పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )
అలా కొండలు బండల వెంబటి తిరుగుతున్న మనకు మరో మోసగాడు ఎడురౌతాడు .చీటీలు కట్టమని పెద్దయ్యను అడిగితె చీదరించిపోమ్మంటే ,ఆయన అటు పోంగానేభార్య నారాయనమ్మను బుట్టలో వేసి డబ్బు దొబ్బి ‘’నీ యట్ల పెద్దమ్మల్ని దద్దమ్మలని ఇబుటికి ఎందర్ని సూసిం ట్ని’’అని మనసులో అనుకోని ఉడాయిన్చాడొకడు ‘’నింగి నిజాము ,దొంగ యాసము ‘’కత లో .వ్యవసాయం దండగ కాదు పండగ అని ‘’రైతు కళాచారం ‘’(సంస్కృతీ )లో పొలం పనులు అందరూకలిసి కట్టుగా చేసుకోవటం ,ఆ ఫలితాన్నీ హుషారుగా పంచుకోవటం లో ఉన్న సంతృప్తిని వ్యక్తం చేసే కధ .నీతితి పుస్తకాలు గీత పుస్తకాలకంటే ‘’నేల ఉనికి నాకు బాగా తెలుసు నాయునికి ఈ నేల మన్నని దాన్నిన్కనే నాకు మన్ను పైన ఇష్టం .మన్ను పని ఇంగా ఇష్టం .ప్రపంచానికే అన్నం పెట్టె ఈ అన్న పూర్ణమ్మ బిడ్డను నేను .మీ బిడ్డను కాలేను .మీరు పొండా’’అని గదిరిన నేల పుత్రుని ఆరాధన .రైతు కళాచారం .శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు .ఉన్నదంతా పోగొట్టుకుని తిండికి లేక ఏదో బతుకు తెరువు దారి చూపించమని ఒక ‘’తెలివప్ప’’ను అడిగితె వాడు హోసూరు కొండపైకి తీసుకెళ్ళి చెత్తలో పడి ఉండే దిష్టి బొమ్మ బయటికి తీసి ,ఎండి కుళ్ళి పడున్న నిమ్మకాయలు ఏరి ఒక వేప కొమ్మకు దిష్టి బొమ్మ తగిలించి వేప చెట్టుమీద దిష్టి దేవుడున్నాడని తానూ కొండా కింది వాళ్ళదగ్గర ప్రచారం చేస్తానని జనం వచ్చి మొక్కు తీర్చుకునేట్లు చేస్తానని నిమ్మకాయల్ని వాళ్ళ చుట్టూ తిప్పి దిష్టి పోయిన్దని చెప్పమని బోధిస్తాడు .ఇంతకంటే వాళ్ళేమీ చేసి చావలేరని ఊహిస్తాడు .ఊళ్ళో ప్రచారం బాగా జరిగి జనం రావటం నిమ్మకాయల దిష్టి తీయటం పెద్ద ప్రహసనం గా తయారై పోయింది .మనిషికి రూపాయి ఫీజు .పదేళ్ళయినా తర్వాత తెలివప్ప వచ్చి చూశాడు .తన కళ్ళను నమ్మలేక పోయాడు .అక్కడ ఒక గుడి వెలిసింది .జనం సముద్రం లావచ్చి వెడుతున్నారు .దిష్టికి పది రూపాయల రేటు పెరిగింది .దంపతులు తెలివప్పను గుర్తించి అంతా ఆయన చలవే నన్నారు .దిష్టి కోసం పదేక రాల నిమ్మ తోట పెంచానని దిష్టి బొమ్మల ఫాక్టరీ పెట్టానని ,మంచి ఇల్లు కట్టుకున్నామని చెప్పి మర్యాద చేసి రెండు నిమ్మకాయలు దిష్టితీశారు ఆయనకు .’’ అమంత్రము నాకే ఏసిరి ‘’అని తెలివప్ప తెలివి తప్పి పడిపోయాడు .దేశం లోని వెర్రి వెంగలప్పల స్వభావికి నిజ రూపమే ఇది .
