ప్రపంచ దేశాల సారస్వతం
108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -10చివరిభాగం )
20వ శతాబ్దం మొదట్లో జోసెఫ్ కాన్రాడ్ తన సముద్ర ప్రయాణాన్నివాస్తవంగా గొప్పగా వర్ణిస్తూ ‘’ది నిగ్గర్ ఆఫ్ ది నార్సిసస్’’,లార్డ్ జిమ్ ,టైఫూన్ నవలలు రాశాడు .మరో మేధావి హెచ్ జి వెల్స్’’ది హిస్టరీ ఆఫ్ మిస్టర్ పాలీ ‘’,టోనే-బంగేనవలలో సంస్కరణాభి లాష వ్యక్తం చేశాడు ఆరార్డ్ బెన్నెట్ మధ్యతరగతి ప్రజల నిజజీవితాన్ని ‘’ది ఓల్డ్ వైఫ్స్ టేల్,’’నవల రాస్తే ,ఉన్నతస్థాయి కుటుంబంలో మూడు తరాలమధ్య పరిణామాలను మనోజ్ఞంగా జాన్ గాల్స్ వర్దీతననవల ‘’ఫోర్సైట్ సాగా ‘’ లో చిత్రించాడు .చైతన్య స్రవంతి ప్రక్రియలో జేమ్స్ జాయిస్ ‘’యులిసిస్ ‘’,ఫినిగన్స్ వేక్’’నవలలు రాశాడు .మిసెస్ డాలోవె,వంటి అత్యుత్తమకథలు వర్జీనియా ఉల్ఫ్ రాస్తే,డి.హేచ్ లారెన్స్ ‘’సన్స్ అండ్ లవర్స్ ,దిరెయిన్ బ్రో ,లేడీచాటర్లీన్ నవలలో శృంగారం రంగరిస్తే కల్లోలపరిస్తే ,ఆల్డస్ హక్స్లీ భావోద్వేగానికీ వివేకానికి నడుమ జరిగే సంఘర్షణ లను ‘’యా౦టిక్ హో ,,పాయింట్ కౌంటర్ పాయింట్ ,ఎ బ్రేవ్ న్యూ వరల్డ్, దిఏప్ అండ్ దిఎసెన్స్’’నవలలు రాశాడు .సోమర్ సెట్ మాంప్రజాదరణ పొందే గొప్పనవలలు ‘’దిమూన్ అండ్ సిక్స్ పెన్స్ ,ఆఫ్ హ్యూమన్ బా౦డేజ్,కేక్స్ అండ్ ఏల్,ది రేజర్స్ ఎడ్జ్ రాశాడు.ఇవికాక ‘’షెప్పీ , ది లెటర్ మొదలైన నాటకాలూ దిరెయిన్ ,హిజ్ ఎక్సేలెన్సి,మిస్టర్ నో ఆల్ వంటి రసవత్తర కథలూ రాశాడు .గ్రాహం గ్రీన్ నైతిక సంఘర్షణ ను చాలా సరసంగా నవలలో చిత్రిస్తే ,కేథరీన్ మానస్ ఫీల్డ్ కథానికా రచనలో నూతన పోకడలు చూపింది .వెల్స్ గాళ్స్ వర్దీ ,హక్స్లీ మొదలైనవారు నవలలో తోపాటు చిరస్మరణీయ కథలనూ సృష్టించారు .
