కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28
కాకినాడ ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం కనుక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ‘’ఇరగవరం’’ గ్రామ ఆహితాగ్నులగురించి తెలుసుకొందాం
పశ్చిమ గోదావరి జిల్లా
కోనసీమ ఆగ్రహారానికి పశ్చిమాన ,మధ్య డెల్టాకు గోదావరి –వసిష్ట కు తూర్పు సరిహద్దున ,గోదావరి-వైనతేయ (గరుడ )నది అంతమవుతుంది .ఆధునికకాలం లొ బ్రిడ్జీల నిర్మాణం జరిగే వరకు ఈ రెండు చానళ్ళు దాటాలంటే ప్రవాహ ఉద్ధృతి లేనప్పుడు ఫెర్రీలే దిక్కు .వసిస్ట కు దూరంగా ఉన్న కుడి భూభాగాన్ని ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అంటున్నారు. దీని ముఖ్యపట్టణం ఏలూరు .ఇది కూడా దాదాపు తూర్పు గోదావరి వైభవాన్ని పచ్చదనం తో సహా కలిగి ఉంటుంది .ధాన్యాగారం అనిపించే పంటపొలాలు వాటి దగ్గర తెల్లకొంగలు ముచ్చటగా ఉంటాయి ,ఇక్కడి పక్షులలో ‘’పాలపిట్ట ‘’ప్రత్యేకమైనది .త్రికోనణాకారమైన ఈ భూ భాగం జూన్ జులై ఆగస్ట్ నెలలో వరదలకు గురౌతుంది .వీటితో అంటువ్యాధులు ప్రబలి జననస్టం కలుగ జేస్టాయి .26 -12 -20 04న వచ్చిన సునామీలో 2,32,౦౦౦మంది మృతి చెందారు .
వేదపండిత ముఖ్యపట్టణం’’ ఇరగవరం ‘’
కోనసీమకు చేరువలో తణుకు పట్టణం వసిష్ట గోదావరికి కను చూపు లొ ఉంటుంది .ఇప్పటికీ ఇక్కడ డజనుకు పైగా వేద పండిత కుటుంబాలున్నాయి .దీనికి సమీప గ్రామాలే ఇరగవరం ,జుత్తిగ ,నిడదవోలు ,ఖండవల్లి ,సిద్ధాంతం ,కానూరు,ముక్కామల అగ్రహారాలు .20 వ శతాబ్దిలో ఇక్కడ చాలా కుటుంబా లలో ఎందరో ‘’ఆహితాగ్నులు’’ వర్దిల్లారు.1991లొ శ్రీ పీసపాటి వేంకట సిద్ధాంతి గారుకోనసీమ శ్రీరామపురాగ్రహారానికి చెందినశ్రీ దువ్వూరి యాజులుగారిని అందరు రుత్విక్కులను ఆహ్వానించే ‘’సోమ ప్రవాకుని ‘’గా తాము చేస్తున్న అగ్ని స్టోమానికి ఆహ్వానించారు .ఇప్పుడు ఈ ప్రాంతంలో పేరు పొందిన శిక్షణ పొందిన వేదపండితులు, ఘనాపాఠీ లకు కొదువలేరు .తణుకు కు ఆరు మైళ్ళ దూరం లొ ఉన్న ఇరగవరం భారత దేశం లొ’’ వేదపండిత ముఖ్య పట్టణం ‘’గా వన్నె కెక్కింది .భారత ఉపఖండం లోనే అరుదైన వేదపండితులను అందించింది ఇరగవరం .వీరిలో’’ క్రమపాఠం’’లొ సర్టిఫికేట్ పొందినవారే 30 మందికి పైగా ,అందులో సగం మంది అనేక స్థాయిలలో 2007లొ ఏర్పడిన ‘’శంకర వేద పాఠ శాలలో ఉన్నారు .ఇవాళ ఈ గ్ర్రామానికి తూర్పున వున్న ఏ గ్రామం లోనూ ఇలా చెప్పుకోవటానికి ఎవరూ లేరు .శతాబ్దం క్రితం కోనసీమలోని ముక్కామలకు ఎంతటి ఘన కీర్తి ఉండేదో, నేడు ఇరగవరానికి అంతటి కీర్తి ప్రతిష్టలు లభించాయి .
