మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201 201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు -201

201-వేణుగాన విద్వాంసుడు ,సంగీత దర్శకుడు ,కంపోజర్ ,రచయిత,మూడు ఖండాలలో అనేకసార్లు కచేరీలు చేసిన –ఏల్చూరి విజయరాఘవరావు

ఏల్చూరి విజయరాఘవ రావు (నవంబర్ 3, 1925 – నవంబర్ 30, 2011) ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత.[1].ఆయన అత్యంత ప్రతిభావంతుడు. సంగీత లోకంలో చాలా గొప్పవాడు. మహాత్మాగాంధీనే తన రామధున్‌ కార్యక్రమం ద్వారా మెప్పించినవా డు. ఖండాంతర ఖ్యాతినార్జించినవాడు. ప్రపంచంలోని ఐదు ఖండాలలో మూడు ఖండాలలో ఒకసారి కాదు ఎన్నోసార్లు ఆయన సంగీత కచేరీలు నిర్వహించాడు. శ్రోతల నుంచి బహుళ విశేష ప్రశం సలు పొందాడు. ఆయన వేణునాద రికార్డులు ఇంగ్లండులోనూ, పారిస్‌లోనూ లభిస్తాయి.ప్రాచుర్యం పొందాయి.

జీవిత విశేషాలు
విజయరాఘవ రావు గారు శ్రీ ఏల్చూరి రామయ్య,సుబ్బాయమ్మ దంపతుల ద్వితీయ సంతానంగా 1925, నవంబర్ 3 న జన్మించారు. ఆయన పసి బిడ్డగా ఉండగానె తండ్రి కాలం చేశారు. వీరి అన్నగారు నయాగరా కవుల్లో ఒకరైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. తండ్రి గారి నుంచి ఆయనకు సంగీతాభిమానం సంక్రమించింది.ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు. విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఇవన్నీకాక సుబ్రహ్మణ్యంగారి సోదరుడిగా తెలుగు కవిత్వమూ, కథలూ, ఇంగ్లీషులో రచనలూ చేశారు.[2]

కళాకారునిగా
బాల్యంలో నరసరావుపేటలో ఎకరాల కొద్దీ విస్తరించిన పెద్ద చెరువు నిండుగా నీళ్లతో తొణికిసలాడుతూ పలనాడు రోడ్డు వెంబడే ఉండేది. చెరువు కట్ట దగ్గర్లోనే ఏల్చూరి రామయ్య గారి ఇల్లు రాళ్ళబండి వారి వీధిలో ఉండేది. ఆ వీధికి పక్కగానే యాదవుల వీధి ఉంది. చెరువు కట్ట మీద యాదవుల పిల్లలతో కూడి వారి వద్దనే వేణువు వాయించడం నేర్చుకున్న విజయరాఘవరావు గారికి ప్రాథమికంగా గురువు ఎవరూ లేరు. అయితే గొల్ల పిల్లలతో చేరి కూడా అల్లరి చేయకుండా విద్యను మాత్రమే గ్రహించే వారు. తర్వాతి రోజుల్లో శాస్త్రీయ సంగీత కచేరిలు చూసి, ఇంటికి వచ్చి సాధన చేసేవారట.[3] ఆయన సంగీతానికి శ్రోతలుగా అనిసెట్టి కృష్ణ, నరసరావు పేట లోని కన్యకా పరమేశ్వరీ గ్రంథాలయ నిర్మాత, విద్యావేత్త మస్తాన్ గార్లు ఉండేవారు. అనిసెట్టి కృష్ణ గారి ప్రేరణతో ఆ తర్వాత ఆయన మద్రాసు వెళ్ళి కళా క్షేత్రంలో సంగీతం, రుక్మిణీదేవి అరండేల్ గారి వద్ద భరత నాట్యం అభ్యసించారు. అక్కడికి వచ్చిన ప్రఖ్యాత నర్తకులు ఉదయ శంకర్ గారి దృష్టిని ఆకర్షించి వారి నృత్య బృందంలో నర్తకుడిగా దేశ విదేశాలూ తిరిగారు. ఆ ప్రదర్శనలు ఇస్తున్నపుడే ఒకసారి రష్యాలో నాట్య ప్రదర్శన అనంతరం వేణు గానంతో అక్కడి శ్రోతల్ని అబ్బుర పరిచారు. ఆ సందర్భంలోనే ఉదయ శంకర్ గారి సోదరుడు పండిట్ రవి శంకర్ తన శిష్యుడిగా స్వీకరించి హిందూస్తానీ సంగీత ప్రపంచంలోకి ఆయన్ని ఆహ్వానించారు. అక్కడితో ఆయన ప్రతిభ మరింతగా విస్తరించింది.[3] సితార్ విద్వాంసుడైన రవిశంకర్‌వద్ద సంగీతం నేర్చుకున్న విజయరాఘవరావు ఆయనకు నికరమైన శిష్యుడు ఎందుకంటే కేవలం రాగతాళాలేకాక మొత్తం భారతీయసంస్కృతినీ, అందులోని వివిధ అంశాలనూ పరిశీలించి, అర్థంచేసుకునే సామర్థ్యం ఆయనకు అలవడింది. రవిశంకర్ స్వయంగా సంగీతరచన చేసిన అనూరాధా, గోదాన్, మీరా మొదలైన హిందీ చిత్రాల రికార్డింగ్‌లన్నిటిలోనూ రావుగారు ప్రధానపాత్ర నిర్వహించారు. ఫిల్మ్స్ డివిజన్‌వారి అసంఖ్యాకమైన డాక్యుమెంటరీల సంగీతంలో ఆయన రేడియోశబ్గాల దగ్గర్నుంచీ, రకరకాల ప్రపంచవాద్యాలదాకా అనేకం వాడి విజయవంతమైన ప్రయోగాలు చేశారు.[4] తెలుగువారికన్నా, ముంబాయి, ఢిల్లీ ఇంకా ఉత్తరభారతదేశ ప్రముఖ నగరాలలో సంగీత విద్వత్ప్రముఖుడిగా గొప్పఖ్యాతినార్జించినవాడు.1945 నుండి 1958 వరకు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో విజయరాఘవరావు సంగీత ప్రయోక్తగా, వాద్యబృంద కార్యక్రమ సంవిధాన కర్తగా పనిచేశారు.

ముఖ్య ఘట్టాలు
గాంధీజీ హత్య జరిగినపుడు బిర్లా భవన్‌ ప్రార్థన సమావేశపు ప్రసార కార్యక్రమానికి శబ్దగ్రాహక యంత్రాలు, సిబ్బంధి ఎంతో శ్రద్ధా నిమగ్నతతో సంసిద్ధమై ఉండగా భయంకరమైన తుపాకి కాల్పులు, సభా స్థలిలో హాహాకారాలు, రోదనలు, విషాదోద్వేగ కలకలం, వీధుల్లో జనం ఆందోళనతో ఉరుకులు పరుగులు తీస్తూ మూలమైన సంక్షభ సూచకంగా పెడుతున్న కేకలు, ఆక్రందనలు ఆకాశవాణి ప్రసారయంత్రాలు విన్పించడం ప్రారంభమైంది. అప్పుడు ఆకాశవాణి కార్యాలయం ఉద్యోగులంతా నిర్ఘాంతపోయారు. నిలువెల్లా సంచలించారు. ఎవరికీ ఏం చేయాలో, అసలేం జరిగిందో తెలియలేదు. అప్పుడు విజయరాఘవరావు ఉద్యోగ బృందానికంతా స్థైర్యం కలగజేసి ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గీతాన్ని శృతిలయబద్ధంగా ఎడతెగకుండా వాద్యసంగీత రూపంగా ప్రసారం చేయించారు. మధ్యలో చిన్న ప్రకటనేమైనా ప్రసారం చేసినా ఆ తర్వాత 24 గంటలు ఈ ప్రార్థన సందేశ గీతిక ప్రసారమవుతూనే ఉంది. దీనిని స్వరపరచినది రాఘవరావే. ఆ తరువాత మహాత్మాగాంధీ సంస్మరణ నివాళిగా ఇది సంప్రదాయ నిబద్ధమైంది.[5]

1950 ప్రాంతాలలో సర్దార్‌ పటేల్‌ కొద్ది రోజులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండేవారు. అప్పుడు వరసగా కొన్ని రోజులు తనను సంగీతంతో సేదదీర్చవలసిందని పటేల్‌ మహాశయుడు విజయరాఘవరావును కోరారు. సాయంకాలం ఒక గంట విజయరాఘవరావు, ఉస్తాద్‌ అల్లారాఖా తబలా వాద్యసహకారంతో పటేల్‌ మహాశయుడి మనస్సును స్వస్థపరచేవారు, రంజింపజేసేవారు.[5]

అమెరికాలో
అమెరికాలో వాషింగ్టన్, డి.సి.లో ‘కార్నెజీ హాల్‌’ అని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సభా భవనం ఉంది. ప్రపంచ ప్రసిద్ధులైన కళాకారుల గాన సభలు అక్కడ జరుగుతవి. అక్కడ సంగీత కచేరీ నిర్వహించడం జీవిత సాఫల్యంగా భావిస్తారు ప్రసిద్ధ కళాకారులు. విజయరాఘవరావు కార్నెజీ హాల్‌లో వారి ఆహ్వానంపై వేణునాదం విన్పించారు.

అమెరికాలో జార్జియా రాష్ట్రంలో భారతీయ సంగీతం, సంస్కృతి, జ్ఞాన సాధన, చింతనధారలను ప్రచారం చేసే ఒక పత్రిక వెలువడుతున్నది. ముఖ్యంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి కార్యక్రమ నిర్వహణ విశేషాలను ప్రకటిస్తుంది ఈ పత్రిక. పన్నెండేళ్ళ కిందట ‘అట్లాంటా’ నగరంలో ‘ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ సొసైటీ ఆఫ్‌ గ్రేటర్‌ అట్లాంటా అనే సాంస్కృతిక సంస్థ విజయరాఘవరావు సంగీత కచేరీ ఏర్పాటు చేసింది. ఆయన గొప్ప నర్తకుడు కూడా. దేశవిదేశాలలో అనేక నృత్యప్రదర్శనలిచ్చాడు. పసిపిల్లల వంటి పరమ ఉల్లాస ప్రవృత్తి ఆయనది.

సోనీ కంపెనీ వాళ్ళు విజయ రాఘవరావు హంసధ్వని గంటన్నరసేపు ఆలపించగా రికార్డు చేసరు. ‘భువన్‌ షోమ్‌’ కూడా నాకు వారు ప్రదర్శించి చూపారు. ఏల్చూరి విజయరాఘవరావు ఇంగ్లీషులో, తెలుగులో కవిత్వం రాశారు, కథలు రాశారు. 1991 జనవరి- ఫిబ్రవరి ఇండియన్‌ లిటరేచర్‌ (సాహిత్య అకాడమి)లో వారి సాహిత్య ప్రస్థాన వ్యాసం ప్రచురితం. అందులో సంగీత సా హిత్యాలలో ఆయన ప్రజ్ఞ, హదయ వైశాల్యం ఎంతో గొప్పగా ఆవిష్కృతమైనాయి.

అవార్డులు
ఆయనకు 1970 లో భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన పద్మశ్రీ వచ్చింది.[6] 1982 లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[7] జాతీయ అంతర్జాతీయ స్వర్ణ పతక సమ్మానితుడు.

వ్యక్తిగత జీవితం
ఆయన 1947 లో శ్రీమతి లక్ష్మి వి.రావును వివాహమాడారు. ఆయనకు నలుగురు పిల్లలు, తొమ్మిదిమంది మనవళ్ళు.sident of the United States.

ఎన్నెన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం చేశారు .స్వయంగా నటులు .ఉదయ శంకర్ తో కలిసి పని చేశారు .ఈయన కుమారుడు మురళీ ధర్ విజయవాడ రేడియోలో డ్యూటీ ఆఫీసర్ గా చేశారు .పద్యకవి కూడా .ఇక్కడ రాజీనామా చేసి న్యు ఢిల్లీ వెంకటేశ్వర కాలేజిలో తెలుగు లెక్చర్ చేశారు .పి.హెచ్ డి.చేశారు .పురాణ వ్యాఖ్యానం లో దిట్ట .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 ·

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200

·         200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ-2

     శ్రీవాత్సవ గురించి యామిజాల జగదీశ్ ,గొల్లపూడి మారుతీరావు చెప్పిన మరిన్ని విశేషాలు

ప్రభుత్వ ఉద్యోగాలలోనో, ఆకాశవాణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనో పనిచేసేవారు ఇంకొక చోట సొంత పేరుతో రాయడానికి వీలులేని పరిస్థితులలోనో, భద్రత కోసమో కలంపేర్లను ఉపయోగించుకుంటారు.
ఆకాశవాణిలో పనిచేసిన యండమూరి సత్యనారాయణ ‘శ్రీవాత్సవ’ పేరుతో రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర వార పత్రికలో ప్రతి సంవత్సరం ఆయనచేసిన సాహిత్య సింహావలోకనాలు చాలా ప్రసిద్ధాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1956లో నాటక ప్రయోక్తగా ప్రవేశం చేసి 12 సంవత్సరాల పాటు ఎన్నో నాటకాలు ప్రసారం చేశారు. కూచిపూడి నాట్య సంప్రదాయానికి ఊపిరిపోసింది బందా. కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యత్వాలు లభించాయి. అభినవకృష్ణ, నటశేఖర బిరుదులతో సత్కరించారు. ఉత్తమనటుడుగా 1963లో రాష్ట్రపతి అవార్డు పొందారు. రేడియో నాటికలు సంపుటిగా ప్రచురించారు. కూచిపూడి నృత్యంపై వీరి రచన ప్రామాణికం

1968 డిసెంబరు 3న నాటకరంగంలో ధృవతార రాలిపోయింది. ఇప్పటికీ కూచిపూడిలో బందా వర్థంతి ఏటా జరుగుతుంది. కూచిపూడిలో సిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాణానికి ఆయన కృషి అపారం.

వీరి తర్వాత జ్ఞప్తికి తెచ్చుకోవలసిన వ్యక్తి ఆమంచర్ల గోపాలరావుగారు వీరు నాటక విభాగ ప్రయోక్తగా విజయవాడలో పనిచేసి పదవీ విరమణ చేశారు. చాలాకాలం మదరాసులో కూడా పనిచేశారు.యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ) 1913 }} శ్రీవాత్సవగా ప్రసిద్ధి చెందిన యండమూరి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో 1913 మే 21న జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం గావించిన సత్యనారాయణ ఆకాశవాణిలో విజయవాడ, మదరాసు కేంద్రాలలో కార్యక్రమ నిర్వహకులుగా చాలాకాలం పనిచేశారు. ఆపైన అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా ఢిల్లీ బదలీ అయి వెళ్ళారు.

ఘంటసాల వేంకటేశ్వర రావు 1944  సెప్టెంబర్ ఇరవైన మొదటిసారి రేడియోలో పాడారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన లలితసంగీత కార్యక్రమాల్లో, సంగీత నాటకాల్లో పాల్గొంటూ వచ్చారు. దీపావళి పండుగ కోసం సముద్రాల రాఘవాచార్యులు రాసిన ‘వెలుగు వెల్లువ’ అనే సంగీత నాటకంలో ఘంటసాల, భానుమతి ప్రధాన పాత్రధారులు. విశ్వనాధ రాసిన ‘కిన్నెరసాని’ సంగీత నాటకానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ‘లైలా మజ్నూ’ నాటకంలో ఘంటసాల మజ్నూ పాత్ర పోషించారు. అందులో ఆయన పాడిన ‘గుడారమెత్తివేశారు’, ‘ఎందు చూచినగాని లైలా…’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.(రచన: యండమూరి సత్యనారాయణ, సంగీతం : రజని). 1945 లో ఘంటసాల పాడిన రజని గేయం ‘ఘనాఘనా గర్జింపవొ..’ అనే పాట  ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయింది.  ఏరి రచనలకు కేం[ద  పురస్కారం లభించింది. పెళ్లాడే బొమ్మ, తీరని కోరికలు నాటకాలు, నాగరిక, చెట్లు గేయ సంపుటిని రచించారు. వీరు 1968 మార్చిలో ఢిల్లీలో చనిపోయారు. వీరి కుమారులు రామచంద్రరావు జర్నలిస్టుగా విజయవాడలో స్థిరపడ్డారు,

ఉష కిరణాలు

గొల్లపూడి మారుతీరావు

1959-63 వరకూ ఆంధ్రప్రభలో పనిచేసి 1963 జనవరి 17న హైదరాబాదు రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాను. అప్పుడక్కడ రజనీకాంతరావుగారు పనిచేస్తున్నారు. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, యండమూరి సత్యనారాయణ, అయ్యగారి వీరభద్రరావు, ఆచంట నారాయణ మూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు, స్థానం నరసింహారావు, న్యాపతి రాఘవరావు, దాశరథి – ఇలా ఎందరో మహానుభావుల సమక్షంలో నౌఖిరీ. నిజానికి అది ఉద్యోగం కాదు. వైభవం. అప్పటికి రజనిగారు పాటలు రాసి, బాణీలు చేయగా పాటలను చిరస్మరణీయం చేసిన ఒక తరం వెళ్లిపోయింది. ఎస్. వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారి, శాంతకుమారి – ఇలాగ. నా జీవితంలో అదృష్టం – తర్వాతి కాలంలో మళ్లీ వారందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరితో పనిచేశాను. ఓ ముప్ఫై సంవత్సరాల తర్వాత ఇంగ్లండులో కెంట్‌లో మిత్రులు డాక్టర్ వ్యాకరణం రామారావు గారింట్లో సూర్యకుమారి గారిని కలిశాను. ‘‘మీ అందరివల్లే నేను రేడియోలో చేరాను’’ అని ఆమెకు గుర్తు చేశాను.

మద్రాసు కేంద్రంలో తెలుగు శాఖలో నాటక శాఖను కీ.శే.యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ) నిర్వహించేవారు. ఆయన గొప్ప రచయిత. షహరజాద్ – అరేబియన్ నైట్స్ – వేయిన్నొక్క రాత్రుల కథలు, లైలామజ్ను, షిరీజ్ ఫర్‌హద్ లాంటి ఇతివృత్తాలతో నాటకాలు రాసేవారు. వాటిలో పాటలూ, సంగీత రచనా రజనీయే.

ఏటా వార్షిక సాహిత్య సమీక్షలు రాసిన యండమూరి సత్యనారాయణ ఆకాశవాణి మద్రాసులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా చిరకాలం పనిచేశారు. వారి కలం పేరే ‘శ్రీవాత్సవ’, ‘ఆనంద నిలయమ్’ 1954లో ఒకసారి, 1957లో మరోసారి మద్రాసు, విజయవాడ కేంద్రాలలో.. ప్రసారమైంది. ఇందులో ఆరు ప్రధాన పాత్రలు – తండ్రి, తల్లి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. వంగర వెంకట సుబ్బయ్య, ఎన్.ఉదయలక్ష్మి, వావికొలను కృష్ణకుమారి, కాటూరి అన్నపూర్ణగార్లు రెండుసార్లు పాల్గొనడం విశేషం. 1954లో వై.జోగారావు, ఎ.ఎస్. గిరిగార్లు నటించగా 1957లో అవే పాత్రలను ఎ.పుండరీకాక్షయ్య, పేకేటి శివరామ్‌గార్లు చేశారు. వంగర, పుండరీకాక్షయ్య, పేకేటి గార్లు సినిమారంగంలో కూడా ప్రసిద్ధులని గమనించాలి.

 శ్రీవాత్సవ విమర్శకులుగా పేరు తెచ్చుకొన్నారు. భారతి, జయంతి, ఆంధ్ర పత్రిక తదితర పత్రికలలో సాహిత్య సింహావలోకనాలు ఏటా ప్రచురించేవారు. ఉష:కిరణాలు, శారదాధ్వజం గ్రంథాలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1966లో బహుమతి ప్రకటించింది. తంజావూరు నాయకరాజుల సాహిత్య భాషను శారదా ధ్వజంలో వివరించారు. ఆనాటి సాంఘిక సాంస్కృతిక రాజకీయ చారిత్రక స్థితిగతులు ఆయన ఆ గ్రంథంలో విశ్లేషించారు. జలతారు జాబిల్లి పేరుతో బాలలకు ఒక పుస్తకం వ్రాశారు. వయోజన విద్యావ్యాప్తిలో భాగంగా టెలివిజన్ కథ రంగురంగుల పూలు అనే గ్రంథాలు వ్రాశారు.

అలనాటి గాయని ఏ.పి.కోమల

రేడియో కార్యక్రమాలు నిర్వహించు యండమూరి సత్యనారాయణ చాలా సుప్రసిధ్ధులు.పాతతరం రేడియో శ్రోతలందరికీ ఆయన గురించి బాగా తెలుసు .ఆయన కార్యక్రమం ప్రారంబం కావడానికి పది నిముషాలు ముందు పాట రాసేవారు .ఆ పాటని అప్పటికప్పుడు నేర్చు కొని ఆమె పడేవారు .దాంతో ఆమె ప్రతిభని గుర్తించి 1944లో రేడియో ఆర్టిస్ట్ ఉద్యోగం ఇచ్చారు .అప్పుడామెకు 50 రూపాయల జీతం .అప్పుడు రెండో ప్రపంచ యుద్దం జరుగుతు ఉండటంతో వార్ అలెవన్సుస్ కింద మరో 14 రుపాయాలు కలిపి మొత్తం 64 రూపాయలు జీతం ఇచ్చారు .ఆమె మొదటి సంపదనే అదే . స్వతంత్రం వచ్చే వరకు ఎప్పటి ట్రిప్లికేన్ నుంచి లాగుడు రిక్షా లో ఎగ్మూరు స్టేషన్ కి వెళ్లి ,రిక్షా అతనికి నెలకి రెండు రూపాయలు ఇచ్చేవారు .అప్పటికి అందరికి తెలిసిన తాత ఉమామహేశ్వర రావు అప్పట్లో రేడియో అనౌన్సర్ గ పనిచేసారు .
త్యాగయ్యలో లో తొలి పాట ……

యామిజాల జగదీశ్

ఇది అరవై ఏళ్ళ పైమాటే. గోరాశాస్త్రిగారు చలంగారిపై అలిగి శ్రీవాత్సవ గారితో ఓ విమర్శ రాయించారు. శ్రీవాత్సవ గారి అసలు పేరు యండమూరి సత్యనారాయణ రావుగారు.

ఈ వ్యాసంతో అప్పట్లో వాదవివాదాలు జరిగాయి. ఈ వివాదాల వ్యవహారాలలో బి.వి. నరసింహారావుగారు, కె.కె. నాయుడుగారు తదితరులు పాల్గొన్నారు.
అయినప్పటికీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారితో శ్రీవాత్సవగారి విమర్శకు ఓ దీటైన జవాబు ఇప్పించడానికి చిన్నారావుగారు, నరసింహారావుగారు, వజీర్ రహ్మాన్ గారు శాస్త్రిగారింటికి వెళ్ళారు.  
చిన్నారావుగారు చిత్రకారులు. నరసింహారావుగారు స్త్రీ వేషధారణతో మంచి నర్తకిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం గడించినవారు. రహ్మాన్ గారేమో అప్పుడే కాకినాడలో డిగ్రీ పూర్తి చేసారు. చలంగారంటే గాఢమైన అభిమానమున్నవారు.
ఈ ముగ్గురి విజ్ఞప్తితో శాస్త్రిగారు ప్రజామాతలో సాహిత్యభాణం అనే శీర్షికతో ఓ వ్యాసం రాశారు. “భాణం” అంటే ఇక్కడో మాట చెప్పుకోవలసి ఉంది. సంస్కృత రూపక భేదాలలో ఓ ప్రక్రియ. ఎదుటి వారి పాత్రల సంభాషణలను తనే ప్రస్తావిస్తూ చేసే సంభాషణ. మరొక మాటేమిటంటే, భారవిలో భా అంటే భావుక, ర అంటే రచన, వి అంటే విమర్శ.ఈ విషయం గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారు 1958 ప్రాంతంలో ప్రచురించిన చలం జీవితం – సాహిత్యం అనే పుస్తకంలో ఉన్న విషయాన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు తమ వ్యాసంలో పేర్కొన్నారు.
ఆ రోజుల్లో శాస్త్రిగారి వ్యాసం ఓ సంచలనం సృష్టించింది.
చలంగారిని విమర్శించిన శ్రీవాత్సవగారు  ఈ వ్యాసాన్ని చదివిన తర్వాత శాస్త్రిగారింటికి వెళ్ళి “మీ ప్రతిస్పందన చాలా బలంగా ఉంది” అన్నారు.
మరోవైపు, చలంగారు శాస్త్రిగారికి ఓ ఉత్తరం రాస్తూ చలానికి విలువ కట్టిన రచనగా తెలిపారు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200 · 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-200

· 200-మల్లీశ్వరి కృష్ణ దేవరాయలు ,మహా సాహిత్యవేత్త ,రేడియో అసిస్టెంట్ డైరెక్టర్-శ్రీ వాత్సవ

· శ్రీ వాత్సవ గా ప్రసిద్ధి చెందిన యండమూరి సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా పసలపూడి 1913లో మే21న జన్మించారు .ఉన్నత విద్య పూర్తీ అయ్యాక ఆకాశవాణి విజయవాడ ,మద్రాస్ కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకులు గా చాలాకాలం సేవ చేశారు . అసిస్టెంట్ డైరెక్టర్ గా ఢిల్లీ వెళ్ళారు .

· శ్రీ వాత్సవ సాహిత్య విమర్శకులుగా విశేష కీర్తి పొందారు .భారతి ,జయంతి ,ఆంద్ర పత్రిక మొదలైన పత్రికలలో ప్రతి ఏటా’’ సాహిత్య సింహావలోకనం ‘’రాసి ప్రచురించేవారు .ఆయన రాసిన ఉషః కిరణాలు ,శారదా ధ్వజం గ్రంధాలకు 1966లో ఆంద్ర ప్రదేశ సాహిత్య అకాడెమి బహుమతి లభించింది .తంజావూర్ నాయక రాజుల సాహిత్యభాషను ‘’శారదాధ్వజం ‘’లో వివరించారు .ఆనాటి సాంఘిక ,సాంస్కృతిక రాజకీయ ,చారిత్రిక స్థితి గతులను అందులో చక్కగా విశ్లేషించారు .’’జలతారు జాబిల్లి ‘’అని బాలలకోసం ఒక పుస్తకం రాశారు .వయోజన విద్యా వ్యాప్తికోసం టెలివిజన్ కు ‘’రంగు రంగుల పూలు, ‘’కత్తి’’గ్రంధాలు రాశారు .వీటికి కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.పెళ్ళాడే బొమ్మ ,తీరని కోరికలు నాటకాలు ,నాగరిక ,చెట్లు గేయ సంపుటి రచించారు .

· బి ఎన్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఆల్ టైం క్లాసికల్ చిత్రం ‘’మల్లీశ్వరి ‘’లో కృష్ణ దేవ రాయలుగా అద్భుతంగా నటించి రాజసం వీరం దాన దయాగుణాలను ప్రస్ఫుటంగా వ్యక్తీకరించారు .ఆతర్వాత మరికొన్ని సినిమాలలోనూ నటించారు .

· మల్లిక (చిన్నపుడు బేబీ మల్లిక, పెద్దయ్యాక భానుమతి), నాగరాజు (చిన్నపుడు మాస్టర్ వెంకటరమణ, పెద్దయ్యాక నందమూరి తారక రామారావు) బావా మరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి. మల్లిక మంచి గాయని. ఒకసారి వారు వర్షం వచ్చినపుడు ఒక పాతగుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపురాజు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి అల్లసాని పెద్దన (న్యాపతి రాఘవరావు)వస్తారు. అతిధులకు మల్లిక, నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు. మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకోళంగా మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి అని అంటాడు.

· ఇక్కడే ‘’పిలచినా బిగువటరా ‘’ జావళి కృష్ణశాస్త్రి గారు రాయగా భానుమతి పాడుతూ అభినయిస్తుంది .రాయలు పెద్దన మురిసిపోతారు .

· 1969లో 56వ ఏట శ్రీ వాత్సవ ఢిల్లీ లో మరణించారు . ఈయన కుమారుడు యండమూరి రామచంద్రరావు జర్నలిస్ట్ గా బెజవాడలో ఉన్నారు .

· ఉగాది వచ్చింది అంటే శ్రీ వాత్సవ సాహిత్య సింహావలోకనం కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూసే వాళ్ళం .అంత బాగా రాసేవారు .

· సశేషం

· అనుకోకుండా ఈ శీర్షిక మొదలుపెట్టి ఇవాల్టికి 200మంది మరపురాని సినీ మహానుభావులపై రాయగలిగాను .ప్రస్తుతం కొన్ని రోజులు విరామం .తర్వాత మిగిలిన వారి గురించి రాస్తాను

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-199199-రంగస్థలనటుడు ,ప్రయోక్త ,నాట్యకళా పోషకుడు ,కూచిపూడిసిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాత నిర్వాహకుడు ,బాలనాగమ్మ ,సారంగధర సినీ నటుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ ,రాష్ట్రపతి పురస్కార గ్రహీత,అభినవ కృష్ణ  –బందా కనకలింగేశ్వరరావుబందా కనకలింగేశ్వరరావు

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-199
199-రంగస్థలనటుడు ,ప్రయోక్త ,నాట్యకళా పోషకుడు ,కూచిపూడిసిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాత నిర్వాహకుడు ,బాలనాగమ్మ ,సారంగధర సినీ నటుడు ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ ,రాష్ట్రపతి పురస్కార గ్రహీత,అభినవ కృష్ణ  –బందా కనకలింగేశ్వరరావు
బందా కనకలింగేశ్వరరావు, (జనవరి 20, 1907- డిసెంబరు 3, 1968) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు.
ఇతను కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు. ఆటపాకలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత బందరు నోబుల్ కళాశాలలో చదివి, మద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. 1934లో మొదట న్యాయవాదిగా పనిచేసి, తరువాతి కాలంలో నాటక ప్రదర్శనమే వృత్తిగా చేసుకున్నారు.ఇతను నాటకాలలో అనేక పాత్రలు పోషించాడు. వాటిలో బాహుకుడు, బిల్వమంగళుడు ఇష్టమైనవి.
ఏలూరులో 1938లో నాటక కళాశాలను స్థాపించి పలువురు నటులకు శిక్షణ ఇచ్చారు. ప్రభాత్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటక ప్రయోక్తగా నూతన ప్రదర్శన రీతులను ప్రవేశపెట్టారు. తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం సినిమాలైన బాల నాగమ్మ, ద్రౌపదీ మానసంరక్షణం, పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా), సారంగధర (1937 సినిమా) సినిమాలలో నటించాడు.కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవచేశారు. ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు.[1] ఈ కళ గురించి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు.[2] 1956 లో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తగా పనిచేసి మంచి నాటకాలను, నాటికలను ప్రసారం చేశాడు. వీరు ఆటపాక గ్రామంలో ఒక శివాలయాన్ని, ఒక చెరువును తవ్వించారు, ఒక వేద పాఠశాలను స్థాపించారు.
ఇతను 1964 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుపొందాడు. వీరి ఉత్తమ నటనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.వీరికి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
వీరి జన్మ శతాబ్ది ఉత్సవాలను హైదరాబాదులో 2006-07 సంవత్సరాలలో ఘనంగా నిర్వహించారు.
  ఏలూరులో కొంతకాలం న్యాయవాదిగా ఉన్నారు .తాలూకా బోర్డ్ సభ్యులయ్యారు .నాటకాలు ఆరవప్రాణం .కృష్ణ పాత్రకు పెట్టిందిపేరు .సారంగధర ,బిల్వమంగళపాత్రలకు జీవం పోశారు .బళ్లారిలో చిత్ర నలీయం నాటకం లో బాహుకుడుగా నటింఛి ,బళ్ళారి రాఘవ ప్రశంసలు పొందారు .ఎన్నో పౌరాణిక ,చారిత్రకనాటకాలు ప్రదర్శించారు .కణ్వ ,అభిమన్యు ,ప్రతాపరుద్ర ,గిరీశం అల్లూరి ,పాత్రలను దీటుగా పోషించారు .ఈయన తండ్రి శ్రీశైలంగారు కొల్లేటి లంక కరణం .బియేబందరులో పూర్తీ చేసి ,మద్రాస్ లో లా చదివి ,ఏలూరులో ప్రాక్టీస్ పెట్టి ‘’ప్రభాత్ ధియేటర్స్ ‘’నాటక సమాజం స్థాపించి 40ఏళ్ళు నిర్వహించారు .
  ద్రౌపదీ మాన సంరక్షణం సినిమాలో కృష్ణ పాత్రతో సినీ అరంగేట్రం చేసి ,సారంగధర ,పాడుక ,కాలచక్రం బాలనాగమ్మ లలో నటించారు .సినిమా పద్ధతులు అలవాట్లు నచ్చక ,1942లో ఏలూరు తిరిగి వచ్చారు .నాటక రంగ పరిశీలనకోసం 1955లో రష్యా ,ఫిన్లాండ్ ,జెకోస్లోవేకియా దేశాలు పర్యటించారు .
  1956 విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో నాటక ప్రయోక్తగా చేరి 12ఏళ్ళు  అవిరళకృషి చేసి ఎన్నెన్నో అద్భుత నాటకాలను ప్రసారం చేశారు .కూచిపూడి నాట్య సంప్రదాయానికి ప్రాణం పోశారు .కేంద్ర సంగీత నాటక అకాడెమి ,ఆంధ్రప్రదేశ్ నాటకాకదేమి సభ్యత్వాలు ఆయనను వరించాయి .అభినవ కృష్ణ ,నటశేఖర బిరుదులు పొందారు ..ఉత్తమ నటుడుగా 1963లో రాష్ట్రపతి అవార్డ్ అందుకొన్నారు .రేడియో నాటికలను ఒక సంపుటిగా ప్రచురించి  శాశ్వతత్వాన్ని  చేకూర్చారు ,కూచి పూడి నృత్యం పై బందా గారి రచన పరమ ప్రామాణికం .1968 డిసెంబర్ 3 నాటక ధ్రువతార బందా కనుమూశారు ,అప్పటినుంచి ప్రతియేటా బందా వర్ధంతి కూచిపూడిలో జరుపుతున్నారు
  నేను విజయవాడ ఎస్ ఆర్ అర సివి ఆర్ కాలేజిలో ఇంటర్ 1956-58లో చదువుతున్నప్పుడు బందాగారు మా ఆహ్వానం పై వచ్చి R -4 లో కృష్ణ పాత్ర ధారణ చేసి అలరించటం ఇంకా గుర్తు ఉంది .అప్పుడే రజని ,వింజమూరి కనకదుర్గ గార్లు కూడా లలిత గీతాలు పాడగా విని ఆనందించాం. కూచిపూడి సిద్ధేంద్ర కళా క్షేత్ర నిర్మాణం ఆయన చేతులమీదుగా జరగటం దాని ఆవిష్కరణ వేడుకలకు కూచిపూడి వెళ్లి చూడటం నాకు మరువరానిఅనుభవం .బందా ఒక లిజెండరీ మహాపురుషుడు .
   సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-22-ఉయ్యూరు 

1. ↑
• 

       
•         

• —


• 

       
•         

• —

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-198198ప్రముఖ సాహితీవేత్త ,నటుడు రచయిత,రేడియో ఉద్యోగి ,ఏకాంబరం ఫేం ,అమెరికా అబ్బాయి సినిమాకు  కధ అల్లినకళారత్న అవార్డీ –జీడిగుంట రామచంద్ర మూర్తి

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-198
198ప్రముఖ సాహితీవేత్త ,నటుడు రచయిత,రేడియో ఉద్యోగి ,ఏకాంబరం ఫేం ,అమెరికా అబ్బాయి సినిమాకు  కధ అల్లినకళారత్న అవార్డీ –జీడిగుంట రామచంద్ర మూర్తి
జీడిగుంట రామచంద్ర మూర్తి ప్రముఖ సాహితీవేత్త.[1] రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన… ఇలా అన్నింట్లో తన కలానికున్న సత్తా చాటారు జీడిగుంట రామచంద్రమూర్తి.
జీవిత విశేషాలు
ఆయన ప్రముఖ తెలుగు రచయిత. ఆయన ఆలిండియా రేడియో, హైదరాబాదు కేంద్రంలో 28 సంవత్సరాలపాటు తన సేవలనందించారు.[3] కేవలం రచనపై ఉన్న ఆసక్తితోనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండిపోయారాయన[2].
రేడియో రచయితగా
ఆయన “కుటుంబ నియంత్రణ” విభాగంలో స్క్రిప్ట్ రచయితగా, తర్వాత “నాటక విభాగం”లో కార్యక్రమ నిర్వహణాధికారిగా పనిచేశారు. అప్పుడే దాదాపు 40 నాటికల్ని, నాటకాల్ని రాసి ప్రసారం చేశారు. అలాగే ప్రయోక్తగా మల్లాది వెంకటకృష్ణమూర్తి (మందాకిని), ముదిగొండ శివప్రసాద్ (అనుభవ మంటపం), వాసిరెడ్డి సీతాదేవి (ఉరితాడు), యండమూరి వీరేంద్రనాథ్ (నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య) లాంటి ప్రముఖ రచయితల నవలలను రేడియో నాటకాలుగా ప్రసారం చేశారాయన[2]. రేడియోలో ఆదివారాల్లో వచ్చే “కార్మికుల కార్యక్రమం”లో “బాలయ్య”గా ఆయన పాత్ర పోషించారు. చిన్నక్క, ఏకాంబరం పాత్రలతో పాటు బాలయ్యగా శ్రోతలు ఆయనను ఆదరించారు. సుమారు నాలుగేళ్లు ఈ కార్మికుల కార్యక్రమాన్ని నిర్వహించి రికార్డు సృష్టించారు. అప్పట్లో ప్రతి ఆదివారం సంక్షిప్త శబ్దచిత్రం శీర్షిక తో ప్రసారమయ్యే తెలుగు చలనచిత్రాల కూర్పు కూడా చేసేవారు.
సినీరంగ ప్రవేశం
ఆయన ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన అమెరికా అబ్బాయి సినిమాకు కథ రాసారు. దుక్కిపాటిగారికి రేడియో వాళ్లంటే ఎంతో అభిమానం. ఆ చిత్రానికి ప్రముఖ రేడియో ఆర్టిస్ట్ ఎర్రమనేని చంద్రమౌళి మాటలు రాశారు. తర్వాత ఈ ప్రశ్నకు బదులేది, పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు అనే సినిమాలకు సంభాషణలు రాశారు. మరో మాయాబజార్, అమృత కలశం చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించారు. టెలివిజన్ లో బాగా ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ సీరియల్‌కు 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశారు.[2]
రచనలు
• నిన్నటి కొడుకు కథలు[4]
• ఆశ్రుఘోష (నాటకం)- 2004 తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ అవార్డు లభించింది.[5]
• ప్రేమకు మిగిలింది
• గోదానం
• అమూల్యం
• నిన్నటి కొడుకు
• అమ్మకో ముద్దు
• జీడిగుంట రామచంద్రమూర్తి కథలు
• వెండితెర సాక్షిగా
• గుడిలో పువ్వు
• జీవన వాహిని (నవల)
• అనుభూతులు అనుబంధాలు (నవల)
• నల్ల మల్లి (నవల)
• మూడు నాటికలు
^ బావా బావా పన్నీరు
• తాతాధిత్తై తధిగిణతోమ్
” శ్రీ అంజనేయం ^ నేనూ నా జ్ఞాపకాలు
వ్యక్తిగత జీవితం
ఆయనకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉంటారు. రెండో కుమారుడు జీడిగుంట శ్రీధర్ టీవీ సీరియళ్లలో నటుడు. అలాగే వెండితెరపై వర్ధమాన నటుడు వరుణ్ సందేశ్ ఆయన పెద్ద కుమారుడు విజయసారథి కుమారుడు.[6] మనుమరాలు వీణా సాహితి కూడా పాటల రచయిత్రి. ఆమె అలా మొదలైంది సినిమాలో పాటలను వ్రాసారు.
అవార్డులు
• ప్రతి సంవత్సరం చాట్ల శ్రీరాములు నెలకొల్పిన “ప్రతిభా పురస్కారం” 2015 సంవత్సరానికి గానూ లభించింది.[7]
• 2015 మన్మధ నామ సంవత్సర కళారత్న పురస్కారాన్ని “సాహిత్యం” విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందజేసింది.[8]
• సారా నిషేధ ఉద్యమంపై రచించిన ‘పరివర్తన’కు ఉత్తమ రచయితగా నంది అవార్డు.
• ‘ఊర్మిళ-ఉగాది రచనల పోటీ’కు ద్వితీయ ఉత్తమ రచయితగా నంది అవార్డు.
• దూరదర్శన్‌లో ప్రసారమైన ‘పునరపి’ సీరియల్‌కు ఉత్తమ టెలీఫిల్మ్ రచయితగా నంది అవార్దు.
• ‘భర్తృహరి సుభాషిత కథలు’ లఘుచిత్రాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు
• “గుండెపోటు” అనే కథకు 2007 సంవత్సర సోమేపల్లి సాహితీ పురస్కారం అందుకున్నారు.
మరణం
శ్రీ రామచంద్ర మూర్తి గారు తన 80వ యేట 2020,నవంబర్ 10న హైదరాబాదులో కేర్ (Care) ఆసుపత్రిలో Covid-19 చికిత్స పొందుతూ మరణించారు[9].
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-22-ఉయ్యూరు
1. ↑
Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-197

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-197
• 197-అఖిలాంధ్ర రైతు సభ ,ఆంద్ర నాటక కళాపరిషత్ కీలక బాధ్యతలు ,హేతువాది సహాయనిరాకర ఉద్యమ నేత ,ప్రజామిత్ర సంపాదకుడు ,మాలపల్లి ,రైతుబిడ్డ
• నిర్మాత ,దర్శకుడు ,పల్నాటి యుద్ధం దర్శకుడు,ఫిలిం చేంబర్ అధ్యక్షుడు  –గూడవల్లి రామబ్రహ్మం
• గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 – అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది
జీవిత విశేషాలు

1898 జూన్ 24న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య – బాపమ్మల కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ స్వగ్రామం కూడా నందమూరే. రామబ్రహ్మం చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరు లలో సాగింది. అతనికి 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు.
1924లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930లో మూసివేయవలసి వచ్చింది. ఆయన 1931లో అఖిలాంధ్ర రైతు మహాసభను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు. 1934లో ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీనికి నాట్యకళ ప్రపూర్ణ బళ్ళారి రాఘవ అధ్యక్షులు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళాడు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి ‘గండికోట పతనం’ అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.
ప్రజామిత్ర
ఆయన మద్రాసు నుంచి ‘ప్రజామిత్ర’ వారపత్రికను పదేళ్ళ పాటు నడిపాడు. ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్ళే తెలుగు రచయితలు, కళాకారులకు ప్రజామిత్ర ఆఫీసే సమావేశ ప్రదేశమైంది. అంతవరకు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత, సాహిత్య, నాటక, చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మం తీర్చిదిద్దారు. ఆయన ప్రజామిత్ర లోనే కాక సమదర్శిని, వాది లాంటి ఇతర పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వ్రాశాడు.
సముద్రాల రాఘవాచార్య, కుర్రా సుబ్బారావులు ఇతనికి సహాయపడుతుండేవారు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత ఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం, బోయి భీమన్నలు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు.
తాపీ ధర్మారావు, వేలూరి శివరామశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్ మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలతో పత్రిక సాగించాలి. అపూర్వ విషయాలతో పత్రిక విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్ధులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు.
సినిమా జీవితం
ఆయన ఆసక్తి సినిమాల మీదకుమళ్ళాక ఆయన పత్రికారంగాన్ని వదిలి పెట్టి సారథిచిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆయన 1934లో తీసిన శ్రీ కృష్ణ లీలలు చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర వేయించడం కోసం రామబ్రహ్మం, నిర్మాత పి.వి.దాసు కలిసి రాజేశ్వర రావు అనే నటుడిని బెంగుళూరు నుంచి తీసుకు వచ్చారు. తర్వాత 1936లో విడుదలైన ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో కూడా ఆయన పనిచేశాడు. ఈ అనుభవాలతో చిత్రనిర్మాణ కళ తనకు పట్టుబడిన తర్వాత, పౌరాణిక చిత్రాల జోరులో కొట్టుకుని పోతున్న జనం అభిరుచులను మార్చడానికి సాహసించి సఫలుడైన ధీశాలి గూడవల్లి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల ఆయన తీసిన తదుపరి చిత్రం. సారథిచిత్ర బ్యానర్ మీద రామబ్రహ్మం నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1938లో విడుదలైంది.
మాలపిల్ల

దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమంతో బాటు గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో రామబ్రహ్మం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాలపిల్ల చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించాడు. అసలు సిసలు సామాజిక ప్రయోజనం గల చిత్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల. జస్టిస్ పార్టీ వారి సమదర్శినితో బాటు ప్రజామిత్ర పత్రికకూ సంపాదకుడైన రామబ్రహ్మం పత్రికల కన్నా సినిమాయే శక్తివంతమైన ప్రచార సాధనమని గుర్తించి ఊపిరిపోసిన చిత్రమిది. ఆనాడు దేశాన్ని పట్టి ఊపేస్తున్న హరిజనోద్యమాన్ని రామబ్రహ్మం తన సినిమాకు ఇతివృత్తంగా తీసుకుని,గుడిపాటి వెంకటచలంతో కథారచన చేయించాడు. ఈ సినిమాకు తాపీ ధర్మారావు సంభాషణలు వ్రాశాడు.చలం, ధర్మారావు ఇద్దరూ ఆనాటి సమాజంలో చలామణి అవుతున్న అర్థం లేని ఆచారాలను అపహాస్యం చేసిన వారే. మాలపిల్ల చిత్రం లోని పాటలకు భావకవి బసవరాజు అప్పారావు కావ్యగౌరవం కల్పించాడు.ఇందరు ప్రముఖుల సౄజనాత్మక భాగస్వామ్యంతో తయారైన మాలపిల్ల తెలుగు నాట అఖండ విజయం సాధించింది. జస్టిస్ పార్టీ నేతృత్వంలో 1920వ దశాబ్దంలో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం జోరుగా నడిచిన ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
మాలపిల్ల చిత్రం కాంచనమాలను సూపర్ స్టార్ ను చేసింది. పౌరాణిక చిత్రాల జోరులో ప్రప్రథమంగా ఒక సమకాలీన సమస్యను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు భాషాప్రాంతాల్లోనే గాక ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పెద్ద హిట్. నాటి గాయని, నటి సుందరమ్మతో కలిసి ఆమె పాడిన నల్లవాడే గొల్లపిల్లవాడే సూపర్ హిట్ అయింది. అప్పటికింకా భాషాదురభిమానం తలెత్తక పోవడంతో దక్షిణభారతమంతటా ఆ పాట జనం నాలుకలపై నర్తించింది.
ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక ‘నిరసన మహాసభ ‘ బ్రాహ్మణులు మాలపిల్లను చూడరాదని తీర్మానించింది. అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా “మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం” అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. ఆయన తీసిన తదుపరి చిత్రం రైతుబిడ్డ
రైతుబిడ్డ
మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుబిడ్డ తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.
ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, జమీన్ రైతు ఉద్యమంలో నెల్లూరు వెంకట్రామానాయుడు వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు బి.నరసింహారావు.
ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన చల్లపల్లి రాజా జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీలో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు.
రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన రోజులు మారాయి చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. ఇటువంటి చిత్రాల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైన కోస్తా రైతాంగ చైతన్యం కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి పల్నాటి యుద్ధం సినిమా తీశాడు.
తీసిన సినిమాలు
• మాలపిల్ల (1938) నిర్మాత, దర్శకుడు
• రైతుబిడ్డ (1939) రచయిత, దర్శకుడు
• ఇల్లాలు (1940) దర్శకుడు
• అపవాదు (1941) దర్శకుడు
• పత్ని (1942) దర్శకుడు
• పంతులమ్మ (1943) దర్శకుడు
• మాయలోకం (1945) దర్శకుడు
• పల్నాటి యుద్ధం (1947) దర్శకుడు

“రామబ్రహ్మం, బి.ఎన్.రెడ్డి తమకున్నలాంటి సంస్కృతే ప్రేక్షకులకు ఉన్నట్లుగా భావించేవారు తప్ప వారిని వెర్రివెంగళప్పలుగా చూడలేదు.” -కొడవటిగంటి కుటుంబరావు.
ఇతర వివరాలు
• రామబ్రహ్మం 1942-43, 1944-45 సంవత్సరాలలో రెండు సార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
• రామబ్రహ్మానికి మధుమేహం వ్యాధి ఉంది. పల్నాటి యుద్ధం భారీ సినిమా నిర్మాణ సమయంలో (1946) హఠాత్తుగా అతనికి పక్షవాతం వచ్చింది. ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గకుండా అక్టోబరు 1న కాలధర్మం చేశారు.
• విజయవాడలో ఈడ్పుగంటి లక్ష్మణరావు కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గౌరవాద్యక్షునిగా ‘గూడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్’ అనే సంస్థను స్థాపించి సుమారు పది సంవత్సరాలు నాటక, సినీ రంగాలకు సేవచేశారు.
• తెనాలిలో రామబ్రహ్మం 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబరులో ‘రామబ్రహ్మం సంస్మరణ సంఘం’ ఏర్పడి అతనితో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులతో విలువైన వ్యాసాలు రాయించి ‘స్మారక సంచిక’ను ప్రచురించారు.
• విజయవాడ గాంధీనగర్ లోని అలంకార్ సెంటర్ లో రామబ్రహ్మం కాంస్య విగ్రహాన్ని 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆవిష్కరించారు.
   సశేషం
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-196• 196-చంద్ర లేఖ విలన్  ,కొండవీటి వీరుడుఫేం,విమానం నడిపిన పైలట్ ,సాహిత్య పట్టభద్రుడు ,నాట్య పిపాసి ‘’సాహసమే జీవిత పు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా’’ పాట రంజనుడు’’-రంజన్విమానం   నడపగల,  ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో.

