింద రాజు  గార్లు తీసుకొని అతి త్వరలోనే రిజిస్టర్ చేయించారు .మొదటిసారిగా ఉయ్యూరు లో వృద్దతరం వారిని సన్మానించా లనుకోని ప్రముఖ జ్యోతిష్ శాస్త్రవేత్త శ్రీ కోటశ్రీరామమూర్తిగారినీ ,శివాలయం అర్చకులు శ్రీ మామిళ్ళపల్లి పురుషోత్తం గారిని ఒక ఉగాది నాడు  సన్మానించాం.ఆతర్వాత సీతంరాజువారిని, రామాచార్యులు గారిని అలా సత్కరించాం .సామూహిక ఉపనయనాలు నిర్వహించాం .వివాహవేదిక కూడా జరిగింది .ప్రతి ఉగాది మధ్యాహ్నం శ్రీ విష్ణ్వాలయం లో బ్రాహ్మణ సంఘం సమావేశం జరిపి వేదపండితులను ,వేద విద్యార్ధులను ఆహ్వానించి సత్కరించి ,నగదు పారితోషికాలిచ్చాం ,కార్తీక వనసమారాధనలు నిర్వహించాం .చుట్టు ప్రక్కల మండలాలకూ విస్తరి౦పజేశాం .శివాలయం లో శ్రీ శంకర జయంతి జరిపాం .ఇలా దిన దిన ప్రవర్ధమానంగా సంఘం అభి వృద్ధి చెందింది .ఊళ్ళో కి వచ్చిన చదువుకున్న బ్రాహ్మణులకు ,పేద బ్రాహ్మణులకు ఆర్ధిక సాయం అందించాం .ప్రతినెలా తప్పకుండా కార్యవర్గ సమావేశం నిర్వహించాం .ఈకార్యక్రమాలకు రమణ పంతులు బాపిరాజు  యెన్డి.ఎస్.,,ప్రభాకర్ వగైరా  లంతా అత్యుత్సాహంగా సహకరించారు .వీరందరినీ సమీకరించి ,సమన్వయ పరచటం మంత్రాలవారు చేసేవారు .ఏపనికైనా కాలికి బలపం కట్టుకొని తిరిగే వారు .మంత్రాలవారు ఉంటె కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందనే ధీమా ఉండేది .నవ్వుతూ నవ్విస్తూ బాధ్యతగా  పని చేసేవారు చేయించేవారు .ఉగాదినాడు వారింట్లో ఆబ్దీకం ఉండేది .దాన్ని యధావిధి గా నిర్వహించి, బ్రాహ్మణసంఘ కార్యక్రమం లో పాల్గొనేవారు. అంతటి అంకితభావం ఆయనది.ఈసంఘం లో అందరం కలిసి పనిచేయటం తో మా ఇద్దరిమధ్యా పరిచయం బాగా పెరిగింది. ఒకరంటే ఒకరికి గౌరవభావమేర్పడింది .ఇక ఇప్పుడు మంత్రాలవారు తెల్లలుంగీ ,పైన చొక్కాతోనే ఎప్పుడూ ఉండేవారు .అప్పటికి ఉయ్యూరు లో లబ్ధ ప్రతిస్టు లైన పురోహితులు బ్రహ్మశ్రీ వంగల సుబ్బావధానులుగారు, శ్రీ కోట కృష్ణమూర్తిగారు వృద్ధాప్యం లో ఉండటం గ్రామాంతరం వెళ్ళిపోవటం తో పెద్ద శూన్యమేర్పడింది .అప్పుడు దుర్గయ్య ఆలోచించి శ్రీ పుచ్చా సూర్యప్రకాశ శాస్త్రి గారిని గౌరవంగా ఆహ్వానించి ఇక్కడే ఉండేట్లు వసతి సౌకర్యాలు కలిపించాడు .దీనికి మంత్రాలవారు చాలా దోహదం చేశారు .మాబోటివారం చేతనైంత చేయగలిగాం .ఆయన ఇక్కడే స్థిరపడి ఇల్లుకూడా కొనుక్కున్నారు .మొదట్లో మేము చేయిఅందించినా , ఆయన చొరవ ,పాండిత్యం ,మాటకారి తనంతో బాగా అల్లుకు పోయారు .  

   2002 లో మేము అమెరికా మొదటిసారి వెళ్లి తిరిగి వచ్చేసరికి బ్రాహ్మణ సంఘం పరిస్థితి  క్షీణించింది .దుర్గయ్య రిటైరై ,స్వగ్రామం పెదముత్తేవి వెళ్ళిపోయాడు .సంఘం బాధ్యత ఎవరూ తీసుకోలేదు .అప్పుడు సమావేశాలంటే గోవిందరాజులవారి అరుగుమీదే రాత్రిళ్ళు ఎక్కువ గా జరిగేవి .అందరు నన్ను బాధ్యత తీసుకోమన్నారు .నాకు దేవాలయం ఉంది ,సాహిత్య సేవ ఉంది .పూర్తి కాలం దీనికి పెట్టలేనుకనుక ఇంకెవరైనా తీసుకొంటే మంచిది అన్నాను .ఎవరూ ముందుకురాలేదు .దుర్గయ్య రెండు మూడు సార్లు వచ్చి ఎవరికైనా అప్పగిద్దామని చూశాడు .వాడూ విసిగిపోయాడు ఇక్కడి వీళ్ళ తీరు చూసి .అప్పుడప్పుడు నాతో రహస్యంగా ‘ఒరేయ్ !ఇందులో’’ ఒక గ్రూప్’’ ఏర్పడి వెనకనించి పెత్తనం చేయాలనిచూస్తోంది .నా నోరు గట్టిది కనుక నాదగ్గర వాళ్ళ ఆటలు సాగలేదు.దబాయించి ఎదురు నిలిచి ఇప్పటిదాకా లాక్కొచ్చా ‘’అన్నాడు నాకూ అది నిజమే అనిపించింది .నేను తీసుకొను బాధ్యత అని చెప్పగానే  మంత్రాలాయన ,గోవిందరాజులాయన కొంతకాలం  నాపై గుర్రుగా చూసేవారు .కనిపిస్తే పలకరించేవారుకూడాకాదు  .చాలామంది నన్నే బాధ్యత తీసుకోమనేవారు నాకు వద్దని నిష్కర్షగా చెప్పేవాడిని .తర్వాత రమణ పంతులు, గరుగుమీద సోమయాజులవారబ్బాయి  లతో ఒక కార్యవర్గం ఏర్పాటు చేసి నడపటం మొదలెట్టారు .వీరిని’’ బాక్ డ్రైవింగ్ ‘’చేస్తూ దుర్గయ్య చెప్పినవర్గం డామినేట్ చేస్తూ ఏ పెత్తనం ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారని విన్నాను.నేను సభ్యత్వం తీసుకోవటమూ మానేశాను .నన్నూ వాళ్ళు పిలవటం మానేశారు .బాపిరాజు ఉద్యోగం నుంచి రిటైరయ్యే దాకా ఇలానడిపి   తర్వాత బాపి రాజుకు పూర్తి పెత్తనం అప్పగించికార్యక్రమాలు చేస్తున్నారు .బాపిరాజుమాత్రం కార్యక్రమాలు నాకు తెలియజేస్తూ హాజరుకమ్మని కోరేవాడు. వీలయితే  వెడుతున్నాను .

  మంత్రాల రాదాక్రిష్ణమూర్తిగారు ఆరోగ్యం బాగుండక దాదాపు నాలుగైదేళ్ళనుంచి  ఇంట్లో నుంచి బయటికి రావటం లేదు .రెండేళ్ళక్రితం ఒకసారి ఇంటికి వెళ్లి పలకరించిన జ్ఞాపకం .అప్పుడే మేము జరిపిన ఐదురోజుల శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమాలలో ఒక రోజు దేవాలయానికి వచ్చారు .అదే చివరి సారి చూడటం .ఆయన శ్రీమతిగారు ఊళ్ళో పెద్దముత్తైదువు . అందరికీ ఆవిడంటే విపరీతమైన గౌరవం మర్యాద .మా గుడికార్యక్రమాలకు తప్పకుండా  ఆవిడా, కుమార్తె పద్మజ  వస్తారు .పద్మజ కు సంగీతం లో ప్రవేశం ఉంది. మేము గుడిలో జరిపే త్యాగరాజ ఆరాధనకు వచ్చి కమ్మగా పాటలు  పాడుతుంది . ఈమె కూతుళ్ళు ఇద్దరూ నేను ఫ్లోరాలో పని చేసినప్పుడు చదివి  బిటెక్ పాసై వివాహాలు జరిగి అమెరికాలో సెటిల్ అయ్యారు .పద్మజ భర్త మా రమణ కు మంచి స్నేహితుడు .వీడు ఆ అమ్మాయిని అక్కా అనిపిలుస్తాడు ఆ అమ్మాయి తమ్ముడూ అని అని పిలుస్తుంది . తండ్రిని అనునిత్యం కనిపెట్టుకొని ఉండే ఒక కుమారుడూ తరచుగా దేవాలయానికి వస్తాడు .మిగిలిన కొడుకుల్లో వాళ్ళు ఎప్పుడు ఉయ్యూరు వచ్చినా  శ్రీ సువర్చలాన్జనేయస్వామి ని దర్శించకుండా వెళ్లరు .  

  ఇలా అందరికీ తలలో నాలుకగా చురుకైన బ్రాహ్మణసంఘ కార్యదర్శిగా , స్నేహశీలిగా ,సంస్కార వంతునిగా ,సమాజ సేవా దృక్పధం ,అర్ధులకు ఆర్ధిక సాయం అందించే దాత గా గుర్తింపు పొందిన శ్రీ మంత్రాల  రాదా కృష్ణ మూర్తి గారు మరణించటం తీరనిలోటు .వారి ఆత్మకు శాంతికలగాలని, వారి కుటుంబం ఈ దుఖం నుంచి నెమ్మదిగా తేరుకోవాలని ,ఆకుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను .

   సుమారు ఏడెనిమిది నెలల క్రితం బ్రాహ్మణ సంఘం ట్రెజరర్ గా దీర్ఘకాలం పనిచేసిన తొంభై ఏళ్ళు దాటిన శ్రీ గోవిందరాజు వెంకటేశ్వరరావు గారు మరణించారు . వృద్దతరం ఇలా కనుమరుగవుతోంది .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-18-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 20శతాబ్దం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ(1958)

సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై , ఎం.వో.ఎల్.,ఆంద్ర ఎం.ఏ.,పొంది ,’’ధ్వని –మనుచరిత్ర ‘’పై పరిశోధన గ్రంథం రచించి పి.హెచ్ .డి .అందుకొని  ,హైదరాబాద్ పటేల్ కళాశాల ఉపన్యాసకులై ,సంస్కృత నలచరిత్ర,,ధర్మపురి లక్ష్మీ నరసింహ సుప్రభాతం ,మొదలైన సంస్కృతాంధ్ర గ్రంథరచన చేసిన ‘’సంస్కృత సాహిత్య రత్న ‘’విద్యాప్రవీణ ,ఒకప్పటి కరీం నగర్ ఇప్పటి జగిత్యాలజిల్లా ధర్మపురి వాస్తవ్యులు డా.కొరిడె రాజన్న శాస్త్రి ,శ్రీమతి సులోచనా దేవి గార్ల  పుత్రరత్నమే  డా . కొరిడెవిశ్వనాథశర్మ గారు .తండ్రికి దీటైన ,కొండొకచో తండ్రిని మించిన సంస్కృతాంధ్ర భాషా పండితులు. ధర్మపురి  శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల అధ్యాపకులుగా ప్రవేశించి, ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగిన విద్వన్మూర్తి ,పరిపాలనా దక్షులు శర్మగారు ..

  విశ్వనాధ శర్మగారు 4-6-1958 న కొరిడె వారి సంస్థానం  ,పవిత్రగోదావరీ తీరంలోని  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం ధర్మపురిలో జన్మించారు .సంస్కృతం లో బి .వో.ఎల్ .,తెలుగులోఎం.ఏ .డిగ్రీలు పొందారు .’’లింగ పురాణం –విమర్శనాత్మక పరిశీలనం ‘’పై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుండి పరిశోధన చేసి పి .హెచ్ .డి .అందుకున్నారు ‘

  సంస్కృతం లో 1- శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాతం 2-పెద్దాపురం లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం రచించారు .తెలుగులో 1- భర్తృహరి సద్భావ లహరి 2-ధర్మపురి కావ్యం (అసంపూర్ణం )రాశారు .శర్మగారు ప్రసిద్ధ అనువాదకులుకూడా  .1-లింగ పురాణం ను కీ.శే .డా .వి హన్మాన్ శర్మగారితో కలిసి అనువదించారు .2-బ్రహ్మ పురాణా౦తర్గతమైన 108 అధ్యాయాల బృహత్ సంస్కృత గ్రంథం ‘’గోదావరీ మహాత్మ్యం ‘’ను కూడా శ్రీ హనుమాన్ శర్మగారితో కలిసి అనువాదం చేశారు .మహా పౌరాణికులైన శర్మగారు తమ పితృపాదులు రచించిన ‘’శ్రీ ధర్మ పురి లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం ‘’కు తెలుగు వ్యాఖ్యానం రచించి సాహిత్య పిత్రూణ౦ తీర్చుకొన్నారు .ప్రస్తుతం 1-కీ.శే .తు౦గూరి శివరామ శర్మగారి అసంపూర్తి పద్యకావ్యం ‘’కాదంబరీ సంగ్రహం ‘’కు 2-భర్తృహరి విజ్ఞాన శతకం కు  తెలుగు వ్యాఖ్యానాలు రాస్తున్నారు.

  శర్మగారి సంపాదకత్వం లో 1-డా.వి.హన్మాన్ శర్మగారి ‘’పదవీ విరమణ అభినందన సంచిక’’ 2-కవితా శ్రీ శిల శ్రీనివాస్ వెలువరించారు .ఆకాశవాణి నుండి సుమారు 15సాహిత్య ప్రసంగాలు చేశారు .సప్తగిరి ఆరాధనహనుమ ,మాలిక పత్రికలలో  వ్యాసాలు  రాశారు .మాంచి భావకవి ఐన శర్మగారు కొన్ని ముద్రిత ,అముద్రిత భావకవితలు రాశారు  .ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ లలో పరిశోధక పత్రాలు రాసి సమర్పించారు .  శర్మగారి విద్యాభ్యాసం అంతా ధర్మపురి లోనే జరిగింది .ఓరియెంటల్ స్కూల్ శ్రీ సీతారామలింగేశ్వర దేవాలయం అనే శివాలయం లోనే చాలా కాలం ఉండేది. ఇక్కడే చెట్లక్రింద అరుగులమీద చదువు సాగేది .కాలేజీ కూడా ఇక్కడే ప్రారంభమైంది .తర్వాత నూతనభవనాలలోకి మారింది .శార్మగారికీ శివాలయానికి అవినాభావ సంబంధం చాలాఉంది .ఈ ఆలయం లోనే కార్తీక మాసాలలో పురాణ ప్రవచనాలు చేస్తారు .ప్రస్తుతం ఒక గృహిణి కోరికపై వారింట్లో తాము అనువదించిన  ‘’గౌతమీ మహాత్మ్యం ‘’ .పురాణం చెబుతున్నారు .ఇది వారి వృత్తికాదు, ధార్మిక ప్రవృత్తి..స్ఫురద్రూపం తో, వెడల్పు ముఖంతో, నుదుట తీర్చి దిద్దబడిన  విభూతి రేఖలతో ,చక్కని వెడల్పు అంచు మల్లెపూవులాంటి ధోవతీ,  అడ్డంగా భుజాలపై వ్రేలాడే ఉత్తరీయం తో బ్రహ్మ వర్చస్సు వెలిగిపోతూ  ,బ్రాహ్మీమయ మూర్తిగా ,రాజసం ఉట్టిపడే నడకలో మరో శ్రీనాధ కవి సార్వభౌమునిలా , అపర కాశీ విశ్వనాథునివలె  ఈ ధర్మపురి  విశ్వనాథ  శర్మ గారు గోచరిస్తారు . మంచి స్థితి పరులైన శర్మగారు బంగారానికి తావి అబ్బినట్లు, ఉదార గుణ సంపన్నులు .తమ ‘’కొరిడె సాహితీ సంస్థాన విజయాలకు చిహ్నంగా ,తమ కుటుంబ ,వంశ కీర్తి ప్రతిష్టలకు ,వినయవివేక సంపత్తికి గౌరవ భూషణ౦ గా ,  తమ రెండస్తుల మేడకు ‘’విజయ భూషణం ‘అని సార్ధక నామకరణం చేశారు .

శర్మగారి శ్రీమతి గొప్ప విదుషీమణి .ఈ దంపతులు అతిధి మర్యాదలకు పెట్టిందిపేరు  .బ్రాహ్మణ్యం ఎవరొచ్చినా తమ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టకుండా పంపరు .ఆమె ప్రవరాఖ్యుని ధర్మపత్ని లాగా ‘’వండనలయదు వేవురు వచ్చి రేని ,నడికి రేయైన’’ అనే సంప్రదాయం పాటించే ఉత్తమ గృహిణి .

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు .మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు .

ఆధారం –శ్రీ విశ్వనాథ శర్మగారు నాకు ధర్మపురిలో 28-10-18 ఆదివారం వారింటిలో ఆత్మీయంగా అందజేసిన బృహద్గ్రంథం-‘’గౌతమీ మహాత్మ్యం ‘’.

 సశేషం

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28

కాకినాడ ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం కనుక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ‘’ఇరగవరం’’ గ్రామ ఆహితాగ్నులగురించి తెలుసుకొందాం

                 పశ్చిమ గోదావరి జిల్లా

కోనసీమ ఆగ్రహారానికి పశ్చిమాన ,మధ్య డెల్టాకు గోదావరి –వసిష్ట కు తూర్పు సరిహద్దున ,గోదావరి-వైనతేయ (గరుడ )నది అంతమవుతుంది .ఆధునికకాలం లొ బ్రిడ్జీల నిర్మాణం జరిగే వరకు ఈ రెండు చానళ్ళు దాటాలంటే ప్రవాహ ఉద్ధృతి లేనప్పుడు ఫెర్రీలే దిక్కు .వసిస్ట కు దూరంగా ఉన్న  కుడి భూభాగాన్ని ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అంటున్నారు.  దీని ముఖ్యపట్టణం ఏలూరు .ఇది కూడా దాదాపు తూర్పు గోదావరి వైభవాన్ని పచ్చదనం తో సహా కలిగి ఉంటుంది .ధాన్యాగారం అనిపించే పంటపొలాలు వాటి దగ్గర తెల్లకొంగలు ముచ్చటగా ఉంటాయి ,ఇక్కడి పక్షులలో ‘’పాలపిట్ట ‘’ప్రత్యేకమైనది .త్రికోనణాకారమైన ఈ భూ భాగం జూన్ జులై ఆగస్ట్ నెలలో వరదలకు గురౌతుంది .వీటితో అంటువ్యాధులు ప్రబలి జననస్టం కలుగ జేస్టాయి  .26 -12 -20 04న వచ్చిన సునామీలో 2,32,౦౦౦మంది మృతి చెందారు .

                    వేదపండిత ముఖ్యపట్టణం’’ ఇరగవరం ‘’

  కోనసీమకు చేరువలో తణుకు పట్టణం వసిష్ట గోదావరికి కను చూపు లొ ఉంటుంది .ఇప్పటికీ ఇక్కడ డజనుకు పైగా వేద పండిత కుటుంబాలున్నాయి .దీనికి సమీప గ్రామాలే ఇరగవరం ,జుత్తిగ ,నిడదవోలు ,ఖండవల్లి ,సిద్ధాంతం ,కానూరు,ముక్కామల  అగ్రహారాలు .20 వ శతాబ్దిలో ఇక్కడ చాలా కుటుంబా లలో ఎందరో ‘’ఆహితాగ్నులు’’ వర్దిల్లారు.1991లొ శ్రీ పీసపాటి వేంకట సిద్ధాంతి గారుకోనసీమ  శ్రీరామపురాగ్రహారానికి చెందినశ్రీ దువ్వూరి యాజులుగారిని అందరు రుత్విక్కులను ఆహ్వానించే ‘’సోమ ప్రవాకుని ‘’గా తాము చేస్తున్న అగ్ని స్టోమానికి ఆహ్వానించారు .ఇప్పుడు ఈ ప్రాంతంలో పేరు పొందిన శిక్షణ పొందిన వేదపండితులు, ఘనాపాఠీ లకు కొదువలేరు .తణుకు కు ఆరు మైళ్ళ దూరం లొ ఉన్న ఇరగవరం భారత దేశం లొ’’ వేదపండిత ముఖ్య పట్టణం ‘’గా వన్నె కెక్కింది .భారత ఉపఖండం లోనే అరుదైన వేదపండితులను అందించింది ఇరగవరం .వీరిలో’’ క్రమపాఠం’’లొ సర్టిఫికేట్ పొందినవారే 30 మందికి పైగా ,అందులో సగం మంది అనేక స్థాయిలలో 2007లొ ఏర్పడిన ‘’శంకర వేద పాఠ శాలలో ఉన్నారు .ఇవాళ ఈ గ్ర్రామానికి తూర్పున వున్న ఏ గ్రామం లోనూ ఇలా చెప్పుకోవటానికి ఎవరూ లేరు .శతాబ్దం క్రితం కోనసీమలోని ముక్కామలకు ఎంతటి ఘన కీర్తి ఉండేదో, నేడు ఇరగవరానికి అంతటి కీర్తి ప్రతిష్టలు లభించాయి .

  వేద  సంప్రదాయానికి ఇరగవరం గర్వ పడే స్థితిలభించింది అనేక కలర్ ఫోటోల ఆల్బం లు ,వీడియోలు అనేక వేద సభల లలో ఎందరెందరో ఘనత వహించిన వేదపండితులకు నెమలి సింహాసనం పై ఆసీనులను చేసి జరిపించిన  అరుదైన సత్కారాలు ఘన సన్మానాలు  పై తీసినవి చూసి ఆనంద పరవశం పొందవచ్చు .అలాంటి ఘన వేదసంప్రదాయమున్న ఇరగవరానికి చెందిన వారిలో గుళ్ళపల్లి వారి కుటుంబం ఎన్నదగినది. వీరికి కోనసీమ దువ్వూరి, దెందుకూరి  కుటుంబాలతో జరిగిన వివాహాలవిషయాలు ముందే చెప్పుకొన్నాం .ప్రస్తుతం గుళ్ళపల్లి కుటుంబం లొ మూడు తరాలవారి గురించి తెలుసుకొందాం .

             శ్రీ గుళ్ళపల్లి సీతారామ శాస్త్రి అవధానులు గారు

             శ్రీ గుళ్ళపల్లి సీతారామ శాస్త్రి అవధానులు గారు, అర్ధాంగి నరసమా౦బ గారికి అయిదుగురు కుమారులు ,ఇద్దరు  కుమార్తెలు ,చాలామంది మనవాళ్ళు ,మనవరాళ్ళు ఉన్నారు .అయిదుగురిలో నలుగురు కుమారులు తిరుపతి దేవస్థానం1990 అక్టోబర్ లో   ‘’వరుణపూజ ‘’కార్యక్రమం నిర్వహించినపుడు ఆహ్వాని౦పబడిన 16 మంది ఆంద్ర వేదపండితులలో ఈ నలుగురూ ఉండటం విశేషం .దీనితో వర్షాభావం ఏర్పడిన తిరుపతిలో కుంభ వృష్టి కురిసి బాధలను పోగొట్టింది .గుళ్ళపల్లి కుటుంబం పూర్తిగా వేద సంప్రదాయానికే కట్టుబడింది .వీరి ఉప కుటుంబాలు  ఆ సంప్రదాయం నిలబెడుతూ ఆధునిక సౌధాలు  బ్రాహ్మణ వాటికలలో నిర్మించుకొని ఉంటున్నా, సంప్రదాయాన్ని విస్మరించక అవిచిన్నంగా కొనసాగిస్తున్నారు . .ఇద్దరు ‘’ ఘనాపాఠీ’’లయ్యారు వీరిలో.ఆధునికకాలం లొ కూడా ఈ కుటుంబం కోనసీమ అగ్రహార కుటుంబాలతో వియ్యమందుకోనటం సంప్రదాయ పరి రక్షణలో భాగమే .

 సీతారామ శాస్త్రి అవధానులు  ‘’లోహితస ‘’గోత్రీకులు .1925 లొ ఇరగవరం లొ జన్మించి ,10 వ ఏట ఉపనయనం చేసుకొని ,కొనసీమలంక ‘’పొద్ద గట్లపల్లి’’ లోని శ్రీ కంభం పాటి లక్ష్మణ అవధాని ,ఉండి అగ్రహారం లోని శ్రీ తంగిరాల సుబ్బావధానులు ,రాజమండ్రిలోని శ్రీ విశ్వనాధ ఘనాపాఠీ గార్లవద్ద  శాస్త్రాలు  అభ్యసించారు .కనుక వీరి చదువు ఎక్కువభాగం కొనసీమలోనే కొనసాగింది .మామూలు పద్ధతిని వదిలి ,ముందుగా  శాస్త్ర విద్య నేర్చి ,తర్వాతే వేద విద్య అభ్యసించారు  ఆ తర్వాత ‘’వేదార్ధం ‘’నేర్చారు .విజయవాడ ,రాజమండ్రి ,సల్లేపల్లిలలో జరిగిన పరీక్షలో ఉత్తీర్ణులై నారు .శ్రౌతం పై అభిలాష తక్కువే అయినా, శ్రౌత ,స్మార్త కర్మలు నేర్చుకున్నారు .వీరి నైపుణ్యాన్ని కొందరు చక్కగా ఉపయోగించుకున్నారుకూడా .ఇరగవరం లోని త౦గిరాలవారిలో  చాలామంది ‘’ఆహితాగ్నులు’’న్నారు.1970 లొ శ్రీ తంగిరాల రామ సోమయాజులు గారు నిర్వహించిన ‘’అగ్ని స్టోమం ‘’కు గుళ్ళపల్లి సీతారామ శాస్త్రిగారిని ‘’అధ్వర్యుని ‘’చేశారు.

  16 వ ఏట వివాహం 19 24 లొ జన్మించిన నరసమాంబ గారితో  జరిగింది  .ఔపోసన  కార్యం అయ్యాక  1950 -60 మధ్యకాలం లోవరుసగా  ఏడుగురు సంతానం కన్నారు దంపతులు ..ఇందులో ఇద్దరు కుమార్తెల ను వేదపండితులకే ఇచ్చిసంప్రదాయ  బద్ధంగా  రజస్వల పూర్వ వివాహం చేశారు .కొడుకుల్లో ఒకాయన వేదమార్గం పై కొంత కాలం ఊగిసలాడినా, చివరికి వేదం నేర్చి ‘’సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ‘’అని పించుకొన్నారు శాస్త్రిగారు .  అయిదుగురు  కుమారులు తిరుపతి వారి వేదపారాయణ స్కీం లొ ఉద్యోగాలు పొందారు .మనుమలందరికీ ఉపనయనం తర్వాత  సీతారామ శాస్త్రిగారే వేదం నేర్పారు .’’మా మనవాళ్ళు అందరూ అయిదోక్లాస్ తోనే ఇంగ్లిష్ చదువు మానేసి వేదం లొ పడ్డారు.  ఇప్పుడు స్కూల్ లో ఎవ్వరూ మావాళ్ళు లేరు.అందరూ వేదంలోనే ఉన్నారు ‘’‘’అని గర్వ పడతారు శాస్త్రి గారు .ప్రశాంత చిత్తంగా ఉండే ఆయన విద్య నేర్పటం లొ చాల క్రమశిక్షణ పాటిస్తారు .’’కోనసీమలో ఒకే గ్రంథాన్నిఒకే సారి ఇద్దరు బ్రహ్మ చారులకు బోధించరాదు’’ అనే సంప్రదాయం ‘’ఉన్నది . కాని శాస్త్రిగారు దాన్ని అధిగమించి ఎక్కువమందికి నేర్పారు .1998 లో10-12 ఏళ్ళ వయసున్న  తన అయిదుగురు మనుమలకు ,8 వ ఏట ఉపనయనం తర్వాత ఒకే సారి తైత్తిరీయ సంహిత నాలుగవ కాండ బోధించారు .తర్వాత ఇకటి ,రెండు, మూడు కాండలు ,తరవాత అయిదు ,నాలుగు , ,ఏడు కాండలు నేర్పి 20 00 మార్చి నాటికి  పూర్తి చేయింఛి పరీక్షకు సిద్ధం చేయించారు .నాలుగు నెలలు పునశ్చరణ చేయించి , నలభైనాలుగు పన్నాలలో శ్రావణమాసం లొ జరిగిన పరీక్షలో కూర్చోపెట్టారు .పరీక్ష రాసిన తర్వాత మొదట ప్రారంభించిన నాలుగవ కాండ ను ‘’పదం’’ తో నేర్పారు .అంతపట్టుదల దీక్షగా గుళ్ళపల్లి రామశాస్త్రి అవధానిగారు నేర్పితే ,అంతేపద్దతిగా క్రమశిక్షణతో అయిదుగురు మనవలు నేర్చుకొని తాతగారి కీర్తిని ఇనుమడింపజేశారు ఇరగవరం లో .ఒకరకంగా ‘’వేదాన్ని ఇ(అ)రగదీశారు ఇరగవరం’’ లో .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31 -10-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

18ఏళ్ళ తర్వాత మళ్ళీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం

18ఏళ్ళ తర్వాత మళ్ళీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం

18ఏళ్ళక్రితం మా మనవడు -మా పెద్దబ్బాయి శాస్త్రి రెండవ కొడుకు ఛి భువన్ హనుమకొండలో పుట్టినప్పుడు వచ్చిన గోదావరి పుష్కారలకు నేను ,మా శ్రీమతి  మా వియ్యపురాలు శ్రీమతి ఆదిలక్ష్మిగారు కలిసి ,హనుమకొండ నుంచి బస్సులోకరీం నగర్ జిల్లా  ధర్మ పురి వెళ్లి ,గోదావరిలో పుష్కరస్నానం చేసి ,అప్పుడున్న పెద్ద రష్ లొ ఆపసోపాలు పడుతూ క్యూ లొ నిల్చోలేక దారిలో ఉన్న ఇంటి అరుగులపై సేద తీరుతూ  శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దర్శనాను భూతి పొందాము .అక్కడి బ్రాహ్మణ్యపు ఇళ్ళు,వారి ఆచార వ్యవహారాలూ చూసి మురిశాము .అవన్నీ మా ఆవిడ హృదయ ఫలకం పై గాఢ ముద్రవేశాయి .మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తూనే ఉంది .ఆ కోరిక ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు ఇవాళ మళ్ళీ 28-10-18ఆదివారం తీరింది .