20వ శతాబ్ది నాటక రచయితలలో శిఖరాయమానుడు జార్జ్ బెర్నార్డ్ షా.సాంఘిక సిద్ధాంతాల ప్రచారానికి నాటకాలను ఉపయోగించాడు .మాన్ అండ్ సూపర్ మాన్ ,పిగ్మాలియన్ ,మిసెస్ వారన్స్ ప్రొఫెషన్ ,సీజర్ అండ్ క్లియోపాట్రా,యాన్డ్రోకలిస్ అండ్ ది లయన్ ,హార్ట్ బ్రేక్ హౌస్ ,సెయింట్ జోన్ ,బాక్ టు మెథు సెలా ,వంటి మనోజ్ఞానాటకాలు సృష్టించాడు .ఆయన కుశాగ్ర బుద్ధి వాక్ చమత్కారం ,ధర్మ ప్రబోధ తత్పరత అన్నిటిలో గోచరిస్తుంది .గాల్స్ వర్దీ కూడాసా౦ఘిక ప్రయోజనం తో ‘’ది సిల్వర్ బాక్స్ ,స్ట్రైఫ్,జస్టిస్ మున్నగు ప్రసిద్ధ నాటకాలు రాశాడు .ఏ వైపుకూ మొగ్గకుండా తటస్థంగా ఉంటూ రచన చేశాడు .జేమ్స్ బారీ రస వంతమైన ‘’పీటర్ ప్యాన్ ,ది అడ్మిరబుల్ క్రైటన్ నాటకాలు రాస్తే ,హాస్యరస ప్రదాననాటకాలు నోయెల్ కవార్డ్ రాయగా ,యేట్స్ ,మిలింగ్టన్సిన్జ్ ,జార్జ్ మూర్ ,జార్జ్ రస్సెల్ ,లార్డ్న్,సీన్ ఓ కేసీ వగైరాలు ప్రయోగాత్మక నాటకాలు రాశారు .జేబీ ప్రీస్ట్లీ వర్తమాన సమాజ స్థితి ని సొగసుగా నాటకాలలో ప్రతిఫలి౦ప జేశాడు .వాల్ గియర్ గుడ్ ,లూయీ మేక్సీన్ శ్రవ్యనాటకాలు కొత్త ప్రయోగాలతో రాశారు .
వార్తాపత్రికలు కూడాసాహిత్యానికి మంచిప్రోత్సాహమిచ్చాయి .ఉత్తమస్థాయి వ్యాసాలూ అసంఖ్యాకంగావచ్చాయి .ఆత్మాశ్రయపద్ధతిలో చార్లేస్ లాంబ్ రాసిన విధానం లో చెస్ట ర్టన్,హైలేర్ బెలాక్ ,ఎజి గార్డనర్,రాబర్ట్ లిండ్ ,.ఇ.వి.లూకాస్ ,మాక్స్ బియర్ బం,జే.బీ .ప్రీస్ట్లీ లు ఆహ్లాదమైన వ్యాస రచన చేశారు ,డబ్ల్యు ఎన్ హడ్సన్ ప్రకృతి వర్ణనాత్మక రచనలు చేశాడు .లిట్టన్ స్ట్రాచీ ‘’ఎమినేంట్ విక్టోరియన్స్’’రచనలో కొత్తదారి తొక్కాడు.టి.ఎ .లారెన్స్ విన్స్టన్ చర్చిల్ చరిత్రగ్రంథాలను సాహిత్య గౌరవంకలిగేట్లు రాశారు.సెయింట్స్ బరీ ,ఆలివర్ ఎల్టన్, వాల్టర్ రాలీ ,ఎసి బ్రాడ్లీ ,క్విల్లర్ కూచ్ డబ్ల్యు పీకార్ ,గిల్బర్ట్ మరి,హెర్బర్ట్ గ్రియర్సన్ ఐ ఏ రిచర్డ్స్ టిల్యార్డ్,డేవిడ్ డై చెస్ ,హెలెన్ డాబీ షైర్ వగైరాలూ మంచి వ్యాసకర్తలే .
రెం.ప్ర.యు .లో అన్వా అణ్వాయు ధాల వాడకం వలన విశ్వ శాంతి నశించి ,మానవాళి నామరూపాలు లేకుండా పోతుందనే ప్రమాద మేర్పడింది .పూర్వ విశ్వాసాలు ,సాంఘిక సూత్రాలు సడలిపోయాయి .1950 తర్వాత నవతరం రచయితలు –యాంగ్రీ య౦గ్ మెన్ పేరుతొ వర్తమానమే ముఖ్యం అనే ధోరణిలో రాశారు .సంఘం లో వ్యక్తులలో ఉన్న వంచనను దుమ్మెత్తి పోశారు .సమాజ యదార్ధ స్థితిని గీతాలలో గేయాలలో నవలలలో చిత్రించారు .వీరిలో జాన్ వెయిన్ రాసిన ‘’హారీ అన్డౌన్,’’కింగ్స్లే ఏమిస్ రాసిన ‘’లకీ జిమ్ ‘’నవలలు చాలా విజయవంతమయ్యాయి.