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-196
• 196-చంద్ర లేఖ విలన్  ,కొండవీటి వీరుడుఫేం,విమానం నడిపిన పైలట్ ,సాహిత్య పట్టభద్రుడు ,నాట్య పిపాసి ‘’సాహసమే జీవిత పు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా’’ పాట రంజనుడు’’-రంజన్
విమానం   నడపగల,  ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో.
 
70 ఏళ్ల క్రితం SS వాసన్‌ తెరకెక్కించిన చంద్రలేఖ సినిమాలో విలన్‌గా నటించిన రంజన్, ఈరోజు చాలా మంది హీరోలు కూడా గొప్పగా చెప్పుకోలేని అనేక నైపుణ్యాలను సాధించామనారాయణ వెంకటరమణ శర్మగా జన్మించిన రంజన్, దర్శకుడు SS వాసన్ యొక్క మాగ్నమ్ ఓపస్ చంద్రలేఖ (1948)లో అంతర్భాగం. విలాసవంతంగా మౌంట్ చేయబడిన హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామాలో అతను విలన్‌గా నటించాడు, ఇది విడుదలైనప్పుడు భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రం.

చంద్రలేఖకు దాదాపు రూ.30 లక్షలు ఖర్చయ్యాయి, ఆ రోజుల్లో భారీ మొత్తం, దీన్ని తయారు చేయడానికి ఐదేళ్లు పట్టింది. నిర్మాత-దర్శకుడు వాసన్ తన ఆస్తిని తనఖా పెట్టి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి స్నేహితుల సహాయం కోరవలసి వచ్చింది. 2010లో, కొంతమంది నిపుణులు అంచనా ప్రకారం, అద్భుతమైన డ్రమ్ డ్యాన్స్ నంబర్‌కు ప్రసిద్ధి చెందింది, ఇది భారతీయ సినిమాల్లోనే మొదటిది, దీని ధర $28 మిలియన్లకు (ప్రస్తుత మార్పిడి రేటు ప్రకారం సుమారు రూ.140 కోట్లు) ఉండవచ్చని అంచనా వేశారు.

చంద్రలేఖ రంజన్‌ని ఖ్యాతి గడించింది మరియు చివరికి అతనికి హిందీ చిత్రసీమలోకి ప్రవేశించడానికి తలుపులు తెరిచింది. అయితే, రంజన్ ఇతర చిత్రాలలో కూడా అద్భుతమైన పని చేశాడని చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా, ఈ రోజు కూడా చాలా మంది హీరోలు గొప్పగా చెప్పుకోలేని అనేక నైపుణ్యాలను సంపాదించిన నిజమైన హీరో అతను.
పాత్రికేయుడు మరియు చలనచిత్ర చరిత్రకారుడు పరాశక్తి మాలి ఇలా అన్నారు, “రంజన్ కుటుంబం తమిళనాడులోని శ్రీరంగం నుండి వచ్చింది. అతను బ్రాహ్మణుడు, అయ్యర్. ఆ వ్యక్తి మృదుస్వభావి మరియు ఉన్నత విద్యావంతుడు. మీరు ఎల్లప్పుడూ కప్పు కోసం స్వాగతం పలుకుతారు. కాఫీ, స్నాక్స్ మరియు చాట్ గురించి. కానీ అతను తన కుటుంబం గురించి చర్చించకుండా ఉండెను.”

1918లో మద్రాసులో జన్మించిన రంజన్ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అతను కళాశాలలో ఉన్నప్పుడు నాటకాలలో పాల్గొనేవాడు మరియు ఒక నాటకంలో అతని నటన జెమినీ స్టూడియోస్ ఉద్యోగి అయిన వేప్పత్తూరు కిట్టు దృష్టిని ఆకర్షించింది, అతను అతన్ని రాఘవాచారి వద్దకు రిఫర్ చేసాడు, అతను అతనికి అశోక్ కుమార్ చిత్రంలో అవకాశం ఇచ్చాడు ( 1941), ఇందులో MG రామచంద్రన్ కూడా నటించారు, తరువాత తమిళ సినిమాలో పెద్ద స్టార్‌గా మరియు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగారు.
అయితే, అశోక్ కుమార్ కంటే ముందు విడుదలైన ఎస్ సౌందరరాజన్ దర్శకత్వం వహించిన ఋష్యశృంగర్ (1940) రంజన్‌ని బాగా పాపులర్ చేసింది. పెద్దయ్యాక ఆడవాళ్ళతో కలవకుండా అడవిలో పెరిగే ముని కొడుకు కథతో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

మాలి మాట్లాడుతూ, “రంజన్ అద్భుతమైన డ్యాన్సర్. నిజానికి, అతను మంచి డాన్సర్‌గా ఈరోజు మీకు తెలిసిన కమల్ హాసన్ కంటే చాలా గొప్పవాడు. మేము మాట్లాడుతున్నప్పుడు, అతను ఒకసారి నాతో చెప్పాడు, అతని హృదయం నృత్యంలో ఉందని మరియు సినిమా దాని పక్కనే ఉంది. రంజన్ డాన్స్‌ని ఎంతగానో ఇష్టపడ్డాడు, వాస్తవానికి అతను నాట్యాంజలి అనే పేరుతో ఒక ప్రచురణను తీసుకువచ్చాడు.
బహుశా అతను డ్యాన్స్‌ని ఎంతగానో ఇష్టపడినందున మరియు అతను క్రాఫ్ట్‌ను బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల, రంజన్ వ్యక్తిత్వంలో కొంత ఆకర్షణ ఉంది, అది అతను చాలా మృదువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి, SS వాసన్ అతని మృదువైన, దాదాపు స్త్రీ స్వభావం కారణంగా చంద్రలేఖ యొక్క క్రూరమైన విలన్‌గా అతనిని నటించడానికి మొదట సంకోచించాడని నమ్ముతారు. అయితే రంజన్ ఎంత మంచి నటుడో ఉక్కు, దుర్మార్గపు విలన్ పాత్రకు సరిపోయేలా తనను తాను పూర్తిగా మార్చుకోగలిగాడు. నిజానికి ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి అతని పాత్ర నిర్దాక్షిణ్యం కూడా ఒక కారణం.
చరిత్రకారుడు మాలి మాట్లాడుతూ, “రంజన్ పూర్తిస్థాయి ప్రొఫెషనల్. “అతను నటనకు అవసరమైన అన్ని నైపుణ్యాలను నేర్చుకున్నాడు. అతను విమానం కూడా నడపగలడని చాలా మందికి తెలియదు. నిజానికి, అతను విమానంలో ప్రయాణించగల మొదటి తమిళ సినిమా హీరో. అతను ఇక్కడ [మద్రాసులో] ఫ్లయింగ్ క్లబ్‌లో సభ్యుడు. అతను అద్భుతమైన విలుకాడు కూడా. అతను చాలా మంచివాడు, అతని షాట్‌లు చాలా అరుదుగా వాటి మార్క్‌ను కోల్పోతాయి. దాని గురించి చెప్పాలంటే అతను తెలివైన షూటర్ మరియు తుపాకీలను నిర్వహించగలడు. రంజన్ గుర్రపు స్వారీలో కూడా ప్రవీణుడు, అతను దాని కోసం నేర్చుకున్నాడు. సినిమాలు.”
వాస్తవానికి, అన్నింటికంటే, అతను కూడా అందంగా ఉన్నాడు. “ఒక్క సమస్య ఏమిటంటే, అతను సాధారణ బ్రాహ్మణ యాసను కలిగి ఉన్నాడు మరియు దానిని వదిలించుకోవడం అతనికి చాలా కష్టమైంది.”

ఈ నటుడు హిందీకి వెళ్లడానికి ముందు తమిళంలో అనేక ముఖ్యమైన ప్రదర్శనలు ఇచ్చాడు. చంద్రలేఖలో ఆయన పోషించిన పాత్ర కాకుండా దక్షిణాదిలో ఆయనకు గుర్తుండిపోయే సినిమా ఏదైనా ఉందంటే అది మంగమ్మ శపథం (1943). SS వాసన్ నిర్మించారు, కానీ ఆచార్యగా ప్రసిద్ధి చెందిన TG రాఘవాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంజన్ ద్విపాత్రాభినయం చేశారు.
సినిమా కథ ఒక పేద స్త్రీ అహంకారి యువరాజు ద్వారా కొడుకును కనాలని ప్రతిజ్ఞ చేసి, ఆ తర్వాత కొడుకు తన తండ్రిని బహిరంగంగా కొరడాతో కొట్టడం. రంజన్ ఈ చిత్రంలో తండ్రి మరియు కొడుకులుగా నటించారు, అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. అది ఎంత గొప్పగా చేరిందో, అది రంజన్ మరియు వసుంధరా దేవి, చిత్ర హీరోయిన్ మరియు లెజెండరీ నటి వైజయంతిమాల తల్లిని ఇంటి పేర్లుగా మార్చింది.

అతను హిందీ చిత్రసీమలోకి ప్రవేశించిన తర్వాత, రంజన్‌కు అంతే అద్భుతమైన పరుగు వచ్చింది. అయితే, ఒకానొక సమయంలో, అతని అదృష్టం తగ్గిపోయినప్పుడు, అతను తమిళ సినిమాకి తిరిగి వచ్చాడు మరియు శాలి వాహనంతో సహా కొన్ని చిత్రాలలో నటించాడు, అది సహేతుకమైన విజయాన్ని సాధించింది. అతను చెన్నై నగరంలో ఒక ఇంటిని కలిగి ఉన్నాడు, అతను బొంబాయికి వలస వెళ్ళే ముందు దానిని విక్రయించినట్లు మూలాలు చెబుతున్నాయి. అతను 12 సెప్టెంబర్ 1983న USలో గుండెపోటుతో మరణించినట్లు నమ్ముతారు.
కొండవీటి దొంగ (1958 సినిమా)
కొండవీటి దొంగ తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.

పాటలు
ఒక్కరికి ఇద్దరయా ఇవి కలికాలపు బుద్దులయా నీ ఒళ్ళే బరువు
చక్కని పిల్ల కంటపడితే సరసాలాడే ఓ పోకిరి పిల్లడ నీవు బలే చిక్కుల్లో
జగమున మగువలింక దీక్షపూను కాలమిది శతృవుల నణచుటకై
తమలపాకు సున్నము పడుచువాళ్లకందము – పి.బి.శ్రీనివాస్, కె.రాణి
దణ్ణం పెడితే తలపై మొట్టే కాలం ఇదికాదు బావా కాలానికి
పల్లెటూరి రైతులారా.. అయ్యా పట్నాల బాబులారా
వింత మనుషులు మగవారు కోతలెన్నో కోస్తారు సింహమొచ్చిన
వుల్లాసాల పాటలే సొంపుగొలుపు ఆటలే కెరటములే – కె. జమునారాణి బృందం
సాహసమే జీవిత పూబాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా – ఘంటసాల
అంజలీ దేవి, రంజన్ నటించిన రాజా మలయ సింహ, కొండవీటి దొంగ చిత్రాలు

https://en.wikipedia.org/wiki/Ranjan_(actor)
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-195 · 195-కృష్ణప్రేమ కృష్ణుడు ,కుంకుమరేఖ హీరో ,వనవాస అర్జునుడు పాండవీయ ధర్మరాజు ,,భూకైలాస్ శివుడు ,అన్నమయ్య తండ్రి ,యమలీల బ్రహ్మ ,రామరాజ్య వశిష్టుడు ,అల్లూరి అగ్గిరాజు మల్లీశ్వరి తాత .చెల్లెలికాపురం నేరముశిక్ష నిర్మాత ,అందరి మన్ననలు పొందిన ఇంజనీర్ స్వర్ణ నంది పురస్కార గ్రహీత –మన్నవ బాలయ్య

· 195-కృష్ణప్రేమ కృష్ణుడు ,కుంకుమరేఖ హీరో ,వనవాస అర్జునుడు పాండవీయ ధర్మరాజు ,,భూకైలాస్ శివుడు ,అన్నమయ్య తండ్రి ,యమలీల బ్రహ్మ ,రామరాజ్య వశిష్టుడు ,అల్లూరి అగ్గిరాజు మల్లీశ్వరి తాత .చెల్లెలికాపురం నేరముశిక్ష నిర్మాత ,అందరి మన్ననలు పొందిన ఇంజనీర్ స్వర్ణ నంది పురస్కార గ్రహీత –మన్నవ బాలయ్య

· మన్నవ బాలయ్య (1930 ఏప్రిల్ 9 – 2022 ఏప్రిల్ 9) తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఎక్కువ సహాయ పాత్రలు పోషించాడు. కొన్ని సినిమాలకు కథ, పాటలు కూడా అందించాడు.

జీవిత విషయాలు
గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించాడు[1].[2] బాలయ్య మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశాడు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశాడు.

చిత్రరంగం
మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించాడు. మిత్రుల ప్రోద్బలముతో చిత్రాల్లో నటించాలనే కోరిక గలిగి తాపీ చాణక్య సహకారముతో చిత్రసీమలో అడుగు పెట్టాడు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో నాయక పాత్ర వేశాడు. తరువాత భాగ్యదేవత, కుంకుమరేఖ చిత్రాల్లో నటించాడు. భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో శివునిగా నటించే అవకాశం వచ్చింది. అటు తరువాత చెంచులక్ష్మి, పార్వతీకల్యాణం నుండి నేటి వరకు 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో (1977) లాంటి మంచి చిత్రాలు నిర్మించాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రముగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారము బహూకరించింది. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు (1994), ఊరికిచ్చిన మాట (1981) నిర్మించాడు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చాడు. చిత్రాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు. 2000 సంవత్సరములో తీసిన “పల్లెవాసం-పట్నవాసం”కు ప్రభుత్వ ఉత్తమ సీరియల్ అవార్డ్ లభించింది. అంకురం చిత్రంలో నటనకు వంశీ-బర్కిలీ వారి ఉత్తమ క్యారెక్టర్ అవార్డ్ లభించింది. ఈనాటి బంధం ఏనాటిదో సినిమాకు కథ, చిత్రానువాదం, పాటలు అందించాడు.[3]

నటించిన చిత్రాలు
1950లు
· 1958 ఎత్తుకు పైఎత్తు

· 1958 పార్వతీ కళ్యాణం

· 1959 భాగ్యదేవత

· 1959 మనోరమ

1960లు
· 1960 కుంకుమరేఖ

· 1960 చివరకు మిగిలేది – ప్రకాశరావు

· 1961 కృష్ణ ప్రేమ

· 1962 మోహినీ రుక్మాంగద

· 1963 ఇరుగు పొరుగు

· 1963 తల్లి బిడ్డ

· 1964 బభ్రువాహన

· 1964 బొబ్బిలి యుద్ధం

· 1964 వివాహబంధం

· 1965 పాండవ వనవాసం – అర్జునుడు

· 1966 మొనగాళ్ళకు మొనగాడు[4]

· 1966 శ్రీకృష్ణ పాండవీయం – ధర్మరాజు

· 1967 అగ్గిదొర

· 1967 రక్తసింధూరం

· 1968 వీరపూజ

· 1968 సర్కార్ ఎక్స్‌ప్రెస్

1970లు
· 1970 లక్ష్మీ కటాక్షం – వినయదండుడు

· 1971 విక్రమార్క విజయం

· 1971 నిండు దంపతులు

· 1973 నేరము – శిక్ష

· 1974 అల్లూరి సీతారామరాజు – అగ్గిరాజు

· 1974 కృష్ణవేణి

· 1976 భక్త కన్నప్ప[5]

· 1977 ఒకే రక్తం

· 1977 ఈనాటి బంధం ఏనాటిదో

· 1977 కురుక్షేత్రం – ధర్మరాజు

· 1978 చిరంజీవి రాంబాబు – 1978

· 1978 ప్రేమ-పగ

· 1978 రాజపుత్ర రహస్యం

· 1979 గంగా భవానీ

· 1979 నామాల తాతయ్య

· 1979 ముత్తయిదువ

1980లు
· 1987 జగన్మాత

· 1988 పృథ్వీరాజ్

· 1988 ప్రాణ స్నేహితులు

· 1988 మహారాజశ్రీ మాయగాడు

1990లు
· 1992 అంకురం –

· 1992 పెద్దరికం – సాంబశివుడు

· 1993 గాయం

· 1994 యమలీల – బ్రహ్మ

· 1996 పెళ్ళి సందడి

· 1996 జాబిలమ్మ పెళ్ళి

· 1997 అన్నమయ్య

· 1997 దేవుడు

· 1997 మా ఆయన బంగారం

· 1999 సాంబయ్య

2000లు
· 2002 ధనలక్ష్మీ ఐ లవ్ యూ

· 2002 మన్మథుడు

· 2003 ఒకరికి ఒకరు

· 2004 మల్లీశ్వరి – రామ్మోహనరావు

· 2004 విజయేంద్ర వర్మ

· 2005 ధన 51

· 2006 సామాన్యుడు

· 2007 గజి బిజి

· 2007 యమగోల మళ్ళీ మొదలైంది

· 2009 మిత్రుడు

2010లు
· 2011 శ్రీరామరాజ్యం – వశిష్ఠుడు

· 2012 నందీశ్వరుడు

· 2012 దేవరాయ

నిర్మించిన చిత్రాలు
· 1971 చెల్లెలి కాపురం

· 1973 నేరము – శిక్ష

· 1978 ప్రేమ-పగ

· 1980 చుట్టాలున్నారు జాగ్రత్త

· 1981 ఊరికిచ్చిన మాట

· 1983 నిజం చెబితే నేరమా

మరణం
92 ఏళ్ల బాలయ్య అనారోగ్యంతో 2022 ఏప్రిల్ 9న హైద‌రాబాదులో క‌న్నుమూశారు. ఇదే రోజు ఆయ‌న పుట్టిన‌రోజు కూడా.[

·

· 300సినిమాలలో నటించాడు కొన్నిటికి దర్శకత్వం ,నిర్మాత ,రచనకూడా చేశాడు .బహుముఖ ప్రజ్ఞాశీలిగా ,చిత్రరంగంలో పెద్దన్నయ్యగా బాలయ్య గౌరవం పొందాడు .ఆయన పోషించిన పాత్రలు ,నిర్మించిన చిత్రాలు ఉదాత్తమైనవి .

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-194

· 194-గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ దగ్గరుంచుకొనే కన్నీటి నటి –డబ్బింగ్ జానకి

· డబ్బింగ్ జానకి దక్షిణభారత చలన చిత్ర నటి. ఈమె దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది.

నేపధ్యమ
వీరిది పెద్దాపురం లోని మధ్యతరగతి కుటుంబం. అక్కడ దగ్గర ఎక్కువగా నాటకాలు వేసేవారు. ఈమె నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్లు ఒకరు ఓ పాత్ర ఉందంటూ తీసుకెళ్లారు. అప్పట్నుంచి నాటకాలతో బిజీ అయిపోయింది. ఏడో తరగతితో చదువు ఆపేసింది. ప్రస్తుతం ఈవిడ చెన్నైలో ఉంటున్నది. షూటింగ్, డబ్బింగ్ ఉంటే హైదరాబాద్ వస్తుంది. ఈవిడ ఇద్దరు కొడుకులు. కోడళ్లూ, మనవలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.

నట జీవితము
పదహారేళ్లు వచ్చేప్పటికి ఈమెకు పెళ్త్లెంది. భర్తది మిలటరీ ఉద్యోగం. ఆయనకీ నాటకాలంటే ఆసక్తి. పెళ్లయ్యాక తన నుంచీ ప్రోత్సాహం లభించింది. అయితే అప్పటికే వీరు చెన్నైలో స్థిరపడ్డారు. ఓసారి బస్సులో వెళుతుంటే ఏవీఎమ్ సంస్థలో పనిచేసే ఓ సహాయ దర్శకుడు ఈమెను చూసి ‘సినిమాల్లో నటిస్తారా’ అని అడిగారు. ఈమె భర్త అంగీకరించారు. అలా 1958లో ‘భూ కైలాస్’లో చెలికత్తె పాత్రతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలుపడింది. ఆర్థిక ఇబ్బందులూ ఉండటంతో గ్రూపు డాన్సర్‌గా కూడా చేసేది. తమిళం, తెలుగు అగ్ర దర్శకులూ, నటులందరితో కలిసి పనిచేసింది. చాలా సినిమాల్లో ఈమె కంటే పెద్దవాళ్లకే అమ్మగా కనిపించింది.

పేరు వెనుక చరిత్ర
శంకరాభరణం సినిమా విజయోత్సవ వేడుక విజయవాడలో జరిగింది. ఆ కార్యక్రమానికి ఈమె, షావుకారు జానకి, గాయని ఎస్. జానకి వెళ్లారు. ‘వేదిక మీదకు జానకిగారు రావాలి’ అని మైకులో చెప్పేసరికి ముగ్గురూ లేచి నిలబడ్డారు. అప్పుడు డబ్బింగ్ జానకి అని అవతలి వ్యక్తి అనడంతో.. ఆ రోజు నుంచి ఈమె పేరుకు మొదట్లో డబ్బింగ్ వచ్చి చేరింది.

విశేషాలు
· ‘మాతృ దినోత్సవం’ వచ్చిందంటే ’20వ శతాబ్దం’ చిత్రం లోని ‘అమ్మను మించి దైవమున్నదా’ పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో సుమన్ తల్వార్కి తల్లిగా ఈవిడ చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.

· ఈవిడ చేసిన సినిమాల్లో తొంభై శాతం వరకూ కంట తడిపెట్టించే సెంటిమెంటు పాత్రలే. గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. సెట్‌లో ఏడ్చీ ఏడ్చీ ఇంటికి వెళ్లేసరికి కళ్లు ఎర్రగా వాచిపోయేవి. ఒకసారి ‘రక్తకన్నీరు’ నాటకం వేసినప్పుడు ఏకథాటిగా మూడు గంటలు ఏడవాల్సి వచ్చింది. ఆ నాటకం పూర్తయ్యేసరికి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.

· ఈవిడ నటించిన సినిమాల్లో బాగా నచ్చినవంటే ‘జంబలకిడి పంబ’లోని పాత్ర… ‘రామాయణంలో పిడకల వేట’లోని గయ్యాళి అత్త పాత్ర.

· సెట్‌లో మర్చిపోలేని సందర్భమంటే ‘నిండు సంసారం’ సినిమా చిత్రీకరణలో ఈవిడ చెట్టు మీద నుంచి నీళ్లలో దూకాలి. అసలే ఈవిడకు నీళ్లంటే భయం. దర్శకుడు చెప్పినప్పుడు కాకుండా ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు ఈవిడను పట్టుకోలేదు. నీళ్లలో పడిపోయింది. తరువాత యూనిట్ సభ్యులు కాపాడారు కానీ నీళ్లు బాగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ప్రాణం పోతుందేమోనని చాలామంది భయపడిపోయారు.

నటించిన చిత్రాలు
తెలుగు (పాక్షిక జాబితా)
· గీతాంజలి

· సాగర సంగమం

· జీవనవేదం (1993)

· 20వ శతాబ్దం (1990)

· చెవిలో పువ్వు (1990)

· అనసూయమ్మ గారి అల్లుడు (1986)

· ఆలయశిఖరం (1983)

· హోమం (2008)

·

· డబ్బింగ్ జానకి ఎన్నో టివి షోలలో సీరియల్స్ లో నటించి మెప్పించింది .ఆమెకు అంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది .

· సశేషం

· శ్రీరామనవమి శుభా కాంక్షలతో

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-193

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-193

· 193-1500 తెలుగు తమిక ,కన్నడ సినిమాలలో నటించిన హీరో ల అమ్మ –పండరి బాయి

· పండరీబాయి (1930 – 2003) కన్నడ, తెలుగు సినిమా నటి. ఈవిడ కర్ణాటకలో భట్కల్ అనే ఊరిలో 1930లో జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈవిడ 1500 పైగా చిత్రాలో నటించారు. శివాజీ గణేశన్, రాజ్‌కుమార్ సరసన కొన్ని చిత్రాలలో నటించారు. తెలుగులో చాలా చిత్రాలలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు తల్లిగా నటించారు.దాదాపుగా అరవై ఏళ్ళలో పండరీబాయి నటించని తెలుగు సినిమాలు అరుదు .నిండుగా ఆప్యాయంగా అచ్చమైన తల్లి గా పాత్రలలో జీవించిన నటీ మణి.చూడగానే పూజ్యభావం కలుగుతుంది .మనసులోని మాతృప్రేమను ధారగా కురిపించి తన్మయులను చేస్తుంది .

నటించిన తెలుగు సినిమాలు
· శ్రీ ఏడుకొండలస్వామి (1991)

· అయ్యప్పస్వామి మహత్యం (1989)

· గడుగ్గాయి (1989)

· పిన్ని (1989)

· దొంగ రాముడు (1988)

· మరణ శాసనం (1987)

· శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం (1987)

· అష్టలక్ష్మి వైభవం (1985)

· ఝాన్సీ రాణి (1985)

· రగిలేగుండెలు (1985)

· ఇదే నా సవాల్ (1984)

· నాగ భైరవ (1984)

· బాబులుగాడి దెబ్బ (1984)

· భలే రాముడు (1984)

· వసంత గీతం (1984)

· ఆడదాని సవాల్ (1983)

· అమరజీవి (1983)

· అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)

· ధర్మ పోరాటం (1983)

· కలియుగ దైవం (1983)

· కోటీశ్వరుడు (1983)

· మాయగాడు (1983)

· పల్లెటూరి పిడుగు (1983)

· రఘురాముడు (1983)

· శ్రీరంగనీతులు (1983)

· రాధా మై డార్లింగ్ (1982)

· అజిత్ (1982)

· కలవారి సంసారం (1982)

· వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)

· చట్టానికి కళ్ళు లేవు (1981)

· టాక్సీ డ్రైవర్ (1981)

· దారి తప్పిన మనిషి (1981)

· రామలక్ష్మణులు (1981)

· కిలాడి కృష్ణుడు (1980)

· కొత్తపేట రౌడీ (1980)

· గజదొంగ (1980)

· గురు (1980)

· త్రిలోక సుందరి (1980)

· ధర్మచక్రం (1980)

· పసుపు పారాణి (1980)

· బంగారులక్ష్మి (1980)

· మహాలక్ష్మి (1980)

· రామ్ రాబర్ట్ రహీమ్ (1980)

· రాముడు – పరశురాముడు (1980)

· సంధ్య (1980)

· సన్నాయి అప్పన్న (1980)

· సర్దార్ పాపారాయుడు (1980)

· సూపర్‌మ్యాన్ (1980)

· హరే కృష్ణ హలో రాధ (1980)

· హేమా హేమీలు (1980)

· దొంగలకు సవాల్ (1979)

· బుర్రిపాలెం బుల్లోడు (1979)

· మూడు పువ్వులు ఆరు కాయలు (1979)

· ప్రియబాంధవి (1979)

· లక్ష్మీ పూజ (1979)

· విజయ (1979)

· వేటగాడు (1979)

· శంఖుతీర్థం (1979)

· శృంగార రాముడు (1979)

· సొమ్మొకడిది సోకొకడిది (1979)

· బందిపోటు ముఠా (1978)

· చదరంగం (1978)

· దేవదాసి (1978)

· దొంగల వేట (1978)

· డూ డూ బసవన్న (1978)

· కాలాంతకులు (1978)

· లంబాడోళ్ళ రాందాసు (1978)

· లాయర్ విశ్వనాథ్ (1978)

· మూడు పువ్వులు ఆరు కాయలు (1978)

· నిండు మనిషి (1978)

· ప్రేమ చేసిన పెళ్ళి (1978)

· సాహసవంతుడు (1978)

· స్వర్గసీమ (1978)

· టాక్సీ డ్రైవర్ (1978)

· దొంగలకు దొంగ (1977)

· ఈనాటి బంధం ఏనాటిదో (1977)[1]

· గీత సంగీత (1977)

· మా ఇద్దరి కథ (1977)

· మనవడి కోసం (1977)

· ఒకే రక్తం (1977)

· పాలాభిషేకం (1977)

· సీతారామ వనవాసం (1977)

· రామరాజ్యంలో రక్తపాతం (1976)

· అమెరికా అమ్మాయి (1976)

· భద్రకాళి (1976)

· బంగారు మనిషి (1976)

· లలిత (1976)

· మా దైవం (1976)

· ముత్యాల పల్లకి (1976)

· నేరం నాదికాదు – ఆకలిది (1976)

· రాజు వెడలె (1976)

· సీతమ్మ సంతానం (1976)

· స్వామి ద్రోహులు (1976)

· అన్నదమ్ముల కథ (1975)

· ఆస్తికోసం (1975)

· డాక్టర్ శివ (1975)

· కథానాయకుని కథ (1975)

· మొగుడా పెళ్ళామా (1975)

· పద్మరాగం (1975)

· పుట్టింటి గౌరవం (1975)

· రక్త సంబంధాలు (1975)

· రాముని మించిన రాముడు (1975)

· సంతానం – సౌభాగ్యం (1975)

· తోటరాముడు (1975)

· అల్లూరి సీతారామరాజు (1974)

· దేవదాసు (1974)

· జన్మ రహస్యం (1974)

· కృష్ణవేణి (1974)

· పెద్దలు మారాలి (1974)

· రామయ్య తండ్రి (1974)

· గౌరవం (1973)

· హేమరెడ్డి మల్లమ్మ (1973)

· నేరము శిక్ష (1973)

· దైవ సంకల్పం (1972)

· కోడలు పిల్ల (1972)

· మరపురాని తల్లి (1972)

· మాతృమూర్తి (1972)

· నిజం నిరూపిస్తా (1972)

· పండంటి కాపురం (1972)

· రంగమ్మ శపథం (1972)

· భళే రాణి (1971)

· ప్రతిధ్వని (1971)

· సంపూర్ణ రామాయణం (1971)

· భగీరథి (1969)

· మనస్సాంతి (1969)

· సువర్ణభూమి (1969)

· అమ్మ (1968)

· పాలమనసులు (1968)

· పోస్టుమన్ రాజు (1968)

· అనురాధ (1967)

· ప్రేమలో ప్రమాదం (1967)

· పుణ్యవతి (1967)

· శ్రీ పురంధర దాసు (1967)

· చంద్రహాస (1965)

· సి.ఐ.డి. (1965)

· సత్య హరిశ్చంద్ర (1965)

· అన్నపూర్ణ (1964)

· భక్త శబరి (1960)

· రాజభక్తి (1960)

· గృహలక్ష్మి (1959)

· కులదైవం (1956)

· భక్త మల్లికార్జున (1955)

· వదిన (1955)

· మనోహర (1954)

· గుమస్తా (1953)

· పరాశక్తి (1952)

· మర్మయోగి (1951)

· వాణి (1943)

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-22

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-192

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-192

· 192-అవ్వయ్యార్ గా జీవించిన –సుందరంబాళ్

· 1953లో విడుదలైనశూలమంగళం సుబ్బు దర్శకత్వం వహించి .శ్రీమతి కే బి సుందరంబాల్ ,ముఖ్య పాత్ర పోషించిన జెమిని వారి ‘’అవ్వయ్యార్ ‘’తమిళచిత్రం తెలుగులోనూ డబ్బింగ్ పొంది అఖండ విజయం పొందింది .మురుగన్ మహా భక్తురాలు అవ్వయ్యార్ .ఎం డి పార్ధసారధి ,ఆనదరం ,మాయవరన్ వేణు సంగీతం కూర్చారు .అవ్వయార్ రాసిన గీతాలతోపాటు పాపనాశనం శివం ,కొత్తమంగళం సుబ్బు పాటలు రాశారు .

· ఒక వీధి వీధి అంతా ఆరోజుల్లోనే లక్షన్నర రూపాయలు పెట్టి సెట్ వేసి చిత్రీకరించారు .అవ్వయ్యార్ కుటుంబ సభ్యులనుంచి విషయ సేకరణ చేసి స్క్రిప్ట్ లో ఉపయోగించారు .10వేలమంది జూనియర్ ఆర్టిస్ట్ లతో నటిమ్పజేశారు .అవ్వయ్యార్ భక్తిగీతాలు తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి .ప్రారంభ గీతం తమిళనాడు గొప్ప తనాన్ని వర్ణిస్తుంది .అవ్వయ్యార్ అంటే తమిళ మాత అనే నమ్మకం .ఆమె ఆరాధ్యదైవం మురుగన్ అంటే కుమారస్వామి అంటే శరవణభవ .పాటలు పద్యాలు అన్నీ అవ్వయ్యార్ పాత్రధరించిన సుందరంబాల్ గానం చేసింది .మ్యూజికల్ హిట్ సినిమా .తెలుగు డబ్బింగ్ కూడా ఆంధ్రలో గొప్ప విజయం సాధించింది .

· అవ్వయ్యార్‌
తమిళంలో అవ్వయ్యార్‌ అంటే గౌరవనీయులైన మహిళ అని అర్థం. తమిళ సాహిత్యంలో ఈ పేరుతో సుమారు ముగ్గురు కవయిత్రులు ఉన్నారు. వారిలో ఒకరు 1 వ శతాబ్దంలో జీవించినట్లు, 59 పద్యాలు రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. అవ్వయ్యార్‌-2 చోళ వంశ పాలనా సమయంలో(10వ శతాబ్దం) జీవించారు. రోజువారీ జీవితంలో చేయకూడని, చేయాల్సిన పనుల గురించి సామాన్య భాషలో పద్యాలు రచించారు. ఆమె రాసిన పద్యాలు నేటికీ తమిళ పాఠ్య పుస్తకాల్లో దర్శనమిస్తున్నాయి. తను ఎంతో ఙ్ఞాన సంపదను కలిగి ఉన్నానని, ఇక నేర్చుకోవాల్సిందేమీలేదని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మారువేషంలో వచ్చిన మురుగన్‌ ఙ్ఞానసముపార్జన నిత్యప్రవాహం వంటిదని, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆమెకు బోధ చేయడంతో మరలా విద్యాభ్యాసం ప్రారంభించిందని, చిన్నారుల కోసం పుస్తకాలు రాసిన మొదటి వ్యక్తిగా నిలిచిందని చరిత్ర చెబుతోంది.శైవ క్షేత్రాలన్నీ కాలినడకన దర్శించి అక్కడి దైవాలపై తనకు వచ్చిన అతి తేలికైన తమిళభాషలో పద్యాలు రాసింది అవి ఈనాటికీ జనుల నాలుకలమీద నర్తిస్తున్నాయి జాతిమతకుల భేదాలులేకుండా భక్తితొ అందర్నీ ఏకం చేసింది

· ఇలా క్షేత్ర దర్శనం చేస్తూ అలసిపోయి ఒకరోజు ఒక అడవిలో చెట్టు దగ్గర కోవెలలో కూర్చుంటే సుబ్రహ్మణ్యస్వామి గోప వేషం లో వచ్చి ‘’ఏంకావాలి అవ్వా ‘’అంటే ‘’నువ్వేమైనా ఆర్చేవాడివా ,తీర్చే వాడివా ?”’అంది .’’మురుగా అనిపిల్చావు కదా అందుకే వచ్చా ‘’అన్నాడు .’’నేను పిలిచిన్దిసుబ్రహ్మణ్యస్వామిని ‘’ ‘’అంటుంది .నాపేరుకూడా మురుగా అందుకే వచ్చా అంటాడు .ఇద్దరిమధ్య వాదోపవాదాయు జరిగిఅవ్వయ్యార్ ఓడిపోతుంది .అప్పుడు మురుగా ‘’నీ కేం కావాలో చెప్పు ‘’అంటాడు .’’వేడి వేడి పళ్ళు కావాలి తెస్తావా ?’’అడిగింది .అదెంతపని అని ప్రక్కనే ఉన్న చెట్టెక్కి పళ్ళు దులిపాడుఅవి కిందపడ్డాయి .అవ్వ వాటిని ‘’ఉఫ్ ఉఫ్అంటూ ఊదుకొని తిన్నది ‘’అవ్వా బాగా వేడిగా ఉన్నాయా పళ్ళు ‘’?అనగా ‘’నాయనా నిన్ను గుర్తి౦చ లేదు నా మురుగన్ నువ్వే ‘’అని నమస్కరించి స్తోత్రం చేస్తుంది .అ౦దులోభావం ‘’నా జన్మ జన్మాల తపస్సు ఫలం సుబ్రహ్మణ్యుడు ‘’అని .

·

· తెలుగు డబ్బింగ్ కు మాటలు పాటలు పద్యాలు ఎవరు రాశారో తెలీదు .

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-22

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-191

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-191
• 191-యువ నటి ,నిర్మాత –వాసంతి బి .ఏ.
• వాసంతి తెలుగు చలన చిత్ర నటీమణులలో ఒకరు. ఈవిడ అసలు పేరు లక్ష్మీరాజ్యం. ఈవిడ కొన్ని చిత్రాల నిర్మాత కూడా. ఈవిడ బి.ఏ. చదివారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం లోని తిమ్మసముద్రం గ్రామం ఈవిడ స్వస్థలం. ఈవిడ ‘లా’ చదువు తున్నప్పుడు “తేన్నిలవు” అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఔట్‌డోర్ షూటింగు కోసం కాశ్మీర్ వెళ్ళవలసి రావడం చేత ఈమె లా పూర్తి చేయలేకపోయింది. ఆ తరువాత బలేపాండ్యన్, ఎన్నదాన్ ముడివు మొదలైన తమిళ చిత్రాలలోను, పాదుకా పట్టాభిషేకం, అమ్మైకాన మొదలైన మళయాల చిత్రాలలోను, అనేక తెలుగు చిత్రాలలోను నటించారు.
నటిగా
• విరిసిన వెన్నెల (1961) – తొలి సినిమా
• మహాకవి కాళిదాసు (1960)
• సిరిసంపదలు (1962)
• మంచి మనసులు (1962)
• ఆరాధన (1962)
• దక్షయజ్ఞం (1962)
• పునర్జన్మ (1963)
• సవతి కొడుకు (1963)
• వివాహబంధం (1964)
• శభాష్ సూరి (1964)
• నవగ్రహ పూజా మహిమ (1964)
• కీలుబొమ్మలు (1965)
• గుడిగంటలు (1965)
• ఉయ్యాల జంపాల (1965)
• సుమంగళి (1965)
• ఆత్మగౌరవం (1966)
• పల్నాటి యుద్ధం (1966)
• శ్రీమతి (1966)
• వీరాంజనేయ (1968)
నిర్మాతగా
• భలేపాప (1971)
• మేమూ మనుషులమే (1973)
• కల్పనాలయా పేరిట వాసంతి నిర్మించిన భలేపాప సినిమాలో రంగారావు,హరనాద్ కేఆర్ విజయ పద్మనాభం ,రేలంగి వగైరాలున్నారు సంగీతం ఆర్ సుదర్శనం .దర్శకత్వం కే ఎస్ ప్రకాశరావు .వీటూరి రాసిన ఎల్ ఆర్ ఈశ్వరిపాడిన  ‘’వయసు పదహారు నా వలపు  సెలయేరు ‘’బాగుంటుంది .చిట్టిపాపా చిరునవ్వులపాప పాట అనిసెట్టి రాస్తే సుశీల పాడింది .అయ్యలారా అమ్మలారా మా అమ్మనేవరైనా చూశారా పాత సినారె రాయగా ఘంటసాల గానం చేశారు
కల్పనాలయా బానర్ పై వాసంతి తీసిన ‘’మేమూ మనుషులమే ‘’సినిమా కె.బాపయ్య డైరెక్ట్ చేయగా కృష్ణం రాజు జమున నటించారు .మంచి ఆలోచన రేకెత్తించే చిత్రం .ఆత్రేయ రాసిన ‘’ఏమంటున్నది ఈగాలీ ?ఎగిరే పైటను అడగాలి ‘’పాట సుశీల బాలు పాడారు ఎం ఎస్ విశ్వనాధం మ్యూజిక్ .ఈగీతం సూపర్ హిట్ అయింది .
•  