వేద సంప్రదాయానికి ఇరగవరం గర్వ పడే స్థితిలభించింది అనేక కలర్ ఫోటోల ఆల్బం లు ,వీడియోలు అనేక వేద సభల లలో ఎందరెందరో ఘనత వహించిన వేదపండితులకు నెమలి సింహాసనం పై ఆసీనులను చేసి జరిపించిన అరుదైన సత్కారాలు ఘన సన్మానాలు పై తీసినవి చూసి ఆనంద పరవశం పొందవచ్చు .అలాంటి ఘన వేదసంప్రదాయమున్న ఇరగవరానికి చెందిన వారిలో గుళ్ళపల్లి వారి కుటుంబం ఎన్నదగినది. వీరికి కోనసీమ దువ్వూరి, దెందుకూరి కుటుంబాలతో జరిగిన వివాహాలవిషయాలు ముందే చెప్పుకొన్నాం .ప్రస్తుతం గుళ్ళపల్లి కుటుంబం లొ మూడు తరాలవారి గురించి తెలుసుకొందాం .
శ్రీ గుళ్ళపల్లి సీతారామ శాస్త్రి అవధానులు గారు
శ్రీ గుళ్ళపల్లి సీతారామ శాస్త్రి అవధానులు గారు, అర్ధాంగి నరసమా౦బ గారికి అయిదుగురు కుమారులు ,ఇద్దరు కుమార్తెలు ,చాలామంది మనవాళ్ళు ,మనవరాళ్ళు ఉన్నారు .అయిదుగురిలో నలుగురు కుమారులు తిరుపతి దేవస్థానం1990 అక్టోబర్ లో ‘’వరుణపూజ ‘’కార్యక్రమం నిర్వహించినపుడు ఆహ్వాని౦పబడిన 16 మంది ఆంద్ర వేదపండితులలో ఈ నలుగురూ ఉండటం విశేషం .దీనితో వర్షాభావం ఏర్పడిన తిరుపతిలో కుంభ వృష్టి కురిసి బాధలను పోగొట్టింది .గుళ్ళపల్లి కుటుంబం పూర్తిగా వేద సంప్రదాయానికే కట్టుబడింది .వీరి ఉప కుటుంబాలు ఆ సంప్రదాయం నిలబెడుతూ ఆధునిక సౌధాలు బ్రాహ్మణ వాటికలలో నిర్మించుకొని ఉంటున్నా, సంప్రదాయాన్ని విస్మరించక అవిచిన్నంగా కొనసాగిస్తున్నారు . .ఇద్దరు ‘’ ఘనాపాఠీ’’లయ్యారు వీరిలో.ఆధునికకాలం లొ కూడా ఈ కుటుంబం కోనసీమ అగ్రహార కుటుంబాలతో వియ్యమందుకోనటం సంప్రదాయ పరి రక్షణలో భాగమే .
సీతారామ శాస్త్రి అవధానులు ‘’లోహితస ‘’గోత్రీకులు .1925 లొ ఇరగవరం లొ జన్మించి ,10 వ ఏట ఉపనయనం చేసుకొని ,కొనసీమలంక ‘’పొద్ద గట్లపల్లి’’ లోని శ్రీ కంభం పాటి లక్ష్మణ అవధాని ,ఉండి అగ్రహారం లోని శ్రీ తంగిరాల సుబ్బావధానులు ,రాజమండ్రిలోని శ్రీ విశ్వనాధ ఘనాపాఠీ గార్లవద్ద శాస్త్రాలు అభ్యసించారు .కనుక వీరి చదువు ఎక్కువభాగం కొనసీమలోనే కొనసాగింది .మామూలు పద్ధతిని వదిలి ,ముందుగా శాస్త్ర విద్య నేర్చి ,తర్వాతే వేద విద్య అభ్యసించారు ఆ తర్వాత ‘’వేదార్ధం ‘’నేర్చారు .విజయవాడ ,రాజమండ్రి ,సల్లేపల్లిలలో జరిగిన పరీక్షలో ఉత్తీర్ణులై నారు .శ్రౌతం పై అభిలాష తక్కువే అయినా, శ్రౌత ,స్మార్త కర్మలు నేర్చుకున్నారు .వీరి నైపుణ్యాన్ని కొందరు చక్కగా ఉపయోగించుకున్నారుకూడా .ఇరగవరం లోని త౦గిరాలవారిలో చాలామంది ‘’ఆహితాగ్నులు’’న్నారు.1970 లొ శ్రీ తంగిరాల రామ సోమయాజులు గారు నిర్వహించిన ‘’అగ్ని స్టోమం ‘’కు గుళ్ళపల్లి సీతారామ శాస్త్రిగారిని ‘’అధ్వర్యుని ‘’చేశారు.