గీర్వాణం రెండవ భాగం రాస్తూండగాహైదరాబాద్ లోని  శ్రీ అందుకూరి శాస్త్రి గారు పరిచయమై శ్రీ కోరిడే రాజన్నశాస్త్రిగారు సంస్కృత మహాపండితులని,సంస్కృత గ్రంథ రచన చేశారని ధర్మపురి వాస్తవ్యులని  వారికుమారులు డా విశ్వనాధశర్మగారు ధర్మపురి ఓరియెంటల్ కాలేజి ప్రిన్సిపాల్ గారని ,మంచి రచయిత అనీ ,తండ్రిగారి గ్రంథాలు వారి వద్ద ఉంటాయని చెప్పి వారి ఫోన్ నంబర్ ఇవ్వగా వారితో మాట్లాడగా ,వారు నా ప్రయత్నాన్ని అభినందించి తండ్రిగారి పుస్తకాలు ,తాము వారిపై రాసిన వ్యాసం తో సహా  ప౦పారు  .అప్పటికే రాజన్న గారు పరమపదించారు .వారిగ్రంధాలు  ఆధారం గా శ్రీ రాజన్న శాస్త్రి గారిపై రెండవ గీర్వాణం లొ రాసి వారి కుమారులకు ఒకకాపీ పంపాను .వారి కోరికపై మొదటి గీర్వాణమూ పంపాను .తదాది వారితో ఫోన్ సంభాషణ కొనసాగింది .వారి సౌజన్యం ముగ్దుడిని చేసింది .ఒకసారి వారు మెయిల్ లొ ధర్మపురికి ఆహ్వానించి తమి౦ట ఆతిధ్యం పొందాలని కోరారు .సరే అన్నాను .ఆకోరికా ఇవాళే తీరింది .

ఈ గురువారం రాత్రి ఉయ్యూరు లొ బయల్దేరి హైదరాబాద్ లొ మల్లాపూర్ మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి శుక్రవారం ఉదయం చేరాం . శుక్రవారం రాత్రి  మావాడు కారు ,డ్రైవర్ అందుబాటులో ఉన్నారని అందరం ఆదివారం ధర్మ పురి వెడదామన్నాడు సంతోషించాం . ఆ రాత్రే   శర్మగారికి మెయిల్ పెట్టి వారి సెల్ నంబర్ కోరాను . వారు వెంటనే ఫోన్ చేస్సి తప్పక రమ్మని ఆహ్వానించారు .శనివారం మా అన్నయ్యగారమ్మాయి  ఛి సౌ వేదవల్లిని నల్లకుంట కు వెళ్లి పరామర్శించి మల్లాపూర్ చేరేసరికి రాత్రి సుమారు 10 అయింది. అందుకని శర్మగారికి ఫోన్ చేసి చెప్పలేకపోయా .

ఆదివారం ఉదయం నాలుగు గంటలకే లేచి స్నానం సంధ్య ,పూజ పూర్తి చేసి కాఫీతాగి అందరం కలిసి కారులో ఉదయం 5 -15 కు 130కిలో మీటర్లలో ఉన్న ధర్మపురికి బయల్దేరాం .కరీం నగర్ కు పావుతక్కువ 8 కి చేరి అక్కడి ఉడిపి హోటల్ లొ ఇడ్లీ వడ తిని కాఫీ తాగి 8-15 కు మళ్ళీ బయల్దేరి ఉదయం 10కి ధర్మపురి చేరాం .ఉదయం 6 నుంచి శ్రీ కోరిడే శర్మగారు ఫోన్ చేస్తూ  మా ప్రయాణ ప్రోగ్రెస్ తెలుసుకొంటూనే ఉన్నారు .సరాసరి గోదావరీ తీరానికి చేరి కాళ్ళు కడుక్కొని పవిత్ర జలాలను తలపై చల్లుకొని సంతృప్తి పడ్డాం .దగ్గరలో ఒక ప్రాజెక్ట్ కడుతూ౦డటం తో బాక్ వాటర్ వచ్చి నదిలో కలుస్తోందట .అక్కడినుంచి ఆటోలో గుడికి చేరాం .అక్కడ ఉగ్ర నారసింహ మూర్తిని, వేణుగోపాల స్వామిని చూసి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం చేరిదర్శనం చేసుకొనే సరికి మాకోసం శ్రీ శర్మగారు శ్రమపడి వచ్చారు. ఆలయ విశేషాలు తెలియజేస్తూ గర్భాలయం లోకి తీసుకు కెళ్లే ప్రయత్నం చేస్తే నేను పాంట్ షర్ట్ తో  ఉండటం తో కుదరదన్నారు. అత్తా కోడలు లోపలి వెళ్లి దర్శించారు .ఆలయం లొ బ్రహ్మ దేవుని విగ్రహం ఉంది .ఇలా ఉండటం అరుదైన విషయమని ,ప్రక్కనే బలరాముడు హలాయుధం తో ఉన్నాడని చూపించి వారి చుట్టూ దశావతారాలున్నాయని సాలగ్రామాలున్నాయని వివరించారు శర్మగారు . తమిళనాడుకు చెందిన శ్రీ ఆదినారాయణ రావు గారు ఇక్కడ ఆంజనేయ విగ్రహం లేదని గ్రహించి నరసింహ స్వామి ఆలయం బయట పెద్ద  శ్రీ ఆంజనేయ విగ్రహం ప్రతిష్టించి నిత్య ధూప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు .ఈ స్వామి ఇక్కడ అదనపు ఆకర్షణ .ఇక్కడే యమధర్మ రాజు కు చిన్న దేవాలయం ఉన్నది .పూజారి శ్లోకం చెప్పి మనతో అక్కడున్న దీపం లొ నూనె పోయిస్తాడు .నరసింహాలయం చుట్టూ అనేక ఆ౦జనేయ  విగ్రహా లున్నాయి.  ఇవేకాక ఊరంతా హనుమవిగ్రహాలు ఎక్కడపడితే అక్కడ ఉండటం విశేషం .ఎందుకున్నాయని శర్మగారిని అడిగితే ‘’ఇక్కడి నృసింహ స్వామి ‘’ని శాంత పరచటానికి అన్నారు .దీనిప్రక్కనే ఉన్న వెయ్యేళ్ళనాటి శ్రీ సీతారామ లింగేశ్వర స్వామి దేవాలయానికి శర్మగారు తీసుకు వెళ్లి అన్నీ చూపించారు .దీనికంటే ప్రాచీనమైనది నృసింహ దేవాలయమని చెప్పారు .ఈశివాలయం   లోనే ఓరియెంటల్ పాఠశాల .ప్రారంభమైందని తానూ ఇక్కడే చదువుకున్నానని  ఇక్కడే కాలేజీ ఉండేదని ,అందులో తానూ పని చేశానని చెప్పగా ,మా ఉయ్యూరువాడు నా సహాధ్యాయి వేమూరి దుర్గయ్య ఇక్కడ పని చేశాడు తెలుసా అని అడిగితే బాగా తెలుసు అన్నారు .ఆయనా ఇక్కడే బోధించాడు అన్నారు .దీనికి ఒకాయన మేనేజర్ గా ఉండేవాడని ,జీతాలు సరిగ్గా ఇచ్చేవాడు కాదని ,ఎవరైనా అడిగితే బియ్యం కావాలంటే షావుకారుకు చెబుతా, సరుకులుకావాలంటే షాపులో  చెబుతా  తెచ్చుకోమనే వాడేతప్ప రూపాయి ‘’చేపే’’వాడు కాదన్నారు .దీనితో దుర్గయ్యగారు మానేసి ఉయ్యూరు  వెళ్లారన్నారు  .ప్రభుత్వం తీసుకోన్నతర్వాత మంచి జీతాలు వస్తున్నాయని ,కొత్త బిల్డింగ్ లోకి కాలేజి మారిందని ,తానూ రెండేళ్లక్రితమే ప్రిన్సిపాల్ పదవి నుంచి రిటైర్ అయ్యానని చెప్పారు .స్ట్రెంగ్త్ బాగానే ఉందా అంటే 150మంది విద్యర్దులున్నారని, ,కాని తగినంత స్టాఫ్ లేదన్నారు .తాను తనకొచ్చే జీతం తో లెక్చరర్ లను అపాయింట్ చేసి కొరత తీర్చానన్నారు .ఇప్పుడు మళ్ళీ మామూలే అన్నారు . ఇక్కడ ప్రిన్సిపాల్ గా పనిచేసిన చారిత్రకపరిశోధకులు ,బహు గ్రంథ కర్త డా సంగన భట్ల నరసయ్యగారు  గారు తెలుసా ఇక్కడే ఉన్నారా అని అడిగితే  బాగా తెలుసునని వారిదగ్గరే తానూ పని చేశానని  ఆయన ప్రస్తుతం వేములవాడలో ఉన్న్నారని చెప్పారు .మాటల సందర్భం లో’’దువ్వాడ జగన్నాధం ‘’సినిమా డైరెక్టర్ సంగనభోట్ల ‘’హరీష్ శంకర్’’ది  ధర్మపురేనని, తమ ఇంటి ఎదుటే ఉంటాడని చెప్పారు .నరసయ్యగారు ధర్మపురి చరిత్రరాశారని దాని ఆధారంగా నెట్ లొ ఏడెనిమిది ఎపిసోడ్ లు రాశానని రాసికూడా ఆరేళ్ళు దాటిందనీ చెప్పాను .  ప్రసాసాదాలు కొని ,తిని శర్మగారింటికి వారితోపాటు వెళ్లాం . ఇప్పటికీ ఇక్కడ 400బ్రాహ్మణ  కుటుంబాలున్నాయని ,ఒకప్పుడు వెయ్యి గడప ఉండేదని ,ఇప్పుడు కోరిడేవారి కుటుంబాలే పదికి పైన ఉన్నాయని,తామున్నది అంతా కోరిడే వారి  ఆస్థానమంటారన్నారు . 18ఏళ్ళ క్రితం ఉన్న బ్రాహ్మణ వాతావరణం ఇప్పుడు మాకు కనపడలేదు .పాతైల్లస్థానం లొ ఆధునిక భవనాలు వచ్చేశాయి .తమ వదినగారు రామాయణ కావ్యం రాశారన్నారు .వారిని పరిచయం చేశారు .శర్మగారి తండ్రిగారు లక్ష్మీ నృసింహ సుప్రభాతం రాస్తే, తాము శ్రీ సీతారామ లింగేశ్వర సుప్రభాతం రాశామని చెప్పారు .ఇంకో దేవత సుప్రభాతమూ రాశామని చెప్పారు .తమ సంస్కృత రచనలగురించి తెలియజేస్తే, ఇప్పుడు రాస్తున్న గీర్వాణం -4లో వారిని గూర్చి రాసిన  అదృష్టవంతుడనవుతానని చెప్పాను .తప్పక పంపిస్తానన్నారు .’’భూషణ వికాస ధర్మ పురినివాస  –దుస్ట సంహార నరసింహ దురిత దూర ‘’మకుటం తో ప్రసిద్ధ శతకం రాసిన సముఖం శేషప్పకవి  ధర్మపురి వాసి యే.

నడక భగీరధ

శర్మగారింటికి వెళ్లేదారి అంతా గోతులమయం .దీన్ని గురించి చెబుతూ శర్మగారు కేసి ఆర్ ’’మిషన్ భగీరధ ‘’కోసం ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చే నెపంతో రోడ్లు అన్నీ తవ్వి గొట్టాలు పెట్టారేతప్ప కనెక్షన్ ఇవ్వలేదు .ఆ గోతులలో నడవాలేము ద్విచాక్రవాహనం నడపనూ లేము ‘’అన్నారు .అప్పుడు నేను ‘’నడక భగీరధ ప్రయత్నంలాగా ఉందన్నమాట ‘’అన్నాను అందరూనవ్వారు .సిద్దిపేట లొ హరీష్ రావు నియోజకవర్గం కనుక అక్కడ భాగీరధ మిషన్ బాగానే ఉన్నట్లు కనపడింది. మిగతా ఎక్కడా ఆ జాడే లేదు .రోడ్లపరిస్థితీ అంతే.

అప్పటికే వారి అర్ధాంగి అన్నీ సిద్ధం చేసి ఉంచారు .నేను హైదరాబాద్ లొ ఉన్న శ్రీ అందుకూరి శాస్త్రిగారికి ఫోన్ చేసి కోరిడే వారి సంస్థానం లొ ఉన్నామని చెప్పాను .వారెంతో సంతోషించి వీరి తండ్రిగారున్నప్పుడు ధర్మపురి వచ్చి వారి ఆతిధ్యం పొందిన విషయం జ్ఞాపకం చేసుకొన్నారు  .శర్మగారితో శాస్త్రి గారు మాట్లాడారు .పప్పు ,బీన్స్  కూర ,అరటి వేపుడు, కాబేజికూర , శ్రీకంఠ్ స్వీటు  ,చారు ,పెరుగులతో కమ్మని తృప్తికరమైన భోజనం పెట్టారు .అందరం మెచ్చుకొంటూ తిని ధన్యవాదాలు చెప్పాం .83ఏళ్ళ శర్మగారి   మాత్రుమూర్తి గారిని పలకరించి నమస్కరింఛి ఆశీస్సులు పొందాం  .అందరి భోజనాలయ్యాక శ్రీ శర్మగారినీ ,విదుషీమణి శిష్యురాలు అయిన  వారి అర్ధాంగి గారినీ కూర్చోపెట్టి హైదరాబాద్ లోకొన్న పంచ ఖండువా వారికి కప్పి ,చీర జాకెట్ ఆమెకు అందించి సరసభారతి పుస్తకాలు ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం’’ ,’’వసుధైక కుటుంబం కవితా సంకలనం ‘’పండ్లతో సహా అందజేసి ఆశీర్వాదాలు పొందాం .ఉత్తరాదిలాగా ఇక్కడ వీరికి ఆశ్వయుజ పౌర్ణమి నుంచే కార్తీకం ప్రారంభమవుతుందట .అందుకే ఈ   పౌర్ణమిమినాడే పురాణం చెప్పటం మొదలు పెట్టారట .శర్మగారి దంపతులు నాకు చాల ఖరీదైన శాలువాకప్పి మా శ్రీమతికి కోడలికి జాకెట్ ముక్కలు మాబ్బాయికి తువ్వాల ,తాము రాసిన ‘’శ్రీ వేద వ్యాస కృత ‘’గౌతమీ మహాత్మ్యం ‘’-శ్రీ బ్రహ్మాండ పురాణా౦త ర్గతం’’ అనే విస్తృత గ్రంధాన్ని(దీనినే శర్మగారు ప్రస్తుతం పురాణంగా చెబుతున్నారు ) ,తమ తండ్రిగారు డా కోరిడే రాజన్న శాస్త్రి గారు రచించిన ‘’ధ్వని –మనుచరిత్రం ‘’అనే అపురూప రిసెర్చ్ గ్రంథాన్నీ  అందజేశారు . ఆన౦దంగా స్వీకరించాము .సరసభారతి పురోగతి అడిగి తెలుసుకొన్నారు .తన ఇంట్లో తమకు సన్మానం ఏమిటన్నారు?’’ఇది సరసభారతి సత్కారం పండిత సన్మానం ‘’అని చెప్పాను . .దారిలో కనపడినవారందరికీ నన్ను గురించి చాలా పెదపెద్ద మాటలతో చెప్పి నేను సిగ్గుపడేట్లు చేశారు  . వారింటికి వెళ్ళేదారిలో రెండు పుష్కరిణులు ఉంటే వాటి  విశేషాలు తెలిపారు .ఇక్కడ స్వామివారి తెప్పోత్సవం డోలోత్సవం జరుగుతాయట .మొదటి దానిలోకి బయట ఎక్కడో ఉన్న చెరువు నీరు ఒక చిన్న  రంధ్రం ద్వారా చేరి నిండి ,రెండవ దానిలోకి చేరుతుంది .వరదలు వస్తే వీటిలోని నీరు ఊళ్లోకి వచ్చి మునిగిపోకుండా అడుగున ఉన్న ద్వారం ద్వారా గోదావరిలోకి చేరుతుందట .ఇంతగొప్ప ప్రణాళికతో సుమారు రండు వేలసంవత్సరాలక్రితం ఈ పుష్కరిణులు ఏర్పాటయ్యాయట. మేము  హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో రాయపట్నానికి దగ్గర ఒకప్పుడు  బౌద్ధ ఆచార్యుడు ,  గొప్ప బౌద్ధగ్రంథకర్త ‘’దిగ్నాగుడు ‘’నివసించిన ఊరు ఉన్నదని చెప్పారు

శర్మగారి దంపతుల వద్ద సెలవు తీసుకొని అందరం మధ్యాహ్నం 2-15 కు కారులో బయల్దేరి  ఆ ఊరిలోనే ఉన్న ‘’ధర్మాంగద’’ సినిమా చరిత్ర జరిగిన కథ ఉన్న మహా పతివ్రత పామును పెళ్ళాడి తన సత్యమహాత్మ్యాన్ని నిరూపించుకోవటానికి ఇసుక పైకి చల్లితే  రాతి స్తంభంగా మారిన చోట ఉన్న ‘’సత్యవతి ‘దేవి దేవాలయం చూసి ,,హైదరాబాద్ మల్లాపూర్ కు సాయంత్రం 6 గంటలకు క్షేమంగా చేరాం.  కారు డ్రైవర్ జగదీశ్ చాలా అనుభవమున్న వాడు .మా కోడలు పని చేసే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్ డ్రైవర్ .ఆదివారం కనుక మాకు వచ్చాడు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27  

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27

              శ్రౌత కక్షలు

కొన్ని దశాబ్దాలుగా శ్రౌత  కర్మకాండ లలో తమ తండ్రిగారి పై కక్షలున్నాయని కపిలవాయి సోదరులు చెప్పారు   .ఇవి శ్రౌతకర్మలు చేయించటం లో,శ్రౌత పరిజ్ఞాన విషయం లొ ఉండేవి .ఇవి శ్రౌతకర్మకాండలు ఆరంభమైన నాటినుండే ఉండేవట .ముఖ్యంగా దర్శ ,పూర్ణమాస విషయం లో, యజమాని విషయం లొ బాగా కనిపించేవి .యజ్ఞేశ్వర శాస్త్రిగారు విజయవాడలో1975లొ  స్వగృహం లొ ఉన్నప్పుడు ,అక్కడి  దెందుకూరి యాజులుగారితో ఈ స్పర్ధలు బయట పడ్డాయి .అనేక సభలు సమావేశాలలో ఇద్దరిమధ్యా చర్చోప చర్చలు జరిగాయి.ఈ కక్షలకు ముఖ్య కారణం దెందు కూరివారు శ్రౌత కార్యాలకు కోనసీమ వారిని ఆహ్వాని౦చే వారు కాదని  ,తర్వాత పిలిచినా కొనసీమనుంచి ఎవరూ రుత్విక్కులుగా వచ్చేవారుకాదని   కపిలవాయి సోదరులు ఉవాచ .దెందుకూరి గారు తమిళ వేదపండితులవైపు మొగ్గు చూపి ,సామవేదగానాన్ని ,కోనసీమ యజ్ఞేశ్వర శాస్త్రి గారు బోధించిన’’ ఆంద్ర గాన’’ విధానాన్ని కాదని తమిళనాడు విధానాన్ని ప్రవేశ పెట్టారు .కనుక మేము ‘’ఎవరో చెప్పిన గానాన్ని ఎందుకు అనుసరించాలి ?’’అని సోదరుల ప్రశ్న .

  ఒకే సారి అనేక క్రతువులు ఒకే చోట చేయటం విషయం లోనూ అభి ప్రాయ భేదాలొచ్చాయి . యజ్ఞేశ్వరులు ‘’సరైన నిష్ణాతులైన వారు నిర్వహిస్తే ,వారు బంధువులుకాని స్నేహితులుకాని కాకపొతే ,రెండు ప్రదేశాలు ఒకనది లేక కొండ చేత విడదీయబడి  ,ఒక చోటి శబ్దం వేరే చోట వినబడనంత  దూరం లొ ఉంటేనే అనేక క్రతువులు నిర్వహించాలని ‘’యజ్ఞేశ్వర శాస్త్రిగారు చెప్పారు .క౦చి స్వాములు కొన్ని విషయాలపై తమ అభిప్రాయాన్ని కోరితే అన్నీ పూసగుచ్చినట్లు వివరించి రాసి పీఠానికి అందజేశారు యజ్ఞేశ్వరులు .వీరి అభిప్రాయాలను వారు పూర్తిగా అంగీకరించి ,ఆమోద ముద్ర వేశారు .

  యజ్ఞేశ్వర గారి అభిప్రాయాలను లంకావారు సమర్ధించారు .’’అభిచార ‘’విషయం లొ యజ్ఞేశ్వర, లంకా వారలపై తీవ్ర ఆరోపణలు ఉండేవి .వీటికి సమాధానాలు చెప్పటానికి వారిద్దరూ బాగా ముసలి వారైపోయారు ,లంకావారు 1983నవంబర్ లొ దేహం చాలించారు .కనుక’’ డిఫెన్స్’’ ఇవ్వలేకపోయారు .కనుక కోనసీమ ,కృష్ణా శ్రౌతులమధ్య తమిళ గాన, ఆంధ్రగాన  వివాదం అలాగే ఉండిపోయింది .

   తర్వాత కాలం లొ వైదిక విధి లొ కొన్ని సమస్యలొచ్చాయి. ఇవి తెలుసుకోవటం చరిత్రను తెలుసుకోవటమే అవుతుంది .చాలా ఉత్సాహంగా ఉంటాయి కూడా .కపిలవాయి వారి ఆరోపణ లొ  దెందుకూరి వారి ఋత్విక్కులు రజస్వల కాని పిల్లలను పెళ్లి చేసుకోన్నారనేది ఒకటి .కనుక వారికి రుత్విజ అర్హత లేదంటారు .రెండోది దెందుకూరి గారు శ్రౌతాన్ని వ్యాపారంగా మార్చేశారని.డబ్బుకోసం కక్కుర్తి పడి కొన్నిటిని అతి తక్కువ సమయం లో అంటే చేయాల్సిన సమయంకంటే సగం సమయం కూడా తీసుకోకుండా  , యజమాని అమాయకత్వాన్ని’’ కాష్’’ చేసుకొని సమయమంతా డబ్బు మీదే లగ్నం చేస్తున్నారని, చేసి లాభం పొందుతున్నారనేది.. దెందుకూరివారు కోనసీమలో సరైన వారులేక ,ఇక్కడి తమ సంపాదన చూసి ‘’అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ‘’అనే సామెత రుజువు చేస్తున్నారు ‘’అంటారు .

  దువ్వూరి యాజులు గారు చేసిన పౌండ రీకానికి దెందు లూరివారు ఆర్ధిక సహాయం చేశారు .దీనితో వీరిద్దరిమధ్య సయోధ్య కుదిరి ,శ్రీరామపురం ,నేదునూరు వేదపండితులు దూరమయ్యారు .ఒక రకంగా దువ్వూరి వారిని ‘’కొనేశారు ‘’అంటారు  కపిలవాయి ,దెందుకూరి వర్గాలకు చెందని తటస్థులైన వేదపండితులు  .వీరే ‘’శ్రౌత కక్షలు  అంతానాటకం ,రాజకీయం ‘’అన్నారుకూడా  .దువ్వూరి ,దెందు లూరి కుటుంబాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న  ‘’గొల్లపల్లి ‘’వేదపండిత కుటుంబాలతో  వివాహాలు ఇచ్చిపుచ్చుకున్నట్లుగా జరిగాయి .

   బ్రహ్మశ్రీ దెందు కూరి అగ్ని హోత్ర సోమయాజులుగారు

దెందుకూరి అగ్ని హోత్ర యాజులుగారి కుటుంబం లొ 15తరాల వేదం పండితులున్నారు .ఆయన త్రేతాగ్ని హోత్రులు ‘.కుమారుడు శ్రీ లక్ష్మీ నరసింహ సోమయాజులు గారుకూడా అగ్ని హోత్రం చేస్తారు .పెద్దయాజులుగారి వద్ద పెద్దపెద్ద  ప్లాస్టిక్ సంచులలో సంస్కృత ,తెలుగు గ్రంథాలున్నాయి.ఇద్దరి కలర్ జిరాక్స్ ‘’రెస్యూమ్స్’’ కూడా అందరికి పంచి పెడతారు . రూపాయలలో కాని, డాలర్లలో కాని ‘’ఇష్టి’’ కోసం ధన సాయం అర్దిస్తారు .ఈ అభ్యర్ధనలు ఏదోఒక సారి మాత్రమే కాదు .పదే పదే అడగటం వారికి పరిపాటి .ఈ లక్షణం ఇప్పటివరకు మనం చెప్పుకొన్న ప్రసిద్ధ కోనసీమ శ్రౌతుల విషయం లొ లేనేలేదు .ప్రపంచ౦  సుభిక్షం గా ఉండాలనే వారు కాక్షించి చేశారు తప్ప స్వంత లాభం కోసం కానేకాదు .అంతా అయ్యాక యజమానులు యెంత ఇస్తే అంతే స్వీకరించారే తప్ప ముందుగా బేరసారాలు ఉండేవికావు వారి విషయం లో.

  1980నాటికీ కోనసీమలో శ్రౌతకార్యాలు చివరి దశకు చేరుకొంటే ,180మైళ్ళ పడమర లొ ఉన్న కృష్ణా తీరాన విజయవాడలో అప్పుడప్పుడే మొదలయ్యాయి.2005కు కృష్ణా జిల్లాలో 20 మంది ‘’ఆహితాగ్ని’’లున్నారని,అందులో 12 మంది బెజవాడలోనే ఉన్నారని  దెందు కూరి చెప్పారు . నిత్యాగ్ని హోత్రులలో దెందుకూరి తండ్రీ కొడుకులు ,రెండు చింతల ,విష్ణు భొట్ల ,కప్పగంతుల ,మద్దూరి మొదలైన కుటుంబాల వారున్నారు .1965లొ దెందు కూరిగారు విజయవాడలో ‘’అగ్ని స్టోమం ‘’చేసి ,తర్వాత అనేక శ్రౌత కార్యాలు నిర్వహించి ‘’బహు యాజి ‘’  అనిపించుకొన్నారు .వాజపేయం ,సర్వ తో ముఖం ,అరుణ కేతు ,మూడు పౌండ రీకాలు మొదలైనవి చేసిన ఘన చరిత్ర ఆయనది .ముగ్గురుకొడుకులకు నేర్పారు . ఇద్దరు కూతుళ్ళను వేదపండితులకిచ్చి  వివాహాలు చేశారు . ఒక’’ వేద సభ’’ స్థాపించి కృష్ణాజిల్లాలో వైదిక వ్యవస్థకు బలం చేకూర్చారు .