•   సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకం

శ్రీ ఆలూరు కోన రంగనాయక శతకం
అనే శతకాన్ని తాడిపత్రి  వాస్తవ్యులు శ్రీ యమ చిడంబరయ్య  రచించి కడపలోని తమ భాగాధేయుడు కావ్య పురాణ తీర్ధ,విద్వాన్  శ్రీ జనమంచి వెంకట సుబ్రహ్మణ్య గారి చే పరిష్కరింప జేసుకొని 1934లో ముద్రించారు .మకుటం రంగ నాయకా . ,ఉత్పలమాల లతో అల్లిన భక్తీ శతకం .ఘటికా సిద్దుడైన శ్రీ ఘటికాచలేశ్వరుడే  తన ఆధి వ్యాధులను తీర్చగల సమర్ధుడని నమ్మిసేవిస్తే తగ్గి ఆరోగ్యం చేకూరినందువలన  కవి ఈశతకం రాసి స్వామికి సమర్పించినట్లు కవి చెప్పాడు .
  మొదటిపద్యం –‘’శ్రీ రఘుకుల వార్ధికులశేఖర మన్మధ కోటి సుందరా –కార ధరాత్మజాహృదయ కామిత పూర,మునీన్ద్రమానసా
ధార ధరాధరా దనుజ దైత్యహరా జగదేకవీర నా –కోరిక దీర్పు మొక్కటియకూరిమి తోడుత ‘’రంగనాయకా ‘’  .నీకధలు వింటూ నిత్యధ్యానం చేస్తూ ఉన్నవారు ఏ కులం లో ఉన్నా వారి బాధలు తొలగిస్తావు .పూర్వం విభీషణుడు శరణు అనగానే కాపాడావు .కోపం పోగొట్టి శా౦తం ఇచ్చి బుధజన సేవ ఇచ్చి నా ఆపదలు హరించు .’’మానము పోవు జీవనం మంచిదికాదు బిరాన ప్రాణమే మాన సుఖాలిస్తుంది .బుద్ధి పాడయిపోయింది .మనసు ఒక చోటనిలవటం లేదు .’’శ్రీరమణ వెంకట నాయకా ‘’అంటే అన్నీ సుఖాలే ఇస్తావు .అంటాడు .
‘’చప్పుడు కాని లోపల ను సన్నతలంపు లుగాని దాహమున్-జెప్పగరాని యాకలియు ,జిన్నని పిల్లలు భార్య యంచు నే –‘’స్రుక్కుతూఉన్నాను .’’నీ దయగల్గ నన్ ధనము నిర్మల తేజము జ్ఞానసంపదల్ –శ్రీ దయితా లభించును ‘’అని గట్టి నమ్మకంతో చెప్పాడు .’’శ్రీ రఘురామ సర్వ సుర సేవిత నామ సురారి భీమ దు –ర్వార పరాక్రమక్రమ ,సువర్ణ సుపర్ణ విహార రామా ‘’నా కోరికలు తీర్చు అని వేడుకొన్నాడు .’’నా టక్కరి బుద్ధి కోరికలతో తా౦డవమాడుతుంది ‘’అక్కటా నీ చరిత్ర ఒక్కనాడైనా నామనసులోకి రాలేదు క్షమించి కాపాడు .జాతి నీతి శాస్త్రం నిర్మలత్వం  లేకపోయినా  ‘’నీ స్మరణ పల్మరు జేసిన వారి బ్రేమతో నేతరియైన వత్సలత నెంతువు రంగనాయకా ‘’అని నమ్మకం తో ఉన్నాడు
‘’నా శిరస్సుకొట్టు ,దేహం తెగగొట్టు ,ఆలుపిల్లలను పట్టు .పొట్టకూటికి బట్టకు బెట్టక –నీపాదాలుపట్టాను వదలను నన్ను రక్షించు .’’కుండలి శాయి వైన నీ భజన పనికిరాదని దుర్జనులు మొండి శిఖండులై ముక్తిమార్గం తెలుసుకోలేక ‘’పాషన్డులైపాపులై యమలోకం లో బాధలనుభావిస్తారు .
‘’ఉత్పల పద్యపుష్పముల నుంచితి హారము గూర్చి నీ మెడన్ –సత్పురుషుల్ సుహారముల జాలగ నియ్యరే ఎత్తుకెత్తుగా-సత్పధ గామిగాక నుతి సన్నుతి కెక్కునె యంచు నెంచకీ –నీ ఉత్పల మాలికాళిగొను మోపికతో నిక రంగనాయకా ‘’  అని కవి శతక సమర్పణ చేశాడు గడుసుగా .
  ఈ శతకం లో కవి తనను గురించి ఏమీ చెప్పుకోలేదు .రంగనాయకుని గురించీ ప్రత్యేకంగా చెప్పలేదు .వెలకూడా తెలియదు .కానీ పద్యాలన్నీ రసబంధురాలే .సరలపద సంజాతాలే.భక్తిభావ సుమవిలసితాలే .చక్కని ధారాశుద్ధి మనసులను ఆకర్షిస్తుంది .ఈకవి ఈశాతకం గురించి మనవాళ్ళు ఎవరూ ఎక్కడా పేర్కొన్నట్లు లేదు .పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .
ఇప్పుడు ఆలూరు కోన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం గురించి తెలు అనంతపురానికి 67 కిమీల దూరంలో ఉంది. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతం భలే నచ్చేస్తుంది. కొండ పైభాగాన 400 ఏళ్లకు పైబడిన చరిత్ర గల హజీ వలీ దర్గా ఉంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులను ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇక్కడి ఆలూరు రంగనాయక స్వామి దేవాలయం కూడా చూడదగినదిసుకొందాం –
అసుర సంహార దోషపరిహారం కావించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్టించమని చెప్పాడు విశ్వామిత్రుడు. తాటకిని సంహరించి, ఆమె ప్రాణాలు వదిలిన స్ధలంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకుని తగిన చోటు కోసం వెదికాడు రాముడు. పెన్నానది ఒడ్డున అడుగుపెట్టిన రాముడు ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక బుగ్గలో కైలాసనాధుడు స్వయంభువ లింగరూపంలో దర్శనమివ్వడంతో పరమానందభరితుడయ్యాడు. పరుశురాముడు పూజించిన స్వయంభువు లింగం అదే అని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ట చేయమని చెప్పాడు. ఆ లింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు భక్తితో చేశాడు రాముడు. అసుర సంహారం వల్ల అదీ ఒక స్త్రీని సంహరించినందువల్ల పొందిన దోషం పరిహారమయ్యింది. ఆ తర్వాత అయోధ్యకు వెళ్ళే మార్గంలో విశ్వామిత్రుడి మార్గదర్శకత్వంలో రాముడు జనక మహారాజు కుమార్తె జానకిని స్వయంవరంలో గెలిచి పరిణయమాడాడు శ్రీరాముడు.
తాటకికి మోక్షం శ్రీరాముడి పరిణయం ఈ దృశ్యాలన్నిటిని విశ్వామిత్రుడు తన దివ్యదృష్టితో ఏనాడో తెలుసుకున్న విషయాలు. తాటకికి మోక్షప్రాప్తి లభించిన చోటే ఈనాడు తాడిపత్రిగా పరిగణించబడుతుంది. ఇక్కడ రాముడు ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన లింగాన్ని రామలింగం అంటారు. ఆలయం నిర్మించబడింది. క్రీ.పూ. 1460 సంవత్సరంలో మొదలైన ఆలయనిర్మాణం క్రీ.పూ 1475 సంవత్సరంలో ముగిసింది. బుక్కా రామలింగస్వామి ఆలయం పేరున పిలువబడుతుంది. ఒక అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం చూడగలం. విశ్వామిత్రుడు యాగం జరిపిన అరణ్య ప్రాంతం తాడిపత్రికి దగ్గరలో వున్న కొండ చరియపై నెలకొన్న ఆలూరుకోన అని అంటారు. పురాణకధ ప్రకారం ఈ పుణ్యక్షేత్రం 14వ శతాబ్దంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు.
ఆ ఆలయంలో తాటకికి మోక్షాన్నిచ్చిన వైకుంఠవాసుడు శ్రీరాముడికి కులదైవమైన శ్రీరంగనాధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.కొండపై చిన్న ఆలయ ద్వారం దాకా మనం వాహనాల్లో వెళ్ళగలిగేంత సౌకర్యంగా ఉన్నాయి రహదారులు. తాడిపత్రి నుండి ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆల్లొరు కోన దట్టమైన అడవిలో పక్షులు కలకలరవాలు మధ్య ప్రయాణం చేయాలి. సహజమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కోనను చేరుకోవచ్చు. ఆలయ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఎక్కడో జలపాతం సవ్వళ్ళు మంద్రంగా వినిపిస్తాయి. సుమారు 50 మెట్లు ఎక్కి వెళ్తే ఒక మండపం ఆ తర్వాత ఆలయగోపుర ద్వారం గుడి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన వసార చివర బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ ్భగవాన్‌ సన్నిధి. గరుడ భగవాన్‌ శ్రీరంఘనాధుని సేవలoోనిరంతరం తన్మయత్వంతో ఉన్నట్టు దర్శనమిచ్చే శ్రీ రంగనాయక విగ్రహం.
  గరుడ భగవాన్‌ ఎదుట ఒక మండపం ఆ తర్వాత గర్భగుడి. భక్తుల కోరికలను తీర్చే ఈ శ్రీరంగనాధుడు పడమటి దిక్కున శిరస్సు నుంచుకొని తూర్పువైపుకి కాళ్ళు పెట్టుకుని శేషశయనంపై పవళించిన విగ్రహం పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చున్నట్టున్న విగ్రహాలు దర్శనమిస్తాయి. నాభియందు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. మాములుగా శేషశయనంపై పవళించే శ్రీరంగనాధుని విగ్రహాలు మట్టితో తయారు చేసినవే. కాని ఈ క్షేత్రంలో వున్న శయనించిన శ్రీరంగనాధుడి విగ్రహం నల్లరాతితో చెక్కిన విగ్రహం. వైష్ణవ గురువైన శ్రీరామానుజల వారికి గర్భగుడి నిర్మించారు.
బయటి ప్రాకారంలో వరుసగా శంఖుచక్రాలు దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరమూ చైత్రంలో బ్రహ్మోత్సవము జరుగుతుంది. ధ్వజారోహణ, సింహవాహనము, హనుమాన్‌ వాహనములపై స్వామి వారి ఊరేగింపు పురవీధులలో జరుగుతుంది. రధోత్సవము, కళ్యాణోత్సవము మొదలైనవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి కులదైవమైన శ్రీరంగనాధుడే ఈ ప్రాంతం లోని ప్రజలకు ఇష్టదైవం. ఇంటి దైవముగా బాసిల్లుతున్నాడు. తమ కోర్కెలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం, ధర్మవరం, బళ్ళారి, కదిరి, నుండే కాక ఆంధ్ర రాష్ట్రములో పలు చోట్ల నుండి కూడా వస్తారు. ఆలయంలో వాయువ్య మూలలో ఎప్పుడూ ఊరే బుగ్గలో స్నానం చేసి స్వామిని దర్శించి కానుకలను, ముడుపులను చెల్లించి ప్రశాంతంగా ఆలయం వెలుపలికి వస్తారు భక్తజనులు. పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఈ ఆలయంలోని శ్రీరంగనాధుని దర్శించి స్వామి వారి అనుగ్రహం పొందుతాం.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-190 190-నటి ,భరత నాట్య కళాకారిణి ,నర్తనశాల ,పూజాఫలం ,గుండమ్మకధ ల హీరోయిన్ వర్జీనియా యూనివర్సిటి బడ్జెటింగ్ అధికారిణి –ఎల్.విజయ లక్ష్మి

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-190

• 190-నటి ,భరత నాట్య కళాకారిణి ,నర్తనశాల ,పూజాఫలం ,గుండమ్మకధ ల హీరోయిన్ వర్జీనియా యూనివర్సిటి బడ్జెటింగ్ అధికారిణి –ఎల్.విజయ లక్ష్మి
• ఎల్.విజయలక్ష్మి 1960వ దశకములోని తెలుగు సినిమా నటి, భరతనాట్య కళాకారిణి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది.
• ఈమెకు నాట్యం అంటే ఎంతో ఆసక్తి. ఈమె సరైన భరతనాట్యం గురువు కోసమే, వీరి కుటుంబం పూణే నుండి చెన్నై తరలి వచ్చింది. త్వరగా నేర్చుకునే చురుకుదనం ఉన్న విజయలక్ష్మి అనతికాలంలోనే చక్కని నాట్యకళాకారిణిగా తీర్చిదిద్దుకుంది. ఈమె ఆరంగేట్రానికి, తనకు స్ఫూర్తినిచ్చిన నాట్యకళాకారిణి కుమారి కమల కూడా హాజరైంది. ఈమె నాట్యం చూసి ఈమెకు తొలిసారిగా తెలుగు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత తమిళంలో కూడా నటించే అవకాశాలు వచ్చాయి.
• 1960వ దశకపు చివర్లో వచ్చిన ఈటి వరై ఉరవు ఈమె చివరి చిత్రం. ఆ చిత్ర నిర్మాణ సమయంలో విజయలక్ష్మి సోదరుని స్నేహితుడు, విజయలక్ష్మి ఫోటోను చూసి ఆమెను ప్రేమించాడు. పెళ్ళి ప్రతిపాదన చేశాడు. అందుకు విజయలక్ష్మి తల్లితండ్రులు అంగీకరించడంతో 1969లో మనీలాలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞుడు సురజిత్ కుమార్ దే దత్తాను పెళ్ళిచేసుకొని మనీలాలో స్థిరపడింది. మనీలాలో ఖాళీ సమయంలో చేసేదేమి లేక వ్యవసాయశాస్త్రంలో ఉన్నత చదువులు ప్రారంభించింది.[1]
• విజయలక్ష్మి 1991లో అమెరికాలో స్థిరపడి, అకౌంటింగ్ విద్యను అభ్యసించి ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో బడ్జెటింగ్ అధికారిగా పనిచేస్తున్నది.[2]
చిత్ర సమాహారం[మార్చు]
• జగదేక వీరుని కథ (1961) – నాగ పుత్రిక
• ఆరాధన (1962) – నాట్యకత్తె
• గుండమ్మ కథ (1962 – పద్మ
• మహామంత్రి తిమ్మరుసు (1962) – చిన్నాదేవి
• శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1962)
• నర్తనశాల (1963) – ఉత్తర
• పునర్జన్మ (1963)
• షబ్నమ్ (హిందీ) (1964)
• పూజాఫలం (1964)
• బబ్రువాహన (1964) – సుభద్ర
• బొబ్బిలి యుద్ధం (1964)
• రాముడు భీముడు (1964)
• పరమానందయ్య శిష్యుల కథ (1966)
• నసీహత్ (హిందీ) (1967)
• శ్రీకృష్ణావతారం (1967)
• భక్త ప్రహ్లాద (1967)
• చిత్రలేఖ.

చక్కని నటనకు ,హావభావాలకు పటిష్టమైన నృత్యానికి చిరునామాగా నిలచింది ఎల్ విజయ లక్ష్మి .సభ్యత సంస్కారాలతో మెప్పించింది .అందం ఆమెకు పెట్టనికోట అయింది .ముద్దుముద్దు పలుకులతో అలరించింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-189 · 189-‘’మా తెలుగు తల్లికీ మల్లెపూదండ ‘’’’దేశమును ప్రేమించుమన్నా ‘’గాయని ,చతుర్భాషా చిత్ర నటి ,విదేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి,నృత్యకళసంగీతం పై వర్క్ షాపులు నిర్వహించి బ్రాడ్వే అవార్డ్ పొందిన విదుషీమణి –టంగుటూరి సూర్యకుమారి

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-189

·         189-‘’మా తెలుగు తల్లికీ మల్లెపూదండ ‘’’’దేశమును ప్రేమించుమన్నా ‘’గాయని ,చతుర్భాషా చిత్ర నటి ,విదేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి,నృత్యకళసంగీతం పై వర్క్ షాపులు నిర్వహించి  బ్రాడ్వే అవార్డ్ పొందిన  విదుషీమణి –టంగుటూరి సూర్యకుమారి

·         టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 131925 – ఏప్రిల్ 252005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు.

జీవిత విశేషాలు

ఈమె 1925 నవంబర్ 13 నాడు రాజమండ్రిలో జన్మించింది. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు. 1937లో మద్రాసు వచ్చి, సినీరంగ ప్రవేశము చేసింది. 1952లో ఆమె తొలి మద్రాసు అందాలసుందరి (మిస్ మద్రాసు) అయినది.[1] మూడో ఏటనుంచే పాటలుపాడేది. పన్నెండు, పదమూడేళ్ళ ప్రాయంలోనే ఆమె ‘రైతుబిడ్డ‘ సినిమాలో నటించింది. సూర్యకుమారి రూపం, కంఠస్వరం రెండూ బాగా ఉండడంచేత, అప్పటికే పెదనాన్న ప్రకాశం సభల్లో ప్రార్థన గీతాలు పాడుతూండడం చేత సినిమావారి పిలుపు వచ్చింది. సాంప్రదాయ నియమ, నిష్టలుగల కుటుంబమవడంచేత కొంత వ్యతిరేకత ఎదురయ్యింది. ఊగిసలాట అనంతరం సూర్యకుమారి సినిమాల్లోకి వచ్చి తెలుగుతమిళకన్నడహిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించింది.

లలిత గీతాలు యాభై, దేశభక్తిగీతాలు యాభై మొత్తం నూరు గ్రామఫోను రికార్డులు ఇచ్చింది. అలాగే ఒక యాభై దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటల రికార్డులు ఉన్నాయి

చంద్రహాస (1941) సినిమాలో టంగుటూరి సూర్యకుమారి పాడిన ముదముగ పాట

నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడంచేత ఆమె పాట కచ్చేరీలు తరుచూ చేస్తూండేది. ఆంధ్రలోని చాలా ఊళ్ళలో లలిత సంగీత కచ్చేరీలు చేసింది. పేరు ప్రతిస్టలు, ప్రజాదరణ ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ప్రత్యేక కృషి చెయ్యాలన్న తపన, మూడు నాలుగేళ్ళపాటు కరతాళ ధ్వనులకు, ప్రశంసలకు దూరంగా ఉండి, చదువుమీద దృష్టి కేంద్రీకరించి, ప్రైవేటుగా కేంబ్రిడ్జి సీనియర్ పరీక్ష వ్రాసి, ప్రథమశ్రేణిలో పాసైంది.[2]

సూర్యకుమారి కంఠ, రంగూ, రూపం ఆకర్షణీయంగా ఉన్నా, మామూలు అమ్మాయిలకంటే కొంచెం పొడవుగా ఉండటం చేత, సినిమా రంగంలో సమస్య అయ్యింది. ఆనాటి సగటు హీరోలు ఈమె కంటే ఓ చూపువాసి పొట్టిగా ఉండటంచేత కాస్త ఇబ్బంది. అదీ కాక ఈమె బ్రాహ్మణ కుటుంబం, అందులోనూ పేరుపొందిన రాజకీయ కుటుంబం నుంచి రావటమే కాదు, ప్రేమ సన్నివేశాలు హీరోయిన్ మీద హీరో చెయ్యి వెయ్యడం, ఇత్యాదివి ఒప్పుకొనేవారు కాదుట. అందువల్ల గొప్ప చాతుర్యం ఉండి కూడా సూర్యకుమారి సినిమాల్లో సుస్థిరత పొందలేక పోయింది.

తెలుగు, తమిళము, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయములో మా తెనుగు తల్లికి మల్లెపూదండదేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. ప్రకాశం పంతులు ఈమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించాడు. శాస్త్రీయ సంగీతం నేర్పించాడు. అతను ఏ సభకు వెళ్ళినా ఈమెను ఆ సభకు తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవాడు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో వందేమాతరం, ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. వీటితో పాటు’స్వప్నజగతిలో ఛాయావీణ’ మొదలైన లలిత గీతాలు, అడవి బాపిరాజు గారి ‘ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ’, ‘రావోయి చిన్నవాడా’ మొదలైన జానపద గీతాలు కూడా పాడుతుండేది. హెచ్.ఎం.వి. తదితర గ్రామఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డు చేశాయి. ప్రముఖ గాయనిగా పేరుతెచ్చుకుంది.

ఇతర దేశాలలో వ్యాపించిన ఖ్యాతి

1960 దశకంలో ఈమె లండను వెళ్ళి అక్కడ ‘ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ సంస్థను స్థాపించింది. ఇందులో భారతీయ పాశ్చాత్య కళలను, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, పరస్పర సదవగాహన పెంపొందించం ముఖ్య ఆశయం. 1968లో ఈమె కృషిని బ్రిటిషు రాణి గుర్తించింది. 1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ సెయింట్ పాల్ కెథెడ్రల్ లో గానం చేసిన ప్రథమ భారతీయ వనిత ఈమె. ఈమె నార్వేస్వీడన్హాలెండ్స్పెయిన్కెనడాఅమెరికామొదలైన పలు దేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి, వందలాది కళాకారులను తయారుచేశారు. అమెరికాలో బ్రాడ్వే థియేటరులో విశ్వకవి రవీంద్రుని ‘కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్’ నాటకంలో రాణి పాత్ర ధరించి, బ్రాడ్వే అవార్డు పొందిన మొదటి భారతీయ వ్యక్తి. ఈ నాటకాన్ని న్యూయార్కులో ఎనిమిది నెలలపాటు ప్రదర్శించి, అటు తరువాత ఆఫ్రికాలో నాలుగు నెలలు పర్యటించింది. కొలంబియా యూనివర్సిటీలోనూ, లండను యూనివర్సిటీ విద్యాసంస్థలలోను, బ్లాక్ థియేటరులోను భారతీయ నృత్యకళ సంగీతంపై వర్క్ షాపులు నిర్వహించింది. ప్రాచ్య, పాశ్చాత్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్భావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినందిన మధురగాయని ఈమె.

అవార్డులు

1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఈమె సేవలను గుర్తించి సత్కరించింది. 1979లో రాజ్యలక్ష్మి అవార్డుతో ఈమెను గౌరవించింది.

అస్తమయం

లండను లోని ప్రముఖ చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్తో వివాహమైంది. 1973లో లండనులో స్థిరపడిన ఈమె ఏప్రిల్ 252005 న లండనులో మరణించింది.

సినిమాల జాబితా

·         విప్రనారాయణ (1937)·         అదృష్టం (1939)·         రైతుబిడ్డ (1939)·         జయప్రద (1939)·         దేవత (1941)·         అబ్ల (1941) – హిందీ·         చంద్రహాస (1941)·         దీనబంధు (1942)·         భక్త పోతన (1942)·         భాగ్యలక్ష్మి (1943)·         కృష్ణప్రేమ (1943)·         కటకం (1947) – తమిళము·         గీతాంజలి (1948)·         సంసారనౌక (1948) – తమిళము·         భారతి (1949) – కన్నడ·         అదృష్టదీపుడు (1950)·         మరదలు పెళ్లి (1952)·         వతన్ (1954) – హిందీ·         ఉడాన్ ఖటోలా (1955) – హిందీ·         బాంబే ఫ్లైట్ 417 (1956) – ఆంగ్లము·         భక్త రామదాసు (1964·         భారతి (1949) – కన్నడ·         అదృష్టదీపుడు (1950)·         మరదలు పెళ్లి (1952)·         వతన్ (1954) – హిందీ·         ఉడాన్ ఖటోలా (1955) – హిందీ·         బాంబే ఫ్లైట్ 417 (1956) – ఆంగ్లము·         భక్త రామదాసు (1964)

  లండన్ లో సెటిల్ అయిన ఆంధ్ర మేధావి, కవి, రచయితా ,విమర్శకుడు ఇంగ్లీష్ సాహిత్యంపై ఉద్గ్రంధాలు రాసిన శ్రీ గూటాల కృష్ణమూర్తి గారు  సూర్యకుమారిపై ఒక అద్భుత గ్రంధాన్ని ఎన్నో విలువైన సమాచారాలతో ఫోటోలతో వెలువరించారు .ఈ పుస్తకం వచ్చిందని సరసభారతి కి ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి తెలియ జేస్తే ,ఆయన శ్రీ బాపు గారికి చెబితే ,బాపు గారు ఆ అరుదైన పుస్తకాన్ని నాకు పంపారు .చిన్నప్పటి నుంచి సూర్యకుమారి పాటలంటే ఇష్టపడే నాకు ఇది అమూల్య బహుమతి .బాపుగారికి ,మైనేనిగారికి కృతజ్ఞతలు అప్పుడే చెప్పాను .మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను .మాధుర్య లాలిత్యాలకు సూర్యకుమారి పెట్టింది పేరు ఆంద్ర దేశపు కీర్తి విదేశాలలో వ్యాపింపజేసిన విదుషీమణి ఆమె .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -2(చివరిభాగం )

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -2(చివరిభాగం )

1892లో ప్రభుత్వం తిరునల్వేలి సబ్ జడ్జిగా చందు మీనన్ ని నియమించింది .అప్పుడే ‘’శారద ‘’నవల రాయటం మొదలుపెట్టి ,1893లో పదవిలో స్థిరపడి ,మంగులూర్ కుబదిలీ అయి ,అక్కడ పక్షవాతం రావటం తో సెలవుపెట్టి ,ఆరోగ్యం కుదుటపడ్డాక ఉద్యోగం లో చేరి ,1896లో కాలికట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు ఈమధ్యకాలం లో శారద నవల రాయలేకపోయాడు .

మలయాళ సాహిత్యాన్ని ప్రభావితం చేసినవి ఆయన రాసిన ఇందులేఖ ,శారద నవలలు మాత్రమె .కేరళ కాళిదాసు గా ప్రసిద్ధుడైన కేరళవర్మవలీయ కోయిల్ తమ్పురాన్ పద్యరచనకు ప్రభావితుడై ‘’మయూర సందేశం ‘’ను స్వంత ఖర్చులతో ముద్రించి ,ముందుమాట తానె రాసి మిత్రులకు అందజేశాడు .కుంజీ శంకరం నంబియార్ రాసిన ‘’నారీ చరితం ‘’అనే శార్దూల చరితానికి కూడా తానె ఆముఖం రాసి అచ్చు వేయించాడు .పి.కె .పరమేశ్వరన్ నాయర్ రాసిన ‘’ఆధునిక మలయాళ సాహిత్యం ‘’ చదివి ప్రభావితుడై ‘’ప్రాచీనకాలం లో న్యాయ వ్యవస్థ ‘’,సర్.టి.ముత్తుస్వామి అయ్యర్ స్మారకోపన్యాసం అనే రెండు ప్రసంగాలు చేశాడు ఇవి పుస్తకరూపం పొందాయి .

ఇంగ్లాండ్ ప్రధాని ఇ.గ్లాడ్ స్టన్ నుంచి చందు మీనన్ కు ఒక ఉత్తరం వచ్చింది .అందులో ఆయన రాసిన రెండు నవలలు మళయాళ సాహిత్యానికీ ,భారత దేశానికి చందు మీనన్ చేసిన సేవలను విక్టోరియా మహారాణి ప్రశంసించినదనీ పేర్కొని ,1897లో చందుమీనన్ కు ‘’రావు బహదూర్ ‘’బిరుద ప్రదానం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం .1898లో మద్రాస్ యూని వర్సిటి ఆయనకు ‘’న్యాయ పట్టాల పరీక్షకుడు ‘’ను చేసింది .విశ్వవిద్యాలయ సభ్యుడిగా కూడా నియమించి గౌరవించింది .

1899సెప్టెంబర్ 7 గురువారం మధ్యాహ్నం కొంచెం ముందుగా కోర్టు నుంచి ఇంటికి వచ్చి కొద్దిగా అల్పాహారం తీసుకొని కుర్చీలో విశ్రాంతి తీసుకొంటుండగా ,ఒకపాత న్యాయవాది మిత్రుడు చూడటానికి వస్తే ,ఇద్దరు న్యాయశాస్త్ర చర్చ చేశారు .మీనన్ కు బాగాలేదనిపించి బెడ్ రూమ్ వైపుకు బయల్దేరి మధ్యలోనే అలసటవచ్చి ,అడుగులు తడబడి పక్కనే ఉన్న కోచ్ మీద కూర్చున్నాడు .అంతే ఒక మహత్తర జీవితం పరిసమాప్తి అయింది .అప్పటికి భార్య ,ఆరుగురు పిల్లలు ఉన్నారు .

ఇందులేఖ నవల రాయటానికి చందు మీనన్ కు భార్య లక్ష్మీ కుట్టి అమ్మ గొప్ప సహకారం అందించిందని అందరూ చెప్పుకొన్నారు .ఈ నవల ఆంగ్లాను వాదకుడు ‘’డూమేర్గ్’’కు మీనన్ రాసిన లేఖలో ‘’నా భార్య ఇంగ్లీష్ నవలల పద్ధతిలో తన మాతృభాష మలయాళం లో రాసిన ఒక నవల చదవాలని ఉంది అని తరచుగా నాతొ చెప్పేది .ఆ కోరిక ఇలా నేరవేర్చాను ‘’అని రాశాడు .

టై లేకుండా కోటు వేసుకొనేవాడు మీనన్ .కోటు గుండీలు పెట్టుకొని దానిపై దట్టీ కట్టుకోనేవాడు .ఇతరుల పాండిత్యాన్ని చాలా తేలికగా అంచనా వేసేవాడు .హాస్యప్రియుడు చమత్కారం మాటలతో సయ్యాట లాడేది .అదే రచనలోనూ ప్రతిఫలించింది .కధాకేళి అంటే చాలా ఇష్టం .కున్జకర్దా నటన బాగా ఇష్టం .అతని ప్రదర్శన చూసి ఆరోజు సావరిన్ ధర ఎంతో తెలుసుకొని దానికి సరిపడా వెండి రూపాయలను అతని చేతుల్లో పోసి తృప్తి చెందేవాడు మీనన్ .

ఇందులేఖ నవల ప్రాముఖ్యత

19వ శతాబ్ది నాయర్ తార్వాడ లేక మరుమక్కత్దాయి ఉమ్మడి కుటుంబాలకద.సాధారణ సంఘటనలతో పాటు విశిష్ట పాత్రలు కూడా ఇందులేఖ నవలలో చిత్రించాడు చందుమీనన్ .ఇందులో పంచు మీనన్ పరమ కోపిష్టి ,నిరంకుశుడు .ఇతని వర్నలోనే అతని క్రూరత్వం స్పష్టమౌతుంది .సూరి నంబూద్రి ని హాస్యం వ్యంగ్యంతో చిత్రించాడు .ఇతడిని విదూషకుడుగా ,పంచుమీనన్ ను ముసలి మిణుగురు పురుగుగా చిత్రించాడు .మాధవన్ ,ఇందులేఖలు ఆదర్శ వ్యక్తులు సౌందర్య సామర్ధ్యాలున్నవాడు ,అసాధారణ పండితుడు గొప్ప క్రీడాకారుడు మాధవన్ .బహుశా మన చందు మీనన్ అనిపిస్తాడు .ఇందులేఖ అత్యంత సౌన్దార్యరాషి ఆమె గుణ గణాలను ఆరు పేజీలలో వర్ణించాడు .ఆమె ఆలోచించి పనులు చేస్తుంది కనుక కుటుంబ లో అందరికీ ఆమె ఇష్టం .ఇంగ్లీష్ చదువులో దిట్ట నంబూద్రి ని మొహం మీదే నిరాకరించి మాధవన్ ను పెళ్ళాడింది .నవల చివర్లో రచయిత పురుషులు అనుభవించే అన్ని హక్కులు స్త్రీలకూ కూడా ఉండాలని తెలియజేయటమే ఈనవల రాయటం లో ముఖ్యోద్దేశం అని చెప్పాడు .నవల వాస్తవికతకు సజీవ చిత్రమే .యువతరానికి మాధవన్ ప్రతినిధి .చందుమీనన్ రచయితగా నిరక్షరాస్యతపై పోరు చేశాడు, విజయం సాధించాడు .

బెంగాల్ లో స్త్రీలు చదువుకొంటే విధవ రాళ్ళు అవుతారు అనే మూఢ నమ్మకం ఉండేది .1882లో భారత స్త్రీ జనాభాలో 800మందిలో ఒక్క స్త్రీ మాత్రమె చదువు నేర్చింది అని గణాంకాలు తెలియజేశాయి .ఇందులేఖ నవలలకు వచ్చిన విశేష ప్రాముఖ్యాన్ని బట్టి అది ‘’నవలారాజం ‘’అయింది .

శారద నవలా విశేషాలు

చందు మీనన్ రెండవ నవల శారద కధ రామేశ్వరం లో ఒక హోటల్ గదిలో మొదలౌతుంది .అక్కడ రామన్ మీనన్ అనే చిత్రకారుడు భార్య కల్యాణి అమ్మతో ,కూతురు శారద తో ఉంటాడు .కల్యాణి తార్వాడు అనే ధనిక భూస్వామికి ఆమె ఇష్టం లేకుండా ఆమె పినతండ్రి ఇచ్చి బలవంతపు పెళ్లి ఆముసలాడితో చేస్తాడు .ఆమె భరించలేక వైతి పట్టర్ అనే ఆశ్రితుడితో కృష్ణన్ అనే పిల్లవాడి సాయంతో ఇల్లువదిలి కాశీ చేరి ,కొంతకాలం తర్వాత చిత్రకారుడు రామన్ మీనన్ తో పరిచయం కలిగి పెళ్లి చేసుకొన్నది.శారద పుట్టింది .పట్టర్ ఈమెను మోసం చేయాలనుకొంటే కధ మారటం వలన వదిలి మలబార్ వెళ్ళిపోయాడు .చిత్ర లేఖనం తో కొంతసంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ కళ్ళకు ఏదో జబ్బు చేసి వృత్తి మానేసి మిగిలిన డబ్బు బాంకు లో వేస్తె అదివాలా తీసింది .తగిలిన రెండు దెబ్బలకు కుంగి తీర్ధయాత్రలు చేస్తూ కుటుంబంతో రామేశ్వరం చేరాడు .కృష్ణన్ మంచి తనాన్ని భార్యకు చెబుతూ ఉండేవాడు మీనన్ .కొంతకాలానికి భార్య కూడా చనిపోయింది .

అనేక నాటక పరిణామాలు జరిగి శారద పెద్ద ఎస్టేట్ కు వారసురలైనా ,అనేకమోసాలు జరిగి తండ్రితో వేరుగా ఉంటోంది .తర్వాత కోర్టుకేసులు విచారణలు .వాదోపవాదాలను అసాధారణ న్యాయ నైపుణ్యం ఉన్న చందుమీనన్ కు మాత్రమె సాధ్యమైన తీరులో సంభ్రమం కలిగిస్తాయి .తర్వాత భాగం రాయలేకపోయాడు .చట్టానికీ న్యాయస్థానానికి సంబంధినది శారద నవలా వృత్తాంతం .

బూజుపట్టిన పాత మార్గాన్ని వదిలి చందుమీనన్ ఆధునిక మలబారును తన నవలలో చిత్రించాడు .పద్యం వదిలి గద్యం రాసి,సజీవ భాష ఉపయోగించాడు .సామాజిక గృహ జీవితమే ఆయన రాశాడు .సమకాలీన జీవిత చరిత్రకారుడై చందుమీనన్ ,మలబారు సాహిత్య ,సాంఘిక ప్రపంచాలలో రాబోయే సంఘటనలకు వేగు చుక్క అయ్యాడు .రాబోయే తరం మరింత తిరుగుబాటుకు స్వేచ్చకు దారి చూపాడు .విద్యకు దూరంగా ఉంచబడిన స్త్రీలపై గొప్ప సానుభూతి చూపాడు .సంస్కర్తగా మారాడు .కాలానికి అనుగుణమైన విద్య మహిళలకు ఇవ్వమని ప్రబోధించాడు .వర్తమానాన్ని అధ్యయనం చేసి బంగారు భవిష్యత్తు ఊహించిన దార్శినికుడు ‘’ఆధునిక మలయాళ నవలాపితామహుడు’’ ,మళయాళ నవలారచనపై కాంతి పుంజం వెదజల్లిన ఉత్తముడు ,దేశీయుల స్వేచ్చ విజ్ఞానం కాంక్షించిన ఉత్తమదేశభక్తుడు చందు మీనన్ .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-22-ఉయ్యూరు

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-188 188-రేడియో బావగారి కబుర్లు ,వినోదాల వీరయ్య ,జానపద గీతాలు హరికదల ఫేం ,భీష్మ లో విచిత్రవీర్యుడు,త్యాగయ్యలో గణపతి ,అందాలరాముడులో పూజారి –ప్రయాగ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-188

188-రేడియో బావగారి కబుర్లు ,వినోదాల వీరయ్య ,జానపద గీతాలు హరికదల ఫేం ,భీష్మ లో విచిత్రవీర్యుడు,త్యాగయ్యలో గణపతి ,అందాలరాముడులో పూజారి –ప్రయాగ

ప్రయాగ నరసింహ శాస్త్రి (నవంబరు 201909 – సెప్టెంబరు 111983ఆకాశవాణి ప్రయోక్త[1], తెలుగు నటుడు.

జీవిత సంగ్రహం

తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన వ్యక్తి శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ‘ సెబాస్ ‘ అనిపించుకొన్న వ్యక్తి. 1936 లో ప్రయాగ ఆకాశవాణి మదరాసు కేంద్రంలో నిలయ విద్వాంసుడుగా చేరారు. ‘ బావగారి కబుర్లు ద్వారా వీరు శ్రోతలకి చేరువయ్యారు. వీరు, గాడేపల్లి సూర్యనారాయణ గారు కలిసి బావగారి కబుర్లు నిర్వహించేవారు. అవి శ్రోతల జీవనంలో భాగమైపోయాయి. ‘ ఏమండోయ్ బావగారు ! రావాలి ! రావాలి ! ‘ అనే పలకరింపులు సహజమయ్యాయి. స్క్రిప్టు లేకుండా యధాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ.

జననం

నరసింహశాస్త్రి 1909 నవంబరు 20 న విశాఖపట్నం జిల్లా పెదగాడి గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై అపారమైన ప్రీతి. విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకొని పట్టభద్రులయ్యారు. శ్రీశ్రీ, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి వీరి సహాధ్యాయులు. ఆదిభట్ల నారాయణ దాసు గారి వద్ద హరికథా గానంలో మెళుకువలు నేర్చుకొన్నారు. చక్కని గాత్రము రూపము ఉన్న ప్రయాగ 1935లో చలన చిత్రరంగ ప్రవేశం చేశారు. భీష్మ చిత్రంలో విచిత్రవీర్యుని పాత్రను పోషించారు. నాగయ్య గారి త్యాగయ్య చిత్రంలో గణపతి పాత్రను పోషించారు. అనేక చిత్రాలకు పాటలు వ్రాశారు. 1969లో ఆకాశవాణిలో పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ చిత్రరంగంలో ప్రవేశించారు. చీకటి వెలుగులుఅందాల రాముడుడబ్బుకు లోకం దాసోహం వంటి సినిమాలలో నటించారు.

ఆకాశవాణి మదరాసు కేంద్రంలో 1936 నుండి రెండు దశాబ్దాలు పనిచేశారు. అక్కడ వీరు ప్రసారం చేసిన మొద్దబ్బాయ్ HMV గ్రామఫోన్ రికార్డు కంపెని వారు రికార్డు చేసి విడుదల చేశారు. 20కి పైగా HMV రికార్డులు ప్రయాగ రిలీజ్ చేశారు. శ్రోతలలో వీరికంత ప్రశస్తి వుండేది. 1956లో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి బదలీ అయి వచ్చారు. అక్కడ సర్వశ్రీ పింగళి లక్ష్మీకాంతంబందా కనకలింగేశ్వరరావుబాలాంత్రపు రజనీకాంతారావు, జరుక్ శాస్త్రి, బాలమురళి, ఓలేటి వంటి పండితుల సాహచర్యం లభించింది.

విజయవాడలో ప్రయాగ గ్రామీణ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు. ఎన్నో జానపద గేయాలను పాడి, పాడించి శ్రోతల మన్ననలందుకొన్నారు. హరికథలు స్వయంగా రచించి గానం చేశారు. త్యాగరాజ చరిత్ర, కన్యాకుమారి, గాంధీజీ, శంకర విజయం హరికథలు ప్రముఖాలు. 1962లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో గాంధీజీ బుర్రకథను వినిపించి బంగారు పతకంతో సన్మానించబడ్డారు. వీరి బుర్రకథలు HMV గ్రామఫోను రికార్డులుగా విడుదలైనాయి.

వినోదాల వీరయ్యగా విజయవాడ కేంద్రం నుండి ఎన్నో కార్యక్రమాలు సమర్పించారు. ఆకాశవాణి ప్రయాగకు ఆరోప్రాణం. 1969లో పదవీ విరమణ చేసేంతవరకు ఆయన ప్రయోక్తగా ఎన్నో కార్యక్రమాలు వెలువడ్డాయి. 1970 నుండి ఐదు సంవత్సరాలు కేంద్ర సంగీత నాటక అకాడమీవారి పక్షాన ‘ బాలాజీ ఆర్ట్ థియేటర్ ‘ పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. 1980 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంగీత కళా పీఠంలో యక్షగానాలుహరికథల అధ్యాపకులుగా పనిచేశారు. హిందు ధర్మ ప్రచార పరిషత్ లో జానపద కళా ప్రచారకులుగా వ్యవహరించారు.

మరణం

1983 సెప్టెంబరు 11న పరమపదించారు. మాటపాట, ఆటలతో శ్రోతల్ని సంబరపెట్టిన ప్రయాగ నిత్యోత్సాహి. ప్రయాగ నరసింహశాస్త్రి కుమార్తె వేదవతి ఆకాశవాణిలో అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా నిజామాబాద్ లో పనిచేస్తున్నారు.

నటించిన సినిమాలు

·         భీష్మ – విచిత్రవీర్యుడు

·         త్యాగయ్య – గణపతి

·         చీకటి వెలుగులు

·         అందాల రాముడు

·         డబ్బుకు లోకం దాసోహం

·           సశేషం

·         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-22-ఉయ్యూరు

·    

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-187 · 187-‘’చీటికి మాటికి చిట్టేమ్మంటే’’పాట ఫేం –కోరస్ గాయని –ఎల్.ఆర్ అంజలి

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-187

·         187-‘’చీటికి మాటికి చిట్టేమ్మంటే’’పాట ఫేం –కోరస్ గాయని –ఎల్.ఆర్ అంజలి

·         ఎల్.ఆర్.అంజలి ఒక సినిమా నేపథ్య గాయని. ఈమె గాయని ఎల్.ఆర్.ఈశ్వరికి చెల్లెలు. ఈమె తల్లి నిర్మల 1950లలో సినిమాలలో కోరస్ పాడేది. ఈమె తండ్రి దేవరాజన్ మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు.ఈమె బాల్యంలోనే తండ్రి మరణించాడు. ఈమె చదువు మద్రాసు ఎగ్మోర్‌లోని ప్రెసిడెన్సీ హైస్కూలులో గడిచింది. తర్వాత రాజారాం అయ్యంగార్ వద్ద సంగీతాన్ని, మీనాక్షి సుందరం పిళ్లై వద్ద శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించింది[1]. ఈమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో పాటలు పాడింది.

తెలుగు సినిమా పాటల జాబితా

ఎల్.ఆర్.అంజలి ఎం.ఎస్.విశ్వనాథన్జె.వి.రాఘవులురమేష్ నాయుడుకె.చక్రవర్తిచెళ్ళపిళ్ళ సత్యంటి.చలపతిరావు, విజయభాస్కర్ వంటి సంగీత దర్శకులు స్వరపరచిన పాటలను, ఆరుద్రకొసరాజు రాఘవయ్యచౌదరిసి.నారాయణరెడ్డిరాజశ్రీదాశరథి రంగాచార్యఅప్పలాచార్యదాసం గోపాలకృష్ణఆత్రేయఅనిసెట్టి సుబ్బారావుఉత్పల సత్యనారాయణాచార్యవేటూరి సుందరరామమూర్తి మొదలైన కవులు వ్రాసిన గేయాలను పాడింది. ఈమె ఎల్.ఆర్.ఈశ్వరిపి.బి.శ్రీనివాస్వాణీ జయరామ్బి.వసంతపిఠాపురం నాగేశ్వరరావుపి.సుశీలఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంరమోలా, మాధవపెద్ది రమేష్, జి.ఆనంద్ వంటి గాయకులతో కలిసి అనేక పాటలు పాడింది.


ఈమె గానం చేసిన తెలుగు పాటలలో కొన్ని[2] ఈ క్రింది జాబితాలో:

క్రమ సంఖ్యసినిమా పేరుపాట పల్లవిసహ గాయకుడు/ గాయినిసంగీత దర్శకుడుగేయ రచయితసినిమా విడుదలైన సంవత్సరం
1బుల్లెట్ బుల్లోడుఉండాలి మనలో మంచి మనసు కల్లాకపటంలేనిఎల్.ఆర్. ఈశ్వరిఎం.ఎస్.విశ్వనాథన్,
జె.వి.రాఘవులు
ఆరుద్ర1972
2ఇంటింటి కథరమణి ముద్దుల గుమ్మ రావే నా రాజనిమ్మలపి.బి. శ్రీనివాస్రమేష్ నాయుడుకొసరాజు1974
3చందనఏందే నాగు ఈడున్నావ్ ఓం భాయిరే షోక్ లంగారిరాజబాబురమేష్ నాయుడుసినారె1974
4తిరపతితప్పెట్లోయి తాళలోయి దేవుడి గుళ్ళోవాణీ జయరామ్,
చక్రవర్తి
చక్రవర్తికొసరాజు1974
5తులాభారంవాణీ ప్రేమ రాణీ వినవేలపద్మనాభం,
వసంత,
పిఠాపురం
సత్యంరాజశ్రీ1974
6బంట్రోతు భార్యపిడికెడుఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
రమోలా,
చంద్రశేఖర్,
రఘురాం
రమేష్ నాయుడుదాశరథి1974
7ముగ్గురమ్మాయిలుచిట్టిబాబు స్వాగతం చేరింది ఉత్తరం ముస్తాబైఎల్.ఆర్.ఈశ్వరి,
శరావతి
టి.చలపతిరావుసినారె1974
8హారతికప్పాఅందరికన్నానువ్వేకె.చక్రవర్తి,
పద్మనాభం
కె.చక్రవర్తిఅప్పలాచార్య1974
9కవితబాజా భజంత్రీలు మ్రోగుతాయి పందిట్లోఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంరమేష్ నాయుడు1976
10మహాత్ముడురంభలాగున్నది రమ్ము తీసుకొచ్చిందిరమేష్,ఆనంద్,విల్సన్టి.చలపతిరావుకొసరాజు1976
11చిల్లరకొట్టు చిట్టెమ్మచీటికి మాటికి చిట్టెమ్మంటె చీపురు దెబ్బలు తింటావురోశారదరమేష్ నాయుడుదాసం గోపాలకృష్ణ1977
12జీవన తీరాలుఅరేయ్ సాంబాఎం.రమేష్చక్రవర్తిఆత్రేయ1977
13దొంగలు చేసిన దేవుడుఅనంత దాయకి ఆలింపవా ఆరాధ్య దైవమాఎల్.ఆర్.ఈశ్వరిఎం.ఎస్.విశ్వనాథన్,
విజయా కృష్ణమూర్తి
అనిసెట్టి1977
14బొమ్మరిల్లుచల్లని రామయ్య చక్కని సీతమ్మజి.ఆనంద్,
పిఠాపురం
చక్రవర్తిఉత్పల1978
15అమ్మాయి కావాలివస్తావా అమ్మాకుట్టి చేక్కేదాం చెన్నపట్నంఎం. రమేష్చక్రవర్తి1979
16కలియుగ మహాభారతంబురు బురు పిట్టా బురు పిట్టఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎం.రమేష్,
రమోల
సత్యం1979
17విజయబూర్లొండేదా బావా గార్లొండేదా బూరులైతేచంద్రశేఖర్చక్రవర్తివేటూరి1979
18దారి తప్పిన మనిషికలగంటున్నాయి నీ కళ్ళు సలసల కాంగింది నీ ఒళ్ళువిజయభాస్కర్1979
18పటాలం పాండువస్తావా అమ్మకుట్టి చేక్కేదాంఎం.రమేష్చక్రవర్తిఆరుద్ర1981
19బందరు పిచ్చోడుఇంటి పెట్ట ఒకటున్నా అది విడవలేనిదనిపార్థసారథిపార్థసారథిభావశ్రీ1981
20బందరు పిచ్చోడుదుత్త మీద దుతెట్టి బుట్టలోన కూడెట్టిపార్థసారథిపార్థసారథియు.వి.బాబు1981

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-186 · 186-‘’లేలేలే నా రాజా ,తీస్కో కోకాకోలా ,మసకమసక చీకటిలో ,బలేబాలే మగాడివోయ్ ‘’వంటి లంగా మార్క్ పాటల గాయని గా ముద్రపడిన కలైమామణి –ఎల్ ఆర్ ఈశ్వరి 

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-186

· 186-‘’లేలేలే నా రాజా ,తీస్కో కోకాకోలా ,మసకమసక చీకటిలో ,బలేబాలే మగాడివోయ్ ‘’వంటి లంగా మార్క్ పాటల గాయని గా ముద్రపడిన కలైమామణి –ఎల్ ఆర్ ఈశ్వరి

·

· ఎల్. ఆర్. ఈశ్వరి ప్రముఖ నేపథ్య గాయని. ఈమె మద్రాసులో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో డిసెంబరు 8వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఈమె ఐదేళ్ళ వయసులో అతడు మరణించాడు. ఈమె తల్లి నిర్మల కుటుంబభారాన్ని మోసింది. ఆమె మంచి గాయని కావడంతో సినిమాలలో అవకాశం లభించినప్పుడల్లా కోరస్ బృందాలకు పాడింది. ఆ సమయంలో తల్లితో పాటు ఈమె కూడా రికార్డు స్టూడియోలకు వెళ్ళేది. ఆ సమయంలోనే ఈమెకు కూడా కొన్ని చిత్రాలకు కోరస్ బృందంలో పాడే అవకాశం వచ్చింది. ఈమె పూర్తి పేరు “లూర్డ్ మేరీ”. ఈమె బామ్మ హిందూ కావడంతో “రాజేశ్వరి” అని పిలిచే వారు. ఈమె తన తల్లి, తండ్రి ఇరువైపుల బంధువులను తృప్తి పరచడానికి తన పేరును లూర్డ్ రాజేశ్వరిగా మార్చుకుంది. అప్పటికే తమిళ సినీరంగంలో ఒక రాజేశ్వరి గాయనిగా చలామణీలో ఉన్నందుకు తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరిగా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు, ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.

· ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, “నల్ల ఇడత్తు సంబంధం” (1958) అనే తమిళ సినిమాలో మొదటి సారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని “పాశమలార్” (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్, ఐటమ్ నంబర్లకు పాడింది. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడింది. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసింది. ఈమె మొత్తం 14 భాషలలో పాడింది.

· ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.

· ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో కళైమామణి అవార్డు ప్రదానం చేసింది.

సినిమాలు-పాటలు

 1. దొంగలున్నారు జాగ్రత్త (1958) (తొలి తెలుగు సినిమా)
 2. జగన్నాటకం (1960)
 3. అగ్గిపిడుగు (1964)
 4. నవగ్రహ పూజామహిమ (1964) : నవ్వర నవ్వర నా రాజా నవ్వుల నివ్వర ఓ రాజా
 5. పాండవ వనవాసం (1965) : మొగలి రేకుల సిగదానా (హేమమాలిని అభినయించిన పాట)
 6. ప్రేమించి చూడు (1965)
 7. శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)
 8. అగ్గిబరాట (1966)
 9. ఉమ్మడి కుటుంబం (1967)
 10. కంచుకోట (1967)
 11. గోపాలుడు భూపాలుడు (1967)
 12. శ్రీకృష్ణావతారం (1967) : చిలుకల కొలికిని చూడు నీ కళలకు సరిపడు జోడు
 13. అమాయకుడు (1968) : పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ
 14. ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)
 15. పాలమనసులు (1968)
 16. బంగారు గాజులు (1968) : జాజిరి జాజిరి జక్కల మావా
 17. బందిపోటు దొంగలు (1968) : గండరగండా షోగ్గాడివంటా
 18. బాగ్దాద్ గజదొంగ (1968)
 19. గండికోట రహస్యం (1969)
 20. నిండు హృదయాలు (1969)
 21. బందిపోటు భీమన్న (1969)
 22. కథానాయిక మొల్ల (1970) : నానే చెలువే అందరికి ( ఐదు భాషలలో పాడిన పాట)
 23. జన్మభూమి (1970)
 24. లక్ష్మీ కటాక్షం (1970) : అందాల బొమ్మను నేను చెలికాడ
 25. జగత్ జెంత్రీలు (1971)
 26. జేమ్స్ బాండ్ 777 (1971)
 27. బస్తీ బుల్ బుల్ (1971) : ఏ ఎండకా గొడుగు పట్టు రాజా నువ్వు పట్టకుంటే నీ నోట మట్టి రాజా
 28. దెబ్బకు ఠా దొంగల ముఠా (1971)
 29. నమ్మకద్రోహులు (1971) : ఏమా కోపమా నేను వేచింది నీకోసమే పాన్పు వేసింది
 30. బంగారుతల్లి (1971)
 31. ప్రేమనగర్ (1971) : లేలేలే లేలేలే నా రాజా… లేవనంటావా నన్ను లేపమంటావా
 32. రౌడీలకు రౌడీలు (1971) : తీస్కో కోకో కోలా వేస్కో రమ్ము సోడా
 33. పిల్లా-పిడుగు (1972)
 34. బాలభారతము (1972) : బలే బలే బలే బలే పెదబావ భళిర భళిర ఓ చినబావా
 35. భార్యాబిడ్డలు (1972) : ఆకులు పోకలు ఇవ్వద్దూ నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ
 36. మంచి రోజులొచ్చాయి (1972)
 37. మావూరి మొనగాళ్ళు (1972)
 38. రైతుకుటుంబం (1972)
 39. ఎర్రకోట వీరుడు (1973)
 40. జీవన తరంగాలు (1973) : నందామయా గరుడ నందామయా
 41. తాతా మనవడు (1973) : రాయంటీ నా మొగుడు రంగామెల్లీ తిరిగి రాలేదు
 42. దేవుడు చేసిన మనుషులు (1973) : మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో
 43. దేశోద్ధారకులు (1973)
 44. ధనమా దైవమా (1973)
 45. పుట్టినిల్లు మెట్టినిల్లు (1973) : బోల్తా పడ్డావు బుజ్జి నాయనా
 46. అల్లూరి సీతారామరాజు (1974)
 47. నిజరూపాలు (1974)
 48. నిప్పులాంటి మనిషి (1974) : వెల్ కం స్వాగతం చేస్తా నిన్నే పరవశం
 49. చిన్ననాటి కలలు (1975)
 50. అంతులేని కథ (1976) : అరే ఏమిటి ఈ లోకం… పలుగాకుల లోకం
 51. పాడిపంటలు (1976)
 52. మన్మధ లీల (1976) : హలో మై డియర్ రాంగ్ నంబర్
 53. దొంగల దోపిడీ (1978)
 54. దొంగల వేట (1978)
 55. మరో చరిత్ర (1978) : భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
 56. సింహబలుడు (1978) : సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్
 57. అందమైన అనుభవం (1979) : ఆనంద తాండవమే ఆడేనుగా ఆ శివుడు
 58. చూసొద్దాం రండి (2000) (చివరిగా పాడిన సినిమా)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో శ్రీరామనవమి శ్రీ సీతారామ కల్యాణం

శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో శ్రీరామనవమి శ్రీ సీతారామ కల్యాణం 
–10-4-22 ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగాఉయ్యూరు  శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం 10గం.లకు శ్రీ సీతా రామ శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది .భక్తులు విచ్చేసి దర్శించి తరి౦చ ప్రార్ధన .

                                    గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త 

                                     మరియు భక్త బృందం -7-4-22

Posted in సమయం - సందర్భం | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-183,184,185 · 183,184,185-రేడియోలో జీవించి ,సినిమాలో రాణించిన –నండూరిసుబ్బారావు ,సి.రామమోహనరావు ,వెంపటి రాధాకృష్ణ

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-183,184,185

·         183,184,185-రేడియోలో జీవించి ,సినిమాలో రాణించిన –నండూరిసుబ్బారావు  ,సి.రామమోహనరావు ,వెంపటి రాధాకృష్ణ

·           వీరి నిజ జీవితాల గురించి విషయాలు తక్కువగా తెలిశాయి కానీ ఈ త్రయాన్ని గురించి ,ఈ పంచ పాండవులగురించి తోటి వారు చెప్పిన విషయాలు పొందు పరుస్తున్నాను –

·         నండూరుసుబ్బారావు

·         సుబ్బారావు : విజయవౌడ కేంద్రం నాటక విభాగంలో (డ్రామా వాయిస్‌గా మూడు ధళా బ్రాలు వనిచేపిన సుప్రసిద్ధులు నండూరి సుబ్బారావు, ఆయన బందా కనక లింగేశ్వర గావు హయాంలో ఆకాశవాణిలో చేరి ఎన్నో. నాటకాలు నాటికలు (వాశారు, స్వయంగా రచయిత, నవలా కారుడు. వీరిగణపతి పాక పోషణ, సక్కుబాయిలో కాశీపతి పాతం వరవిక్రయం (శ్రోతల్ని అలరిస్తూ వుంటాయి. 1933 జూలై 7న కృష్ణాజిల్లా ఆరుగొలనులో జన్మించిన సుబ్బారావు బందా వారి సౌజన్యంతో 1960 ఆగస్టులో రేడియోరంగ (ప్రవేశం చేశారు. 1961 జనవరి మండి Drama Voicem ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి 1990 ఆగస్టు 31న రిటెరయ్యారు. 20 నవలలు, రెండు రేడియో నాటక సంపుటాలు (ప్రచురించారు. వీరి నవలల్లో ఆటబొమ్మ, దీపంజ్యోతి, అతకని (బతుకులు, విరిగిన కెరటాలు, వెన్నెల విలువెంత ? మన శీనయ్య సంసారం, రాగరంజిక (పముఖాలు, పిల్లల నాటికల సంపుటి గూడా (ప్రచురితమైంది. పీకు విశ్రాంత జీవితాన్ని విజయవాడలో గడుపు తున్నారు. మ్మికాంతగిరి శిఖరం, భగవాన్‌ రమణ మహర్షిరూపకాలలో పీరు శ్రీ గోపాల్‌తో కలిసి (ప్రొడక్షన్‌ టీమ్‌లో పనిచేసి జాతీయస్థాయి ఆకాశవాణి బహు మతులందుకొన్నారు.

నాటక రంగాన్ని పరిపుష్టం చేసిన మరికొందరిని న్మరించాలి. “ేమవరప్ప (శ్రీధరరావు నటుడుగా (సిద్ది గడించారు. అలానే కూచిమంచి కుటుంబరావు, ‘వెంవటి రాధాకృష్ణ, సి. రామమోహనరావు, నండూరి సుబ్బారావు, నాగరత్నమ్మ, వి.వి. కవకదుర్గ, A.B ఆనంద్‌, కమలకుమారి, నాటక విభాగంలో విశేష కృషి చేశారు. విజయవాడ నాటకాలంటే (శోతలు అప్పటికీ యిప్పటికీ చెవులు కోసు కొంటారు. శ్రీ 5. డీ. పద్మనాభరావు (టాన్సిమిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా 915లో చేరి (ప్రజా సంబంధాలు పటిష్టం చేశారు. 1991లో PEX అయ్యారు.

  విజయవాడ కేంద్రంలో పనిచేసి వదవీ విరమణ చేసిన అనొన్సర్లు లబ్ది (పతిష్టలు, సర్వశ్రీ కూచిమంచి కుటుంబరావు, శ్యామసుందరి, లత, కమలకుమారి, A.B. ఆనంద్‌, పేరి కామేశ్వరరావు, కోకా నంజీవరావు, డీ. లింగరాజు శర్మ, వెంపటి రాధాకృష్ణ కేవలం అనౌన్సర్లుగానే గాక ఇకర కార్య(క్రమాల ద్వారా (ప్రసిద్ది పొందారు. కుటుంబరావు చక్కటి కంఠస్వరం గల వ్య కి. వీరు నటించిన నాటికి నేడు నాటకం రసవత్తరంగా సాగింది. లత రచయిత్రిగా పేరు తెచ్చుకొన్నారు. (డ్రామా వాయిస్‌లుగా సర్వశ్రీ సి. రామమోహనరావు, నండూరి సుబ్బారావు, వి.వి. కనకదుర్గ, సీతారత్నమ్మ (ప్రముఖులు.

ఎండమావులు – నాటకం – సాహిత్యం – నండూరి సుబ్బారావు (రేడియో)

నండూరి సుబ్బారావు గారి పేరు వినంగాన్లే సాహితీపరులకు ఎంకిపాటల సుబ్బారావు గారి పేరు గుర్తుకు రావచ్చు. కానీ గతంలో రేడియో ప్రోగ్రాములు విన్నవారికి నండూరి సుబ్బారావు గారు గుర్తుకు వచ్చే ఉంటారు. రేడియోలో ఆయన గొంతు వినని రోజు లేదేమో. ఆయన రేడియో నాటకాలలో నటించటం వరకే మనకు తెలుసు, కాని ఆయన నాటకాలు రచించిన విషయం చాలామందికి తెలియక పోవచ్చు. ఆయన రచించిన “ఎండమావులు” అనే నాటకం కింద పోస్ట్ చేస్తున్నాను. ఇది “చిత్రనళీయం” అనే నాటిక సంపుటి నుండి, 1967 ముద్రణ. అప్పటికే ఆయన రచించిన నాటకాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ నాటకం చదువుతూ వుంటే సుబ్బారావు, నాగరత్నమ్మ గార్ల గొంతులు చెవుల్లో వినబడుతున్నట్లుగా

 వుంటుంది. చదివి ఆనందించండి.

   http://sobhanaachala.blogspot.com/2013/06/blog-post_29.html

http://sobhanaachala.blogspot.com/2016/12/blog-post_26.html

రేడియో కోసమే పుట్టి రేడియోకే తమ జీవితాలను అర్పణ చేసిన వారిలో చరితార్థులైన వారెందరో ఉన్నారు. నిజానికి వారెప్పుడో చేసి ఉంచిన కళాఖండాలే ఈ వేళ రేడియో ప్రతిష్టను నిలబెట్టి ఉంచుతున్నాయనటంలో సందేహం లేదు. కొన్ని ప్రమాణాలను
నిర్దేశించి, చక్కని దిశను దశనూ ఏర్పరచి వెళ్లారు. ఆ
మహామహుల అనన్య కృషి వల్ల రేడియోకు ఒక స్థిరత్వం ఏర్పడింది.

– మల్లాది సూరిబాబు
9052765490
నాకు తెలిసినంతవరకూ రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలన్నింటికీ బాధ్యత వహించేవారు రెండు రకాలుగా ఉంటారు.
ఒకరు కార్యక్రమ నిర్వాహకులు/ సాంకేతిక సిబ్బంది.
రెండవ వారు కళాకారులు.
వివిధ కళా సాహిత్య రంగాలకు సంబంధించిన వ్యక్తుల్ని స్టూడియోకు పిలిచి వారితో చేసే ముచ్చట్లతో రూపొందించే పరిచయాలు చేసేవారు కొందరు.
కళలతో, కళాకారులతో కలిసి ఆలోచనలు పంచుకుంటూ, సృజనాత్మక కార్యక్రమాలు రూపొందించటంలో అధికారుల కంటే కళాకారులే ప్రశంసలందుకుంటూ శ్రోతలకు దగ్గరవుతూంటారు. విజయవాడ రేడియోలో 35 ఏళ్లు నా జీవితం. 1960 నుంచి కొనే్నళ్లపాటు పరోక్షంగానూ, 1970 నుండి మూడున్నర దశాబ్దాలపాటు ప్రత్యక్షంగా రేడియో కార్యక్రమాల వైభవం నేనెరుగుదును. ఒక అనౌన్సర్ తన ఇంద్రజాల నైపుణ్యంతో ఎంతవరకూ అవసరమో అంతే విశేషాలతో వినిపిస్తూ శ్రోతలను కూర్చోబెట్టి వినేలా చేయటమే అసలైన విద్య.
మాటలతో మంత్రముగ్ధుల్ని చేయటం చిన్న విద్య కాదు. ఇందులో ఘటికులుగా పాతకాలంలో, ఉషశ్రీ, కూచిమంచి కుటుంబరావు, నండూరి విఠల్, ఎ.బి.ఆనంద్ గార్లను చెప్పుకునేవారు.
అనౌన్సర్ అనే మాట ప్రక్కనే ‘కంపేర్’ అనీ, యాంకర్ అనీ, మరో రెండు పదాలు కూడా రేడియోలో వాడుకలో ఉన్నాయి.
ఒకప్పుడు బయట ఊళ్లలో రేడియో కార్యక్రమాలు నిర్వహించేవారు. వాటిని ‘ఔట్‌డోర్ బ్రాడ్‌కాస్ట్’ (ఓబి) కార్యక్రమాలనేవారు. క్రమంగా ఇపుడు కనుమరుగయ్యాయి. ఆర్థిక మాంద్యమే కారణం. కానీ ఎన్ని విప్లవాత్మక మార్పులొచ్చినా ఆకాశవాణి అంటే ఇప్పటికీ అభిమానించే శ్రోతలున్నారు. అందుకు ప్రధాన కారణం – జీవితాలను మైకులకు అంకితం చేసిన గళాలే. కొందరు రేడియోలో మాట్లాడితే కదలాలనిపించదు. వారి గొంతులో ఏదో జీవం కూర్చోబెట్టేస్తుంది. గలగల పారే సెలయేరులా, మేఘ గంభీరమైన స్వరంతో మాటను మంత్రం చేస్తూ శ్రోతలను ముగ్ధులను చేసిన వారిలో ‘ఉషశ్రీ’ ఒకరు. అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయనతో, నా సాన్నిహిత్యం రెండు దశాబ్దాలకు పైనే. విజయవాడలో బాలాంత్రపు రజనీకాంతరావు డైరెక్టర్‌గా వున్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన ఉషశ్రీ.. పండిత పామరులకు పరిచితమైన అద్భుతమైన కంఠం. అక్షరానికీ, శబ్దానికి, అర్థం చెప్పిన ఉషశ్రీ, రామాయణ భారతాలు రేడియోను ఉత్తుంగ శిఖరంపై నిలబెట్టాయి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పురాణ శ్రవణానికి శ్రోతలు వశులై అన్ని పనులూ మానుకుని రేడియో చుట్టూ చేరిపోయేవారు. ఆ సమయంలో రేడియో ఇంటింటా మారుమోగిపోయేది. మొదట వ్యవసాయదారుల కార్యక్రమంలో వుంటూ అంచెలంచెలుగా ఎదిగి, మాట మీద పట్టు సాధించిన ఉషశ్రీకి సాహిత్యాభిమానులైన శ్రోతలతోబాటు, సామాన్య శ్రోతలు కూడా ఉండేవారు. అత్యంతాసక్తితో ఆయన్ని చూడాలని విజయవాడ రేడియో కేంద్రానికి వస్తూండేవారు. ‘ఉషశ్రీ ధర్మసందేహాలు’ కార్యక్రమంలో నేను పద్యాలు పాడేవాణ్ణి. నా పక్కనే ఎ.బి.ఆనంద్, సి.రామ్మోహనరావులు ప్రశ్నలు సంధిస్తూండేవారు. శ్రోతల ధర్మసందేహాలకు ఉషశ్రీ సమాధానాలు చాలా ఆసక్తిని కలిగిస్తూండేవి. ఎంతో లౌక్యంగా చెప్పే ఆయన తీరు ముచ్చటగా ఉండేది. గిలిగింతలు పెట్టేది కూడా. రేడియోకు అఖండ గౌరవాన్ని తెచ్చిన ఉషశ్రీ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడ్తారు.
అసలు రేడియోకు సంగీతం, నాటకం, సాహిత్యం.. ఈ మూడూ మూడు ప్రాణాలు. వైఖరి బాగోలేకపోతే ప్రసారాలు సవ్యంగా శ్రోతలకు చేరవు. మాటాడే మనిషిని వినిపించుకోక పక్కన పెట్టేస్తారు.
అదే పత్రికైతే మడతపెట్టి అటక ఎక్కించేస్తారు. మనకు నచ్చకపోయినా, ఆసక్తిగా వింటాం, చదువుతాం. ఎందుకు? చెప్పేవాడిపైనా, రాసేవాడిపైనా ఉంటుందంతా.
ఏం చెప్పాలో తెలియటం.. తెలిసిన దాన్ని కాగితం మీద పెట్టడం.. ఒక పద్ధతి. అలా వ్రాసుకొచ్చిన దాన్ని మొక్కుబడిగా చదివేస్తూ పోతే ఏ ఒక్కరికీ నచ్చదు. అదో గోలగా ఉంటుంది. మన ఎదురుగా కూర్చుని మనతోనే మాట్లాడినట్లుగా చెప్పడంలోనే ఉంది మజా.
సాధారణంగా, లాయర్లు, డాక్టర్లు, కొందరు స్టూడియోలో కూర్చుని మైకు చూడగానే బిగుసుకుపోతారు. యాంత్రికంగా మాట్లాడతారు. ఆత్మీయత ఉండదు. లాయర్లు నయం. డాక్టర్లను గమనించే వుంటారు. రోగులతో ఎప్పుడైనా కాస్త ఆప్యాయంగా మాట్లాడుతూ, పలకరించే వారుంటారా? అసలు ఆ అలవాటుంటేగా? స్టూడియోలో స్వేచ్ఛగా ఎలా మాట్లాడగలరు? అందుకే ప్రశ్నలు వేస్తూ మాట్లాడిస్తారు. రేడియో ప్రసారాలపై విసుగు కలగటానికి ఇదో కారణం.
నేను రేడియోలో చేరిన కొత్తలో పింగళి లక్ష్మీకాంతంగారి ‘సూక్తిసుధ’ తరచు ప్రసారమయ్యేది. ‘ఏమి వాగ్వైభవం?’ ఆయన్ని ఎప్పుడూ తలుచుకుంటాను. నాలుగున్నర నిమిషాలలో చెప్పదలచిన ఆత్మీయమైన మాటలను, అనునయిస్తూ చెప్పిన తీరు నన్ను ముగ్ధుణ్ణి చేసేది. అదో వరం. సాధనతో రాదు.
ఓసారి ఉషశ్రీ, నేనున్న స్టూడియోలోకి వచ్చి, రేడియోలో ఎలా మాట్లాడాలో చూడు. రమ్మని ఒక టేపు వినిపించారు. విస్తుబోతూ వింటున్నాను. 15 నిమిషాల వ్యవధిలో ‘జానకితో జనాంతికం’ అని ‘దువ్వూరి వెంకట రమణశాస్ర్తీగారి’ చిరుప్రసంగం అది.
భద్రాచలంలో వున్న సీతారామస్వామి గుడికి ఒక్కసారి రమ్మని సీతమ్మ తల్లి తనను పిలిచినట్లు, ‘ఎలా వున్నారు శాస్ర్తీగారూ!’ అని పలుకరించినట్లుగా, దానికి సమాధానంగా శాస్ర్తీగారు మాట్లాడిన తీరు, ఉషశ్రీని సైతం ఆశ్చర్యపరిచిందంటే ఆలోచించండి. అదీ వాక్వైఖరి యొక్క గొప్పతనం. సీతమ్మ తల్లి పాదాల చెంత కూర్చున్న భక్తుడు ఎంత చనువుగా ఉంటాడో ఆయన మాటలు చెప్పాయి.
అందుకే పాత్రలన్నీ మన కళ్లెదుటనే తిరుగుతున్నట్లుగా చూపించగలిగేది రేడియో నాటకం. డైలాగులను అప్పజెప్పేస్తూ పోతే ప్రయోజనం సున్నా. అందుకే రేడియోకి ప్రొడ్యూసర్లుండేవారు. తెలుగు నాటక రంగస్థలంపై తనదైన ముద్ర వేసిన నటుడు సి.రామమోహనరావు – పేరు మీకు గుర్తుండే ఉంటుంది. రేడియో నాటకానికి గుర్తింపు తెచ్చిన ప్రముఖులలో సి.రామ్మోహనరావు స్థానం అద్వితీయం.
విజయవాడ రేడియో కేంద్రానికి రామ్మోహనరావు ఓ మూల స్తంభం అంటే ఆశ్చర్యం లేదు. బందా కనకలింగేశ్వర్రావు శిష్యుడై తొలినాళ్లలో డ్రామా వాయిస్‌గా నాటక నిర్వహణలో పాలుపంచుకుంటూ రేడియో నాటకానికే తన శక్తినంతా వినియోగించి అంకితభావం కలిగిన నటుడు, నాటక ప్రయోక్త ఆయన. రాజరాజు, శ్రీకృష్ణ భీష్మ, వరవిక్రయం, గణపతి, మూడంతస్తుల మేడ, ఆఖరి ప్రేమలేఖ, కల్యాణి, సుశీల వంటి నాటకాలెన్నో ఆయన కీర్తిని ఇనుమడింపజేశాయి. విక్రాంత గిరి శిఖరం, అమరారామం, కొండ నుంచి కడలి దాకా లాంటి జాతీయ అంతర్జాతీయ బహుమతులు పొందిన రూపకాలకు సృష్టికర్త. ‘వరుడు కావాలి’ ‘బ్రహ్మా! నీ రాత తారుమారు’ లాంటి హాస్య నాటకాలు ప్రేక్షకులను ఆనందింపజేశాయి. అసలు రేడియో నాటకానికో ప్రత్యేకతనూ, విలక్షణతనూ తెచ్చిన వ్యక్తి రామ్మోహనరావు.
నాటకం కోసం మూడున్నర దశాబ్దాలు అహరహం తపించిన వ్యక్తి. రేడియో నాటకానికి, ఒక దిశ, దశ నిర్దేశిస్తూ, నాటకానికే గౌరవం తెచ్చిన వ్యక్తి. సుత్తి వీరభద్రరావు ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా, రామ్మోహన్‌తోనే ఉండేవాడు. వీరభద్రరావు నటించిన ఎన్నో నాటకాల వెనుక రామ్మోహన్ పాత్ర ఉంది. సినీ నటులు మురళీమోహన్, అన్నపూర్ణ, జంధ్యాల, కోట శంకర్రావు, పొన్నాల రామసుబ్బారెడ్డి వీరి శిష్యులే.
రేడియోలో రామ్మోహనరావుతో నేను, ఎన్నో చిరు నాటికలలో నటించాను. మేమిద్దరం చేసిన ‘బావగారి కబుర్లు’ శ్రోతలు ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవారు.
సాధారణంగా ప్రముఖులైన నటీనటులో, రాజకీయ ప్రముఖులో స్టూడియోకు వస్తే అధికార గణం ఆఘమేఘాల మీద ఇంటర్వ్యూ చేయాలని తెగ ఉబలాటపడేవారు. అవతలి వారి సమర్థత, తెలియక, అమాయకంగా ప్రశ్నలేస్తూ, విసిగించిన సందర్భాలు అనేకం. గంటసేపు పైగా, హాయిగా మాట్లాడగలిగే వారికి, ప్రశ్నావళి విసుగు తెప్పించి, సదరు ప్రముఖులు 5 నిమిషాల్లో చల్లగా జారుకునే ప్రయత్నం చేయటం నాకు తెలుసు.
మీడియా, టీవీ ఛానెళ్లు ఇంత ప్రచారం లేని ఆ రోజుల్లో, కేవలం శబ్ద మాధ్యమం ద్వారా సినిమా నటులకున్న క్రేజ్‌ను సొంతం చేసుకున్న నండూరి సుబ్బారావు రామ్మోహనరావుకు సహచరుడు. విజయవాడ ఆకాశవాణికి ఆయనో లైట్‌హౌస్. నండూరి సుబ్బారావు లేనిదే ఆకాశవాణి లేదనుకునేవారు. 50, 60 ఏళ్ల పైబడ్డ ప్రతి శ్రోత గుండెల్లో ఆయన జ్ఞాపకాలు నేటికీ పదిలంగానే ఉన్నాయి.
రేడియో హాస్యబ్రహ్మగా, చిలకమర్తి వారి ‘గణపతి’ నాటకంలో ప్రధాన పాత్రధారిగా శ్రోతలకు చిరపరిచితుడు. ఆ పాత్ర కోసమే పుట్టాడనిపించాడు. ఆ రోజుల్లో సి.రామ్మోహనరావు నండూరి సుబ్బారావు జంట నిజంగా రేడియో శ్రోతల పంట.
నండూరి నటించిన ‘గణపతి’ చిలకమర్తి వారి నాటకాన్ని బందా నిర్వహించారు. ఆ నాటకం విజయవాడ కేంద్రం నుండి ఎన్నిసార్లు ప్రసారమైనా అన్నిసార్లూ అప్పుడే విన్న అనుభూతి కలిగిస్తుంది. సహజంగా వాక్చాతుర్యం ఉండేది. ‘సక్కుబాయి’లో శ్రీరంగం గోపాలరత్నానికి భర్తగా నటించిన సుబ్బారావు నటనకు జోహార్లు అర్పించారు శ్రోతలు.
మూడంతస్తుల మేడ, చివరకు మిగిలేది, రాధాకృష్ణ, సౌందర నందం, తలుపులు, కల్యాణి, పూటకూళ్లు, ఇంటి నెంబరు, తస్మాత్ జాగ్రత్త లాంటి నాటకాలు విన్నప్పుడల్లా పొట్టచెక్కలయ్యేలా శ్రోతలు నవ్వుకునేవారు. వెలికితనం ఎక్కడా కనిపించేది కాదు. రామయ్య కాపురం, సీతారాముడి సన్యాసం, ఎలుకల బోను, చీరల బేరం, అది అంతే, అపరాజిత, నాటికి నేడు, ప్రేమ యాత్ర నాటికలు సుబ్బారావును కీర్తి శిఖరాలపై కూర్చోబెట్టాయి. ఎన్నో హాస్య పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన సుబ్బారావు సరస సంభాషణ చతురులు. ఆయన నాటక నిర్వహణలో ఎందరో కళాకారులను ప్రోత్సహిస్తూ, ముందుకు నడిపించిన నిగర్వి. ఆయనతో కలిసి కొనే్నళ్లు బావగారి కబుర్లు చేశాను. అదో తీయని జ్ఞాపకం నాకు.
తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్కో మాటతో, లేని సంబంధాన్ని పెంచుకోవచ్చు. మనసుకు స్వాంతన కలిగించేది మాట. ‘మాట చేత దేవతలు మన్నన చేసి వరము లిత్తురు’ అన్నట్లు, మధురంగా ఉండే మాటకు ఎవరు వశులవ్వరు?
‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న సత్య మప్రియం బ్రూయాత్’ చెప్పే పద్ధతిలో చెబితే మనకు తెలియకుండానే చెవి అటువైపు వెళుతుంది. రేడియో ఆవిర్భావమే అందుకు!
సంగీత, నాటక, సాహిత్య, త్రివేణీ సంగమంలా ఆకాశవాణి శ్రోతల అభిమానాన్ని పొందినవారు ఒకరా, ఇద్దరా?
రేడియో కోసమే పుట్టి రేడియోకే తమ జీవితాలను అర్పణ చేసిన వారిలో చరితార్థులైన వారెందరో ఉన్నారు. నిజానికి వారెప్పుడో చేసి ఉంచిన కళాఖండాలే ఈ వేళ రేడియో ప్రతిష్టను నిలబెట్టి ఉంచుతున్నాయనటంలో సందేహం లేదు. నేను రేడియోలో చేరకముందే కొందరు రేడియోకి కొన్ని ప్రమాణాలను నిర్దేశించి, చక్కని దిశను దశనూ ఏర్పరచి వెళ్లారు. ఆ మహామహుల అనన్య కృషి వల్ల రేడియోకు ఒక స్థిరత్వం ఏర్పడింది.
ఇప్పుడు మొత్తం సమాజం ఒక మార్పుల కూడలిలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని ఉంది. ఎనె్నన్నో టి.వి. ఛానెళ్లు బయలుదేరాయి. కాదు వెర్రివెర్రిగా
పెరిగిపోయాయి. ఎనె్నన్నో సాంకేతిక సదుపాయాలు అనూహ్యంగా ఏర్పడిపోయాయి. వ్యవస్థ మీద నియంత్రణ లేదు. ఎవరి చిత్తం వచ్చినట్లు వారు ఏవేవో కార్యక్రమాలను ప్రజల నెత్తి మీద రుద్ది, పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ డబ్బు గడిస్తున్నారు. అన్నిటినీ చోద్యంగా నివ్వెరబోతూ బిక్కుబిక్కుమంటూ చూస్తోంది రేడియో. మన భాషకు తెలుగు వ్యవహారిక వ్యాప్తికి ఆకాశవాణి చేసిన సేవ అనన్యం. దానికి కారణం అనౌన్సర్లు, వార్తలు చదివే న్యూస్‌రీడర్లు మాత్రమే కాదు. రూపకల్పన చేసిన, తెర వెనుకనున్న మేధావులు. వాళ్లని మర్చిపోతే ఎలా?
ఈవేళ రేడియో షాపుల కంటే టీవీ షోరూములు పెరిగిపోయి, క్యాసెట్లు, సీడీల స్థానంలో పెన్‌డ్రైవ్‌లు విస్తారంగా వచ్చాయి. వినిపించేవన్నీ బాహాటంగా కనిపిస్తోంటే ఇంక రేడియో అవసరమేముంది? కానీ ఒకటి నిజం. రేడియో తప్ప మరే ఇతర కాలక్షేప సాధనాలేమీ లేని రోజుల్లో, నిజాయితీగా, కొందరు ఈ మాధ్యమం యొక్క అభివృద్ధికి కారణభూతులై, అంకితభావంతో రేడియో సేవలో తరిస్తూ, రేడియో రుణం తీర్చుకున్నారు.
లబ్ధప్రతిష్టులైన వారెప్పుడూ చిరస్మరణీయులే. ఆకాశవాణి కీర్తిని ఉత్తుంగ శిఖరాలపై నిలబెట్టినది వారే. ఆ కళాకారులు చేసిన కార్యక్రమాలే ఇంకా సజీవంగా ఉండి రేడియోని బ్రతికిస్తున్నాయనేది అక్షర సత్యం. అదంతా ఓ గతం. మీకు తెలుసా? ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అన్న ఆయన కలం ప్రపంచానికి ప్రసిద్ధం. కుక్కపిల్ల, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల దగ్గర నుంచి జగన్నాథ రథ చక్రాలవరకూ ఏది వర్ణించినా జనం ఊగిపోయారు. సినీ పాటల రచయితగా, సంభాషణల రచయితగా, డబ్బింగ్ చిత్రాల అద్భుత అనువాదకుడుగా కూడా ఆయన ప్రేక్షకులకు పరిచయమే. ఆయనే శ్రీశ్రీగా తెలిసిన శ్రీరంగం శ్రీనివాసరావు. ఒకప్పుడు ఆయన ఆకాశవాణిలో వార్తలు చదివే వారన్న సంగతి కొందరికే తెలుసు.
తెలుగు చలనచిత్ర రంగంలో విలక్షణ స్థానాన్ని సంపాదించుకున్న ‘కళావాచస్పతి’ కొంగర జగ్గయ్య కూడా ఒకప్పుడు ఖంగుమనే కంఠంతో వార్తలు చదివిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు.
స్పష్టమైన భావస్ఫోరకమైన వారి వాచికాభినయం, అభినయ కౌశలం, వారి మూర్తిమత్వం తెలుగు వారికి పరిచితమైనదే. పార్లమెంటేరియన్‌గా ఎదిగిన జగ్గయ్య ఆకాశవాణి కళాకారుడని చెప్పడం మాకెంతో గర్వకారణం.
విమర్శలకు తావివ్వకుండా, ఔచిత్యాన్ని పాటిస్తూ, జనాన్ని జాగృతం చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన ‘ఆకాశవాణి’ స్వర్ణయుగపు రోజులు వెళ్లిపోయాయి. ప్రసార భారతిగా మారింది. ఏదేదో చేసెయ్యాలనే ఆలోచనలైతే లేకపోలేదు కానీ ఎలా? ఆచరణ సాధ్యం కాని వాటివల్ల ఏం ప్రయోజనం? ఈ సంస్థలన్నీ మళ్లీ పుంజుకోవాలంటే ఎవరో మేధావులే రావాలి. గత్యంతరం లేదు.

ఈ రేడియో కళాకారులవి గొర్రె తోక జీతాలు. ఎదుగూ బొదుగూ లేదు. ప్రమోషన్లు లేవు. ఎక్కడ చేరారో అక్కడే రిటైర్ అయ్యేవాళ్ళు. అయినా మనసుపెట్టి పనిచేసేవారు. వారికిది వృత్తి కాదు. ప్రవృత్తి. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారిలో ప్రముఖ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు, కవులూ, రచయితలూ వుండేవారు. స్టేషన్ డైరెక్టర్లు కూడా వీరికి ఎంతో మర్యాద ఇచ్చేవారు. నేను చేరకముందు – శ్రీయుతులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్తానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు, గోపీచంద్, బుచ్చిబాబు, నాయని సుబ్బారావు,  న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య), బాలాంత్రపు రజనీకాంతరావు, గొల్లపూడి మారుతీరావు, రావూరి భరద్వాజ, శంకరమంచి సత్యం, నండూరి విఠల్ వంటి దిగ్గజాలు హైదరాబాద్ రేడియో కేంద్రంలో పనిచేశారు. వీరుకాక, భాస్కరభట్ల కృష్ణారావు, శారదా శ్రీనివాసన్, తిరుమలశెట్టి శ్రీరాములు, వింజమూరి సీతాదేవి, మాడపాటి సత్యవతి, జ్యోత్స్నా ఇలియాస్, ఇందిరా బెనర్జీ ఒకరా ఇద్దరా ఇందరు తమ స్వరాలతో హైదరాబాద్ రేడియో కేంద్రానికి  అజరామర కీర్తిని సముపార్జించి పెట్టారు. నాకు తెలిసి వీళ్ళల్లో ఎవ్వరూ కూడా నెలకు అయిదారువందలకు మించి జీతాలు తీసుకున్నవారులేరు.

సంక్షిప్త శబ్ద చిత్రంసాయంత్రం నాటికలునాటకాలు ప్రసారం చేసేవారు.. వి.బి.కనకదుర్గనండూరి సుబ్బారావుఎ.వి.యస్. రామారావుపాండురంగ విఠల్ వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు… మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.

 వీరితో నా పరిచయం

 నేను పామర్రు హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు అక్కడి విద్యార్ధులతో ఒక ప్రోగ్రాం చేయటానికి బెజవాడ రేడియో స్టేషన్ నుంచి నండూరి సుబ్బారావు నాయకత్వం లో వచ్చారు అప్పుడే పరిచయం .మాటల సందర్భం లో ‘’మా తెలుగు తల్లికి ‘’పాట ఎవరు రాశారు అని వస్తే నేను ‘’సుందరంబాడి శంకరాచార్యులు ‘’అన్నాను ఆయన ఔననలేక కాదనలేక ‘’కాదేమో నండీ శంకరంబాడి సుందరాచార్యులు ‘’అనుకొంటా అన్నారు నాతప్పు నాకు తెలిసింది .అసందర్భంగానే శబరీమల ‘’మకర జ్యోతి ‘’విషయం కూడా ఆయన చాలా ఉత్సాహంగా భక్తీ భావ భరితంగా చెప్పారు.అదే మొదటి సారి నేను శబరీ మల గురించి వినటం .

  ఆతర్వాత నేను ఉయ్యూరు హైస్కూల్ లో పని చేస్తున్నప్పుడు మిత్రుడు టిఎల్ కాంతారావు మేమూ బెజవాడ రేడియో స్టేషన్ బృందం నండూరి ,పాండురంగ ,సుమన్ ,ఆనంద్ లను ఒక సాయంత్రం మా వంగల దత్తు గారింటికి ఆహ్వానించి వారితో రెండు గంటలు హాయిగా కబుర్లతో కాలక్షేపం చేశాం .వేమన త్రిశతి జయంతి జరిపి డా జివి .కృష్ణారావు గారిని ఆహ్వానించి సన్మానిన్చాం  ఆసభకు ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్న ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు అధ్యక్షులు .ప్రముఖ కవి విమర్శకుడు అద్దేపల్లి రామమోహనరావు గారు వక్త .ఆరోజు రాత్రి అంతా అద్దేపల్లి శర్మగార్లతో సాహిత్య కాలక్షేపం చేశాం జీవితం లో మరుపురాని మధురానుభూతి పొందాం .బెజవాడ రేడియో వారు నిర్వహించే ఉగాది కవి సమ్మేళనానికి మా బృందం వెళ్లి ,ఆస్వాదించి ,పై బృందాన్నికలిసి మాట్లాడి వచ్చేవాళ్ళం .

  నండూరి హాస్యం జన్మలో మర్చి పోలేనిది రామమోహనరావు వాచికం అద్భుతం తేనెలు కురిసి నట్లు ఉండేది వీరిద్దరూ ఉన్న నాటిక నాటకం అదరహో .కానీ రామమోహనరావు కొంచెం రిజర్వ్ గా ఉండేవారని పించింది .ఒకసారి మా ఉయ్యూరు విష్ణ్వాలయం  అర్చకులు ,గాయత్రీ గురుకులం నిర్వాహకులు శ్రీ వేదాంతం శ్రీరామాచార్యులు గారు పిల్లలకు నాట్య సంగీత ప్రదర్శనలలో పోటీనిర్వహించి సి .రామమోహన రావు గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు .తెల్ల పంచె లాల్చీ ఉత్తరీయం తో ఆయనవచ్చి కంచు కంఠం తో నవరస స్పోరకంగా అద్భుత ప్రసంగం చేశారు .నేను దగ్గరకు వెళ్లి కరచాలనం చేసి అభినందించాను .ఆయన ప్రసంగం లో ‘’చిన్న పిల్లలకు అందులో ఆడపిల్లలకు శృంగార కీర్తనలు నెర్పిన్చిఅభినయిమ్ప జేయటం మంచిదికాదు అవి వారిపై చెడు ప్రభావం కలిగిస్తాయి ‘’అని చెప్పటం నాకు ఇంకా గుర్తు .

  వెంపటి రాధాకృష్ణ గారు మా ఉయ్యూరు దగ్గర కనకవల్లి వారే .మా దత్తు గారిద్వారా పరిచయం .ఆపరిచయంతో ఆయన రాసిన ప్రసిద్ధ నాటకం ‘’కన్యకాపరమేశ్వరి ‘’మాకు చదివి వినిపిస్తాను అంటే ,రోజూ సాయంత్రం 6గం నుంచి 7వరకు మా వాకిటి సావడిలో చాపల మీద కూర్చుని ఆయన అర్ధభావ స్పోరకంగా చదువుతూ ఉంటె ,చెవులప్పగించి మధురానుభూతి పొందాం నాతోపాటు దత్తుగారు కాంతారావు ఆంజనేయ శాస్త్రి ,హిందీ రామారావు గార్లు శ్రోతలు అందరికి టిఫిన్ ,కాఫీ మా శ్రీమతి తయారు చేసి అందించేది .అదో సాహితీ లోకం గా గడిపాం వారం రోజులు .ఆనాటకం ఆంద్ర దేశమంతా దిగ్విజయంగా ప్రదర్శించారు వెంపటి రాదా కృష్ణ .ఆయనతో పాటు నటించిన వారిలో కనకవల్లి వాస్తవ్యుడు ,ఉయ్యూరు హైస్కూల్ లో నా క్లాస్ మేట్ శిష్ట్లా సాక్షి కామేశ్వర సోమయాజులు కూడా ఉన్నాడు. యితడు బెజవాడ రేడియో నాటకాలలోనూ నటించాడు .

  ఈ ముగ్గురు సినిమాలలో నటించారు .ఎవరికైనా పేర్లు గుర్తుంటే తెలియజేయండి .వీరిని జంధ్యాల పరిచయం చేశాడని నాకు గుర్తు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-182

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-182

·         182-నటి ,రచయిత్రి డబ్బింగ్ ,నృత్య కళాకారిణి,కిక్కుపాటల గాయని  –రమోలా

·         రమోలా 1970వ దశకంలో ఒక వెలుగు వెలిగిన సినీ నేపథ్యగాయని. ఈమె గాయని మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్టు, రంగస్థల నటి, శాస్త్రీయ నృత్యకారిణి కూడా.

అసలుపేరు రామం .  విజయనగరంలో 1946సెప్టెంబరు 24వ తేదీన జన్మించింది[1]. ప్రముఖ నటి వైజయంతిమాల ఈమె పేరును ‘రమోలా’గా మార్చింది. ఈమె తండ్రిపేరు ఉపద్రష్ట సూర్యనారాయణ, తల్లి పేరు సీతారామమ్మ. ఈమె పది మంది సంతానంలో తొమ్మిదవ సంతానం. మహాకవి శ్రీశ్రీ భార్య సరోజ ఈమెకు ఒక అక్క కాగా హాస్యనటుడు రాజబాబు భార్య లక్ష్మీ అమ్ములు ఈమె చెల్లెలు. ఈమె 8వ తరగతి వరకు విజయనగరంలో చదువుకుని పిమ్మట మద్రాసుకు చేరుకుంది. మద్రాసు ఆంధ్రమహిళా సభలో మెట్రిక్ చేసింది. ఈమె చిన్నతనంలోనే అన్ని కార్యక్రమాలలో పాల్గొనేది. రేడియో అన్నయ్యరేడియో అక్కయ్య ఈమెను ప్రోత్సహించారు. మొదట సినిమాలలో కోరస్‌లు పాడటంతో మొదలైన ఈమె సినీ ప్రస్థానం తెలుగుతమిళకన్నడమలయాళహిందీ భాషలలో 3000కు పైగా పాటలు, 75 చిత్రాలలో పాత్రధారణ, మరెన్నో చిత్రాలలో గాత్రధారణలతో ముగిసింది.

ఈమె ఎందరో హీరోయిన్‌లకు, క్యారెక్టర్ యాక్టర్లకు డబ్బింగ్ చెప్పింది. మరపురాని మనిషిజీవనజ్యోతికృష్ణవేణినాయుడుబావనామాల తాతయ్యజాతకరత్న మిడతంభొట్లు మొదలైన సినిమాలలో నటించింది. రంగస్థలంపై కుమ్మరిమొల్ల, సప్తపది మొదలైన నాటకాలలో జె.వి.సోమయాజులుపొట్టి ప్రసాద్జె.వి.రమణమూర్తి మొదలైన వారి సరసన నటించి గొప్ప పేరు సంపాదించుకుంది.

భరతనాట్యంలో శిక్షణ పొంది వైజయంతిమాల డాన్స్ ట్రూపులో చేరి రాధాకృష్ణ, చండాలిక మొదలైన నృత్యరూపకాలలో నాట్యం చేసి, ఢిల్లీఅహ్మదాబాద్కలకత్తామాంచెస్టర్ వంటి చోట్ల వందలాది ప్రదర్శనలిచ్చింది.

ఈమె గాయని, డబ్బింగ్ కళాకారిణి, నృత్య కళాకారిణి, నటి మాత్రమే కాక రచయిత్రి కూడా. ఈమె సుమారు 35 పాటలను రచించింది.