16 వ ఏట వివాహం 19 24 లొ జన్మించిన నరసమాంబ గారితో జరిగింది .ఔపోసన కార్యం అయ్యాక 1950 -60 మధ్యకాలం లోవరుసగా ఏడుగురు సంతానం కన్నారు దంపతులు ..ఇందులో ఇద్దరు కుమార్తెల ను వేదపండితులకే ఇచ్చిసంప్రదాయ బద్ధంగా రజస్వల పూర్వ వివాహం చేశారు .కొడుకుల్లో ఒకాయన వేదమార్గం పై కొంత కాలం ఊగిసలాడినా, చివరికి వేదం నేర్చి ‘’సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ‘’అని పించుకొన్నారు శాస్త్రిగారు . అయిదుగురు కుమారులు తిరుపతి వారి వేదపారాయణ స్కీం లొ ఉద్యోగాలు పొందారు .మనుమలందరికీ ఉపనయనం తర్వాత సీతారామ శాస్త్రిగారే వేదం నేర్పారు .’’మా మనవాళ్ళు అందరూ అయిదోక్లాస్ తోనే ఇంగ్లిష్ చదువు మానేసి వేదం లొ పడ్డారు. ఇప్పుడు స్కూల్ లో ఎవ్వరూ మావాళ్ళు లేరు.అందరూ వేదంలోనే ఉన్నారు ‘’‘’అని గర్వ పడతారు శాస్త్రి గారు .ప్రశాంత చిత్తంగా ఉండే ఆయన విద్య నేర్పటం లొ చాల క్రమశిక్షణ పాటిస్తారు .’’కోనసీమలో ఒకే గ్రంథాన్నిఒకే సారి ఇద్దరు బ్రహ్మ చారులకు బోధించరాదు’’ అనే సంప్రదాయం ‘’ఉన్నది . కాని శాస్త్రిగారు దాన్ని అధిగమించి ఎక్కువమందికి నేర్పారు .1998 లో10-12 ఏళ్ళ వయసున్న తన అయిదుగురు మనుమలకు ,8 వ ఏట ఉపనయనం తర్వాత ఒకే సారి తైత్తిరీయ సంహిత నాలుగవ కాండ బోధించారు .తర్వాత ఇకటి ,రెండు, మూడు కాండలు ,తరవాత అయిదు ,నాలుగు , ,ఏడు కాండలు నేర్పి 20 00 మార్చి నాటికి పూర్తి చేయింఛి పరీక్షకు సిద్ధం చేయించారు .నాలుగు నెలలు పునశ్చరణ చేయించి , నలభైనాలుగు పన్నాలలో శ్రావణమాసం లొ జరిగిన పరీక్షలో కూర్చోపెట్టారు .పరీక్ష రాసిన తర్వాత మొదట ప్రారంభించిన నాలుగవ కాండ ను ‘’పదం’’ తో నేర్పారు .అంతపట్టుదల దీక్షగా గుళ్ళపల్లి రామశాస్త్రి అవధానిగారు నేర్పితే ,అంతేపద్దతిగా క్రమశిక్షణతో అయిదుగురు మనవలు నేర్చుకొని తాతగారి కీర్తిని ఇనుమడింపజేశారు ఇరగవరం లో .ఒకరకంగా ‘’వేదాన్ని ఇ(అ)రగదీశారు ఇరగవరం’’ లో .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31 -10-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