 శ్రౌత కక్ష ఉన్నా , కపిలవాయి వెంకటేశ్వర్లు గారు దెందు కూరి వారి 18 శ్రౌతకార్యాలలో లంకావారిలాగా రుత్విజులుగా చూపిన సర్వ సమర్ధతను మెచ్చుకొని, తమ విశాల హృదయన్ని ఆవిష్కరించారు ..  దెందు కూరిగారి తండ్రీ ,పెద్దన్నపౌండరీక యాజులుగారు కూడా ‘’ఆహితాగ్ను’’లే .తండ్రిగారు గుంటూరు జిల్లా నల్లపాడు నుంచి ఇక్కడి విజయవాడకు వచ్చారు . డయాబెటిస్ ,నరాల బలహీనత ,కీళ్ళ నొప్పులు ఉన్నా ,అన్నిటినీ అధిగమించి దెందు కూరి యజ్ఞేశ్వర సోమయాజులుగారు ,కోనసీమలోని కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి ,,రెండు చింతల  యాజులు గార్ల  రికార్డ్ లను అధిగమించి ,కొత్త రికార్డ్ సాధించి,స్థాపించి , తమకు ,కృష్ణాజిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు.బెజవాడలో చాలా సార్లు దెందు కూరి యాజులు గారిని వేదసభలలో,యజ్ఞ, యాగాలలో,పీఠాధిపతులు విచ్చేసి నపుడు  చూశాను .పొట్టిగా నుదుట దట్టమైన విభూతి రేఖలతో  మెడలోరుద్రాక్షలతో  ,మొకాలిపైకి బిగి౦చికట్టిన అంగోస్త్రం,పైన ఉత్తరీయం ,చేతిలో దర్భలకట్ట తో కనిపించేవారు .

  అన్నవరం వారి దేవస్థాన  సర్వీస్ లొ ఉన్న కపిలవాయి రామ శాస్త్రి గారిని  దేవస్థానం 2014 ఫిబ్రవరి-మార్చి లొ  నెల్లూరు జిల్లా మాదిరాజు గోడూరు గ్రామం లో జరిగిన ‘’వ్యూధ పౌండ రీకం ‘’కు సలహాదారుగా ఉండమని పంపింది దీనికి’’ యజమాని’’ కపిలవాయి రెండు చింతల కృష్ణ చయనులుగారు  .

  సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26

శ్రీ కపిలవాయి రామశాస్త్రి గారు

శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రిగారి రెండవ కుమారుడు సర్వ  స్వతంత్రుడుగా,ఆత్మ విశ్వాసం తో పెరిగారు . చాలా విశాలహృదయులు .అన్నగారితో కలిసి శ్రౌతకార్యాలకు అప్పుడప్పుడు వెళ్ళినా ,అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఆస్థాన  వేదపారాయణ విద్వాంసులుగా ఉన్నారు .చాలా వినయంతో ఉంటారు .అన్నగారు ‘’వెంకటేశ్వర చతుర్వేది ‘’అని బిజినెస్ కార్డ్ లు వేయి౦చు కొంటే ,దానికి భిన్నంగా ఉంటారు .అధర్వ వేదం లొబ్రాహ్మణాలు కూడా నేర్చి  ‘’త్రివేది ‘’అనిపించుకొన్నారు .1998లొ  అన్నవరం దేవాలయం దశావతారాలకు యజ్ఞం చేశారు .దీనికి రామ శాస్త్రిగారు అధ్వర్యులుగా వ్యవహరించారు .వెంకటేశ్వర్లుగారు మొదలైన చాలామంది ఆంద్ర దేశం లోని వేదపండితులు అగ్నిహోత్రాలలొ నెయ్యి,సమిధలు  వేసే పనిలో ఉన్నారు  .మధ్యలో వచ్చే ఖాళీ సమయాలలో అన్నదమ్ములిద్దరూ చేసే క్రియా పరమార్ధాన్ని  అందరికి  అర్ధమగునట్లు  వివరించేవారు .ఇద్దరికీ తండ్రిగారే గురువు అని మనకు తెలుసు .అన్నదమ్ములిద్దరికీ సమాన పారితోషికమే దేవస్థానం అందించింది .

కపిలవాయి వారి బజారులో శాస్త్రిగారు అయిదు అంతస్తుల సౌధం నిర్మించుకొన్నారు .ఇద్దరు కూతుళ్ళకు వివాహం చేశారు .కొడుకు అగ్ని హోత్ర శర్మ వీరితోనే ఉండేవారు .అయిదవ అంతస్తులో విలువైన 150ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భద్ర పరచారు .  సౌధం  20 14 కు అత్యంత ఆధునిక సదుపాయాలతో అమెరికన్ హర్మ్యం లాగా తయారైంది .శాస్త్రి గారికి 11 వ ఏట కాశి లొ ఉపనయనం జరిగింది .అన్నగారు వెంకటేశ్వర శాస్త్రి తైత్తిరీయం పూర్తీ చేసి ఘనం కాక ఋగ్వేదం లొ పడ్డారు .ఈయన అధర్వ వేదం దారిన పడ్డారు ..అన్నగారు అగ్నిహోత్ర పరికరాలను చూపించేవారు కాదు .వీరు మాత్రం  అతిధులు అడిగితె తమవద్ద ఉన్న ఆరణి,జుహు ,ఉపభ్రుత్ ,చమస మొదలైనవి  చూపెట్టేవారు.బ్రా హ్మలు కాని వారు తరులేవరైనా ఇంటర్వ్యూ చేయటానికి వస్తే భోజనానికి ఆహ్వానించేవారు సంభాషణ సమయం లొ టీ కాని కాఫీ కాని ఇచ్చేవారు ,అవసరమైతే అతిది ఉండటానికి సౌకర్యంకల్పించేవారు  .

వీరి సతీమణిశ్రీమతి బోనపల్లి మారుతిగారు భర్తకు సమానంగా వేదం శ్రౌతాలలో బాగా అవగాహన ,ఆకళింపు ఉన్నవారు .పురుషులతోపాటు వేదం, శ్రౌత చర్చలు చేసేవారు .వేదపండితుని కుమార్తె ,ఆహితాగ్ని అయిన తాతగారి ఇంట గుంటూరు జిల్లా రేపల్లె అగ్రహారం లో పెరిగారు.వెంకటేశ్వరగారి భార్యగారిదీ ఈ అగ్రహారమే .కపిలవాయి సోదరులు ఈమెతాతగారి శిష్యులే .గురువుగారింట్లోనే ఆరునెలలు ఉండి నేర్చుకున్నారు .వీరిలో తమ్ముడు రామశాస్త్రిగారికితన మనవరాలినిచ్చి శిష్యుడి వివాహం చేశారు గురువుగారు .16 వ ఏట భర్తతో కాశీలో కాపురం పెట్టినప్పటికే ఆమెకు శ్రౌతం లో ప్రక్రియలపై గొప్ప అవగాహన ఉండేది .కాశీలో మొదటి ఆరేళ్ళు యజ్న పాయసం మొదలైన అగ్నిహోత్రునికి నివేది౦ప బడినవి మాత్రమే భుజించేవారు.ఇందులో ఆమెకు సత్పుత్రుడు కలగాలనే తీవ్ర సంకల్పమూ ఉండేది .చాలామంది వేద పత్ని ల కంటే మారుతిగారు పూర్తిగా వైదిక జీవితానికే అంకితమై ఉన్నారు .శ్రౌతకర్మలలో ఏవైనా లోపాలు జరిగితే తప్పనిసరిగా చెప్పి సరి చేయించే నేర్పు ఆమెది .ఆమె గారి పరిశీలన అంత నిశితంగా ఉండేదని చెప్పుకొనేవారు .

2005లొ ఒక రోజు ఆమె తన విశాలభవనం లొ మూడునెలల మనవడిని ఉయ్యాల ఊపుతుంటే,ఒళ్ళంతా నలుగు పెట్టి తలంటి పోస్తుంటే   ఇరుగమ్మ ,పొరుగమ్మలు ఆశ్చర్యం గా చూసేవారు ..పిల్లాడు నడక మొదలుపెడితే ,అరికాళ్ళకింద అరిసెలు వేసి నడిపించారు .ఇవన్నీ చేస్తున్నా భర్తకు అగ్నిహోత్ర విధిలో యధావిధిగా సహకరించేవారు .అదే ఏడాది రామ శాస్త్రిగారు తిరుపతిలో జరిగిన ‘’పౌ౦డరీకం ‘’కు ‘’ఉద్గాత ‘’గా ఉన్నారు .చిన్ననాట,యవ్వనం లొ  ఎప్పుడో పౌండరీకం చూశారు.మళ్ళీ 25ఏళ్ళ తర్వాత ఉద్గాత గా ఆహ్వానిస్తే సమర్ధంగా చేయించగలనా అనే సందేహం వచ్చిందట  .ఆవిషయం వివరిస్తూ ఆయన ‘’దీర్ఘకాలం వ్యాధితో ఉన్నామా తాత గారు కలలో కన్పించి భయం లేదు బాగా చేయించగలవుఅని చెప్పారు .,కలలోనే దానికి సంబంధిన చార్టులను  ఏర్పాటు చేసే పనిలోపడ్డాను ,ఇంతలో గాలి వచ్చి వాటిని చెల్లా చెదురు చేసింది.  కంగారుపడ్డాను .’’వెతకండి వెతకండి ‘’అని అరిచాను .అప్పుడు ‘’అవి పొతే పోయాయి లే.వాటికోసం దిగులు పడకు ‘’అనే మాటలు వినిపించాయి .మానాన్న గారిని ‘’రేపు నేను ‘’పౌండరీకం’’ఎలా చేయించగలను “”అని అడిగాను . ఆయన ‘’భయపడకు .నేను నీ వెంట ఉంటాను ‘’అన్నారు .’’తెల్లవారి లేచిచూస్తే ఇదికలా నిజమా అని ఆశ్చర్యపోయాను ‘’అని చెప్పారు శాస్త్రిగారు .

అన్నదమ్ములిద్దరి మధ్యా పోలికలే ఎక్కువ .వెంకటేశ్వర్లుగారి ముగ్గురు కుమార్తెల వివాహాలు అయ్యాయి .పెద్దమ్మాయి సీతా నాగ లక్ష్మి కంప్యూటర్ సైన్స్ లొ డిగ్రీ పొంది,ఇంగ్లిష్ టీచర్ గా పని చేస్తూ గుంటూరుజిల్లాబాపట్లలోని వేదపండితుడుపవన కుమార శర్మతో   వివాహమైంది .సుందరి అయిన ఈమె అత్యద్భుత గాత్రం తో భక్తీ గీతాలను,మంత్రాలను సుస్వరంగా  ఆలపించే నైపుణ్యం కలది .ఈమెకంటే మూడేళ్ళ చిన్నదైన అగ్నివతి నాగలక్ష్మికి ద్రాక్షారామానికి వేదపండితునితతో వివాహం జరిగి బెజవాడ  లొ భర్తతో  కాపురం ఉంటోంది .చిన్నకూతురు స్వాహాదేవి కి 11 వ ఏటనే 1998లొ తూర్పుగోదావరి జిల్లాఏలేశ్వరానికి చెందిన  స్మార్త బ్రాహ్మణుడు,తండ్రిగారి శిష్యుడి కిచ్చి వివాహం చేశారు . వీళ్ళు మాత్రమే తూ .గో.జి  లో ఉంటున్నారు .

2005లొ పెద్దకుమార్తె సీతా నాగలక్ష్మి ,బాపట్ల శ్రీ భావనారాయణ దేవాలయం లొ వేదపండితుడుగా ఉన్న పవన్ కుమార్ దంపతులు తాము బాపట్లలో ‘’ఆధానం ‘’చేయ బోతున్నామన్న  కమ్మని వార్త తెలియ జేశారు .ఒక దశాబ్దం తర్వాత కూడా రామ శాస్త్రిగారు ఆ పని చేస్తారేమో అని ఎదురు చూశారు  .2016లొ శాస్త్రిగారు రిటైర్ మెంట్ సన్నాహం లొ ఉన్నారు .

1998మేనెలలో ఉపనయనం అయిన అగ్ని హోత్ర శర్మ అగ్నికార్యం చేశాడు .తండ్రిచాటున యవ్వన ప్రాదుర్భావంలోనే ఋత్విక్కుగా ఉన్నాడు..14వ ఏట  తొమ్మిదో క్లాస్ చదువుతూ,తైత్తిరీయంలొ పదపాఠం నేర్చాడు .తండ్రిఉద్గాతగా , బాబాయిహోతగా  తిరుపతిలో జరిగిన ‘’పౌండ రీకం ‘’లో’’ప్రస్తారుడు ‘’గా ఉన్నాడు .దీనికి ముందేఒక అగ్ని స్టోమానికి ‘’సుబ్రహ్మణ్యుని గా వ్యవహరించాడు .దీనితో శ్రౌతం లొ నిష్ణాతుడు అనిపించుకున్నాడు .2014కు బాపట్ల శంకర విద్యాలయంలో సామవేద ఉపాధ్యాయునిగా , అక్కడే యజుర్వేద పారాయణ కూడా చేసి మంచి కీర్తి సాధించాడు .రామ శాస్త్రిగారి శ్రౌత సంప్రదాయం కుమారుడికి ,,మనవడు మారుతి రామ యజ్నేశ్వరుని వరకు కొనసాగింది .ఇవీ  కపిలవాయి రామ శాస్త్రిగారి కుటుంబ విశేషాలు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-10-18-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25(శ్రీ శశికుమార్ పంపిన సవరణలతో )

శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారు

కపిలవాయి సోదరులు ఏడవ ఏటనుంచి 12 వ ఏట వరకు తండ్రితో ,మేనమామలతో కలిసి శ్రౌతకార్యాలకు వెళ్ళేవారు. 1953లొ పుట్టిన వెంకటేశ్వర శాస్త్రి   తైత్తిరీయ సంహిత అపస్తంభం తో పాటు నేర్చి12నుంచి 15వ ఏడు వరకు ‘’ఆధ్వర్యవ ‘’,’’హోత్రీయ ‘’,’’ఔద్గాత్రీయ కాండలను0అంగుళాల మ౦ద౦  ఉన్న  తాతగారు తెలుగు ,సంస్కృతాలలో రాసిన దాదాపు శిదిలావస్థలో ల ఉన్న తాళపత్రాలగ్రంథంలో ని ‘’శ్రౌతం ‘’ నేర్చుకున్నారు .తర్వాత ఋగ్వేదం ,సకల శాఖ ,ఆశ్వలాయన౦తో  అభ్యసించారు.ఆ తర్వాత అధర్వ వేదం ‘’శౌనిక శాఖ ‘’అధ్యయనం చేసి 27వ ఏట1979లొ పూర్తి చేశారు .వీరికి స్పూర్తి ల౦కావారు.సామవేదాన్నీ వదిలిపెట్టలేదు .మూడు పాఠ భేదాలున్న దానిలో కొన్ని భాగాలు నేర్చుకొన్నారు .

వీరి బాబాయి శ్రీ చిన్నరామ శాస్త్రి గారు సింహాచల దేవాలయం లొ రిటైరై ,వీరిని ఆ పోస్ట్ కు  సిఫార్స్ చేశారు .నిత్యమూ మహా పండితుని వలె ఋగ్వేదం వల్లే వేసుకొంటారు .19 ఏట శాస్త్రిగారికి శ్రీమతి అన్నదానం సీతామః లక్ష్మి గారితో వివాహం జరిగింది .ఈమె తెనాలిదగ్గర ఆర్యపాటి అగ్రహారం లోని వేదపండితుని కుమార్తె . భార్యతో సింహాచలం లొ కాపురము౦డి ,మగ పిల్లల కోసమని ఆశపడి వరుసగా ముగ్గురు ఆడపిల్లలను కన్నారు .చివరికి కోరిక నెరవేరి వరుస గా ఇద్దరు కుమారులు పుట్టారు   .కొడుకులను వెంట తీసుకొని 1922ఏప్రిల్ లొ సింహాచలం అప్పన్న దేవాలయానికి వెళ్ళేవారు .13 ,8 ఏళ్ళ వయసులో వారిదర్నీ బడి చదువు మాన్పించేశారు ‘’వాళ్ళకి స్టమేనా ‘’’’అని అడిగితే ‘’బోడి వాళ్ళఅంగీకారం ఎవడిక్కావాలి ?  పనిలేదు. నేను నిర్ణయించా.అలా జరగాల్సిందే ‘’అన్నారు మొండిగా .సోదరులిద్దరూ రోజూ ఉదయం 5 గంటలకే లేచి మూడవ కాండ రెండవ పన్నం  సంతను  5 గంటలపాటు చెప్పుకొంటు౦టే ,తండ్రిగారి పారాయణ పూర్తయ్యేది .,అగ్ని రామకుమార్ ,రామ యజ్నవరాహ నరసింహ మూర్తి లకు వరుసగా ఉపనయనాలు జరిపిచారు .అన్న వేదం నేరుస్తుంటే తమ్ముడు వింటూ ఉండేవాడు ‘’ఇలా చేస్తే రెండవవాడు నేర్వటం ప్రారంభించేనాటికి అనుభవం బాగా వస్తుంది ‘’అన్నారు తండ్రి .ఆరేళ్ళ తర్వాత ఇద్దరూ మళ్ళీ బడిలో చేరి పెద్దాయన  ఇంటర్ పాసై నేవీ లొ ఉద్యోగార్హత సాధిస్తే, తమ్ముడు టెన్త్ క్లాస్ లొ ఉండి,వేదం పూర్తి చేశాడు .

1998నాటికి వెంకటేశ్వర శాస్త్రిగారి ముగ్గురమ్మాయిలు సీతారామ లక్ష్మి ,సీతా మహాలక్ష్మి ,శ్రీదేవి లకు వివాహాలు అయిపోయాయి .సంతానవతులై తలిదండ్రులకు  మనవళ్ళు మనవరాళ్ళను అందించారు .పెద్దమ్మాయికి ఇద్దరాడ పిల్లలతర్వాత కవల మగపిల్లలు పుట్టారు .వీళ్లిద్దరిని అతిజాగ్రత్తగా పెంచి తమ అగ్ని హోత్రవిదులు అప్పగించారు .అతి పెద్దనగరమైన విశాఖ పట్టణానికి సింహాచల౦  అతి చేరువలో ఉండటం వలన ,ఋగ్వేద పఠనం లొ మంచి గుర్తింపు పొందినందువలన వెంకటేశ్వర శాస్త్రిగారి ఆదాయం చాలా బాగా ఉండేది .వేదపండితులలో మొట్ట మొదటి సారిగా మోటార్ సైకిల్, టి.వి. సెల్ ఫోన్ లను కొన్న ఘనులాయన .మధ్యతరగతి కుటుంబమైనా మంచి ఆధునిక వనరులతో సంతృప్తిగా సంసారం గడిపారు .

దురదృస్టవశాత్తు శాస్త్రిగారి భార్య సీతా లక్ష్మి గారు 49ఏళ్ళకే కేన్సర్ వ్యాధి తో 2010లొ మరణించారు.ఆమె మరణం శాస్త్రిగారికి ,పిల్లలకు అత్య౦త  బాదాకరమైంది .మళ్ళీ వివాహమాడకుండా,అగ్నిహోత్రం జోలికి వెళ్ళకుండా ఉన్నారు. ఆయన చిన్నతమ్ముడు రామశాస్త్రి కూడా అంతే .ఈయనకూడా బాబాయి ,తండ్రి గార్లలాగానే ఉండిపోయాడు .సాగారాంధ్ర లొ కుటుంబం  లొ యవ్వనం లొ ఉన్న వాడు మరణిస్తే అతనిభార్య ఆమె స్నేహితులు ,బంధుజనం ‘’గుండా గుండా ‘’అని ఏడవటం సంప్రదాయం .దీనిఅర్ధం అగ్నిగుండం లొ దూకాలని .అంటే సహగమనం చేయాలని భావం .కాని కాల౦ మారి ఇప్పుడెవరూ అలా చేయటం లేదు . చట్టం ఊరుకోదుకూడా .ఆహితాగ్ని భార్య మరణిస్తే అగ్ని హోత్రం ఆర్పేయటం  ,శ్రౌతకార్యాలు నిషేధించటం జరుగుతాయి.

వెంకటేశ్వర గారు తనజాతక రీత్యా ద్వితీయం రాసిపెట్టి ఉందని తెలుసుకొన్నారు .కాని వివాహం చేసుకొంటే రజస్వల కాని పిల్లనే చేసుకోవాలి .తనకు అప్పటికే 61,కొడుక్కి 35ఏళ్ళు కనుక అలా చేసుకోవటం భావ్యం కాదని, విరమించుకున్నారు .ఇంతలో వీరి కొడుకులిద్దరూ వేదం లొ సర్టిఫికేట్ పొంది తిరుపతి దేవస్థానం వారి వేదం పారాయణ కార్యక్రమ౦లొ నియోగి౦ప బడ్డారు .  రామ యజ్న శాస్త్రికి చిత్తూరు జిల్లా కాణీపాకం దేవాలయం లొ పారాయణ ఉద్యోగం లొ చేరాడు .ఈ దంపతులకు ఒక కొడుకు .రామ యజ్నేశ్వరుడు,తాతగారు ,గురువు అయిన వెంకటేశ్వర శాస్త్రి గారివద్దనే సింహాచల౦లొ ఉన్నాడు ;2014లొ ఉపనయనం అయింది .చిన్నతమ్ముడు రామకుమార్ ఋగ్వేద పండితుడైవిశాఖ పట్టణం లొ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం లొ పారాయణ ఉద్యోగం చేస్తున్నాడు .ఇవీ శ్రీ  కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారి  కుటుంబ విషయాలు,విశేషాలు .సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

సవరణ –శ్రీ శశికుమార్ పై వ్యాసం లో కొన్ని సవరణలు 2-11-18న పంపారు  వాటిని యధాతధంగా పొందుపరుస్తున్నాను- -గబ్బిట దుర్గాప్రసాద్ 3-11-18-ఉయ్యూరు

పెద్దలు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి నమస్కారములు!!

 

మీరు ప్రచురించిన కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25

శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారు

వ్యాసాంగంలో చిన్న సవరణలు చేయాలండి. ఈ క్రింది సవరణలు స్వయాన శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారి మేనల్లుడు శ్రీ పవనకుమార శర్మబాపట్ల భావనారాయణ స్వామి దేవాలయ వేదపండితులు గారు నాకు స్వయంగా పంపించారు.

సవరణ 1: – వీరి సంతానం

మొదట ఆడపిల్ల అనంతరం మగపిల్లవాడు పునః ఇద్దరు ఆడపిల్లలు,మరల మగపిల్లవాడు.ఇది పిల్లల వరుస.

సవరణ 2: – వీరి విద్యాభ్యాసం

ఋగ్వేదమూలం, యజుర్వేదక్రమాన్తం,

అథర్వవేదమూలం, సామవేదం యజ్ఞభాగం ఆంధ్రగానంవరకు అధ్యయనం, ఆంగ్లంలో BA డిగ్రీని కూడా పొందనారు.

సవరణ 3: – వీరి పునర్వివాహంలో చేసిన కల్పన (ఊహ)

పునర్వివాహ ఆలోచన విషయం ఊహాజనితమే.

 

దయచేసి మీ వ్యాసం సరిచేయమని మనవి.

 

భవదీయుడు

 

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26



I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శిష్యుడి ఉత్తరం

శిష్యుడి ఉత్తరం

ఆర్ ఎస్ ఎస్ రఘుప్రసాద్ అనే ఆతను నా శిష్యుడనని ఉత్తరం రాస్తూ ”కృష్ణా జిల్లా కవుల”గురించి రాయమని కోరాడు . చాలామంది రాసే ఉన్నారు . నేను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు . ఎవరి దృస్టి పడనీ వారి గురించే నా తాపత్రయం . అర్ధం చేసుకొంటాడని భావిస్తా అతని కార్డును జత చేశా చదవండి -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24

బ్రహ్మశ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్ర శాస్త్రి గారు (1909-1983)

కాకినాడకు చెందిన కాశ్యప గోత్రీకులు  బ్రహ్మశ్రీ  కపిలవాయి వెంకట సోమ యాజులు ,సుబ్బలక్ష్మీ సోమి దేవమ్మ దంపతులకు అయిగురు పుత్రులు ,ముగ్గురు పుత్రికలు .వీరి పెద్దకుమారుడు పెద్ద రామ శాస్త్రి (1889-1987)గారు 98సంవత్సరాలు జీవించారు .అరుదైన వేదపండితునిగా గణనకెక్కారు.వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయారు .కనుక త్రేతాగ్నులలో ఒకే ఒక అగ్ని హోత్రాన్ని ఆరాధించారు.రెండవ కుమారుడు చిన్న రామ శాస్త్రి గారు (1904-85) కూడా గొప్ప వేదపండితుడే.వివాహమాడి గ్రాహ్యపత్యాగ్ని మాత్రమే చేశారు.కాని తండ్రిలాగా త్రేతాగ్నులను ఆరాధించలేదు .ఈయన బాబళ్ళశాస్త్రిగారికి సమకాలీనుడు .మూడవ కుమారుడు జన్మించిన తర్వాత నాలుగవ పుత్రుడు శ్రీ యజ్ఞేశ్వర శాస్త్రి గారు జన్మించారు .ఈయనే మన కథానాయకులు .

యజ్ఞేశ్వర శాస్త్రిగారు అన్నగారు పెద్ద రామ శాస్త్రి గారి వద్దనే వేద౦ నేర్చారు.వీరు అన్నివిధాల తండ్రికి సరిజోడు . దక్షిణ భారత దేశం లో వీరికి మించిన వేదపండితులు, శ్రౌతం కార్య నిర్వాహకులు  లేరని పించుకొన్నారు .అనేక ప్రముఖ పట్టణాలలో తమ విద్వత్ ప్రదర్శన చేసి గొప్ప ప్రశంసల౦దుకొన్నారు .పర్య వేక్షణలో ,ఆర్ధిక ప్రోత్సాహమివ్వటం లో ,పదోన్నతిలో ,కార్య నిర్వహణలో ఆయనకు సాటి మరెవ్వరూలేరు .కాని చిన్నన్నగారు చిన్న రామ శాస్స్త్రి గారిలాగా ‘’ఆధానం ‘’చేయలేదు.కనుక అగ్ని స్టోమంకూడా లేదు .చెయ్యాలనే కోరికలేకకాదు కాని ,సోదరుల అనాసక్తి వలనమాత్రమే .పెద్ద అన్నలిద్దరూ త్రేతగ్నులను చేయనట్లే ఈయనా చేయలేదు .దీనికి బదులు సరిసాటిలేని శ్రౌతి అనిపించుకొన్నారుఆధునిక  దక్షిణ భారత చరిత్ర లో .

ఆహితాగ్ని కుటుంబం’’వేదం లో ఉన్నాం ‘’అని  చెప్పినట్లుగా చేయటానికి సరైన గురువు ప్రోద్బలం కూడా అవసరం .ధర్మ శాస్త్రం చెప్పిన  ‘’పరీస్ట’’అంటే పెద్దవారిని అధిగమించి తాను చేయటం అనే సందిగ్ధం కూడా తోడైంది .కనుక అన్నగార్ల అనుమతి పొందాల్సి ఉంది .పెద్దన్నగారు దారిచూపి ఉంటె తనకు ఈ ధర్మ సంకటం రాకపోయేదికదా .అప్పుడుతాను కర్మాదికారి యోగ్యతపొందేవాడినికదా అని వితర్కి౦చు కొన్నారు .వారితో సహపంక్తి భోజనానికీ అర్హత లేదు .కనీసం చిన్నన్న అయినా మనసుమార్చుకొని  అగ్ని స్టోమం చేసి ఉంటే తనకీ తిప్పలుండేవి కావు .ఎప్పుడూ తోడి పెళ్లి కొడుగ్గా ఉండటమే తప్ప పెళ్లి కొడుకు పాత్ర రావటం లేదని బాధ పడేవారు అంటే యజ్ఞం లో యజమాని అయ్యే అవకాశం కోల్పోతున్నానని భావం .కనుక యజ్ఞా యాగాలకు అధికారి ,పర్య వేక్షకులుగా ఉండి’’యజ్ఞేశ్వర అగ్ని హోత్రి  ‘’అని పిలిపించుకోవాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు .అంతేఇక తిరుగు లేదు. ఈ రంగం లో తనకు మించిన వారెవరూ లేరనే స్థాయి సంపాదించి’’ యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి’’ అయ్యారు .

ఆరవ ఏటనే ఉపనయనం జరిగి,పెద్దన్నగారివద్ద’’తైత్తిరీయ౦’’నేర్చారు .ఒకరకంగా అరుదైన బాలమేధావి (wunder kind )అని పించారు .25-1-1984న  యజ్ఞేశ్వరుల మరణం తర్వాత రెండు నెలలకు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఆయన ఫోటో ప్రచురించి ఆయనగురించి అత్యద్భుతంగా రాసింది –దాని సారాంశం తెలుసుకొంటే వారి ప్రతిభ మనకు అవగతమవుతుంది .

’’12వ ఏటనే యజ్ఞేశ్వర శాస్త్రిగారు వేద,వేదాంగాలలో , విద్యారణ్య  భాష్యం లో ,షట్ శాస్త్రాలలో వీటికి మించి శ్రౌతం లో అపార జ్ఞాన సమన్నులవ్వటం ,అన్నీ నాలుకమీద నర్తిస్తున్నట్లు గోచరించటం చూసి ఇరుగూ,పొరుగూ వారు ఆశ్చర్య చకితులై కళ్ళు అప్పగించి చూసేవారు .16వ ఏటమొట్టమొదటి సారిగా  ఒక యజ్ఞాన్ని పర్యవేక్షించారు .తర్వాతకుంభ కోణం లోని  కంచికామకోటి పీఠం గురుకులం లో చేరారు .అక్కడ నేలమాళిగలో ఉన్న, అక్కడ స్థానిక వేదపండితులకు అవగాహన లేని    మూడు తాళపత్ర గ్రంథాలనువెలికి తీసి ,వాటిలోని రహస్యాలను వెతికి రాసి ,లోకానికి తెలియ జేసేవరకు విశ్రమించలేదు .అంతటి కఠోర దీక్ష ఆయనది ‘’.అనిఆయన ప్రతిభను  ఆవిష్కరిస్తూ రాసింది .