తెలుగు సినిమా పాటల జాబితా

ఈమె గానం చేసిన వందలాది తెలుగు పాటలలో కొన్ని ఈ క్రింది జాబితాలో:

క్రమ సంఖ్యసినిమా పేరుపాట పల్లవిసహ గాయకుడు/ గాయనిసంగీత దర్శకుడుగేయ రచయితసినిమా విడుదలైన సంవత్సరం
1రత్నగిరి రహస్యంనాటు రాజా అయ్యా నాటురా కొంచెం నాగరీకంకె.రాణిఎం.ఎస్.రాజు,
టి.జి.లింగప్ప
శ్రీశ్రీ1957
2రత్నగిరి రహస్యంయవ్వనమే ఈ యవ్వనమే అద్భుతరాగం అంది ఫలించుకె.రాణిఎం.ఎస్.రాజు,
టి.జి.లింగప్ప
శ్రీశ్రీ1957
3చిలకా గోరింకఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను బరువెక్కెనుజయదేవ్ఎస్.రాజేశ్వరరావుశ్రీశ్రీ1966
4సంబరాల రాంబాబువిన్నారా విన్నారా.. ఈ చిత్రం కన్నారా… సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడువి.కుమార్రాజశ్రీ1970
5శ్రీదేవిగుండుమల్లె చెండుచూసి గుండెలోనే పొంగుజి.కె.వెంకటేష్జి.కె.వెంకటేష్శ్రీశ్రీ1970
6కొరడారాణికనులలోన కతలు దాచి నడకలోన కులుకు దాచిఎస్.పి.బాలుసత్యంరాజశ్రీ1972
7దత్తపుత్రుడుమనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావాఘంటసాలటి.చలపతిరావుసి.నా.రె.1972
8నిజం నిరూపిస్తాబంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగఎస్.పి.బాలుసత్యంఆరుద్ర1972
9కలవారి కుటుంబంచిలిపి చూపుల దాన చిక్కవే జాణా అవునన్నాకాదన్నాఎస్.పి.బాలుసత్యంకొసరాజు1972
10ధనమా?దైవమా?కుడి ఎడమైతే పొరబాటు (పేరడి పాట)పట్టాభి,
విల్స్‌న్,
జ్యోతిఖన్నా,
విజయలక్ష్మి కన్నారావు,
కౌసల్య
టి.వి.రాజుసి.నా.రె1973
11వాడే వీడుచీరలేని చిన్నదానా ఓయబ్బా చిగురాకు వన్నెఘంటసాలసత్యంసి.నా.రె1973
12మల్లమ్మ కథముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే ఈ మురిపాలపి.సుశీల,కౌసల్యఎస్.పి.కోదండపాణిసి.నా.రె.1973
13బంట్రోతు భార్యఆనింగి ఈనేలఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలు,
రఘురాం
రమేష్ నాయుడుదాశరథి1974
14బంట్రోతు భార్యపిడికెడుఎస్.పి.బాలు,
పి.సుశీల,
ఎల్.ఆర్.అంజలి,
చంద్రశేఖర్,
రఘురాం
రమేష్ నాయుడుదాశరథి1974
15ఈ కాలపు పిల్లలుయేమన్నాడే అతడు అవునన్నాడా యేం చేశాడేపి. సుశీలసత్యందాశరథి1975
16జీవన జ్యోతిఎందుకంటె ఏం చెప్పను ఏమిటంటే ఎలా చెప్పనుఎస్.పి. బాలుకె.వి.మహదేవన్సి.నా.రె.1975
17రక్త సంబంధాలుఅరే మాకీ మీకీ మంచి జోడా కలవాలా మత్తులోనఎస్.పి.బాలుసత్యంఆరుద్ర1975
18పాడవోయి భారతీయుడాపాపయికి నడకొచ్చింది పకపకా నవ్వొచ్చిందిఎస్.పి.బాలుకె.వి.మహదేవన్దాశరథి కృష్ణమాచార్య1976
19ముద్దబంతి పువ్వుముద్దబంతి పువ్వు ఉహూ ఉహూ ముగిసిందా నవ్వుఎస్.పి.బాలురమేష్ నాయుడుసి.నా.రె1976
20సీతాకల్యాణంసీతమ్మకు సింగారం చేతాముపి. సుశీల,
బి.వసంత,
ఉడుతా సరోజిని
కె.వి.మహదేవన్ఆరుద్ర1976
21అమరదీపంఅంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయిరామకృష్ణసత్యంఆరుద్ర1977
22తొలిరేయి గడిచిందిగుడ్ అంటే మంచిది బ్యాడ్ అంటే చెడ్డది గుడ్ అండ్ బ్యాడ్పి. సుశీలసత్యంఆచార్య ఆత్రేయ1977
23పంచాయితిగాలి అందరిదైతే నేల కొందరిదేనాఎస్.పి.బాలు,పి. సుశీలకె.వి.మహదేవన్సి.నా.రె.1977
24మరో చరిత్రకలసి వుంటే కలదు సుఖం కలసివచ్చిన అదృష్టముఎస్.పి.బాలుఎం.ఎస్.విశ్వనాథన్ఆచార్య ఆత్రేయ1978
25ఖైదీ నెం: 77నేనే ఓ మాధవీ ఆహా నా మాధవీ అది ఏది కాదుఎస్.పి. బాలుసత్యంసి.నా.రె.1978
26ఇది కథ కాదుఇటు అటు కాని, హృదయం తోని – ఎందుకురా ఈ తొందర నీకుఎస్.పి.బాలుఎం.ఎస్.విశ్వనాథన్ఆచార్య ఆత్రేయ1979
27ఇది కథ కాదుఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందంఎస్.పి.బాలుఎం.ఎస్.విశ్వనాథన్ఆచార్య ఆత్రేయ1979
28కుక్క కాటుకు చెప్పు దెబ్బహే బేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలిఎస్.పి.బాలుఎం.ఎస్.విశ్వనాథన్ఆచార్య ఆత్రేయ1979
29కలియుగ మహాభారతంబురు బురు పిట్టా బురు పిట్టఎస్.పి.బాలు,
ఎం.రమేష్,
ఎల్.ఆర్.అంజలి
సత్యంవేటూరి1979
30విజయహే పెద్దలు రాక రాక వచ్చారు రాత్రిఎల్.ఆర్. ఈశ్వరి,
రాజబాబు
చక్రవర్తిజంధ్యాల1979
31శ్రీ వినాయక విజయండూ డూ డూ బసవన్నాభళిరా అందెల బసవన్నారామకృష్ణఎస్.రాజేశ్వరరావుకొసరాజు1979
32ధర్మ యుద్ధండిస్కో సౌండ్ ( ఇంగ్లీష్ పాట )హరిరాంఇళయరాజారాజశ్రీ1979
33అగ్ని సంస్కారంకొండమీద కాపురముండు వాడా వరము కోరుకుంటిశ్రీనివాస్ఎం. జనార్ధన్1980
34పగడాల పడవవల్లారి బాబోయి వల్లరి మావాయ్ ఏ ఊరన్నవిల్సన్ఘంటసాల విజయ కుమార్దాశరథి1980
35పొదరిల్లుఅల్లాడిపోతావే చూడు మల్లా కిల్ల్లడి ఓ కన్నె లేడిపిల్లాఎస్.పి.బాలుజె.వి.రాఘవులు1980
36గురుశిష్యులుతగ్గు తగ్గు తగ్గు తల తిక్క ఒగ్గు ఏమిటా టెక్కుఎస్.పి. బాలుకె.వి. మహదేవన్ఆచార్య ఆత్రేయ1981
37ఇంద్రుడు చంద్రుడువయసు బెత్తెడు నూరేళ్ళది నులి వేడిది ఇపుడున్నదిఎం.రమేష్ఎస్.రాజేశ్వరరావుజాలాది1981
38నెలవంకఎంత చెప్పిన వినవేమిరాజిత్‌మోహన్ మిత్ర,
ప్రకాశరావు
రమేష్ నాయుడుఇంద్రగంటి శ్రీకాంతశర్మ1983
39అమాయకుడు కాదు అసాధ్యుడుఏమిటో ననుకుంటి ఇదా అరె విన్నానులే అసలు కథఎస్.పి.బాలుసత్యంకొసరాజు1983
40ఆడవాళ్లే అలిగితేభయమెందుకే నీకు భార్యామణి పాకాలు శాకాలుఎస్.పి.బాలుకృష్ణ – చక్రిడా.నెల్లుట్ల1983
41అనసూయమ్మ గారి అల్లుడుఅత్తా అనసూయమ్మా నీతో సరసోయమ్మా మేనత్త రాకతోఎస్.పి.బాలుచక్రవర్తివేటూరి1986
42అత్త మెచ్చిన అల్లుడుఘల్లు ఘల్లున కాలి గజ్జలు మ్రోగంగ కాళీయఫణిఎస్.పి.బాలుకె.వి.మహదేవన్సి.నా.రె.1989
43అబ్బాయిగారుతడికెందుకు అదిరిందిఎస్.పి.బాలు, చిత్ర, రమణఎం.ఎం.కీరవాణిభువనచంద్ర1993

·          సశేషం

·         మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-181 · 181-తెల్లగుబురు మీసాలమధ్య హాస్యపు రత్నాలు వెదజల్లిన లాయర్ రేడియో ఆర్టిస్ట్ ,హాస్యరచయిత ,రేడియో ఆర్టిస్ట్ ఆనందభైరవి హై,హైనాయకా’’ సినీ ఫేం ‘’అల్లుడూ ఆమె ఎవరో మహాబాగుందయ్యా ‘’డైలాగ్ ఫేం –పుచ్చా పూర్ణానందం

   మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-181

·         181-తెల్లగుబురు మీసాలమధ్య హాస్యపు రత్నాలు వెదజల్లిన లాయర్ రేడియో ఆర్టిస్ట్ ,హాస్యరచయిత ,రేడియో ఆర్టిస్ట్ ఆనందభైరవి హై,హైనాయకా’’ సినీ ఫేం ‘’అల్లుడూ ఆమె ఎవరో మహాబాగుందయ్యా ‘’డైలాగ్ ఫేం –పుచ్చా పూర్ణానందం

·         పుచ్చా పూర్ణానందం సుప్రసిద్ధ తెలుగు హాస్యరచయిత, నటుడు

జీవిత విశేషాలు

ఇతడు గుంటూరు జిల్లాపెద్ద కొండూరు గ్రామంలో 1910ఆగష్టు 10వ తేదీన జన్మించాడు[1]. ఇతడు దుగ్గిరాలలో ఎస్.ఎస్.ఎల్.సి వరకూ చదివి, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఏ., బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మదన్ మోహన్ మాలవ్యా వైస్ ఛాన్సలర్‍గా వుండగా ఎమ్.ఎ., ఎల్.ఎల్.బి., చదివాడు. ఇతడు ఆంధ్ర మహాసభ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇతనికి టంగుటూరి ప్రకాశంతో పరిచయం, స్నేహం ఏర్పడింది. వీర సావర్కర్ అంటే గౌరవాభిమానావల్ల గాంధేయవాద సిద్ధాంతాలకు కొంత దూరంగా నడిచాడు. రాజమండ్రిలోనే భమిడిపాటి కామేశ్వరరావుతో పరిచయం కలిగి, ఆయన రచించిన నాటకాల్లో వేషాలు వేశాడు. ఇతని కోసమే భమిడిపాటి కొన్ని పాత్రలు సృష్టించాడు కూడాను[1].

నాటక రంగం

ఇతడు పద్య నాటకాలు ఎక్కువ వేయలేదుగానీ ద్రౌపదీ వస్త్రాపహరణంలో భీష్ముడిగా వేశాడు. అనార్కలి నాటకంలో సలీం, వాపస్, ఆడది, పుట్ట, సంభవామి యుగేయుగే, టీకప్పులో తుఫాను, దంతవేదాంతం వంటి రంగస్థల నాటకాల్లో వేశారు. ప్రాచుర్యం పొందిన చిలకమర్తి రేడియో నాటకం “గణపతి”లో ఉపాధ్యాయునిగా, ఇంకా కంఠాభరణం, వయోలిన్ మాస్టారు, ఇంటినెంబరు, మృచ్ఛకటికం వంటి రేడియో నాటకాల్లో నటించాడు. బందా కనకలింగేశ్వరరావుకాశ్యపవిన్నకోట రామన్న పంతులుబళ్లారి రాఘవస్థానం నరసింహారావు వంటి వారితో పరమ ఆప్తుడిగా, ఆత్మీయుడిగా మసిలాడు[1].

సినిమా రంగం

1942లో సినిమారంగం హీరోగా ఇతనికి అవకాశం వచ్చినా కాదని తన లాయరు వృత్తిని వదలలేదు. కానీ జంధ్యాల పట్టుబట్టగా ఆనందభైరవిరెండు రెళ్ళు ఆరుశ్రీవారి శోభనంమదన గోపాలుడుహై హై నాయకా మొదలైన చిత్రాలలో నటించాడు[1].

ఇతడు మొదట తెనాలిలో ప్లీడర్‍గా ఖ్యాతిపొంది, త్రిపురనేని రామస్వామి చౌదరికి సన్నిహితుడిగా, త్రిపురనేని గోపిచంద్ సహధ్యాయిగా ఉన్నాడు. 1944లో విజయవాడకు వచ్చి లాయర్‌గా ప్రాక్టీసు కొనసాగించాడు. ఇతడు మరణించే వరకూ కూడా హాస్య రచయితగా, నటునిగా, ప్రసిద్ధ లాయరుగా రాణించాడు[1].

రచనలు

·         కవి నియంత (1951)

·         ఆవకాయ – అమరత్వం (1966)

·         ఆషాఢ పట్టీ (1971)

·         మీసాల సొగసులు (1984)

·         అచ్చమైన తెలుగు దానానికి స్వచ్చమైన తెలుగు హాస్యానికీ పుట్టిన ,పెట్టిన పేరు పుచ్చా పూర్ణానందం గారు .ఆ వాచకం అనితర సాధ్యం .ప్రతి పదం లో హాస్యం చిప్పిలాల్సిందే .అదీ ఆయన రచనా వైభోగం .పుచ్చ పువ్వు లాంటి ,పండు వెన్నెలలాంటి హాస్యం ఆయనది .ఉదారుడు స్నేహశీలి ,కలుపుగోలుతనమున్నవారు .

·           పుచ్చావారబ్బాయి లెక్కల మాస్టారు .పేరు గుర్తు లేదు .బెజవాడ మునిసిపల్ స్కూల్ లో టీచర్ .బందరులో ఉండే మా కుటుంబమిత్రులు ప్రముఖ కధా రచయితా ,విమర్శులు లెక్కల మేష్టారు భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు నాకు మరింత ఆత్మీయులు స్వర్గీయ ఆర్ ఎస్ కే మూర్తి గారు పుచ్చావారబ్బాయికి తోడల్లుడు .టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ లో కలుస్తూ ఉండేవారు .ఈయనా గొప్ప హాస్యం ఒలికిం చేవారు. ఒకసారి మాటలలో పూర్ణానందం గారు తమ తండ్రి అనిచేబితే ,,బెజవాడ విద్యాధర పురం లో ఉన్న వారి ఇంటికి వెళ్లాను అప్పుడు పూర్ణానందం గారిని మొదటి సారి చూశాను చక్కగా మాట్లాడారు .హాయిగా నవ్వించారు .గొప్ప అనుభవం అనిపించింది .

·           సశేషం

·         మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-179

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-179
179-సురభి నాటకాల రచయిత,,పరమానందయ్య శిష్యులు ,పంతులమ్మ సంభాషణా రచయిత ఆంద్ర నాటక కళాపరిషత్  వ్యవస్థాపక సభ్యులు ,కవిరాజు -విశ్వనాథ కవిరాజు
విశ్వనాధ కవిరాజు అసలుపేరు మల్లాది విశ్వనాథ శర్మ (1900 – 1947) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, రచయిత.
. జీవిత విశేషాలు
వీరు విశాఖపట్నం జిల్లా, బొబ్బిలి తాలూకా శ్రీకాకుళ గ్రామానికి చెందినవారు. పర్లాకిమిడి రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత కొంతకాలం దక్షిణాముర్తి శాస్త్రి గారి వద్ద ప్రత్యేకంగా సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. 1921 నుండి జీవితాంతం వరకు విజయనగరంలోని మహారాజా కళాశాల లో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. కంచి కామకోటి పీఠాధిపతి వీరి కవితా ప్రావీణ్యానికి మెచ్చి “కవిరాజు” గౌరవం ఇచ్చారు. అప్పటి నుండి వీరు విశ్వనాథ కవిరాజు గా ప్రసిద్ధులయ్యారు. వీరు కొన్ని చలనచిత్రాలకు కథలు, మాటలు, పాటలు రాశారు. పరమానందయ్య శిష్యులు, పంతులమ్మ (1943) అనే సినిమాలకు స్క్రిప్టులు రాశారు.
నాటకరంగం

ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులు, 1929
విశ్వనాథ కవిరాజు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాటక సంస్థ సురభి నాటక కళాసమితికి నాటకాలు రచించేవారు. అనేక సంస్కృత నాటకాలను కూడా తెలుగులోకి అనువదించి వారికి అందించేవారు. ఈ క్రమంలో సురభి నాటక సమాజంలో చాలా గౌరవప్రదమైన స్థితిని పొందారు. కుటుంబ నాటక సమాజంగా పేరొందిన ఈ సంస్థలో అతికొద్ది మంది మాత్రమే బయటివారు సన్నిహితులుగా ఉండేవారు. అటువంటి కొద్దిమందిలో విశ్వనాథ కవిరాజు కూడా ఉండేవారు. 1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపక సభ్యులలో వీరు కూడా ఒకరు.[1]
రచనలు
అనువదించిన సంస్కృత నాటకాలు
• అనర్ఘ రాఘవము
• ఆశ్చర్య చూడామణి (శక్తిభద్రుని నాటకానికి అనువాదం
• మృచ్ఛ కటికము
• మాళవికాగ్ని మిత్రము
• విక్రమోర్వశీయము
• శివపురాణము
ఆధునిక నాటకాలు
• కిఱ్ఱుగానుగ
• దొంగాటకము
• ప్రహ్లాద
• వారసులు
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-22-ఉయ్యూరు


• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-180
• 180-ఆదర్శ నటుడు సంగీత ప్రియుడు ,నాటకాలలో సత్యవంత ,శ్రీరామ పాత్రధారి,సినీ రామ ,దుర్యోధనుడు-యడవల్లి సూర్యనారాయణ
• 1888లో జన్మించి ,1939లో 51ఏటనే మరణించిన యడవల్లి సూర్యనారాయణ పదహారవ ఏట నాటక రంగం లో ప్రవేశించి 35ఏళ్ళు నిర్విరామంగా నాటక రంగం లో రాణించిన ఆదర్శ నటుడు .గుంటూరులో ఆగర్భ శ్రీమంతుల ఇంట జన్మించాడు .పూర్వాచార పారాయణ వంశం .ఇంగ్లీష్ లో మెట్రిక్ పాసై ,సంస్కృత ఆంధ్రాలను కూడా నేర్చాడు .
•   మంచి ఆరోగ్యం అవయవ సౌష్టవం ,ఠీవి గాత్రం,అందం  గామ్భీర్యలతో మహారాజ పాత్ర పోషణకు తగినవాడు అనిపించాడు .అందం తో నాటక రంగాన్ని స్వాధీన పరచుకొన్నాడు .నాటక జీవితం ఎంతటి ఉదాత్తమో నిజజీవితమూ అంత ఉదాత్తమైనది .కనుకనే గౌరవం విశిష్టత సాధించగలిగాడు .
•   సంగీత ప్రియుడైన యడవల్లి దేశం లోని ప్రసిద్ధ గాయకుల కచేరీలను స్వయంగా చూసి  నేర్చి నటనకు, గాత్రానికి మెరుగులు దిద్దుకొన్నారు .సరసుడు ,సాహిత్య ప్రియుడు కూడా .వ్యంగ్య చమత్కారంతో సంభాషణతో అందర్నీ ఆకర్షించే నైపుణ్యం ఉండేది .సహజ నటనకు నిత్య సాధన తోడ్పడి ఉన్నత శిఖరాలను చేర్చింది .
•   గద్య ,పద్య పఠనం లో సూర్య నారాయణకు ఒక ప్రత్యేకత ఉండేది .ఎంతటి సమాసాన్ని అయినా చక్కగా విడమర్చి అందరికి అర్ధమయేట్లు పలకగల సామర్ధ్యం ఆయనది .నాటక సమాజాన్ని గొప్ప క్రమశిక్షణతో నడపగల సమర్ధుడు .నాటక ప్రయోగాలకు సిద్ధంగా ఉండే దర్శకుడు .
• బాల్యం లో గుంటూరు విద్యార్ధి సంఘంతో ,యవ్వనంలో బెజవాడలోని మైలవరం బాలభారతీ నాటక సమాజం తో ,తర్వాత ఏలూరు లో సీతారామాంజనేయ నాటక సమాజం తో నాయక పాత్రలు ధరించి , ఆంధ్రదేశమంతా ప్రదర్శనలిచ్చి విఖ్యాతనటకీర్తి పొందాడు .
•   సావిత్రి నాటకం లో సత్యవంతుడు ,పాదుక లో శ్రీ రాముడు ,శాకుంతలం లో దుష్యంతుడు ,సారంగధర లో సారంగ ధరుడుగా ,గయోపాఖ్యానం లో అర్జునుడు ,చిత్ర నళీయం లో బాహుకుడుగా ,వేణీ సంహారం,ద్రౌపదీ వస్త్రాపహరణం ,పాండవోద్యోగ విజయంలో దుర్యోధనుడుగా నటించి రాజసం ఒలకబోస్తూ ,విశేష ప్రఖ్యాతి పొందాడు .
•     1932లో చలన చిత్ర రంగం లో ప్రవేశించి పాదుకా పట్టాభి షేకం లో శ్రీ రాముడుగా నటించాడు ,మెప్పించాడు .అదే ఏడాది లో వచ్చిన శకుంతల లో దుష్యన్తుడిగా నటించి చిరయశస్సు నార్జించాడు .1936లో ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో దుర్యోధనుడుగా నటనలో జీవించి ఈ రంగాన్ని కూడా సుంపన్నం చేశాడు యడవల్లి సూర్యనారాయణ .
•   సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-22-ఉయ్యూరు  

Posted in సినిమా | Tagged | Leave a comment

    మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-178

    మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-178

·         178-శతాధిక నాటక కర్త ,కళావని,కళా భారతి  సమాజ స్థాపకుడు ,లంబాడోళ్ళ రాం దాసు ,పెండింగ్ ఫైల్ ఫేం,ఇద్దరు మిత్రులు ,బంగారు పంజరం సినిమాల డైలాగ్ రచయిత-కొర్రపాటి గంగాధరరావు

·         కొర్రపాటి గంగాధరరావు (మే 101922 – జనవరి 261986నటుడు, దర్శకుడు, శతాధిక నాటక రచయిత, కళావని సమాజ స్థాపకుడు.[1]

జీవిత సంగ్రహం

ఇతను 1922మే 10న మచిలీపట్నంలో జన్మించాడు. ఏలూరుమద్రాసులో చదివాడు. ఎల్.ఐ.ఎం. పరీక్షలో ఉత్తీర్ణులై వైద్యవృత్తిని చేపట్టి బాపట్లలో నివాసమున్నాడు.

రచనా ప్రస్థానం

తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత ఇతను. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనల అనుగుణమైన రచనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతం చేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయం చేశాడు.

ఈయన నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి. నాటకరంగాన్ని గురించి, నాటక ప్రదర్శన విధానాల గురించి అనేక వ్యాసాలను రచించి నాటక కళాభివృద్ధికి కృషిచేశాడు. నాటకాన్ని ఒక పదునైన ఆయుధంగా సమాజంలోని చెడ్డ అలవాట్లపై ప్రయోగించాలని ఇతని ఆశయం. కళావని అనే నాటక సమాజాన్ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా, దర్శకులుగా వ్యవహరించారు.

కళాభారతి అనే సాంస్కృతిక సంస్థకు, బాపట్ల ఫిల్ముక్లబ్ కు అధ్యక్షుడుగా అనేక సాంస్కృ తిక కార్యక్ర మాలను నిర్వంహించాడు. లంబడోళ్ళ రాందాసు, బోధిశ్రీ, ధంసా, నాలుగు నాలుగు నలభై నాలుగు, స్వర్గసీమ, శాంతి తోరణం, నారీ స్క్వేర్ బ్రహ్మచారి, అమృత మధనం, లకుమాదేవి- కుమారగిరి, నవతా!మానవతా అనే నవలలు రచించాడు. ఇవేకాక బ్రహ్మచారి పెళ్ళాం, యమలోకంలో సావిత్రి, పతి-పత్ని, వేగుచుక్క,డాక్టర్ గారి అమ్మాయి, సినిమా తారా, చేదుకో మల్లయ్య చేదుకో, ద్వి పాత్ర, పరకాయ ప్రవేశం, ఖబడ్దార్ ఖూనీకోర్ మొదలైన అముద్రిత నవలలు కూడా రచించాడు.

రచనలు

గంగాధర రావు గారు 130కి పైగా నాటక నాటికలు, 12 రేడియో నాటికలు, 20 నవలలు, 7 కథలు, ఏకపాత్రలు, నాటకరంగంపై 65 వ్యాసాలు వ్రాశాడు. విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీనాటకాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు, మనిషి వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.[2]

నాటకాలు/నాటికలు

1.    రధచక్రాలు (నాటికల సంపుటి)

2.    పెండింగ్ ఫైల్ (నాటిక)

3.    గుడ్డిలోకం

4.    నిజరూపాలు

5.    కమల

6.    కొత్తచిగురు

7.    పుడమితల్లికి పురిటినొప్పులు

8.    ఈ రోడ్డు ఎక్కడికి?

9.    తెరలో తెర

ఆంధ్ర కళాపరిషత్ నిర్వహించిన పోటీలలో పాల్గొన్న, బహుమతులను అందుకున్న 25 నాటికలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షాన నాటికా పంచవింశతి అనే పేరుతో సంకలనం చేసి ప్రచురించారు.

పురస్కారాలు

వీరి నాటకాలలో ఎన్నో ఉత్తమ రచనలుగా బహుమతులు అందుకున్నాయి.

1.    యథాప్రజా-తథారాజా నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు

2.    ప్రార్థన నాటకానికి ఆంధ్రనాటక కళాపరిషత్తు అవార్డు,

3.    మద్యపాన నిషేధం వస్తువుగా రాసిన పెడదోవ నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి.

మరణం

తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన ఇతను 1986జనవరి 26 తేదీన మరణించాడు.

సీక్వెల్ గా నాటకాలు నవలలు రాశారు .ఎన్నెన్నో నాటకపోటీలు నిర్వహించి యువకులను ప్రోత్సహించారు .దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఇద్దరుమిత్రులు సినిమాకు ,బిఎన్ రెడ్డి బంగారు పంజరం సినిమాకు కోర్రపాటితో సంభాషణలు రాయించారు .వీరి అత్యుత్తమనాటకం ‘’యధా ప్రజా తధా రాజా ‘’నాటక ,సంగీతప్రియులను విశేషంగా ఆకర్షించింది .గరికపాటి రాజారావు తో పరిచయం మద్రాస్ లో ఏర్పడి కొన్ని నాటకాలు ఆయనతో కలిసి ఆడారు .నిజరూపాలు ,తెరలోతెర ,భవబంధాలు ,రాగశోభిత ,గృహదహనం రాగద్వేషాలు ,ఆరని పారాణి ,నిర్మల ,కమల ఈ రోడ్డేక్కడికి ,తస్మాత్ జాగ్రత ,భాయి భజరంగ్ ,గుడ్డిలోకం గొప్ప ప్రజాదరణ పొందిన నాటకాలు .రాయం రంగనాధం పేరుతొ స్త్రీ పాత్రలులేని 13హాస్యనాటికలు కాలేజీ యువకులకోసం రాశారు. ఒకే పేరుతొ సీక్వెల్ గా రాయటం ,ప్రదర్శించటం ఒక అద్భుతమై ఎవ్వరూ చేయని ప్రయోగం గా నిలిచింది .నాటక ప్రయోగానికీ ఊపిరి పోసింది ఆయనే .పరిషత్తులలో ఉత్తమ నటులు నటీమణులను ఎంపిక చేసి వారికి ఒక సంఘటన చెప్పి ,అప్పటికప్పుడు పది నిమిషాలలో నటింప చేసి పోటీ లనూ నిర్వహించిన మొదటి వాడు ఆయనే.ఉత్తమనటుడు ,నటి హాస్యనటుడు ,కేరక్టర్ ఆర్టిస్ట్ ,లాంటి బహుమతులను ప్రవేశపెట్టినవాడూ కొర్ర పాటే.వారందరినీ సత్కరించి ప్రోత్సాహం కల్గించాడు .

  కళావనినాటక విద్యాలయం స్థాపించి ఎందఱో ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చాడు .కొర్రపాటి శిష్యులలో పిఎల్ నారాయణ ,కే ఎస్ టి.సాయి వంటి మహానటులున్నారు  .నటుడు,ప్రయోక్త ,,విశ్రాంత ఆచార్యుడు డి.ఎస్.ఎన్ . మూర్తి ఆయన బృందం వారే .అయోమయంలో చీకటిలో బతుకుతున్న సామాన్యులకు ఆయన నాటకాలు ఆసరా .’’పది రూపాయలిస్తే ‘’నాటకం లో పది ఉచిత పధకాలిస్తే ఓట్లేస్తే జనాన్నీ దేశాన్నీ పది వేలకోట్లకు అమ్మేసే ప్రభుత్వాలోస్తాయిజాగ్రత్త  అని చెప్పారు .కారా మాస్టారి ‘’యజ్ఞం ‘’కధ ను నాటిక గా మలిచి అద్భుతం చేసిన ప్రజ్ఞాశాలి కొర్రపాటి .అలాగే ఎందఱో గొప్ప రచయితల కధలను దృశ్యమానం చేసిన ఘనత డా. కొర్రపాటిది.

 ఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమి ‘’కళాప్రపూర్ణ ‘’బిరుదుతో సత్కరించింది .యధారాజ నాటకప్రదర్శనకు  9-2-1972కు యాభై ఏళ్ళు నిండాయి .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -1

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -1
చందు మీనన్ అనే పుస్తకాన్ని మలయాళం లో టిసి.శంకర మీనన్ రాస్తే తెలుగులోకి కేకే రంగానాథాచార్యులు అనువదిస్తే కేంద్ర సాహిత్య అకాడెమి 1979లో ప్రచురించింది .వెల-రూ2-50.
మళయాళ సాహిత్య నూత్న పద నిర్దేశకుడు చందు మీనన్ .అత్యధిక విద్యాధికులున్న కేరళరాష్ట్రం లో జన్మించాడు .శతాబ్దాల క్రమ పరిమాణం కల మలయాళభాష 17 వ శతాబ్దిలో ప్రత్యేకతను ,ఆధునికత ను సంతరించుకొన్నది.మళయాళ సాహిత్య పితామహుడు తున్జల్ ఎళుత్తచ్చన్ ఆధునిక మలయాళాన్ని సాహిత్యం లో ప్రవేశలోపెట్టాడు .ఇవాళఅన్ని  సాహిత్య ప్రక్రియలతో విస్తృతంగా వర్ధిల్లింది .1969లోనే మహాకవి జి శంకర కురూప్ భారతీయ జ్ఞాన పీఠ పురస్కారం పొందాడు .1890లో రావు బహదూర్ ఓ.చందు మీనన్ రాసిన ‘’ఇందులేఖ ‘’నవల మొట్టమొదటిసారిగా ఆంగ్లానువాదం పొంది మళయాళ సాహిత్యం అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేసింది .చందుమీనన్ వృత్తి రీత్యా న్యాయాధికారి కానీ రచయిత కాదు అంటే అవాక్కైపోతాం .
         చందుమీనన తండ్రి ఎతపతి చందు నాయర్ కూడా న్యాయాదికారే .కేరళ కొట్టాయం తాలూకా పినరాయ్ వంశం లో కేలలూరు సబ్ డివిజన్ లో విద్య సదుపాయం పెద్దగా లేని చోటపుట్టి తండ్రి మళయాళ ఇంగ్లీష్ లలో పరిచయం పొంది తెల్లిచ్చేరి కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం లో చేరి ,వరుసగా ప్రమోషన్లు పొంది మేజిష్ట్రేట్ అయ్యాడు .తర్వాత తాసీల్దారై,మలబారులో చాలాచోట్ల పని చేశాడు .ఈయన రెండవభార్య పార్వతి అమ్మ కన్న అయిదుగురు సంతానం లో చందు మీనన్ చివరివాడు . 9-1-1847న పుట్టాడు .52ఏళ్ళు జీవించి 1857లో మరణించాడు .తండ్రి తెల్లచ్చేరిలో పని చేస్తూ ఒక ఇల్లు కట్టించుకొన్నాడు దానికి ‘’ఒయ్యరథ్’’అని పేరు పెట్టుకొన్నాడు .చందు ఇక్కడే పెరగటం వలన’’ ఒయ్యరథ్ చందు మీనన్ ‘’అయ్యాడు .
  తండ్రి చనిపోయే నాటికి చందుకు పదేళ్ళు .తల్లి వాత్సల్యానురాగాలతో పెంచింది .పక్కింటాయన కొరాన్ గురుక్కళ్ దగ్గర మొదటి పాఠాలు నేర్చాడు .తర్వాత కు౦జు౦బి నంబియార్ వద్దసంస్కృతకవిత్వం నాటకాలు వ్యాకరణం నేరుస్తూ స్థానిక పాఠశాలలో ఇంగ్లీష్ నేర్చుకొన్నాడు .ఆతర్వాత అనువాదకుడు సబ్ జడ్జి అయిన కే.కుంజన్ వద్ద చదివి ,సివిల్ సర్వీస్ కు యోగ్యత పొందినా చదువు కొనసాగించి మెట్రిక్ చదివి 1864లో తల్లి చనిపోగా చదువుమానేశాడు  .
  17వ ఏట ఉద్యోగ వేటలో పడ్డాడు .తెల్లిచ్చేరి స్మాల్ కాజెస్ కోర్టులో గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తుపెట్టి ,ఇంటర్వ్యు చేసిన జడ్జి టిఆర్ షార్ప్ ను షార్ప్ సమాధానాలతో మెప్పించి సెలక్ట్ అయి ఆరవ గుమాస్తాగా నియమింపబడి ఉద్యోగం లో చేరాడు .మూడేళ్ళు పని చేసి తన అమోఘ శక్తిసామర్ధ్యాలు ప్రదర్శించగా సబ్ కలెక్టర్ లోగాన్ కావాలని చందు మీనన్ ను తన ఆఫీసులో మూడవ గుమాస్తాగా బదిలీ చేయించి వేసుకొన్నాడు .కొద్దికాలానికే మొదటి గుమాస్తా అయ్యాడు చందు .1871లో కాలికట్ సచివాలయం లో హెడ్ మున్షి అయ్యాడు .కావ్యంగా గుర్తింపు  పొందిన ‘’ మలబార్ జిల్లా మాన్యువల్’’  తయారు చేయటం లో చందు మీనన్ గొప్ప కృషి చేసి లోగాన్ కు సాయపడ్డాడు .జస్టిస్ షార్ప్1872లో కాలికట్ జిల్లా జడ్జి అయినప్పుడు చందు మీనన్ ను సివిల్ కోర్ట్ హెడ్ క్లార్క్ గా చేశాడు అతని పనితీరును పరిశీలించి తృప్తి చెంది .1875లో ప్రభుత్వం పట్టామ్బి లో ఆయన్ను తాత్కాలిక మున్సిఫ్ ను చేసి గుమాస్తాకు స్వస్తి చెప్పించింది .పాల్ఘాట్, కాలికట్ వగైరా లలో పని చేసి 1886నుంచి 1892వరకు పరప్పనం గుడి లో జిల్లా మున్సిఫ్ చేస్తూ ,1890లో తన ప్రఖ్యాత నవల ‘’ఇందులేఖ ‘’రాసి ప్రచురించాడు చందు మీనన్ .1890లో మలబార్ మారేజ్ కమిటీలో మహోన్నతులతో సమానంగా సభ్యుడయ్యాడు .1891లో నివేదిక విడుదలయ్యాక అందరూ దాన్ని ఒప్పుకొంటే చందు తన అసమ్మతిని సూచించాడు .మరుమక్కత్దాయం కుటుంబాలలో ఆచారాల పవిత్రత అధికారం వాటికి ఉన్నాయనీ వాటిలో మార్పులు తేవటం అవాంఛనీయమని, వాటికి చట్టబద్ధ గుర్తింపు తేవటం ఒక్కటే సంస్కరణ అని చెప్పాడు .అప్పటి మద్రాస్ ప్రభుత్వం వాడుకలో ఉన్న విధానాన్నే మార్పులు లేకుండా ఆమోదించింది .చందు మీనన్ ఎంత లోతుగా అధ్యయనం చేశాడో మనకు అర్ధమౌతుంది .
   సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-177

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-177

· 177-రంగస్థల నటుడు ,వ్యాఖ్యాత ,ప్రజానాట్యమండలి కళాకారుడు ,ప్రపంచం ,రోజులు మారాయి ఫేం –వల్లం నరసింహారావు

· వల్లం నరసింహారావు సినిమా, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, ప్రజా కళాకారుడు. ఇతడు 2006, మార్చి 13వ తేదీన 79 ఏళ్ల వయసులో హైదరాబాదులో గుండెపోటుతో మరణించాడు[1]. ఇతడు ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. కృష్ణా జిల్లా,తిరువూరుకు చెందిన వల్లం నరసింహారావు 1952లో సినీరంగ ప్రవేశం చేశాడు. మా భూమి వంటి నాటకాల్లో నటించి ఈయన జైలు శిక్ష అనుభవించాడు. కులదైవం, ముద్దుబిడ్డ సినిమాల్లో ఈయన హీరోగా నటించాడు. ఇంకా పలు చిత్రాల్లో నటించాడు. నటుడు బి.పద్మనాభంతో కలిసి రేఖా అండ్ మురళి పతాకంపై పలు చోట్ల నాటకాలు ప్రదర్శించాడు.

సినిమాలు

 1. ప్రపంచం (1953)
 2. రోజులు మారాయి (1955)
 3. ముద్దు బిడ్డ (1956)
 4. ఎం.ఎల్.ఏ. (1957)
 5. ఎత్తుకు పైఎత్తు (1958)
 6. ముందడుగు (1958)
 7. కులదైవం (1960)
 8. అసాధ్యుడు – శ్రీశ్రీ వ్రాసిన అల్లూరి సీతారామరాజు నాటకానికి వ్యాఖ్యాత.
 9. నిలువు దోపిడి (1968)
 10. రణభేరి (1968)
 11. సంపూర్ణ రామాయణం (1971 )
 12. దేవుడు చేసిన పెళ్లి (1974)
 13. కొత్త కాపురం (1975)
 14. ఇది కథ కాదు (1979)
 15. యువతరం కదిలింది (1980)
 16. దారి తప్పిన మనిషి (1981)
 17. నాలుగు స్తంభాలాట (1982)
 18. భారతసింహం (1995)
 19. ధర్మచక్రం (1996)
 20. శ్రీరాములయ్య (1998)
 21. వెలుగునీడలు (1999)
 22. సూర్య పుత్రిక (1999)
 23. ఈతరం నెహ్రూ (2000)
 24. భద్రాచలం (2001)
 25. ఆయుధం (2003)
 26. సింహాద్రి (2003)
 27. ఆ నలుగురు (2004)
 28. లక్ష్మీనరసింహా (2004)
 29. శాంతి సందేశం (2004)
 30. సోగ్గాడి సరదాలు (2004)
 31. ప్లీజ్ నాకు పెళ్లైంది (2005)
 32. మేస్త్రీ (2005)
 33. నిన్న నేడు రేపు (2008)

నాటకాలు
మాభూమి
కాళహస్తి మహాత్మ్యం
శాంతి నివాసం
ఇన్‌స్పెక్టర్ జనరల్[2]
· ఈ వల్లం నరసింహారావు గారి అన్నకుమారుడి పేరుకూడా వల్లం నరసింహారావు .ఈయన మాకు 2017లో అమెరికాలోని షార్లెట్ నగరం లో ఆ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం నాడు పరిచయమయ్యారు .ఈయనకూడా నాటక కళాకారుడే .ఆయనతో నాటకాలలో నటించిన వారే .ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు .ఇదొక యాక్సి డెంటల్ కోయింసి డెంట్.

అసలు వల్లం గారిని సుమారు 40ఏళ్ళక్రితం హైదరాబాద్ లో అనుపమ సంస్థ నిర్మాత దర్శకుడు కెబి తిలక్ మొదలైనవారితో చూశా .

·

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-176

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-176

· 176-భరత కళాప్రపూర్ణ ,కళాసరస్వతి ,సంగీతనాటక అకాడెమి అవార్డీ,రహస్యం సినిమా ఫేం –కోరాడ నరసింహారావు

· కోరాడ నరసింహారావు (1936 – జనవరి 4, 2007) ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు.

· పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పవర్‌పేట వాస్తవ్యుడైన కోరాడ 1936[1] లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, 12 ఏటనే పలు నాట్యరీతులను ఆకళింపు చేసుకున్నాడు. 1960లలో ప్యారిస్‌లో జరిగిన విశ్వ నాట్యోత్సవాలలో కోరాడ ప్రదర్శించిన కూచిపూడి దశావతారాల ప్రదర్శనకు ప్రపంచ ఉత్తమ పురుష నర్తకుడిగా బహుమతి పొంది జగద్విఖ్యాతుడయ్యాడు.

· కోరాడ నరసింహారావు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల సమక్షంలో నాట్యం చేయడమే కాక 23 దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించాడు. భారతదేశ మొట్టమొదటి మిస్‌ ఇండియా ‘పద్మభూషణ్‌’ ఇంద్రాణి రెహమాన్, పద్మ విభూషణ్‌ యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాల, రీటా చటర్జీ, గోపీకృష్ణ, హేమమాలిని, శాంతారామ్‌లకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చాడు. గిరిజా కళ్యాణం, వేదాంతం రాఘవయ్య నిర్మించిన రహస్యం చిత్రాల్లో నటించారు. కోరాడ నరసింహారావును భరత కళాప్రపూర్ణ, కళాసరస్వతి లాంటి బిరుదులతో పాటు కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలతో గౌరవించాయి. నాట్యరంగంలో ఆయన విశిష్ట సేవలకు గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ 2005 లో అవార్డును రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా 2006 మార్చి 20వ తేదీన న్యూఢిల్లీలో అందుకున్నారు.

· మరణం
· కోరాడ తీవ్ర అస్వస్థతతో 2007 జనవరి 4 రాత్రి హైదరాబాదులో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-174

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-174
• 174-జయ ,శోభనాచల సంస్థ , దక్ష యజ్ఞం,గొల్లభామ ,లక్షమ్మ నిర్మాత దర్శకుడు –మీర్జాపురం రాజా
• శోభనాచల పిక్చర్స్ తెలుగు చలనచిత్రరంగంలో అతిముఖ్యమైన నిర్మాణసంస్థల్లో ఒకటి. దీని అధినేత మీర్జాపురం రాజా వారు. మీర్జాపురం అంటే నూజివీడు .నూజివీడు రైల్వే స్టేషన్ పేరు మీర్జాపురం .అసలు పేరు మేకా రంగయ్యప్పారావు .ఇంతకముందు జయ ఫిలింస్ పతాకాన కొన్ని చిత్రాలు నిర్మించిన రాజా వారు 1941లో శోభనాచల సంస్థను స్థాపించారు. శోభనాచల సంస్థ నిర్మించిన తొలి చిత్రం దక్షయజ్ఞం (1941). గొల్లభామ (1947) చిత్రం శోభనాచల సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1947లో విడుదలైన చిత్రాలలో గొల్లభామనే ఆర్థికంగా పై చేయి సాధించింది. 1949లో వచ్చిన కీలుగుర్రం చిత్రానికి రాజా వారు దర్శకుడి, నిర్మాత. కీలుగుర్రం రాజా వారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. 1950లో విడుదలైన లక్ష్మమ్మ చిత్రాన్ని ప్రతిభా వారి శ్రీ లక్ష్మమ్మ కథతో పోటీ పడి నిర్మించారు. ఈ పోటీలో లక్ష్మమ్మదే పై చేయి అయ్యింది. 1940లలో గొప్ప పేరు తెచ్చుకున్న శోభనాచల సంస్థ కొన్ని కారణాల వలన 1950ల ప్రథమార్థంలో మూతపడింది. శోభనాచల సంస్థ యాజమాన్యంలో మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలోని శోభనాచల స్టూడియోలలో అనేక చిత్రాలు నిర్మితమయ్యాయి. 1949లో వాహినీ స్టూడియోస్ ప్రారంభంతో శోభనాచల స్టూడియోలలో చిత్రాల నిర్మాణం తగ్గిపోయింది. 1955లో శోభనాచల స్టూడియోల యాజమాన్యం మారింది, స్టూడియో పేరు వీనస్ స్టూడియోగా మార్చబడింది. దశాబ్ద కాలం పైగా పనిచేసిన వీనస్ స్టూడియో తర్వాత మూతపడింది.
చిత్ర సమాహారం
జయ ఫిలిమ్స్ చిత్రాలు
• జరాసంధ (1938)
• మహానంద (1939)
• భోజ కాళిదాసు (1940)
• జీవన జ్యోతి (1940)
శోభనాచల చిత్రాలు
• దక్షయజ్ఞం (1941)
• భీష్మ (1944)
• గొల్లభామ (1947)
• మదాలస (1948)
• కీలుగుర్రం (1949)
• లక్ష్మమ్మ (1950) (ఎం.ఆర్.ఏ. ప్రొడక్షన్స్తో కలిసి)
• తిలోత్తమ (సినిమా) (1951)
• ప్రజాసేవ (1952)
• సావాసం (1952)
• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-22
• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-175
• 175-మీర్జాపురం రాణి ,గాయని ,నిర్మాత ,రామారావు రంగారావు ఘంట సాల,రమేష్ నాయుడు  లను తెలుగు తెరకు పరిచయం చేసిన అందాలనటి గొల్లభామ,లక్షమ్మ ఫేం,రఘుపతి వెంకయ్య అవార్డీ –కృష్ణ వేణి
• సి.కృష్ణవేణి లేదా (ఎం.కృష్ణవేణి) (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత
జీవిత చరిత్ర[మార్చు]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది.1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.
కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత,తనకంటే 29ఏళ్ళు పెద్ద అయిన  మీర్జాపురం రాజా (జన్మనామం:మేకా రంగయ్య)తో వివాహం జరిగింది.ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
పురస్కారాలు
• తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకుంది.
కృష్ణవేణి నటించిన సినిమాలు
1. సతీ అనసూయ -ధ్రువ (1936)
2. మోహినీ రుక్మాంగద (1937)
3. కచ దేవయాని (1938)
4. మళ్ళీ పెళ్ళి (1939)
5. మహానంద (1939)
6. జీవనజ్యోతి (1940)
7. దక్షయజ్ఞం (1941)
8. భీష్మ (1944)
9. బ్రహ్మరథం (1947)
10. మదాలస (1948)
11. మన దేశం (1949)
12. గొల్లభామ (1947)
13. లక్ష్మమ్మ (1950)
నిర్మాతగా కృష్ణవేణి
కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు
• భర్త స్థాపించిన సంస్థ – జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
• సొంత సంస్థ – తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
కృష్ణవేణి నిర్మించిన సినిమాలు
• మన దేశం (1949)
• లక్ష్మమ్మ (1950)
• దాంపత్యం (1957)
• గొల్లభామ (1947)
• భక్త ప్రహ్లాద (1042)
• సశేషం
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

ఓటుహక్కు కోసం పోరాడిన అమెరికన్ జర్నలిస్ట్ –మేరీ వైట్ ఓవింగ్టన్(వ్యాసం )-

ఓటుహక్కు కోసం పోరాడిన అమెరికన్ జర్నలిస్ట్ –మేరీ వైట్ ఓవింగ్టన్(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్
01/04/2022 గబ్బిట దుర్గాప్రసాద్
11-4-1865న అమెరికాలోని న్యూయార్క్ వద్ద బ్రూక్లిన్ లో మేరీ వైట్ ఓవింగ్టన్ జన్మించింది .తలిదండ్రులు స్త్రీ హక్కులకోసం,బానిసత్వ నిర్మూలన కోసం పోరాడే యునిటరేనియన్ చర్చి కి సంబంధించిన వారు .పాకర్ కాలేజి ఇన్ ష్టిట్యూట్,రాడిక్లిఫ్ కాలేజి లో చదివి , 1890లో సివిల్ రైట్స్ ఉద్యమం లో పాల్గొని ,ఫ్రెడరిక్ డగ్లస్ ఉపన్యాసం న్యు యార్క్ లో విని ప్రేరణ పొంది ,1903లో సోషల్ రిఫార్మ్ క్లబ్ లో బుకర్ టి.వాషింగ్టన్ ప్రసంగం తో స్పూర్తి పొందింది .1894లో ఇడా బి.వెల్స్ ను కలిసి ,అతని అక్క చెల్లెళ్ళ పిల్లలకు క్రిస్మస్ గిఫ్ట్ లు అందించి ,వారి దయనీయ జీవితాలను చూసి కలత చెంది ,ఇడా తో కలిసి వారి నివాసాలను మెరుగు పరచటానికి కృషి చేసింది .1895లో బ్రూక్లిన్ లో ‘’గ్రీన్ పాయింట్ సెటిల్ మెంట్ ‘’ఏర్పరచి ,తర్వాత ఏడాది ఆప్రాజేక్ట్ హెడ్ అయింది .1904లో సాంఘిక విచారణ సంఘం అయిన గ్రీన్ విచ్ హౌస్ కమిటీ ఫెలో అయింది .తర్వాత అయిదేళ్ళు మాన్ హట్టన్ నల్లవారి ఉద్యోగాలు గృహ విషయాలపై అధ్యయనం చేసింది .ఆ సమయం లో డబ్లు బి.డ్యుబోస్ తో పరిచయమై ,ఇద్దరు ‘’నయాగర మూమెంట్’’ కు సంస్థాపక సభ్యులయ్యారు .

