ప్రపంచ దేశాల సారస్వతం
112-బర్కినాఫాసో దేశ సాహిత్యం
పీపుల్స్ రిపబ్లి క్ఆఫ్ బర్కినాఫాసో దేశం పశ్చిమాఫ్రికాలో ఉంది .రాజధాని క్వాగడౌ కౌవు .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ CFA ఫ్రాంక్ .జనాభా సుమారు 2కోట్లు .సున్ని ముస్లిం దేశం .అధికారభాష ఫ్రెంచ్ .వ్యవసాయమే వనరులు .మధ్యతరగతి ఆదాయమున్న దేశం .సురక్షిత దేశం .10ముఖ్య యాత్రాస్థలాలున్నాయి .
బర్కీనా ఫాసో సాహిత్యం –ఈ దేశ సాహిత్యాన్ని బర్కినాబ్ సాహిత్యం అంటారు కాలనీ పాలన రాకముందు సాహిత్యం లేదు .మౌఖికంగానే తరతరాలుగా కధలు గాధలు గీతాలు ప్రచారమయ్యాయి .సంస్కృతి సంగీతం ద్వారానే వ్యాప్తి చెందింది .ఈ విషయాన్ని 1992లో తిటింగా ఫ్రెడరిక్ పెసేర్ర్ ‘’లీ లాంగేజ్ డెస్ టాం టామ్స్ ఎట్ డెస్ మాస్కి ఆఫ్రికి ‘’పుస్తకం లో వివరించాడు .ఇక్కడ గ్రయట్స్ ఆదిమజాతి .1934లో డండలోబ్సం క్వెడ్రోగా’’మాక్షిమ్స దాట్స్ ,అండ్ రిడిల్స్ ఆఫ్ ది మొస్సి ‘’పుస్తకం రాశాడు .అందులో మొస్సిసామ్రాజ్యం తర్వాత బర్కినాఫాసోఏర్పడింది అని చెప్పాడు .
దేశం స్వతంత్రం పొందాక బర్కినేబ్ రచయిత నాజి బోని ‘’దిడౌన్ ఆఫ్ ఎన్శేంట్ టైమ్స్ ఆర్ ‘’దిట్విలైట్ ఆఫ్ ది బైగాన్ డేస్’’రాసి 1962లో ముద్రించాడు .బోనీ స్వతంత్ర సమరంలో నాయకుడు .ది ట్రడిషన్స్ ఆఫ్ బ్వోము పీపుల్ నవల రాశాడు .ఇది ఎథ్నోగ్రాఫిక్ నవల .రోజర్ నికిమా’’మైజర్ మోగా ఏ కామెడి ఆఫ్ మానర్స్ ‘’నవల రాశాడు .పియర్రి డేబిరి -సంసోవా ,అండ్ మౌసా సమడోగా –డాటర్ ఆఫ్ దివోల్టా ,దిఆరకిల్ నవలలు రాశారు
1970లో తరువాతతరం నవలాకారులు ఆగస్టేన్ ,కోలిన్ నోఎట్లేన్నీ స్వాదోగా .ఇటీవలి వారిలో జాక్వెస్ ప్రాస్పర్ ,జీన్ బాప్టిస్ట్ సోమేనార్బెర్ట్ జొన్గో వగైరాలు .స్త్రీ రచయితలలో ,పియరేట్టీ సాండ్రాకాంజీ ,బెర్మాడేట్టీ డోవా,గేల్ కోన్,సారాబయూలిన్ ,అందరిలో ప్రముఖరచయిత ఫ్రెడరిక్ పాసేర్రి టిటింగా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-6-20-ఉయ్యూరు