ఈ అసాధారణ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిసింది శాస్స్త్రి గారిపై .దీనితో వారికి వేదవిజ్ఞానం పై విపరీతమైన మక్కువ ఏర్పడింది .జీవితా౦త0 ఉత్తమ గురువుల ,అత్యుత్తమ గ్రంథాల అన్వేషణలోనే ఉన్నారు .గ్రంథాల ఆచూకీకోసం  భార్యతో ,ఇద్దరన్నగార్లతో కలిసి రైళ్ళు బస్సులలో ప్రయాణం సంపాదించేవారు .ఒక్కోసారి వీరంతా అనేక మైళ్ళుసాదువులు లాగా  నడిచి వెళ్ళాల్సి వచ్చేది .ఈ ప్రయాణాలలో వారి ఆహారం వేరుసెనగకాయలు, జీడిపప్పుమాత్రమే .వీరి అన్వేషణ ఎక్కడైనా గొప్ప వేదపండితులవద్ద అరుదైన శాస్త్ర గ్రంథాలున్నాయా , శ్రౌత కార్యాలకు ఇంకాఎవైనా  నిర్దుష్ట పద్దతులున్నాయా అని తెలుసుకోవతానికే .ఒక్కోసారి పీఠాధిపతులను సందర్శించి  సంభాషించి విషయ సేకరణ చేసేవారు  .తన ముఖ్య స్నేహితుడు రెండు చింతల యాజులుగారితో ,గోదావరి డెల్టాలోని మరికొందరు పెద్దలతో సమావేశమై చర్చించేవారు .అది ఆయనకు బాగా  గుర్తింపు పొందిన కాలం .ఈనాడు వేదపండితులు మొదలైనవారు రైళ్ళలో బస్సుల్లో టాక్సీలలో ప్రయాణాలు చేస్తుంటే ఆనాడు వారు యెంత శ్రమ పడ్డారో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది .

ఈ వేద అన్వేషణ శాస్త్రిగారి నడి వయస్సుపై  దాకా సాగింది .యాభై వయేట ఆయనకు  ‘’శుక్ల యజుర్వేద వాజసనేయ సంహిత’’ కాశీలో ఉన్నట్లు తెలిసింది.అప్పటికే సూర్యాస్తమయ ,అధ్యయనకాలం రాత్రి  8గంటలకు విశ్రమించాల్సిన సమయం .ఆయన ముఖ్య గ్రంథం’’ఆపస్తంభ శ్రౌత సూత్రం ‘’దీన్నే శ్రౌతం అంటారు .ఆయనకు అత్యంత ఇష్టమైనది ‘’పౌ౦ డరీకం ‘’  .ఇదిఒక రకమైన ‘’అగ్ని చయన౦’’.ఆంద్ర దేశమంతటా ఆచరించేది .దీన్ని వారు గోదావరి కృష్ణా ,కావేరీ ప్రాంతాలలో ,రామేశ్వరం దాటి  శ్రింగేరి ,కంచి ,తిరుచినాపల్లి లలో దక్షిణాన,  ఉత్తరాన బదరీనాద్ ,ఢిల్లీ ,కాశీ ల లో కూడా పర్య వేక్షకులుగా ఉంటూ నిర్వహించారు .

తైత్తిరీయ సంహిత ఆయనకు అభిమానమైనదే అయినా ,ఆయనకు సామవేదం మీదా అత్యంత ఆదరణ ఉండేది .యుక్త వయసులో విజయనగరం లో ‘’రనయానియ ‘’విధానాన్ని అధ్యయనం చేశారు .తర్వాత ‘’కౌతుక పధ్ధతి ‘కంచిలో ’నేర్చారు .’’జైమినీయ పధ్ధతి’’పై ఆసక్తిలేదు .పై రెండుపద్ధతులలో తేడాలు పెద్దగాలేవని అందరూ అంటున్నా శాస్త్రిగారికి వీటిలోని సూక్షం భేదాలను గుర్తించే సామర్ధ్యం ఉండేదని వారికుమారులు చెప్పారు .ఈ భేదాలే శ్రౌతకుటుంబాలలో 20వ శతాబ్దం లో   చీలికలకు దారితీసింది .

అధర్వ వేదం విషయం లో డెల్టాలో ఒకటికంటే ఎక్కువ పంక్తులలో దాట వేతలున్నాయి.శ్రీ తంగిరాల బాల గంగాధర శాస్త్రిగారు  ,.యజ్ఞేశ్వర శాస్త్రిగారికి   కపిలళేశ్వర పురం లో ఋగ్వేదం నేర్పారని లంకావారు తెలియ జేశారు .శాస్త్రిగారు నేర్చుకొని ఋగ్వేదం బోధించారుకూడా .త౦గి రాలవారు కాశీలో అధర్వ వేదాన్ని ప్రత్యేక విధానంలో  ఉదయం వేళమాత్రమే  ఒక కుండలో ఉన్న అగ్ని హోత్రాన్ని శిరసు పై ఒక తడిగుడ్డపై   ఉ౦చు కొని  ‘’అగ్ని వ్రతం ‘’గా అభ్యసించారు .శిష్యుడు యజ్ఞేశ్వర శాస్త్రిగారు కూడా ఇదే పద్ధతిలో నేర్చుకొన్నారు .

1975లో యజ్ఞేశ్వర ,మహాలక్ష్మి దంపతులు విజయవాడ కృష్ణలంకలో స్వగృహం నిర్మించుకొని ,ఆంద్ర దేశమంతా సంచారం చేస్తూ జీవితం గడిపారు .తర్వాత నేదునూరు లో జరిగిన ‘’వాజపేయం ‘’కు యజ్ఞేశ్వర శాస్త్రిగారు ,లంకావారు పర్యవేక్షకులుగా ఉండి నిర్వహించారు .74వ ఏట బ్రహ్మశ్రీ యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి గారు యజ్ఞపురుషుని లో లీనమయ్యారు  .ఆంధ్రదేశమేకాదు , యావద్భారత దేశం కూడా ఒక మహా శ్రౌతిని ,మహనీయ వేదపండితుని కోల్పోయింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-18-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

1-

 

.

 



Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

 331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007)

డా||జి.ఎం.రామశర్మ

అసంఖ్యాక కవులకు, అవధాని పుంగవులకు పుట్టినిల్లయిన ఉమ్మడి మెదకు జిల్లాకు చెందిన సమ్మత సాహితీ కిరణం గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ మాగాణంలో 20వ శతాబ్దికి చెందిన తొలి ద్వ్యర్థి కావ్యకర్త ఆయన భవ్యకీర్తి అజరామరం. కమనీయ శ్లేష యమక కవితా కలాపాలతో,రమణీయ గీర్వాణాంధ్ర భాషలలో తలస్పర్శియైన పాండితీ ప్రకర్షతో, రసిక స్తవనీయ సరసావధాన సల్లాపాలతో నాలుగు దశాబ్దాల పాటు సారస్వత ప్రియులను సముల్లాస పరచిన మహనీయ మనీషి గౌరీభట్ల వారు. వృత్తి పౌరోహిత్యమైనా సాహిత్య సౌహిత్యాలే ప్రవృత్తిగా గలిగి వెలిగిన నిరాడంబర వ్యక్తి, కవితా శక్తి రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ తల్లికి అపురూపమైన అక్షర సృజనల నీరాజనాలిచ్చిన విద్వత్కవి తల్లజుడాయన. ఆ తేజోమూర్తి జీవన సౌరభాలను పంచే ప్రయత్నమే ఈ వ్యాసం.

రామకృష్ణ శాస్త్రి కాళయుక్తి నామ సంవత్సర ఆశ్వయుజ పౌర్ణమి (1919 సం.) రోజున చిలుకమాంబా నారాయణ శాస్త్రి పుణ్యదంపతుల వంశ సపన్మణిగా జన్మించారు. ఇప్పటి సిద్ధిపేట జిల్లాలోని తొగుట మండలంలోని వెంకట్రావుపేట వీరి స్వగ్రామం. స్వయంగా అష్టావధాని, సంస్కృత భాషా కోవిదుడు అయిన తన తండ్రి నారాయణ శాస్త్రి వద్ద బాల్యంలో ప్రాథమికంగా అమరకోశం, శబ్దమంజరి, రఘువంశం మొదలైన వాటిని అభ్యసించిన రామకృష్ణ కవి. సికింద్రాబాదులోని మున్నాలాల్‌ సంస్కృత పాఠశాలలో తన తదనంతర విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. అక్కడ వారి ప్రధాన విద్యాగురువులైన తూములూరు శివరామకృష్ణ శాస్త్రి వద్ద, సిద్ధాంత కౌముది, అలంకార శాస్త్రం కావ్య నాటకాలను చదువుకున్నారు. తండ్రి నుండి అనువంశికంగా అలవడిన కవితా కళతో అటు గురువుల దృష్టిని ఇటు తోటి విద్యార్థుల మనస్సులను ఆకర్షించారు రామకృష్ణ శాస్త్రి. విద్యా వ్రతాన్ని పూర్తి చేసుకున్న గౌరీభట్ల సగౌరవంగా సుశ్లోకులైన తన గురువును ఈ క్రింది శ్లోకంలో శ్లేషయుక్త పదాలతో కీర్తించారు.

శ్లో|| కృష్ణప్రేమ్ణి సుభాషిణే చ కలయ న్నీలాంశుకం సద్వ్రజే
యోవైక్షాంతిషు కుంభజాతమతమః ప్రాప్త్యాం స్వశిష్యావనే
సత్త్రాణే కుముదాత్మ సంపది హరిశ్చంద్రః స్వయం సూనృతే
తం వందే శివరామ కృష్ణ విదుషం తూమ్లూరువంశ్యం గురుం

ఇందులో తన విద్యాగురువును పలుకుల లాలిత్యంలో శుకమహర్షితోను, రామ చిలుకతోను, రేపల్లిలోని బలరామునితోను, సహనంలో భూమితోను, శిష్యరక్షణలో ద్రోణాచార్యునితోను, సాధుజన రక్షణలో విష్ణువుతోను, కలువలకు కళా సంపదను ప్రసాదించడంలో చంద్రునితోను, సత్యం పలకడంలో హరిశ్చంద్రునితోను సారూప్యం చేసి ఉల్లేఖాలంకార సంకలితంగా ప్రశంసించడం చాలా ఉదాత్తంగా ఉంది. గురువును ఇలా తనివిదీర శ్లాఘించిన వినయశీలియైన శిష్యరత్నానికి విద్య కరతలామలకమవడం విస్పష్టం. శ్లేషయమక కవితా విన్యాసాలు ఈ కవి దిగ్గజానికి వప్రక్రీడలు. ఇందుకు మాఘకావ్యం తనకు మార్గదర్శకమని ఆయన చెప్పేవారు.

శతావధాని, విద్యోపాసకులు విఠాల చంద్రమౌళి శాస్త్రి (చుంచన కోట) ఆధ్యాత్మిక గురుత్వంలో రామకృష్ణ కవి కవితలకు దేవతాబలం తోడై క్రొత్త కోమలత సంతరించింది. దాని అవధాన కళ మొగ్గతొడిగింది. ఆ పరంపరలో సికింద్రాబాదులోని కన్యకాపరమేశ్వరీ ఆలయం వారి తొలి అష్టావధానానికి వేదికైంది. వారు 1940 నుండి 1980 వరకు తెలంగాణలోని సికింద్రాబాదు, వేములవాడ, నిజామాబాదు, వరంగల్లు, యాదగిరిగుట్ట, సిద్ధిపేట, మెదక్‌, నాచారంగుట్ట మున్నగు వివిధ ప్రాంతాలలో 45 వరకు అష్టావధానాలు చేసి విద్వదవధానిగా వర్తమాన అవధాన కవులకు మార్గదర్శకులయ్యారు. తెలంగాణ మాగాణంలో అవధాన భారతిని అవిశ్రాంతంగా నాట్యమాడించిన గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ వీరి శిష్య రత్నమే. వీరి ఇద్దరు కుమారులు డా|| జి.యం. రామ శర్మ (శతావధాని), డా|| జి. రఘురామశర్మలకు కూడా వారే అవధాన గురువుగా కావడం వివేషం.

రామకృష్ణ శాస్త్రి తన నూనూగు మీసాల నూతన యౌవనంలో (25వ ఏట) యాదాద్రి దేవస్థానంలో ఆశు కవితా ప్రదర్శన నిచ్చి అప్పటి ఆస్థాన పరీక్షక పండిత వర్గ మైన మల్లాది దక్షిణా మూర్తి, ఖండవల్లి నరసింహ శాస్త్రి, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి (పంచ సహస్రావధాని), కాసుల నృసింహ సోమయాజులు, అన్నావఝుల నృసింహావధాని, వంగీపురం నరసింహాచార్యులు మొదలగు విద్వాంసుల చేత లిఖిత పూర్వకంగా ‘కవి శార్దూల కిశోర’ బిరుదాన్ని అందుకున్నారు. అది వారి ప్రతిభకు సువర్ణ కిరీటం తొడిగిన రోజు (చిత్రభాను నామ సం|| మార్గశీర్ష పూర్ణిమ)

ఆయన రచించిన ఏకవీర కుమారీయమను రెండర్థాల కావ్యానికి దేవీ భాగవతం, కుమార సంభవం ఆధార గ్రంథాలు. శ్రీ మహావిష్ణు కుమారుడైన ఏకవీరుని కథను (దేవీభాగవతం) పార్వతీ పరమేశ్వరుల కొడుకైన కుమారస్వామి కథను ఈ కావ్య వస్తువుగా గ్రహించి ప్రతిపద్యంలోను హృద్యంగా రెండు కథాంశాలను అనుసంధానిస్తూ కావ్య సవ్యసాచిత్వాని సాధించారు శాస్త్రి. మచ్చుకు ఒక్క పద్య పారిజాతాన్ని ఇచ్చట పరిశీలిద్దాం.

”అచ్చటి నగరామల సత్వమ ! యిదమిత్థ
మనగరాదు, గన్పట్టు నెందును గనుగొన
నందు నమదమరాళీ సమాగమములు
శుక ముఖోద్గత శ్రుతిహిత సూక్తి కళలు”

ఈ పద్యంలో ఏకవీర కథా భాగ పరంగా వైకుంఠాన్ని కుమార స్వామి, కథాంశ పరంగా కైలాసాన్ని కవి అభివర్ణించాడు. ఆహా ! ఆ వైకుంఠ నిర్మల శోభ (నగర+అమల సత్వమ!) ఇంతా అంతా అని చెప్పరానిది. ఎక్కడ చూచినా శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ ఉండే అమర (దేవతల) సమూహాలే (నమత్‌+అమరాళీ సమాగమములు) కనిపిస్తున్నాయి. ఎక్కడ విన్నా శుకాది మునులచే వివరించబడిన వేదవిహిత భక్తి పరిమళోక్తులే (శుకముఖోద్గత శ్రుతి హితసూక్తి కళలు) వినిపిస్తున్నాయి. అని వైకుంఠ వర్ణన సంపన్నమైంది.

ఆహా! ఈ కైలాస పర్వత శోభ (నగ రామ లసత్వమ!) వర్ణనాతీతం. ఎక్కడ చూచినా మందించిన నెమళ్ళ గుంపులే (అందున మద మరాళీ సమాగమములు) కనిపిస్తున్నాయి. ఎక్కడ విన్నా రామచిలుకలచే వెల్లడి చేయబడిన చెవుల కింపగు పలుకుల కళలే (శుక ముఖ+ఉద్గత శ్రుతిహిత సూక్తి కళలు) వినిపిస్తున్నాయి. అని కైలాస వర్ణన సంఘటించింది. ఇలా పద్యంలోని మొదటి, మూడవ పాదాల్లో శబ్దశ్లేష, నాల్గవ పాదంలో అర్థశ్లేష చమత్కార భరితమై చమక్కుమంటున్నాయి. ఇదే రీతిలో ఈ ద్వ్యర్థి కావ్యంలో పరమహిమాలయము (పరమ హిమాలయము, పర మహిమాలయము), సహజపావని (సహ జపావని, సహజ పావని), ఈ శుభవనము (ఈశు భవనము, ఈ శుభ వనము) భ్రమరహిత (భ్రమ రహిత, భ్రమర హిత), మున్నగు పదాల శబ్దల శ్లేషలు, సుమనః పుంజము (దేవతా బృందము, పుష్ప సముదాయము), నీలకంఠ (శివుడు, నెమలి) మొదలైన పదాల అర్థశ్లేషలు సుధీవరులైన చదువరులను ఆకట్టుకొంటున్నాయి.

విశేషమేమంటే కావ్యం ఇంత శ్లేషమయం అయినప్పటికి పద్యాలు లేశమాత్రమైనా క్లేశమయం కాక నిరర్గళ ప్రవాహతుల్యమై సాగాయి. సుందర ప్రబంధశైలీ బంధురమైన ఈ కావ్యాన్ని కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాచ్య విద్యావిభాగం తెలుగు పిడిసి కోర్సు పాఠ్యాంశంగా (సుమారు మూడు దశాబ్దాల క్రితం) ఏర్పరచి ఈ కావ్యపు విలువను గుర్తించడం ప్రమోదప్రదం. ఈ ద్వర్థి కావ్యంతో పాటు శ్రీరామకృష్ణ కవి కవన బృందావనం పేర శ్రీ శివ యశోదుతిః, భారత సంగ్రహః, మున్నగు కావ్య ఖండికలను, శ్రీ గోపబాల మానస పూజా, చుంచన రాజరాజేశ్వరీ స్తవము (ఆశువుగా రచించినది) మొదలైన రచనలను చేసి సాహిత్యారామాన్ని సంపన్నం చేశారు.

వివాహాది కార్యక్రమాల్లో ఆశీర్వచనంగా వారు చెప్పే శ్లోకాలు, పద్యాలు కూడా శ్లేష చిత్రాలతో పరిమళించేవి. ఏ సమావేశాల్లోన యినా వారి చుట్టూ చేరి కూర్చున్న వారికి పసందయిన కవిత్వపు విందునందించడం ఆయన నైజమై ఉండేది. ఆయన చిత్ర కవిత సహృదయులకు గిలిగింతలకు గలిగించేదిగా ప్రసరించేది. మచ్చుకు రెండు మూడింటిని ముచ్చటిస్తాను.

శ్లో|| భారోంతరే ‘సు’ వర్ణశ్చే ద్భాసురః స్యాత్తనూమతాం
తదేకాభావతః సమ్య క్సచ భారాయ కల్పతే

భావం :- భారములో (భారః+అంతరే) అనగా బరువైన మూటలో సువర్ణం (బంగారం) ఉన్నచో ఆ భారము (సు అను వర్ణం మధ్యలో చేరడం వల్ల) భాసురమగును అనగా ప్రకాశవంతమగును. ఆ భారము మధ్యలో సువర్ణం (బంగారం/సు అను అక్షరం) లేనిచో అది కేవలం భారముగానే మ్రోతకోలుగా మాత్రమే మిగులుతుందని మనో రంజకమైన చిత్రశ్లేష ఇక్కడ ప్రదర్శింపబడింది.

ఇట్లే మానవ దానవ శబ్దాలను చమత్కార సమున్మేషంగా ఉపయోగిస్తూ వారు చెప్పిన ఈ దిగువ శ్లోకాన్ని పరికిద్దాం.
సర్వదా మద సంబంధాత్‌ మానవో దానవో భవేత్‌
సర్వదా దమ సంబంధా దానవో మానవో భవేత్‌

భావం :- మద సంబంధం వల్ల మానవుడు దానవుడవుతాడు దమ(మనో నిగ్రహం) సంబంధం వల్ల దానవుడు కూడా మానవుడవుతాడు – అని సామాన్యార్థం. లోతుగా విచారిస్తే – మ కార స్థానంలో దకారం వచ్చి చేరడం (మద సంబంధం) వల్ల ద కార స్థానంలో మకారం వచ్చి చేరడం వల్ల (దమ సంబంధం) దానవ పదం మానవ పదంగా మారుతుందని శాబ్దిక చమత్కారం ఇక్కడ స్పష్టమవుతుంది.

ఒకసారి అష్టావధానం చేస్తున్న సందర్భంలో అప్రస్తుత ప్రసంగం చేసే ప్రాశ్నికుడు శాస్త్రిని వరునికి వానరునికి తేడా వివరించండని అడగ్గా ఆయన అద్భుతంగా శ్లోకపాదరూపంలో ఈ విధంగా సమాధానమిచ్చారు.

”నరశ్చ వానరశ్చైవ వాలోపయుత ఏవచ”
వానరుడు (కోతి) తోకతో కూడిన వాడు (వాల+

ఉపయుతః) ఇక నరుడేమో వా-లోపయుతుడు. అనగా వానర శబ్దంలో ఉండే ‘వా’ అను అక్షరం లేనివాడని సమన్వయం (నరునికి వానరుని శబ్దపరంగా ‘వా’ అనే అక్షరమే తేడా). ఇటు వంటి పదాల మెరుపులు వారి అవధానాలలో శ్రోతలను మైమరపించేవి.

వారు చేసిన అష్టావధానాలు రాశిలో తక్కువైనా వాసిలో మిన్న. సంస్కృతంలోను తెలుగులోను అవధానాలు చేసిన దిట్టమైన కవి దిగ్గజం శాస్త్రి. వారి అష్టావధానంలో నిషిద్దాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఛందోభాషణ చదరంగం, వ్యస్తాక్షరి, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలుండేవి. వారి అవధాన పద్య పూరణలలోని నైపుణాన్ని రేఖా మాత్రంగా దర్శిద్దాం.

1970 సం||లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్ధిపేటలో అష్టావదానం చేసినప్పుడు ఒక ప్రాశ్నికుడు ”శంకరుడెత్తె వెండిమల శైలతానూభవ తాపమందగన్‌” అను అసంగతమైన సమస్యనీయగా రామకృష్ణ శాస్త్రి దాన్ని అవలీలగా పూరించి పరాశరం గోపాల కృష్ణమూర్తి వంటి ఆనాటి సభలోని విద్వాంసుల మన్ననలందుకున్నారు. ఆ పూరణ ఈ విధంగా ఉన్నది.

ఉ|| పంకజ సూతిచే వరము బాపురె పొందుచురావణుండికే
ణాంక కిరీటు గొల్చి వరమంది ప్రహమతికై కటా సురల్‌
జంకగ, శంకరుండుమను జంకను బెట్టుచు జంక, లోకనా
శంకరుడెత్తె వెండిమల శైలతనూ భవ తాపమందగన్‌

ఇందులో బ్రహ్మచేత వరాన్ని పొంది గర్వంతో రావణ బ్రహ్మ కైలాస పర్వతాన్ని కదిలించిన సన్నివేశాన్ని కన్నుల ముందుంచాడు కవి. సమస్యలోని శంకర పదానికి పైన ‘నా’ చేర్చగా రావణ పరంగా లోకనాశంకరుడు (లోకాలను నాశనం చేయువాడు) అను అర్థం ఏర్పడి ఆ సమస్య చక్కగా పరిష్కరించబడింది.

మెదకులో జరిగిన మరొక అవధానంలో వారికి దత్తపదిగా పూరి, సాంబారు, ఉప్మా, వడ – పదాలిచ్చి భారతార్థం వచ్చేటట్ల పూరించుమనగా ఈ క్రింది పద్యం జాలువారింది.

మ|| ఇన పుత్రాదులెదో సెబాసన జనాసృక్పూరితో గ్రాహవా
వనికిన్‌ దింపకు బావ! చూడుమిల సాంబారూఢి భీష్మించి, పా
వని కేల న్గద ద్రిప్పి, క్రీడి తన చాపమ్మూని బాణాగ్ని రా
ల్చిన నాడా ఉపమన్యు వయ్యు నెవడాలించున్‌ త్వదార్తధ్వనుల్‌

శ్రీ కృష్ణుడు దుర్యోధనుణ్ని హెచ్చరిస్తున్న సన్నివేశాన్ని వర్ణించే పై పద్యం రమణీయ రసమందిరమై, సుకుమార పద సుందరమై అందాలతో సందడి చేస్తున్నది. ప్రత్యేకంగా వివరిస్తే కాని తెలియనంతగా దత్తపదులు పై పద్యంలో మెత్తగా ఒదిగి పోయాయి.

నాచగిరి దేవస్థానంలో జరిగిన అష్టావధానంలో గౌరీభట్ల సత్యనారాయణ శర్మ ప్రాశ్నికుడుగా ఉంటూ ఖరారే, హరారే, మురారే, పరారే అనే దత్తపది నిచ్చి విష్ణుపరంగా పూరించుమనగా శాస్త్రి స్పందించి ఆ పదాలను శ్లోకంలో ఇమిడించి రసరమ్యంగా అందించారిలా…

శ్లో|ఖరారే!మహీజామనశ్చౌర్యసూరే -హరారే-స్సుమేషోఃస్వయంస్యాఃపితారే !
మురారేసదతాపసాంతసశౌరే!పరారేత పాణే! నమో హృత్పురారే !

ఖరుడనే రాక్షసునికి విరోధివైన, సీతాచిత్తాన్ని అపహరించుటలో ఆరితేరిన పండితునివైన, శంకరుని శత్రువైన మన్మథునికి తండ్రివైన, అహరహమూ మునుల మనస్సులలో విహరించే వాడవైన, హృదయంలో పదిలంగా పరమ శివుణ్ణి భద్ర పరచుకున్న వాడవైన (హృత్పురారే!), చక్రపాణివైన (పర+అర+ఇతపాణే) ఓ మురారీ! నీకు నమస్కారము – అని ఆ శ్లోకంలోని సుకుమార సురభిళ భావం. ఇక్కడ విశేషించి ప్రాశ్నికుడిచ్చిన పదాలను క్రమంగా శ్లోకంలోని ప్రతిపాదంలోని ఆదిలో ప్రయోగించి వాటికి సమాంతరంగా ప్రతిపాదాంతంలో అంత్యప్రాసను జోడించి శోకానికి ఇంపును,మంచి ముక్తాయింపును కలిగించిన వైనం శ్రోతల్ని ముగ్ధుల్ని చేస్తున్నది.

వారు బంధ కవిత్వంలో కూడా తన ప్రజ్ఞా సమున్మేషాన్ని ప్రదర్శించారు. గవాక్ష, నాగ, ఛురికా, పద్మ, చక్ర బంధాలను వారత్యంత నిపుణంగా సంధించారు. కవి స్వదస్తూరితో ఏర్పరచిన ఈ నాగ బంధ చిత్రాన్ని చిత్తగించండి!

శ్రేష్ఠమైన ఆకారం కలిగిన, తెల్లని దేహవర్ణం కలిగిన ధీరులకు సౌఖ్యాన్నిచ్చే మహిమగలిగిన, శ్రీ కృష్ణునికి ప్రీతి గలిగించుట్టి ఓ పూరారీ! (శివా!) నీవు నాకు ఆనందాన్ని కలిగించు ! అని ఆ శ్లోక భావం.

32 అక్షరాల అనుష్టుప్పు శ్లోకమది. మెలికలు తిరిగిన ఆ నాగబంధంలో 28 అక్షరాలు నేర్పుతో కూర్పు చేయబడినవి. శ్లోకంలో రా,మ,కృ,ష్ణ అను అక్షరాలకు పునరావృత్తి ఉన్నది. కాబట్టి ఆ అక్షరాలను బంధంలోని 4 సంధి స్థానాలలో (కర్ణికలు) ఏర్పరచడమైనది. సంధి స్థానాలలోని ఆ ఆక్షరాలు కవినామం (రామకృష్ణ) కావడం ఒక విశేషం. శ్లోకాదిలోని శ్రీకారం నాగబంధంలో తల (పగడ) భాగంలో, శ్లో అంత్యాక్షరమైన ‘రు’ వర్ణాన్ని తోక భాగంలోను సంధించడం మరొక విశేషం. ఇలాంటి బంధ కవిత కూర్చడాని కవికి అసమాన శబ్ద శక్తి అనితర సాధ్య భావయుక్తి అవసరం.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి (నాంపల్లి) హైదరాబాదు ప్రతిభా పురస్కారం, మౌళిత్రయ స్మారక పురస్కారం (సిద్ధిపేట), డి.ఎ.ఎల్‌.ఎన్‌. మూర్తి స్మారక పురస్కారం రామకృష్ణ శాస్త్రిని వరించి వారి ప్రతిభకు గుర్తింపునిచ్చాయి. తన రచనల ఆనవాళ్ళను ఈ సాహితీ కేదారంలో ఉంచి 2007 సం||లో శాస్త్రిగారు కీర్తి శేషులయ్యారు.