1905లో ఓవింగ్టన్ అమెరికన్ సోషలిస్ట్ పార్టీ లో చేరి ,విలియం మోరిస్ ప్రభావం తో ఫిలిప్ రాండాల్ఫ్ ,ఫ్లయోడ్ డెల్,మాక్స్ ఈస్ట్ మాన్ ,జాక్ లండన్ వంటి ప్రముఖులతో పరిచయం పెంచుకొన్నది .వీరంతా జాతి సమస్యలు క్లాస్ సమస్యల వంటివే అని అభిప్రాయ పడ్డారు .దిమాసేస్ ,న్యూయార్క్ ఈవెనింగ్ పోస్ట్ ,న్యూయార్క్ కాల్ ,పత్రికలలో ఈసమస్య లపై వ్యాసాలూ రాసింది .రే స్టానార్డ్ బెకర్ తో కలిసి పని చేసింది అతడు 1908లో రాసిన ‘’ఫాలోయింగ్ ది కలర్ లైన్ ‘’పుస్తకం చదివి ప్రభావితురాలైంది .

1908లో విలియం ఇంగ్లిష్ వాల్లింగ్ అనే సోషలిస్ట్ ది ఇండి పెండెంట్ పత్రిక లో రాసిన ‘’రేస్ వార్ ఇన్ ది నార్త్ ‘’చదివి ,నల్లజాతి నిలయాలైన అబ్రహాం లింకన్ ,స్ప్రింగ్ ఫీల్డ్ ,ఇల్లినాయిస్ లలో జరిగిన హత్యలు గృహదహనాలు బిజినెస్ లపై దాడులు తెలిసి అత్యున్నత సంఘం తో విచారణ జరిపించి వారికి తక్షణ న్యాయం జరిపించాలని కోరిన విషయాలన్నీ తెలుసుకొని ,తానుకూడా ఆర్టికల్స్ రాసి ,న్యూయార్క్ సిటిలో వాలింగ్ ను ఆయన ఇంట్లో హెన్రి మొసోవిజ్ బృందంతో వెళ్లి పరామర్శించి ,ఆఫ్రికన్ అమెరికన్ ల పౌర ,రాజకీయ హక్కులకోసం లింకన్ పుట్టిన రోజు 1909ఫిబ్రవరి 12న జాతీయ సమావేశం జరపాలని నిర్ణయించారు .

న్యూయార్క్ లో1909లో మే 31,జూన్ 1 న ‘’నేషనల్ నీగ్రో కమిటీ ‘’సమావేశం జరిగింది .తర్వాత ఏడాది అది ‘’నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ ‘’(NAACP)గా విస్త్రుతమైసమావేశం జరిపింది .ఓవింగ్టన్ ఎక్సి క్యూటివ్ సేక్రేటరిగా ,జోసేఫిన్ రాఫిన్ ,మేరి టాల్బర్ట్ ,జార్జి హెన్రి వైట్ మొదలైనవారు సభ్యులు .తర్వాత ఏడాది లండన్ లో జరిగిన ‘’యూనివర్సల్ రేసెస్ కాంగ్రెస్ ‘’లో పాల్గొన్నది .రిచేట్టా వాన్డాల్ఫ్ వాలెస్ ‘’చాలాకాలం ఈమె వద్ద సేక్రేటరి గా ఆ సంస్థకు పని చేసింది .

మహిళా ఓటింగ్ హక్కు ఉద్యమాలలో1921లో ఓవింగ్టన్ చురుకుగా పాల్గొని ,ఆలిస్ పాల్ కు ఒక ఉత్తరం రాస్తూ19వ అమెండ్ మెంట్ బిల్లు పాసైన సందర్భంగా జరిపే ‘’నేషనల్ వుమెన్స్ పార్టీ ‘’ఉత్సవాలలో నల్లజాతి మహిళలను కూడా ఆహ్వానించామని కోరింది .పాసిఫిస్ట్ అయిన ఓవింగ్టన్ మొదటి ప్రపంచయుద్ధం లో అమెరికా పాల్గొనటం పై వ్యతిరేకించింది .నల్లవారి పౌరహక్కులను సమర్ధిస్తున్న ‘’ది మెసెంజర్ ‘’పత్రికాధిపతి ఫిలిప్ రాండాల్ఫ్ ను సమర్ధించింది .

యుద్ధం తర్వాత ఓవింగ్టన్ NAACP) లో బోర్డ్ మెంబర్ ,ఎక్సిక్యూటివ్ సెక్రెటరి,చైర్మన్ గా పని చేసింది .మహిళలను చైతన్యం చేసి సంస్థలో చేర్పించింది .ఈ సంస్థ ఓటింగ్ హక్కు, జాతి వివక్షత ,విద్య ,ఉద్యోగం ,గృహాలు ,రవాణా విషయాలపై తీవ్ర పోరాటాలు చేసింది .దక్షిణ రాష్ట్రాలు చేసిన చాలా చట్టాలు రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్ట్ లో1915నుంచి 1923 వరకు కేసులు వేసి న్యాయం పొందారు .

1934జూన్ లో ఒవింగ్టన్ 14 వివిధ కాలేజి లలో ప్రసంగాలు చేసింది .తన సంస్థ నల్ల తెల్ల యువత ను సమానంగా చూస్తూ నల్లవారి హక్కులను కాపాడే ది అనీ తెల్లవారిలో కూడా నల్లవారి హక్కులపట్ల సానుభూతి తో ఉన్నవారున్నారని “They should know the power the race has gained” – Mary White Ovington[7] చెప్పింది.

బ్లాక్ మాన్హట్టన్ స్టేడి ,హాఫ్ ఎమాన్ ,స్టేటస్ ఆఫ్ నీగ్రో ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ,సోషలిజం అండ్ ఫెమినిస్ట్ మువ్ మెంట్ ,యాన్ ఆ౦థాలజి ఆఫ్ బ్లాక్ చిల్డ్రెన్ ,ది అప్ వర్డ్ పాత్ ,బయాగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ ఆఫ్రికన్ –అమెరికన్స్ ,పోర్త్రైట్స్ ఆఫ్ కలర్ ,పుస్తకాలతో పాటు తన జీవిత చరిత్ర ‘’రెమినిసేన్సెస్ ‘’రాసింది . తన అనారోగ్యం దృష్ట్యా తన పదవి నుంచి తప్పించమని మరీమరీ కోరేది . తప్పని సరి పరిస్థితులలో మేరీ వైట్ ఓవింగ్టన్ 1947లో 38 సంవత్సరాల నిర్విరామ సేవ చేసి తన సంస్థ బోర్డ్ మెంబర్ గా రిటైర్ అయింది . చివరి రోజులలో మాసా చూసేట్స్ లో తన అక్క చెల్లెళ్ళ వద్ద సుఖ జీవితం గడిపింది .అక్కడే న్యూటన్ హైలాన్డ్స్ లో 17-7-1951న 86ఏళ్ళ సార్ధక జీవనం గడిపి మేరీ వైట్ ఓవింగ్టన్ మరణించింది .బ్రూక్లిన్ లోని మిడిల్ స్కూల్ కు ఆమె పేరుపెట్టి గౌరవించారు .2009లో ఆమె గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in సమీక్ష | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-173 · 173-ఆలీబాబా అరవై దొంగలు ,కత్తికాంతారావు ,సూర్యవంశం సినీ డైలాగ్ ఫేం –మరుధూరి రాజా

మన మరుపు మరుధూరి రాజా తెలుగు సినీ సంభాషణల రచయిత, దర్శకుడు.[1] 200 కి పైగా సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన సోదరుడు ఎం. వి. ఎస్. హరనాథ రావు కూడా నాటక, సినీ రచయిత.

వ్యక్తిగత వివరాలు
మరుధూరి రాజా గుంటూరులో జన్మించాడు. ఒంగోలు లో చదువుకున్నాడు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య ఎం. వి. ఎస్. హరనాథ రావు కూడా నాటక, సినీ రచయిత. తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, వేషాలు వేయడం, దర్శకత్వం చేయడం ఆయనకు అలవాటు. సినిమాల్లోకి రాకమునుపే 18 నాటకాలు రచించాడు.

కెరీర్
ఆయన దర్శకత్వం వహించిన శ్రమదేవోభవ అనే నాటకం రవీంద్రభారతి లో ప్రదర్శనను చూసిన జంధ్యాల ఆయన్ను మద్రాసుకు రమ్మని ఆహ్వానించాడు. దాంతో ఆయన జంధ్యాల దగ్గర శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, రావూ గోపాలరావు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత ఈతరం ఫిలింస్ బ్యానర్ లో ప్రజాస్వామ్యం సినిమాకు సంభాషణల రచయితలుగా పనిచేస్తున్న పరుచూరి బ్రదర్స్ దగ్గర సహాయకుడిగా చేరాడు. తరువాత నవభారతం సినిమాతో సంభాషణల రచయితగా మారాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పోకూరి బాబూరావు, కె. రాఘవేంద్రరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జి. నాగేశ్వరరెడ్డి లాంటి దర్శకులతో సుమారు 200 సినిమాలకు సంభాషణలు రాశాడు.

సినిమాలు
సంభాషణల రచయితగా
· 6 టీన్స్ (2001)

· ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)

· అమ్మాయి కోసం

· ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)

· ఆయుధం

· గౌరి (2004)

· ఆరోప్రాణం

· ఆలీబాబా అరడజను దొంగలు (1994)

· ఎగిరే పావురమా

· ఒంటరి పోరాటం

· కత్తి కాంతారావు

· కాంచనమాల కేబుల్ టి.వి.

· దేనికైనా రేడీ

· నవభారతం

· నువ్వు వస్తావని

· యజ్ఞం

· వీడెక్కడి మొగుడండీ?

· శుభాకాంక్షలు

· సిసింద్రీ

· సూర్య వంశం

· ఆరో ప్రాణం (1997)

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-172

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-172

· 172-‘’ఈతరం ఫిలిమ్స్ ‘’స్థాపకుడు ,టి.కృష్ణ సహచరుడు ,నేటి భారతం ,రేపటిపౌరులు ,యజ్ఞం నిర్మాత –పోకూరి బాబూరావు

పోకూరి బాబురావు ఒక తెలుగు సినీ నిర్మాత. అతను సినిమా నిర్మాణ సంస్థ ఈతరం ఫిలిమ్స్ ను స్థాపించాడు.

జీవిత విశేషాలు
పోకూరి బాబూరావు ప్రకాశం జిల్లా లోని ఒంగోలుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రోవగుంట గ్రామంలో శేషయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. ఐదో తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. అతనికి అతని తండ్రే స్పూర్తి. అతని తండ్రి సాధారణ రైతు స్థాయి నుంచి పెద్ద పొగాకు వ్యాపారిగా, థియేటర్ యజమానిగా, హోటల్ ప్రొప్రయిటరుగా అంచెలంచెలుగా ఎదిగాడు. బాబూరావు ఉన్నత విద్యకోసం ఒంగోలు పీవీఆర్ హైస్కూలులో చేరాడు. స్వగ్రామం నుండి ఒంగోలుకు రోజూ నడిచె వెళ్ళేవాడు. దారిలో అతని స్నేహితులతొ సినిమా చర్చలు ఎక్కువగా జరిగేవి. అక్కడ 10వ తరగతి పూర్తి చేసాడు.

నాటకాలపై ఆసక్తి
అతని తల్లి ఖాళీ సమయాలలో భక్తిగీతాలు, హిట్టయిన సినిమా పాటలు పాడేది. వాటిని శ్రద్ధగా వింటూ అతనూ గొంతు కలిపేవాడు. అలా అతని తల్లి నుంచి ఆ కళ అతనికి అబ్బింది. స్కూల్లో టీచర్లు అతనిచే పాటలు పాడించేవారు. అతని ఊళ్ళో సంక్రాంతికి నాటకాలు వేసేవారు. అతని మేనమామ వెంకటేశ్వర్లు నాటకాలలో నటించేవాడు. అతని ప్రేరణతో బాబూరావుకు నాటకాలలో వేషాలు వేయాలనే ఆసక్తి పెరిగింది. అతని పోరుకు తట్టుకోలేక అతని మామయ్య ఓసారి నాటకంలో పోస్ట్ మ్యాన్ పాత్ర ఇప్పించాడు.

అతను విజయవాడలో పి.యు.సి చదివాడు. ఒంగోలు లోని సి.ఎస్.ఆర్ శర్మ కాలేజీలో డిగ్రీ బీ.కాం చేసాడు. అక్కడ అతని క్లాస్ మేట్ టి.కృష్ణ. అతను ఎక్కువగా పాటలు బాగా పాడటం మూలాన కృష్ణకు అతనంటే అభిమానం ఏర్పడింది. టి. కృష్ణ కాలేజీ సాంస్కృతిక విభాగానికి కార్యదర్శిగా ఉండేవాడు. కాలేజీ వార్షికోత్సవంలో, వీడ్కోలు సభలలో నాటకాలు వేసేవారు. ఈ నాటకాలకు కృష్ణ దర్శకత్వం వహించేవాడు. బాబూరావు “సంభవామి యుగే యుగే” నాటకంలో చిన్న పాత్ర వేసాడు. కళాశాలలో ప్రతీ సంవత్సరం చివర్లో పాటల పోటీలు జరిగేవి. ప్రతీ యేడాది కృష్ణ ఉత్తమ గాయకునిగా ఎంపిక అయ్యేవాడు. ఒకసారి బాబూరావు కూడా ఉత్తమ గాయకునిగా ఎంపికయ్యాడు. కళాశాల, యూనివర్శిటీ స్థాయిలో కృష్ణ ఉత్తమ నతుడూ దర్శకుడిగా బహుమతులు సాధించేవాడు. ఒకసారి “పగ” అనే నాటకంలో ఉత్తమ నటునిగా బాబూరావు బహుమతి వచ్చింది. కృష్ణ కాలేజీ నుండి వెళ్ళాక బాబూరావు అతని స్థానంలో సాంస్కృతిక విభాగానికి కార్యదర్శి అయ్యాడు. అతనిలోని కళను గుర్తించి, దాన్ని పదిమందికీ పరిచయం చేసి, అతనికి ఒక గుర్తింపు తెచ్చింది కృష్ణ.[1]

కాలేజీ చదువు పూర్తయ్యాక కృష్ణ మద్రాసు వెళ్ళాడు. “తల్లీ కూతుళ్ళు” సినిమా తీస్తున్న దర్శకుడు గుత్తా రామిరెడ్డి దగ్గర అసిస్టెంటుంగా చేరాడు. ఉత్తరాల ద్వారా బాబూరావు కృష్ణతో స్నేహాన్ని కొససాగించాడు.

అతను ఏలూరు సీ ఆర్ ఆర్ కళాశాలలో ఎం.కాం చదివాడు. తరువాత నిడదవోలు ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగంలో చేరాడు. తర్వాత అతనికి ఒంగోలు బదిలీ అయింది. అతను ఆంధ్రాబ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ వ్యవహారాల్లో పాల్గొనేవాడు. ఈ లోపు మద్రాసు వాతావరణం నచ్చక కృష్ణ తిరిగొచ్చాడు. కృష్ణ, అతనూ ప్రజా నాట్యమండలి ఒంగోలు వేదికలపై పాటలు పాడేవారు. ఆ క్రమంలో అతనికి నల్లూరు వెంకటేశ్వరరావు పరిచయమయ్యాడు. అప్పుడాయన “ప్రజా నాట్యమండలి” ప్రకాశం జిల్లా కార్యదర్శి. మాదాల రంగారావు, టి.కృష్ణ, బాబూరావు, వందేమాతరం శ్రీనివాస్ లు అంతా నల్లూరు వెంకటేశ్వరరావు శిష్యులే.

సినిమా రంగంలో
మాదాల రంగారావు ప్రారంభించిన యువతరం కదిలింది సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లో అతను కృష్ణతో పాటు పాల్గొన్నాడు. వాళ్ళిద్దరూ చిన్న వేషాలు వేసేవారు. అతను బ్యాంకు ఉద్యోగానికి సెలవులు పెట్టి ఇవన్నీ చేసేవాడు. డబ్బింగ్, ఎడిటింగ్ కోసం మద్రాసు వెళ్ళి ఆయా దశలను పరిశీలించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత ఎర్రమల్లెలు, విప్లవ శంఖం సినిమాలలో రంగారావు ఓ స్థాయికి చేరుకున్నాడు.

తానూ దర్శకుడు కావాలన్న తపన కృష్ణలో రోజు రోజుకూ పెరిగిపోయింది. ఇద్దరు మిత్రులూ చెరో లక్షా వేసి సినిమా తీయాలనుకున్నారు. ఈ విషయం అతని తండ్రితో చెబితే మొదట్లో కాదన్నా కృష్ణతో కలసి చేస్తున్నందున అంగీకరించాడు. “ఈ తరం పిలింస్” బ్యానర్ పెట్టి నేటి భారతం సినిమాను ప్రారంభించారు. వారు తెచ్చిన రెండు లక్షలూ రికార్డింగ్ కే సరిపోయాయి. ఈ దశలో తన తండ్రికి డబ్బు అడగడం ఇష్టం లేక తెలిసిన మిత్రుల దగ్గర చిన్న చిన్న మొత్తాల్లో అప్పుచేసి, మద్రాసు తీసుకువెళ్ళేవాడు. ఈ విషయం అతని తండ్రికి తెలిసి ఎవరినీ అడగవద్దనీ తానే ఇస్తాననీ ధైర్యాన్నిచ్చాడు. తండ్రి వద్ద పొగాకు వ్యాపారం చేస్తున్న అతని తమ్ముడు రామారావు అతనికి సహకరిస్తూ ఉండేవాడు. అతను నిర్మించిన నేటి భారతం పెద్ద విజయం సాధించింది. అతను బ్యాంకు ఉద్యోగి కాబట్టి అతని పేరు కాకుండా అతని తమ్ముడి పేరు వేశాడు. తర్వాత దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు వంటి చిత్రాలు హిట్ అయ్యాయి.

తర్వాత కొంత కాలానికి కృష్ణ కేన్సర్ తో మరణించాడు. అతను బతికి ఉన్నంత వరకు బాబూరావు అతని నీడనే ఎదిగాడు. అదే సమయంలో అతని తండ్రి కూడా మరణించాడు.

డిగ్రీ తరువాత 1973లో అతని పెళ్ళి జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు కలిగారు. రెండు సినిమాలు హిట్టయ్యే సరికి, ఈ మార్గంలో నడవవచ్చునన్న నమ్మకంతో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసాడు.

అతను పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో “ప్రజాస్వామ్యం” సినిమాను తీసాడు. ఈ చిత్రంలొ అతనికి పేరొచ్చింది. మరుదూరి రాజాను “ప్రజాస్వామ్యం” సినిమా సమయంలో పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంటు గా ఉంచాడు. అతని కథ, మాటలతో “నవభారతం” సినిమాను ప్రారంభించాడు. అది కూడా హిట్ అయింది. తరువాత భారతనారి, ఎర్ర మందారం, అన్న ఇలా అతని సినిమాల ప్రస్థానం మొదలయింది. [2]
టి.కృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రేమ్‌చంద్ ను “అన్న” సినిమా సమయంలో డైరక్షన్ డిపార్టుమెంటులో చేర్చాడు. అమ్మాయి కాపురం సినిమా షూటింగ్ లో ప్రమాద వశాత్తూ ప్రేమ్‌చంద్ మరణించాడు. కృష్ణ రెండవ కుమారుడు తొట్టెంపూడి గోపీచంద్ సినిమారంగంలోకి ప్రవేశించాడు. కృష్ణ

మీద ఉన్న గౌరవంతో అత అతను యజ్ఞం సినిమాలో గోపీచంద్ ను హీరో గా పరిచయం చేసాడు.

అతను వామపక్ష భావాలతో సమాజ మార్పును కోరే సినిమాలు మాత్రమే తీయగలిగాడు. అతనికి ప్రేక్షకునిగా ఎంటర్‌టైన్‌మెంటు, ఆర్ట్ పిలింస్ అంటే యిష్టం. కామెడీ సినిమాలను కూడా ఎక్కువగా ఇష్టపడతాడు. కానీ అలాంటి సినిమాలు తీయలేదు.

అతనికి సినిమాలు చూడడం, కథల గురించి ఆలొచన చేయడం, షార్ట్ స్టోరీ పుస్తకాలు చదవడం అంటే యిష్టం. అతనిని “చిరస్మరణీయులు” సినిమా ఎంతో పభావితం చేసింది. ఇది “కయ్యూరు కామ్రేడ్స్” అనే మలయాళ నవలకు అనువాదం.

అతని సినిమాలకు ఎం.వి.ఎస్ హరనాథరావు, మరుదూరి రాజా ఎక్కువగా మాటలు రాసారు.

పురస్కారాలు
అతను నేటిభారతం, రేపటి పౌరులు, ప్రజాస్వామ్యం చిత్రాలకు నంది పురస్కారాలను స్వర్గీయ ఎన్.టి. రామారావు చేతుల మీదుగ తీసుకున్నాడు.

గాయకునిగా
అతను స్వరాజ్యం, ఎర్రమంద్రారం మొదలైన సినిమాలలో పాటలు పాడాడు.

నటునిగా
నిర్మాతగా నిలదొక్కుకున్న తరువాత టి.కృష్ణ మెమోరియల్ వాళ్ళు అతనిని విలన్ వేషం వేయమని కోరారు. కాదనలేక “నవయుగం” సినిమాలో నటించాడు. అందులో మంచి పేరొచ్చింది. ప్రేమ తపస్సు, రగులుతున్న భారతం సినిమాలలో నటించాడు. అవి ప్లాప్ అయ్యేసరికి నటనకు దూరమయ్యాడు.

వ్యక్తిగత జీవితం
అతని భార్య పేరు రమ. పిల్లలు ప్రశాంత్, ప్రవీణ్. ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ లో ఎం.ఎస్ చేసారు. పెద్ద కుమారుడు అట్లాంతాలో సాఫ్టువేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

నిర్మించిన సినిమాలు
· రణం

· ఇన్‌స్పెక్టర్ ప్రతాప్

· యజ్ఞం (2004 సినిమా)

· అమ్మాయి కోసం

· మాదాల రంగారావు

· భారతనారి

· ఎర్ర మందారం (సినిమా)

· మా ఆయన బంగారం

· ప్రజాస్వామ్యం (1987 సినిమా)

· అన్న (సినిమా)

· ఏం పిల్లో ఏం పిల్లడో

· యజ్ఞం (2004 సినిమా)

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-170

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-170
• 170-‘’నాటకం ‘’ రచయిత,నటుడు ,ఎం.ఎన్ .రాయ్ అనుచరుడు ,పెద్ద మనుషులు,గుండమ్మకధ డైలాగ్స్ ఫేం, కలం లో హాస్యం ,వ్యంగ్యం చిలికించిన ,కారుదిద్దినకాపురం దర్శకుడు –డి.వి.నరసరాజు
• డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు (జూలై 15, 1920 – ఆగష్టు 28, 2006) రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.
జననం
1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో జన్మించాడు.[1] ఇతను హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు అయిన ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. సినీ కథా రచయిత.ఈనాడు పత్రికలో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు.
నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.[2] ఈ ఇల్లు అమ్మబడును, వాపసు నాటకం రాశాడు.[3]
నరసరాజు 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. 1951లోపాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం “నాటకం” చూసి దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.[4] గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత, దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ, భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.
మరణం
2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.[5] ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య శిరీష నరసరాజు మనవరాలే.
సినిమా దర్శకుడిగా
సుప్రసిద్ధ రచయిత డి.వి.నరసరాజు గారు సినిమాలకు రాకముందు నాటకాల్లో నటించే వారు. కాని, అతి బలవంతం మీద రెండుమూడు సినిమాల్లో నటించారు. నరసరాజు గారు ఉషాకిరణ్ మూవీస్ వారి ‘కారు దిద్దిన కాపురం’ డైరెక్టు చేశారు. కథ తయారు చేసి, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాసిన తర్వాత మొత్తం నిర్మాత రామోజీరావు గారికి వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. అప్పుడు వచ్చింది ప్రశ్న. ఎవరు దర్శకుడు? అని. ఒక్క నిమిషం ఆలోచించి, మీరే డైరక్టు చెయ్యండి. మొత్తం అంటే అందులోనే వుంది కదా- అంతా మీరే చేశారు అన్నారట రామోజీరావు. నరసరాజుగారు ఆఁ? అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత ‘అబ్బే’ అన్నారట. తర్వాత రామోజీరావు గారి బలవంతంతో అంగీకరించారు. ఒక మిట్టమధ్యాహ్నం విజయగార్డెన్స్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు రావి కొండలరావు అక్కడికి వెళ్లారు. వెళితే నరసరాజు గారు కనిపించలేదు. అడిగితే, కాస్త దూరంలో వున్న చెట్టు చూపించారు. నరసరాజు గారు చెట్టు నీడన నిలబడి ఉన్నారు. రావి కొండలరావు వెళ్లి అడిగారు షాట్స్ రాసి ఇచ్చేశానయ్యా- డైలాగ్స్ ఏంలేవు. అంచేత వాళ్లు తీసేయొచ్చు. నీడగా వుందని ఇలా నించున్నాను అన్నారాయన. హాయిగా ఏసి రూమ్‌లో కూచుని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే అన్నారు రావి కొండలరావు ఆయనకున్న చనువుతో. ఆయన నవ్వి, అవుననుకో, కానీలే, ఇదొక అనుభవం. మళ్లీ డైరక్టు చేస్తానాయేం? అన్నారు నరసరాజు. అప్పుడే, పైన చెప్పిన విషయం చెప్పారు.
సినిమాలు
సినిమాలు
కథ లేదా మాటల రచయితగా
1. మనసు మమత (1990)
2. కారు దిద్దిన కాపురం (1986) దర్శకుడు కూడాను
3. వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)
4. యుగంధర్ (1979)
5. యమగోల (1975)
6. అమ్మ మనసు (1974)
7. ఇద్దరు అమ్మాయిలు (1972)
8. మూగనోము (1969)
9. బాంధవ్యాలు (1968)
10. భక్తప్రహ్లాద (1967)
11. చదరంగం (1967)
12. గృహలక్ష్మి (1967)
13. రామ్ ఔర్ శ్యామ్ (1967) కథ, స్క్రీన్ ప్లే
14. రంగుల రాట్నం (1966)
15. నాదీ ఆడజన్మే (1965)
16. రాముడు భీముడు (1964)
17. గుండమ్మ కథ (1962)
18. మన్ మౌజీ (1962)
19. మోహినీ రుక్మాంగద (1962)
20. రేణుకాదేవి మహాత్మ్యం (1960)
21. రాజమకుటం (1959)
22. దొంగరాముడు (1955)
23. పెద్దమనుషులు (1954)

భరద్వాజ చెప్పిన కబుర్లు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన రచనతో ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన ప్రసిద్ధ రచయిత డి.వి. నరసరాజు గారి శతజయంతి నేడు(జూలై 15).. డి.వి. నరసరాజు గారి పూర్తి పేరు దాట్ల వెంకట నరసరాజు.. గుంటూరు జిల్లా కోసూరు మండలం తాళ్లూరులో 1920 జూలై 15న జన్మించారు.
నరసరాజు గారి శత జయంతి సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు, విశేషాలను తెలుసుకుందాం..
కె.వి.రెడ్డి విజయా బ్యానర్‌లో ‘పాతాళబైరవి’ తీసిన తర్వాత వాహినీకి పెద్దమనుషులు కమిట్ అయ్యారు. పింగళి విజయాలో రచయితగా జీతానికి చేరడంతో గత్యంతరం లేక చక్రపాణి అనుమతి కోరారు. ఆయన ఇవ్వలేదు. మీరు రచయితను ఇవ్వకపోతే నేను సినిమా తీయలేనా అని బెజవాడ నుంచి ఓ కొత్త రచయితను తీసుకువచ్చారు. ఆయన పేరు డి.వి.నరసరాజు.
ఈ నరసరాజుగారిని కె.వి.కి తగిలించింది గుడివాడ శరత్ టాకీసు యజమాని కాజా వెంకట్రామయ్య. ఇప్పుడు ఈ థియేటరు కొడాలి నాని ఆధ్వర్యంలో ఉందనుకోండి. ఇప్పుడు విజయవాడలో కలసిపోయిన ముత్యాలంపాడు గ్రామంలో తొలి గ్రాడ్యుయేట్ దాట్ల వెంకట నరసరాజు. మొదటి నుంచి సృజనాత్మక కళల మీదే నరసరాజు దృష్టి. ఉద్యోగాలు చేయాల్సిన లంపటాలు లేకపోవడం పైగా బాగా ఆస్తి, బంధువుల దన్ను ఉండడంతోనూ… నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించారు. ‘అంతర్వాణి, నాటకం’ లాంటి సూపర్ హిట్ నాటకాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అవి చూసే ‘పెద్దమనుషులు’ చిత్రం కోసం కె.వి. పికప్ చేశారు. కె.వి.నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు నరసరాజు
కె.వి.రెడ్డి ఒకానొక సందర్భంలో విజయాధినేతలతో పొసగక బైటకు వచ్చారు. సరిగ్గా అప్పుడే.. దుక్కిపాటి మధుసూదనరావు గారు సినిమా చేయమని అడిగారు. అప్పుడు అన్నపూర్ణ కంపెనీకి కె.వి. చేసిన సినిమా ‘దొంగరాముడు’.
ఆ మూవీకీ డి.వి.నరసరాజునే రచయితగా తీసుకున్నారు. అందులో కూడా డి.వి.మార్క్ డైలాగులు పేల్తాయి. ముఖ్యంగా హీరో జైలు నుంచి విడుదలై హోటల్‌కి వెళ్లి పండితుల్ని బురిడీ కొట్టించే సీన్‌ అద్భుతంగా రాశారు. విజయా బ్యానర్‌లో కె.వి.రెడ్డి డైరక్ట్ చేసిన చిత్రాలకు మాత్రమే పింగళి నాగేంద్రరావు మాటలు రాసేవారు. మిగిలిన చిత్రాలకు ఎక్కువగా బయట రచయితలే రాసేవారు
• అలా ‘గుండమ్మ కథ’కు డి.వి.నరసరాజుతో సంభాషణలు రాయించుకున్నారు చక్రపాణి. స్క్రిప్ట్ వర్క్ ఎక్కువగా చక్రపాణే చేసుకునేవారు. ‘స్కేప్ గోట్’ అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా నరసరాజు రాసుకున్న స్క్రిప్ట్ చాలా కాలం ఏ నిర్మాతా తీసుకోలేదు. బెజవాడ లక్ష్మీ టాకీసు ఓనరు మిద్దే జగన్నాథం లాంటి వారైతే.. అది సక్సెస్ కాదని నిరాశపరిచారు కూడా. అయితే విచిత్రంగా రామానాయుడు సురేష్ మూవీస్ ప్రారంభిస్తూ కథ కోసం నరసరాజును అప్రోచ్ అయ్యారు.
నరసరాజు తన దగ్గరున్న డబుల్ యాక్షన్ కథ చెప్పారు. నాయుడుగారు ఓకే అన్నారు.
• అలా రూపొందిన ‘రాముడు భీముడు’ సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మాస్ సినిమాకు ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. విజయా, వాహినీ కాంపౌండ్ రైటర్ కావడంతో నరసరాజుగారితో ఎన్టీఆర్‌కు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన సాంఘిక చిత్రాలకు ఎక్కువగా నరసరాజుకే స్క్రిప్ట్ బాధ్యతలు అప్పగించేవారు ఎన్టీఆర్
• అలా రూపుదిద్దుకున్న చిత్రాల్లో ‘కోడలు దిద్దిన కాపురం’ ఒకటి. ఆ సినిమా కథా చర్చలు జరిగే సయమంలో నిజంగా ఆడవాళ్లు ఇంత ఇబ్బంది పడతారా రాజుగారూ అని ఎన్టీఆర్ అడిగారట. నరసరాజు సుమారు ఓ గంటన్నర పైగా వివరించారట. అప్పట్నించీ ఎన్టీఆర్ వాళ్ల ఆవిడ బసవతారకంతో వ్యవహరించే తీరులో మార్పు వచ్చిందని సాక్షాత్తు నరసరాజుగారే చెప్పారు.
• ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆడపిల్లకూ పిత్రార్జితంలో హక్కు కల్పించడం దాకా నడిచింది. అలా నరసరాజు అంటే ఎన్టీఆర్ కు అపరిమితమైన గౌరవం…గురి కూడా.
• నరసరాజుగారు చాలా ఖచ్చితమైన మనిషి. స్క్రిప్ట్ చెప్పిన సమయానికి ఇచ్చేసేవారు. ఆత్రేయలా ఇబ్బందులు పెట్టేవారు కాదు.
ఆత్రేయకు అడ్వాన్స్ ఇచ్చి ఆయన రాయక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న చాలా మంది నిర్మాతలకు నరసరాజు అభయం ఇచ్చి పని పూర్తి చేసేవారు. అలాంటి సినిమాల్లో ‘బడిపంతులు’ ఒకటి. బడిపంతులు డైలాగ్స్ కోసం డబ్బులు తీసుకున్న ఆత్రేయ రాయలేదు. ఫైనల్‌గా నరసరాజుగారే కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అయితే డైలాగులు రాయకపోయినా ఆ మొత్తానికి ‘నీ నగుమోము’ అనే ఓ అజరామర గీతాన్ని రాసి ఇచ్చారు ఆత్రేయ.
• ఎవిఎమ్ చెట్టియార్‌కు కూడా నరసరాజుగారి మీద విపరీతమైన నమ్మకం ఉండేది. ‘భక్త ప్రహ్లాద’ సినిమా కోసం చిత్రపు నారాయణమూర్తి ఎమిఎమ్ అధినేతను అప్రోచ్ అయ్యారు. నరసరాజు స్క్రిప్ట్ రాస్తానంటే తీస్తాను అని చెట్టియార్ షరతు పెట్టారు.
• చిత్రపు నారాయణమూర్తి అప్పుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఆయన పరిస్థితి చూసి సాధారణంగా పౌరాణికాలు పెద్దగా అంగీకరించని నరసరాజుగారు భక్త ప్రహ్లాదకు పనిచేశారు. ఎస్వీ రంగారావు కూడా డి.వి. గారి మాటే వినేవాడు. చిత్రపు నారాయణమూర్తి ఫ్లాపుల్లో ఉండడం వల్ల ఆయన మాట లెక్కచేసేవారు కాదు ఎస్వీఆర్. క్లైమాక్స్ సీన్ సరిగా రాకపోయే సరికి ఎస్వీఆర్‌ను మరో సారి సెట్స్‌కు రమ్మనడానికి ధైర్యం చాలలేదు. అందుకని డి.వి.నే ఆశ్రయించారు. నరసరాజు అనుకోకుండా ఎస్వీఆర్‌‌ను కలసి ఆ క్లైమాక్స్ ఏమిటండీ అలా ఉందీ… నాకు చూపించారు. మీరు బాగా డల్‌గా ఉన్నట్టు అనిపించింది. నాకెందుకులే అని ఊరుకున్నా.. మీరడిగితే రీషూట్ పెడతారు అనిచెప్పి వచ్చేశారు. అంతే.. పని అయిపోయింది. అంత లౌక్యంగా వ్యవహరించేవారు డి.వి.
• ఒక రచయితను అంగీకరించాలంటే చాలా ఆలోచించే బి.ఎన్.రెడ్డికి కూడా డి.వి.నరసరాజు అంటే ఇష్టం. బి.ఎన్. కు ప్రయోగాల మీద పెద్దగా మోజు ఉండేది కాదు. అందుకే పింగళి నాగేంద్రరావు గారి రచన నచ్చేది కాదు. పింగళి ‘గుణసుందరి కథ’కు రాసిన డైలాగులు బిఎన్ కు అస్సలు నచ్చలేదట. అయితే నరసరాజు మాత్రం బిఎన్ కు ‘రంగులరాట్నం, రాజమకుటం’ లాంటి సినిమాలకు పనిచేశారు. యమలోకపు గందరగోళంతో కూడిన బెంగాలీ సినిమా ‘జీవాంతమానుష’ రీమేక్ హక్కులు కొన్నారు పల్లవీ ప్రొడక్షన్స్ వెంకటరత్నం.
• నేరుగా తనకు సాన్నిహిత్యం ఉన్న ముళ్లపూడి దగ్గరకెళ్లి తెలుగులో రాయమన్నారు. అయ్యా అది పొలిటికల్ సెటైరికల్ డ్రామా… మనవల్ల కాదు… డి.వి.నరసరాజే దీనికి సమర్ధుడు.. అని చెప్పి రమణ గారే పంపారు. కథ నరసరాజు చేతిలో పడడంతో హీరో కూడా మారాడు. శోభన్ బాబు ప్లేస్ లో ఎన్టీఆర్ వచ్చారు. ‘యమగోల’ చేసి జనంతో ఈలలు కొట్టించుకున్నారు
• ఇక్కడ ఇంకో పిట్టకథ..నిజానికి వెంకటరత్నం ఎన్టీఆర్ దగ్గరకు పోయి ఇప్పుడు సినిమాలో ఉన్న ఎన్టీఆర్ కారక్టర్‌ను బాలకృష్ణతోనూ యముడు కారక్టర్ ఎన్టీఆర్‌తోనూ చేయించాలని తనకు ఉన్నట్టు చెప్పారు. అయితే ఎన్టీఆర్ దీనికి ఒప్పుకోలేదు.ఆ కారక్టర్‌కు బాలయ్య సరిపోడు. అది నేనే చేస్తాను. యముడుగా సత్యనారాయణను తీసుకుందాం అని సలహా చెప్పారు.
• అలా సత్యనారాయణను యముడుగా ప్రమోట్ చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. యమగోలలో చాలా పొలిటికల్ డైలాగులు పేల్చారు నరసరాజు. అప్పట్లో ఏదన్నా సినిమాలో డైలాగులు హిట్టైతే చాలు వాటిని ఎల్పీ రికార్డులుగా విడుదల చేసేవారు. ముఖ్యంగా ఎమర్జన్సీ మీద కాంగ్రెస్ పార్టీ మీద చాలా సెటైర్లు పేల్చారు నరసరాజు.
తెర మీద చెప్పేది ఎన్టీఆర్ కావడంతో ఆ తెర మీద చెప్పేది ఎన్టీఆర్ కావడంతో ఆ డైలాగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘నాటకం’ అనే నాటకంతో రంగస్థలం మీద సంచలనం సృష్టించిన డి.వి.నరసరాజు తెర మీద కూడా రెండు సినిమాల్లో నటించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించారు.
నరసరాజుగారికి ఈనాడు రామోజీరావుతో బాగా సాన్నిహిత్యం ఉండేది. ఓ సారి రామోజీరావు మీకేమండీ ఎప్పుడూ తెల్లని మడత నలగని పంచె కట్టుకుని హాయిగా ఉంటారు… మా టెన్షన్లు ఏం చెప్పమంటారు అన్నాడట. అయ్యా మీరేమో మోసే గాడిదలు… మేం మేసే గాడిదలం అదీ తేడా అనేశార్ట నరసరాజు. రామోజీరావు కూడా సినిమాలకు సంబంధించి ఏవన్నా అనుమానాలుంటే నరసరాజు సలహా తీసుకునేవాడు
• ‘కారు దిద్దిన కాపురం’ సినిమా సరిగా రావడం లేదని నరసరాజుకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన సినిమాను విజయతీరాలకు నడిపించారు.
• సినిమా పరిశ్రమలో నాన్ కాంట్రోవర్షియల్ పర్సన్ ఎవరైనా ఉంటే అది నిస్సందేహంగా నరసరాజుగారే. ఆయన ఎన్ని సినిమాలకు రాసినా నరసరాజు అనగానే గుర్తొచ్చే సినిమా మాత్రం ‘యమగోలే’.
-భరద్వాజ
• సశేషం
• రేపు శ్రీ శుభకృత్ ఉగాది శుభా కాంక్షలతో
• మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-171

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-171
• 171-కారుదిద్దిన కాపురం ఫేం –హాస్యనటి –మమత
ఆమె 1978లో తొలిసారిగా భూమి కోసం చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, హాస్య నటిగా సినీ ప్రియులను అలరించిన నటీమణి మమత (55) చెన్నైలో మరణించారు. సోమవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తెలుగు చిత్రాలతో పాటు దక్షిణాది భాషల చిత్రాలన్నింటా మమత హాస్యనటిగా రాణించారు. కారుదిద్దిన కాపురం చిత్రంలో మంచి నటన కనబరచి ప్రశంసలందుకున్న మమత, చెన్నైలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. దాదారు 250కు పైగా చిత్రాల్లో నటించిన మమత రాజబాబు, నాగేష్ మరియు అల్లు రామలింగయ్య వంటి ప్రముఖ హాస్యనటులందరి సరసనా నటించారు.
తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు మారిన తర్వాత కూడా ఆమె చెన్నైలోనే ఉంటూ సినిమాలకు, సీరియళ్లకు డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. ఆమె గజదొంగ, చుట్టాలున్నారు జాగ్రత్త వంటి తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె మృతికి చెన్నైలోని డబ్బింగ్ కళాకారులు సంతాపం ప్రకటించారు.
నటించిన చిత్రాలు:
• *భూమి కోసం
• *గజదొంగ,*
• *చుట్టాలున్నారు జాగ్రత్త
• ౧౯౯౪ : నిరీక్శే(కావేరి)
• ౧౯౮౯ : చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళం
• ౧౯౮౬ : కారు దిద్దన కాపురం.
• ౧౯౮౫ : మహా శక్తిమాన్.
• ౧౯౮౧ : గడసరు అత్తః సోగోసరి కోడలు

•   సశేషం –
• మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-2ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169

·         169-సహాయ సంగీత దర్శకురాలు ,రచయిత చలం తమ్ముడికూతురు –‘’తీయని వెన్నెల రేయి ,కాదుసుమా కలకాదుసుమా ‘’పాటల ఫేం –వక్కలంక సరళ

·       –వక్కలంక సరళ (1927 – 1999[1] తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని ‘కాదు సుమా కల కాదు సుమా’ పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.[2] ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే మద్రాసులో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, చలం (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు[3] సరళ 1927, ఆగష్టు 8 న మద్రాసులో సుందరమ్మ, గోపాలరావు దంపతులకు జన్మించింది. ఈమె తల్లి సుందరమ్మ కూడా గాత్ర సంగీత కళాకారిణే.

·         ఆమెకు అలనాటి సినీనటి అంజలీదేవికి మంచి స్నేహితురాలు. అంజలీదేవి మొదటిసినిమా బాలరాజులో ‘ఇది తీయని వెన్నెల రేయి’ పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి ‘స్వప్నసుందరి‘ తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.[4] ఈమే కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మభూషణ గ్రహీత స్వప్నసుందరి.

·         ఘంటసాలతో కలిసి సరళ, కాదు సుమా కల కాదు సుమా’ పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు ఘంటసాలతో పెళ్ళికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో, ఘంటసాలకు మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగింది.[5]

·         సరళ వివాహం అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.[6]

·         సరళ కూతురు స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[1][7]

·         ఈమె ఆలపించిన తెలుగు సినిమా గీతాల జాబితా

విడుదల సం.సినిమా పేరుపాటఇతర గాయకులుసంగీత దర్శకుడురచయిత
1948బాలరాజుతీయనివెన్నెల రేయి ఎడబాయని వెన్నెల హాయీఘంటసాలసముద్రాల సీనియర్
1949కీలుగుర్రంఅహా ఓహో ఎంతానందంబాయెనహా ఊహాతీతముగాఘంటసాలతాపీ
1949కీలుగుర్రంకాదుసుమా కలకాదుసుమా అమృతపానమునుఘంటసాలఘంటసాలతాపీ
1949రక్షరేఖబిడియమా మనలో ప్రియతమా సఖా బిగువ చాలు నాతోఓగిరాల రామచంద్రరావుబలిజేపల్లి
1949లైలా మజ్నుఅనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానాభానుమతిసి.ఆర్.సుబ్బరామన్సముద్రాల సీనియర్
1952సింగారిశుద్ధం చెయ్యండోయ్ తొలంచి శుద్ధం చెయ్యండోయ్తంగవేలు బృందంఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్
టి.ఎ.కళ్యాణం
1952మరదలు పెళ్ళిపిలిచే గోదావరోడ్డు నూరూరించే బందరు లడ్డుచిత్తూరు నాగయ్య,
టంగుటూరి సూర్యకుమారి
శ్రీశ్రీ
1953అమరకవిజి.రామనాధన్,
టి.కె.కుమారస్వామి

 

·          

·          

సారంగదేవ్ సరళగురించి రాసిన విశేషాలు

·         మన మధుర గాయకులు – వక్కలంక సరళ

·         అలనాటి మధుర గాయకుల మీద తెలుగు స్వతంత్ర వార పత్రికలో  ప్రచురితమైన వ్యాసాలను (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) వెలికితీసి కొన్ని పాటలు జోడించి ఈ శీర్షిక ద్వారా 15 మంది గాయనీ గాయకుల వివరాలు వెలుగులోకి తేవటం జరిగింది. ఈ వ్యాసాలు వ్రాసిన “సారంగదేవ” రజని గారని శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు వ్రాసిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. ఈ మధుర గాయకులు అందరూ ఆకాశవాణి వారికి పాడటం జరిగింది. సినిమా పాటలు మినహాయిస్తే ఈ వ్యాసాల్లో పేర్కొన్న చాలా రేడియో కార్యక్రమాలు, గేయాలు లభించటం లేదు. ఆకాశవాణి వారి వద్ద కూడా ఉన్నాయో లేదో తెలియదు. చివరగా వక్కలంక సరళ గారి మీద వచ్చిన వ్యాసం చూడండి. ముందు ముందు, ఇతర గాయనీ గాయకుల మీద లభ్యమైన వ్యాసాలు, వివరాలు ఈ శీర్షిక ద్వారా అందించటానికి ప్రయత్నిస్తాను

·         కూచిపూడి ,భరతనాట్యం ,కొరియోగ్రాఫర్,గాయని,పద్మభూషణ్ -స్వప్నసుందరి

·         గాయని వక్కలంక సరళ కుమార్తె స్వప్నసుందరి కూచిపూడి భారత నాట్యాలలో అగ్రశ్రేణి కళా కారిణి .కొరియోగ్రాఫర్, గాయని .భారత ప్రభుత్వం చేత 2003లో ‘’పద్మభూషణ్’’ పురస్కార గ్రహీత .సాహిత్య కళాపరిషత్ ,సంగీత నాటకాకాడేమి పురస్కారగ్రహీతకూడా .’’ది వరల్డ్ ఆఫ్ కూచిపూడి డాన్స్ ‘’ట్రేసింగ్ ది రూట్స్ ఆఫ్ దిక్లాసికల్ డాన్స్ ‘’గ్రంథాల రచయిత్రి .ఢిల్లీ లో ‘’కూచిపూడి డాన్స్ సెంటర్ ‘’సంస్థాపకురాలు .మద్రాస్ లో జన్మించింది ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ లలో ఉంటుంది .

