గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 373-హర్యానా లోని ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ సాన్ స్క్రిట్  అండ్ మైథలాజికల్ స్టడీస్  వారి ఆధ్వర్యం లో వెలువడిన సంస్కృత గ్రంధాలు –

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

373-హర్యానా లోని ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ సాన్ స్క్రిట్  అండ్ మైథలాజికల్ స్టడీస్  వారి ఆధ్వర్యం లో వెలువడిన సంస్కృత గ్రంధాలు –

1-శ్రీ దిగ్వే కర్ యాచించిన -కురుక్షేత్ర మాహాత్మ్యం 2-నాగేశభట్టు రాసిన -పరమ లఘుమంజరి 3-డా జి ఏం భట్టాచార్య రాసిన మేఘ దూత టీకా 4-నారాయణ తీర్థుల -కుసుమాంజలికారికా వ్యాఖ్య 5-రాజానక ఆనందకవి కృత-ష్తత్రి0శత్తత్వ సందోహ 6-డా కపిల్ దేవ శాస్త్రి రచన -గాణాపత్య 7-డా బల్దేవ్ సింగ్ కృత -పాదపదార్ధ సమీక్ష 8-ధర్మోత్తర వ్యాఖ్యతో న్యాయబిందు 9-డా ఎస్ యెన్ శాస్త్రి రాసిన -దయానంద దర్శన 10-డా ఎస్ యెన్ శాస్త్రి కృత -వేదం ప్రామాణ్య తదా ఋషి దయానంద

374-ఘెరండ  సంహిత కర్త -ఘెరండుడు (17 వ శతాబ్దం )

హఠ  యోగం పై ఉన్న మూడు ప్రసిద్ధ గ్రంధాలలో ‘’ఘెరండ సంహిత ‘’ఒకటి మిగిలిన రెండు హఠ యోగ ప్రదీపిక ,శివ  సంహితలు ,ఘెరండుడు చంద్ర కాపాలికి బోధించిన హఠ యోగం ఇది . 17 వశతాబ్దికి ఈ చెందిన ఈ గ్రంధం హఠయోగానికి విజ్ఞాన సర్వస్వము .దీనిలో సప్త విధ యోగాలు చెప్పబడినాయి 1-శతికర్మ -బాహ్యాభ్యంతర శుచికి 2-ఆసన -బలానికి 3-ముద్ర -నిశ్చలత్వానికి 4-ప్రత్యాహార -ప్రశాంతికి 5-ప్రాణాయామ -తేలిక కు 6-ధ్యాన దర్శనానికి 7-సమాధి -తాదాత్మ్యానికి చెప్పబడ్డాయి .ఇది ‘’ఘటస్థ యోగం ‘’కు చెందినదిగా కూడా భావిస్తారు .సమాధి ప్రకరణం లో పతంజలి చెప్పినదానికంటే అనేక పద్ధతులు దీనిలో చెప్పబడ్డాయి -ఒక శ్లోకం –

‘’అద్యశ్య సేతే పద యుగ్మ వ్యస్తం పృష్టే  నిధియాపి ధృతం కరాభ్యాం -ఆకుంచ  సంయ ద్యుదరాస్తు గాఢం ఉష్టం ఉచ్ఛం చ పీఠం యాతాయో వదంతి ‘’(ఉష్ట్రా సన వర్ణన  )భావం -ముఖం కిందకు వంచి రెండుకాళ్లు వెనక్కిమడిచి ,పాదాలను చేతులతోపట్టుకొని పొట్ట .మూతి అక్కలిస్తే ఉష్ట్రాసనం

375-శివ సంహిత -అజ్ఞాత కవి  (17 వశతాబ్దం )

హఠ యోగం పై మరోగ్రంధమే శివ సంహిత శివుడు పార్వతికి తంత్ర శాస్త్రాన్ని గురించి బోధించిన గ్రంధం .1 7 వశతాబ్దిలో దీన్ని వారణాసిలో  ఒక అజ్ఞాత కవి రాసినట్లు దీని పై డి ఫిల్  పరిశోధన రాసిన డా మాలిన్సన్ అభిప్రాయపడ్డాడు.దీన్ని తంత్ర శాస్త్రమని కవి చెప్పాడు .ఇందులో 84 ఆసనాలు చెప్పబడ్డాయి .కానీ అయిదింటినిమాత్రమే పూర్తిగా వివరించి చెప్పాడు .సామాన్య గృస్తహుకూడా దీన్ని అభ్యాసం చేయచ్చు అనికవి భరోసా ఇచ్చాడు  అనేక ఆంగ్లానువాదాలున్నాయికానీ 1884 లో లాహోర్ కు చెందిన శ్రీ చంద్ర వాసు అనువాదం పరిపుష్ఠిగా ఉందని విశ్లేషకులు భావిస్తారు .ఒక శ్లోకం చూద్దాం –

‘’ఏకం జ్ఞానం నిత్య  మాధ్యంత  శూన్యం  కిఞ్చిద్వత్తే తే వస్తు సత్యం -యద్దేవారి మన్నింద్రి యోపాధినా వై జ్ఞానస్యాయ భాసతే నాణ్య యైవ ‘’-భావం -జ్ఞానమొకటే శాశ్వత0 అది ఆద్యన్తరహితం .సత్యమైనది వేరొకటి లేదు ప్రపంచం లో మనం చేసే వైవిధ్యం ఇంద్రియ సంబంధమైనడది .ఈ భావం నశిస్తే ఉన్నదొక్కటే సత్యమనే  జ్ఞాన0

2-సత్యం కేచిత్ ప్రశంసంతి తపః శోచం తథాపరే -క్షమాం కేచిత్ప్రశంసంతితథైవ సమ్మార్జనం ‘’

భావం – కొందరు సత్యాన్ని కొంద రు స్వచ్ఛతను   మరికొందరు సన్యాసాన్ని పొగుడుతారు .కొందరు క్షమను కొందరు సమానత్వాన్ని రుజుత్వాన్ని పొగుడుతారు

375-హఠ  యోగ ప్రదీపిక కర్త –స్వామి స్వాత్మా రామ్ (15 శతాబ్దం)

స్వామి గోరఖ్ నాధ్(శ్రీనాధ్ ) శిష్యుడు స్వామి స్వాత్మారాం 15 వ శతాబ్దం లో హఠ  యోగ ప్రదీపిక రాశాడు .హఠ  యోగం పై ఇదే మొదటి గ్రంధం .దీనిలో భౌతిక ఆంతరిక శుద్ధి వివరించాడు .ఆసన ,ప్రాణాయామాలపై ఎక్కువ దృష్టిపెట్టాడు .దీనికి ఆంగ్లం లో పంచన్  సిన్హా చక్కని వ్యాఖ్య రాశాడు .

‘ఆసనాలపై చెప్పిన మొదటి శ్లోకం ‘’శ్రీ ఆదినాధాయ నమోస్తు తస్యై ఏనాపాదిస్టా హఠ యోగ క్రియా – విభ్రాజతే  పరే న్నత  రాజయోగం ఆరో ఆరో ధుమి చ చ్చోరాది రోహిణీవ ‘’

భావం -హఠ యోగ విజ్ఞానాన్ని వ్యాప్తి చేసిన ఆది దేవుడైన శివునికి ప్రణామం .ఇది రాజయోగాన్ని అధిరోహించటానికి మెట్టుగా తోడ్పడుతుంది

‘’ప్రణమ్య శ్రీ గురుం నాదం స్వాత్మా రామేణ యోగినా -కేవలం రాజ యోగాయ  హఠ విద్యో పాదిశ్యతే ‘’

 భావం –  స్వాత్మానంద యోగి గురువైన శ్రీనాధునికి నమస్కరించి రాజయోగ మార్గాన్ని దారి చూపే హఠ యోగాన్ని రాస్తున్నాడు ..

  సశేషం

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-17- కాంప్-షార్లెట్- అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 368-ధనుర్వేద కర్త -సారంగధర (15 వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణం -3

368-ధనుర్వేద కర్త -సారంగధర (15 వ శతాబ్దం )

15 వ శతాబ్దం లో సారంగధరుడు రాసిన బృహత్ సారంగధర పధ్ధతి లో ధనుర్వేద విషయాలున్నాయి .దీన్ని ఇంగ్లిష్ లోకి పీటర్ పియర్సన్ అనువదించి 1888 లో బాంబే ప్రెస్ లో ప్రచురించాడు . దీన్ని గురించి కవి ఇలా చెప్పాడు -’’పరమ శివుడు వ్యాసమహర్షికి బోధించిన ధనుర్వేదం నుండి నేను సంగ్రహించి దీన్ని రాస్తున్నాను .సారంగధారుడనే నేను తప్ప ప్రపంచం లో ధనుర్వేదం లో  ప్రావీణ్యం ఉన్నవారులేరు .  కారణం నాకు శివుడు బోధించాడుకనుక .ఇందులోని విషయాలు శక్తి సమర్థులైన  దనుషుకుడైన చింతామణి చెప్పిన విషయాలను చూసి దీనిపై ఎవరికీ సందేహాలు ఉండాల్సిన పని లేదు .విలుకాండ్రు శ్రద్ధగా నేను చెప్పినట్లు సాధన చేసి మహా ధనుష్కులు కావాలి .సింహం గుహలో ఉంటేనే అరణ్యం లోని జంతువులు వణికి దగ్గరకు రానట్లు  మంచి విలువిద్యా వేత్త ఉన్న ఊరిలో కి శత్రువులెవరూ ప్రవేశించే సాహసం చేయరు .శిష్యుల గుణ పరీక్ష చేసి గురువు ఈ విద్య నేర్పాలి .బ్రాహ్మణ శిష్యుడికి ధనుస్సు క్షత్రియునికి ఖడ్గం ,వైశ్యునికి బల్లెం ,శూద్రునికి గదలలో గురువు శిక్షణ నివ్వాలి .బాహుయుద్ధం 7 రకాలు .వీటిని ధనస్సు ,చక్రం, బల్లెం గద,ఖడ్గం చురిక  చివరికి చేతులతో యుద్ధం చేయాలి .వీటన్నిటిలో ప్రావీణ్యం ఉన్నవాడిని ‘’సప్త యోధుడు ‘’అంటారు .నాల్గింటిలో శక్తిఉంటే ‘’భార్గవ ‘’అని రెండు మాత్రమే నేరిస్తే ‘’యోధ  ‘’ అని ఒక్కటే నేరిస్తే ‘’గణక ‘’అనీ అంటారు .హస్త ,పునర్వసు ,పుష్యమి ,రోహిణి ,ఉత్తర ,అనూరాధ అశ్విని రేవతి నక్షత్రాలలోను దశమినాడు  పుట్టినవారు విలువిద్య లో నేర్పరులౌతారు .ధనుర్విద్య నేర్చుకొనే ముందు గురువుకు బ్రాహ్మణులకు బ్రాహ్మణ స్త్రీలకూ సహ పాఠకులకు విందు నివ్వాలి అంతకు ముందు శివ పూజ చేయాలి .ధనుర్విద్య నేర్చే శిష్యుడు జింక చర్మం ధరించి వింటికి బాణాలకు పూజ చేసి ,రెండు చేతులతో నమస్కరించాలి .గురువు శివమంత్రాలు చదువుతూ శిష్యుని చేతులను శుభ్రపరచి వాటిపై తన చేతులుంచాలి .విఘ్న నివారణకు పూజలు చేయాలి .శిష్యుడి జుట్టుకు ముడివేసి దానిపై శివుని శిరసుపై  కేశవుని రెండుబాహువులలో ,బ్రాహ్ణను నాభిలో  ,వినాయకుని తొడలలో ఆవాహన చేయాలి .ఓం హోమ్ మంత్రం తో  ఈ దేవతలను స్థాపించిన చోట పూజించాలి -పూర్తి మంత్రం –

‘’ఓం హోమ్ శిఖా స్థానే శంకరాయనమః -ఓం హోమ్ బాహువో కేశవాయనమః -ఓం హోమ్ నాభి మధ్యే బ్రాహ్మణే నమః -ఓం హోమ్ జంఘాయోర్ గణపతయే  నమః ‘’

 ఇలా 226 శ్లోకాలతో ‘’శివ ధనుర్వేదం ‘’ను వ్యాస మహర్షి శివుడు బోధించగా రాశాడని సారంగ ధరుడు పేర్కొన్నాడు .