ఆధారం –తెలంగాణ మాసపత్రిక(అక్టోబర్ 2018) లో డా.జి .ఏం .రామ శర్మగారి ‘’కవి శార్దూల కిశోర ‘’గౌరీ భట్ల ‘’వ్యాసం

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు
జీవితం
చక్రపాణి రంగనాథుడు తొలి జీవితంలో వైష్ణవుడు. ఇతను మత విషయంలో పాల్కురికి సోమనాథునితో వాదన పడుతుంది. శివుడు కాని వాడిని కంటితో కూడా చూడను అనే నియమం ఉండటం వల్ల తెరచాటున ఉండి సోమనాథుడు, తన కుమారుడయిన చతుర్ముఖ బసవేశ్వరుణ్ణి ముందు ఉంచుకోని వాదనలో పాల్గొంటాడు. ఇద్దరికీ గొప్ప వాదన జరిగింది, రంగనాథుడు ఓడిపోతాడు! పరాజయ దు॰ఖంతో ఇంటి దారి పట్టి దారిలో వచ్చిన శ్రీశైలంశ్రీశైల మల్లిఖార్జునుడిని దర్శించుకోలేదట! దానితో రంగనాథుని రెండు కళ్ళు పొయినాయట! అహోబిళంలోని నరసింహస్వామిని ప్రార్థిస్తే ఆ స్వామి కలలో కన్పడి శివుని గొప్పదనాన్ని చెపితే సిగ్గుతో శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుణ్ణి పూజిస్తాడు. అప్పుడొక కన్ను వస్తుంది, తరువాత సోమనాథున్ని క్షమాపణ వేడుకుంటే రెండవ కన్ను వచ్చిందట! ఈ వృత్తాంతం మొత్తం కన్నడ పుస్తకం అయిన సోమనాథపురాణం (రచన: విరక్త తొంటెదార్యుడు) నందు వివరింపబడినది.

ఇతనికి కన్నులు ఓ సారి పొయి మరల వచ్చినట్టు ఇతని రచనల ద్వారా కూడా రూఢీ అవుతుంది.

ఇతను రచించిన కంటి రగడనందు:

నయముగా నయనములు నా కీయ బొడగంటి

భయభక్తు లీ భర్గు పాదములు పొడగంటి

అని చెప్పినాడు.

సోమనాథునితో వాదన కూడా నిజమే అని ఈ దిగువ పంక్తులు రూఢీ చేస్తాయి.

త్రిభువనము భక్తులకు దృణకణములని కంటి

సభలందు భక్తులకు జయవాద మని కంటి

రచనలు
1. శ్రీశైల మల్లికార్జునుని పేర 500 సీస పద్యాలు.

2. శ్రీశైల మల్లికార్జునుని పేర 8000 పద్యాలున్న మరో గ్రంథం

3. వేయి పాదాలు గల దండకం, శ్రీశైల మల్లికార్జునునిపైనే

4. ఒక తారావళి

5. నాలుగు లయగ్రాహులు

6. ఒక వృత్తశతకం

7. వేయి దోధకవృత్తాలు

8. నూరు తోటకవృత్తాలు

9. ఏడు రగడలు

10. 3000 మత్తకోకిలలు

11. 600 గీతపద్యాలు

12. 8 మంజరులు

13. 500 కందాలు

14. 36 గద్యలు

15. 36 ఉభయ శతకాలు

ఈ కృతులన్నీ ఇప్పుడు దొరకవు, కానీ ఇన్ని వ్రాయడానికి కారణం మాత్రం తెలుస్తుంది! కళ్ళు పొయి వచ్చిన తరువాత తన ఎత్తు కృతులు సమర్పిస్తానని మొక్కుకున్నాడట! దానికే ఇలా వందలూ వేలూ పద్యాలు రచించినాడట. ఇతని నయన రగడ నుండే మరి కొన్ని లైన్లు – ఈ మొక్కు గురించి వివరిస్తూ:

ఇంక శ్రీగిరి జేర నేగందు నని కంటి

కరుని కృపవడయ సమయ మిది యని కంటి

నికను నాయెత్తు కృతు లిత్తునని పొడగంటి

క గృతుల్ చెప్ప నా కేమి భయమని కంటి

డి గృతుల్ నాయెత్తు వచ్చునని పొడగంటి

మృడు డింక నా కృతుల్ మెచ్చునని పొడగంటి

రంగనాథ రామాయణం కర్తా?
కొంతమంది రంగనాథ రామాయణం కూడా చక్రపాణి రంగనాథుడే రచించినాడని భావిస్తూ వచ్చారు, కానీ రాంగనాథ రామాయణంలోనే ఈ గ్రంథాన్ని గోన బుద్ధభూపతి తన తండ్రి పేరుమీదుగా రచించినట్లు చెప్పినాడు. అందువల్ల ఈ చక్రపాణి రంగనాథుడు రంగనాథ రామాయణాన్ని రచించలేదు అని చెప్పవచ్చు

ఆధారం –తెలుగు వీకీ పీడియా

మీ- గబ్బిటదుర్గాప్రసాద్ -24-10-18-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి 

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి

      తెలుగు సాహిత్యంలో విశేష పరిశ్రమ చేసి అజ్ఞాతంగా పరుగునపడిపోయిన కవులెందరో వున్నారు. వారిలో అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి ఒకరు. వీరికి తెలుగు సాహిత్య క్షేత్రంలో రావలసినంత పేరు ప్రతిష్టలు రాలేదు సరికదా చరిత్రకారులు ఆయనను పూర్తిగా విస్మరించడం గమనార్హం.
ఆధునిక యుగాంధ్ర సారస్వత స్రష్టలలో, ద్రష్టలలో బహుముఖ ప్రజ్ఞాదురంధరులలో ఈయన విద్వత్క విరత్నము. రసజ్ఞ విమర్శక తర్నము. నిరంతర సాహితీ తపస్వి. బహుభాషా కోవిదులు.
ఆంధ్రలో పుట్టి తెలంగాణలో స్థిరపడి ప్రాంతీయ భేదాలకు అతీతంగా తెలుగు జాతికి వెలుగు బాటగా ‘సాహితీ మేఖల’ అను సాహిత్య సంస్థను నల్లగొండ జిల్లా చండూరులో స్థాపించి తమ జీవితకాలమంతా ఈ సంస్థకే అంకితం చేసి తెలంగాణలో ఎందరో కవుల రచనలను సాహితీ ప్రియులకు అందించిన సహృదయ సాహితీమూర్తి.
అంబటిపూడి సాహిత్యం గద్య పద్యాత్మకమై హృద్యంగా వుంటుంది. భాషాదృష్టితో పరిశీలిస్తే ఆంధ్రరచనలు, సంస్కృత రచనలు, ఆంగ్ల రచనలు, అనువాద రచనలుగా వర్గీకరించవచ్చు.
1857లో నానాసాహెబ్‌ కూతురైన మైనాను ఆంగ్ల ప్రభుత్వం సజీవంగా కాల్చిన గాథను ఇతివృత్తంగా ‘మైనాదేవి’ అనే చక్కని పద్య కావ్యాన్ని సృష్టించారు. ఈ కావ్యం చాలామందిలో దేశభక్తిని ప్రబోధించింది. ‘సంధ్యా విద్య వీరి హిందూత్వాభిమానానికి గొప్ప ప్రతీక. విదేశీయ గాధలను కూడా రాయడం ఈ కవి సమదృష్టిని సూచిస్తుంది. ఇలాగే వీరు తమ రచనా వ్యవసాయంలో ఎన్నో ప్రయోగాల ప్రక్రియలు చేశారు. ముఖ్యంగా వందలాది వ్యాసాలు, ఉపన్యాసాలు, కావ్యాలు, నాటకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, శాస్త్రీయ గ్రంథాలు, ఆంగ్ల – సంస్కృత గ్రంథాలు, లఘుగ్రంథాలు, అనువాద కావ్యాలు, శతకానువాదాలు మొదలైన రచనలు చేసినప్పటికీ చరిత్రకారులు ఆయనను విస్మరించడం గమనార్హం. వీరు ఆనాడు పేరు ప్రతిష్టల కోసమూ, సంపద కోసమూ, అవార్డుల కోసమూ ఎప్పుడూ పాకులాడలేదు. కొందరికి అవి అయాచితంగా వస్తాయి. మరికొందరికి ప్రయత్నించినా రావు. ముఖ్యంగా ఆనాడు అంబటిపూడికి దక్కాల్సిన జ్ఞానపీఠం మరొకరి వశమైంది.
అంబటిపూడి ప్రౌఢకవి. వీరి కవిత్వాన్ని రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా మొదలైన వారు ప్రశంసించి చక్కని పీఠికలు రాశారు. అయినప్పటికినీ వీరు అజ్ఞాతంగానే ఉండిపోయారు.
జీవితానికి ఒక లక్ష్యం వుంటుందని, ఆ లక్ష్య సాధన కోసం సాహిత్యం ఒక చక్కని ఉపకరణమని విశ్వసించి చిత్తశుద్ధితో చివరిక్షణం వరకూ నిలిచిన ఆదర్శమూర్తి అంబటిపూడి.
‘ఈ తెలుగు నాలుకనిచ్చిన మీ రుణమ్ము ధాత్రి సకలమిచ్చినప్పటికీ తీరదు’ అని తమ గురుభక్తిని వేలూరి శివరామశాస్త్రికి చాటిన విద్వత్కవి అంబటిపూడి. తెలుగు సాహిత్యంలో ఆయన ఒక మరుగున పడిన మాణిక్యం. సుమారు 60కి పైగా రచనలు (సాహిత్య గ్రంథాలు) రచించిన అంబటిపూడిని నేడు తెలంగాణ సాహిత్యకారులు ప్రస్తావించక పోవడం ఎంతో విచారకరం.
సాహిత్య సేవ కోసం ఆయన మనసు తపన పడింది. సాహిత్యసేవతో పాటు సమాజ సేవ కూడా చేయాలని ఆయన హృదయం ఆరాటపడింది. పల్నాడంతా కాలి నడనక తిరుగుతూ తెలంగాణ ప్రాంతమైన నల్లగొండ జిల్లాలోని చండూరు గ్రామం చేరి అక్కడ దరిద్రనారాయణ సేవా సమితి పేరుతో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. సాహిత్య సేవతో పాటు కృష్ణభక్తి ప్రబోధం, హరిజనులకు విద్యాదానం, పేదలకు వస్త్రదానం, అన్నదానం ఆయన ఆశ్రమంలో సాగి ప్రాచీన గురుకులంగా ప్రసిద్ధి చెందింది. కులమతాలకు అతీతంగా ధనిక, పేద తారతమ్యం లేకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం, రావి నారాయణరెడ్డి సహకారంతో హరిజన పాఠశాలను స్థాపించడం లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ”కల్లొద్దురా బాబు కల్లొద్దురా” వంటి గీతాలు పాడి మధ్యపానం నుండి ఎంతో మంది అమాయకులను విముక్తుల్ని చేశారు.
చండూరులో ఆయన నాటిన మొక్కే ‘సాహితీ మేఖల’. నేడది శాఖోపశాఖలుగా విస్తరించి శతాధిక గ్రంథాలను ప్రచురించి గొప్ప సాహితీ క్షేత్రంగా విరాజిల్లుతుంది.
అంబటిపూడి రచనలు :
ప్రణయవాహిని (1936), మైనాదేవి (1941), మొరాన్‌కన్య (1941), వత్సలుడు (1941), వనవాటి (1941), చంద్రశాల (తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు 1951), ఇంద్ర ధనువు (1951), దక్షిణ (నాటకం 1943), ఏకాంకికలు (1950), సంధ్యావిద్య (1955), కృష్ణకథ (1958), వివేక శిఖరాలు, తర్కభాష, కథావళి, తాత్విక తరంగాలు, ఇందిరా విజయమ్‌ (తెలుగు, సంస్కృతం 1972), ఓటర్ల కొకమాట, మధుర యాత్ర, గోపీకావ్యం (1984), శాంతి తీరాలకు, ప్రభుసప్తతి, భారతీయ సంస్కృతి (1973), గుంటూరు కాలేజి శతావధానం, బ్రహ్మ సూత్రములు, షడ్దర్శనములు, క్యావ మణిహారం, రత్నకవి అనువాదలహరి, సంధ్యావందనము, వ్యాస తరంగాలు మొదలగునవి.
ధర్మజనిర్వేదంలాంటి ఖండకావ్యాలు కవికి ఇతిహాస, వాఙ్మయంపైగల అధికారానికి గీటురాళ్ళు. బెర్నార్డ్‌షా, కీట్సు, షెల్లీ వంటి ఆంగ్ల కవుల రచనలు తెలుగువారికి పరిచయం చేశారు.
అంబటిపూడి తన 63వ ఏట నల్లగొండలోని గీతా విజ్ఞాన ఓరియంటల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి ఎందరో విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
వివేకానందుడు పేర్కొన్నట్లు “Have an eastern heart and western mindµ” అనే భావానికి అంబటిపూడి ప్రతీకగా నిలుస్తారు. అంబటిపూడి భారతీయ సంస్కృతిని పాఠకలోకానికి అందించడానికి ‘తాత్విక తరంగాలు’ అన్వేషించి, వివేక శిఖరాలు అధిరోహించి 75 సంవత్సరాల కాలంతో పాటు ప్రయాణించి శాంతి తీరాలకు చేరారు.
– పున్న అంజయ్య, 9396610639

నిరంతర సాహితీ సేవలో కవి'రత్నం'
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సత్యదుర్గేశ్వర కవులు

సత్యదుర్గేశ్వర కవులు
సత్యదుర్గేశ్వర కవులు అనే పేరుతో జంటగా రచనలు, శతావధానాలు చేసినవారు వేదుల (ద్వివేది) సత్యనారాయణశాస్త్రి మరియు చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. వీరు 1935-1940 మధ్యకాలంలో జంటగా అనేక అవధానాలు చేశారు[1].

వేదుల(ద్వివేది) సత్యనారాయణశాస్త్రి
ఇతడు 1915, జూలై 11వ తేదీన ఫ్రెంచి పాలనలో ఉన్న యానాంలో జన్మించాడు. ఇతని తండ్రి ద్వివేది నారాయణశాస్త్రి పండితకవి. సత్యనారాయణశాస్త్రి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క స్కూలు ఫైనలు పరీక్ష పాసై ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించాడు. ఇతడు తిరుపతి వేంకటకవులలో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి మేనకోడలి కుమారుడు.

చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి
ఇతడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రెండవ కుమారుడు. ఇతడు రాజమండ్రి సమీపంలో ఉన్న కడియంలో 1920 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించాడు. ఇతడు బాల్యం నుండే కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. ఇతడు తన తండ్రి వద్ద వెంకయ్య వ్యాకరణం, బాలవ్యాకరణం, సిద్ధాంతకౌముదిలో పూర్వార్థం, మేఘసందేశం, నాటకాలు చదువుకున్నాడు. కడియంలోని సంస్కృత పాఠశాలలో పాలంకి గంగాధరశాస్త్రి వద్ద శబ్దమంజరి, రఘువంశం, కుమారసంభవాది గ్రంథాలను అధ్యయనం చేశాడు.

అవధాన ప్రస్థానము
ఈ ఇద్దరు కవులూ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి నుండి ఉత్తేజాన్ని, స్ఫూర్తిని పొంది “సత్యదుర్గేశ్వర కవులు” అనే పేరుతో జంటగా అవధానాలు చేయడం ఆరంభించారు. వీరు పెనుగొండ, ఆలమూరు, ఏలూరు, పెదపాడు, జగ్గయ్యపేట, నందిగామ, నేలకొండపల్లి, సూర్యాపేట, హైదరాబాదు, సికిందరాబాదుమొదలైన అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాలలో పలు అష్టావధానాలు, శతావధానాలు చేసి ప్రసిద్ధి చెందారు. ఈ జంటకవులు చేసిన అవధానాలలో నిషిద్దాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, వ్యస్తాక్షరి, కావ్యపాఠము, ఆకాశపురాణము, ఆంధ్రీకరణము, క్యారమ్స్ ఆట మొదలైన అంశాలు ఉండేవి.

అవధానాల నుండి ఉదాహరణలు
ఈ అవధానుల పూరణలు కొన్ని మచ్చుకు:

· సమస్య : తన సుతు గూడి గర్భమును దాల్చెనదేమని చెప్పనక్కటా

పూరణ:

తన కిక వంశనాశనము తప్పనిదేమొ! యటంచు నెంచి పు
త్రుని మది నెంచె సత్యవతి; తోడన వ్యాసుడు వచ్చి నిల్వ దా
సిని నియమించె నంబికయు చెప్పినట్టుండగ నఁద్ది వ్యాసు, శం
తను సుతు గూడి గర్భమును దాల్చెనదేమని చెప్పనక్కటా

· వర్ణన: కాఫీ

పూరణ:

వీడన్ జేయును బద్దకమ్మును మనఃప్రీతిన్ బొనర్చున్ బయిన్
బాడున్ జేయును దేహదార్ఢ్యమును జేవల్‌గుల్కు కంఠానకున్
గోడున్ గీడొనరించు నాఁకలికి నెగ్గున్ గూర్చు కాఫీని యె
వ్వాడున్ వర్ణన జేయలేఁడు నిజమీ వాక్యమ్ము లాలింపుడీ!

· దత్తపది: మరపు – వెరపు – కరపు – చెరపు అనే పదాలతో

పూరణ:

మరపొకయింతలేక జనమాన్యధురీణుఁ డజాతశత్రుడే
వెరపున సర్వరాజ్యమును వీడి ప్రవాసమిహైక కోటికిన్
గరపిన మాడ్కిఁజేసి బహుకష్టములన్ విసువందకుండనే
చెరపును లేక రాజ్యరమ చెందెనో? ధర్మమనంగ నట్టిదే?

రచనలు
ఈ కవులు జంటగా ఈ క్రింది గ్రంథాలను రచించారు.

1. భావలహరి (ఖండకావ్యము)

2. రమాదేవి (ఐదంకముల నాటకము)

3. శాంతి సమరము (ఏకాంక నాటకము)

4. రత్నేశ్వర ప్రసాదనము (ఆంధ్రీకరణము)

5. ప్రణయ స్వైరిణి

6. ఆంధ్ర ప్రతిష్ఠ[2](కావ్యము)

7. అవిమారకము – నీతిగీత

సత్యనారాయణశాస్త్రి విడిగా ఈ క్రింది గ్రంథాలను వ్రాశాడు.

1. స్వరాజ్య సమరము (నాటకము)

2. మహాకవి కాళిదాసు (రెండు భాగములు విమర్శ)

3. ఆత్మకథ (గాంధీజీ జీవిత చరిత్ర – సంస్కృతములో)

4. నాటకరచన (పరిశోధన గ్రంథం)

5. సంస్కృత కవులు (విమర్శ)

6. భారతజ్యోతి (ఆంధ్రీకరణము)

7. ఆంధ్ర సేనాని (రూపకము)

8. వ్యాస మంజూష

ఇక దుర్గేశ్వరశాస్త్రి విడిగా

1. ధరణికోట (నాటకము)

2. వేంకటేశ్వర సర్వస్వము (అనువాదము)

3. ప్రణయ కంకణము (అనువాదము)

4. మణిమేఖల (అనువాదము)

5. దుర్గాదాసు (అనువాదము)

6. భారతేతిహాసము

7. తిరుపతి వేంకట కవుల కవితా ప్రతిభ మొదలైన గ్రంథాలను రచించాడు.

ఆధారం –రాపాకవారి రచన, వీకీపీడియా

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23

1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు -3(చివరిభాగం

పట్టి సీమ శ్రీ వీర భద్ర స్వామి దేవాలయం లో ఒక శివరాత్రి రోజు సుమారు రెండు వ౦దలమంది వేదపండితులు వేద పఠన సమావేశం లో మిత్రనారాయణగారు పాల్గొని ,వారి సామర్ధ్యాన్ని అంచనా వేశారు .స్వస్తి వచనం నిర్దుష్టంగా చెప్పగల వేరొక ఆరుగురి ని ఆహ్వానించి స్వస్తి చెప్పించి ఘనంగా వారికి పారితోషికాలు ఇప్పించారు .మరొక సారి దువ్వూరి యాజులుగారి బదులు మిత్రనారాయణగారు వేద విద్యార్ధులను పరీక్షించే బోర్డ్ లో సభ్యులుగా ఉన్నప్పుడు ప్రధమ,ద్వితీయ,తృతీయ  శ్రేణి విద్యార్దులను  ఎంపిక చేయమన్నప్పుడు’’ఇందులో శ్రేణి అంటే ఏమిటి ?వందమంది వీళ్ళు వేర్వేరుప్రాంతాలనుంచి వచ్చారు .వీరిలో ఏ ఒక్కరినో ఎంపిక చేసి క్లాస్ ఇవ్వటం కుదరదు .వీరెవరూ పాస్ కు అర్హులుకారు .అందుకని నేను ప్రేక్షక పాత్ర వహించి మిగతా  సభ్యుఅలనే  నిర్ణయించమని చెప్పాను ‘’అన్నారు .వేదసంస్కృతం గురించి మాట్లాడుతూ ఎవరికీ సరైన అవగాహన లేదన్నారు .మిత్రనారాయణగారు  ప్రాచీన సంప్రదాయ పరిరక్షకులలో ఒకరే కాక  ,ఆధునికకాలం లో జరుగుతున్న అనర్దాలపై మంచి విమర్శకులుకూడా .

  ఈ నాటి వేదవిద్యార్ధులు ఇంగ్లిష్ కూడా నేర్వటాన్ని ‘’హూణ విద్యా ప్రవేశం తో వేదం ,శ్రౌతం భ్రస్టు పట్టాయి .వైదిక జీవితం కనుమరుగైంది అందులోని ఆత్మదెబ్బతిన్నది .ఇది హూణ విద్య కాలం .వేదం లో నిష్ణాతుల తరం గడిచిపోయింది  సరైన రుత్విజులు లేరు .ఉన్నవారికి సాధికారత లేదు .ఇప్పుడు జరుగుతున్న శ్రౌతకార్యాలన్నీ రసహీనమే ‘’అంటారు .  దక్షిణాదికి పర్యవేక్షకునిగా వెళ్ళటాన్ని గురించి మాట్లాడుతూ ‘’ఉద్దేశ్యాలు పవిత్రంగా లేనప్పుడు ,అక్కడ జరిగే క్రియలూ సత్ఫలితాలనివ్వవు .చెరుకు గడ నుంచి తీసిన రసం రుచికాని , దాని పిప్పి నుంచి తీస్తే రాదుకదా ‘’అన్నారు .కృష్ణాజిల్లాలో యజ్ఞయాగాదులు చేయించేవారు డబ్బు గుంజటం మీదనే దృష్టిపెట్టటం బాధాకరం అంటారు .

  మిత్రనారాయణ గారి ఆహితాగ్ని తండ్రి గారు 1989లో చనిపోయినపుడు ‘’బ్రహ్మ మేధం ‘’చేయటానికి ,సమర్ధులు ,నిష్ణాతులైన వారిని పిలిపించటం చాలా కష్టమైంది .ఆయనకు అత్యంత ఆప్తుడు స్నేహితుడే నిర్దాక్షిణ్యంగా ‘రావటానికి నిరాకరించాడు .అప్పుడు ‘’వాళ్ళు దీనికి వస్తే తాము కూడా చస్తామన్న భయం ‘’అని దెప్పారు .తానే పుస్తకం దగ్గర పెట్టుకొని బ్రహ్మమేధం చేశానని గర్వంగా చెప్పారు మిత్రనారాయణగారు .’’బ్రహ్మ మేధం లేని అన్త్యేస్టి కుక్కగతే’’అన్నారు .ధర్మ శాస్త్రం పై అంతటి అపార విశ్వాసం ఆయనకు .

  1988లో బాబళ్ళ శాస్త్రి గారు డెల్టాలో శ్రౌతకర్మలు ఇంకో పదేళ్ళు మాత్రమె జరుగుతాయిఅని చెప్పారు .దాదాపు ఆయన అన్నట్లే జరిగింది .శతాబ్దం చివరలో బులుసు కామేశ్వర సోమయాజి ,మిత్రనారాయణగారు  మళ్ళీ అగ్నిహోత్రం ప్రారంభించాలని నిర్ణయించారు .అగ్నులన్నీ ఆరిపోయాయి .సంతృప్తిగా ఆధానం చేయటానికి ఇద్దరికీకుదరలేదు .లంకావారి అల్లుడు మిత్రనారాయణగారు లంకావారు ,దువ్వూరి వారు లాగా పాతతరానికి చెందినవారే .పంచాంగాలను బట్టే నడిచేవారు. చెప్పటం కూడా తెలుగు సంవత్సరాల పేర్లతోనే అంటే నందన శర్వరి మొదలైన పేర్లతో నే గత చరిత్ర గుర్తు చేస్తారు .దువ్వూరి యాజులు గారిలా శ్రౌత విద్యనూ కులవిద్యగా భావించారు .ఇంటికి అతిదులెవరైనా వస్తే భార్య అనసూయగారు మనవరాలు కాఫీ లేక టీ లుఇచ్చి మర్యాద చేస్తారు .మిత్రనారాయణ,అనసూయ దంపతులకు 13మంది మనవలు మనవరాళ్ళు .ఆయన గదిలో 200 ఏళ్ళనాటి తాళపత్ర గ్రంథాలున్నాయి.వీటిలో కొన్ని వేదపండితులైన ఆయన తాతగారు రాసినవికూడా ఉండటం విశేషం . ఆహితాగ్ని గారైన తండ్రిగారికి వారినుంచి ఈయనకు తరతరాలుగా సంక్రమించి గ్రంథ నిధి.ఒక సారి విసుగుపుట్టి దేశం లో ఈ ప్రాంతంలో మిగిలిఉన్న వైదిక శ్రౌతిఅనిపించుకోవటం ఇష్టం లేకపోయింది .అందుకే దానినుంచి విరమించారు. కాని ఒకసారి ఎవరో ఫోన్ చేసి ఫోన్ లో వేద పఠనంవినిపించమని బ్రతిమిలాడారు కానీ ఇష్టపడలేదు . ఆయన స్నేహితుడి బలవంతం పై పఠనం  చేసి ,యెలాఉ౦దని  ఆయన్ను అడిగితే రికార్డింగ్ చాలా అద్భుతంగా వచ్చిందని సంతోషంగా చెప్పారట .ఫోన్ చేసినాయన వెయ్యిన్నూట పదహారు రూపాయలు గౌరవ పారితోషికంగా పంపాడు .అప్పుడు  ‘’ఎంత ఉత్కృష్టమైన ది ఈ వేదవృత్తి ?రోజుకో ఫోన్ కాల్ ఇలా వస్తే చాలు సంతోషంగా ఉంటుంది ‘’అన్నారు ఆనందంగా బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు.

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22

1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు -2

తన’’ సర్వతో ముఖ యాగం ‘’గురించి మిత్రనారాయణ గారు ‘’సర్వతో ముఖ౦ అయ్యాక నాకు శ్రౌతం అంటే విరక్తి కలిగింది .’’అన్నారు .అందుకనే చాలా ఏళ్ళు శ్రౌతాలకు ,,రుత్విక్కులపై  పర్య వేక్షకులుగా ఉన్నారు .1998లో ఆయన విశిష్టమైన 8 పౌండరీకాలకు,2 వాజ పేయాలకు బ్రాహ్మ లేక ఆధ్వరులు పై పర్య వేక్షకులుగా ఉన్నారు .చాలా వాటికీ అంటే నక్షత్రేష్టి,,పంచ రత్న యాగం లలో  ఉద్గార్ గా, హోత గా మచిలీపట్నం మొదలైన చోట్లఉన్నారు .చివరికి 2005 జనవరి చివరలో విజయవాడ లో జరిగిన పౌ౦డరీకానికి బ్రహ్మగా ఉండి 75ఏళ్ళ మిత్రనారాయణ బాగా అలసిపోయి ,కాకినాడ వచ్చి విశ్రాంతి తీసుకొన్నారు .

కాకినాడలో ఏడేళ్ళు నిత్యాగ్ని హోత్రం చేసి ,ఆతర్వాత స్వస్తి పలికారు .మళ్ళీ అగ్రయనం ,శ్రావణ పశు ,దర్శ ,పౌర్ణమాస  క్రతువుల్లో ప్రాయశ్చిత్తం జరిపి పునః అగ్ని హోత్రం చేశారు .మంచి ఇల్లు కట్టుకొనే సంకల్పం తో కూడా కొంతకాలం ఆపేశారు .చివరకు కాకినాడ సమీపం లో విశాలమైన గృహం నిర్మించుకొని గృహపవేశం చేశారు . కానీ అగ్ని హోత్రం జోలికి పోలేదు .దీనికి కారణాలు చాలాఉన్నాయి అగ్నిహోత్ర౦ గది పూర్తికాకపోవటం ,భార్య ఆరోగ్యం బాగులేకపోవటం ,ఇష్టి నిర్వహణకు తగినంత ఋత్విజులు లభ్యం కాకపోవటం .