అమ్మా కావాలి ఆలీ కావాలి యెట్లా?కొడుక్కు సంకటం వచ్చింది .గోడ ఉపాయం చెప్పింది .’’మీ అమ్మ అలిగితే దానిమాటలు పట్టుకుంటావా? నేను నీ బిడ్డ నమ్మా అను .అమ్మ అర్ధం చేసుకుంటుంది .నీ భార్య అలిగితే ‘’మీ అమ్మ తిట్టిన్దనుకో .నేను అందర్లా అమ్మ కొడుకుని కాను నేను నా పెండ్లాము దాసుడిని అను సర్దుకు పోతుంది’’ అని’’ అమ్మా ఆలీ’’ తగువు తీర్చింది గోడ .ఇంతేనా దీనికే తానూ ఇదైపోవాలా అనుకోని ఆ వెర్రి పీనుగు నాటకాలు సురూ చేశాడు ఇద్దర్నీ మెప్పించాడు .ఇంతే కద .గోడకు మొర పెట్టుకోమంటారు సామెత గా .అదే ఇక్కడ నిజమైంది .’’కష్టపడే వాళ్లకు కావలైతే నేమి బీడు అయితే నేమి ‘’అని యదార్ధాన్ని చెప్పిన కథ ‘’ఓణీ సేను ‘’ఇంట్లో డబ్బుకు కట కట .చేను అమ్మితే కాని పరిష్కారం కాదు .భార్య కు పుట్టింటారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం (ఓణీ సేను )అమ్మాడు. తరువాత వరస పెట్టి అన్నీ అమ్ముకోవాల్సోచ్చింది .చిన్నకొడుక్కి రాయి రప్పా ఉన్న చేను వచ్చింది .భార్యతో కస్టపడి అంతా చదును చేసి సాగు చేస్తే బంగారప్పంట పండింది .పంట కోయటానికి అమ్మనోచ్చి పూజ చేయమని కోరాడు .’’బంగారు పండే బూముల్ని అమ్మి నిన్ను ఆ కావలిలా కష్ట పడే మాద్రి సేస్తిని .నేనొచ్చి యేమని పూజ సేస్తును సిన్నా ‘’అని ఏడ్చింది తల్లి .మర్నాడు అందరూ చేలోకి వెళ్ళారు .పినతండ్రి పంటను చూసి కుశాలయ్యాడు ‘’ఓణీ సేను ని మించి పంట పండిం డావే .కొడుకంటే వీడమ్మా ‘’అని బుజం తట్టి తల్లినీ మెచ్చుకోనేట్లు చేశాడు .
మనం తినే కూడును కూడా మిషన్ల లాగా తిన కూడదు పండ్లను ఉపయోగించి నవలాలి అని చెప్పేదే ‘’గువ్వల్ని సూసి నేర్వాల ‘’కత .ఇక్కడి వారికి మబ్బూ దేవుడే పొద్దూ దేవుడే .మనకి కూడా అంతే కదా .ఒక పెళ్ళాం మొగుడిని పక్కింటి గౌడు ను చూసి భయమూ భక్తీ నేర్చుకోమంటుంది .గౌడు పొద్దున్నే లేచి ఆవులకు మేతేసి కడిగి దణ్ణం పెడతాడు సూర్యుడికి నమస్కరిస్తాడు .సాములోల్లలా గౌడు లా ఉండాలే మనుష్యులని భార్య భావం కొన్నేళ్ళకు సాములోల్లకు గౌడుకు పెద్ద తగాదా అయింది .కొడుకు తనకు పుట్టలేదని గౌడు ఇంట్లోంచి వాణ్ని గేట్టేసాడు నువ్వు చచ్చావు అని కూతురికి పిండం పెట్టారు .అప్పుడు భర్త ‘’ఏమే వాళ్ళ మాదిరిగా నన్ను ఉండమాన్నావా “అని అడిగితె నెత్తీ నోరు కొట్టుకొని తప్పు తెలుసుకుని ‘’మీరు ఇట్లే ఉండండ ‘’అని ఆప్యాయం గా బువ్వ వడ్డించిన భార్యా భర్తల కథ ఏ ‘’అంతా పుంగు మొకానికి రంగు ‘’.బాహ్యాడంబరాలు కాదు మనసు కావాలి అని తెలియ చెప్పే కధ..పాత తరం మాటలు అర్ధం కాక తల్లికేదో పెద్ద జబ్బు అని డాక్టర్ వసంత దగ్గరకు తీసుకొస్తే ఆమె మాటల్లో అర్ధం గ్రహించి జబ్బు కాదు డబ్బు దాచిన మనేద అని ముక్క దొబ్బులు పెట్టిన ‘’అంశంకి ‘’కద.జీవితం అర్ధం పరమార్ధం ‘’జీవించటమే ‘’అనే నీతి ,ఒక సాములోరు ఊళ్లోకి వచ్చి సుద్దులు చెబుతుంటే ఒక అవ్వశ్రీరామునికాలం లోనే శంబూకుడు రాముడిని ఎలా ఎదిరించాడని అడిగితె సామి ‘’ఈ ముండకి ఇసయం ఎలా తెలిసే ‘’నని ఆశ్చర్య పోతాడు .అర్జునిడికంటే ఏకలవ్యుడు గొప్ప విలుకాడైనా విలువ నివ్వని శాస్త్రాలను కడిగేసింది అవ్వా .’’మీరు ఒగ నాదన్నా మా ఇండ్లల్లా సెయి కదిగిండారా/’’అని నిలేస్తే అవాక్కయ్యాడు సాములోరు .శాస్త్రాలను దుల్లి సేస్తే చెదలు కూడా మిమ్మల్ని ముట్టవు ‘’అని శాపనార్ధాలు పెట్టాడు .కోపం తారస్తాయికి చేరిన అవ్వ ‘’సేదల్లా (చెదలు )పుట్టి సేదల్లా పెరిగే వాళ్ళం మేము .మమ్మల్ని చెదలు ముట్టవా ?మీ సేమడాలు ఒలిసి సెప్పులు కుట్టునాని .మీరే అమ్మకి అబ్బకీ కాకుండా అగ్గికి పుట్టినోళ్ళ మాద్రి అగ్గిలా కాలి బూడిదవుతారు .మీ బూడిదని సేదలు బొంగులా కూడా పెట్టుకోవు ‘’అని ఝాడించి పారేసింది అవ్వ .’’’ఎట్లేట్లా ‘’అనే చివరి కద లో
ఇవన్నీ జీవితాన్ని పరచిన కథలే .చదివే ఓపిక ఉండాలి కాని అన్నీ భారత భాగవత రామాయణాలు చెప్పే నీతి కధలే .భూమిని నమ్ముకున్న వారి కతలే .చెట్టూ పుట్టాకధలే. వాటి నిస్వార్ధాన్ని విడమర్చే వే .క్రుతజ్ఞాతకు పట్టం కట్టేవే .మనో మాలిన్యాన్ని ఊడ్చిపారేసేవే .డాక్టర్ వసంత్ ప్రతిదాన్ని సాన పట్టి చిత్రిక పట్టి మెరుగులు తీర్చినట్లున్న కధలే .దీనికోసం ఆయన పడిన తపన ,శ్రమ అందరూ మెచ్చాల్సిందే చదివి తీరాల్సిందే .పెద్దాయన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ‘’రచయితా వైద్యుడు కా బట్టి ఆయన వ్రుత్తి నైపుణ్యాన్ని అంతా ఈ కతల్లో నిమ్పిరి .కొన్ని తావులలో చేదు మందులు మింగిస్తారు .కొన్ని తావులలో చురుక్కుమని సూదితో పొడుస్తారు .కొన్ని తావులలో గాయ పడిన మనసుకి మెల్లగా మలాము పూసి మెత్తటి కట్టు కడతారు .కతలంతా ఈ గుణాలను నింపి మన ముందు వడ్డించిరి వసంత్’’అని మనస్పూర్తిగా చెప్పిన మాటలు చదివిన వాళ్లకు పచ్చి నిజాలని పిస్తాయి .ఈ పుస్తకం లో వసంత్ఎన్నో సామెతల ఆమెతలు గుది గుచ్చి సందర్భాన్ని బట్టి వాడాడు .పల్లె ప్రజ మాట్లాడే బూతులూ రాశాడు .అది నేటివిటి అని వదిలేయచ్చుమనం. ఏ ప్రాంతం లో నైనా జీవ భాష లో రాస్తున్నప్పుడు అవి దొర్లి వచ్చి కూర్చున్డటం సహజం .వాటిని పంటి కింద రాళ్ళు అనుకోనక్కర్లేదు .ఇప్పుడు సామేతాల వైభోగం చూద్దాం
ముత్తయిదుల తావ ముండకేం పని?,సారాయి సోర్గము సేద్యము నరకము రామ సేంద్రా ,తిత్తిరి బిడ్డను కంటే ఎలకెత్తుకుని పోయి ఎంనులా పెట్టె నంట ,సింత లేని సివంగి సంత కోక బిడ్డను కనింది ,
చివరగా వాళ్ళ భాషలోనే ‘’మీరంతా ఈ రెండు పోత్తాలు సదు ఉండ్రి.కతలు ఇనుకొండ్రి.అందులోని సారాంశం అర్తము సేసుకోనాకి రాండా బేగి రాండా’’అని పిలుస్తూఇది అధిక్షేపణ కాదని మనవి చేస్తూ కృష్ణ రసం ను పానం చేయ వలసినది గా కోరుతు సెలవ్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-14-ఉయ్యూరు