369-మల్ల యుద్ధ పురాణకర్త -జ్యేష్ఠ మల్లుడు (13 వ శతాబ్దం )

మల్లయుద్ధం రామాయణ భారత కాలం నుండే ఉంది .దీనికి సంబంధించిన నీతి నియమాలు ప్రచారం లో ఉన్నాయి .. సిద్దార్ధ గౌతముడు కూడా గొప్ప మల్ల యుద్ధ విశారదుడు . 1124-1138వరకు పాలించిన చాళుక్యరాజు మూడవ సోమేశశ్వరుడు పండుగ పబ్బాలలొ ఖాళీ సమయాలలో’’ మల్ల వినోదం ‘’ ఏర్పాటు చేసినట్లు ఆయనే రాసిన ‘’మానసోల్లాసం ‘’లో ఉంది .మల్లయోధులను వయసు బరువు ,బలం ఆధారంగా విభజిస్తారని ,వాళ్ళు ఎలా వ్యాయామం చేయాలో ఏవి తినాలో కూడా వర్ణించాడు .రాజులే మల్లయోధుల బాధ్యత వహించి వారికి కావలసిన ఆహారపదార్ధాలు పాలు మాంసం పప్పు ధాన్యాలు సమకూర్చాలి .వారిని ఆడవారికి దూరం గా ఉంచి శరీరం రాటు దేలేట్లు బాడీ బిల్డింగ్ కోసం శిక్షణ నిప్పించాలి . మల్ల పోరాటం లో కదలికలు దెబ్బలు వగైరా అన్నీ చర్చించాడు రాజు

 అసలు మల్ల యుద్ధం పై ప్రత్యేక పురాణమే రాశాడు 13 వ శతాబ్దానికి చెందిన గుజరాత్ బ్రాహ్మణ మల్లయోధకవి జ్యేష్ఠ మల్లుడు . ఇందులో మల్లురలో ఉండే తేడాలు వారి ఆహారం ,సాధన ,చేయాల్సిన వ్యాయామాలు ,పాటించాల్సిన టెక్నీక్ లు  కుస్తీ గోదా తయారు చేసేపద్ధతి  కుస్తీ పట్టేవారు ఏ కాలం లో ఏయే పదార్ధాలు తినాలి అన్న అన్ని విషయాలు ఇందులో జ్యేష్టమల్ల రాశాడు .ప్రథమాధ్యాయం లో ప్రారంభ శ్లోకం –

‘’ఏకస్మినన్ కమలాకటాక్ష వివరే సందగ్ధార్యతే – క్షీరాబ్దే రపరత్న దీర్ఘ ధవలైహ్ కల్లోలలోలాత్కరైహ్

వ్యగ్రస్యాపి సామార్దితప్రమ నవ్యాపరాలబ్దో దయా -శ్చత్వారో వితరంతు వాంఛిత ఫలం హరే ర్భగవః ‘’

ధర్మా ధర్మ విదిహ్ ప్రోక్తో బ్రాహ్మన్ సమ్యక్ శ్రుతో మయ -విద్యాశ్చ వివిదాహ్ స్వామిన్ వర్ణ భేదాసత్వనేకధా

మల్ల విద్యా త్వయా ప్రోక్తం మమ సంక్షేపతః పురో -విస్తరేణ  మమ బ్రూహి తస్యాం కౌతూహలం హి మే

 ఈ మల్లపురాణం లో నారద బ్రహ్మ కృష్ణ బలరామ ,సోమేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ల మధ్య జరిగిన సంవాదం వీరు తప్ప ఇంకా ఎవరిపేరూ ఉండదు .చివరలో తాను  కాశ్యప గోత్రీక బ్రాహ్మణుడనని చెప్పుకొన్నాడుకవి .ఇది 18 అధ్యాలున్నగ్రంధం మొదటి అధ్యాయం లో కంసవధ తర్వాత కృష్ణాదులు ద్వారకకు ప్రయాణమవటం దారిలో శ్రీరాముడు తపస్సు చేసి బ్రాహ్మణులకు ఆవాసం కల్పించిన ధర్మారణ్యం లోని మయూరాంబలం  పట్టణానికి రావటం ,రెండవ అధ్యాయం లో గర్గ గోత్రీకుడు సోమేశ్వరుడు అడుగగా కృష్ణుడు మల్లయుద్ధాన్ని గురించి వివరించి అతనినికూడా మల్లయోధుడవమని ప్రోత్సహించటం ,ఆయన సందేహాలు అడగటం వాటిని కృష్ణుడు నివారించి మల్ల యుద్ధాన్ని గురించి బోధించటం ,చివరి అధ్యాయం లో మల్లశాస్త్ర వివరనతర్వాత బలభద్రుడు విసుగుతో అరణ్యానికి వెళ్లబోతుండగా ఆపటం మహేశ్వరి బ్రాహ్మి వైష్ణవి శక్తి లను సృష్టించటం సోమేశ్వరుడు మల్ల విద్యాభ్యాసం చేసి కృష్ణుడిని తనకు  రక్షగా  ఉండమనటం కృష్ణుడు రక్షణకోసం లంబాజా దేవి ‘’ని సృష్టించటం .మొత్తం కాదాంశం .

370- సంస్కృతాన్ని శిరో భూషణంగా శిరసావహిస్తున్న ఉత్తరాఖండ్

కర్ణాటకలో ఒకటి రెండుగ్రామాలలో ప్రజలందరూ సంస్కృతం లోనే మాట్లాడుకొంటారని మనం తెలుసుకున్నాం . దేవతా భూమి అయినా ఉత్తరాఖండ్ తానేమీ వెనకబడి లేదని నిరూపించింది అక్కడ సంస్కృతం రెండవ భాషగా చేసి ప్రోత్సహిస్తున్నారు .స్కూల్స్ లో సంస్కృతం తప్పని సరి చేశారు .పుణ్య స్థలి ఋషీకేశ్ ను సంస్కృత సిటీ ని చేసిందిప్రభుత్వం .అక్కడి ‘’భంటోలీ’’గ్రామ ప్రజలందరూ  ఏడాది న్నర కాలం నుంచి   సంస్కృతం లోనే మాట్లాడుకొంటున్నారు .ముఖ్యంగా మహిళలు  ఫోన్ పలకరింపుల్లో కూడా ‘’హరి ఓం నమస్తే ,భవాన్  కదం అస్థి ‘’అని అంరంటారు . వీళ్ళు కాషాయం కట్టుకున్నవాళ్ళు కాదు సాధారణ గ్రామజీవులు .ఉత్తరాఖండ్ లో భాంటోలి దేహరాడూన్ కు 450 కిలో మీటర్ల దూరం లో ఉన్న కుగ్రామం .వారి మాతృ భాష స్థానిక ‘’కుమోని ‘’కానీ ఇప్పుడు .శతాబ్దాలతరబడి వస్తున్న సంస్కృతం.  భాంటోలి లోని 500 గ్రామస్తులందరు  గీర్వాణమే మాట్లాడుతారు  .దీనికి కారణం సుమారు ఏడాదిన్నర క్రితం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భా0టోలి గ్రామాన్ని ‘’భాంటోలి సంస్కృత గ్రామం ‘’గా ప్రకటించటమే . 30 ఏళ్ళ శ్రీ మనోజ్అధికారి మొదటి సంస్కృత ఆచార్యుడుగా ఇక్కడికి వచ్చి గ్రామస్తులకు సంస్కృతం నేర్పటం ప్రారంభించాడు .ఇప్పుడు దేశం లో 5 వ సంస్కృత గ్రామంగా భాంటోలి రికార్డ్ సృష్టించింది .మిగిలిననాలుగు కర్ణాటకలోని మత్తూర్ ,హోషనహళ్లి  ,మధ్యప్రదేశ్ లోని మొహద్ , ఝిరీ గ్రామాలు . ఈ అయిదు సంస్కృత భారతిఅనే స్వచ్చంద సంస్థ  ఆధ్వర్యం లో నడుస్తున్నాయి .

  బయటి గ్రామాలనుంచి భాంటోలి గ్రామానికి వచ్చిన వారికి గ్రామస్తులు అంతా సంస్కృతం లోనే మాట్లాడుతుంటే కలా  నిజమా ,తాము 5 వశతాబ్దం లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది .సంస్కృతం దేవ భాష అని వీరందరూ విశ్వసించి అనుసరిస్తున్నారు .ఇప్పుడు హరిద్వార్ లో ఉన్న ఉత్తరాఖండ్ సంస్కృత విశ్వ విద్యాలయం సంస్కృతం లో బీఎడ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది .రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి సంస్కృతాన్ని రెండవ భాషగా హిందీని మొదటిభాషగా  డిక్లేర్   చేసి ప్రోత్సహించింది .సంస్కృతం లో శాస్త్రి కోర్సు పూర్తి చేసినవారు డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారికే సంస్కృత బీఎడ్ కు అర్హులు .ఆగస్టు 15నుంచి అడ్మిషన్లు ప్రారంభమై 175 మంది విద్యార్థులతో 12 మంది అధ్యాపకులతో కళకళ లాడుతోంది .హరిద్వార్ -రూర్కీ జాతీయ రహదారిలో సంస్కృత యుని వర్సిటీ నిర్మాణం శరవేగం గా జరుగుతోంది .యూనివర్సిటీ మొదట ఇద్దరు డిగ్రీ సంస్కృత విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు  యోగా ,కంప్యూటర్  జరలిజం లైబ్రరీ సైన్స్  అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కు చెందిన 150 మంది విద్యార్థులతో నిండుగా ఉంది .

  భారత దేశం లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక్కటే సంస్కృతాన్నిమొట్టమొదటిసారిగా  రెండవ అధికార భాషగా ప్రకటించింది .ఈ బిల్లు 2009 లో పాస్యయింది .కాళిదాస మహాకవి ఉత్తరాఖండ్ లో జన్మించాడని ఇక్కడి ప్రజల పూర్తి విశ్వాసం .రాష్ట్రం లో అనేక సంస్కృత మీడియంపాఠశాలలు కాలేజీలు సంస్కృత విద్యా వ్యాప్తికి సహకరిస్తున్నాయి .ప్రభుత్వం కూడా వీటికి తగినంత సహాయ మందిస్తోంది  . నిత్యవాడకం లో సంస్కృతాన్ని ఉపయోగించటం ,పోటీ పరీక్షలలో పాల్గొనిబహు  మతులు సాధించటం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రదమా ,ద్వితీయ  తృతీయ బహుమతుల కోసం ఒక లక్షా ,యాభై వేలు, 25 వేలు నగదు పారితోషికాన్నిస్తోంది .ప్రభుత్వం ఆధ్వర్యం లో 100 దాకా సంస్కృతపాఠశాలలు కాలేజీలు నడుస్తున్నాయి .వీటన్నిటికీ ప్రాభుత్వం పూర్తి గ్రాంట్ సమకూరుస్తోంది .సంస్కృత యూనివర్సిటీతోపాటు మరి 4 యూనివర్సిటీలలో సంస్కృతం బోధిస్తున్నారు .ఉచిత మధ్యాహ్నభోజనం తోపాటూ కంప్యూటర్లు స్కాలర్షిప్ లు ఇచ్చి మరింతగా ప్రోత్సహిస్తోంది .

 ఉత్తరాఖండ్ సంస్కృత అకాడెమీ కూడా తనదైన శైలిలో సంస్కృతభాషాభి వృద్ధి చేస్తోంది .సంస్కృతనాటకాలు నృత్యాలు సంగీతకచేరీలు ,ఆశుభాషణం  జనరల్ నాలెడ్జి బృందగానం  కార్యక్రమాలు జిల్లాస్థాయి రాష్ట్ర స్థాయిలో నిర్వహించి బహుమతులు అందిస్తోంది .సంస్కృత నాట్య యాత్రలు సంస్కృత కుటుంబ సమ్మేళనాలు ,సంస్కృత గ్రామానిర్మాణం నిర్వహిస్తోంది .

వీటికి మించిహరిద్వార్ లోని  ఉత్తరాఖండ్ సంస్కృత అకాడెమి   భారత దేశం లోనే మొట్టమొదటిసారిగా సంస్కృత టి వి . ఛానల్ ప్రారంభించి ఆదర్శ ప్రాయంగా నిలిచింది .వార్తలేకాక సంస్కృత సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది .ఇది మాత్రమేకాదు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనం ను సెప్టెంబర్ లో నిర్వహిస్తోంది .ఇలా గీర్వాణ భాషకు గొప్పతనం అన్ని కోణాలలో అన్ని రూపాలలో సంతరిస్తున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం అభినందనీయం ..

371-త్రిపురా రహస్య కర్త -హరితాయనుడు

దత్తాత్రేయమహర్షి పరశురాముని బోధించిన అద్వైత తత్వమే త్రిపురా రహస్యం .ఒకరకంగా ఏ రహస్యములేనిది అని అర్ధం .త్రిమూర్త్యాతీతమైన విషయం అని భావం .త్రిపురాలు అంటే మూడు పట్టణాలు మాత్రమేకాదు -జాగృతి ,స్వప్న సుషుప్తులు .వీటిలోని అంతశ్చేతన నే  ‘’శ్రీ త్రిపుర సుందరి  ‘’అంటారు  .ఆమెయే  మాతృమూర్తి చండిక.ఈ గ్రంధం అత్యున్నత ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది . ఈ తత్వాన్ని పరమ శివుడు విష్ణుమూర్తికి బోధిస్తే ,ఆయన మానవ రూపం లో  దత్తాత్రేయ  అవధూతగా  జన్మించి  పరశురాముని బోధిస్తే ,ఆయన హరితయానుడికి చెప్పాడు .దత్తాత్రేయ ,పరశురాముల సంవాదమే త్రిపురారహస్యం .దీనికే ‘’హరితాయన సంహిత ‘’అనే పేరుంది .హరితాయనుడు హరితుని కుమారుడు . ఈ గ్రంధం 3  ఖండాలలో  12 ,000 శ్లోకాలలో ఉంటుంది .మొదటిఖండం మహాత్మ్య ఖండం రెండవది జ్ఞాన ఖండం మూడవది చర్య ఖండం . అత్రి ముని అనసూయ దంపతుల ప్రార్ధనమన్నించి త్రిమూర్తులలో బ్రహ్మ చంద్రుడుగా శివుడు దూర్వాసమహర్షిగా ,విష్ణువు నారాయణుడు అనే దత్తాత్రేయునిగా జన్మిస్తారు .జమదగ్ని రేణుకాదేవి దంపతుల కుమారుడు పరశురాముడు తండ్రి ఆజ్ఞతోతల్లిని చంపి దేశం లో క్షత్రియ వంశ నిర్మూలనకు దిగి ,శ్రీరాముని చేతిలో పరాభవం పొంది గర్వం ఖర్వమై హిమాలయాలకు వెడుతూ దారిలో బృహస్పతి తమ్ముడైన అవధూత సంవర్తుని దర్శించగా  దత్తాత్రేయుని శరణు వేడ మని హితవు చెబుతాడు .దత్తాత్రేయునికి పరశురాముని జరిగిన జ్ఞాన సంవాదం లో వెలువడింది త్రిపురా రహస్యం .దీనితో ఆత్మ జ్ఞానం పొందిన పరశురాముడు మలయ పర్వతాలలో తపస్సు లో కాలం గడిపాడు . దీనికి ఇంగ్లిష్ అనువాదాలు చాలా ఉన్నాయి .తెలుగు లో లోనూ అనువాదాలు వచ్చాయి . ఒకటి రెండు శ్లోకాలు చూద్దాం –

‘’ఏకైక భావ తుస్టై కర  సైకత జనప్రియ -ఏ దమానప్రభా వైదద్భక్త పాతకనాశినీ

ఏలామోద  ముఖై నౌద్రి శక్రాయుధ సమాస్థితః -ఈహాశూన్యే ప్సితే శాది సేవ్యే శానా వరాఙ్గతా ‘’

372-న్యాయ బిందు టీకా కర్త -ధర్మోత్తర (క్రీశ 800 )

బౌద్ధ ప్రమాణాలపై ప్రామాణిక గ్రంధాలురాసిన ధర్మోత్తర 8 వ శతాబ్దికి చెందినవాడు . ధర్మ కృతి పై అనేక వ్యాఖ్యానాలు రాశాడుకాని సంస్కృత న్యాయబిందు టీకా ఒక్కటే దక్కింది .ఇవికాక అపోహ నామ ప్రకారణ ,క్షణ భంగ సిద్ధి, పరలోక సిద్ధి ,ప్రమాణ పరీక్ష ,ప్రమాణ వినిశ్చయాటీకా కూడా రచించాడు .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 366-భారత జాతీయ గీతం కావాల్సిన ‘’జయజయ ప్రియభారత జనయిత్రి ‘’గీత కర్త -పద్మభూషణ్ -దేవులపల్లి కృష్ణ శాస్త్రి(1897- 1980)

            గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

366-భారత జాతీయ గీతం కావాల్సిన ‘’జయజయ ప్రియభారత జనయిత్రి ‘’గీత కర్త -పద్మభూషణ్ -దేవులపల్లి కృష్ణ శాస్త్రి(1897- 1980)

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.

ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా “కృష్ణపక్షం కావ్యం” రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది.

తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే “ఊర్వశి” అనే కావ్యం వ్రాశాడు.

1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో[] ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.

భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి… బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి.

‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు …దేవులపల్లి కృష్ణశాస్త్రి.

గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించాడు.

కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి.

పురస్కారాలు

ప్రముఖుల అభిప్రాయాలు

 • మహాకవి శ్రీశ్రీ – నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.

 • విశ్వనాథ సత్యనారాయణ – మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.

రచనలు

 • కృష్ణ పక్షము : ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.

 • ఊర్వశి కావ్యము,

 • అమృతవీణ – 1992 – గేయమాలిక

 • అమూల్యాభిప్రాయాలు – వ్యాసావళి

 • బహుకాల దర్శనం – నాటికలు,కథలు

 • ధనుర్దాసు – నాలుగు భక్తీ నాటికలు,

 • కృష్ణశాస్త్రి వ్యాసావళి – 4 భాగాలు

 • మంగళకాహళి – దేశభక్తి గీతాలు

 • శర్మిష్ఠ – 6 శ్రవ్య (రేడియో) నాటికలు

 • శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993

 • మేఘమాల – సినిమా పాటల సంకలనం – 1996

 • శ్రీ విద్యావతి – శృంగార నాటికలు

 • యక్షగానాలు – అతిథిశాల – సంగీత రూపకాలు

 • మహాతి

 • వెండితెర పాటలు – 2008

దేశభక్తి గీతం—భారత మాత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!

జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి!

జయ జయ జయ…..

జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల!

జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా!

జయ జయ జయ…….

జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ!

జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ!

జయ జయ జయ…….

367-చిన్నలకు పెద్దలకు సంస్కృత0 బోధిస్తున్న టీనేజ్ కుర్రాళ్ళు –అశోక్, సిద్ధార్ధ ( 2000)

9 ఏళ్ళ అశోక్ ,11 ఏళ్ళ సిద్దార్ధ అమెరికాలో పెన్సిల్వేనియా కుర్రాళ్ళు .వాళ్ళ గురువుగారు భారతీయ భోజనం ఎలా చేయాలో  బోధించినందుకు సంస్కృత శ్లోకం లో —’’నమో నమః ఆవయోవ గురు భారతస్య  భోజనస్య పద్ధతిమ్ ఆవామ్ వర్ణిత వాన్ ‘’అంటూ గురు స్తుతి చేసిన వినయ సంపన్నులు .

యు ట్యూబ్ లో ‘’సాంస్క్రిట్  కార్నర్ ‘’ను ఈ చిచ్చర పిడుగులు యెర్ర కుర్తా లతో ఫాలభాగాన విభూతి రేఖలతో పంచామృత ప్రసాదం శ్లోకాలు చదువుతూ వీడియోలో కనిపిస్తారు .ఈ వీడియోని ఇప్పటికి 50 వేలకు పైగా జనం చూసి మెచ్చారు .సంస్కృత కార్నర్ కు 800 కు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు . ఈ లెక్కలు ఇదివరకటి దాకా ఈసోదరులకు ఒక ఇన్స్పిరేషన్ గా  ఉండేది .ఇప్పుడు బాగా ప్రచారం లో ఉన్నారు కనుక వాటిపై దృష్టి లేదు అంటారు ..