 

కాకినాడటౌన్ విపరీతంగా పెరిగిపోయి కోనసీమ అగ్రహారం  ఒంటరిదైపోయింది .వేదపండితులు విద్యార్ధులు క్రమంగా తగ్గిపోయారు .1988లో ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వందేళ్ళు జీవించి మరణించాక కాకినాడ లో వైదిక విద్యకూడా దూరమైందని మిత్రనారాయణ అన్నారు .1992లో ఒక రిటైర్ ఇంజనీర్ కు రోజుకు ఎనిమిదిగంటలు వేదం నేర్పారు .తైత్తిరీయ సంహిత నాలుగవ కాండ క్రమ పాఠంలో ఉండగా ,మిత్రనారాయణ గారుకళ్ళు మూసుకొని తన్మయంతో  సంత చెబుతుంటే , ఆ 60ఏళ్ళ ఇంజనీర్ విద్యార్ధి పుస్తకం చేతిలో పెట్టుకొని బిగ్గరగా వల్లెవేస్తుంటే ,ఆయనకు తన తండ్రి గారివద్ద యాభై ఏళ్ళక్రితం వేదాధ్యయనం చేసిన రోజులు గుర్తుకొచ్చేవి. ఈ సన్ని వేశాన్ని ఆంగ్ల దొరకు తెలియ జేస్తుంటే ,ఒక్క అక్షరం కూడా మారకుండా ఇంతకాలం వేదం ఎలాకాపాడబడిందో అర్ధమై ఆనందంతో కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి .తర్వాత కాకినాడ బయట ఒక వేదపాఠశాల వెలిసి౦ది .అయితే దానికి శ్రౌతం లో నిష్ణాతులెవరూ ఉపాధ్యాయులు లేరు .వారి అభ్యర్ధన మేరకు మిత్రనారాయణగారు 10-12ఏళ్ళ వయసుగల అయిదుగురు విద్యార్ధులకు  తైత్తిరీయ సంహిత లోని ఆధాన ,అగ్ని స్టోమ,అగ్ని చయన భాగాలను నేర్పారు .

మధ్యవయసులో మిత్రనారాయణగారు అందంగా  స్పురద్రూపిగా ,మామగారు లంకావార౦త  ఎత్తుతో ,చెవులకు  స్వర్ణకుం డలాలతో వాద ప్రతివాదాలలో చేతులూ ,తలా ఊపుతున్నప్పుడు ఆ కుండ లాలు కూడా ఊగుతూ, స్వర్ణ కా౦తులను వెదజల్లేవి  1992ఏప్రిల్ లో కాకినాడలో ఆయనకు రాజమండ్రిలోని  వేద భాష్య ప్రవీణులు శ్రీ రేమెళ్ళసూర్య ప్రకాశ అవధాని గారు ముఖ్య అతిధిగా  గొప్ప సన్మానం జరిపారు ,మామగారు లంకావారు వృద్ధాప్యం తో ప్రయాణం చేయలేక రాలేక పోయారు .మిత్రనారాయణగారికి చాలా సన్మానాలు ,పట్టా ప్రదానాలు జరిగాయి .అందులో ముఖ్యమైనవి మద్రాస్ ,కంచి ,తిరుపతి ,రాజమండ్రి ,ఢిల్లీ వి సుప్రసిద్ధమైనవి .సత్కార సమ్మానాలంటే చివరికి విసుగనిపించేది ‘’మీకు సన్మానం చేస్తాం ,మీతో ఫోటో దిగుతాం ,మీ విగ్రహం పెడతాం ‘’అని చాలామంది ఉవ్వి ళ్ళూరించే వారని చెప్పారు .వీటివలన అంకిత భావం ,ఆత్మజ్ఞానం కోల్పోవటం జరుగుతుందని బాధ పడ్డారు .

శతాబ్దం చివరకు మిత్రనారాయణ గారు శరీరం బలహీనమై,వయసు భారమై ఇక తాము ఎన్నో ఏళ్ళు జీవి౦చలేము అని తెలుసుకొన్నారు .ఒత్తు జుట్టు బట్టతల అయింది .శరీరం కృశించి ,ముఖం పొడవై  చెవికు౦డలాలు భారమై కిందికి వేలాడేవి .కొత్త శతాబ్దం లో మొదటి దశాబ్దం వరకు సమాజం లోని యువకులు ,వృద్ధులు ఆయనను అత్యంత గౌరవంగా ఆదరించారు. ‘’అరుగో !శ్రౌతం లో అద్వితీయులు ,స్వయం పోషకులు ,సర్వ స్వతంత్రులు ,ఏ విషయం పైన అయినా సాధికారంగా ,పాండిత్యం ఉట్టిపడేట్లు ప్రసంగించగల దిట్ట శ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సోమయాజులు గారు ‘’అని ఉప్పొంగిపోతూ చెప్పుకొనేవారు అని శ్రీ దువ్వూరి యాజులు గారు అన్నారు . .దువ్వూరి ఫణి గారు మిత్రనారాయణగారిని ‘’మానాన్న గారు యాజులుగారికంటే ‘’త్రికాండ ‘’విద్వత్తులో మిత్రనారాయణ గారు ఘనులు .కర్మ ,ఉపాసన ,జ్ఞానం మూడింటిలో  మిత్రనారాయణగారికి సాటి వేరెవరూ లేరు ‘’అని నిష్కర్షగా నిర్దుష్టంగా  నిస్సంకోచంగా చెప్పారు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-18-ఉయ్యూరు

 

 

 

 

 

 

1-

 

.

 

 

 

 

 

 

 

 



Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21

ఇప్పుడు కాకినాడ లోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొందాం

1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు

కాకినాడకు చెందిన  బ్రహ్మ శ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సర్వ తోముఖ సోమయాజిగారు శాండిల్య గోత్రీకులు .తండ్రిగారు బ్రహ్మశ్రీ భమిడిపాటి శేషాద్రి సోమయాజులుగారు ఆహితాగ్ని ,ఘనాపాటీ,వేద భాష్య ప్రవీణులు .శేషాద్రిగారు 1935లో అగ్ని స్టోమం తన 26 ఏళ్ళవయసులో చేశారు .అప్పుడు మిత్రనారాయణ గారి వయసు 5.వేద ,శ్రౌతాలలో శేషాద్రిగారు’’డిస్టింక్షన్ సర్టి ఫికేట్ ‘’పొందారు .ఉర్లాం పట్టా ,బెజవాడ పట్టా దారు కూడా .ఇవి ఈనాడు గొప్పగా చెప్పుకొనే హార్వర్డ్ ,ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీలనుండి పొందే పి.హెచ్ .డి .లకంటే ఎక్కువ .అర్ధాంగి శ్రీమతి సూర్య సోమిదేవమ్మగారి తండ్రి ,తాత ,సోదరులు అగ్ని స్టోమం చేసినవారే . శేషాద్రి దంపతులకు ముగ్గురు కొడుకులు ,ఏడుగురు కుమార్తెలు .ఇద్దరు కొడుకులకు శేశాద్రిగారే వేదం నేర్పి వేదపండితులను చేశారు .ఇద్దరూ సర్టిఫికేట్ పొందినవారే .ఒక ఆడపిల్లను మాత్రం వేదపండితుడికిచ్చి పెళ్లి చేశారు .లంకావారు భమిడిపాటి వారికంటే మూడేళ్ళు చిన్నవారు .లంకా కూడా భమిడిపాటి శిష్యుడే .లంకావారు అగ్నిహోత్రం ప్రారంభించేనాటికి మిత్రనారాయణ గారికి లంకావారి ఏకైకపుత్రిక అనసూయ గారితో వివాహమైంది .దీనితో లంకావారికి  ఆహితాగ్నిఅల్లుడు లభించాడన్నమాట  .

శేషాద్రి దంపతుల పెద్దకొడుకు మిత్రనారాయణగారు 1930లో జన్మించారు .16ఏళ్ళ వయసులోనే వేద విద్యనంతటినీ కపిళేశ్వరపురం దగ్గరున్న కోరుమిల్లి లో తండ్రి గారి వద్దనే అభ్యసించారు .నేదునూరు కు కోరుమిల్లి ఉత్తరాన ఉంటుంది .ఇదే దువ్వూరి యాజులుగారి ఆవాస భూమి .తూర్పుకు ప్రవహించే గౌతమి గోదావరి కి ఎడమ గట్టుమీద ఉంటుంది .15ఏళ్ళ వయసులో అనసూయగారు ఈ అత్యంత విశాల గోదావరి దాటి కోరుమిల్లికి కాపురానికి వచ్చారు .మిత్రనారాయణ దంపతులకు ఏడుగురు సంతానం .మొదటి సంతానం పొందగానే 1955లో శ్రౌతం లో ప్రవేశం కోసం ‘’ఆధానం ‘’,’’అగ్ని స్టోమం ‘’ చేశారు .అల్లుళ్ళు ,మామగారి కుటుంబం ప్రోద్బలంతో స్వయంగా 22 వ ఏట తండ్రి అయిన దానికంటే  కంటే నాలుగేళ్ల ముందే  ’’ ఆహితాగ్ని’’ అయ్యారు మిత్రనారాయణగారు .మిత్రనారాయణగారి ‘’అగ్నిస్టోమం’’కు బాబళ్ళశాస్త్రిగారు , ,బులుసు చయనులుగారు ,లంకా లక్ష్మీనారాయణ గారు ,బులుసు వ్యాఘ్రేశ్వరుడు గారు, బులుసు కామేశ్వర సోమయాజిగారు వంటి దిగ్దంతులు హాజరయ్యారు .దువ్వూరి యాజులు గారొక్కరే రాలేదు ,అగ్ని స్టోమం అవగానే మిగిలిన శ్రౌత కర్మల విషయం పై దృష్టి పెట్టి 1970కి ముందే’’చయనం’’,’’సర్వతో ముఖం ‘’లను నేదునూరు లో నిర్వహించారు .సర్వతో ముఖానికి  నాలుగు వైపులా ఉన్న అగ్ని హోత్రాలలు నిర్వహించటానికి 72 మంది ఋత్విక్కులు అవసరం .గోదావరి డెల్టాలో 50ఏళ్ళ క్రితం బ్రహ్మశ్రీ రెండు చింతల యాజులు గారు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మిత్రనారాయణ గారు చేసి రికార్డ్ నెలకొల్పారు .దీనితో మిత్రనారాయణగారు ‘’మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు గారు ‘’అయ్యారు .

మిత్రనారాయణగారికి దగ్గర బంధువైన దువ్వూరి యాజులుగారే గొప్ప ప్రేరణ .ఈ జంట ఎప్పుడూ కోనసీమ లో  ఎక్కడ ఏ శ్రౌతకార్యం వచ్చినా కలిసి నిర్వహించేవారు .1950-60కాలం లో ఇష్టి,అగ్రయనం ,శ్రావణ పశు నిర్వహణలకు ఋత్విక్కుల కొరత ఉండేదేకాదు .7ఏళ్ళ వ్యవధిలో మిత్రనారాయణ గారు నిత్యాగ్ని హోత్రులుగా ఉంటూనే నాలుగు అద్వితీయమైన శ్రౌతకార్యాలు నిర్వహించి ప్రశంసలు పొందారు.  కాని మామగారు లంకావారి లాగా మిత్రనారాయణ గారు కొడుకులకు  వేదవిద్య నేర్పటం లో అంతగా సఫలీకృతులవ్వలేదు .ఇతరుల పిల్లలకు బోధించిమాత్రమే సంతృప్తి పడాల్సి వచ్చింది .ఈ వేదబోధ ఆయన 70ఏళ్ళ వయసు దాటే వరకు నిరాఘాటంగా సాగింది .

వేదపండితులకు  ‘’పారాయణ ప్రోగ్రాం ‘’ను ప్రారంభించటానికి తిరుపతి దేవస్థానానికి   బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు గొప్ప ప్రేరణ ,స్పూర్తి కలిగించారని మిత్రనారాయణ గారు  స్పష్టం చేశారు .ఆయన ఈ ఆలోచన చేయకపోతే వేదపండితులకు ఆర్ధిక వనరులు సమకూరేవికావు అన్నారు .

బ్రాహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రిగారు కోరుమిల్లికి తూర్పునున్న బాంక్ కెనాల్ పై ఉన్న ‘’దంగేరు ‘’గ్రామం లో 1888లో జన్మించారు .కాకినాడలో స్థిరపడ్డారు .’’శతమానం భవతి ‘’అన్నట్లు నూరేళ్ళు పూర్ణ ఆయుర్దాయం తో జీవించారు .కాకినాడ లో ఉన్న ’’ జానకీ జాని ‘’అని పిలువబడే శ్రీ సామవేదం జానకిరామ శాస్త్రిగారు ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఇంగ్లిష్ లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేసి రిటైరయ్యారు .కాకినాడ కేన్సర్ ఆస్పతి ఎదురుగా ఉండే ఎల్ .బి .నగర్ లో స్వంత ఇంట్లో ఉండేవారు .1994లో రాజమండ్రి లో మూడు రోజులపాటు ఆత్మీయులు, మహాకథకులు, అఖిలభారత సాహిత్య పరిషత్ అధ్యక్షులు మాన్యులు శ్రీ ఆర్ .ఎస్. కే .మూర్తి గారి ఆధ్వర్యం లో నిర్వహించబడిన  సభలలో నాకూ మా బావమరది ఆనంద్ కు పరిచయమయ్యారు .వయసులో మాకంటే చాలాపెద్ద అయినా ,ఎంతో చనువుగా ఆప్యాయంగా ఆ మూడురోజులు మాతో గడిపారు .ఆయనకు వాల్మీకి రామాయణం వాచో విదేయం.కవిసామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారిముఖ్య  శిష్యుడుకూడా .కల్పవృక్ష  రామాయణం పై అధారిటీ .ఆ తర్వాత మా ఇద్దరిమధ్యా ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్ సంభాషణలు జరిగాయి .కాకినాడ వెళ్ళినప్పుడల్లా జానకీ జానిగారిని చూడకుండా వచ్చేవాళ్ళం కాము నేనూ మా శ్రీమతీ .ఒక సారి మా అమ్మాయి విజయలక్ష్మి ని కూడా వారింటికి తీసుకు వెళ్లాను .ఆయన అర్ధాంగి గారు మంచి కాఫీ ఇచ్చేవారు .వాకిటిదాకా వచ్చి సాగనంపే సౌజన్యం వారిది .వారితో తీయించుకున్న ఫోటోలు పంపమని చెప్పేవారు అల్లాగే పంపేవాడిని .

ఒకసారి వారింటికి వెడితే ,అయన నన్ను ‘ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు తెలుసా “”?అని అడిగితే నోరు  వెళ్ళబెట్టాను .అప్పుడు ఆయన ‘’మా శ్రీమతి మేనమామగారే గణపతి శాస్త్రి గారు .మహా గొప్ప సంస్కృత, వేదవిద్వాంసులు .కాకినాడలోనే ఉండేవారు ‘’అన్నారు .అప్రతిభుడనయ్యాను .గణపతి శాస్త్రిగారి గురించి విన్నానేకాని, పూర్తిగా తెలియదు .గీర్వాణం-3లో వారి గురించి రాసి ఋణం తీర్చుకోన్నాను .జానకీ జాని గారి తండ్రి జానకిరామ శర్మగారు రామాయణ కావ్యం రాశారు .దీన్ని నాకు జానకీజానిగారు పంపితే చదివాను. కలకండ పద్యాలవి .జానకీ జానిగారు ‘’రామాయణ పావని ‘’రాశారు .మంచి కథకులుకూడా. ఎన్నో బహుమతులు పొందారు.ఆయన రాసిన ‘’యధాకాష్టం చ కాష్టం చ’’కథానిక చాలా గొప్పగా తత్వ బోధకంగా ఉంటుంది . ఆయన కథా సంపుటాలు నాకు పంపితే వాటిపై సమీక్ష రాసి వారికి పంపితే పరమానందంగా ఫీలయ్యేవారు. ఫోన్ చేసి ఆనందాన్ని తెలియజేసేవారు .మనపుస్తాకాలూ వారికి పంపేవాడిని .ఏమైనా రాస్తున్నారా అని అడిగేవారు తానేమి రాస్తున్నారో చెప్పేవారు .కాకినాడ, విశాఖ, రాజమండ్రి లలో ధార్మిక ప్రసంగాలెన్నో చేసేవారు .ఎక్కువగా వాల్మీకి విశ్వనాధ రామాయణాలమీదే ప్రసంగించేవారు .ఆ వివరాలు కరపత్రాలు పంపేవారు .నేనూ మనవి పంపేవాడిని .ఎన్నెన్నో సంమానాల౦దుకొన్న బహుముఖప్రజ్ఞా శీలి జానకీ జాని .

ఒకసారి ఏలూరుదగ్గర తమ తమ్ముడి ఇంట్లో ఉంటున్న తల్లిగారిని చూడటానికి వస్తున్నానని ఉయ్యూరు కూడా వస్తానని ఫోన్ చేస్తే, రెండే రెండు రోజుల వ్యవధిలో సాహితీ మిత్రులను మా డాబా పై అంతస్తులో సమావేశ పరచి వారితో విశ్వనాథ రామాయణం పై మాట్లాడమంటే రెండు గంటలపాటు ప్రసంగించి మమ్మల్ని’’ రసగంగ’’లో ముంచి తేల్చారు ఘన సత్కారం చేసి వీడ్కోలు పలికాం .ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి పేరుతో ఈ జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి .

గణపతి శాస్త్రిగారు మిత్రనారయణగారికి కాకినాడ లో1977లో  ఒక ఇంటిని కుదిర్చి  దగ్గరలో ఉన్న జగన్నాయిక పురం లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో వేదపారాయణకు ఏర్పాటు చేయించారు .అద్దె లేని ఆ ఇంట్లో ఉంటూ తన 9 మంది సంతానాన్నిమిత్రనారాయణ గారు పోషించారు .నిత్యం స్నానం సంధ్యావందనం ,అగ్నిహోత్రం చేయటం ,టిఫిన్ చేసి దేవాలయానికి వెళ్లి ఉదయం 8నుండి 10వరకు వేదపారాయణ చేయటం నిత్య కృత్యం .ఉదయం 11గంటలకు ఇంటికి చేరి .మాధ్యాహ్నిక సంధ్యావందనం అగ్నిహోత్రం  చేసి భోజనం చేసి  మధ్యాహ్నంఒక విద్యార్ధికి వేదం నేర్పేవారు    .రాత్రిభోజనం నిద్ర .1992కు వేదపారాయణ జీతం నెలకు వెయ్యి ,1998కి 1800 రూపాయలయింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-18-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

1-

 

.

 

 

 

 

 

 

 

 


 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు ఇక లేరు

image.png

వైజాగ్ ప్రసాద్ అసలుపేరు’’ కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు’’ .విశాఖపట్నం లోని గోపాలపట్నంలో జన్మించాడు .సంతానం లో చివరివాడు .ముగ్గురు అక్క చెల్లెళ్ళు .తండ్రి స్కూల్ టీచర్. ప్రసాద్ నాటక రంగ నటుడు .స్నేహితులు ‘’వైజాగ్  ప్రసాద్ ‘’అని పిలిచేవారు . బాల్యం లోనే తల్లి చనిపోవటం తో మేనమామ ఇంట్లో పెరిగి  .ఎస్ ఎస్ ఎల్ సి  చదివాడు .మేనమామ పేరుపొందిన పురోహితుడు .14 గ్రామాలకు ఆయన పౌరోహిత్యం చేసేవాడు .అన్నీ వాచో విధేయంగా ఉండేవని మేనమామ ను గుర్తు చేసుకొని ,కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు .నాటకాల పిచ్చిలో పడి’’ఏం బిబి ఎస్ సీట్ పోగొట్టుకొని బి.ఏ. చదివాడు ‘.వైజాగ్ లోని ‘’హిందూస్థాన్ షిప్ యార్డ్ ‘’లో ఉద్యోగం చేశాడు .భమిడిపాటి కామేశ్వరరావుగారి ‘’దంతవేదాంతం ‘’మొదలైన అన్ని నాటికలలో  నటించాడు ;’’గరీబ్ హటావో ‘’నాటిక తన నట జీవితం లో ‘’గ్రేటెస్ట్ వెంచర్ ‘’అన్నాడు. దీన్ని 150 సార్లు ప్రదర్శించామనీ ,అలహాబాద్ లోకూడాదీన్ని  మల్టి లింగ్యువల్ నాటికల పోటీలో ప్రదర్శించిన ఘనత తమదని ఆనందంగా చెప్పాడు .700కు పైగా నాటకనాటికలలో నటించిన అనుభవం ప్రసాద్ ది . 

  సినీ ప్రవేశం చేశాక ,వైజాగ్ నుంచి వచ్చాడు కనుక కూడా ఇండస్ట్రీలో ఐడెంటిటీ కోసం  అందరూ వైజాగ్ ప్రసాద్ అన్నారు  .జంధ్యాల డైరెక్ట్ చేసిన ‘’బాబాయ్ అబ్బాయ్ ‘’సినిమాతో తెరంగేట్రం చేశాడు .మొదట జంధ్యాల గారే ఈయన్ను ‘’వైజాగ్ ప్రసాద్ ‘’అని పిలిచాడు .30 సంవత్సరాలు సినీ రంగాన నటనతో  320 కి పైగా చిత్రాలతో అలరించిన కేరక్టర్ ఆర్టిస్ట్  ప్రసాద్..అనేక తరాల నటులతో నటించిన అనుభవం ఆయనది 2000 వరకు షిప్ యార్డ్ లో ఉద్యోగం చేస్తూనే ఏడాదికొక సినిమాలో నటించాడు .నువ్వూ నేనూ సూపర్ హిట్ అయ్యాక పూర్తిగా సినిమాలకే అ౦కితమైపోయాడు .హైదరాబాద్ లో స్థిరపడ్డాడు .ఉదయ కిరణ్ కు వైజాగ్ ప్రసాద్ తండ్రిగా నటించటం ఇష్టం ఉండేదికాదు .కాని డైరెక్టర్ తేజ ఈయన నాటకాలు చూసి ప్రభావితుడై ఆ పాత్రకు ప్రసాద్ మాత్రమే సరిపోతాడని చెప్పి ఒప్పించాడు .అప్పటికే కళాతపస్వి విశ్వనాథ్ తీసిన రెండు సినిమాలలో నటించిన అనుభవం కూడా ఉంది ‘’నువ్వూ నేనూ సినిమా  నాతోబాటు చాలామందికి భిక్ష పెట్టింది ‘’అన్నాడు దాని విజయాన్ని చూసిపొంగిపోయి .ఉదయ కిరణ్ తో ‘’కలుసుకోవాలని ‘’సినిమాకూడా చేశాడు .ఉదయ కిరణ్ ‘’డాడీ డాడీ ‘’అనే ప్రసాద్ ను ఎప్పుడూ పిలిచేవాడని చెప్పాడు .ఉదయ కిరణ్ మరణం అందరికీ బాధ మిగిల్చినదని చెప్పాడు .నిజంగా తనభార్యకు తాను  నాటకాలలో ,సినిమాలలో నటించటం అస్సలు ఇష్టం లేదని ,తన ప్రవర్తనతో ఆమె మనసు మార్చగలిగానని ,అలాంటి అడ్జస్ట్ మెంట్ మెంటాలిటీ లేకపోతె కష్టం అనీ అన్నాడు .డబ్బులు వచ్చిమీద పడుతున్నప్పుడు ఖర్చులు పెంచేసి అవకాశాలు తగ్గగానే ఖర్చులు తగ్గించుకోలేక డిప్రెషన్ లో పడతారు .’’జాగ్రత్తగా  ఖర్చుచేయకపోతే ఇండస్ట్రీ లో ఎవరూ మనల్ని ఆదుకోరు మనజీవితాలను మనమే తీర్చి దిద్దుకోవాలని ‘’సినీ నీతి సూత్రం చెప్పాడు .  

వైజాగ్ ప్రసాద్ భార్య విద్యావతి .ఈ దంపతులకు రత్నప్రభ ,రత్నకుమార్ కూతురు కొడుకు .ఇద్దరూ సాఫ్ట్ వేర్ రంగం లో  రాణించారు  .అమ్మాయి అమెరికాలో,  అబ్బాయి లండన్ లో స్థిరపడ్డారు .

2017లో విడుదలైన చిత్రం ‘’ఇది మా ప్రేమకథ’’ప్రసాద్  ఆఖరి  సినిమా.తేజ దర్శకత్వం వహించిన ‘’నువ్వు –నేను ‘’సినిమా లో ఉదయ కిరణ్ తండ్రిగా వైజాగ్ ప్రసాద్ నటన నభూతో గా ఉన్నది .దీనితో ఆయనకు ఆఫర్లు వెల్లువగా వచ్చి పడ్డాయి .ఆయనకు దీటుగా హీరో ఉదయ కిరణ్ కూడా ఊపేశాడు .నీరాజనం సినిమాలోనూ వైజాగ్ ప్రసాద్ నటన బాగా గుర్తి౦పు పొందింది .’’భద్ర ‘’సినిమాలో హీరో రవి తేజ మేనమామగా ,’’జై చిరంజీవ ‘’లోహీరోయిన్  భూమిక తండ్రిగా డాక్టర్ పాత్రలో మెప్పించాడు .అగ్ర శ్రేణి హీరోలందరితో చేసినా ,వర్క్ హాలిక్ అయిన ప్రసాద్ ఎవరితోనూ సన్నిహితంగా మెలగలేదు. తనపనేదో తను చూసుకొని వచ్చేవాడు .

  బుల్లితెర పై అనేక సీరియళ్ళలో నటించాడు ప్రసాద్ .  దాదాపు రెండేళ్లుగా అనారోగ్యం తో బాధ పడుతున్నాడు .ఇప్పటికే రెండు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది .ఈ20 తేది ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు మూడోసారి స్ట్రోక్ రావటం తో సోమాజిగూడా యశోదా హాస్పిటల్ లో చేర్చారు .అప్పటికే అంతా అయిపోయి, వైజాగ్ ప్రసాద్ 75 వ ఏట తుదిశ్వాస విడిచాడు .

 వెడల్పైన ముఖం ,స్పష్టమైన ఉచ్చారణ ,రాజసం ఉట్టిపడే మూర్తిమత్వం ,అద్భుత నటనా సామర్ధ్యం ,గొప్ప నడవడిక తో తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వం వైజాగ్ ప్రసాద్ ది. ఆయన మృతి నాటక, సినీ రంగాలకు  తీర్చలేని లోటు..ఆయన ఆత్మకు శాంతికలగాలని , ఆకుటుంబం సాంత్వన పొందాలని కోరుకొందాం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-18-ఉయ్యూరు

 

image.png

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943)

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4

331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943)

ఆభిరాజ్ రాజేంద్ర మిశ్ర 1943లో ఉత్తరప్రదేశ్ జాన్ పూర్ జిల్లా ద్రోణిపూర్ లో పండిట్ దుర్గా ప్రసాద్ మిశ్ర ,అభిరాజ్ దేవి దంపతులకు జన్మించాడు .ఈయన  దీక్షా గురువు జగద్గురు  రామ భాద్రాచార్య .సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్  యూనివర్సిటి సంస్కృత ఆచార్యుడుగా పని చేశాడు .ఇండోనేషియాలో అతిప్రాచీన విశ్వవిద్యాలయం యూని వర్సిటి ఆఫ్ ఇండోనేషియా కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .సంస్కృత హిందీ ఇంగ్లిష్ భోజపురి భాషల్లో చాలా గ్రంధాలు రాశాడు .

అందులో ‘’సంస్కృత శతకం ‘’ముఖ్యమైనది .మిగిలిన వాటిలో ఇక్షుగంధ,అరణ్యాని , అభిరాజ్ యశోభూషణం ,ధరా మండవీయాం ,,జానకీ జీవనం ,మధుపం ,సప్త ధారా ,అభిరాజ సహస్రకం ,నాట్య పంచగవ్యం ,నాట్య పంచామృతం ,వాగ్ వధూటి ,మ్రిద్వికా ,శ్రుతిమ్భర ,సువర్ణ ద్వీప రామకధ,సాంస్క్రిట్ సాహిత్యమే అన్యోక్తి ,పోయెట్రి అండ్ పోయేటిక్స్ ,బాలీద్వీప సాహిత్య సంస్కృతీ ,హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ బహాసా ఇండో నేషియా ఉన్నాయి .

అభిరాజ్ కు ‘’ఇక్షుగంధ’’సంస్కృత రచనకు గాను సాహిత్య అకాడెమి పురస్కారం 1988లో లభించింది.2002లో ప్రెసిడెంట్ అవార్డ్ ,వాల్మీకి సమ్మాన్,వాచస్పతి సమ్మాన్,ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ వారి విశ్వభారతి సమ్మాన్ లు అందుకొన్న కవి దిగ్గజం అభిరాజ్ రాజేంద్ర మిశ్ర .పదవీ విరమణ తర్వాత సిమ్లాలో స్థిరపడ్డాడు .