21వ శతాబ్దం లో గ్లోబల్ వార్మింగ్ ,పర్షియన్ గల్ఫ్ వార్ లపై గొప్పరచనలు వచ్చాయి .బెన్నెట్ 2006 లో రాసిన ‘’హిస్టరీ ఆఫ్ బాయ్స్ ‘’నాటకం లో 1980లో ఇంగ్లాండ్ ఉత్తర తీరంలోని స్కూలు విద్యార్ధుల మనస్తత్వాన్ని ప్రతి బి౦బి౦ చింది .డేవిడ్ మిచెల్ ‘’క్లౌడ్ అట్లాస్ట్ ‘’ నవలలో లో 19,20వ శతాబ్దుల స్థితిగతులున్నాయి .మైకేల్ ఫేబర్ రాసిన ‘’క్రిమ్సన్ పెటల్ అండ్ ది వైట్ ‘’లో విక్టోరియన్ నవల పోకడ చూపాడు .హీన్లీ –ఎలెక్ట్రిక్ లైట్ ,డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్ కవితా సంపుటులు రాశాడు .2004లో వచ్చిన ‘’బరియల్ ఎట్ ధేబ్స్’’-స్ప్ఫిక్లిస్ రాసిన ‘’యాంటిగొని’’కి అనునాదం గా ఉంటుంది .
మార్టిన్ ఏమిస్ ,పాట్ బార్కర్ ,బెర్మిక్ సమ్మర్ఫీల్ద్ ,టాంక్లైన్ ,కెన్ ఫ్లాలేట,రాంకిన్, రీమాన్ ,జాక్ వైట్ ,రియాన్ బాండ్ వగైరా 21వ శతాబ్ది నవలాకారులు .బాలసాహిత్య రచనలలో చార్లీ అండ్ లోలా ,హారీపార్టర్ మొదలైనవి బ్లాక్ బస్టర్అయాయి .
సమకాలీననవలా సాహిత్యం –జెడి స్మిత్ –వైట్ టీత్ ,సారావాటర్స్ –దిపేయింగ్ గెస్ట్స్ ,నీల్ గే మాన్ –దిఓషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లేన్ ,డేవిడ్ మిచెల్-క్లౌడ్ అట్లాస్ ,కేటే అట్కిన్సన్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ,హిలరి మాన్టేల్ ఉల్ఫ్ హాల్ ,రూత్ వేర్-ఇన్ ఏ డార్క్ డార్క్ వుడ్ ,దిగర్ల్ నెక్స్ట్ డోర్,జోజో మోఎస్ –మీ బిఫోర్ యు ,ఇయాన్ మెక్ ఇవాన్ –అటోన్మెంట్ ,జూలియన్ బార్న్స్ –దిసెన్స్ ఆఫ్ ఎండింగ్,క్రిస్ క్లీవ్ –లిటిల్ బీ నవలలు మంచి పేరుపొందాయి .
సమకాలీన కవిత్వం –రాయ్ ఫిషర్ ,ప్రియాన్నే ,ధాంసన్ ,అందరూ క్రోజియర్ ,జాన్ సిల్కిన్ ,టోనీ హారిసన్ ,కరోల్ ఆన్ డఫే మొదలైన కవులు .
సమకాలీన నాటక రచయితలు –కరైల్ చర్చిల్ ,నినా రైనే ,బోలా అగబాజే ,లూసీ ప్రేబుల్ ,రాయ్ విలియమ్స్ ,టేర్రిజాన్సన్ ,జో పెన్హాల్ తానికాగుప్తా ,జేజ బట్టర్ వర్త్ .
సాహిత్య నోబెల్ పురస్కార గ్రహీతలు –రుడ్యార్డ్ కిప్లింగ్ ,జాన్ గాల్స్ వర్దీ ,టిఎస్ ఇలియట్ ,బెర్ట్రాండ్ రసెల్ ,విన్స్టన్ చర్చిల్ ,విలియం గోల్డింగ్ ,హరాల్డ్ పింటర్ ,డోరిస్ లెస్సింగ్ (2007)
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-6-20-ఉయ్యూరు

