ప్రజలకోసమే పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1
‘’సమాజ శ్రేయస్సుకోసం పని చేయటం ,సంకల్పం లో స్వార్ధం లేనంత వరకు దైవ బలం తప్పక తోడుగా ఉంటుందని నమ్మి ,నిబ్బరం ,మనో ధైర్యం ,పనిలో విశ్వాసం ,అపారమైన సృజనాత్మకత అద్భుత ప్రజా సంబంధాలు ,ఓర్పు ,లౌక్యం ,తార్కిక వాదన ,కార్య నిర్వాహక సామర్ధ్యం ,ఉన్న ఐ ఏ ఎస్ అధికారి శ్రీ పి.వి.ఆర్.కే ప్రసాద్ .వివిధ విరుద్ధ స్వభావాలున్న ముఖ్యమంత్రుల వద్ద ను ,సాక్షాత్తు శ్రీ వారి ఆలయం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ కార్య నిర్వాహణాదికారిగా ,విశాఖ పోర్ట్ చైర్మన్ గా ప్రధాన మంత్రి పి.వి గారి దగ్గర ,వివిధ హోదాలలో ప్రసాద్ పని చేశారు .అందరి వాడు అనిపించుకొన్నారు . సమర్ధత కు ప్రతి రూపం .నిస్వార్ధ సేవకు నిలువెత్తు రూపం .తన శ్రీవారి అనుభవాలను ‘’నాహం కర్తా –హరిహ్ కర్తా ‘’అని మొదటి పుస్తకం రాసిన సంగతి అందరికి తెలుసు .రెండేళ్ళ క్రితం ‘’అసలేం జరిగిందంటే –‘’పేరు తో రాసిన పుస్తకం లో ప్రజా సేవలో తన జీవితం ధన్య మైన సంఘటనలు పూస గ్రుచ్చినట్లు ఎక్కడో మొదలు పెట్టి గిరికాలు తిప్పుతూ ,సంఘటన పూర్వా పరాలను స్పృశిస్తూ ,తనకెదురైన సమస్యలను వివరిస్తూ ,వాటిని అధిగమించటానికి నిస్వార్ధం గా ప్రజా సంక్షేమమే ధ్యేయం గా పని చేశారు .నాలుగు వందలకు పైగా పేజీలున్న ఈ పుస్తకాన్ని అయిదారు రోజుల్లో ఆమూలాగ్రం చదివాను .అందులోనుంచి సంఘటనలకు మాత్రామే ప్రాధాన్యం ఇచ్చే విషయాలను ,నాకు నచ్చిన విషయాలను మీ అందరికోసం అందిస్తున్నాను .
శ్రీ ప్రసాద్ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా జలగం వారు కావాలని వేయిన్చుకొన్నారు . శ్రీ జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుమూడున్నర ఏళ్ళు పని చేసి ఆ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేట్లు చేశారు .ముఖ్యమంత్రి ఈయనకు కావలసిన అధికారాలు డబ్బు అన్నీ అందించారు .వాటితో జిల్లా రూపురేఖలే మార్చేశారిద్దరూ .ఏ రాజకీయ నాయకుని క్రీనీడ పడకుండా జాగ్రత పడ్డారు .చివరికి వాళ్లకు కోపం వచ్చి ప్రసాద్ గారి దగ్గరకొచ్చి ‘’అయ్యా అన్నీ మీరిద్దరే చేస్తున్నారు మా రాజకీయ నాయకులం ఎందుకూ పనికి రాకుండా పోతున్నాం .మీరు చేసిన అభివృద్ధి చాలు .ఇక మాకు పెత్తనం రాక పోతే ఓట్లు పడవు కనుక మీరు మీ కు కావాల్సిన చోటుకు బదిలే చేయించుకోండి ‘’అని చెప్పారు .ఇలాంటిస్పందన వస్తుందని ఆయన ఊహించలేక ముఖ్యమంత్రిని తన్ను హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ చేయమని కోరారు .ఆయన అఖండ మేధావి .’’ప్రసాద్ మా వాళ్ళు ఏమైనా అన్నారా?’’అని కూపీ లాగి విషయం అర్ధమై హైదరబాద్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేశారు .
అక్కడ చేరిన మూడు నెలల్లోనే దివి సీమ ఉప్పెన వచ్చింది .వేలాది జనంచనిపోయాయి ,వేలాది పశువులు చనిపోయాఇ . .నీళ్ళు అన్నీ కలుషితమయ్యాయి .తాగు నీరు లేక,అంటువ్యాధులు పెరిగే ప్రమాదం వచ్చింది . జలగం ఫోన్ చేసి ప్రసాద్ కు పూర్తీ అధికారాలిచ్చి దివి సీమకు పంపి పది రోజుల్లో ఎక్కడ వీలైతే అక్కడ రిగ్గులతో బోరు బావులు తవ్వించి భూ గర్భ జలాలను జనాలకు అంద జేయవలసిందని యెంత డబ్బు ఖర్చైనా పరవా లేదని ఆర్డర్ జారీ చేశారు . అంతే ఆఘ మేఘాల మీద దివి సీమకు ప్రభుత్వ రిగ్గులు ,ప్రైవేట్ రిగ్గులను తెప్పించి డీజల్ డ్రమ్ములు గాస్ లైట్లు ఇప్పించి ,స్థానిక ప్రజలను అగ్గి పుల్ల కూడా అడగ కుండా అన్నీ ఏర్పాటు చేసి ,పర్య వేక్షిస్తూ ,అత్యవసర కార్యక్రమంగా మంచి నీటి సరఫరాను భావించి అధికారులతో పని చేయించారు .మరమ్మత్తులకు మెకానిక్కులు ,టెంట్ లు వారి భోజన వసతి అన్నీ చూశారు .’’దెబ్బ తిన్న ప్రతి గ్రామానికి తాగునీరు ఇద్దాం .ఆకలి ,నిద్రకోసమే తప్ప మిగిలిన సమయ మంతా ఈ పనికే కేటా ఇంచండి మీ సామర్ధ్యం వలన కొన్ని వేల కుటుంబాలను నిల బెట్ట గలుగుతాం .’’అని కింది అధికారుల్ని ప్రోత్సహించి పంపారు .
ప్రసాద్ గారు అక్కడే ఉండి పర్య వేక్షిస్తూ ,ప్రతి రోజు జీపులో తిను బండారాలు డీజిల్ కాన్లు రిగ్గ్గులు పై చేస్తున్న గ్రామాలకు పంపించారు .ఎన్ని అడుగులు లోతుకు వెళ్ళినా నీరు పడనీ గ్రామాలకు టాంకర్ల ద్వారా మంచి నీరు సప్ప్లై చేయించారు .రోజూ గ్రామలో నీటి సరఫరా ఆ తటాంకర్ల తోనే చేయించారు .చీకటి రాత్రులలో చుట్టూ శవాలమధ్య వాటికంపు మధ్య ,చలిగాలిలో ,ఆ సిబ్బంది దాదాపు ఇరవై నాలుగు గంటలూ శ్రమించారు .వారికీ అంటూ రోగాలు సోకాయి ,విరేచనాలు పట్టుకున్నాయి .అయినా మొక్క వోని ధైర్యం తో సిబ్బంది పని చేసి పది రోజుల పనిని ఆరు రోజుల్లోనే సంతృప్తికరం గా పూర్తీ చేశారు .ఆ నాటి కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ వి ఎస్ రెడ్డి గారు సిబ్బందిలో ప్రతి ఒక్కరిని ప్ర శం సించి అభినందించారు .తనకు ముఖ్య మంత్రి ఇచ్చిన పనిని సంతృప్తిగా దిగ్విజయం గా పూర్తీ చేసి ప్రసాద్ గారు ముఖ్యమంత్రిని కలిసి వివరించారు .జలగం ఆనందం పట్టలేక ‘’రాజ కీయ ప్రయోజనాలకోసం నిన్ను ఖమ్మం జిల్లా నుంచి పంపించేశారు .కాని ఇప్పుడు దివి తాలూకాకి నువ్వే అవసరం అయ్యావు ప్రసాద్ .ఇక్కడ నీ అవసరం ఉందనే నెమో ముందు చూపుగా నిన్ను మా జిల్లా వాళ్ళు వద్దని ఉంటారు ‘’అని మెచ్చుకొన్నారు ..

రేపు తొలి ఏకాదశి –శుభాకాంక్షలు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-14-ఉయ్యూరు

