మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -58


· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -58

58-మరో మొహంజదారో నాటక౦,మరో ప్రపంచం ఫేం, నటుడు ,రచయిత-మోదుకూరి జాన్సన్

మోదుకూరి జాన్సన్ (ఆగష్టు 8, 1936 – డిసెంబరు 24, 1988) నటుడు, నాటక రచయిత. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన ‘మరో ప్రపంచం’ సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు.[1]

జననం – విద్యాభ్యాసం – ఉద్యోగం
వీరు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో 1936, ఆగష్టు 8 తేదీన జన్మించారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం దుగ్గిరాల, గుంటూరులో చేసిన తర్వాత ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తెనాలి లో కొంతకాలం న్యాయవాది గా పనిచేశారు,

నాటకరంగ ప్రస్థానం
ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. వీరు నటనాలయం,[2] దేవాలయం, హృదయాలయ, సిలువభారం మొదలైన నాటకాలు రాసి ప్రదర్శించారు. ఢక్కాభిషేకం నవల రాశారు. రాగ హృదయం అనే రూపకానికి నేపథ్యగానం అందించారు. ఛండాలిక, పైరుపాట సంగీత రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు.

సినీరంగ ప్రస్థానం
మోదుకూరి రాసిన నటనాలయం నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే అక్కినేని నాగేశ్వరరావు – ఆదుర్తి సుబ్బారావు లు తమ సొంత చిత్రమైన మరో ప్రపంచం సినిమాకు సంభాషణల రచయితగా అవకాశం ఇచ్చారు.[3] వీరు కరుణామయుడు (1978), ఇంద్రధనుస్సు (1978), మానవుడు – దానవుడు (1972), విచిత్ర దాంపత్యం (1971), డబ్బుకు లోకం దాసోహం (1973), ఆంధ్ర కేసరి, దేశోద్ధారకులు మొదలైన సినిమాలకు సంభాషణలు రాశారు.[4]

నటుడుగా ,సంగీత దర్శకుడు గా అనేక బహుమతులు పొందారు .జాన్సన్ గొప్ప వక్త .సంభాషణా చతురులు

రచించిన పాటలు[మార్చు]

  1. కదిలింది కరుణరథం… సాగింది క్షమా యుగం (కరుణామయుడు)[5]
  2. మన జన్మభూమి… బంగారు భూమి(పాడిపంటలు)[1]
  3. స్వాగతం దొరా (దేశోద్ధారకులు)[3]

మరణం
— వీరు 1988, డిసెంబరు 24 తేదీన 52 ఏళ్ళకే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

హీరో,దర్శకనిర్మాతకృష్ణ –‘’ ‘చెరగని జ్ఞాపకం’ పుస్తకావిష్కరణలో కృష్ణ
‘తెలుగు సినీ రంగంలో రచయితగా మోదుకూరి జన్సర్‌ చెరగని ముద్ర వేశార’ని నటుడు కృష్ణ అన్నారు. ‘మరో ప్రపంచం’, ‘మానవుడు – దానవుడు’, ‘డబ్బుకులోకం దాసోహం’, ‘దేశోద్ధారకులు’, ‘బంగారుభూమి’, ‘కరుణామయుడు’, ‘దేవాలయం’, ‘నేటి భారతం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాటలను, ‘మన జన్మభూమి… బంగారు భూమి'(పాడి పంటలు), ‘కదిలింది కరుణ రథం..'(కరుణామయుడు) వంటి పాటలను రచించిన సినీ రచయిత మోదుకూరి జాన్సన్‌ జీవిత విశేషాలపై ‘చెరగని జ్ఞాపకం’ పేరుతో తెనాలికి చెందిన న్యాయవాది, రచయిత గుంటూరు కృష్ణ రూపొందించిన పుస్తకాన్ని కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పద్మాలయ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, ‘జాన్సన్‌ తెనాలి సమీపంలోని కొలకలూరులో 1934లో జన్మించారు. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన ‘మరో ప్రపంచం’ సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు. దాదాపు 50 సినిమాలకుపైగా మాటలు సమకూర్చారు. మాటలతో పాటు శ్రీ శ్రీ, దాసరథి, ఆరుద్ర వంటి ప్రముఖుల సరసన కొన్ని చిత్రాలకు పాటలను కూడా రాశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, విజయచందర్‌ చిత్రాలకు రచయితగా పనిచేశారు. పి.సి.రెడ్డి, టి.కృష్ణ, విజయనిర్మల కె.బాపయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు, సురేష్‌ ప్రొడక్షన్స్‌, పద్మాలయ పిక్చర్స్‌, ఉషా శ్రీ పిక్చర్స్‌ సంస్థలు నిర్మించిన పలు చిత్రాలకు రచయితగా పనిచేసి తెలుగు సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 1988 డిసెంబర్‌ 24న ఆయన మరణించారు. చనిపోయి 30ఏండ్లు అవుతున్నా నేటికీ జాన్సన్‌ మాటలు, పాటల ద్వారా చిరస్మరణీయుడుగానే ఉన్నారు. జాన్సన్‌పై పుస్తకాన్ని రాసిన గుంటూరు కృష్ణకు నా అభినందనలు’ అని అన్నారు. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడటం చాలా ఆనందంగా ఉంది’ అని రచయిత కృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, శాఖమూరి మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.