పల్లవి :
ఆంధర్రవైభవ కీర్తి అమరావతి
అందుకో తెలంగాణ మా హారతి
పురుడోసుకుంటున్న పుణ్యవతి
చరణం:
హైద్రాబాద్ నగర మానందము పడుతు,…
మక్కమాజిదడుగు మట్టినీ కంపింది
లస్కరూ మాంకాళి పురుడోస్తనంటుంది
పెద్దతల్లి నీకు పేరుపెడతానంది
-ఆంధ్ర-
కృష్ణమ్మ గోదారి నీరునీ కంపింది
కలకాలమూ చల్లగుండమంటుంది
తంగేడు చామంతి బంతిపువ్వులు మీకు
అభిషేకమూ చెయ్య ఆరాటపడెసూడు
-ఆంధ్ర-
యాదాద్రి నర్సన్న జాన్పాడు సైదన్న
కనుల పండుగ జూడ కదిలి వస్తున్నరు
కొమరెల్లి మల్లన్న యములాడ రాజన్న
మంచి జరగాలని మదిలోన తలచిండ్రు
-ఆంధ్ర-
సమ్మక్క-సారమ్మ పసుపు కుంకుమ పంపె
గారాలతల్లి నీకు గాజులంపిండ్రె
పోచంపల్లి నీకు పట్టు చీరను పంపె
ఊడలామర్రి నీకు ఉయ్యలంపిందె
-ఆంధ్ర-
చరితలో చెరగనీ గుర్తుగా తల్లి
ఆంధ్రబిడ్ల ఆశలా కల్పవల్లీ
సిరిసంపదలతోని వెలగాలి తల్లి
కలకాలమూ సల్లగుండాలి మల్లి
-ఆంధ్ర-
– బోడ చంద్రప్రకాశ్