·         తొమ్మిదవ ఏట నాయనమ్మ ప్రోత్సాహం తో కూచిపూడి భరతనాట్యం  నేర్చి,విశాఖపట్నం వెళ్లి నాట్యాచార్య పసుమర్తి సీతారామయ్య గారివద్ద శిక్షణ పొందింది .తండ్రికి ఢిల్లీ బదిలీ అయితే గురువుగారి ని తీసుకువెళ్ళి నృత్యం వదిలిపెట్టకుండా అభ్యసించింది .అప్పటిదాకా యామినీ కృష్ణమూర్తి విశేష ప్రాముఖ్యం పొంది ,వెనక్కి తగ్గాక స్వప్నసుందరికి అవకాశాలు వెన్నంటి వచ్ఛి 15వ ఏట మొదటి ప్రదర్శన ఇచ్చింది .నృత్యం తో పాటు విద్యా ,గాన సంబంధ విషయాలు చేర్చిన తోలి కళా కారిణి గా విఖ్యాతి చెందింది..విలాశీ నాట్యం మొదలైన పురాతన సంప్రదాయ నృత్యాలకు జీవంపోసింది .నృత్యంలో ఆమె చేసిన పరిశోధన అనితర సాధ్యమైంది .అతి చిన్న వయసులో పద్మభూషణ్ పొందిన అదృష్టవంతురాలు .ఆమె సృజనకు అవదులు లేవని పిస్తాయి  .

·           1977లోవ్యంగ్యాత్మక  ‘’కిస్సా కుర్సీ కా ‘’హిందీ సినిమాలో స్వప్నసుందరి అందులోను ఇందిరాగాంధీ ఎమర్జెన్సి కాలం లో ఈ సినిమాలో డాన్స్ చేసింది .సినిమాను నిషేధించింది ప్రభుత్వం .తర్వాత ఎప్పుడో విడుదలైంది .నిరంతర క్రియాశీలిగా ఉండటం స్వప్న సుందరికి అత్యంత ఇష్టం .ఆంధ్రుల అమ్మాయి విశ్వ వేదికపై కూచిపూడి భారతనాట్యాలకు   పట్టాభి షేకం చేస్తూ మనకు గర్వకారణం గా ఉంది .

·           మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22-ఉయ్యూరు

·          

·         సశేషం

·         మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169
• 169-సహాయ సంగీత దర్శకురాలు ,రచయిత చలం తమ్ముడికూతురు –‘’తీయని వెన్నెల రేయి ,కాదుసుమా కలకాదుసుమా ‘’పాటల ఫేం –వక్కలంక సరళ
• క్కలంక సరళ (1927 – 1999) [1] తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని ‘కాదు సుమా కల కాదు సుమా’ పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.[2] ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే మద్రాసులో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, చలం (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు[3] సరళ 1927, ఆగష్టు 8 న మద్రాసులో సుందరమ్మ, గోపాలరావు దంపతులకు జన్మించింది. ఈమె తల్లి సుందరమ్మ కూడా గాత్ర సంగీత కళాకారిణే.
• ఆమెకు అలనాటి సినీనటి అంజలీదేవికి మంచి స్నేహితురాలు. అంజలీదేవి మొదటిసినిమా బాలరాజులో ‘ఇది తీయని వెన్నెల రేయి’ పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి ‘స్వప్నసుందరి’ తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.[4] ఈమే కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మభూషణ గ్రహీత స్వప్నసుందరి.
• ఘంటసాలతో కలిసి సరళ, కాదు సుమా కల కాదు సుమా’ పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు ఘంటసాలతో పెళ్ళికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో, ఘంటసాలకు మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగింది.[5]
• సరళ వివాహం అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.[6]
• సరళ కూతురు స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[1][7]
• ఈమె ఆలపించిన తెలుగు సినిమా గీతాల జాబితా
విడుదల సం. సినిమా పేరు పాట ఇతర గాయకులు సంగీత దర్శకుడు రచయిత
1948 బాలరాజు
తీయనివెన్నెల రేయి ఎడబాయని వెన్నెల హాయీ ఘంటసాల
సముద్రాల సీనియర్
1949 కీలుగుర్రం
అహా ఓహో ఎంతానందంబాయెనహా ఊహాతీతముగా ఘంటసాల తాపీ
1949 కీలుగుర్రం కాదుసుమా కలకాదుసుమా అమృతపానమును ఘంటసాల ఘంటసాల తాపీ
1949 రక్షరేఖ
బిడియమా మనలో ప్రియతమా సఖా బిగువ చాలు నాతో ఓగిరాల రామచంద్రరావు బలిజేపల్లి
1949 లైలా మజ్ను
అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా భానుమతి సి.ఆర్.సుబ్బరామన్
సముద్రాల సీనియర్
1952 సింగారి
శుద్ధం చెయ్యండోయ్ తొలంచి శుద్ధం చెయ్యండోయ్ తంగవేలు బృందం ఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్
టి.ఎ.కళ్యాణం
1952 మరదలు పెళ్ళి
పిలిచే గోదావరోడ్డు నూరూరించే బందరు లడ్డు చిత్తూరు నాగయ్య,
టంగుటూరి సూర్యకుమారి
శ్రీశ్రీ
1953 అమరకవి
జి.రామనాధన్,
టి.కె.కుమారస్వామిసారంగదేవ్ సరళగురించి రాసిన విశేషాలు
• మన మధుర గాయకులు – వక్కలంక సరళ
• అలనాటి మధుర గాయకుల మీద తెలుగు స్వతంత్ర వార పత్రికలో  ప్రచురితమైన వ్యాసాలను (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) వెలికితీసి కొన్ని పాటలు జోడించి ఈ శీర్షిక ద్వారా 15 మంది గాయనీ గాయకుల వివరాలు వెలుగులోకి తేవటం జరిగింది. ఈ వ్యాసాలు వ్రాసిన “సారంగదేవ” రజని గారని శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు వ్రాసిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. ఈ మధుర గాయకులు అందరూ ఆకాశవాణి వారికి పాడటం జరిగింది. సినిమా పాటలు మినహాయిస్తే ఈ వ్యాసాల్లో పేర్కొన్న చాలా రేడియో కార్యక్రమాలు, గేయాలు లభించటం లేదు. ఆకాశవాణి వారి వద్ద కూడా ఉన్నాయో లేదో తెలియదు. చివరగా వక్కలంక సరళ గారి మీద వచ్చిన వ్యాసం చూడండి. ముందు ముందు, ఇతర గాయనీ గాయకుల మీద లభ్యమైన వ్యాసాలు, వివరాలు ఈ శీర్షిక ద్వారా అందించటానికి ప్రయత్నిస్తాను
• సశేషం
• మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22


Posted in రచనలు, సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-168

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-168

· 168-‘’పగిలిన గోడలు’’ నాటకానికి ‘’బహు’’బహుమతులు పొంది,అతితక్కువకాలం లో అత్యధిక చిత్రాలలో నటించిన కరుడుకట్టిన విలన్ ,కారక్టర్ నటుడు –త్యాగరాజు

జీవిత విశేషాలు
ఇతడు 1941లో వరంగల్ జిల్లా హన్మకొండలోన టి.ఆర్‌.నారాయణస్వామి నాయుడు, యతిరాజమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని పూర్తి పేరు పగడాల త్యాగరాజు నాయుడు. ఇతని విద్యాభ్యాసం వరంగల్‌, హైదరాబాదు నగరాల్లో జరిగింది. బాల్యం నుండే క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ఆసక్తి కనబరచి కాలేజీ రోజుల్లో క్రీడల్లో ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు. ఇంటర్‌ కాలేజీ క్రీడోత్సవాల్లో పాలు పంచుకుని చాలా బహుమతులు పొందడమే కాక కాలేజీ తరపున క్రికెట్‌ టీముకు కెప్టెన్‌గా వ్యవహరించేవాడు. క్రీడల పట్ల ఎంత శ్రద్ధాసక్తులు ఉండేవో నటన పట్ల కూడా ఇతనికి అంతే ఆసక్తి ఉండేది. మొదటిసారిగా పదేళ్ల వయసులో సికిందరాబాదు గవర్నమెంట్‌ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవాల్లో ఒక నాటకంలో ఆడపిల్ల వేషం వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ నాటకాన్ని చూసిన అప్పటి హైదరాబాదు స్టేట్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అభినందిస్తూ ప్రత్యేక బహుమతి అందజేశారు. తరువాత వరంగల్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు చాలా నాటకాల్లో నటించి పేరు తెచ్చుకోవడమే గాక చాలా నాటకాలకు దర్శకత్వం వహించి జిల్లా స్థాయి నాటకాల్లో ఉత్తమ నటుడు అవార్డులందుకున్నాడు. కాలేజీలో చదివే రోజుల్లోనే నాటకాలంటే ఇతనికి ఒక వ్యసనంగా మారింది. తన మిత్రులతో కలిసి పగిలిన గోడలు అనే నాటకాన్ని అంతర్‌ విశ్వవిద్యాలయాల నాటకోత్సవాల్లో ప్రదర్శించాలనుకున్నాడు. కానీ ఇంతలో తనకు ఇవ్వవలసిన వేషం వేరొకరికి ఇచ్చి తనను తప్పించారు. అప్పటికే కాలేజీ సాంస్కృతిక విభాగానికి కన్వీనర్‌గా ఉన్న తనకు వేషం లేకపోవడమేమిటని అడగడంతో అదే నాటకంలో ఒక రిక్షావాడి వేషం ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ పోటీల్లో, వేంకటేశ్వర, ఉస్మానియా వర్సిటీలు కూడా పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఇతని ‘పగిలిన గోడలు’ నాటకానికి ఉత్తమ నాటకం, ఉత్తమ స్క్రిప్టు, ఉత్తమ నటుడు బహుమతులతో పాటు త్యాగరాజు పోషించిన రిక్షావాడి పాత్రకు ఉత్తమ సహాయనటుడి బహుమతి వచ్చింది. ఒక నాటకానికి అన్ని బహుమతులు రావడం ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో అదే మొదటిసారి. రిక్షావాడి పాత్ర పోషణను మెచ్చుకుంటూ ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ టెలిగ్రాం ద్వారా అభినందనలు తెలిపితే, రిజిస్ట్రార్‌ కూర్మా వేణు గోపాలస్వామి నాయుడు ఏకంగా తమ యూనివర్సిటీలోనే ఎం.ఎ.చదవమని అడిగాడు. కానీ త్యాగరాజు మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగానే తిరస్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఎం.ఎ., ఎం.ఫిల్‌., ఎల్‌.ఎల్‌.బి. చేశాడు. త్యాగరాజు నాటకాల పట్ల ఉన్న ఆసక్తితో వరంగల్‌లో మిత్రులందరితో కలిసి కాకతీయ కళాసమితి అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ పక్షాన చాలా నాటకాలు వేశాడు[1].

సినిమా రంగం
నాటక రంగంలో త్యాగరాజు కృషిని, నటుడిగా ప్రదర్శించే ప్రతిభను గుర్తించి ఇతని స్నేహితులు సినిమాలలో ప్రయత్నించమని ప్రోత్సహించారు. మద్రాసు వెళ్లి దర్శకుడు ప్రత్యగాత్మను కలిసి సినిమాలలో నటించాలనే తన అభిలాషను వ్యక్తం చేశాడు. ప్రత్యగాత్మ తాను దర్శకత్వం వహించిన మంచి మనిషి చిత్రంలో విలన్‌గా అవకాశం ఇచ్చాడు. ఆవిధంగా ఇతనికి 1964లో తొలి సినిమా అదీ ఎన్.టి.ఆర్.తో కలిసి నటించే అవకాశం లభించింది. ఆ వెంటనే గుత్తా రామినీడు ‘పల్నాటి యుద్ధం’ (1966)లో వీరభద్రుడి వేషం, రంగుల రాట్నం (1967)లో వాణిశ్రీ తండ్రి వేషంతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తరువాత ఇతనికి పాతికేళ్లకు పైగా తన సినీజీవితంలో వెనక్కి తిరిగి చూసుకొనే అవసరమే కలుగలేదు. బందిపోటు దొంగ, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వేషాలకు త్యాగరాజు పెట్టింది పేరుగా చలామణి అయ్యాడు. ప్రతినాయక పాత్రలో కరుడుగట్టిన విలన్‌ వేషాలు వేయడంలో తనకు తానే సాటి రాగలడనే పేరు తెచ్చుకున్న త్యాగరాజు ‘పాప కోసం’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ వంటి చిత్రాల్లో సాత్విక పాతలు ధరించి ప్రేక్షకుల సానుభూతిని పొందాడు కూడా. ఇతడు కౌబాయ్, క్రైమ్‌ చిత్రాలతో పాటు జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో మొత్తం 400 చిత్రాలకు పైగా నటించాడు[1].

నటించిన సినిమాలు
త్యాగరాజు నటించిన సినిమాల పాక్షిక జాబితా:

 1. ప్రేమ ఖైదీ (1991)
 2. వీరూ దాదా (హిందీ) (1990)
 3. అయ్యప్పస్వామి మహత్యం (1989)
 4. శ్రీరామచంద్రుడు (1989) – ఫణీంద్రరావు
 5. ఊరేగింపు (1988)
 6. నేనే రాజు – నేనే మంత్రి (1987)
 7. విశ్వనాథ నాయకుడు (1987)
 8. తాండ్ర పాపారాయుడు (1986)
 9. ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
 10. పరశురాముడు (1986)
 11. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
 12. మేరా జవాబ్ (హిందీ) (1985)
 13. బాబులుగాడి దెబ్బ (1984)
 14. అమాయకుడు కాదు అసాధ్యుడు (1983)
 15. ఆంధ్రకేసరి (1983)
 16. ధర్మ పోరాటం (1983)
 17. పటాలం పాండు (1981)
 18. ధర్మం దారి తప్పితే (1980)
 19. మూగకు మాటొస్తే (1980)
 20. యముడు (1980)
 21. రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
 22. శివమెత్తిన సత్యం (1980)
 23. సర్కస్ రాముడు (1980)
 24. సూపర్ మేన్ (1980)
 25. ఆడదంటే అలుసా (1979)
 26. గంగా భవానీ (1979)
 27. గంధర్వ కన్య (1979)
 28. పంచభూతాలు (1979)
 29. మూడు పువ్వులు ఆరు కాయలు (1979)
 30. రాముడే రావణుడైతే (1979)
 31. హేమా హేమీలు (1979)
 32. కరుణామయుడు (1978)
 33. కేడీ నంబర్ 1 (1978)
 34. దొంగల దోపిడీ (1978)
 35. పట్నవాసం (1978)
 36. ముగ్గురూ ముగ్గురే (1978)
 37. లాయర్ విశ్వనాథ్ (1978)
 38. చిల్లర దేవుళ్లు (1977)
 39. జడ్జిగారి కోడలు (1977)
 40. జీవిత నౌక (1977)
 41. మనవడి కోసం (1977)
 42. మనుషులు చేసిన దొంగలు (1977)
 43. ఇద్దరూ ఇద్దరే (1976)
 44. ఈ కాలపు పిల్లలు (1976)
 45. కొల్లేటి కాపురం (1976)
 46. దొరలు దొంగలు (1976)
 47. నా పేరే భగవాన్ (1976)
 48. నిజం నిద్రపోదు (1976)
 49. నేరం నాది కాదు ఆకలిది (1976)
 50. పాడవోయి భారతీయుడా (1976)
 51. భలే దొంగలు (1976)
 52. మా దైవం (1976)
 53. వేములవాడ భీమకవి (1976)
 54. సీతా కళ్యాణం (1976) – పరశురాముడు
 55. అందరూ మంచివారే (1975)
 56. అన్నదమ్ముల అనుబంధం (1975)
 57. ఆస్తికోసం (1975)
 58. నాకూ స్వతంత్రం వచ్చింది (1975)
 59. వయసొచ్చిన పిల్ల (1975)
 60. అల్లూరి సీతారామరాజు (1974) -బాస్టియన్
 61. కన్నవారి కలలు (1974)
 62. రామ్ రహీం (1974)
 63. ఒక నారి – వంద తుపాకులు (1973) – సర్దార్
 64. గాంధీ పుట్టిన దేశం (1973)
 65. జీవన తరంగాలు (1973)
 66. పంజరంలో పసిపాప (1973) – కిల్లర్
 67. మంచివాళ్ళకు మంచివాడు (1973)
 68. విచిత్ర వివాహం (1973)
 69. కలవారి కుటుంబం (1972)
 70. కొరడారాణి (1972)
 71. చిట్టి తల్లి (1972)
 72. నిజం నిరూపిస్తా (1972)
 73. పిల్లా? – పిడుగా? (1972)
 74. బుల్లెమ్మ బుల్లోడు (1972)
 75. భలే మోసగాడు (1972)
 76. మాయింటి వెలుగు (1972)
 77. మావూరి మొనగాళ్ళు(1972)
 78. రాజమహల్ (1972)
 79. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972) – నరకాసురుడు
 80. అడవి వీరులు (1971)
 81. అనూరాధ (1971)
 82. కత్తికి కంకణం (1971)
 83. కిలాడి బుల్లోడు (1971)
 84. జాతకరత్న మిడతంభొట్లు (1971)
 85. జేమ్స్ బాండ్ 777 (1971)
 86. దెబ్బకు ఠా దొంగల ముఠా (1971)
 87. నమ్మకద్రోహులు (1971) – రాజా
 88. మాస్టర్ కిలాడి (1971)
 89. మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (1971)
 90. మోసగాళ్లకు మోసగాడు (1971)
 91. రివాల్వర్ రాణి (1971)
 92. విక్రమార్క విజయం (1971)
 93. శ్రీకృష్ణసత్య (1971)
 94. కథానాయిక మొల్ల (1970)
 95. కోడలు దిద్దిన కాపురం (1970)
 96. ఖడ్గవీర (1970)
 97. జన్మభూమి (1970)
 98. ద్రోహి (1970)
 99. పగ సాధిస్తా (1970)

100.మాయని మమత (1970)

101.రక్తసింధూరం (1970)

102.రౌడీరాణి (1970)

103.అగ్గి వీరుడు (1969)

104.కదలడు వదలడు (1969) -డిండిమ వర్మ

105.గండర గండడు (1969) – కాలకంఠుడు

106.గండికోట రహస్యం (1969)

107.టక్కరి దొంగ చక్కని చుక్క (1969) – ఇన్‌స్పెక్టర్ కామేశం

108.పంచకల్యాణి దొంగలరాణి(1969)

109.మహాబలుడు (1969)

110.ఎవరు మొనగాడు (1968)

111.దేవకన్య (1968)

112.పాప కోసం (1968) – కిష్టయ్య

113.బంగారు పంజరం (1968)

114.బందిపోటు దొంగలు (1968) – పాపన్న

115.భలే మొనగాడు (1968)

116.మంచి మిత్రులు (1968)

117.చిక్కడు దొరకడు (1967)

118.పట్టుకుంటే పదివేలు (1967)

119.మంచి కుటుంబం (1967)

120.రంగులరాట్నం (1967)

121.రక్తసింధూరం (1967)

122.పల్నాటి యుద్ధం (1966) – వీరభద్రుడు

123.హంతకులొస్తున్నారు జాగర్త (1966)

124.మంచి మనిషి (1964)

మరణం
అతి తక్కువ కాలంలో అత్యధిక చిత్రాలలో నటించిన త్యాగరాజు తన 51వ ఏట 1991 ఫిబ్రవరి 24న హైదరాబాదులోని అశోక్‌నగర్‌లో ఉన్న తన సోదరుని ఇంట్లో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు[1].

హెచ్ .రమేష్ బాబు తెలియజేసిన విషయాలు –

· ఆర్టిస్టుగా ఎంతకాలం పరిశ్రమలో ఉన్నామనేదే ముఖ్యమని” ఒక సందర్భంలో చెప్పుకున్న త్యాగరాజు నిజంగా మంచి ఆర్టిస్టు. తెలుగు సినీ చరిత్రలో విలక్షణ విలన్‌గా త్యాగరాజు స్థానం సుస్థిరం.
కొత్త పెళ్లి కూతురి భయం

· కొత్త పెళ్లి కూతురి భయం
ఒకసారి ”మున్సబుగారి అల్లుడు” (1985) సినిమా అవుట్‌ డోర్‌ షఉటింగ్‌ జరుపుకుంటున్నప్పుడు ఆ చిత్ర దర్శక నిర్మాత విజరుబాబు స్నేహితుడి ఇంట్లో భోజన వసతులు ఏర్పాటు చేశారు. అందరినీ భోజనానికి ఇంటికి పిలిచినా ఆయన మన వాడిని మాత్రం ఇంటికి రానీయకుండా ఉన్నచోటనే ఉంచి ప్రత్యే కంగా భోజనాలు పంపేవాడు. ఇదేమిటి అనడిగితే ‘సినిమాల్లో మీరు చూపే విలనీ చూసి వాళ్ల అమ్మాయిలు వడ్డించడానికి భయపడుతున్నార’ట అన్నాడాయన. ప్రేక్షకులను అంతలా భయపెట్టే విలనీ వేషాలు వేశారాయన. అలాగే పెళ్లయిన కొత్తలో భార్యను వెంట పెట్టుకుని ”గాంధీ పుట్టిన దేశం” ప్రివ్యూకు వెళ్ళాడు రాజు. చాలా సంతోషంగా ప్రివ్యూ థియేటర్‌లోకి వెళ్లనైతే వెళ్ళారు గానీ తీరా లోపల ఆ చిత్రంలో త్యాగరాజు హీరోయిన్‌ను అత్యా చారం చేసే దృశ్యాలు చూసిన ఆ కొత్త పెళ్లి కూతురు త్యాగరాజును భయంతోనూ, ఆందోళనతోనూ చూసింది. ఇంటికి వచ్చే వరకూ, ఆ తరువాత కూడా ఆమె కొద్ది రోజులు త్యాగరాజును చూసి భయపడేది. అంతలా ఉండేది ఆయన సహజ నటన. ఆ తరువాత తానెప్పుడూ భార్యతో కలిసి తను నటించిన సినిమా చూడటానికి వెళ్ళలేదాయన. ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా చెప్పుకొన్నారొక వ్యాసంలో.
త్యాగరాజు సినిమాలు
ఇంకా త్యాగరాజు నటించిన సినిమాల్లో కొన్ని వరుసగా, ‘హంతకులొస్తున్నారు జాగ్రత్త’ (1966), ‘ఎవరు మొనగాడు’, ‘మంచి కుటుంబం’, ‘మంచి మిత్రులు’ (1968), ‘బందిపోటు దొంగలు’, ‘టక్కరి దొంగ చక్కని చుక్క’, ‘బంగారు పంజరం’ (1969), ‘రౌడీరాణి’, ‘మాయని మమత’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘కథానాయిక మొల్ల’, ‘పగ సాధిస్తా’, ‘కొల్లేటి కాపురం’, ‘పాడవోయి భారతీయుడా’ (1970), ‘పట్టుకుంటే పదివేలు’, ‘నమ్మక ద్రోహులు’, ‘అడవి వీరులు’ (1971), ‘రాజమహల్‌’, ‘అనురాధ’, ‘మాయింటి వెలుగు’, ‘బుల్లెమ్మ బుల్లోడు’, ‘కలవారి కుటుంబం’ (1972), ‘ఒకనారి వంద తుపాకులు’, ‘విచిత్ర వివాహం’, ‘జీవన తరంగాలు’, ‘పంజరంలో పసిపాప’ (1973), ‘కన్నవారి కలలు’ (1974), ‘అందరూ మంచివారే’, ‘వయసొచ్చిన పిల్ల’, ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘నాకు స్వాతంత్య్రం వచ్చింది’ (1975), ‘వేములవాడ భీమకవి’, ‘నా పేరే భగవాన్‌’, ‘నేరం నాది కాదు ఆకలిది’, ‘ఇద్దరూ ఇద్దరే’, ‘మా దైవం’ (1976), ‘జడ్జిగారి కోడలు’, ‘చిల్లర దేవుళ్లు’, ‘జీవిత నౌక’ (1977), ‘లాయర్‌ విశ్వనాథ్‌’, ‘ముగ్గురూ ముగ్గురే’, ‘కె.డి.నెం.1’, ‘కరుణామయుడు’, ‘పట్నవాసం’ (1978), ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’, ఆడదంటే అలుసా’ (1979), ‘యముడు’, ‘పరశురాముడు’, ‘సూపర్‌మెన్‌’, ‘రాం రాబర్ట్‌ రహీం’, ‘శివమెత్తిన సత్యం’, ‘సర్కస్‌ రాముడు’ (1980), ‘ధర్మ పోరాటం’, ‘ఆంధ్ర కేసరి’ (1983), ‘తాండ్ర పాపారాయుడు’, ‘ధర్మ పీఠం దద్దరిల్లింది’ (1986), ‘విశ్వనాథ నాయకుడు’, ‘నేనే రాజు నేనే మంత్రి’ (1987), ‘అయ్యప్పస్వామి మహత్మ్యం’ (1989) తెలుగు చిత్రాలు, ఇంకా తమిళ, మలయాళ, ‘మేరా జవాబ్‌’ (1985), ‘వీరూదాదా’ (1990) వంటి హిందీ మొత్తం కలిపి 400 సినిమాల్లో నటించాడు త్యాగరాజు. ఆయన కనిపించిన చివరి చిత్రం ‘ప్రేమఖైది’ (1991).
సెల్‌ : 94409 25814

 • హెచ్‌.రమేష్‌బాబు

· విల‌న్ క్యారెక్ట‌ర్ల‌లో ఉన్న‌త స్థాయిలో రాణించి, వాటిపై త‌న‌దైన ప్ర‌త్యేక ముద్ర వేసిన న‌టుడు త్యాగ‌రాజు. సినీ రంగంలో అడుగుపెట్టి తొలి సినిమాలోనే మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావును ఢీకొట్టే విల‌న్ పాత్ర‌ను చేసి, మెప్పించారాయ‌న‌. 1964లో వ‌చ్చిన ఆ సినిమా ‘మంచి మ‌నిషి’. ఆ త‌ర్వాత రెండున్న‌ర ద‌శాబ్దాల కెరీర్‌లో ఎన్నో సాంఘిక‌, జాన‌ప‌ద‌, పౌరాణిక‌, చారిత్ర‌క‌, కౌబాయ్ చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టే ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో గొప్ప‌గా రాణించి, వారి హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం సంపాదించారు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ శుభ కృత్ ఉగాది పంచాంగ శ్రవణం –సాహితీ బంధువులకు శ్రీ  శుభ కృత్ ఉగాది శుభా కాంక్షలు 

శ్రీ శుభ కృత్ ఉగాది పంచాంగ శ్రవణం 
–సాహితీ బంధువులకు శ్రీ  శుభ కృత్ ఉగాది శుభా కాంక్షలు 

 1-శ్రీ శుభ కృత్ ఉగాది పంచాంగ శ్రవణం ఉగాది రోజు 2-4-22 శనివారం ఉదయం 8-30గం.లకు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లోనూ ,

2-ఉదయం 11గం .లకు సరసభారతి ప్రత్యక్ష ప్రసారంగానూ 

3-సాయంత్రం 6గం.లకు గండిగుంట శ్రీ దత్త దేవాలయం లోనూ జరుగును 

4-సాయంత్రం 4గం లకు బృహదారణ్య కోపనిషత్  సరసభారతి ప్రత్యక్ష ప్రసారంగా జరుగుతుంది 

 గబ్బిట దుర్గాప్రసాద్ -31-3-22

Posted in సమయం - సందర్భం | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-167

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-167

· 167-విలనీ’’’ కి కొత్తర్ధం చెప్పిన ,’’అదే మామా మన తక్షణ కర్తవ్యమ్ ‘’ బాబులుగాడి దెబ్బ గోల్కొండ అబ్బా’డైలాగ్ ఫేం ,’’నాన్నగారు’’ పాత్రధారి –ఆర్ .నాగేశ్వరావు

ఆర్‌.నాగేశ్వరరావుగా ప్రసిద్ధుడైన తెలుగు సినిమా నటుని పూర్తి పేరు రాజనాల నాగేశ్వరరావు (1928 – 1959). విలన్‌ అంటే గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు ఉన్న వ్యక్తులు మన కళ్ళ ముందు మెదులుతారు. అయితే అవేమీ అక్కరలేకుండా విలన్‌ పాత్రధారి కూడా హీరో తరహాలో సాత్వికంగా కనబడవచ్చని, అతనిలోని క్రూరత్వానికి, బయటకు కనిపించే ఆకారానికి సంబంధం లేదని ‘విలనీ’కి కొత్త అర్ధం చెప్పిన విలక్షణ నటుడు ఆర్‌.నాగేశ్వరరావు. “బాబులు గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి” అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ అప్పట్లో అందరి నోటా వినిపించేది. అదే నోటితో ఆయన చెప్పిన “అదే మామా మన తక్షణ కర్తవ్యం” అంటూ పలికిన డైలాగ్‌ కూడా ఇప్పటికీ మరచిపోలేం. మొదటి డైలాగ్‌ అన్నపూర్ణా వారి దొంగరాముడు చిత్రంలోనిది కాగా, రెండవది విజయా వారి మాయాబజార్ చిత్రంలోనిది. కౄరమైన పాత్రలు పోషించడంలో ఆర్‌.నాగేశ్వరరావు తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇల్లరికం, ఇంటిగుట్టు, ఇలవేల్పు, శభాష్‌ రాముడు వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. విలన్‌ పాత్రలు వేయడంలో ఆయన ఎంత దిట్టో, వ్యక్తిగతంగా అంత వినయశీలి, సౌమ్యుడు. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న ఆర్‌.నాగేశ్వరరావు ఒకసారి కోడంబాక్కం అడవుల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆయన జీపునకు అడ్డంగా ఒక పులి వచ్చి నిలబడింది. అది ఆయనపై దూకడానికి సిద్ధపడడంతో చాకచక్యంగా జీపు నడిపి జీపుతో పులిని ఢీకొని చంపేశారు. ఆ విధంగా మృత్యువుని జయించిన ఆయన కొద్దిరోజుల్లోనే క్షయవ్యాధి బారినపడి తన 33వ ఏటనే కన్నుమూశారు. అప్పటికే ఆయనకు భార్య, అయిదుగురు పిల్లలు ఉన్నారు. విధికి తలవంచిన మంచి నటుడుగా రాజనాల నాగేశ్వరరావు పరిశ్రమ గుండెల్లో పదిలంగా ఉండిపోతారు.

· పేరుతెచ్చిన సినిమాల జాబితా
దేవదాసు (1953)
కన్నతల్లి (1953) …. చలపతి
పరోపకారం (1953)
అగ్గి రాముడు (1954)
దొంగ రాముడు (1955) …. బాబులు
జయం మనదే (1956)
మాయా బజార్ (1957) …. దుశ్శాసనుడు
వినాయక చవితి (1957)
పెళ్ళినాటి ప్రమాణాలు (1958) …. భీమసేనా రావు కొడుకు
అప్పు చేసి పప్పు కూడు (1958) …. రామ్ సింగ్
ముందడుగు (1958)
ఇల్లరికం (1959) …. శేషగిరి
పెళ్ళిసందడి (1959)
· కూతురు సుహాసిన చెప్పిన విశేషాలు

· ఆరడుగుల ఆజానుబాహుడు.. కన్ను తిప్పుకోలేని వస్త్రధారణ..
అందంగా కనిపించే విలక్షణ విలన్‌… సూటు వేసుకుంటే నిజాం నవాబు..
‘భలే మామా భలే…’ ‘ఇదే మన తక్షణ కర్తవ్యం…’ ‘బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి..’
‘రారోయి మా ఇంటికీ! మావా! మాటున్నదీ! మంచి మాటున్నదీ!’
ఈ మాటలపాటల ప్రత్యేకతలతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు…
కొద్ది సినిమాలలో నటించి, అతి కొద్దికాలం మాత్రమే జీవించి, తెలుగు సినీ పరిశ్రమలో అందమైన విలన్‌గా ముద్ర వేసుకున్న ఆర్‌. నాగేశ్వరరావు గురించి జ్ఞాపకాలుగా ఆర్ద్రమైన గుండెతో పంచుకున్నారు సింగపూర్‌లో నివాసం ఉంటున్న వారి పెద్ద కుమార్తె సుహాసిని..

· ‘నాన్న పోయేనాటికి నా వయసు ఎనిమిది సంవత్సరాలు. నాన్నకు మాసివ్‌ అటాక్‌ రావటం, మేడ మీద నుంచి ఆయనను కిందకు తీసుకు రావటం, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా దారిలోనే మరణించటం, ఇంటికి తీసుకువచ్చి హాలులో.. నిండైన విగ్రహంలాంటి నాన్నను పడుకోపెట్టడం.. పక్కనే అమ్మ కన్నీరుమున్నీరవ్వటం… నా మనసు ఆయన జ్ఞాపకాలలోకి పరుగులు తీస్తూనే ఉంటుంది.

· ఐస్‌క్రీమ్‌ చేసి పెట్టేవారు..
నాన్న సికింద్రాబాద్‌ జీరాలో పుట్టి పెరిగారు. నాన్న నాయనమ్మ కడుపులో ఉండగా తాతగారు పోయారు. అప్పటికే నాన్నకు ఒక అన్నయ్య ఉన్నారు. నాన్న వాళ్ల అన్నయ్య ఇంట్లోనే పెరిగారు. అది నాన్న సొంత ఇల్లే. నాన్న మంచి పొజిషన్‌కి వచ్చాక ఆ ఇల్లు వాళ్లకి ఇచ్చేశారు. నాన్న నవాబులతో దోస్తీగా ఉండేవారు. ఆయన మాట్లాడే భాషలో తెలంగాణ నవాబుల హిందీ ఉర్దూ మాండలికం ఉండేది. అమ్మ రత్నాబాయి గుంటూరు లో పుట్టి పెరిగింది. నాన్నగారిది మేనరికం. మేం ఐదుగురు పిల్లలం. మోహన్, తాతాజీ, సుహాసిని (నేను), శ్యామ్, చాందినీ. అన్నయ్యలు, తమ్ముడు గతించారు. నేను, చెల్లి మాత్రమే ఉన్నాం. నాన్న పోయేనాటికి చెల్లెలికి నాలుగేళ్లు, నాకు ఎనిమిది సంవత్సరాలు. అందరం హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నాను

· రిక్షాలో వెళ్లమన్నారు..
అమ్మ వాళ్లందరూ తరచుగా భద్రాచలం వెళ్లేవారు. రైల్వే స్టేషన్‌ మా ఇంటికి దగ్గరే. కాని అందరూ పని పూర్తి చేసుకుని వెళ్లేసరికి ట్రైన్‌ టైమ్‌ అయిపోయేది. అందుకని నాన్న పరుగెత్తుకుంటూ, ఇంజన్‌ డ్రైవర్‌ దగ్గరకు వెళ్లి, రైలు ఆపించేవారట. బ్రిటిష్‌ టైమ్‌లో తాతయ్య (అమ్మవాళ్ల నాన్న) ట్రైన్‌ ఇంజిన్‌ డ్రైవర్‌గా ఉండేవారు. బహుశః అందుకే ఆపేవారేమో. ‘జీవితంలో కష్టపడటం నేర్చుకోవాలి, స్కూల్‌కి రిక్షాలో వెళ్లండి’ అని చెప్పేవారు నాన్న. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆదివారం స్వయంగా ఐస్‌క్రీమ్‌ తయారుచేసి పెట్టేవారు. అవకాశం ఉన్నప్పుడు బీచ్‌కి తీసుకెళ్లి, మాతో దాగుడు మూతలు ఆడేవారు.

· డ్రై ఫ్రూట్స్‌ తెచ్చేవారు..
మేం పొద్దున్నే నిద్ర లేచి హాల్‌లో కూర్చుని చదువుకుంటుంటే చూడటం ఇష్టం నాన్నకు. కారులో అన్నవరం తీసుకువెళ్లేవారు. నదీ తీర ప్రాంతంలో డ్రైవింగ్‌ చేయటం చాలా ఇష్టం. అక్కడ స్నేహితులందరితో కలిసి భోజనం చేసేవారు. ప్రతి వారం మద్రాస్‌ ప్యారిస్‌ కార్నర్‌ నుంచి స్వీట్స్, పూలు, కూరలు తెచ్చేవారు. ఆ రోజుల్లోనే అంటే 1955 ప్రాంతంలోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ తెచ్చేవారు. అమ్మ వంటలు బాగా చేసేది. నాన్న మంచి ఆహారం మితంగా తినేవారు. ప్రతిరోజూ రాత్రి పరాఠాలు, నాన్‌వెజ్‌ తినేవారు. హైదరాబాద్‌ స్టయిల్‌ ఆహారం ఇష్టపడేవారు. మీగడ పెరుగంటే చాలా ఇష్టం.

· అప్పుడు మేం ఉన్న మా ఇంటితో ఎప్పటికప్పుడు కొత్త అనుబంధం ఏర్పడుతూనే ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా, అక్కడ నాన్నతో కలిసి పెరిగిన వాళ్లు, ‘‘మీ నాన్నతో కలిసి పెరిగాం. మేమంతా చనువుగా ఆయనను ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లం’’ అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్‌పి రోడ్‌లో ఇప్పటికీ పాత హార్డ్‌వేర్‌ దుకాణాలున్న ప్రాంతానికి వెళితే, ‘మిమ్మల్ని బాగా చూసినట్లు ఉంది. అచ్చం నాన్నగారిలా ఉన్నారు’ అంటూ, నాన్నను గుర్తు తెచ్చుకుంటారు. నాన్న నిండైన విగ్రహమే అందుకు కారణం. అమ్మ 90 సంవత్సరాలు వచ్చేవరకు జీవించింది. నాన్న గురించి అమ్మ చెప్పే మాటలు వింటూ పెరిగాను.

· —

· ఇప్పటికీ గుర్తుండిపోయింది…
నాన్న పోయిన రోజున ఆయనను తీసుకురావటం బాగా గుర్తుంది. గదిలో పడుకుని ఉండగా మాసివ్‌ అటాక్‌ వచ్చి అతి పిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయనను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ చేదు జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది . నాన్న గురించి వింటూ, పెరగటం వల్ల, నాన్నలా ఉండాలనే భావన నాకు తెలియకుండానే అలవాటైపోయింది. ఆయన పర్సనాలిటీ నాకు వచ్చిందని గర్వపడతాను. నాన్న ఇప్పటికీ మా మనసులో, ఆలోచనలలో, చేతలలో సజీవంగానే ఉన్నారు. నాన్నకి అందమే కాదు, వ్యక్తిత్వం, అస్తిత్వం కూడా ఉన్నాయి. తల్లిదండ్రులతో ఉన్న బంధం మరచిపోవటం కష్టం.

· నాన్న వెరీ పర్టిక్యులర్‌
నాన్న ఆజానుబాహువు. అందమైనవారు. నాన్న స్టయిల్‌ని చాలామంది ఫాలో అయ్యేవారు. నవాబుల కంటె హుందాగా, గొప్పగా ఉండేవారు. నాన్న దగ్గర 300 సూట్లున్నాయి. షూస్‌ లెక్క చెప్పలేను. ఏ సూట్‌లో చూసినా ఎంతో కంఫర్టబుల్‌గా అనిపించేవారు. ఎస్‌వి రంగారావు అంకుల్‌ గృహప్రవేశానికి నాన్న హై కాలర్‌ (నెహ్రూ కాలర్‌) బ్లాక్‌ సూట్, ఎస్‌విఆర్‌ వైట్‌ సూట్, టోపీ ధరించారు. అతిథులందరికీ నాన్న విస్తళ్లు వేసి వడ్డించారు. అడ్డగీతల రా సిల్క్, బ్రైట్‌ ఎల్లో… హై కాలర్‌ స్వెటర్‌తో ఇంగ్లీషు దొరలా ఎంతో దర్పంగా, హుందాగా అనిపించేవారు. మా అందరికీ నాన్నే బట్టలు కొనేవారు. ఒకసారి నాకు అద్దాలు కుట్టిన నల్ల లంగా తీసుకువచ్చారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పటికీ అలాంటి లంగా కనిపిస్తే, ఆ రోజులు గుర్తుకు వస్తాయి. – సుహాసిని

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-166

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-166

·         166-పెళ్లి సందడి నిర్మాత ,బొబ్బిలియుద్ధం లో  వెంగళ రాయుడు  ,నిర్మాత ,దర్శకుడు ‘’అందాల రాణివే, నీవెంత జాణవే’’పాటఫేం –సి.సీతారాం

·         సమర్ధులైన దర్శకులు కఠినంగా చెబుతూ ఉంటే, బాగా నటించి రాణించగలవారిలో పద్మనాభాన్ని సీతారాంను, రామకోటిని చెప్పుకోవాలి.

·         సీతారాంకు కొంతకాలంగా హాస్య పాత్రలు లభించటమేలేదు. అతను వేశాడు కాబట్టి హాస్యం ఉందనుకోవలసి వస్తోంది. నిజానికి ఈ దుస్థితి, ఇటీవల దాదాపు అందరు హాస్య నటులకూ పట్టింది. 

·         హుషారుగా కబుర్లుచెబుతూ కుర్రకారు ప్రేమయణంమీద మూడు మైళ్లు షికారు తీసుకెళ్ళే “పెళ్లిసందడి” (రిపబ్లిక్‌ (ప్రొడక్షన్స్‌) ఆంధ్రలో1959 ఏప్రిల్‌ రెండునుండి సందడి చేస్తోంది. ఇందులోని పాత్రలలో చిన్నవాళ్లూ, పెద్దవాళ్లూ, వాళ్లలా నటించిన నటులలో పెద్దవాళ్లూ, చిన్నవాళ్లూ, దర్శక నిర్మాతలూ. రచయితా యావన్మందీ కూడా ఈసారి బేఖాతరీగా విహరించి హాస్యంచేసి రంజింపచేయడానికి వడికట్టి, దాదాపు అంతపనీ చేశారు. ఎటొచ్చి కొందరు ఆ పని చెప్పకుండా చేసి నవ్వించగలిగారు; మిగతా వారంతా కాసుకోమని వార్నింగు ఇచ్చారు. ఇస్తే ఇచ్చారుగాని మొత్తంమీద వాళ్లూ బాగానే నవ్వించగలిగారు. అందరికన్న ఎక్కువ నవ్వించగలినది మాటలు. సినీ అసందర్భాలన్నీ సమిష్టిగా ఒకచోట సందర్భపడ్డ ఈ చిత్రంలో గుర్నాధం అనే చిన్నవాడు తన పెళ్లిచూపులకు తన స్నేహితుని పంపి “ప్రాక్సీ? ఇచ్చి రమ్మనడం ముఖ్య విషయం. సముద్రాల జూనియర్‌కు సంభవించిన అసంభవమనిపించే ఈ తొలి ఊహ చుట్టూ మరికొన్ని అసంభవాలను, అపోహలను పేర్చి ఆయనా, దర్శకుడు యోగానంద్‌, నిర్మాత సీతారాం వాటికి తగ్గ మూటలు కూర్చి కథను కట్టారు. అసందర్భ ప్పిల్లడు గుర్నాధం వాలకాస్పీ అంతకో రీలు క్రితం బ్రహ్మాండమైన ఆస్తీ వేపకాయంత వెర్రి ఉన్న గుమ్మడినీ, అతని అన్నదమ్ముడు     

·           రమణారెడ్డినీ వాళ్ళ అపోహాపోహల తీరుతెన్నులనూ చూసేసరికి, మనకీ ఈ కధలో సాధ్యాసాధ్యాల గురించిన బెంగలు పోతాయి. డాన్సులూ రొమాన్సులూ అంటే ప్రాణం పెట్టే గుర్నాధం, ఒక దాన్సరుతో పెట్టుకున్న ఎంగేజిమెంటువల్ల తీరుబడిలేక గిలగిల్లాడుతూ ఉంటాడు. ఆ వేళకి అతని తండ్రి గంగాధరంగారు పొరుగూళ్ళో పెళ్లిసంబంధం చూసి పిల్లణ్ణి వెళ్ళి చూసి రమ్మంటాడు. అపుడు గుర్నాధం తన జర్నలిస్టు మిత్రుడు వాసును తన బదులు హాజరుకమ్మని పంపుతాడు. ఇలా “ప్రాక్సీ వెళ్లి మిత్రుడి తరపున గైరుహాజరినామా పలకబోయినందుకు వాసుకుపడ్డ జరిమానా (ప్రేమ కధలో జారిపడడం, అక్కడున్న ఇద్దరమ్మాయిలలోను పెద్ద చిన్నదాన్ని చూసి సరదాపడి డూయెట్‌ అందుకుంటాడు వాసు. ఆ పిల్ల రెండో చరణం అందుకోవడంతో ఒక జంట స్వయంవరణం పూర్తి అవుతుంది, అందువల్ల వాసు ఆ యింట్లో చిక్కడిపోతాడు. ఇటు, _వాసువచ్చేదాకా _ఇంటికెళ్ళకుండా అజ్ఞాతవాసంలో ఉండబోయిన గుర్నాధం, అక్కడ అలా ఉండలేక, ధైర్యంగా ఇవతల పడలేక అవస్థపడుతూ ఉంటాడు. అనూరాధగా అంజలీదేవి, నకిలీ పెళ్లీకొడుకు వాసుగా నాగేశ్వరరావూ కనిపించడంతో, అసలు పెళ్లికొడుకు గుర్నాధానికి (చలం), రెండో చిన్నది ప్రియంవద (సరోజాదేవి) మటుకే దక్కుతుందని మనం ముందే పసిగట్టినా, కథ ఈ చిక్కులు విప్పుకొని అడంగి చేరేవరకు, చూచి ఆనందించతగ్గ హాస్య సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. జర్నలిస్టుగా అభినయించిన స్థూలలబాల సరస్వతి, రమణారెడ్డి వివాహమాడుట వగైరాలు. ఈలోగా అనూరాధ జన్మవృత్తాంతం బయటపడడం కాస్తంత డ్రామా, మెలోడ్రామా, ఆ పైన ఆమె – కష్టదశలో పడే సినీ హీరోయిన్‌లందరూ తొక్కినదారిలోనే బయల్దేరి వూరూవాడా వదలి ఫోటోజెనిక్‌ అడవులలో తిరగడం, త్రాగుబోతులు ఆమెను చుట్టుముట్టడం, కొట్లాటలూ ఈలోగా హీరో వాసు కథ బయటపడడం వగైరా ఘట్టాలమీదుగా కథ జనరంజకంగా గమ్యస్థానం చేరుకొంటుంది, వెరసి మొత్తం నాలుగు పెళిళ్లూ ఫెళ్ళున జరుగుతాయి. నటీనటులందరూ ఎంత కథోచితంగా నటించినా మొత్తం మీద హాస్య నటన స్థాయి గర్వకారణంగా లేదు. చిన్న నటులంతా తమ పాత్రలను సమర్థంగా నిర్వహించారు గాని ముఖ్యపాత్రధారుల హాస్యనటన, హాస్యనటనకు ఉండతగ్గ అవధులను దాటిపోయింది. ఇది హాస్యము సుమీ అన్న తరహాలో హాలివుడ్‌ కమీడియన్‌లు కూడా ఈ మధ్యనే వదిలివేసిన హావభావాలతో మొదలై ముందుకు సాగి, హాస్య నటనమీద దర్శకునకు నటులకు గల చిన్నచూపును విశదంచేసింది. సి. ఎన్‌. ఆర్‌, రమణారెడ్డి, తొలిసారి హాస్యపాత్ర ధరించిన గుమ్మడి చెప్పుకోతగ్గ నటన ప్రదర్శించారు. హాస్యంపట్ల (ప్రేక్షకుల పట్ల దర్శకులకు మరికొంచెం గురి, గౌరవం ఉంటే, నాగేశ్వరరావు, చలం, బాలసరస్వతి బాగా రాణించేవారని, గుమ్మడి హాస్యనటనలో తన అజ్ఞాత ప్రజ్ఞను మరింత ప్రస్ఫుటంగా చూపగలిగే వాడనీ    

·         అనిపిస్తుంది. ఉన్నవారిలో అంజలీదేవి ధరించిన అనూరాధ అందంగా ఆహ్లాదకరంగా ఉంది. సరోజూదేవిని భరించిన ప్రియంవద గురించి చెప్పుకొనకపోవడం మంచిది. హాస్వేతరనటుడు అయినా తాగుబోతుగా ఆర్‌. నాగేశ్వరరావు ఒకడూ బాగా గుర్తుంటాడు. సంగీత దర్శకుడు ఘంటసాల చాలమంచి పాటలు వినిపించారు. నిండుగా ఉత్సాహవంతంగా ఉన్నాయి. జాగీర్టార్‌ ఛాయాగ్రహణం విశేషించి (ప్రశంసించవలసిన అంశాలలో ఒకటి. సరదాగా “చాలా సేపు కాలక్షేపం చెయ్యడానికి సకుటుంబంగా వెళ్లి చూడదగిన చిత్రం. ఈ సినిమా బాగా అడింది

·          

·           . నిర్మాత సీతారాం తరువాతి ప్రయత్నంగా “బొబ్బిలియుద్ధం” అనే చారిత్రాత్మక చిత్రం తీసి తనే దర్శకత్వం వహించారు. జమునకు జోడీగా ముఖ్యపాత్ర ధరించారు.   