332-‘’అపశ్చిమః  పశ్చిమే’’ యాత్రా సాహిత్య కర్త –డా.హెచ్.ఆర్. విశ్వాస (20 వ శతాబ్దం )

డా.హెచ్. ఆర్ .విశ్వాస కర్ణాటకలోని మా౦గలూర్ నివాసి .సంస్కృత భాష పునరుజ్జీవనం కోసం బాగా కృషి చేశాడు .ప్రసిద్ధ  కన్నడ రచయిత భైరప్ప రాసిన ‘’ఆవరణ ‘’ను సంస్కృతం లోకి అనువాదం చేసి సాహిత్య అకాడెమి పురస్కారం పొందాడు .’’సంభాషణ సందేశ ‘’ సంస్కృత మాసపత్రిక 5ఏళ్ళు నడిపాడు .సంస్కృత భారతి సంస్థ కు అఖిలభారతీయ ప్రాక్ శిక్షణాప్రముఖ్,ప్రకాశనా ప్రముఖ్ గా చాలాకాలం పని చేశాడు  .2011 జనవరి లో మొదటి ప్రపంచ సంస్కృత గ్రంథ ఉత్సవం వర్కింగ్ కమిటీ సభ్యునిగా సేవలందించాడు .రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వారి సంస్కృత పాఠాల బోధనలో టీచర్ గా ఉన్నాడు. వీటిని   డి.డి.భారతి ,జ్ఞాన్ దర్శన్ కేంద్రాలు ప్రసారం చేశాయి .’’హోస దిగంత’’పత్రికలో ప్రతివారం ‘’సంగత ‘’ శీర్షిక నిర్వహించాడు .కర్నాటక ప్రభుత్వ౦ ప్రచురించే 5,6,7తరగతుల సంస్కృత పుస్తకాల సిలబస్ కమిటి సభ్యుడుగా ఉన్నాడు .

విశ్వాస సంస్కృతం లో ఏం ఏ చేసి కువెంపు యూనివర్సిటినుండి డాక్టరేట్ తోపాటు ‘’విద్వత్ డిగ్రీ’’ పొందాడు .భార్య శాంతలకూడా సంస్కృత భారతిలో పని చేస్తుంది .సంస్క్రుతానువాదం’’ ఆవరణ ‘’కు ఆరునెలలు పట్టింది .2008 నవంబర్ లో ఆవిష్కరణ జరిగింది .ఈయన కన్నడ పుస్తకం ‘’మత్తే హోత్తు హీబ్రూ హనాతే’’ను సంస్కృత పండితుడు  జి .వెంకట సుబ్బయ్య ఆవిష్కరించాడు.2006లో ఇది బెస్ట్ సెల్లర్ అయింది .భైరప్పరాసిన ‘’పర్వ ‘’ను కూడా సంస్కృతం లోకి అనువదించబడి 2012లో విడుదలైంది ..’’మార్జాలస్య ముఖం దృష్టం ‘’అనే నాటికల సంపుటి కి  సాహిత్య అకాడేమి నుంచి  బాలసాహిత్య పురస్కారం 2013లో అందుకొన్నాడు  .సంస్కృతం లో ‘’అప శ్చిమః పశ్చిమే’’అంటే’’ తూర్పు వాడు పశ్చిమం ‘’లో అన్న సంస్కృత యాత్రా సాహిత్య౦ ,’’హేమచ్ఛటికా’’  (స్వర్ణ మృచ్ఛకటిక),’’ సంస్కృత బోధకుల హాండ్ బుక్ గా’ కౌశలబోధిని’’  ‘’ఆవరణ ‘’రాశాడు .కన్నడం లో రెండుపుస్తకాలు తెచ్చాడు .అనాలిసిస్ ఆఫ్  సెన్టేన్న్సేస్ ఇన్  సాంస్క్రిట్’’అనే పరిశోధనా పత్రం రాశాడు .

333 –సంస్కృత వ్యాప్తి చేసిన ఆర్య సమాజ ఆచార్య –పండిత గోపదేవ్ (1896-1996)

పండిత గోపదేవ్ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కూచిపూడి గ్రామములో కావూరి రామయ్య, అచ్చమాంబ దంపతులకు 1896, జులై 30 న జన్మించాడు. గోపదేవ్ సామాన్య కర్షక కుటుంబములో పుట్టాడు. చిన్నతనములో పొలం పనులు చేసుకుంటూ తండ్రికి చేదోడుగా ఉండేవాడు. కొంత వయస్సు వచ్చిన తర్వాత స్వంత ఆసక్తితో అక్షర జ్ఞానం సంపాదించాడు. చదువు మీద జిజ్ఞాస పెరిగింది. బెల్లంపల్లి వెంకటనారాయణ వద్ద చదువుకొని ఉపాధ్యాయ శిక్షణ కూడా పొందాడు. 1922లో గుంటూరు జిల్లా బోర్డు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు. ఉద్యోగములో చేరిన కొత్తలోనే పెళ్ళి జరిగింది. భార్య వివాహము జరిగిన కొద్ది కాలానికి చనిపోయింది. శేషజీవితం బ్రహ్మచర్యములోనే గడపాలని దీక్ష బూనాడు.

సంస్కృత విద్య
కూచిపూడి దగ్గరలోని అమృతలూరు లో సంస్కృత పండితులను ఆశ్రయించి పంచకావ్యాలను, నాటక సాహిత్యము చదివాడు. కావూరు సంస్కృత పాఠశాలలో తర్క, మీమాంస శాస్త్రములు చదివాడు. వేద వేదాంగములు అభ్యసించడానికి పండితులను కోరగా నిరాకరించబడ్డాడు. కేరళ, లాహోరు, వారణాసి పర్యటించి, విసిగి చివరకు ఢిల్లీ లో స్వామి శ్రద్ధానంద స్మారక విశ్వవిద్యాలయములో 1927లో విద్యార్థిగా చేరాడు. అచటనే ఉపనయన సంస్కారం జరిగింది. గోపయ్య గోపదేవ్ శాస్త్రిగా మారాడు. విద్వాంసుల వద్ద వేదోపనిషత్తులు క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకున్నాడు. ఆదర్శవంతమైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. లాహోరు లోని ఉపదేశక విశ్వవిద్యాలయములో చేరి అచట స్వతంత్రానందస్వామి వద్ద సంస్కారవిధి, తర్కము, మీమాంస, వేదానంద స్వామి వద్ద వ్యాకరణము నేర్చుకున్నాడు. అచటనే ఆర్యసమాజ పరిచయం, ప్రవేశం జరిగాయి. దర్శన వాఙ్మయం చదివే కోరికతో పోఠోహోర్ గురుకులము చేరి పండిత రామోపాధ్యాయుల వద్ద శిష్యుడిగా చేరాడు. 1933లో జగద్గురు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల పరిచయముతో పీఠాధిపతుల వద్ద వేదాంత దర్శనము చదివే భాగ్యము కలిగింది.

ఆర్య సమాజము
తరువాత స్వగ్రామము కూచిపూడి చేరి, పండిత గంగాప్రసాద్ ఉపాధ్యాయ ప్రోత్సాహముతో వైదిక ధర్మాన్ని, వైదిక సంస్కృతినీ ప్రచారం చేయాలనే ఆశయముతో 1939లో ఆర్య సమాజము స్థాపించాడు. తెలుగు నాట అనేక ప్రాంతాలలో ఆర్యసమాజాన్ని గురించి, మహర్షి దయానంద సరస్వతి సందేశాల గురించి ప్రచారము చేశాడు. అనేక చోట్ల ఆర్యసమాజాలు స్థాపించాడు. కూచిపూడిలో 1946లో మహిళా ఆర్యసమాజము కూడా స్థాపించి స్త్రీలకు వేదాభ్యాసము చేశాడు. హైదరాబాదులో దయానంద సరస్వతి ఉపదేశక విద్యాలయములో ఉపదేశకునిగా పనిచేసి డెబ్బది పైగా గ్రంథాలు రచించాడు.

పురస్కారాలు
1922లో దయానంద సరస్వతి వారి పురస్కారము పొందాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ “కళాప్రపూర్ణ” బిరుదుతో గౌరవించింది.

మరణం
నిస్వార్ధముగా వైదికథర్మ ప్రచారానికి జీవితము అంకితము చేసిన గోపదేవ్ 1996, అక్టోబర్ 22 న మరణించాడు.

334-అముద్రిత సంస్కృత కావ్యకవి –తెలకపల్లి విశ్వనాథ శర్మ (1940-2016)

తెలకపల్లి విశ్వనాథ శర్మ ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు.[1]

జీవిత విశేషాలు
ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1963లో సంస్కృత విభాగంలో, ఎం.ఏ గోల్డ్‌మెడల్ పొందిన తొలి వ్యక్తిగా వినుతికెక్కారు.[1] ఆయన హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశారు. తర్వాత 1965లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి 1993లో పదవీ విరమణ చేశారు.[2] ప్రాకృతం, తెలుగు, సంస్కృతం, గ్రీకు సహా ఇతర విదేశీ భాషలపై పట్టు ఉన్న విశ్వనాధ శర్మ సంస్కృతాంధ్ర కవితలు అముద్రితంగానే ఉన్నాయి. దూరదర్శన్‌లో కొన్నేళ్ళపాటు విశ్వనాధ శర్మ భాషణలతో పాటు శివపురాణ కార్యక్రమం నిర్వహించారు. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించడంలో ఘనాపాఠీగా పేరున్న ఆయన రాసిన పరాశర మాధవీయం, కాళిదాస జ్యోతిష గ్రంథం బహుళ ప్రాచుర్యం పొందాయి.

మైసూరులోని దత్తపీఠాథిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో విశ్వనాథశర్మ దాదాపు ఐదు సంవత్సరాలు సంస్కృతం బోధించారు.[3] అనేక గ్రంథ, శాస్త్రాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాలన్న ఆయన తృష్ణను మాజీ డిజిపి అరవిందరావు నెరవేర్చారు. అరవిందరావు చేయూతతో అనేక సంస్కృత గ్రంథాలను, విశ్వనాథశర్మ తెలుగులోకి అనువదించారు.[1]

వ్యక్తిగత జీవితం
ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మే 10 2016 న మరణించారు.

335-వీరశైవ గురుకుల స్థాపకులు సంస్కృత సాహిత్యోసకులు –శ్రీ చిదిరె మఠం వీరభద్ర శర్మ (1906-1948)

చిదిరెమఠం వీరభద్రశర్మ ఆధ్యాత్మికవేత్త,వీరశైవ గురుకుల స్థాపకులు,బహుభాషాకోవిదులు,విభూతి అనే సారస్వతపత్రికా స్థాపకులు, శ్రీ జగద్గురు విశ్వారాధ్య పీఠాధ్యక్షులు.

బాల్యం,విద్యాభ్యాసం
శ్రీ వీరభద్ర శర్మగారు నల్గొండ జిల్లాలోని చర్లపల్లె అను గ్రామమున, వీరశైవమతము నందు గురు వర్గమునకు చెందిన మాహేశ్వర శాఖలో సం.1906లో శ్యామలాంబ, నాగభూషణు నామాంకితులగు దంపతులకు జన్మించిరి. తల్లిదండ్రులకు వీరు ఏకైక పుత్రులు. వీరికొక కనిష్ఠ సోదరిమాత్రము ఉండెను. నల్గొండ జిల్లాలోని 70 గ్రామాలకు చిదిరెమఠము కుటుంబమువారె మఠస్థులుగా ఉండిరి. 14 ఏండ్లు వయస్సు వచ్చులోపలనే తల్లితండ్రులు చనిపోవుటచేతను, జ్ఞాతులు, బంధువులు వీరి ఆస్తులను అపహరించుటచేతను, మరికొంతకాలమునకు వివాహితాయిన సోదరికూడ మరణించుటచేతను ఆదరించువారే లేక చిన్నతనమున బహుకష్టములకు లోనయిన శర్మగారు జన్మస్థలమును విడిచి హైదరాబాదు, నీరడగుంభ, నారాయణపేట మున్నగు తవులకేగి వీరశైవుల ఇండ్లలో భిక్షాటన మొనర్చుచు, సంస్కృత విద్యాభ్యాసము గావించిరి. త్వరలోనే వీరు కావ్యనాటక అలంకార సాహిత్యము సంపాదింపగలిగి వీరి తెలివితేటలకు, నైపుణ్యమునకు సంతసించి హైదరాబాదులో హైకోర్టు వకీలుగా నుండిన శ్రీ దేశ్ ముఖ్ బాబూరావు గారు, శ్రీ మహంతుమఠము చెన్నబసవయ్య అను వారు వీరిని ఆదరించిరి. 18 ఏండ్లకే సంస్కృతముతో పాటు ఆంధ్ర, కర్ణాటక భాషలయందు పాండిత్యమును సంపాదించిరి.

ఆధ్యాత్మిక పరిమళం
1922సం. ప్రాంతమున శ్రీ శివకోటి వీరభద్రయ్య అను మహేశ్వరులు- పరమశివభక్తి సంపన్నులు పెక్కుదివ్య క్షేత్రములు సేవించి ద్వాదశజ్యోతిర్లింగములలో ఒకటి అగు వైద్యనాధేశ్వరలింగమును అభిషేకమొనరింపబోవ అచ్చటి బ్రాహ్మణులు ప్రతిఘటించిరట. అందుపై వీరశైవులకు వేదాధికారము కలదా, లేదా అను విషయమున వాదాములు కలిగి అవి న్యాయస్థానముల కూడ నెక్కెనట. ఈ వివాదపరిష్కారవిషయమున నిజాము హైకోర్టువారు 1923-24సం.లో ఒక పండితసభనేర్పరచిరి. అదివరకు కాశీక్షేత్రములో విద్యనభ్యసించి వేదతీర్ధ పట్టము పొంది, ధార్వాడజిల్లాలో చౌడదానపురమఠాధ్యక్షులుగా నుండిన శ్రీ విరూపాక్షఒడయరు మహాస్వాములవారు పండితసభలో వీరశైవపక్షమున ప్రధాన పండితులుగా నుండిరి. అప్పుడు ప్రమాణ గ్రంధపరిశీలనాదికములలో వారికి శ్రీ వీరభద్రశర్మగారు కూడ తోడ్పడుచుండిరి. తుదకు హైకోర్టు వారు వీరికి అనుకూలముగా తీర్పు నిచ్చుట వలన, శ్రీ వీరభద్రయ్య గారు శ్రీ వీరభద్రశర్మ గారి చాకచక్యమునకు మిక్కిలి సంతసించి కాశీ క్షేత్రమునకు పోయి చదువుటకు సంస్కరించిరి. అటుపై వీరు విద్యాభ్యాసమొనర్చి స్మృతితీర్ధ, కావ్యతీర్ధ, ధర్మాచార్య, సాహిత్యవిశారద మున్నగు పట్టపరీక్షలందు కృతార్ధులయిరి. 1929 వ సం.లో వీరు హిమాలయము లకు సుమారు 500 మైళ్ళు కాలినడక సాగించి ఆయా విషయములను వివరించు నొక గ్రంధుము కూడా వ్రాసిరి. వీరు బ్రాహ్మీ లిపియందు అనేక దుర్గమ శాసనములను వీరు పఠించి ప్రకటింపగలిగిరి.

హిమాలయము నుండి తిరిగి రాగానే, కొంతకాలము యాదగిరి అందలి శంకరసంస్కృత కళాశాల అధ్యక్షులుగా పనిచేసిరి. అటు తరువాత శ్రీమటికె నాగయ్య అను భక్తవరులు దానపూర్వకముగ నొసగిన ధర్మనిలయమున వీరు వీరశైవగురుకులమున, శైవభారతీభవనమును సికింద్రాబాదులో నెలకొల్పి వీరశైవ విద్యార్ధులకు ఉచితముగా విద్య చెప్పుచుండిరి. అందే శివధర్మ గ్రంధమాలికను కూడ స్థాపించి వీరశైవ మహాత్ములు, రేణుక విజయము, శ్రీకరభాష్యము, శివపంచస్తని మున్నగు గ్రంధములు పదకొండు ప్రకటించిరి. బహుధాన్య సంవత్సర మహాశివరాత్రి దినమున విభూతి అను పేరుతో ఒక సారస్వతపత్రికను ప్రారంభించి రమారమి 4 సం. నిర్వహించి శైవమతసేవచేసిరి. వీరు బ్రహ్మ చర్యమును చేపట్టిరి.

జీవితకాలములో ఆహారవిహారములయందు వీరు పెక్కు నియమములు పాటించిరి.నెలకొక దినము మౌన వ్రతము పాటించుచుండిరి.ఆరోగ్యము చెడిన చివరి 8 కొద్ది నెలలు ఆహారమును విసర్జించిరి గాని స్నాన జప పత పాద్యనుష్ఠానముల నొక్కింతయు విరమింపరయిరి.25-1-1948న శ్రీ వీరభద్ర శర్మగారు 42వ ఏట నే సిద్ధిపొందారు .

336-శ్రీ దత్త పీఠ విద్యాధికారి- శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తి (20వ శతాబ్దం )

భారతీయ వేదాలలో అన్నీవున్నాయి. అని అందరు అంటుంటారు. కాని వెలికి తీసి సామాన్య ప్రజలకు తెలియ జేయడాని కొందరు కృషి చేస్తుంటారు. వారిలో కుప్పా వేంకట కృష్ణమూర్తి గారు ఒకరు.; .

ఉద్యోగము
కుప్పా వేంకట కృష్ణ మూర్తి గారు గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేసి, బ్యాంకు ఉద్యోగంలో చేరారు. ఇతని తండ్రి కుప్పా లక్ష్మణావధాని. తరువాతి కాలంలో ఆయన శ్రీజనార్దనానన్ద సరస్వతీ స్వామి వారిగా ప్రసిద్ధి చెందారు. తండ్రి నుంచి వారసత్వంగా లభించిన వేద విద్వత్తు ఆయనను బ్యాంకు వుద్యోగంలో నిలవనీయ లేదు. ఆధునిక విద్య, ఉపాధి మార్గం నుంచి వేదాల వైపు నడిపించింది. ఫలితంగా ఆయన 37వ ఏటనే బ్యాంకు ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి వేద పరిరక్షణ, వేద విజ్ఞాన వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తున్నారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో పట్టు ఉండటం వల్ల వేద విజ్ఞానాన్ని సామాన్యులకు అర్థం అయ్యే రీతిలో అందించే మహాత్తర కార్యక్రమం చేపట్టారు.

ఆధునిక – వేద విజ్ఞానాల సంగమం
అటు ఆధునిక విజ్ఞానం, ఇటు వేద విజ్ఞానాల మేలు కలయికగా ఉండే కృష్ణమూర్తి అవధూత దత్తపీఠంలో విద్యాధికారిగా, ట్రస్టీగా పనిచేశారు. 1986లో శ్రీదత్తదర్శనం చిత్రానికి సంభాషణలు కూడా రాశారు. ఆ తరువాత దశాబ్ద కాలం క్రితం వేదాలపై శాస్త్రీయ పరిశోధన సంస్థ (ఐసర్వ్) ను స్థాపించి వేదాల వికాసానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 36 జాతీయ సమ్మేళనాలు రచించారు. 30కి పైగా ఆధ్యాత్మిక, వైజ్ఞానికి గ్రం«థాలు ప్రచురించారు. 11 ఆధునిక వైజ్ఞానికి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఆయుర్వేదం, పాణినీయ వ్యాకరణం ద్వారా నూతన కంప్యూటర్ లాజిక్ ఆవిష్కరణ, నవీన వైజ్ఞానిక రీతులలో పురాతన సంఘటనల కాలనిర్ణయం, సనాతన భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్ర, వైదిక పద్ధతుల్లో భూకంపాది ఉత్పాతాల నిర్ణయం, అధర్వణ వేద పరిశీలన వంటి పరిశోధన ప్రాజెక్టులను అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు

30 గ్రంథాల రచన
ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషల్లో ఆయన ఇప్పటి వరకు 30 గ్రంథాలు రచించారు. యోగావశిష్ఠ హృదయం నాలుగు గ్రం«థాలు తెలుగు వచనం, ఆంగ్లంలో కూడా రచించారు. గురు తత్వ, గురు సచ్చిదానంద సద్గురు చరిత్ర, అధ్యాయ శ్లోకావళి, యోగ తారావళి, రుద్ర ప్రపంచ సత్వం ఆయన రచించిన

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20

1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి -2

   సౌమ్యులైన శ్రీ కామేశ్వర సోమయాజి గారి దంపతులు సంభాషించేటప్పుడు కళ్ళల్లో కాంతులు పెదవులపై చిరునవ్వు దర్శనమిస్తాయి .అందరు ఆహితాగ్నుల భార్యలకంటే సోమయాజిగారి భార్య సావిత్రిగారు శ్రౌత ధర్మం పాటించే వారి జీవితాలలో ఉన్న సూక్ష్మ విషయాలు కూడా తెలియజేసేవారు . ఈ దంపతులు అగ్నిహోత్రం చేసే పవిత్ర పరికారాలను చూపించేవారు .అగ్ని హోత్రం ఆరిపోతే ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ వెలిగించేవారు .అగ్ని హోత్రం తో తమకున్న గాఢ అనుబంధాన్ని సవివరంగా తెలియ జేసేవారు .సోమయాజిగారికి ఉన్న విజ్ఞానం  సావిత్రిగారికీ ఉండేది .ఈ దంపతులు 35ఏళ్ళు నిరాటంకంగా అగ్ని హోత్రారాధన చేసిన ధన్యజీవులు .ఇంటర్వ్యు చేసేవారొస్తే వారికి కాఫీ టీ కొబ్బరి నీళ్ళు ఇచ్చి సంభాషించేవారు .అన్నవరం లోని కపిలవాయి రామ శాస్త్రి గారి పత్ని శ్రీమతి మారుతి గారికి ఎలాంటి సంభాషణా చతురత, విషయ స్పష్టీకరణ ఉందో సావిత్రిగారికి కూడా ఉన్నది .మగవారితో చక్కగా మాట్లాడుతూ అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం అందించటం లో వీరిద్దరూ దిట్టలు..

 కామేశ్వర సోమయాజిగారు సుమారు 30 శ్రౌత కార్యక్రమాలకు ఆహ్వాని౦పబడ్డారు .వీటిలో వాజపేయం ,పౌ౦డరీకం ,చయనాలు కూడా ఉన్నాయి .కొన్నిటిలో ఋత్విక్కుగా ,అధ్వర్యునిగా కూడా ఉన్నారు .వీరి దగ్గర చదువుకున్న శిష్యులెవరూ తైత్తిరీయాన్ని పూర్తి చేయలేకపోయారు.సోమయాజిగారు 30మందికి పైగా విద్యార్ధులకు విజయవంతంగా స్మార్తం నేర్పారు .80ఏళ్ళు దాటినాకూడా ,ఇంకా నేర్పుతూనే ఉండటం  విశేషం .వీరంతా హైదరాబాద్,ఇతర ప్రాంతాలలో  స్మార్త పండితులుగా పేరు తెచ్చుకొన్నారు .కామేశ్వర సోమయాజి గారి  వేద విధానం ఆంద్ర దేశమంతటా  అవిచ్చిన్నంగా కొనసాగుతోంది.అది ఆయనకు దక్కిన గొప్ప అదృష్టం .2010లో కామేశ్వర సోమయాజిగారు 84 వ ఏట మరణించారు .నేదునూరు పరిధిలో శ్రీరామపురం ,వ్యాఘ్రేశ్వరం అగ్రహారాలలో కామేశ్వర సోమయాజిగారే చిట్టచివరి ఆహితాగ్ని .మిత్రనారాయణగారు ఈ పరిధికి వెలుపల ఉన్న ఆహితాగ్ని .

2-శ్రీ పుల్లెల లక్ష్మీనారాయణ సోమయాజులు గారు (1920-1999)

వ్యాఘ్రేశ్వార అగ్రహారం లో 1960లో స్థిరపడిన మూడవ ఆహితాగ్ని శ్రీ పుల్లెల లక్ష్మీ నారాయణగారు .కౌండిన్య గోత్రీకులు .1920లో వసిష్ట గోదావరి తీరం లోగన్నవరం కాలువ ప్రక్కనున్న నరేంద్ర పురం లో జన్మించారు .1970లో అగ్నిస్టోమం చేసి పుల్లెల లక్ష్మీనారాయణ సోమయాజులయ్యారు.అర్ధాంగి కామేశ్వరిగారు సోమి దేవమ్మ అయ్యారు .ఆహితాగ్ని తండ్రిగారికి ఈయన ఒక్కరే కుమారుడు .తొండవరం లోని మేనమామ శ్రీపాద లక్ష్మీనరసింహ సోమయాజి గారు లక్ష్మీనారాయణ గారు శ్రౌతం  నేర్వటానికి గొప్ప ప్రేరకులయ్యారు .

 గంగలకుర్రుకు దక్షిణాన ఉన్న  తొండవరానికి చెందిన ఆహితాగ్ని గారి మనవరాలు శ్రీమతి కామేశ్వరి గారినిచ్చి లక్ష్మీనారాయణగారికి వివాహం చేశారు .వివాహం 1936లో వైనతేయ గోదావరినది గుర్రపు నాడ లాగా వంపుతిరిగిన చోట ఆమెకు 10.ఆయనకు 16 వయసులో జరిగింది .ఈ దంపతులకు నలుగురుపుత్రులు ,నలుగురు పుత్రికలు .కుమార్తెలెవ్వరికీ వేదపండితులతో వివాహం కాలేదు .కుమారులెవరికీ కూడా వేదం అబ్బలేదు ..మధ్య వయసు దాటిన ఈ దంపతుల కుమారులు ఆర్ధిక బాధలనుభావించారు .తండ్రిగారి లాగే తామూ ఆహితాగ్ని కావాలనుకొన్న లక్ష్మీనారాయణ గారు అగ్నిహోత్రం ఏర్పాటు చేసుకోవటానికి ఒక ప్రత్యేక ఇంటికోసం ఎదురు చూశారు .

   వ్యాఘ్రేశ్వరానికి దక్షిణాన ఉన్న చోట భార్య కామేశ్వరిగారి అక్కగారు వీరు౦డటానికి ఒక నివాసం ఏర్పాటు చేస్తే కుటుంబాన్ని 1962లో అక్కడికి మార్చారు . ముక్కామల ,నేదునూరు,శ్రీరామ పురం లు  వ్యాఘ్రేశ్వరానికి ఎలా దగ్గరో, శ్రౌతానికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉంటుందో ఇదీ అలాగే ఉన్నది .దువ్వూరి యాజులుగారి పౌండ రీకం ,బాబళ్ళ శాస్త్రిగారి’’అరుణ కేతుకం ‘’ లంకా  బులుసు వారల యజ్ఞాలు చాలా ప్రేరణ కలిగించాయి .

  లక్ష్మీనారాయణ ,కామేశ్వరి దంపతులు కొత్త చోట అగ్ని హోత్రం ఏర్పాటు చేసుకొని ,రెండు పూటలా అగ్ని కార్యం నిర్వహిస్తూ ,పౌర్ణమి, పాడ్యమి రోజుల్లో  ‘’ఇష్టి’’చేస్తూ ,ప్రతి సంవత్సరం ‘’అగ్రయనం ‘’చేశారు .లంకావారి లాగానే సోమ యాగం చేయటానికి చాలాకాలం నిరీక్షించాల్సి వచ్చింది .చివరికి  లంకావారు అధ్వర్యులుగా ,మిత్రనారాయణగారు ‘’బ్రహ్మణ్యులు ‘’గా ,కోనసీమలోని 18మంది  రిత్విక్కులుగా  ‘’1970లో అగ్ని స్టోమం నిర్వహించి మనోభీష్టం నెరవేర్చుకొన్నారు .

  లక్ష్మీనారాయనగారికి అగ్నిహోత్రం అన్నా ఇష్టిఅన్నా పరమ ఆరాధనా భావం .కొడుకులతో కలిసి పొదలలో , పాములభయం ఉన్న చోట్ల చప్పుళ్ళు చేస్తూఎండు కట్టెలను పోగేసి తెచ్చి అగ్నిహోత్రానికి ఉపయోగించేవారు  .ముఖ్యంగా పంటలకాలం లో అమావాస్య ,పౌర్ణమి రోజులలోను ,దీపావళి సమయం లోనూ’’ అగ్రయనం ‘’చేయటానికి చాలాఉత్సాహ పడేవారు .ఒక్కసారిమాత్రమేఅగ్నిస్టో మం ‘చేసిన వెంటనే ‘’శ్రావణ పశు ‘’చేశారు .మిగిలిన ఏ శ్రౌత కర్మల జోలికీ పోలేదు .’

  శ్రౌతం డబ్బు వచ్చే  వృత్తి అనుకోలేదు .కనుక కుటుంబ ఆర్ధికస్థితి ఎప్పుడూ వొడిడుడుకులతోనే ఉండేది.1986లో ఆయన 66 వ ఏట తిరుపతి దేవస్థానం వారి దృష్టిలో పడి వృద్ధ పండితులుగా మాత్రమే గుర్తించి వేదపఠనం లేని పెన్షన్ ఇచ్చారు .నెలవారీ డబ్బు రావటం తో కొంత తేరుకున్నారు .చివరికాలం లో రుత్విజులలేమి తో కొంత కలత చెందారు .తెలుగు పండిట్ అయిన కొడుకు ఆసరాగా నిలబడ్డాడు .1996లో కామేశ్వరీ సోమిదేవమ్మగారు 70వ ఏట మరణించారు .ఆమెతోపాటు త్రేతాగ్నులు’’ బ్రహ్మ మేధం ‘’తో పాటు దూరమయ్యాయి .ఈ బ్రహ్మమేదాన్ని శ్రీరామపురానికి చెందినదువ్వూరి యాజులుగారు ,వ్యాఘ్రేశ్వరానికి చెందిన బులుసు కామేశ్వర సోమయాజిగారు దగ్గరుండి చేయించారు .లక్ష్మీనారాయణ దంపతుల ముసలితనం వలన అంతకు  మూడేళ్ళకు ముందే అగ్ని హోత్రం ఆగిపోయింది .’’లౌకిక ఆరణి’’,స్త్రీలకు మాత్రమే ఉన్న మరొక ‘’సభ్యోక్తి ‘’అగ్నిలను మాత్రమే జాగ్రత్తగా కాపాడి ,రెండేళ్ళ తర్వాత చనిపోయినలక్ష్మీ నారాయణ సోమయాజులుగారి అన్త్యేష్టి కి  ఉపయోగించారు .వీరితో పుల్లెల వారికుటుంబం ఆత్మ విశ్వాసంగా , గర్వంగా చెప్పుకొనే ‘’వేదం లో ఉన్నాము ‘’అనే మాట కూడా దూరమై పోయింది .

 సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-18-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు

పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు

కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజు హస్తినాపురం సమ్రాట్ గా పట్టాభి షేకం జరిగాక ,ధర్మరాజు కాకుండా మిగిలిన నలుగురు సోదరులు శ్రీ కృష్ణుని సందర్శించి ,రాబోయే కలియుగ విశేషాలు వివరించమని ప్రార్ధించారు .సరే అన్న ఆయన తాను  నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు సంధిస్తానని ,వాటిని  వెంబడించి ఒక్కో దిక్కులో బాణం పడి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అక్కడ తాము ఏమి గమనించారో తిరిగి వచ్చి తెలియ జేయమని చెప్పాడు .అలాగే పాండవులు నలుగురు బాణాలు వెళ్ళిన తలో దిక్కుకు బయల్దేరి వెళ్ళారు .

  ముందుగా అర్జునుడు వెళ్ళిన దిక్కులో ఒక కోయిల మధురంగా గానం చేస్తూ కాలికింద కుందేలును  పొడుచుకు తింటూ అతి ఆనందంగా కనిపించింది .బిత్తర పోయిన అర్జునుడు ఈ విషయాన్నివెళ్లి  కృష్ణుడికి చెప్పాడు .భీముడు వెళ్ళిన దిక్కులో నాలుగు  బావులు కనిపించాయి వాటిలో మూడిట్లో నీరు నిండా ఉన్నాయి నాలుగోది నీరు లేకుండా ఖాళీగా ఉంది.పరిగెత్తుకు వెళ్లి బావకు చెప్పాడు .నకులుడు బాణంపడి ఉన్న చోటుకు వెళ్లి చూస్తే అప్పుడే పుట్టిన లేగదూడను ఒళ్లంతా ఆప్యాయంగా  దూడ ఒళ్ళంతా పుళ్ళు పడేదాకా నాకుతున్న ఆవు కనబడింది .సహదేవుడు చోసిన బాణం దగ్గర ఒక పెద్ద కొండ మీదనుంచి పెద్దబండరాయి దొర్లి పడుతూ కిందకు వస్తూ ఒక చిన్న మొక్క అడ్డం వస్తే ఆగిపోవటం గమించాడు .కవలలు కూడా తామిద్దరూ చూసిన వాటిని శ్రీ కృష్ణుడికి నివేదించారు .దీనిభావమేమి తిరుమలేశా అంటూ నలుగురు బిక్కమోహంతో బావ ను అడిగారు .ఆయన విశదంగా వివరించాడు .

 అర్జునుడు చూసిన కోయిల- కుందేలు విషయం లో రాబోయే కలికాలం లో విజ్ఞులైన వివేకులు ధనవంతులు కూడా తమ సంపదను ఆనందంగా అనుభవిస్తూ ప్రక్కనే ఉన్న పేదవారిపై దయా,దాక్షిణ్యం , జాలిలేకుండా పీడిస్తూ వారి సంపదపై బతుకుతూ రాక్షసానందాన్ని కోయిల పొందినట్లుగా పొందుతారు అని భావంగా చెప్పాడు .భీముడు చూసిన నూతుల విషయాన్ని వివరిస్తూ ప్రక్కన అతి పేదవాడున్నా  వాడికి గుక్కెడు నీళ్ళు అందించి దాహం తీర్చాలన్న ఆలోచన రాని వారు కలియుగం లో ఉంటారు అనిచెప్పాడు.నకులుడు చూసిన ఆవు దూడ విషయం లో   –కలియుగం లో తమ తలిదండ్రులు అతి ప్రేమతో గారాబంగా పిల్లలను పెంచి చెడగొడతారుఆవులాగా అన్నాడు .అతిప్రేమతో నాకుతూ తనపిల్లకు పుళ్ళు పడ్డాయని కూడా గ్రహించని ఆవులాగా ,పుత్ర వ్యామోహం, సంతానం పై అతి ప్రేమ పిల్లలను చెడ  గొడతాయన్నాడు .సహదేవుడు  చూసిన దొర్లే కొండమీది రాయి –కలియుగం లో మానవులు నైతిక విలువలు కోల్పోయి బండరాయిలాగా పై స్థాయినుంచి పతనం చెందుతూ ,చివరికి ఆబండరాయి చిన్న మొక్క అడ్డురావటం తో ఆగిపోయినట్లు భగవద్భక్తి, భగవన్నామం వలన పతనం నుంచి కాపాడుకొంటారన్నాడు . అని కలియుగ రహస్యాలు వివరించాడు శ్రీ కృష్ణ పరమాత్మ.

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-18-ఉయ్యూరు    

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’

ఒసే సీతా ఓసారి రావే .పక్కింటి మామ్మగారి కేకలాంటి పిలుపు .’’ముసిలీ !సీత అనిపిలవోద్దని లక్షన్నర సార్లు చెప్పా .సీత్ అని పిలవమని లక్షన్నోక్క సార్లు నోరెత్తి మొత్తుకున్నా.అసలెందుకు పిల్చావ్ ?

‘’ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్ .సీతమ్మ తల్లి పేరు కావాలని నేను మీ నాన్నతో పెటిస్తే  ఇప్పుడేంటి ఈ నీలుగుడు ?

‘’’సీతా సావిత్రి కాలం చెల్లిపోయింది .యువత ఏది చేస్తే అది చెల్లుబాటు .మీ పెత్తనం ఇక సాగదు.ఖబడ్దా ర్’’

‘’ఒసే సావిత్రి ఎక్కడ చచ్చావ్ .ఇందాకట్నించి పిలిచి చస్తుంటే రావేమే ‘’

‘’బామ్మోవ్ !నీపిలుపు కు నేను పలకనని  ఎప్పుడో చెప్పా. అయినా మానవ్.’’సావ్’’అని పిలిచేదాకా పలకనని  చెప్పి చెప్పి విసుగెత్తింది ‘’

‘’సావ్ ఏంటే ? చావు లాగా .అయినా మీ ఇద్దరికీ ఇదేం పోయే కాలమే .నిక్షేపం లాంటి పేర్లొది లేసి –ఇంటావంటా లేని ముదనష్టం .’’

  వెనకింట్లో మీనాక్షి కామాక్షి తో –‘’ఎక్కడి కేడుతున్నావ్ వదినా?

  ‘’గుళ్ళో ‘’చామంతి’’ వారి పురాణ ప్రవచనానికి ‘’.

‘’ఇంకా ఈ పురాణాలు ,ఇతిహాసాలు ఎందుకే ?

‘’నువ్వెక్కడికి  సింగారించుకొని కులుకుతూ పోతున్నావ్ ‘’?

క్లబ్ లో కామారావు గారు కామకేళి పై ప్రాక్టికల్ ప్రసంగానికి .హాయిగా చేస్తూ సరదా చేస్తూ మాట్టాడతాడట .మేం వందమంది వెళ్తున్నాం .నీఖర్మ .చామంతాయన మాటల్లో ఏముంటుంది ? ధర్మం శాస్త్రం కట్టుబాట్లు ,ఒకమగాడికి ఒకటే పెళ్లాం.ధర్మం చర అంటూ బోర్ కొట్టటమేగా ?కాలం మారింది .అవన్నీ ఇక చెల్లవు .’’

‘’ఓసి నీ దుర్మార్గం కూలిపోనూ .నీకేం పోయే కాలమొచ్చిందే .పురాణాలు చేదా? ధర్మ0 విషమా ?నీతి బూతా?కలికాలం కలికాలం అంటే ఏమిటో అనుకొన్నా .నాకళ్ళ ఎదుటే అన్నీ కూలి పోతున్నాయి రో దేవుడో ‘’

‘’నీ చాదస్తం తో నువ్వు మట్టి కొట్టుకో .అక్కడ టికెట్లు కొని సీట్ రిజర్వ్ చేసుకోన్నాం. నీతో సోది పెట్టుకుంటే సాగదు .ఎవరిఖర్మ కెవరుకర్తలు ?అనుభవి0చాలమ్మా .ప్రసంగం లో కాదు ‘’సంగం’’ లోనే ముక్తి అంటాడు కామారావు ‘’

ఎదురింటాయన తన పక్కి౦టాయనతో ‘’మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా సారూ ?’’

‘’మగ సంబంధం వెతకాల్సిన పనిలేదండీ ఇక .మా అమ్మాయి తన చిన్ననాటి స్నేహితురాలితో కలిసి ఉంటోంది .ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొంటు౦దట .ఇప్పుడేదో తీర్పు వచ్చిందట .ఆడాళ్ళు ఆడాళ్ళను మగాళ్ళను మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చని నిజమేనా మాస్టారూ?’’

‘’నిజమేనండి .ఎవరూ ఎదురు చెప్పటానికి వీల్లేదు .స్వలింగ సంపర్కం గ్రీకు దేశం లో ఎప్పటి నుంచో ఫాషనట .అరిస్టాటిల్ ,ఆయన శిష్యుడుజగజ్జేత అలేక్జాండర్ కూడా ఆబాపతేనట  .ఆధునిక కాలం లో ఆస్కార్  వైల్డ్ ,సోమర్సెట్ మాం ,మధ్యకాల౦ లో మో సింఫనీ మాంత్రికుడు బీథోవెన్ అంతేట.’’

‘’మరి, భవిషత్తులో ఆడపిల్లలు ,మగపిల్లలు ఎలాపుడతారండీ బాబు ?పిచ్చి కుదిరింది తలకురోకలి చుట్టమన్నట్లుంది లోకం తీరు .ఏదైనా అంటే ఏదో తీర్పు అని మన నోళ్ళు నొక్కేస్తున్నారు.నాసంగతి ఇలా అఘోరి౦చిందనుకోండి .మీ అబ్బాయి కి పెళ్లి సంబంధాలుచూస్తున్నారా ?’’  

‘’మా వాడూ ఆ తానులో గుడ్డే కదండీ బాబూ .వాడు కూడా చిన్నప్పటినుంచి ఒకే కంచం లో తిని ఒకే మంచం లో పడుకున్న జిగినీ దోస్త్ ఉన్నాడట వాడికే తాళికట్టి కాపురం అఘోరిస్తాడట ‘’

‘’నాలుగు కూకలేసి ఇంట్లో కూర్చో పెట్ట లేక పోయారా ?’’

‘’నాలుగేమిటండీ .నాలుగొందల సార్లు చెప్పాం నేనూ వాళ్ళమ్మా కూడా .ససేమిరా అన్నాడు .వాళ్ళమ్మ నూతిలో దూకుతానని బెదిరించింది కూడా .’’

‘’దారికి రాలేదా ?’’

‘’రాలేదు మహప్రభో !నూతిలోనీళ్ళు పనికిరాకుండా పోతాయి .ఇంకెక్కడైనా చావు అని కుళ్ళు జోకేశాడు పైగా ‘’

వీధి అరుగు మీద కూర్చున్న ఇరుగింటి ,పొరుగింటి పెద్దాయనలో ఒకాయన –‘’ఏంటండీ చాటింపు వినిపిస్తోంది .నాకళ్ళు పెద్దగా కనిపించవు .చెవులూ అంతే.’’

‘’అదా౦డీ బాబయ్యగారూ !ఇవాళ చౌరాస్తాలో పెద్ద భోగిమంట వేస్తున్నారట .’’

‘’ఇప్పుడు భోగి పండగ రోజులు కావుగా “”?

‘’అదేదో సినిమాలో బ్రహ్మానందం తన ఇష్టమొచ్చిన రోజు దీపావళి జరుపుతానని హడావిడి చేస్తూ ‘’ఎనీ అబెక్షన్ ?’’అని సవాలు విసిరాడు చుట్టుప్రక్కల ఇళ్ళ వాళ్ళని .అలాగే ఇది. భోగి మంటకాదండీ  .మన పురాణాలు ధర్మ శాస్త్రాలు నీతిశతకాలు కాల దోషం పట్టేశాయట.వాటిని కలెక్ట్ చేసి తగలబెట్టి వినోదం చూస్తారట .’’

‘’ఇదే౦ పోయే కాలం  ?’’

‘’పొద్దున్న నేను వారించాను .’’నువ్వెవరవోయ్ కోన్ కిస్కాగాడివి ‘’అని నన్ను తన్ని తగలేశారు .’’

‘’అయ్యో పాపం .ధర్మ రక్షణ చేద్దామనుకున్న మీకు ఇంతటి పరాభవమా’’  ?.కలికాలం బాబూ కలికాలం ‘’ఇదంతా వింటుంటే రెండో ప్రపంచ యుద్ధం లో నాజీ దురాగతాలు గుర్తుకొస్తున్నాయ్ “’‘’నాజీ  దుర్మార్గాలా ?ఏదో లక్షలాది యూదుల్ని చంపారని విన్నాకాని పుస్తకాల పై కూడా పగబట్టారావాళ్ళు ?’’

‘’అవును .రాజ్య ద్రోహమని ,కమ్యూనిస్ట్ రచనలని హిట్లర్ కు వ్యతిరేకమైనవని లైబ్రరీలలో ఉన్న పుస్తకాలన్నీ లారీలకు లారీలు మోసుకొచ్చి నడి బజార్లలో డ్రమ్ములు, పిచ్చ సంగీతం హోరు లో కాల్చి పిచ్చ నవ్వు నవ్వుకున్నారురాక్షసానందం పొందారు ,యువకులు , నాజీలు .సరస్వతి ని హత్య చేశారు బాబూ –కిరాయిమూకలు ‘’

‘’ఇంటింటికీ వచ్చి ,మన ప్రమేయం లేకుండానే వీళ్ళు కూడా పూజాపుస్తకాలు ధర్మ గ్రంధాలు వ్రతకధలు  నోములపుస్తకాలు నీతి గ్రంధాలు వాళ్ళే వెతికి పట్టుకొని సంబరాలు చేసుకొంటూ తీసుకు వెళ్ళారు .సాయంత్రం ఇళ్ళల్లో వాళ్ళంతా హాజరై ఆ భోగిమంటలు చూడాలట.కడుపు మండు తోంది బాబు గారు’’.  

‘’పోయే కాలమొస్తే ఎవరాపగలరు మూర్తిగారు .అసలు ఎందుకీ చేష్టలట?’’

‘’అవన్నీ నీతి, న్యాయం ,ధర్మం, శీలం, పతివ్రతా లక్షణాలు చెప్పేవట .ఇవన్నీ ఇక ‘’చల్తానై ట’’.ప్రగతి నిరోధక పుస్తకాలట.ఆడదాన్ని ఇంట్లో కట్టి పడేసేవి ,ఒక మొగుడుకు ఒకటే పెళ్ళాం అని బోధించే వీ నట.పరాయి మగాడిని కన్నెత్తి చూడరాదని ,పరాయి స్త్రీతో సంబంధం వద్దనీ చెప్పే శుష్క వాక్యాలట.పెళ్లి అయిన అమ్మాయి మరో పరపురుషుడితో కలవరాదన్న చాదస్త పుస్తకాలట.పెళ్ళయిన మగాడు కూడా మరోస్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోరాదని బోధించే చెత్త రాతలట ‘’

‘’అయ్యో అయ్యో !మరి మన  యువత ఏమంటోంది ?’’

‘’ఏమంటుంది ?తానా అంటే తందానా అంటోంది .ఇందులో యవ్వనం లో ఉన్న యువతీ యువకులే కాదు అన్ని రకాల వయసున్న ఆడామగా కూడా ఫుల్  సపోర్ట్-.ఇదేమి కాని కాలమో ?’’

‘’మూర్తిగారూ !నా చిన్ననాటి  సంఘటన ఒకటి గుర్తుకొస్తోంది .గుంటూరు లోనో, తెనాలి లోనో ఒక లాయరు గారికి అర్ధరాత్రి ఆవేశం వచ్చి తన లాంటి భావాలున్న ఆడా మగా లతో కలిపి’’ఫ్రీ లవ్ సొసైటీ ‘’ఏర్పాటు చేశాడు .-కానీ ‘’

‘’అరే! అప్పుడు నేను పుట్టిఉంటే  ఆక్లబ్ లోబాగా  చెలరేగి పోయేవాడిని .ఎంజాయ్ చేసేవాడిని .మాబాబూ అమ్మా నన్ను లేటుగా కన్నారు .’’

‘’అందుకే మూర్తిగారు ‘’కానీ ‘’అని ఆపాను .ఆ క్లబ్ సభ్యులైన ఆడా ,మగా స్వేచ్చగా రాత్రిపూట ఎవరి పెళ్ళాలతోనైనా, ఎవరి మొగుళ్ల తో నైనా హాయిగా పడుకొని సెక్స్ కోర్కెలు తీర్చుకోవచ్చు .ఎవరూ అభ్యంతర పెట్టటానికి వీలు లేదని  రూల్స్ కూడా పెట్టుకున్నారు .ఒక నెల అయ్యే సరికి అసలు పెట్టిననాయనకు చుక్కలు చూపించారు మిగతావాళ్ళు .ఆయన పెళ్ళాన్ని రోజూ రాత్రిళ్ళు మిగిలినవాళ్ళు హాయిగా వాడుకొన్నారు. కాని వాళ్ళ పెళ్ళాలను ఈయన దగ్గర పడుకో బెట్టకుండా ఏదో సాకు చెప్పేవారు .దిమ్మతిరిగి బొమ్మ కనబడింది గురూ గారికి .అంతే అర్ధాంతరంగా క్లబ్ రద్దు చేశాడు ‘’

‘’మీరు అన్నీ  ప్రత్యక్షం గా చూసినట్లు చెప్పారు .మీక్కూడా సభ్యత్వం ఉండేదా బాబుగారూ ?””

‘’లేదు నాయనా ,కర్నాకర్నీ విన్నా .పేపర్లన్నీ అప్పుడు కొళ్ళయి కూశాయి .అంత సీన్ నాకు లేదు బాబూ ‘’.

ఎదురింట్లో మామగారితో కొత్తల్లుడు ‘’మామగారూ! నా బెడ్ రూమ్ బాగా అన్ని సౌకర్యాలతో కట్టించారు బాగుంది .కానీ ‘’

‘’ఏమైంది బాబూ !ఇంకా ఏమైనా మార్పులు చేయించాలా ?’’

‘’అవును .మీఅమ్మాయితో కాపురానికి అది భేషుగ్గానే ఉంది .కాని నాకోసం వచ్చే లేడీస్ కి అది సరిపోదు .దీనికి ఎటాచ్ చేస్తూ ఇంకోటి ఇల్లాగే కట్టించండి ‘’

‘’అదేమిటల్లుడూ !అమ్మాయి కాపురం బుగ్గి చేస్తావా ?’’

‘’కాదండీ .ఈ మధ్య తీర్పు వచ్చి౦దిగా .భార్య అనుమతి తో పరస్త్రీ తో సంబంధం పెట్టుకోవటం నేరం కాదని .మీ అమ్మాయి అంగీకారం తోనే నా పని చేస్తాను .చదూకున్న అమ్మాయి కనుక అఫ్కోర్స్ ఒప్పుకుంటుంది .ఒప్పుకుంటేనే సాహసిస్తా .ఓకేనా మామయ్యా ?’’

‘’చస్తానా !నీ ఏడుపేదో నువ్వేడు .’’అసహనంగా మామ .

పక్కింట్లో అత్తగారితో కొత్తకోడలు –‘’అత్తయ్యా ! బెడ్ రూమ్ బాగుంది .మీ అబ్బాయికి  నాకు గ్రాండ్ గా ఉంటుంది- కానీ’’

‘’సందేహం ఎందుకమ్మా !చెప్పు “”

‘’నాకు మీ అబ్బాయికాక ఇంకేవరితోనైనా పడుకోవాలనిపిస్తే మరొక బెడ్ రూమ్ ఉంటే బాగుంటు౦ది కదా అని.మామయ్యగారు లేరాయె .పెత్తనమంతా మీదేనాయే .నా కోరిక తీర్చరా ?అదైనా మీ అబ్బాయి ఇస్టపడితేనే వేరేవర్నైనా పిలుచుకొంటాను .ఆయన డిస్టర్బ్ కాకూడదుగా   .ఆయన క్షేమం కూడా నాకు ముఖ్యం కదా అత్తయ్యా “’

‘’నో-నో-స్టాపిట్,-స్టాపిట్ ‘’

ఏమండీ మిట్టమధ్యాహ్నం నిద్రలో ‘’నోనో స్టాపిట్ స్టాపిట్ ‘’అంటూ ఆ గావుకేకలేమిటండీ .హడిలి చచ్చాను .ప్రక్కమామ్మగారిని అడిగి ఇంత మంత్రించిన విభూది తెస్తాను రాసుకొని పడుకోండి ..’’అని మాఆవిడ అనే దాకా ‘’అది అంతా కల’’ అని నాకు తెలీనే తెలీదు.

  దసరా సరదా కోసం చేసిన ప్రయత్నమిది

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-18-ఉయ్యూరు   

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగాదికి సరసభారతి ప్రచురించే రెండు గ్రంధాల ఆవిష్కరణ

 ఉగాదికి సరసభారతి ప్రచురించే రెండు గ్రంధాల ఆవిష్కరణ
సాహితీ బంధువులకు మహర్నవమి విజయ  దశమి  శుభాకాంక్షలు –
   శ్రీ వికారి నామసంవత్సర ఉగాది  (6-4-2019 ) కి 6 రోజుల ముందు వచ్చే ఆదివారం అంటే 31-3-2019 సరసభారతి నిర్వహించే ఉగాది వేడుకలలో నేను  రచించిన 20 21 , ,సరసభారతి ప్రచురిస్తున్న 31,32పుస్తకాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోందని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .
1-దర్శనీయ శ్రీ ఆంజనేయదేవాలయాలు -2 రెండవ భాగం -మొదటి భాగం లో చోటు చేసుకొనని సుమారు 150 దేశ ,విదేశాలలోని శ్రీ ఆంజనేయ దేవాలయాల విశేషాలు .
2-శ్రీ మైనేని గోపాలకృష్ణగారు పంపిన శ్రీ దాసరి ఆంజనేయులుగారి గారి ఇంగ్లిష్ రచన -”‘’PUTCHA VENKATESWARLU(1921-1997) Elected Fellow 1970’’.ఆధారం గా నేను అంతర్జాలం  లో 2-12-2017 నుండి 20-12-2017 వరకు రాసిన 14 ఎపిసోడ్ ల-
” మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక  వేత్త – తెలుగువిద్యా  తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటేశ్వర్లు”. 
. విద్యార్థులకు యువతకు స్ఫూర్తిదాయక కరదీపిక .
  సరసభారతి అభిమానులు ,ప్రాయోజకులు ,సాహిత్యాభిమానులు అందిస్తున్న యెనలేని ప్రోత్సాహక అభిమానాలకు మరొక మారు 
దసరా శుభాకాంక్షలతో కృతజ్ఞతలు-
గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-18-ఉయ్యూరు  
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ఆవిష్కరణ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 329-యతి గీతి శతక కావ్య కర్త  –మన్మోహన ఆచార్య (1967-2013)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

329-యతి గీతి శతక కావ్య కర్త  –మన్మోహన ఆచార్య (1967-2013)

ఒరిస్సా జహత్సింగ్ పూర్ జిల్లా లతంగ గ్రామం లో 1967 అక్టోబర్ 20మన్మోహన ఆచార్య జన్మించాడు .మాయాధర ఆచార్య తండ్రి .పార్వతి దేవి తల్లి .అతని కవిత లు –గీతామోహనం ,గీతా భారతం ,గీతా మిలి౦ద౦ ,పాలిపంచాసిక ,సుభాస చరితం ,శ్రీ శివానంద లహరిక ,యతి గీతి శతకం సంస్  సంస్కృతకావ్యం .నృత్య రూపకాలు –అర్జున ప్రతిజ్ఞా ,శ్రిత కమలం ,పాదపల్లవం ,దివ్య జయదేవం ,రావణ ,పింగల ,మృత్యు ,స్థిత ప్రజ్ఞా,తంత్రం,పూర్వ శాకుంతలం,ఉత్తర శాకుంతలం .

  జయ దేవుని గీత గోవిందాన్ని ‘’గీత గోవింద రసావలి ‘గా అనువదించాడు .అనేక పరిశోధన వ్యాసాలూ రాశాడు –శిష్టాచార,ఇండియన్ ట్రెండ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ,యాన్ ఆల్జీబ్రేక్ ఆపరేషన్ ఇన్ వేదిక్ మాధమాటిక్స్  ,యాన్ ఎన్సైక్లో పీడిక్  డిక్షనరీ ఆఫ్ యజుర్వేదిక్ ఉపనిషత్స్ ,దిస్క్రిప్షన్ ఆఫ్ హార్ట్ ఇన్ ఉపనిషత్స్ ,తర్క వాచస్పతి మధుసూదన మిశ్ర ,మాప్ ఆఫ్ పురాణిక్ ఇండియా .

 మన్మోహన్ ఆచార్య ప్రతిభకు తగిన పురస్కారాలు పొందాడు –సాంస్క్రిట్ ఎలక్వెంసిఅవార్డ్ ,వా ణీకవి అవార్డ్ ,గీతాసారస అవార్డ్ ,భారత భారతి సమ్మాన్ ,సాంస్క్రిట్ సంగీత నాటక అవార్డ్ ,ఫెలో ఆఫ్ వాచస్పతి ,చింత చేతనా నేషనల్ బాలసాక్షి అవార్డ్ మొదలైనవెన్నో .

  మన్మోహన్ ఆచార్య 2013లో 46ఏళ్ళకే కటక్ లో మరణించాడు

330-’’శ్రీ శివ రాజ్యోదయం ‘’మహా కావ్య కర్త  –శ్రీధర్ భాస్కర్ వర్నేకర్ (1918)

  శ్రీధర్ భాస్కర్ వర్నేకర్  నాగపూర్ లో 31-7-1918 జన్మించాడు .సంస్కృతంలో అనేక కవితలు రాశాడు .అందులో అతి ముఖ్యమైన మహా కావ్యం ‘’శ్రీ శివ రాజ్యోదయం ‘’.దీన్ని యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ వారు సివిల్ సర్వీస్ పరీక్షలో సంస్కృత పేపర్ రాసేవారికి పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు . .ఇది సంస్కృత విభాగం లో సాహిత్య అకాడెమి  ఆవార్డ్ ను 1974 లో పొందింది .ఛత్ర పతిశివాజీ మహారాజ్  జీవితం ,త్యాగం ,రాజ్యపాలనలపై 68  కాండల సంస్కృత కావ్యం ఇది.

డా.వర్నేకర్ కు ప్రెసిడెంట్ అవార్డ్ కాళిదాస సమ్మాన్ అవార్డ్  బిర్లా ఫౌండేషన్ సరస్వతి పురస్కార్ మొ దలైన పురస్కారాలు లభించాయి .అమెరికాలోని  లోని న్యుపాల్త్జ్ లో ఉన్నన్యూయార్క్ స్టేట్ యూని వర్సిటి ఆహ్వానం పై సంస్కృత   సెమినార్ కు వెళ్ళాడు . ఈకవి సంస్కృత సాహిత్య సేవకు హర్షించిన శ్రీ శంకరా చార్య జగద్గురువులు ‘’ప్రజ్ఞా భారతి ‘’బిరుదు ప్రదానం చేసి సన్మానించారు.

  సశేషం

  దుర్గాష్టమి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-18-ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ఆవిష్కరణ న్యూస్ పేపర్ కటింగ్

సరసభారతి పుస్తక ఆవిష్కరణ న్యూస్ పేపర్ కటింగ్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమెరికాలో ”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి రామయ్య ”పుస్తకావిష్కరణ

అమెరికాలో సరసభారతి ఆధ్వర్యంలో గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన” అణు శాస్త్రవేత్త డా శ్రీ ఆకునూరు వెంకట రామయ్య ”గ్రంథాన్ని   15-10-18 సోమవారం సాయంత్రం టేనస్సీ రాష్ట్రం నాష్ విల్ లోని  డా రామయ్యగారి స్వగృహం లో  మన శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్ర ప్రసాద్,ఆవిష్కరించారు .  శాస్త్రవేత్తశ్రీ  వేంకట రామయ్య, దంపతులు, స్పాన్సర్  శ్రీమైనేని గోపాలకృష్ణ  శ్రీమతి భ్రమరాంబ గారు పాల్గొన్నారు -దుర్గా ప్రసాద్

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment