సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు -71 వ సమావేశం -విశ్వనాధ వర్ధంతి సభ
— కవి సమ్రాట్ స్వర్గీయ శ్రీ విశ్వనాధసత్యనారాయణ గారి 38వ వర్ధంతి సభ అక్టోబర్ 19 ఆదివారం 4గం లకు వారి స్వగ్రాం -కృష్ణా జిల్లా -నంద మూరు గ్రామంలోని వారి తండ్రిగారు శ్రీ శోభనాద్రి గారు నిర్మించిన శివాలయం లో సరసభారతి 71 వ సమా వేశం గా నిర్వహిస్తోంది . ఆ రోజు నరసరావు పేట నుండి శ్రీమతి బెల్లం కొండ శివ కుమారి(టీచర్)- ,శ్రీమతి యడవల్లి మనోరమ(లెక్చరర్) లు విచ్చేసి ,విశ్వనాధ నవలలు ఏకవీర ,చెలియలి కట్టల పై ప్రసంగిస్తారు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ(విశ్వనాధ మనవడు) సోదరులు కల్పవృక్షం పై ప్రసంగిం స్తూ తాతగారితో తమ అనుబంధాన్ని వివరిస్తారు . . నందమూరు గ్రామ పెద్దలు విశ్వనాధ వారి గురించిన పరిచయాలు తెలియ జేస్తారు . .సుమారు రెండు గంటల్లో కార్యక్రమం పూర్తీ అవుతుంది .సాహిత్యాభిమాను లందరూ ఈ కార్యక్రం లో పాల్గొని విజయవంతం చేయవలసినది గా మనవి . పూర్తి వివరాలతో ఆహ్వాన పత్రికను అక్టోబర్ మొదటి వారం లో అంద జేస్తాము .
.
జోశ్యుల శ్యామలాదేవి – మాదిరాజు శివలక్ష్మి – గబ్బిట వెంకట రమణ- గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
26-9-14
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