 ఇప్పుడు టీనేజ్ లో ఉన్న ఈ సోదరద్వయం ధారాళంగా సంస్కృతం రాస్తారు ధారాళంగామాట్లాడాడుతారు .బి ఏ తో సమానమైన ‘’కోవిద ‘’కోర్సు చదివి డిస్టింక్షన్ లో సిద్దార్ధ ఉత్తీర్ణుడయ్యాడు .ఇప్పుడు సంస్కృత పంచకావ్యాలు అధ్యయనం చేస్తున్నాడు .ఒకప్పుడు హాబీ గా ప్రారంభమైన సంస్కృతం ఇప్పుడు ఈ సోదరుల నిత్య జీవిత వ్యాపకమే అయింది .2010లో సంస్కృతాన్ని తీవ్రంగా అధ్యయనం చేయాలన్న కోరికతో చెన్నై కి చేరుకున్న ఈ సోదరులలో 16 ఏళ్ళ సిద్దార్ధ చెన్నై రామకృష్ణా మఠం లో సంస్కృతాన్ని 10 ఏళ్ళ పిల్లలనుంచి సీనియర్ సిటిజెన్ల వరకు 10 రోజుల ఇంటెన్సివ్ వర్క షాప్ లో బోధిస్తున్నాడు .దీనిపై సిద్దార్ధ స్పందిస్తూ ‘’ఈ వర్క్ షాప్ లో నేను బాలుర నుంచి వృద్ధుల వరకు సంస్కృతం ను ఒక్క తమిళ మాటకాని ఒక్క ఇంగ్లిష్ మాటకాని వాడ కుండా అంతా సంస్కృతం లోనే బోధించటం గొప్ప అనుభూతిగా ఉంది .ఇది నాకు పెద్ద మానసిక శ్రమ కనుక నేను అనేక ఆధారాలు సాంకేతికాలు (ప్రాప్స్ అండ్ సైన్స్)లపై ఆధార పడాల్సి వచ్చింది’’  అని నిజాయితీగా చెప్పాడు .

 ఈ సోదరుల తల్లి శ్రీమతి విజయ విశ్వనాథన్  వీళ్లకోసమే చెన్నైకి వచ్చి వారికి  స్ఫూర్తిగా నిలిచింది .సుమారు 15 ఏళ్ళక్రితం స్వామి దయానంద సరస్వతి ప్రవచనాలతో స్ఫూర్తి పొంది భగవద్గీత ,ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు అధ్యయనం చేస్తూ సంస్కృతంలో గట్టిగా కృషి చేసింది .అమెరికాలో  ‘’సంస్కృత భారతి ‘’లో నేనూ నా పిల్లలతో పాటు సంస్కృతం నేర్చుకున్నాను .మేము ముగ్గురం కలిసి సంస్కృత పరీక్షలు రాశా0 .మా ఇంట్లో సంస్కృతం ఒక అఫీషియల్ సీక్రెట్ మాకు ‘’అంటూ చిరునవ్వుతో ఆమాతృమూర్తి’’ వార్టన్  బిజినెస్ స్కూల్ ‘’పూర్వ విద్యార్థిని , భర్తతో కలిసి ‘’ఫార్మా స్యూటికల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘’నిర్వహిస్తున్న   శ్రీమతి విజయ మాధవన్ చిరునవ్వుతో  చెప్పింది .

 పెన్సిల్వేనియా లో ఉన్నత వర్గాల వారు చదివే ప్రయివేట్ స్కూల్ లో చదువుతున్న తన ఇద్దరు పిల్లలను ఆ స్కూల్ మాన్పించి ఇంటి వద్దనే తానే  వారికి విద్య బోధించటం ప్రారంభించింది .దీనికి ఆమె చెప్పినకారణాలు ‘’మా వాళ్ళు చదివే స్కూల్ ఉన్నత వర్గాల పిల్లలు చదివేది పాప్ కల్చర్ బాగా ఒంటబట్టిన వారి మధ్య మా పిల్లలు ఉంటె మన విలువలు మృగ్యమై పోతాయనే వ్యధతో మాన్పించి నేనే మన విద్యను ఇంటివద్దే నేను ఫిజిక్స్ లెక్కలు నేర్పించాను .ఇంగ్లిష్  ,ఫైన్ ఆర్ట్ లను  ఆన్ లైన్ లో నేర్చుకొన్నారు  .రెగ్యులర్ గా ఆన్ లైన్ పరీక్షలు రాసి పాసవుతున్నారు .అని గర్వంగా చెప్పింది ఆ తల్లి .

 ఇండియాకు తిరిగి వచ్చాక స్కూల్ లో చేరారుకాని కొద్దికాలానికే మానేశారు .ప్రస్తుతం అశోక్ ,సిద్దార్ధ ఇద్దరు ‘’స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ‘’ఆన్ లైన్ హై స్కూల్ కర్రిక్యులం చదువుతూ స్టాన్దర్డ్ పరీక్షలు రాస్తున్నారు . సాధారణ స్కూల్ విద్య చదవ లేదనే దుగ్ధ వారికి లేదని చెప్పారు .సమయం ఎక్కువగా ఉండటం వలన సంగీతం ,వయోలిన్ నేర్చుకొంటూ వేద క్లాసులకు వెడుతూ సంస్కృతం బోధిస్తున్నారు .కర్ణాటక సంగీతాన్ని శ్రీమతి జి సీతా లక్ష్మి అమ్మాళ్ వద్ద ,వయోలిన్ శ్రీమతి చారుమతి రఘురామన్ వద్ద అభ్యసిస్తున్నారు .అరుదైన సంగీత కాంపోజిషన్స్ ను పద్మశ్రీ ఎస్ ఆర్ జానకీరామన్   వద్ద నేర్చుకొంటున్నారు . వేదం పాఠాల తర్వాత తగినంత  సమయం ఉంటోందికనుక తమకిష్టమైనవాటిని కష్టపడకుండా ఇష్టపడి నేరుస్తున్నామని సంతృప్తి వ్యక్తపరిచారు ఈ టీనేజీ కుర్రాళ్ళు ..’’మా ఇంట్లో టి వి లేదు .ఒక సెల్ ఫోన్ ఒక కంప్యూటర్ మాత్రమే ఉన్నాయి వాటినికూడా విద్యా వ్యాసంగానికే వాడుతాము .మా ఇంట్లో వేరే ఏ పరికరము లేదు .అందువల్ల మా అబ్బాయిలు వాళ్లకు కావాల్సిన విషయాలమీద పూర్తిగా దృష్టి పెట్టి చదివి ఉన్నతి సాధిస్తున్నారు .అదే మా అందరికి పరమానందం గా ఉంది అదే మాకు సంతృప్తి ‘’అన్నది ఆ బంగారు బాబుల మహా తల్లి  శ్రీమతి విజయ మాధవన్ . ఈ ఆదర్శ కుటుంబం అందరికీ ఆదర్శం అని పించి వీరి గురించి గీర్వాణం లో రాశాను .

 (ఆధారం -దీపా వెంకట్రామన్ 20-12-16 న ది హిందు  పత్రికలో రాసిన ‘’ది  టీనేజ్ సాంస్క్రిట్  స్కాలర్స్ -’’)

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-17 కాంప్-షార్లెట్-అమెరికా

 Inline image 1Inline image 2

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ/ ఆషాఢ శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు

Inline image 1Inline image 2

 

ఆషాఢ శుద్ధ ఏకాదశి 4-7-17 మంగళవారం శయన ఏకాదశి అనే తోలి ఏకాదశి శుభాకాంక్షలు

 

Inline image 1Inline image 2

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 365-వేద గణిత గ్రంథ కర్త – డా . శ్రీ రేమెళ్ళ అవధానులు(1948)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

365-వేద గణిత గ్రంథ కర్త – డా . శ్రీ రేమెళ్ళ అవధానులు(1948)

భారతీయ భాషలను మొట్టమొదట కంప్యూటరీకించి,వేదాలనూ కంప్యుట రైజ్  చేసిన భారతీయ మేధావి డా  శ్రీ రేమెళ్ళ అవధానులు  ‘’.యజుర్వేద సంహితలో టు టు ది పవర్ ఆఫ్ 19 వరకు అంకెల ప్రస్తావన ఉంది .దీన్ని ‘’లోక ‘’అంటారు .వాల్మీకి రామాయణం లో’’ మహౌమ’’ఉంది అంటే పది టు ది పవర్ ఆఫ్ 62 .పైధాగరస్ కనిపెట్టాడని చెప్పుకొంటున్న లంబ కోణ  త్రిభుజ సూత్రం బోధాయన ‘’శుల్బ సూత్రాలలో ‘’ఉంది .’’ఇన్ఫినిటీ ‘’గురించి ‘’పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ‘’శ్లోకం లో ఎప్పుడో మనవాళ్ళు చెప్పారు .హైడ్రోజెన్ ఐసోటోపుల ప్రస్తావన కృష్ణ యజుర్వేదం లో కనిపిస్తుంది .ఏకతాయ స్వాహా ద్వితాయా స్వాహా త్రితాయా స్వాహా ‘’లోని ద్వితా డ్యుటీరియం,త్రిథా త్ట్రిటీణీయంగా మార్చి నట్లు అనిపిస్తుంది  . ట్రిగనా  మెట్రీ ని  అందరికంటే ముందుకనుక్కోని ,ఆర్య భట్టు వరాహమిహిరుడు సైన్ ,కాస్ ల విలువలను ముందే చెప్పారు .  .స్టీమ్ ‘’అనే పదం పాణిని అష్టాధ్యాయి లో ఉంది .స్టీమ అర్జీ భావే ‘’అంటే ఆవిరి అవటం .న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ శక్తి ని భాస్కరాచార్యుడు 12 వ శతాబ్దం లో తన ‘’సిద్ధాంత శిరోమణి ‘’లో భూమ్యాకర్షణ శక్తిగా చెప్పాడు .ఆధునిక భౌతిక  రసాయన వైద్య వైమానిక శాస్త్రాలలో ఉన్న సమాచారం అంతా వేదాల్లో నిక్షిప్తమై ఉంది .అందుకే ‘’అన్నీ వేదాల్లోనే ఉన్నాయష ‘’అనే సామెత వచ్చింది .ఇది వెటకారం కాదు పచ్చినిజం ‘’అంటారు అవధానులుగారు .

  తనకు మంత్రాలపై మంచి అవగాహన ఉండేదని ,కానీ పరమాణు భౌతిక శాస్త్రం లో ఏం ఎస్ సి చేశానని చెప్పారు .అప్పుడే ఒక ప్రయివేట్ కంపెనీ మొదటిసారిగా కంప్యూటర్ కోర్సు ప్రకటన చేసిందని ,అందులో చేరి డిప్లొమా పొంది ,తర్వాత రాజోలు కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ గా పని చేస్తూ సాయంకాలలలో  ప్రక్కనే ఉన్న వేద పాఠ  శాలలో వేదం నేర్చుకొంటూ ,1971 లో హైదరాబాద్ లో యి.సి.ఐ.ఎల్. లో టెక్నీకల్ ఆఫీసర్ గా చేరి పని చేశారు .మన దేశం లో మొదట కంప్యూటర్ తయారు చేసింది ఈ కంపెనీయే .ఇక్కడ శిక్షణలో ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చరిత్ర కనిపించింది .దీన్ని 3 వేల  సంవత్సరాలక్రితమే  భారతీయులు కనుక్కొన్నట్లు తెలిసి ప్రాచీన గ్రంధాలపై ఆసక్తి పెరిగిందట .  ఇక్కడ పని చేస్తూకూడా వేదం నేర్చుకొంటూ ,అప్పటికి ఏ భారతీయ భాషా కంప్యూటరీకరించబడలేదని గ్రహించి మొదటగా తెలుగును కంప్యూటరీకించాలన్న ఆలోచనవచ్చి ఆయన స్నేహితులతోకలిసి 6 నెలలు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటర్ లోకి ఎక్కించారు .ఇలా 1976 లో భారతీయ భాషలలో తెలుగు భాష ఒక్కటే మొట్టమొదటిసారిగా కంప్యూటరైజ్ అయి అవధానులు బృందానికి ఘన కీర్తి నిచ్చింది.అప్పటి అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ వావిలాల గోపాల క్రష్ణయ్య గారు కంపెనీకి వచ్చి అభినందించారట .కానీ ఆఫీసువారి ప్రోత్సాహం కరువై ముందుకు సాగలేదన్నారు .

  తెలుగు కంప్యూటర్ లోకి ఎక్కిందన్న సంచలన వార్త పార్లమెంట్ ను కుదిపేసి ,హిందీ ని కూడా చేర్చమని  కంపెనీ అధికారులపై ఒత్తిడి వస్తే ,అవధానులు బృందం దాన్నీ ఎక్కించారు .పార్ల మెంటరీ కమిటీ వచ్చి చూసి స0తృప్తి చెంది అభినందించింది . 1978 లో ఢిల్లీ లో ‘’భారతీయ భాషల కంప్యూటీకరణ ‘’అనే అంశం పై సదస్సు నిర్వహించారు ,కానీ ప్రోత్సాహం కరువై ఆగిపోయింది . 1991లో నిమ్స్ లో పని చేస్తున్నప్పుడు గోదావరి పుష్కరాలలో తిరుమల దేవస్థానం గ్రంధాలు చదివి 1131 వేదం శాఖలకు కేవలం 7 శాఖలే మిగిలాయని చదివి అశ్రద్ధ చేస్తే ఇవి కూడా త్వరలోనే  అంతరించిపోతాయేమోననే భయమేసి ఎలా రక్షించుకోవాలన్నా ఆలోచనవచ్చి రికార్డ్ చేయిస్తే అంచిదనిపించి ,యజుర్వేదం నేర్చుకొంటూ ,మరీ ప్రమాద లో పడిపోయిన ఋగ్వేదం నేర్చిన వారెవరైనా ఉన్నారేమోనని అన్వేషణ చేస్తూ ,మహా రాష్ట్రలో ఒకాయన ఉన్నారని తెలిసి కుటుంబ సమేతంగా ఆహ్వానించి పోషణ బాధ్యత తీసుకొని వారితో ఋగ్వేదాన్ని 1992లో రికార్డ్ చేయించటం  ప్రారంభించారు .

 అదే సమయం లో తిరుపతి దేవస్థానం వారు ‘’అఖిల భారత వేద శాస్త్ర సమ్మేళనం ‘’నిర్వహిస్తున్నప్పుడు తనను వేదాలపై ఒక ప్రదర్శన ఇవ్వమని కోరగా ‘’నమక0 ‘’లోని మూడుమంత్రాలను వాటి అర్ధాలను సి లాంగ్వేజ్ సాయం తో కంప్యూటర్ లో పెట్టగా దాన్ని చూసిన ఉపరాష్ట్రపతి శ్రీ శంకర దయాళ్ శర్మ అవధానులుగారిని మనస్ఫూర్తిగా అభినందించి తనకు  10  నిమిషాల సమయాన్నిమాత్రమే ఇచ్చినా, శర్మగారు  45 నిమిషాలుదాకా  మాట్లాడి ప్రపంచం లోనే మొట్ట మొదటిసారిగా వేదాలను కంప్యూటర్ లో పెట్టిన ఈ విలువైన ప్రాజెక్ట్ ను పూర్తి చేయమని కోరారు .కంప్యూటర్ కొనాలంటే లక్షల మీద ఖర్చు .దీనికి అశ్విని హెయిర్ ఆయిల్  అధినేత సుబ్బారావు గారు వెంటనే ఒక లక్షా ఇరవై వేల  రూపాయలు ఉచితంగా ఉదారం గా అందజేయగా అవధానులుగారు అత్యాధునిక కంప్యూటర్ కొన్నారు .పని చేయటానికి కుర్రాళ్ళు కావాలి వాళ్లకు జీతాలు తనజీతంలోనుంచి ఇచ్చేవారు.  తానూ వారితో పంచేస్తూ ‘’వేద భారతి ట్రస్ట్ ‘’ఏర్పాటు చేయగా విరాళాలు అంది పని నిరాటంకంగా సాగింది . 1995 వేదానుక్రమణిక రాస్స్హారు . ఈ విషయాలు తెలుసుకొన్న రాష్ట్రపతి శ్రీ శంకర దయాళ్ శర్మ ఢిల్లీకి ఆహ్వానించారు .యజుర్వేదానికి చెందిన 7 అనుక్రమణికలు కంప్యూటరీకించి ,దేశం లోనే మొదటి సారి మల్టీ మీడియా లో ఆయనకు చూపించారు . ఆయన మహా గొప్పగా ఆనందించి అభినందించారు . 2000 నాటికి ఋగ్వేదాన్ని సి డి లలో పొందుపరచారు .వీటిని ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ ఆవిష్కరిస్తూ ‘’మా చిరకాల స్వప్నం సాకారమైంది ‘’అని మెచ్చుకొన్నారు .

 బెంగుళూరులో వైదిక సరస్సు జరుగుతుంటే పాల్గొనాలని వెడితే తనకు ఏ శాస్త్రం లోను ప్రవేశం లేదుకనుక అనుమతి లేదని చెబితే పట్టుబట్టి రాజమండ్రి ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన తనబాబాయి శ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి వద్ద మీమాంస శాస్త్రం నేర్చుకొన్నారు .తర్వాత సంస్కృతం జ్యోతిషం లలో ఏం ఏ చేసి ,’’వేదాలలో సైన్సు ,భూకంపాలు -జ్యోతిషం ‘’లపై పిహెచ్ డి చేసి ,వేదగణితం వేద విజ్ఞానా లపై చానళ్లలో కార్యక్రమాలు చేశారు .అవధానులుగారు చేసిన ‘’మల్టీ మీడియా వేదిక డేటా బేసిక్ డిజైన్ ‘’కు భారత ప్రభుత్వం పేటెంట్ హక్కునిచి ‘’సంస్కృత మిత్ర ‘’బిరుదుతో సత్కరించింది .

 వేద భారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటికి 700 కు పైగా గంటల రికార్డ్ పూర్తయింది .ఇది 200 కుపైగా ఆడియో మల్టీమీడియా సిడి లుగా తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచారు .మిగిలిన వేద శబ్దాన్ని రికార్డ్ చేయటానికి ఇంకా 2500 గంటలు కావాల్సి వస్తుందన్నారు .అంత ఆర్ధిక స్తొమత తమకు లేదని వదాన్యులు ముందుకు వచ్చి ప్రోత్సహించి వేద విజ్ఞానాన్ని సంరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు .అవధానులుగారు  ‘’వేద గణితం ,రామాయణ భాగవత భారతాలలో జ్యోతిశ్శా స్త్ర  విశేషాలు ,ఉపనిషత్ రత్నావళి ,సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాస్ అండ్ శాస్త్రాస్ ‘’గ్రంధాలు రాశారు .ఇంట గొప్ప పరిశోధకులు క్రియాశీలి వేద గణితం పై అధారిటీ అయినా శ్రీ అవధానులు గారి గురించి ఇంతఆలస్యంగా గీర్వాణ కవుల కవితా గీర్వాణం లో రాయటం క్షమించరాని నేరమే.అయినా ఇప్పటికైనా రాయగలిగా నని ఒక ప్రక్క సంతోషిస్తున్నాను.

 అవధానులుగారు 25-9-1948న తూర్పుగోదావరి పొగడపల్లి లో జన్మించారు .తండ్రిశ్రీ  వి సూర్య నారాయణ తల్లి శ్రీమతి లక్ష్మీ  నరసమ్మ .

   సశేషం

     మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా

— Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 362-సూర్య శతక కర్త -డా.దేవీ ప్రసాద్ మిశ్రా

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

362-సూర్య శతక కర్త -డా.దేవీ ప్రసాద్ మిశ్రా

పాండిచ్చేరి ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో ఇండాలజిస్ట్ డా దేవీ ప్రసాద్ మిశ్రా యువ సంస్కృత విద్యావేత్తగా ‘’మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ ‘’పురస్కారం 2015 లో అందుకున్నాడు .దీనికి ఒక లక్ష రూపాయల పారితో షికం ఇచ్చారు .ఈ పురస్కారాన్ని భారత రాష్ట్ర పతి శ్రీ ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదుగా 2016 అందుకున్న అదృష్టవంతుడు మిశ్రా

ఒరిస్సాలో నయాగరా జిల్లాకు చెందిన మిశ్రా ,1999 లో పాండిచ్చేరి ఫ్రెంచ్ ఇన్ ష్టి ట్యూట్ లో సంస్కృత రీసెర్చ్ స్కాలర్ గా చేరాడు .సంస్కృతం లో ‘’సూర్య శతకం ‘’రాయటమే కాక ,శైవాగమాలపై విపరీతమైన కృషి చేశాడు .ఈ సంస్థలో మిశ్రా 3, 500 వ్రాత ప్రతులను క్రోడీకరించాడు .నేనుఈ  సంస్థలో చేరి పి .హెచ్ .డి.చేస్తుండగా ఈ కేటలాగింగ్ చేసే అదృష్టం నాకు కలిగింది ‘’అంటూ పొంగిపోయి చెప్పాడు మిశ్ర .ఈ సంస్థలో 8 400 కు పైగా తాళపత్ర గ్రంధాల కట్టలున్నాయని ,అందులో శైవాగమాలు కర్మకాండ గ్రంధాలే ఎక్కువని ,మిగిలినవి ఆలయ శిల్పకళా ,జ్యోతిషం ఖగోళ శాస్త్రామ్ ,తిరుక్కురళ్ దక్షిణ భారత దేశ వైద్యం ,సంస్కృత సాహిత్యం ,తమిళ ఆధ్యాత్మిక0 కు చెందినవని అన్నాడు .

 వీటిలో చాలా గ్రంధాలు ‘తమిళ బ్రాహ్మణుల ‘’’గ్రంథ లిపి ‘’లో రాయబడిన సంస్కృత గ్రంధాలని ,మిగిలినవి కాశ్మీరీ శారదా లిపి ,నందినాగర,నెవారి ,తీగలారి ,గ్రంథ ,తెలుగు ఒరియా ,తుళు  పుస్తకాలని ,ప్రతి తాటాకు కట్టలో చిన్న చిన్న అక్షరాలలో డజన్ల కొద్దీ గ్రంథాలుంటాయని  పరిశోధకుడు దేవీ ప్రసాద్ మిశ్రా తెలియ జేశాడు .

363-విదేశీ భాషా గ్రంధాలపై సంస్కృత ప్రభావం

ఫిలిప్ గ్లాస్ రాసిన ‘’సత్యాగ్రహ ఒపేరా ‘’లో భగవద్గీత శ్లోకాలను సంస్కృతం లో పాడటం జరిగింది .ది మార్క్సిస్ట్ రివల్యూషన్ ‘’లో ‘’బృహదారణ్యక ఉపనిషద్ ‘’ప్రార్ధన ఉంది .ప్రఖ్యాత మడోన్నా మ్యూజిక్ ఆల్బమ్ లోని ‘’సైబర్ రాగ ‘’లో సంస్కృత  మంత్రోచ్చారణ ఉంది . 1998 లో మడోన్నా  గ్రామీ అవార్డు అందుకున్న ఆల్బమ్ ‘’రే ఆఫ్ లైట్ ‘’లో ‘’అష్టాంగ విన్యాస యోగ ‘’మంత్రాలున్నాయి .అసలు లిరిక్కే ఓం శాంతిశాంతి తో ప్రారంభమవుతుంది .సంగీత కర్త జాన్ విలియమ్స్ ‘’ఇండియానా జోన్స్ అండ్ ది  టెంపుల్ ఆఫ్ డూమ్‘’లో ‘’స్టార్ వార్ ‘’ఎపిసోడ్ లో సంస్కృత శ్లోకాల కాయిర్ సింగింగ్ ఉంది . 2004 నాటి ‘’బాటిల్ స్టార్ గాలాక్టికా ‘’అంతా ఋగ్వేదం లోని గాయత్రీ మంత్రమే .ఎనిగ్మాతా రాసిన’’ లిరిక్స్ ఆఫ్ చైల్డ్ ఇన్ యు ఎస్ లో సంస్కృత శ్లోకాలు ఉన్నాయి ..(ఆధారం –సాంస్క్రిట్ -గీకీ పీడియా )

364-ఆరవ శతాబ్ది రామాయణం కనుగొన్న -కలకత్తా ఏషియాటిక్ సోయాసైటీ

కలకత్తాలోని ఏషియాటిక్ సొసైటీ లైబ్రరీ  రీసెర్చ్ స్కాలర్స్ వారు 6 వశాతాబ్దానికి చెందిన ‘’వహ్ని (అగ్ని )పురాణం పై పరిశోధిస్తుంటే అందులో ఒక అసంపూర్తి వ్రాతప్రతి గ్రంధం చూసి ఆశ్చర్య పడిపోయారు .అప్పుడు జర్మన్ స్కాలర్ Aufrecht గోబర్ రిపాజిటరీ గా సంస్కృత గ్రంధాలపై తయారు చేసిన ‘’కేటలాగో కేటలాగం ‘’ను పరీక్షగా చూడగా ఒకే రకమైన రెండు వ్రాత ప్రతులు ఉన్నట్లు గమనించారు .ఒకటి లండన్ లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీ వారు భద్రపరచినది ,రెండవది శతాభి చరిత్రకలిగిన కలకత్తా సంస్కృత సాహిత్య పరిషత్ భద్ర పరచింది గా తెలుసుకొన్నారు .వారి ఉత్సాహం పెరిగి అగ్నిపురాణం వ్రాతప్రతి బూజు దులిపి దాని సంపూర్ణ ప్రతిని పట్టుకొన్నారు .దీన్ని విశ్లేషిస్తుండగా ‘’దశగ్రీవ రాక్షస వధ ‘’కు వహ్నిపురాణానికి ఏమీ సంబంధం ఉన్నట్లు కనబడ లేదు .ఈ పురాణం లో అకస్మాత్తుగా మరొక రకమైన కథా శ్లోకాలు ఎలా చేరాయో అర్ధం కాలేదువారికి  .నిదానం గా ద్రుష్టి సారిస్తే వారికి తాము చదువుతున్నది అనేక చేర్పులు మార్పులతో ఉన్న 6 వ శతాబ్దపు రామాయణ గ్రంధం అని అర్ధమైంది .ఆర్కిమిడీస్ లాగా ‘’యురేకా ‘’అని ఆనందం తో కేకలేసుకొన్నారు . అసలైన వాల్మీకి రామాయణం క్రీ పూ 4 వ శతాబ్దానికి చెందింది .

  ఈ 6 వ శతాబ్ది రామాయణం లో 7 కాండలకు బదులు 5 కాండలు మాత్రమే ఉన్నాయి .బాలకాండం ఉత్తర కాండలు లేవు .రావణ వధ  తర్వాత రామాదులు అయోధ్యచేరి పట్టాభి షేకం జరుపుకోవటం తో ఈ రామాయణం సమాప్తం .ప్రారంభం కూడా దశరధుని శాపం రాముడిని అరణ్యాలకు పంపటం లేదు .దీని బదులు శుక్రాచార్యుల భార్యను విష్ణుమూర్తి సంహరించినందుకు ఆయన లక్ష్మీ దేవిని శపించటం ,చనిపోయిన రాక్షసులను బ్రతికించటం తో కధ  ప్రారంభమౌతుంది .రెండవ శాపం నిరంతరంగా జరుగుతున్న దేవ దానవ యుద్ధానికి ధరిత్రి వ్యధ చెందగా లక్ష్మీ నారాయణులు  బాధ్యత తమపై వేసుకొని తామిద్దరం శాప ఫలంగా భూమిపై జన్మిస్తామని తెలియ జేయటం జరుగుతుంది .ఈ రామాయణం భార్యా భర్తల వియోగానికే ప్రాధాన్యం తప్ప తండ్రీ కొడుకుల వియోగాన్ని ప్రాధాన్యమివ్వలేదు .ఇందులో రాముడు దేవుడుగాకాక మానవత్వమున్న ఉన్నత మానవునిగా కనిపిస్తాడు

  (ఆధారం -న్యూ రామాయణ డిస్కవరీ అ స్టాండ్ స్కాలర్స్ ఇన్ కలకత్తా –ఝిమి ముఖర్జీ పాండే ) దీని ఫోటో జతచేశాను చూడండి

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-17 -కాంప్-షార్లెట్-అమెరికా

— Inline image 1

డా .దేవీ ప్రసాద్ మిశ్ర  
Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

వీక్లీ అమెరికా-14 (26-6-17 నుండి 2-7-17 వరకు )

వీక్లీ అమెరికా-14 (26-6-17 నుండి 2-7-17 వరకు )

శ్రీ రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రత వారం

26-6-17 సోమవారం మధ్యాహ్నం శ్రీ మైనేని గారు శ్రీ ఎల్లాప్రగడ వారు ఫోన్ చేసి నా పుట్టిన రోజు 26 అనుకొని   ‘’ముందే కోయిలలు కూసినట్లు ‘’శుభాకాంక్షలు తెలియ జేశారు నిన్ననే మా అల్లుడు ,మనవళ్లు కాలిఫోర్నియా నుంచి తిరిగి వచ్చారు . …

           శ్రీ రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం

27 జూన్ తేదీలప్రకారం నా పుట్టిన రోజు .తిధులప్రకారం జ్యేష్ఠ బహుళ సప్తమి . .మా అమ్మ ఉన్నన్నాళ్ళు, ఆ తర్వాత కూడా చాలా ఏళ్ళు ఈ సప్తమి తిథినాడే పుట్టిన రోజు చేసుకునేవాడిని మా అమ్మ తప్పని సరిగా నాకు చాలా ఇస్టమని మైసూర్ పాక్ చేసేది .మా శ్రీమతీ ఎప్పుడూ చేస్తూనే ఉంది ..ఈ సారి అమెరికాలో ఉండటం మా పెద్ద మనవడు చి సంకల్ప్ (పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు )ఏం ఎస్ పాసవటం ,చికాగోలో ఉద్యోగం వచ్చి చేరటం ,వాడితమ్ముడు చి భువన్ సెంట్రల్ సిలబస్ టెన్త్ క్లాస్ పాసై ,కాలేజీలో ఇంటర్ లో చేరటం ,మా రెండవ అబ్బాయి శర్మకొడుకు చి హర్ష టెన్త్ పాసై కాలేజీ లో చేరటం వాడి చెల్లెలు మా మనవరాలు చి హర్షిత టెన్త్ కు రావటం ,మా మూడోవాడు మూర్తికొడుకు చి చరణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాసవటం  వాడి చెల్లెలు మా మనవరాలు చి. రమ్య నైన్త్ క్లాస్ కు రావటం ,మా ఇక్కడి పెద్దమనవడు (మా అమ్మాయి పెద్దకొడుకు )చి శ్రీకేత్ టెన్త్ స్టాండర్డ్ కి రావటం వాడి తమ్ముళ్లు మా బుడ్డి మనవళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ లు సెవెంత్ స్టాండర్డ్ కు రావటం ,నాకు 77 వెళ్లి 78 ఏళ్ళు రావటం అన్నీ పురస్కరించుకొని 27-6-17  మంగళవారం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉదయం 7-15 నుంచి 11 వరకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి అష్టోత్తర సహస్ర నామ పూజ ,మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ,శివా ష్టోత్తర సహస్రనామ పూజ ,బిల్వాష్టోత్తర పూజ చేశాను .ఉదయం 11 గం నుంచి మధ్యాహ్నం  1-15 వరకు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నవగ్రహాలకు అష్టోత్తర పూజ తో సహా చేసుకున్నాం .అంటే సుమారు 6 గంటలు ఈ రూపం గా భగవధ్యానం లో గడిపే అదృష్టం కలిగింది … వ్రతం కాగానే మా అమ్మాయి శ్రీ మైనేనిగారు పంపిన ‘’ఘన నగదు ‘’కానుక ,ప్రత్యేక గ్రీటింగ్ ,తాను  కొన్న ‘’ఘనవస్తు కానుక ‘’అంద  జేసింది .నేను మా ముగ్గురు మనవళ్లను ”యధాశక్తి ”నగదు కానుక అందించాను . భోజనం లోకి మామిడికాయ పప్పు ,బీన్స్ కూర కొబ్బరి పచ్చడి ,పులిహోర ,బొబ్బట్లు చేసింది .ఈ మధ్య చాలాసార్లు మైసూర్ పాక్ చేయటం వలన వెరైటీగా  బొబ్బట్లు చేసింది .శ్రీ మతి గోసుకొండ అరుణ  ,వాళ్ళబ్బాయిలను భోజనానికి పిలిచాము వాళ్ళు ఇక్కడికి వచ్చేదాకా విషయం చెప్పలేదు మేము .వచ్చి ఆశ్చర్య పోయి0ది అరుణ .. మైనేనిగారికి ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపాను …మా అబ్బాయిలు శాస్త్రి శర్మరమణ మనవళ్లు   మనవరాలు రమ్య .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియ జేశారు . ఇమెయిల్ ద్వారా సాహితీబంధువులు పంపిన శుభాకాంక్షలకు  ధన్యవాదాలు తెలిపాను ..శ్రీ సుంకర  అప్పారావు గారు ,అమ్మాయివచ్చి పళ్ళు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు . సాయంత్రం మా ఇంటికి సుమారు 15 మైళ్ళ  దూరం లో ఉన్న శ్రీ త్రిమూర్తి దేవాలయానికి వెళ్లి అక్కడి బ్రహ్మా ,శ్రీనివాస ,శివులను ,సరస్వతీ పార్వతీ పద్మావతీ అమ్మవార్లను మా ఆంజనేయస్వామిని దర్శించి మంగళవారం వీరందరి దర్శన భాగ్యం కలిగినందుకు సంతృప్తి చెందాం . 5 ఏళ్ళ క్రితం ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగినప్పుడు మేము ఇక్కడే ఉన్నాం .రెండు సార్లు వెళ్లి చూశామ్ .ఇప్పుడు నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్ట జరిగి ఆలయం దర్శనానికి వీలుగా తయారయింది .

 బుధవారం  రాత్రి మైనేనిగారి బావగారు శ్రీ రాచకొండ శర్మగారికి ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నాను . ఆ డాక్టర్ దంపతులకు 93 ఏళ్ళు వచ్చిన సందర్భంగా విశాఖ సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ వారు ఇంటికి వచ్చి ఇద్దరినీ పుష్పహారాలతో  సన్మానించారని శర్మ గారు చెప్పారు .వారిద్దరూ మరింత ఆరోగ్యంగా శతాధిక ఆయుస్సుతో ఆరోగ్యంగా వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధించా .మార్చి 15 న మేము విశాఖ వెళ్లి ఆ ద0పతులతో కొన్ని గంటలు గడిపిన మధురానుభూతి మరువ లేనిది . రాత్రి ‘’గొట్టం’’లో  సీతమ్మ అందాలు -రామయ్య చందాలు ‘’ సినిమా చూసాం నీట్ గా ఉంది .జగపతిబాబు ‘’కబడ్డీ కబడ్డీ ‘’ట్రాక్ కథ  .

  గురువారం   గీర్వాణం -3 లో శ్రీ హనుమద్రామాయణం తో పాటు అస్సామ్ గీర్వాణకవుల గురించి రాసి 330 కు చేర్చా .సాయంత్రం అప్పారావు గారింటికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఫలాలు ఇచ్చివచ్చాము .మా మనవరాలు చి రమ్య కు హాపీ  బర్త్ డే చెప్పాం

  రాత్రి రాజేంద్ర ప్రసాద్ చలపతిరావు నటించి కోన వెంకట్ సంభాషణలు రాసిన ‘’ఓనమాలు ‘’సినిమా ట్యూబ్ లో చూసాం చాలా పర్పస్ ఫుల్ పిక్చర్ .అందరూ బాగా చేశారు .ఎవరు ఎంత కు ఎదిగినా జన్మభూమిని మూలలను మరచిపోరద నే చక్కని సందేశం ఉన్న సినిమా ..

 శుక్రవారం శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ నటించిన  ఆకెళ్ళ నాటకం శ్రీనాధుడు చూసాం .చాలా బాగుంది .గుమ్మడి నటన బాగా నే ఉంది పద్యాలూ మైనేనిగారన్నట్లు కంచుగొంతు తో ఆలాపించాడుకాని బిగుసుకు పోయి నటించినట్లని పించిందినాకు .’’సినిమా గుమ్మడి ‘’రాజసం కొరవడింది .ఏమైనా పద్యనాటకం రాయటం ,దాన్ని ఆడటం ఆషామాషీ కాదు .దాన్ని మెప్పించారు రచయితా నటుడూ ..గీర్వాణం 340 కు చేరింది .

 శనివారం -గీ -3 లో 351 మంది కవుల గురించి రాయగలిగా . దాదాపు ఇరవై రోజులకు ఆస్ట్రో ఫిజిక్స్ చదివి పూర్తి చేశా …ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ చదవటం నత్తనడక లో సాగుతోంది ..గొట్టం లో ఏవేవో సినిమాలు ట్రై చెశాముకాని అవీ ‘’గొట్టంలా’’ ఉండటం తో చూడలేదు .

2-7-17 ఆదివారం -ఉదయంమా అమ్మాయి  రమణ ఫోన్ చేసి రాత్రి చెప్పాడని మా శిష్యుడు చిలుకూరి కొడుకుకు ఎంసెట్ లో ఏం బి బి ఎస్ కు 1600 రాంక్ వచ్చిన శుభవార్త చెప్పింది వెంటనే మెయిల్ రాయటమేకాక కాకినాడకు ఫోన్ లో వాడికి కంగ్రాట్స్ చెప్పాను .నిరుడు ఎంట్రన్స్ లో ఈ కుర్రాడికి 26000 రాంక్ వచ్చింది . వాడిని బెజవాడ తీసుకొచ్చి ఏడాది ఇన్సెంటివ్ కోచింగ్ లో పెట్టాడు . దానికి తగ్గట్టే కుర్రాడూ కస్టపడి చదివి 1600 రాంక్ సాధించాడు అంటే గవర్నమెంట్ కాలేజీలలో సీట్ వస్తుంది . రూపాయి కూడా డబ్బు కట్టక్కర లేదు .చాలా మంచి వార్తమా అందరికి . మార్చిలోనే మా చిలుకూరి అంటే సి ఎల్ యెన్ శర్మ తల్లీ ,తమ్ముడు రెండు రోజుల  తేడాలో ఉయ్యూరులో చనిపోయారు . వారిద్దరి కార్యక్రమాలు వీడే దగ్గరుండి జరిపాడు .చిలుకూరి అంటే మా ఇంట్లో కుర్రాడనే భావన . వాడు వాళ్ళ నాన్నగారు మా కుటుంబానికి చేసిన సేవలు  తీర్చుకోలేనిది .అందుకే ఈ కుర్రాడి ఉపనయనానికి రెండేళ్ల క్రితం జోరున వర్షం లో కారులో కాకినాడ వెళ్లి ఆశీస్సులు అందజేశాము . అంతటి అభిమానం మాకు ఆ కుటుంబం అంటే .ఇంతకాలానికి చిలుకూరి దంపతుల కోరిక తీరింది .కొడుకు బాధ్యతగా చదివి వారి కోరిక తీర్చాడు .మంచికాలేజీ లో సీటు వచ్చి చదివి డాక్టరై అందరికి మరింత సంతోషం కలిగిస్తాడని ఆశిస్తున్నాము .

  మా కుటుంబం లో డాక్టర్ చదివిన వాళ్ళెవరూ లేరు .మా రేపల్లె బాబాయి శ్రీ  రాయ ప్రోలు శివ రామ దీక్షితులుగారి చివరి కొడుకు రామ కృష్ణ -నాకంటే ఐదారేళ్ళ చిన్నవాడు ఏం బి బి ఎస్ చదివి హైదరాబాద్ మల్కాజి గిరిలో ప్రాక్టీస్  చేస్తూ స్వ0త హాస్పిటల్ కట్టుకొని మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు ..వీడు తప్ప మాలో ఎవరూ డాక్టర్ కాలేదు . ఇప్పుడు చిలుకూరి కొడుకు చి సాయి డాక్టర్ సీట్ సాధించాడంటే మా కుటుంబలో వాడు సాధించినంత ఆనందంగా ఉంది .

 గీర్వాణం 356 కు చేరింది .  ఈ  వీక్లీ ఇంతటితో సమాప్తం .

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 361- శైవాగమ గ్రంథ పరిశోధకుడు -ఎస్ సంబంధ శివాచార్య (1927

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

  361- శైవాగమ గ్రంథ పరిశోధకుడు -ఎస్ సంబంధ శివాచార్య (1927

పాండిచ్చేరిలో ఫ్రెంచ్ ఇన్ స్టి ట్యూట్ లో రీసెర్చర్ గా ఉన్న 89 ఏళ్ళ జ్ఞాన వయో వృద్ధుడు ఎస్ సంబంధ శివాచార్య  సంస్కృత సేవకు శైవ మత సిద్ధాంత వ్యాప్తికి రాష్ట్రపతి ప్రశంసా పత్ర0 అందజేశారు .   .తాళగ్రంధ వ్రాత ప్రతులను చదవటం లో నిష్ణాతుడు .శైవాగమాలలో అనన్య సామాన్య ప్రతిభా సంపన్నుడు  శైవాగమనాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ప్రచురించాడు .శైవ సిద్ధాంత పరిణామ చరిత్రను ఆమూలాగ్రంగా మధించి రాశాడు . పురాతన శైవ గ్రంధాలను 300 కు పైగా క్రోడీకరించి ,అనువదించిన మహా విద్వా0సుడు .రాష్ట్ర పతిపురస్కారం తోపాటు 5 లక్షల నగదు పారితోషికాన్ని స్వీ కరిస్తున్నప్పుడు ఆయన అతి వినయంగా ‘’నేను పూర్వ జన్మలో చేసుకొన్న పుణ్యఫలితమే ఈ సంస్కృత ప్రశంసా పత్ర0 పారితోషికం ‘’అన్నాడు .

