బక దాల్భ్యుడు -20
మత్చ్య పురాణం 24.22.-27,పద్మపురాణం 12.65-69 ల ప్రకారం కేశి ని పురూరవుడు కొట్టాడు .ఒకప్పుడు వాడు చిత్రలేఖ ,ఊర్వశి లను ఎత్తుకు పోతుంటే ,ఇంద్రుని దర్శనానికి వెడుతున్నపురూరవుడు చూసి వాడితో యుద్ధం చేస్తే వాడు ఓడిపోయి వాయవ్యాస్త్రంతో పారిపోయాడు –‘’వినిర్జి ‘’ .పురూరవుడు ఊర్వశిని ఇంద్రునికి అప్పగించి అభిమానం సంపాదించగా 12.69 ఇంద్రుడు ఊర్వశిని పురూరవుడికి ఇచ్చేశాడు .చిత్రలేఖ గతి ఏమైందో మాత్రం చెప్పలేదు .కంసుడి రాక్షసముఠా లో కేశి కూడా ఉన్నాడు .కంసుడు వీడిన కృష్ణబలరాములను చంపటానికి అశ్వరూపంలో పంపితే వాడు నోరు తెరిచి మీదపడబోతే బెదరని కన్నయ్య బృందావనం లో వాడి నోట్లో ఎడమ చెయ్యి పెట్టి ,వాడి దంతాలు పగలకొట్టి లోపలి దూరి చీల్చగా వాడు ఏమీ చేయలేక చెమటలు కక్కుకొని ,చొంగ కార్చి ,కక్కుకొని ,ఉచ్చపోసుకొని ఊపిరాడక ఉంటె చేతులు మరీ పెంచి బాలకృష్ణుడు వాడిని చంపాడు .భాగవతం లో కేశి అనిమాత్రమే ఉంటె ,బ్రహ్మ పురాణంలో వాజీ ,దైత్యవాజీ,దుస్ట వాజి అనీ ,హరివంశం లో దైత్య ,కేశి తురగ దానవ ,దుస్టో స్వో వనగోచరః ,హయాధమః ,కేశి తురగ సత్తమ అని ఉన్నది .హరివంశ కేశి దుస్టరాక్షసుడు, మానవ మాంసాహారి,కోపమొస్తే యుద్ధానికి పెద్దపెద్ద చెట్లు పీకేస్తాడు .చివరికి ఓడిపోయి నేలపైబడి రెండుగా చీల్చబడి ప్రాణాలు పోగొట్టుకొంటాడు .భాగవతంలో వాడిని రెండుగాచీల్చినట్లు లేదు .
రాక్షసంహారంలో సాధారణంగా రెండుగా చీల్చటం ఒక క్రీడ.భీముడు బకాసురవధలో ,,కృష్ణుడు బకాసుర సంహారంలో రెండుగా చీల్చే చంపారు .దాల్భ్యాసుర ,బక,కేశి ఉదంతాలు సమా౦తరాలు .కృష్ణుడు బకుడిని తురగాసురుడిని చంపినపుడు వాళ్ళిద్దరూ నోళ్ళు పెద్దగా తెరచి ,శరీరం రెండు సగాలై చచ్చారు .ఊర్వశి చిత్రలేఖ కేశి ఉదంతంలో ఊర్వశి మంచి వైపుకు అంటే దేవతలా వైపుకు ,,చిత్రలేఖ చెడు అంటే కేశి దైత్యుని వైపుకు మొగ్గారు .ఇంద్రుడు కేశి అసురుడువేసిన గదను ,పర్వతశిఖరాన్నీ రెండుగా చీల్చాడు .కాని కేశి చావలేదు పారిపోయాడు .గుర్రం రూపంలో వచ్చిన వీడినే కృష్ణుడు రెండుగాచీల్చి చంపాడు .
విష్ణు పురాణం లో ఖా౦డిక్య, కేశిధ్వజ రాజ సోదరుల వృత్తాంతం ఉన్నది .ఖా౦డిక్యుడు కర్మ మార్గావలంబి .కేశి అడవికి వెళ్లి జ్ఞానసముపార్జన చేసి మృత్యు సముద్రం దాటాలనుకొని యాగం చేస్తుంటే ఒకపులివచ్చి యాగ ధేనువును చంపేసింది .దీనికి ప్రాయశ్చిత్తం ఎవరికీ తోచక ,కసేరునుతర్వాత సునకుని కలిస్తే దీనిగురించి చెప్పగలిగేవాడు ఖా౦డిక్యుడు మాత్రమె అంటే గుర్రమెక్కి అతన్ని కలవాలని వెడితే అతడుతనపైకి దాడికి వస్తున్నాడేమో అనుకొనగా ,కాదని నచ్చచెప్పగా అతడు తన మంత్రుల అభిప్రాయం అడిగితె వాళ్ళు అతడిసోదరుని చంపి రాజ్యభాగం పొందమని సలహా ఇచ్చారు .అతడికి ఈలోకం జయించాలా పరలోకాన్నా అనే సందిగ్ధం ఏర్పడి ,ఉత్తమలోక ప్రాప్తినే కోరుకొని సోదరుడికి ప్రాయశ్చిత్త విధానం సాకల్యంగా తెలియజేసి ,యాగం పూర్తి చేయించాడు .కేశికి పరలోక ప్రాప్తి పోయి ఇహలోక ప్రాప్తి దక్కింది .
మరో సారి మళ్ళీ వీళ్ళిద్దరూ కలిశారు .తనయాగం నిర్విఘ్నంగా కొనసాగేట్లు చేసిన సోదరుడికి కేశి గురు దక్షిణ ఇవ్వాలని భావించి ఏమివ్వమంటావు అనిఅడిగితే ,రాజ్యంకోరకుండా ఖా౦డిక్యుడు’’క్లేశం నుంచి విముక్తి చెందే మార్గం ‘’బోధించమనికోరాడు –‘’క్లేశప్రషామయాలం యత్ కర్మా ‘’ .రాజ్యం కోరనందుకు అమితాశ్చర్యం పొంది,ఖాండి ‘’అవిద్య స్వరూపం ‘’బోధించాడు –‘’అవిద్యాః స్వరూపం ‘’. ‘’ఖాన్డిక్య కేశిధ్వజ సంవాదం ‘’పేరుతోకృష్ణ దేవరాయలు’’ ఆమక్తమాల్యద ‘’ప్రబంధంలో అద్భుతంగా చిత్రించాడు .మిగిలినవిషయాలు తర్వాత .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-6-20-ఉయ్యూరు

