ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -2
వేద వేదంగ శాస్త్రాలను బోధించే విశ్వ విద్యాలయాల లాంటి వాటికి ‘’ఘటికా స్థానాలు ‘’అంటారు .అక్కడ అధ్యయన అధ్యాపనలు బ్రాహ్మణులే చేసేవారు .ఆయుర్వేద ,ధనుర్వేద ,గాంధర్వ ,అర్ధ శాస్త్రాది బోధనలు కూడా అక్కడ జరిగేవి ,ఉత్తర భారతం లో కాశీ ఒక ఘటికాస్థలం ..నిడు మర్రు శాసనగ్రహీత ,పురాణ ధర్మశాస్త్ర ఆగమ ఉపనిషత్సాన్గుడు కటి శర్మ తాత’’మండ శర్మ ‘’కల్ప,పురాణ ఇతిహాస ధర్మ శాస్త్రాలలో కూడా పండితుడై,కమ్మ రాష్ట్రంలోని ’’అసనపుర ఆస్థానం ‘’లో ఘటికా సామాన్య పదవి అలంకరించాడు .హేమవతి అనబడే హోన్జేరు లో నోసంబెశ్వరాలయం మరో ఘటికా స్థాన౦ ,అక్కడ 94మంది విద్యార్ధులకు భోజన సౌకర్యం కలిపించారు .అలాంటిదే కాకర పర్రులో ఉంది .ఇది ‘’శాతాబ్దాలనుంచి ఒక విద్యా పీఠం’’అని విశ్వనాధ,’’భారతీయ సాంప్రదాయ విద్యలకు దక్షిణ కాశి ‘’అని ఆచార్య ఎస్వి జోగారావు పేర్కొన్నారు .7వ శతాబ్ది చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఇక్కడికివచ్చి పండితులను ప్రశంసి౦చాడని అంటారు .జర్మనీ పండితుడు మాక్స్ ముల్లర్ (మోక్ష మూల భట్టర్)’’కాకరపర్రు లో ప్రతి ఇంటి అరుగు ఒక విశ్వ విద్యాలయం ‘’అని మెచ్చాడు .
చాలాకాలం క్రితం ఉద్దండ భారతీస్వామి అనే యతి సకల శాస్త విద్యా పార౦గ్తుడను అనే గర్వం తో తనతో శాస్త్ర వాదం చేస్తేనే కాని భిక్ష తీసుకొననే వాడు .ఒక బంగారు చీపురు దగ్గర పెట్టుకొని విద్వాంసులను ‘’ఇలా చెరిగి అలా తుడిచి పారేస్తాను’’ప్రగల్భాలు పలికేవాడు . .ఒకసారి కాకరపర్రు రాగా భిక్ష తీసుకోమంటే ముందు శాస్త్ర చర్చ చేయాలన్నాడు .అక్కడి పండితులు ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటమే కాక ,వాళ్ళే ప్రశ్నలు సంధించారు వారి వైదుష్యానికి విస్మయం చెంది ఓడిపోయానంటే పరువు తక్కువకనుక కవిత్వం పై ప్రశ్న వేస్తానని ‘’ఆశ్చర్య మాశ్చర్య మతః పరం కిం ‘’అనే సమస్య ఇచ్చాడు .అక్కడి యువకవి ఒకడు –
‘’యోగీశ్వరో వా యతీశ్వరోవా –విద్వత్ప్రభు ర్వాదమదనాన్తకోవా –కాన్తాల కాంతానన చిత్త వృత్తిః-’ఆశ్చర్య మాశ్చర్య మతః పరం కిం ‘’అని పూరిస్తే ,ఉద్దండ స్వామి తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు .పూర్వం ఇక్కడ’’ కుండలీ గ్రంథాల’’ను అన్వయం చేసే సమర్దులుకూడా ఉండేవారు .కాశీలాగా దీటుగా కాకరపర్రు ఒక ఘటికా స్థానమే .క్రీ పూ 9-10 శతాబ్ద కాలం లో కాకర్త్య గుండ్యనవంశం వారు జైనమతమవలంబించారు.ఇక్కడి కనక మహా లక్ష్మి అమ్మవారి దేవాలయం 19వ శతాబ్దిలో పెమ్మరాజు వెంకటరత్నం నిర్మించాడు .అమ్మవారి పేరే చాలామంది పెట్టుకొనేవారు .9వ శతాబ్దిలో నరేంద్ర మృగరాజు అనే చాళుక్య ప్రభువు రాజరాజేశ్వర రాజేశ్వరీ దేవాలయం కట్టించాడు .హనుంమ౦తుడు ప్రతిష్ట చేసినట్లు చెప్పబడే సీతారామస్వామి దేవాలయం ఉంది .తర్వాత వేణుగోపాల సుబ్రహ్మణ్యే శ్వర,సాయిబాబా ,పాండురంగ దేవాలయాలు వచ్చాయి .త్రిమూర్తుల ప్రతి రూపంగా రావి ,వేప మర్రి చెట్ల పండగ చేస్తారు .
మొదటి ఆంద్ర మహాకావ్యం భారతం రాసిన ,వాగనుశాసనుడు 11వ శాతాబ్దినన్నయభట్టు తణుకు దగ్గర లో యజ్ఞంచేసి ,భారత రచన మొదలుపెట్టాడని భావిస్తారు .ఆయన అనుంగు మిత్రుడు నారాయణ భట్టు ,కూడా ఇక్కడి వారే అన్నారు చాలామంది .కానీ కాకరపర్రు పండితులు పెన్మత్స సత్యనారాయణ రాజు ,ఆకుండి వెంకటేశ్వరరావు ,కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మ,ఆచార్య దివాకర్ల ,నరసింహ దేవర ఉమామహేశ్వర శాస్త్రి గార్ల విపుల పరిశోధన సారంగా నన్నయ తణుకు వాడే ,కాని యజ్ఞం చేసింది కాకరపర్రు లోనే అని తేల్చారు .రాజరాజ నరేంద్రుని కోరికపై భారతం ఆంధ్రీకరణ కు పూనుకొనగా రాజుగారు ఏనుగు అ౦బారీపై కాకరపర్రు చేరి ,ఊరి బయట పెద్ద రావి చెట్టుకు ఏనుగును కట్టి ,నన్నయగారింటికి రత్నకనుకలతో నడిచి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన పండిత సభలో కవిపండితులను సత్కరించి ఆశీస్సులు పొందగా నారాయణభట్టు నన్నయ గురించి ప్రశంసా వాక్యాలు పలికాడు .రాజరాజు కవిని అపూర్వ కానుకలతో సత్కరించి ,రాజమహేంద్రవరం కు రమ్మని ఆహ్వానించాడు .ఆయన నారాయణభట్టువైపు సాభిప్రాయంగా చూసి ‘’తథాస్తు ‘’అన్నాడు .పండితవర్గం హర్షా మోదం వ్యక్తం చేసింది .నన్నయ తూర్పు చాళుక్యుల రాయబారి ,నారాయణ పశ్చిమ చాళుక్యుల రాయబారి. కవిత్రయం లో మూడవవాడు ఎర్రాప్రగడ కాకరపర్రు వాడే అని మల్లంపల్లి వారు చెప్పారు.
14-16శాతాబ్ద౦ వాడైన అనిసింగరాజు రామ కృష్ణుడు ఇక్కడివాడే జ్యోతిశ్శాస్త్ర పండితుడు ఒక సారి విజయనగర రాజాశ్రయం కోసం వెడితే రాజ దర్శనం కాకపొతే ,ఒక రోజు తెల్లవారు ఝామున నదిలో స్నానం చేస్తుంటేభిక్షాటన చేసే బ్రాహ్మణుడు కనిపిస్తే ,మర్నాడు సూర్యగ్రహణం అన్నమాట రాజుగారికి చెప్పద్దని ,రాణివాస స్త్రీలు అడిగితె ఆరోజు గ్రహణం పట్టదు అని భయపడకుండా చెప్పమని, తానూఎక్కడు౦టాడోకూడా చెప్పాడు .మర్నాడు గ్రహణ స్నానానికి రాణి వాస స్త్రీలు బంధువులు అందరూ తరలి వచ్చారు .కానీ గ్రహణం పట్టలేదు .రాజుగారికి తెలిసి ఆ యాయవార బ్రాహ్మణుడిద్వారా రామ కృష్ణుడును ఆస్థానానికి రమ్మని చెప్పమన్నాడు .తనకు వీలులేదని రాజునే రమ్మని చెప్పాడు .తానున్నగదిలో ముగ్గులతో గ్రహ వ్యవస్థ రూపొందించాడు.అనిసిన్గరాజు . కుడికాలు బొటన వ్రేలితో గ్రహణాన్ని త్రొక్కి ఉంచి ,రాజుగారిని కిటికీ లోంచి చూడమని చెప్పాడు. రాజు అది చూసి ఆశ్చర్యపోయి ,ఆయనగురించి వివరాలు అడిగి రాజ దర్శనం కాకపోవటం వల్లనే ఇలా కాలస్థంభనవిద్యతో గ్రహణాన్ని ఆపేసినట్లు తెలియ జేశాడు .రాజు అతని జ్యోతిష్య పాండిత్యానికి అబ్బురపడి కొంత లంకభూమిని రామకృష్ణుడికిఈనాముగా ఇచ్చాడు .అది ‘’అనిసిన్గరాజు లంకభూమి’’గా గ్రామ రికార్డు లలో ఉన్నది. వేదుల సూర్యనారాయణ శర్మగారు ‘’కన్నీళ్లు ‘’గ్రంథంలో ‘’అన్సిన్గ్రాజు రామకృష్ణుడ౦డీ —-గ్రహణము నిల్పిన –సూర్యగ్రహణము నిల్పిన దంసిన్గ్రాజు రామకృష్ణు డండీ’’అని ఆవిషయం ప్రస్తావించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-20-ఉయ్యూరు
—