·         బొబ్బిలి యుద్ధం సినిమాను సి. సీతారామ్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్.టి.ఆర్, ఎస్వీఆర్, భానుమతి, రాజనాల, ఎమ్.ఆర్.రాధా, జమున మొదలైన తారాగణంతో భారీగా నిర్మితమైనది. శ్రీకర కరుణాలవాల, మురిపించే అందాలే వంటి హిట్ గీతాలున్నాయి. శ్రీశ్రీ పాటలు, ఎస్.రాజేశ్వరరావు సంగీతం సినిమా విలువను పెంచాయి

రెండు ప్రధాన రాజవంశాలు, బొబ్బిలి, విజయనగరం ఇరుగుపొరుగు సంస్థానాలు. విజయనగర ప్రభువు విజయరామరాజు (రాజనాల) భార్య చంద్రాయమ్మ (జయంతి) కుమారునితో కలిసి బొబ్బిలిరాజు (రంగారావు నాయుడు (ఎన్.టి.ఆర్) రాణిమల్లమాంబ (భానుమతి)ల కుమారుడు వెంకటరాయల పుట్టినరోజు వేడుకలకు బొబ్బిలి వస్తాడు. ఆనాడు జరిగిన కుస్తీ పోటీల్లో, కోడిపందేల్లో, బలప్రదర్శనలో విజయనగరం వారిపై, బొబ్బిలివారు సాధించిన విజయాలకు, అసూయపడతాడు. రామరాజు వారినేవిధంగానైనా అణగద్రొక్కాలని సమయంకోసం ఎదురుచూస్తుంటాడు. రాజాం ప్రభువు తాండ్రపాపారాయుడు (యస్.వి.రంగారావు) బొబ్బిలికి అండ. అతని చెల్లెలు సుభద్ర(జమున)కు, రంగారావు నాయుడు, తమ్ముడు వెంగళరాయుడు (సీతారాం)కు వివాహం నిశ్చయిస్తారు. ఈలోపు ఫ్రెంచి గవర్నరు తరఫున బుస్సీ (ముక్కామల) కప్పాలు కట్టవలసినదిగా తాఖీదులు పంపుతాడు. తామెవరికి సామంతులు కామని, కప్పాలు కట్టమని బొబ్బిలిరాజులు తిరస్కరిస్తారు. ఈ అవకాశం తీసికొని విజయరామరాజు, బుస్సీ అనుచరుడు హైదర్‌జంగ్ (ఎం.ఆర్.రాధ) సహాయంతో బుస్సీకీ బొబ్బిలిపై చాడీలుచెప్పి, ఆ కోటను జయించి తనకిస్తే మొత్తం పరగణాల మాన్యంతానే చెల్లిస్తానంటాడు. వెంగళరాయుడు పెళ్ళి జరిగిన వెంటనే, బుస్సీ బొబ్బిలిపై దాడికి సిద్ధపడతాడు. రాజాం వైపునుంచి వచ్చే సైన్యాన్ని అటకాయిస్తానని అక్కడ విడిదిచేస్తాడు తాండ్ర పాపారాయుడు. కాని అడవి మార్గం గుండా బొబ్బిలిని ఆక్రమిస్తారు బుస్సీ సైనికులు. యుద్ధంలో బొబ్బిలి వీరులెందరో రంగారావునాయుడుతో సహా వీరమరణం పొందుతారు. తాండ్ర పాపారాయుడు బొబ్బిలి వచ్చి, విజయరామరాజును బాకుతో గుండెల్లో పొడిచి, చంపి, తానూ, ఆత్మత్యాగం చేసుకుంటాడు. ఇరు రాజ్యాల కుమారులు స్నేహంగా సాగుతుండగా కథ ముగుస్తుంది. చివరలో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించటం. ఆ స్వాతంత్య్ర వేడుకలు చూపటంతో చిత్రం పూర్తవుతుంది.

ఇంకా ఈ చిత్రంలో నరసారాయుడుగా ధూళిపాళ, అడిదం సూరకవిగా, కె.వి.యస్.శర్మ, దుబాసీ లక్ష్మయ్యగా సి.యస్.ఆర్, మొరాసిందొరగా (ప్రభాకర్‌రెడ్డి) హర్కొరులుగా (రాజ్‌బాబు, డా.శివరామకృష్ణయ్య) వరహాలుగా పద్మనాభం, వెంకటలక్ష్మిగా బాలసరస్వతి, చారులుగా బాలకృష్ణ, గీతాంజలి, మల్లయోధునిగా నెల్లూరు కాంతారావు నటించారు. తగిర్చి హనుమంతురావు నిర్మాతగా, దొప్పలపూడి వీరయ్యచౌదరి దర్శకుడిగా ఈ చిత్రం టైటిల్స్ లో కనబడుతుంది. వీరు ఇద్దరూ కంకటపాలెం వాస్తవ్యులు . పెళ్ళిసందడి’, ‘రక్తసింధూరం’ చిత్రాలు నిర్మించిన రిపబ్లిక్ ప్రొడక్షన్స్‌వారు నిర్మించిన చారిత్రాత్మక చిత్రం ‘‘బొబ్బిలియుద్ధం’’. 1964లో విడుదలయింది. ఈ చిత్రానికి మాటలు- గబ్బిట వెంకట్రావు, పర్యవేక్షణ సముద్రాల సీనియర్, నృత్యం- వెంపటి సత్యం, పసుమర్తి వేణుగోపాల్, ఫొటోగ్రఫీ- కమల్‌ఘోష్, కూర్పు- కందస్వామి, సంగీతం- యస్.రాజేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత- సీతారాం. పాటలు- శ్రీశ్రీ, సి.నా.రె, కొసరాజు, ఆరుద్ర, సముద్రాల జూ., గబ్బిట వెంకటరావు.
‘బొబ్బిలియుద్ధం’ చిత్రంలో నటీనటులందరూ అఖండులు కావటంతో, ఎంతో సమర్ధవంతంగా పరిపూర్ణంగా నటించి, తమ పాత్రలకు న్యాయం చేశారు. వెంగళరాయుడుగా ఉద్రిక్తతను, ఆవేశాన్ని, పరాక్రమాన్ని సమపాళ్ళలో సీతారాం, తమ్ముని ఆవేశాన్ని అడ్డుకట్టవేసే సోదరునిగా, ప్రజాసంక్షేమంకోరే ప్రభువుగా, పరాక్రమవంతునిగా సామ, దాన, ధీర గంభీరంగా ఎన్.టి.ఆర్. ఆయా సన్నివేశాలకు వన్నెతెచ్చారు. తాండ్ర పాపారాయునిగా, యస్.వి.ఆర్. మల్లయుద్ధంలోనూ, విజయరామరాజును సంహరించే సమయంలో, ‘నీ పేరాశకిదే నా బహుమతి, ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్కపోటు’ అంటూ అతని గుండెలపై కూర్చొని బాకుతో పొడుస్తూ చెప్పే డైలాగులు, తన్నుతాను పొడుచుకున్నాక ‘‘మాతృభూమికోసం, ఈనాడు వీరులు కార్చిన రక్తబిందువులు ఏనాటికైనా విదేశీపాలన అంతానికి కారణం కాకపోవు’’ దర్శకునిగా సీతారాంకు, రచయితగా గబ్బిటవారికి నటునిగా ఎస్.వి.రంగారావును అభినందించాల్సిందే. మరో పాత్ర ధర్మరాయుడుగా (బాలయ్య) సంధికోసం బుస్సీవద్దకు వెళ్ళిన సన్నివేశం, వీరోచితంగా సంభాషణలు పల్కటంలో, సైన్యాన్ని ఎదిరించి, తిరిగివచ్చి వెంగళరాయునిచే ఎగతాళికి, దాంతో ఆవేశానికి గురైన పాత్రను నటనలో బాలయ్య ఎంతో సంయమనాన్ని, వీరాన్ని ప్రదర్శించటం, గుర్తుండిపోయేలా చిత్రీకరణ మరో విశేషం.
ఇక ఈ చిత్ర గీతాలు పెళ్ళికి సిద్ధంచేసిన వంటకాలు, రుచితో ఊహల్లోకి వెళ్ళిన రంగారావునాయుడు తమ తొలి రేయిని స్మరిస్తూ చిత్రీకరించబడిన గీతం, ఎన్.టి.ఆర్, భానుమతిల అభినయంతో మనసును ఊయల లూగిస్తుంది. ‘‘ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైనా’’ (భానుమతి- సి.నా.రె) జమున, చెలికత్తెలపై చిత్రీకరించబడిన గీతం ‘‘ముత్యాల చెమ్మచెక్కా, రతనాలా చెమ్మచెక్క’’ సాంప్రదాయపు ఆటతో, పొడుపుకథలతో రమ్యంగా సాగింది. (పి.సుశీల బృందం- ఆరుద్ర) భానుమతిపై చిత్రీకరించిన భక్తిగీతం- ‘‘శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా’’ (భానుమతి- సముద్రాల జూ.) గీతాంజలిపై చిత్రీకరించిన నృత్య గీతం ‘‘ఏమయా రామయా ఇలా రావయా’’ (స్వర్ణలత- బి.వసంత. వి.సత్యారావు- రచన కొసరాజు) యల్.విజయలక్ష్మిపై చిత్రీకరించిన జావళి ‘‘నినుచేర మనసాయెలా’’ (పి.సుశీల- శ్రీశ్రీ) రాజనాలపై చిత్రీకరించిన పద్యం ‘‘పర వీర రాజన్య భయద ప్రతాపుడు ఆరంగరాయ’’ (మాధవపెద్ది- గబ్బిట) బుస్సీ, హైదరుజంగులన్ (మాధవపెద్ది- గబ్బిట) యస్.వి.ఆర్.పై ‘‘చెల్లిలా నీ అన్న జీవించి యుండగా (మాధవపెద్ది- ఆరుద్ర) కె.వి.యస్.శర్మపై పద్యం ‘‘రాజు కళింకమూర్తి రతిరాజు శరీర విహీనుడు’’ (మాధవపెద్ది- అడిదం సూరకవి) అందాల నటి జమునతో జంటగా సీతారాం నటించిన ఈ చిత్రంలో వారిపై చిత్రీకరించిన గీతాలు, ఎంతో ముచ్చటగా, పరవళ్ళుత్రొక్కే సంగీతంతో కూడిన గీతం ‘‘అందాల రాణివే, నీవెంత జాణవే’’(పి.సుశీల, ఘంటసాల) వారిద్దరిపై చిత్రీకరించిన తొలిరేయి గీతం ‘‘సొగసుకీల్జెడదానా’’ వజ్రాల వంటి పలువరుస దానా అని వర్ణన జమునకు సరిపోయేలా సాకీ వ్రాయటం పాట ‘‘మురిపించే అందాలే అవి ననే్న చెందాలే’ (ఘంటసాల, పి.సుశీల) ఈ రెండూ గీతాలు శ్రీశ్రీ వ్రాయటం ముదావహం. చిత్ర ప్రారంభంలో గోపాలకుడు నాగయ్యపై చిత్రీకరించిన గీతం ‘‘సిరినేలు రాయుడా, శ్రీమన్నారాయణ’’ (ఆరుద్ర రచన ఈ గీతాన్ని చిత్ర సంగీత దర్శకులు యస్.రాజేశ్వరరావు, నాగయ్యకు ప్లేబాక్ పాడడం ఎన్న దగినది). చిత్ర సంగీత, సాహిత్యాలు ఈనాటికీ శ్రోతలను అలరిస్తూనే వున్నాయి.

అందాల రాణివే, నీవెంత జాణవే కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా
ఏమయ్య రామయ్యా ఇలా రావయ్యా

·         మురిపించే అందాలే అవి నన్నే చెందాలె నాదానవు నీవేలే నీవాడను నేనేలే
మురిపించే అందాలే అవి నన్నే చెందాలె నాదానవు నీవేలే నీవాడను నేనేలే

·           సశేషం

·         మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-164

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-164

· 164-రామోజీ కుడిభుజం,కీరవాణి,సుధా చంద్రన్ లను పరిచయం చేసిన –అట్లూరి రామారావు

· నిన్నటి తరం సినీ ప్రముఖుడు, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను దీర్ఘకాలం పర్యవేక్షించిన అనుభవజ్ఞుడు అట్లూరి రామారావు కన్ను మూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పల్లె జీవితపు స్వచ్ఛతకూ, అచ్చతెలుగు తనానికీ నిదర్శనంగా తెల్లటి పంచె, లాల్చీలోనే ఎప్పుడూ కనిపించే అట్లూరి క్రమశిక్షణ, సమయపాలన, పద్ధతిగా కార్యనిర్వహణకు మారుపేరు.
1925 జూన్ 26న ఆయన జన్మించారు. పత్రికాధి పతి రామోజీరావుదీ, అట్లూరిదీ ఒకే ఊరు. కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరలోని పెదపారుపూడికి చెందిన ఆయన, రామోజీ ‘మార్గ దర్శి’ ఆరంభించిన తొలి నాళ్ళ నుంచి వెంట నిలిచిన సన్నిహితుల్లో ఒకరు. ‘ఉషాకిరణ్ మూవీస్’ పేరిట చిత్ర నిర్మాణా నికి విస్తరించినప్పటి నుంచి ఆ వ్యవహారాల్లో కుడిభుజంలా వ్యవహరించారు. ఆ సంస్థలో జంధ్యాల ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984) మొదలు ‘మయూరి’, ‘ప్రతిఘటన’ (’85), ‘మౌనపోరాటం’(’89), ‘అశ్వని’ (’91) లాంటి హిట్ చిత్రాలు అట్లూరి చిత్ర నిర్మాణ నిర్వహణలో తయారైనవే. పత్రికావార్త ఆధారంగా నర్తకి సుధాచంద్రన్‌ను అన్వేషించి ‘మయూరి’ లాంటివి తీయడంలో అట్లూరిది ప్రధానపాత్ర. సంగీత దర్శకుడు కీరవాణిని పరిచయం చేయడంలోనూ ఆయన పాత్ర.

నిజానికి, అట్లూరి చదువుకున్నది కేవలం 5వ తరగతి వరకే. అయితే, ఆ రోజుల్లోని హిందీ భాషా ప్రచార ఉద్యమం వేడితో హిందీ చదివారు. అప్పట్లో గాంధీ గారిని కలవడమే కాక, హిందీ ప్రచారానికి చేసిన కృషికి గాంధీ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. కొంతకాలం హిందీ అధ్యాపకత్వం కూడా చేశారు. ప్రజా నాట్యమండలి సభ్యుడూ, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త అయిన పెరుమాళ్ళుతో స్నేహం చేసి, రంగస్థలంపై స్త్రీ పాత్రలు పోషించేవారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారు హిందీలోకి అనువదించిన తెలుగు నాటకాల్లో నటించారు.
‘మాభూమి’ తదితర ప్రయోజనాత్మక నాటకాల్లో నటించారు. తరువాత కాలంలో రామోజీ పిలుపు మేరకు ఆయన సంస్థలో చేరి, తొలుత వివిధ పత్రికల ప్రచురణ చూసేవారు. సినీ నిర్మాణబాధ్యతలు చేపట్టాక అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ, నటనాభిరుచిని కొనసాగించారు. బ్లాక్ అండ్ వైట్ యుగంలోనే ఎన్టీఆర్ ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రంలో సబ్‌రిజిస్ట్రార్ పాత్రలో ఆయన కనిపించారు.
‘ప్రతిఘటన’లో గాంధేయవాది పాత్రలో, ‘మౌనపోరాటం’లో హీరో తండ్రి పాత్రలో ఆదర్శవాదిగా తెరపై మెరిశారు. ఆ మధ్య హీరో వేణుతో వచ్చిన ‘సదా మీ సేవలో’నూ నటించారు. మీద పడుతున్న వయసు కారణంగా 2000ల నుంచి క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకున్నారు. అట్లూరి 6-2-2015న 90వయేటమరణి౦చారు.

·

165-N.A.T.సంస్థ స్థాపకుడు ,శ్రీకృష్ణావతారం ,మహామంత్రి తిమ్మరుసు ,రఫీని తెలుగు కు పరిచయం చేసిన సినీ నిర్మాత –అట్లూరి పుండరీకాక్షయ్య

· అట్లూరి పుండరీకాక్షయ్య (ఆగష్టు 19, 1925 – ఫిబ్రవరి 2, 2012), తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసఎన్.టిి “నేషనల్ ఆర్ట్ థియేటర్” స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. కర్తవ్యం సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు.

·

బాల్యం
ఆయన కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరున్న మెకాసా కలవపూడిలో ఆగస్టు 19, 1925లో పుట్టాడు. ఐదవ తరగతి వరకు అక్కడే చదివాడు. తరువాత వాళ్ళ తండ్రి బెజవాడకు మకాం మార్చడంతో నాన్నకు సహాయంగా ఉండాలని 8వ తరగతితో చదువు ఆపేశాడు. ప్రహ్లాద సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు నాటకాలు వేస్తుండేవాడు. అక్కడే ఎన్.టి.ఆర్తో పరిచయం ఏర్పడింది. తరువాత రామారావు సినిమాల్లో వేషాల కోసం మద్రాసుకు వెళ్ళడంతో ఆయన తమ్ముడు త్రివిక్రమరావుతో కలిసి నేషనల్ ఆర్ట్స్ నిర్వహించేవాడు.

సినిమా పరిచయం
1951 లో రామారావు పిలుపు మేరకు మద్రాసుకు వెళ్ళాడు. అప్పటికే రామారావు నటుడిగా నిలదొక్కుకొని ఉన్నాడు. ఈయన్ను తీసుకెళ్ళి చక్రపాణికి అప్పగించాడు. అలా విజయా సంస్థలో వంద రూపాయల జీతంతో పనిలో చేరాడు. ఒక రోజు రామారావు వచ్చి తను ఒక కంపెనీ ప్రారంభిస్తున్నాననీ, అందుకు ఆయన్ను ప్రొడక్షన్ కంట్రోలర్ గా ఉండమని కోరాడు.

త్రివిక్రమ రావు నిర్మాతగా నేషనల్ ఆర్ట్స్ బ్యానర్ పై పిచ్చి పుల్లయ్య అనే సినిమా ప్రారంభించారు. అందులో పుండరీకాక్షయ్య ఒక పాట కూడా పాడారు. తరువాత వహీదా రెహమాన్ కథానాయికగా జయసింహ అనే సినిమా తీశారు. ఆ తర్వాత రేచుక్క పగటి చుక్క, పాండురంగ మహాత్యం, సీతారామకళ్యాణం మొదలైన సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్ గా పనిచేశాడు. సీతారామకళ్యాణం విడుదల సమయంలో అనారోగ్యం పాలయ్యాడు. అదే సమయంలో ఆయన చదివిన అప్పాజీ నవలను సినిమాగా తీయాలనుకున్నారు. అలా ప్రారంభమైందే మహామంత్రి తిమ్మరుసు. ఈ సినిమా గుమ్మడికి బాగా పేరు తెచ్చిన చిత్రం. దీనికి కేంద్ర ప్రభుత్వ నుండి రజత పతకం కూడా లభించింది.

నటుడిగా
కర్తవ్యం సినిమా కోసం బయటకు చూడ్డానికి సౌమ్యంగా కనిపిస్తూ లోపల విలనీ ఆలోచనలుండే ఒక పాత్రను పరుచూరి బ్రదర్స్తో రాయించారు మోహన గాంధీ. ఆ వేషం వేయాల్సిందిగా ఏ.యం.రత్నం పుండరీకాక్షయ్యను కోరాడు. ఆయన మొదట్లో ఒప్పుకోకున్నా, తరువాత బలవంతంగా ఒప్పించారు. తరువాత మామా కోడలు, శివయ్య, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ మొదలైన 20 తెలుగు, 5 కన్నడ సినిమాల్లో నటించాడు.

సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది.

మరణం
పుండరీకాక్షయ్య చెన్నై లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012, ఫిబ్రవరి 2 గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు కన్నుమూసారు

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162

·         162-ఊరుమ్మడి బతుకులు సినీ ఫేం –సత్యేంద్ర కుమార్

·         సత్యేంద్రకుమార్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడిని ఎం.బాలయ్య అన్నాతమ్ముల కథ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

క్ర.సంసినిమా పేరువిడుదల సంవత్సరందర్శకుడుసహ నటులు
1అన్నాతమ్ముల కథ1975డి.ఎస్.ప్రకాశరావుఎం.బాలయ్య,చంద్రమోహన్ప్రభరోజారమణి
2మొనగాడు1976టి. కృష్ణశోభన్ బాబు,రాజబాబుప్రభమంజులరోజారమణి
3ఈనాటి బంధం ఏనాటిదో1977కె.ఎస్.ఆర్.దాస్కృష్ణ,ఎం.బాలయ్యజయప్రదఫటాఫట్ జయలక్ష్మి
4ఊరుమ్మడి బ్రతుకులు1977బి.ఎస్.నారాయణరాళ్లపల్లిమాధవి
5చలిచీమలు1978దేవదాస్ కనకాలరాళ్లపల్లినూతన్ ప్రసాద్ఎస్.పి.శైలజ
6ప్రేమ పగ1978బి.వి.ప్రసాద్మురళీమోహన్లతసత్యనారాయణ
7తుఫాన్ మెయిల్1978కె.ఎస్.రెడ్డినరసింహ రాజుగిరిబాబు, మంజుల, విజయ్ కుమార్
8చిలిపి కృష్ణుడు1978బోయిన సుబ్బారావుఅక్కినేని నాగేశ్వరరావువాణిశ్రీగుమ్మడిరావు గోపాలరావు
9కాలాంతకులు1978కె.విశ్వనాథ్శోభన్ బాబు, జయసుధకాంచనకాంతారావు
10ఛాయ1979హనుమాన్ ప్రసాద్నూతన్ ప్రసాద్, రూపఅన్నపూర్ణపి.ఎల్.నారాయణ
11కలియుగ మహాభారతం1979హనుమాన్ ప్రసాద్మాదాల రంగారావు, నరసింహ రాజు, వంకాయలమాధవి

·         మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-163

·         163-‘’మా ‘’వ్యవస్థాపక సభ్యుడు ,సినీకార్మిక సంఘ కోశాధికారి ,372సినిమాల హాస్యనటుడు –సారధి

·         సారథి ప్రముఖ హస్యనటుడు. ఇతని పూర్తి పేరు కడలి జయసారథి.

జననం

ఇతడు పశ్చిమగోదావరి జిల్లాపెనుగొండలో వీరదాసు, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

1945లో తొలిసారి మొదటిసారి శకుంతల నాటకంలో భరతుడిగా నటించాడు. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాలు నాటకరంగానికి సేవచేశాడు. ఋష్యేంద్రమణిస్థానం నరసింహారావురేలంగి వెంకట్రామయ్యబి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించాడు.

సినిమారంగ ప్రస్థానం

ఇతడు 1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించాడు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇతడు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించాడు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నాడు[1].

కుటుంబం

ఇతనికి అనూరాధతో వివాహం జరిగింది. వీరికి ఉదయ్‌కిరణ్, ప్రశాంత్ అనే ఇద్దరు కుమారులున్నారు.

సినిమా రంగం

నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

1.    సీతారామ కళ్యాణం (1961) – నలకూబరుడు

2.    పరమానందయ్య శిష్యుల కథ (1966) – శిష్యుడు

3.    ఈ కాలపు పిల్లలు (1976)

4.    భక్త కన్నప్ప (1976)

5.    అత్తవారిల్లు (1977)

6.    అమరదీపం (1977)

7.    ఇంద్రధనుస్సు (1978)

8.    చిరంజీవి రాంబాబు

9.    జగన్మోహిని (1978)

10.  మన ఊరి పాండవులు (1978)

11.  సొమ్మొకడిది సోకొకడిది (1978)

12.  కోతల రాయుడు (1979)

13.  గంధర్వ కన్య (1979)

14.  దశ తిరిగింది (1979)

15.  అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)

16.  నాయకుడు – వినాయకుడు (1980)

17.  మదన మంజరి (1980)

18.  మామా అల్లుళ్ళ సవాల్ (1980)

19.  బాబులుగాడి దెబ్బ (1984)

20.  మెరుపు దాడి (1984) – అంజి

21.  ఆస్తులు అంతస్తులు (1988)

22.  మామా కోడలు

సారధి తాత గారు కడలి వీరయ్య గారు ఆంధ్రదేశం లో ప్రఖ్యాత హరి కధకులు .కొంచెం పొట్ట ఉండేది బొద్దుగా ఉండేవారు కానీ వేదికపైకి వస్తే హరికధ చెప్పటం లో వీరంగమే వేసేవారు శ్రావ్యమైన స్వరం .బహుశా హరికధలు స్వయంగా రాసేవారని గుర్తు .మా ఉయ్యూరు లో ధనుర్మాసంలో సుమారు 40ఏళ్ళక్రితం వీరయ్యగారు వచ్చి కధాగానం చేయటం నేను స్వయంగా చూశాను గొప్ప అనుభవం అది .అలాంటి ఆయన మనవడు సారధి హాస్యాన్ని ఎంచుకొని ,రామారావు తీసిన సీతారామకల్యాణం లో మొదటి సారిగా నలకూబరుడుగా నటించి మెప్పించాడు .సినిమాలు తగ్గాయో లేక ఆయనే దూరంగా ఉన్నదో తెలీదు కానీ ఆయన ఎక్కడున్నాడో అని ఈ టివి వారు తమ ‘’అన్వేషణ’’ప్రోగ్రాం లో ఆయన్ను భీమవరం లో వెతికి ఆయనను పట్టుకొని చక్కని ఇంటర్వ్యు చేశారు .అందులో తన నటజీవితాన్ని సారధి చక్కగా ఆవిష్కరించాడు ఇప్పుడే ఆ ఇంటర్వ్యు చూసి వివరాలు రాశాను .

  భక్తకన్నప్ప లో పూజారిగా నటించినట్లు గుర్తు .మరీ వెకిలి తనం లేని హాస్యం పండించాడు సారధి .తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకొన్నాడు .ఇంతకంటే వివరాలు దొరకలేదు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-22-ఉయ్యూరు

Posted in సినిమా | Leave a comment

మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-162
• 162-ఊరుమ్మడి బతుకులు సినీ ఫేం –సత్యేంద్ర కుమార్
• సత్యేంద్రకుమార్ తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడిని ఎం.బాలయ్య అన్నాతమ్ముల కథ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
క్ర.సం సినిమా పేరు విడుదల సంవత్సరం దర్శకుడు సహ నటులు
1 అన్నాతమ్ముల కథ
1975 డి.ఎస్.ప్రకాశరావు ఎం.బాలయ్య,చంద్రమోహన్, ప్రభ, రోజారమణి
2 మొనగాడు
1976 టి. కృష్ణ
శోభన్ బాబు,రాజబాబు, ప్రభ, మంజుల, రోజారమణి
3 ఈనాటి బంధం ఏనాటిదో
1977 కె.ఎస్.ఆర్.దాస్
కృష్ణ,ఎం.బాలయ్య, జయప్రద, ఫటాఫట్ జయలక్ష్మి
4 ఊరుమ్మడి బ్రతుకులు
1977 బి.ఎస్.నారాయణ
రాళ్లపల్లి, మాధవి
5 చలిచీమలు
1978 దేవదాస్ కనకాల
రాళ్లపల్లి, నూతన్ ప్రసాద్, ఎస్.పి.శైలజ
6 ప్రేమ పగ
1978 బి.వి.ప్రసాద్
మురళీమోహన్, లత, సత్యనారాయణ
7 తుఫాన్ మెయిల్
1978 కె.ఎస్.రెడ్డి నరసింహ రాజు, గిరిబాబు, మంజుల, విజయ్ కుమార్
8 చిలిపి కృష్ణుడు
1978 బోయిన సుబ్బారావు
అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, గుమ్మడి, రావు గోపాలరావు
9 కాలాంతకులు
1978 కె.విశ్వనాథ్
శోభన్ బాబు, జయసుధ, కాంచన, కాంతారావు
10 ఛాయ
1979 హనుమాన్ ప్రసాద్ నూతన్ ప్రసాద్, రూప, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ
11 కలియుగ మహాభారతం
1979 హనుమాన్ ప్రసాద్ మాదాల రంగారావు, నరసింహ రాజు, వంకాయల, మాధవి

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-163
• 163-‘’మా ‘’వ్యవస్థాపక సభ్యుడు ,సినీకార్మిక సంఘ కోశాధికారి ,372సినిమాల హాస్యనటుడు –సారధి
• సారథి ప్రముఖ హస్యనటుడు. ఇతని పూర్తి పేరు కడలి జయసారథి.
జననం
ఇతడు పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండలో వీరదాసు, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
1945లో తొలిసారి మొదటిసారి శకుంతల నాటకంలో భరతుడిగా నటించాడు. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాలు నాటకరంగానికి సేవచేశాడు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించాడు.
సినిమారంగ ప్రస్థానం
ఇతడు 1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించాడు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇతడు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించాడు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నాడు[1].
కుటుంబం
ఇతనికి అనూరాధతో వివాహం జరిగింది. వీరికి ఉదయ్‌కిరణ్, ప్రశాంత్ అనే ఇద్దరు కుమారులున్నారు.
సినిమా రంగం
నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
1. సీతారామ కళ్యాణం (1961) – నలకూబరుడు
2. పరమానందయ్య శిష్యుల కథ (1966) – శిష్యుడు
3. ఈ కాలపు పిల్లలు (1976)
4. భక్త కన్నప్ప (1976)
5. అత్తవారిల్లు (1977)
6. అమరదీపం (1977)
7. ఇంద్రధనుస్సు (1978)
8. చిరంజీవి రాంబాబు
9. జగన్మోహిని (1978)
10. మన ఊరి పాండవులు (1978)
11. సొమ్మొకడిది సోకొకడిది (1978)
12. కోతల రాయుడు (1979)
13. గంధర్వ కన్య (1979)
14. దశ తిరిగింది (1979)
15. అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
16. నాయకుడు – వినాయకుడు (1980)
17. మదన మంజరి (1980)
18. మామా అల్లుళ్ళ సవాల్ (1980)
19. బాబులుగాడి దెబ్బ (1984)
20. మెరుపు దాడి (1984) – అంజి
21. ఆస్తులు అంతస్తులు (1988)
22. మామా కోడలు
సారధి తాత గారు కడలి వీరయ్య గారు ఆంధ్రదేశం లో ప్రఖ్యాత హరి కధకులు .కొంచెం పొట్ట ఉండేది బొద్దుగా ఉండేవారు కానీ వేదికపైకి వస్తే హరికధ చెప్పటం లో వీరంగమే వేసేవారు శ్రావ్యమైన స్వరం .బహుశా హరికధలు స్వయంగా రాసేవారని గుర్తు .మా ఉయ్యూరు లో ధనుర్మాసంలో సుమారు 40ఏళ్ళక్రితం వీరయ్యగారు వచ్చి కధాగానం చేయటం నేను స్వయంగా చూశాను గొప్ప అనుభవం అది .అలాంటి ఆయన మనవడు సారధి హాస్యాన్ని ఎంచుకొని ,రామారావు తీసిన సీతారామకల్యాణం లో మొదటి సారిగా నలకూబరుడుగా నటించి మెప్పించాడు .సినిమాలు తగ్గాయో లేక ఆయనే దూరంగా ఉన్నదో తెలీదు కానీ ఆయన ఎక్కడున్నాడో అని ఈ టివి వారు తమ ‘’అన్వేషణ’’ప్రోగ్రాం లో ఆయన్ను భీమవరం లో వెతికి ఆయనను పట్టుకొని చక్కని ఇంటర్వ్యు చేశారు .అందులో తన నటజీవితాన్ని సారధి చక్కగా ఆవిష్కరించాడు ఇప్పుడే ఆ ఇంటర్వ్యు చూసి వివరాలు రాశాను .
  భక్తకన్నప్ప లో పూజారిగా నటించినట్లు గుర్తు .మరీ వెకిలి తనం లేని హాస్యం పండించాడు సారధి .తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకొన్నాడు .ఇంతకంటే వివరాలు దొరకలేదు .
  సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-22-ఉయ్యూరు
•         Posted in సినిమా | Tagged | Leave a comment

కుక్కుటేశ్వర శతకం

కుక్కుటేశ్వర శతకం

పిఠాపురం అనే పాదగయా క్షేత్రం లో వెలసిన శ్రీ కుక్కుటేశ్వరస్వామిపై శ్రీ వక్క లంక శ్రీనివాసు కవి శతకం రాశారు .స్వామి కోరి రాయించి అంకితమివ్వమని కలలో చెబితే కవిగారు నెరవేర్చారు ..’’కువలయానందకర శర్వ కుక్కుటేశ ‘’అనేదిమకుటం .స్వభాను సంవత్సర చైత్ర శుద్ధ శుద్ధ అష్టమి కి శతకం పూర్తీ చేసి అంకితమిచ్చాడు కవి .

 ‘’సుగతి నొప్పారు గౌతమీ సురవరతట-పులినస్థిత’’పాదగయ ‘’పుణ్యమూర్తి

వందనము శూలి ,,భక్తాళి  వశ వినోద – కువలయానందకర శర్వ కుక్కుటేశ’’అనేది రెండవ పద్యం .క్రోధ తిమిరం మన్నూ మిన్నూ కానకుండా చేస్తోంది శరణు ఇవ్వు .పిఠాపురం లో నువ్వున్నావని మర్చేపోయాను క్షమించు .సర్వం నీకే ఇస్తా .శరణు .దక్షిణకాశి పీఠికాపురం లో వెలిశావు.కాలం పరిగెత్తిపోతోంది  .మాత రాజేశ్వరి మహిమ తో నీ పాద సంసేవనమివ్వు .’’ప్రధమేశ ‘’అని మొక్కితే అన్నీ తీరుస్తావు .’’భక్తజన భాగధేయ –సుభాగ్య చరిత –పాపజనులను క్షమ జూచే భవనాశుడవు ‘’.పిత్రువనం లో పాదగయ లో నీ మూర్తి బహు సుకీర్తి ‘’అన్నాడు .

  శివరాత్రినాడు జరిగే కోటి శతవ్రత పూజ చూసి తరిస్తాను .’’బేసికన్నుల ప్రొడ హో భేషు నీదు –చరితం ‘’ఇంత అని ఎవరూ తెలుసుకోలేరు .’’పునుకుల పేరు వదిలి –రావోయి మాతోడి విందు గుడియ ‘’అని ఆహ్వానించాడు .’’ఆరుత రుద్రాక్ష జపమాల అగ్రమునను –యాగవాటిక ,పాణినియతుల యష్టి –లింగరూపము ‘’ఇవే నీ లీల .’’హే ప్రపన్నార్తి హరా శంభు హేకృపాళో-పాహిమాం భక్తజనపాల పాహి శర్వ ‘’అని వేడుకొన్నాడు .సూనృత వాక్యం ఘనం అది సువ్రత ఫలం .అదే పరం ఏదీనీకంటే వేరు కానేకాదు .’’సచ్చి దంబోధి హంసవై సాగరమున –నిరత కేళిని దేలెడి నీలకంఠ’’మాపాపాలుమాన్పు ..అష్టమూర్తి ,రుద్రా గుణ భద్ర శాంతంపు రూపసి నువ్వు ‘’సూర్య శశినేత్ర-నీ అగ్ని నేత్రం తెరిచి ఇబ్బంది పెట్టకు .’’శంకరా పాహిమాం ‘’అంటే పొంగిపోయి రక్షిస్తావు .

  ‘’పాదగయ లో స్నానం చేసి శైవ వైష్ణవులందరూ వరుత నరిగినా వైష్ణవులు ఎందుకో నిన్ను ఎరగరు ?’’చంద్రునకు నూలుపోగు ‘’చందంగా రచన సాగించి ‘’గీతాల రత్నహారం ‘’సమర్పించాను అన్నాడు భక్తిగా కవి .మాసశివరాత్రి సోమవారం ఉపవాసంతో నిన్ను కొలిచే భక్తులకు కొదవ ఏమీ ఉండదు ‘’అని భరోసా ఇచ్చాడు .’’కుక్కుటాకార మామక కూర్మి మనము –వేగ నీ యందచిగిరించి విరుయునట్లు –వరము దయచేసి ,నీలోక వసతి నిమ్ము –కువలయానందకర ,శర్వ కుక్కుటేశ ‘’అని 104గీతం పాడి చివరిదైన 108లో ‘’భక్తితో ఈ కుక్కుటేశ్వర శతకం పఠించే వానికి ‘’ఇచ్చెదవు గాతవీ విమలపథము-కువలయానందకర ,శర్వ కుక్కుటేశ ‘’అనే పద్యంతో శతకం పూర్తి చేశాడు కవి .కింద గద్య లో భ్రమరాంబికా రామలింగేశ్వర రత్న పుత్రుడు భారద్వాజస గోత్రుడు సుజన విదేయుడు  శ్రీ వక్కలంక శ్రీనివాసరాయ ప్రణీతం ‘’అన్నాడు .

  గీతపద్య శతకం ఆద్యంతం భక్తి రసప్రవాహంగా నడిచింది సరళపదాలు.పాదగయ క్షేత్ర వైభవం ,స్వామి కున్న అపార కారుణ్య దృష్టి అన్నీ కవితలలో పొంగిపారాయి .ఈ శతకం గురించి ,కవి గురించి మన చరిత్ర కారులు ఎక్కడా చెప్పినట్లు నాకు తెలియదు .పుస్తకం ఏసంవత్సరం లో ప్రచురి౦పబడి౦దీ, వెల వివరాలు కనిపించలేదు ముందు పేజీలు  లభ్యం కానందున .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-22-ఉయ్యూరు      

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-161

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-161

· 161-మూడేళ్ళు హీరో కృష్ణకు 30సినిమాలలో పాడిన సింహాసనం లో ,’’ఆకాశామలో ఒకతార’’ఫేం –రాజ్ సీతా రాం

· సూపర్ స్టార్ కృష్ణ హీరోగా దూసుకుపోతూ 250 వ సినిమా వైపుకి అడుగులు వేస్తున్నారు. అయన సంవత్సరానికి 12 సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. కృష్ణకు,గాయకుడు బాల సుబ్రహ్మణ్యంనకు ఒక విషయంలో తేడా వచ్చింది. కృష్ణ నా సినిమాలకు పాడవలసిన అవసరం లేదని అనడంతో బాలు కూడా సరే అన్నారు. కృష్ణ జేసు దాసుతో వరుస సినిమాలకు పాటలు పాడించుకుంటున్నారు. ఇది 1985 నాటి మాట. అప్పుడు కొత్త గాయకుడికి ఒక బంపర్ ఛాన్స్ దొరికింది. అతని పేరు రాజ్ సీతారాం. రాజ్ సీతారాంతో కృష్ణ దాదాపుగా 30 సినిమాలకు పాటలు పాడించుకున్నారు. ఇప్పుడు శంకర్ మహదేవన్,ఉదిత్ నారాయణ్ ఎలా అయితే వైవిధ్యాన్ని చూపేవారో,అప్పట్లో రాజ్ సీతారాం గొంతు కృష్ణకు బాగా సెట్ అయింది.

·

· రాజ్ సీతారాం కృష్ణకు 1985 నుంచి 88 వరకు అంటే మూడు సంవత్సరాలు పాడగా వాటిలో 14 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సూర్య చంద్ర,బ్రహ్మాస్త్రం,సింహాసనం,ఖైదీ రుద్రయ్య,తండ్రి కొడుకుల ఛాలెంజ్,దొంగోడొచ్చాడు,ముద్దాయి వంటి సినిమాలకు పాడాడు. ఇక ఆ తర్వాత కృష్ణ సినిమాల్లో అయన పాడటం ఆపేసారు. ఎందుకంటే రాజ్ సీతారాంకి పాటలు పాడటం ఒక హాబీ మాత్రమే.

·

· కృష్ణ సినిమాలకు పాటలు పాడకముందే శోభన్ బాబు సినిమా జగన్ లో ఒక పాట పాడారు. ఆ తర్వాత రాజ్ సీతారాంకి పెద్దగా సపోర్ట్ లేకపోవటం,కృష్ణ సినిమాలకు బాల సుబ్రహ్మణ్యంతో పాడించటానికి రాయబారాలు సక్సెస్ అవ్వటంతో ఆ తర్వాత కృష్ణ సినిమాలకు బాల సుబ్రహ్మణ్యం పాడటం వరుసగా జరిగిపోయింది.

·

· 1990 పత్రికల్లో బాలుని ఎన్టీఆర్,ANR, శోభన్ బాబు తిరస్కరిస్తే కృష్ణ ఆదరించారని చెప్పుతారు. అయన వారి మధ్య గ్యాప్ పెరిగింది. ఇప్పటికి పల్లెలలో రాజ్ సీతారాం పాడిన సింహాసనం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే రాజ్ సీతారాం ఏమి చేస్తున్నారనే సందేహం కలుగుతుందా? ఆ తర్వాత రాజ్ సీతారాం Rural Management లో డిగ్రీ చేసారు. గుజరాత్‌లో ఈ కోర్సు తర్వాత, శ్రీరామ్ వెంచర్స్ గ్రూప్‌లో కొన్నాళ్లు పని చేశాడు. ఆ తర్వాత వీడియోకాన్ గ్రూపులో కూడా పని చేశాడంటారు. ఐతే యూఎస్ లో ఐవా ఫార్మా పిటిఈ లిమిటెడ్ అనే పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా పదవి నిర్వహిస్తున్నాడు. న్యూ జెర్సీ ప్రిన్స్‌టన్ ఏరియాలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. జెనెరిక్ ఫార్మాలో ఇది కూడా లీడింగ్ కంపెనీ. రెండేళ్ల క్రితమే ఈ సంస్థకు అమెరికా నుంచి 30 మిలియన్ డాలర్ల భారీ ఫండింగ్ సమకూరింది. ఇంత పెద్ద కంపెనీకి ఉపాధ్యక్షుడిగా పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ సీతారాం జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఈషా ఫౌండేషన్‌లో వలంటీర్ గా కూడ పని చేశాడు. పర్యావరణ హితం కోరుతూ జరిగే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంటాడు రాజ్ సీతారాం.

· · గుజరాత్ లో శ్రీరామ్ వెంచర్స్ లో కొంతకాలం పనిచేసారు. ఆ తర్వాత కొంతకాలం VIDEOCON లో కూడా పనిచేసారు. ఆ తర్వాత US వెళ్లి సెటిల్ అయ్యారు. రాజ్ సీతారాం US లో పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-22-ఉయ్యూరు

· ఆకాశంలో ఒక తార-రచన వేటూరి -గానం రాజ్ సీతారం ,సంగీతం -బప్పిలహరి

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

ఇలలో ఒక చందమామ
ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ
ఒడిలో పొంగింది ప్రేమ

తార జాబిలి కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

అనురాగం అందంగా మెరిసింది
నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే
నీ ముద్దుముంగిళ్ళలోన

అనురాగం అందంగా మెరిసింది
నీ కళ్ళలోన అందుకో నా లేతవలపే
నీ ముద్దుముంగిళ్ళలోన

కదిలే నీ ప్రాణశిల్పం
మదిలో కర్పూరదీపం
కదిలే నీ ప్రాణశిల్పం
మదిలో కర్పూరదీపం

నింగి నేల కలిసినచోట
ఏ వెలుతురూ రాదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో
ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి
దోసిళ్ళలోన

అలలై నా సోయగాలు పాడాలి
యుగయుగాలు
అలలై నా సోయగాలు పాడాలి
యుగయుగాలు

వాగు వంక కలవని నాడు
ఏ వెల్లువ రాదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ

కాలంతో ఈ బంధం
ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన

కాలంతో ఈ బంధం
ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన

నీవే నా రాచపదవి
నీవే నా ప్రణయరాణివి
నీవే నా రాచపదవి
నీవే నా ప్రణయరాణివి

నీవు నేను కలవకపోతే
ప్రేమన్నదే లేదులే

ఆకాశంలో ఒక తార
నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే

Posted in సినిమా | Tagged | Leave a comment