 1969 లో ఈ రీసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో చేరిన ఈ ఆచార్య కు  ఫ్రెంచ్ ప్రభుత్వం  అత్యుత్తమ సివిల్ అవార్డు ను2008 లో  అందజేసింది  .ఆలిండియా ఆది శైవ శివాచార్య సేవాసంఘం 2011 లో ‘’ఆగమ భూషణ ‘’పురస్కారమిచ్చింది .అర్చక కుటుంబలో 6-1-1927న జన్మించిన శివాచార్య ఏడవ  ఏట నుంచి దేవాలయం లో అర్చనాదులు చేయటం లో సిద్ధ హస్తుడయ్యాడు .తండ్రి డి సుబ్రహ్మణ్య గురుక్కళ్ వద్ద వేదం శాస్త్రాలు వివిధ పండితులవద్ద నేర్చి మధురాంతకం లోని అహోబిల మఠ సంస్కృత పాఠశాలలో , తిరువయ్యారు ,మైలాపూర్ సంస్కృత కాలేజీ లలో చదివి  చెన్నైలోని థియ సాఫికల్ సొసైటీ వ్రాత ప్రతుల డిపార్ట్ మెంట్ లో ,ప్రభుత్వ మన్యు స్క్రిప్ట్ లైబ్రరీ లో పనిచేసి తంజావూర్ సరసవతిమహల్ లైబ్రరీ తో సంబంధంకలిగి ,మైసూర్ ఓరియంటల్ లైబ్రరీలో పని చేసి తరువాత పాండిచ్చేరిలో ఈ రీసెర్చ్ సంస్థలో చేరారు . 8400 తాటాకు గ్రంధాలు ఈ ఇంస్టి ట్యూట్ లో ఉన్నాయని .అందులో ఎక్కువగా శైవాగమాగ్రంధాలేనని  మిగిలినవి జ్యోతిష ,దక్షిణ భారత దేశ వైద్యగ్రంధాలు ,సంస్కృత సాహిత్య గ్రంధాలు ,తమిళ ఆధ్యాత్మిక గ్రంధాలు ఉన్నాయని చెప్పాడు

  ఈ వ్రాతప్రతులు తమిళలిపి  లో రాయబడిన  సంస్కృతమే  ఉందని   మిగిలినవి శారదా ,నందినగరి , నెవారి తిలగరి  గ్రంథ ,తమిళం తెలుగు ఒరియా ,తుళు గ్రంధాలు .ప్రతి తాళపత్ర కట్టలో అతి చిన్న అక్షరాలలో అనేక గ్రంధాలున్నాయని సంబంధ శివాచార్య చెప్పారు .దాదాపు 5 దశాబ్దాలుగా శివాచార్య రోజుకు 10 గంటలకు పైగా  పనిచేస్తున్నారు .దేశం లోని వివిధ ప్రదేశాలనుంచివివిధ భాషలలో ఉన్న  వ్రాత ప్రతులను తెప్పించి పరిశీలించి శుద్ధ ప్రతి తయారు చేసి ప్రచురిస్తున్నారు .ప్రస్తుతం ‘’సూక్ష్మా గమం ‘’పై కృషి చేస్తున్నారు .క్రిందటి శతాబ్దం లో సంస్కృతం గ్రంథ లిపి నుంచి దేవనాగరి లిపి లో రాయబడుతూ బాగా ప్రాచుర్యం లో ఉందని చెప్పారు స్వ0త ప్రింటింగ్ ప్రెస్ ను గ్రంథ ,దేవనాగరి లిపులతో ఏర్పాటు చేసుకొని ఎన్నెన్నో శైవాగమ గ్రంధాలు ప్రచురించారు .ప్రస్తుతం పంచాంగాలు ,తిరుకొయిల్ ,అనుష్టాన వాక్య పంచాంగం పై కృషి చేస్తున్నారు . స్యయ0 గా  15 ఏళ్ళనుంచి పబ్లిషింగ్ కంపెనీ నడుపుతున్నారు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

Inline image 1


Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 357-శౌనక శిక్ష కర్త -కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి (b. 1906)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

357-శౌనక శిక్ష కర్త -కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి (b. 1906)

కేరళలో కోతకార దగ్గర నంది కులం లో కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి1906 లో జన్మించాడు .త్రిపుంతూర్ సంస్కృత కాలేజీ లెక్చరర్ . శాస్త్ర దివాకర ,శాస్త్ర రత్న బిరుదులూ పొందాడు .శంకరాచార్య చరితం శౌనక శిక్ష ,వర్ణోచ్ఛరణ దీపికా  ,ఋగ్వేద జ్యోతిషం సంస్కృతం లోను  ఆది శంకరాచార్య అండ్ కాలడి   ఇంగ్లిష్ లోను రచించాడు

358-జాతకాదేశ కర్త -శంకరం నంబూద్రిపాద్ కానిప్పయ్యూర్(1891

శంకరం నంబూద్రిపాద్ కానిప్పయ్యూర్ గొప్ప వాస్తు శిల్ప శాస్త్ర వేత్త .జ్యోతిష పండితుడు ,సంస్కృత  విద్వామ్సుడు,సాంఘిక సంస్కర్త . 1891 లో త్రిచూర్ జిల్లా కున్నాంకులం లో జన్మించాడు .గురుకులం లో శాస్త్రాధ్యయనం చేశాడు .పంచాగమ  ప్రెస్ పెట్టాడు యోగక్షేమ సభ నిర్వహించాడు .కోచి మహారాజు ‘’పండిత రత్న ‘’బిరుదునిచ్చాడు .జాతకాదేశం ,పంచ బోధ0 ,మనుష్యాలయ భాష ,తంత్ర సముచ్చయం  సంస్కృత మళయాళ నిఘంటు ఔషధ నిఘంటు వంటి సంస్కృత గ్రంధాలు ,అనేక మళయాళ గ్రంధాలు రాశాడు  .

359-వాసుదేవ కర్ణామృత కర్త -వాసుదేవన్ నంబూద్రి (1891-1947 )

1891 లో జన్మించిన వాసుదేవన్ నంబూద్రి కవి ,వక్త .ఆయన భాగవత ప్రవచనం ఆపాత మధురం .వేదం సకలశాస్త్రాలు కావ్యాలు నేర్చాడు .హరివిలాసం లో సంస్కృత విద్యాలయం స్థాపించాడు .ఈయన భాగవత కథా ప్రశస్తికి మెచ్చిరెండు చేతులకు  కోచ్చిరాజు బంగారు వీర శృంఖలాలు బహుమానం ఇచ్చాడు.రవి వర్మ ‘’భక్త శిరోమణి ‘’బిరుదునిచ్చాడు .సంస్కృతం లో వాసుదేవ కర్ణామృతం ,భాగవత సంగ్రహం ,భాగవత సంగ్రహ గాధ ,శ్రీధరాచార్య భాగవత  మకరందం రాధా మొదలైనవి రచించాడు .సామాన్యుడిని భాగవతం వైపుకు ఆయన లాగా ఆకర్షించేట్లు చేయగలిగిన నేర్పున్న వారెవరూ లేరు .  ఆయనపై పి .హెచ్ డి చేశారు .మహా భాగవతోత్తముడు వాసుదేవన్ నంబూద్రి 1947 లో చనిపోయాడు .

360-భాష సౌందర్య లహరి స్తోత్ర కర్త -శ్రీధరన్ నంబూద్రి చ0ద్రమన (1917

1917 లో పుట్టిన శ్రీధరన్ నంబూద్రి చ0ద్రమన  అసమనూర్ వాసి .ఆయన ‘’మాస్టర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ ‘’ జ్యోతిషం తో సహా ఆయనకు రాని శాస్త్రమే లేదు  .కధాకళీ నేర్చి ప్రదర్శనలిచ్చారు .సంస్కృతం లో భాషా సౌందర్య లహరి స్తోత్రం ,కిరాతావాసిష్ఠం ,విశ్వా మిత్ర మేనకా రాశాడు .కవన కౌతూహలం మేగ జైన్ లో ఎక్కువగా రచనలు చేశాడు  ..

     సశేషం

          మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 352-స్యేన సందేశకర్త -వయాస్కార ఆర్యన్ నారాయణన్ మూస్ (1841 – 1902)    

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

352-స్యేన సందేశకర్త -వయాస్కార ఆర్యన్ నారాయణన్ మూస్ (1841 – 1902)

 1841లో జన్మించి 1902 లో మరణించిన వయాస్కార ఆర్యన్ నారాయణన్ కేరళ నంబూద్రి కుటుంబానికి చెందినవాడు .అష్టవైద్యన్ బిరుదుపొందిన ఈకవి ‘’స్యేన  సందేశం ,నక్షత్ర వృత్తావలి ,చిత్ర ప్రబంధాలు రాశాడు

353-వ్రతారాధన మాల కర్త -వల్లాన సేరి  వాసున్ని మూసద్ (1855 – 1914)

1855 లో పుట్టి 1914 లో 59 వ ఏట మరణించిన వల్లాన సేరి  వాసున్ని మూసద్ కేరళ నంబూద్రి కుటుంబం వాడు .విజ్ఞాన చింతామణి ‘’సంస్కృత పత్రిక నడిపాడు .ఈయన రాసిన గ్రంధాలలో వ్రతారాధన మాల ,,సంస్కృత పాఠావలి ,శ్రీ పాదాది కేశ పఞ్చా0గి క ,మాయాస్తవం ,మాన విక్రమ సామూత్రి మహా రాజా చరితం మొదలైనవి ఉన్నాయి .

354-కుల శేఖరీయం కర్త -ఇంచూర్ కేశవన్ నంబూద్రి (1855 – 1932)

కేరళ నంబూద్రి బ్రాహ్మణుడైన ఇంచూర్ కేశవన్ నంబూద్రి1855 లో తిక్క వరూర్ దేశం లో పుట్టి 87 ఏళ్ళు జీవించి 1932 లో మరణించాడు .ఇతని కులశేఖరీయం వీదువంశ చంపు ప్రసిద్ధమైనవి .

355-నివాపాంజలి కర్త -అచ్యుత వాసుదేవ మూసద్  (1895 – 1959)

అచ్యుత వాసుదేవ మూసద్ 1895 లో జన్మించి 1959 లో 69 వ ఏటా చనిపోయాడు .పుఞ్ఞసిరి నంబి శిష్యుడు ,నివాపాంజలి ,మరక్కాధా నాలుక రాశాడు ..

356-ఆమ్నాయ మతానాం కర్త -యెర్కార రామన్ నంబూద్రి (1898 – 1983)

1898 లో జన్మించి 85 ఏళ్ళు జీవించి 1983 లో చనిపోయిన యెర్కార రామన్  నంబూద్రి వేద వేదాంగాలలో నిష్ణాతుడు . అనేక సోమయాగాలు అతిరాత్రాలు నిర్వహించిన ఘనుడు .ఆమ్నాయ మతానాం ,శ్రౌత కర్మ వివేకం గ్రంథ కర్త . 32రోజుల పౌండరీక యజ్ఞం లో సుప్రసిద్ధుడు . 1942-43 లో గురువాయూర్ లో  ‘’మురహోమం ‘’దగ్గరుండి జరిపించాడు .సంస్కృతం శాస్త్రాలలో ఆయన పాండిత్యం అపారం .ఒకసారి ‘’కౌశికీయత బ్రాహ్మణం ‘’గడగడా అప్పగించి అందర్నీ ఆశ్చర్య పరచాడు . 1970 లో తిరుపతి దేవస్థానం ఆహ్వానం పై వెళ్లి దీన్ని చదివి రికార్డ్ చేయించాడు .దీంతో జాతీయ ,అంతర్జాతీయ కీర్తి పొందాడు .శ్రౌత స్మార్తాలలో భారత దేశం లో ఆయనదే తుది తీర్పుగా ఉండేది . భారత రాష్ట్రపతి ప్రశంసా పత్రం తోపాటు ‘’వేదార్ధ రత్న ‘’వంటి బిరుదులెన్నో పొందాడు . 22ఏళ్ళ వయసులో శ్రీమతి పార్వతిని వివాహమాడి 4 గురుకుమారులు 5 గురు కుమార్తెలను  ఈ దంపతులు సంతానంగా పొందారు . జీవితకాలం లో 99 యాగాలు స్వయంగా చేసి అనేక యాగాలు ఇతరులతో కలిసి నిర్వహించిన యజ్ఞ నిర్వహణ దక్షుడు  రామన్  నంబూద్రి

 20-7-1983 న ఈ కర్మిష్ఠి  రామన్  నంబూద్రి   85 వ ఏట వైకుంఠ  మందిరం చేరాడు .

  సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి