జార్జి శాంతాయన

జార్జి శాంతాయన

ఫిలాసఫర్ జార్జి శాంతాయన స్పెయిన్ దేశం లోని మాడ్రిడ్ లో  16-12-1863న జన్మించాడు .26-9-1952నమరణించాడు .అమెరికా ఫిలాసఫర్ లలో పేరెన్నిక గన్న వాడు .కవి ,విమర్శకుడు .మాత్రు భాశ స్పెయిన్ అయినా ఇంగ్లీష్ లోనే అంతా రాశాడు .తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అతన్ని అమెరికాలోని బోస్టన్ కు తీసుకొని వెళ్ళింది .జర్మని వేదాంతి “”Lotz’’బాగా పరిచయం ఉండేది .హార్వర్డ్ లో పి హెచ్ డి చేశాడు .అక్కడే ప్రొఫెసర్ గా పని చేశాడు .1912లో యూరప్ పర్యటన చేశాడు .

Inline image 1Inline image 2

శాంతాయన –సానేట్స్ ,సెన్స్ ఆఫ్ బ్యూటి ,లైఫ్ ఆఫ్ రీజన్ ,మై హోస్ట్ –ది వరల్డ్ మొదలైన గ్రంధాలు రచించాడు .జీవితం అంతా వేదాంతానికి అంకితం చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో ఇటలీలో ఒంటరిగా మిగిలాడు .స్నేహితుల సహాయం వలన బతికి బట్ట కట్టాడు .చివరికి అక్కడే తుది శ్వాస పీల్చాడు .’’his philosophy is a symbolic expression of the values of the perceptions that structure a way of life ‘’

అన్ని ఆలోచనలకు సహజ మైన భూమిక ఉంటుంది .మారుతున్న పరి సరాలను బట్టి అవి ఇచ్చే సవాళ్ళను బట్టి మనుషులలో కళ సృజనాత్మకం అవుతుంది .హేతువు ఒక భౌతిక శక్తి మాత్రమే .దీన్ని ప్రపంచం లో జీవించటానికి మనిషి వాడుకొంటాడు .తన క్షేమాన్ని చూసుకొంటాడు .అని శాంతాయన అభిప్రాయం .ఆయన రోమన్ కేధలిక్ అయినా దేవుడిని తిరస్కరించనూ లేదు ,వ్యతిరేకిన్చనూ లేదు .’’Christian  statements reveal deep truths about the human conditions and aspirations symbolically ,but literally they are false ‘’అంటాడు విశ్వాసం తో .

ఆధునికుల ‘’విషయ లోలత’’ను వ్యతిరేకించాడు .’’philosophy must proceed by explicating and systematizing the commitments inflict in our confident action .this is animal faith ,If it is trusted ,it reveals to us the real spatio –temporal matrx of our actions .శాతాయన ఎక్కువ గా గ్రీకు వేదాంతి అరిస్టాటిల్ ను అనుసరించాడు .’’all knowledge pre supposes intellect ,but powerless spirit (consciousness )the fourth irreducibly different sort of being ‘’అని భావించాడు .మనిషిలోని మానసిక ప్రవ్రుత్తులే మంచి అయినా చెడు అయినా అన్నాడు .జంతు మానసిక స్తితి వెంటనే కని  పించకుండా అంతమౌతుంది ,దాని వలన అంతిమ సంతృప్తి దానికి రాదు .అని చెప్పాడు .

‘’   it is possible to transcend the endless instrumentalities of life and engage in the timeless contemplation of enjoyment of what ever essence may be presented .This liberation through absorption in immediacy is ‘’the spiritual life ‘’అని వివరించాడు .ఇది శాంతాయన ఫిలాసఫీలో ఒక భాగం .జీవితం అంతా పరమ శాంతం గా పవిత్రం గా ఆదర్శం గా జీవించిన ఆదర్శ వేదాంతి .Santayana tried to actualize in  his own life .His calm life balanced vision and high ideals are a fitting legacy for our disturbed ages ‘’అని జాన్ లాక్స్ శ్లాఘించాడు .నేచరిస్ట్ గా నే గుర్తింపు పొందాడు .

Santayana is known for famous sayings, such as “Those who cannot remember the past are condemned to repeat it”,[2]or “Only the dead have seen the end of war.

విస్కాన్సిస్ యూని వర్సిటి నుండి గౌరవ డాక్టరేట్ ను ,రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ నుంచి  బెన్సన్ మెడల్ ను ,కొలంబియా వర్సిటి నుండి బట్లర్ గోల్డ్ మెడల్ ను పొందాడు .బెట్రాండ్ రసెల్ ను ,ఇలియట్ ను రాబర్ట్ ఫ్రాస్ట్ ను ప్రభావితం చేశాడు .’’The presentation of self in every day life ‘’అనే ఆయన గ్రంధం చాలా మందిని ప్రభావితం చేసింది .జీవితకాలం లో ముప్ఫై పుస్తకాలు రాసి ప్రచురించాడు .మరణానంతరం డజను పుస్తకాలు వెలువడ్డాయి .పరిణామ సిద్ధాంతాన్ని బాగా బల పరిచాడు .’’మెటా ఫిజికల్ నేచరలిజం ‘’కు కట్టుబడి రచనలు చేశాడు .రాజకీయాలు జీవిత సమస్యలు వేదాంత విషయాలు ,మానవ విలువలు మొదలైన అనేక సమస్యల పై శాంతాయన విసృమ్ఖలం గా రాశాడు .విలియం జేమ్స్ ఈయనకు స్నేహితుడేకాక మెంటార్ కూడా. ఆయన లాగే ఈయన కూడా అమెరికా జీవితాన్ని,సంస్కృతిని  మనుష్యులను విదేశీ దృక్పధం లోనే చూశారని అంటారు .ఫిలాసఫీని సాహిత్యం గా రాసి మెప్పు పొందాడు .అంటే సాంకేతిక పదజాలాన్ని విపరీతం గా వాడి కంగారు పెట్టకుండా హాయిగా చదువుకోనేట్లు రాశాడని భావం.’’i was most comfortable intellectually and aesthetically at Oxford University ‘’అని నిజాయితీ గా చెప్పుకొన్నాడు .స్పానిష్ భాషలో ఆయన రచనలు చాలా భాగం అనువదింప బడ్డాయి ఎజ్రాపౌండ్ తన ‘’కాంటోస్’’లో శాంతాయన్ ను ఎక్కువ సార్లు కోట్ చేశాడు .

శాంతాయన్ రాసిన వేదాంత గ్రంధాలు –‘’ది సెన్స్ ఆఫ్ బ్యూటి ,ది లైఫ్ ఆఫ్ రీజన్ ,సెప్టిసిజం అండ్ యానిమల్ లైఫ్, ప్రసిద్ధమైనవి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.