‘పొద్దస్తమానూ తిని తొంగుంటే, మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది? మడిసన్నాక కాసింత కలాపోసనుండాలి’ / ‘సెక్రె టీ! నీ బుర్ర వట్టి బాత్ రూమ్’ / ‘ఎలాయినా సావాలత్తది మంచి మనసు. అప్పిస్తావా, అరువిస్తావా?’ / ‘అప్పు సచ్చినా ఇవ్వను’ / ‘ఇదేంటి? పది రూపాయలిచ్చి వందరూపాయలకి సిల్లరిమ్మంటాడు?’ / ‘కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గోరింటాకు పెట్టుకున్నావా?’ / ‘ఏమన్నా తేడా వస్తే మా బాసు సహించడు, చమించడు, సహించడు, చమించడు’.
‘మొగుడు పెళ్ళాం సమానం. కానీ మొగుడు కొంచెం ఎక్కువ సమానం’ ‘భార్య పట్ల మొగుడనబడే మగవాడి అహంకారం ఎప్పటికీ అలాగే ఉంటుందని, ‘మిస్టర్ పెళ్లాం’ చిత్రంలో ఒక్కవాక్యంలో చెప్పే చక్కని డైలాగు)
‘బామ్మగారూ! అట్టులు పెట్టరూ?’ / ‘అట్టులు వుట్టి నే పెట్టరు. ఇట్టులనే పెట్టెదరు’/ ‘అట్టులనే ఇచ్చెదము’
ఎవరు రాయగలరు ఈ మాటలు, రమణగారు తప్ప? ఆ మాటలకి అందమైన గీతలు ఎవరు గీయగలరు బాపుగారు తప్ప? ఈ రాత గీతల నేస్తాలే బాపు రమణలు. వారు నిత్య చిరస్మరణీయులు
‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’, ‘దేశబాషలందు తెలుగు లెస్స’ అని మన తెలుగు భాషని గొప్పగా కొనియడారు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం మన తెలుగు భాషకే పరిమితం.
తెలుగులోని తియ్యదనం గొప్పతనాన్ని, తెలుగువాడి సంస్కృతి, సంప్రదాయాల్ని బాపు రమణలు చాటి చెప్పారు. అందుకే తెలుగువాళ్ళు గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, అందమైన వాళ్ళు, ప్రేమానుగారాలు పరిచేవాళ్ళు, తెలివైన అమాయకులు, ‘బాపు రమణలు మా తెలుగువారు’ అని గొప్పగా చెప్పకునే అదృష్టవంతులు!
చీర సింగారించుకుని, పొడుగ్గా జడ వేసుకుని, తల్లో పూలచెండు, నుదుట పెద్దబొట్టు, కళ్ళకి కాటుక పెట్టుకుని అందంగా ఎవరైతే ఉంటారో, వాళ్ళే మన తెలుగింటి అమ్మాయిలు. వాళ్ళే బాపు బొమ్మలు. ఆ బొమ్మలు మాట్లాడే మాటలే ‘రమణ’ తీయని ముత్యాల పలుకులు.
వాళ్లకి ఆంటీలు, ఆంకుల్స్, మమ్మీలు, డాడీలు, గ్రాండ్ పాలు, గ్రాండ్ మాలు లేరు. తెలుగు పక్కింటి పిన్నిగారు, వాళ్ళ మొగుడుగారు, బామ్మగారు, గోపాళం బాబాయి, ప్రైవేట్ మాస్టారు, రెండు జెళ్ళ సీత, కిరాణా కొట్టు విసినాథం, చిన్నబాబులందరు బుడుగులు, చిన్ని పాపలు సీగానపెసూనాంబలు-వాళ్ళని రోజు స్నానం చెయ్యమని, అన్నం తినమని, చదువకోమని, అల్లరి చెయ్యొద్దని విసిగించే పెద్ద కాటుక కళ్ళ అందమైన రాధమ్మలు, గోపీ నాన్నలు… ఇలా ఎంతోమంది తెలుగు వాళ్ళు బాపు రమణలకి ఆత్మీయులు. వాళ్ళకి బాపు రమణలన్నా చాలా ఇష్టం.
ముంగిట ముత్యాముగ్గులతో, పచ్చని తోరణాలతో కళకళలాడే అందమైన తెలుగింటి లోగిళ్ళు, అందమైన రాధమ్మలు, గోపి నాన్నలు, అందమైన శృంగార విన్యాసాలు, భార్యా భర్తల చిట్టి చిట్టి కోపాలు, కీచులాడుకునే అందమైన ప్రేమికులు, డబ్బుజబ్బు చేసిన చెడ్డ మనుషులు, డబ్బు జబ్బు తెలియని మంచిమనుషులు, వాళ్ళ అమాయకత్వాలు, తెలుగిళ్ళ సహజ వాతావరణం, అందరూ కలిసి శ్రీరామనవమికి భద్రాచలం లాంచి ప్రయాణం. ఆ ప్రయాణంలో పదనిసలు.. ఇలా ఎన్నో నీతులు, జీవిత సత్యాలతో కలబోసిన ‘అందాలరాముడు’ సినిమా అంతా బాపు రమణీయం.
బాపుని ఒంటరిని చేసి రమణ నిష్క్రమణంతో తెలుగు ప్రజల హృదయాలు బాధగా రోదించాయి. ఇప్పుడు బాపుగారి మరణంతో తెలుగువారందరికీ తీరని లోటు కలిగింది. వాళ్ళు చెడ్డతనం ఎరుగని, గర్వం తెలియని, అహంకారాలు, ఆడంబరాలు లేని, మన తెలుగువారు గర్వించదగ్గ తెలుగుజాతి రత్నాలు. స్నేహమేరా జీవితం, స్నేహమంటేఇదేరా అని చాటి చెప్పిన మహా తెలుగు మహానుభావులు బాపు రమణలు.
– – –
బుడుగు బాపు గీసిన తన బొమ్మల్ని అపురూపంగా చూసుకుంటూ, ‘తాతగారూ! మీరు నన్నొదిలి వెళ్ళిపోయారా?’ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇంతలో భుజం మీద చెయ్యి తగిలి కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి చూసాడు. సీగాన పెసూనాంబని చూసి ఇంకా ఏడ్చాడు.
‘పెసూనాంబా, పెసూనాంబా! బాపు తాత గారు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోయారు’ / ‘ఊరుకో, ఊరుకో బుడుగూ! ఏం చేస్తాం? మీ అమ్మ, మా అమ్మ, గోపాళం బాబాయి, రెండు జెళ్ళ సీత, కిరాణా కొట్టు విసినాథం, పక్కింటి పిన్నిగారు, వాళ్ళ మొగుడుగారు, ప్రైవేటు మాస్టారు, ఇలా హోల్ ఫేమిలీ అందరూ బాధపడుతున్నారు. నువ్వు, నేను కూడా అక్కడే బాధ పడదాం, రా బుడుగూ’/ ‘నే రాను’ / ‘ఎందుక్కూ….? పోనీ ఈ పాలు తాగు, నీరసంగా ఉన్నావు’.
‘అబ్బబ్బ.. జాటర్ డమాల్! నే రానన్నానా? నాకు అసలే మనసు బాగాలేదు. అసలే అప్పుడెప్పుడో, మూడేళ్ళో, పదేళ్ళ క్రితమో రమణ తాత గారు పోయారు. మళ్ళీ ఇప్పుడేమో బాపు తాతగారూ పోయారు. అందుకే నాకాకలిగా లేదు. ఐనా ఇప్పుడొస్తే అమ్మ ‘స్నానం చేద్దూ గాని, రా బుడుగూ’ అంటూ లాక్కుపోతుంది. ఆ తరువాత తన కిష్టమైన బట్టల్లో నన్ను కూరుతుంది. ఆ తర్వాత ప్పదో, ప్పదేనో ఇడ్డెన్లు, బోలెడు నెయ్యి పోసి నా నోట్లో కూరుతుంది. నాకాకలిగా లేదు మొర్రో అన్నా వినిపించుకోదు. ఆ తరవాత ప్రైవేటు మాస్టారొస్తే, పలక, బలపం ఇచ్చి అ.. ఆ.. దిద్దమని కూలేస్తుంది. పలక పగిలిపోయిందంటే, కిరాణా కొట్టు విసినాదం దగ్గర ఇంకో పలక తెప్పిస్తుంది. పోనీ కడుపు నొప్పిగా ఉంది బాబోయ్, ఇవాళ ప్రైవేటు వద్దు తల్లోయ్ అంటే చేదుమందు మింగించి కూచోపెడుతుంది. బామ్మకి చెప్పుకుందామంటే, ఒకటి చెబుతే ఇంకోటి మాట్లాడుతుంది. ఆవిడకి చెముడు. గోపాళం బాబాయీ, రెండు జెళ్ళ సీతతో ముచ్చట్లాడుకుంటాడు. నన్ను పట్టించుకోడు. ఈలోగా పక్కింటి పిన్నిగారు, వాళ్ళ మొగుడుగారు వచ్చి, నన్ను బలంగా ఎత్తేసుకుని, గట్టిగా ముద్దు పట్టేసుకుని, గమ్మున కింద పడేస్తారు. నాకేమో బుగ్గలు వాచిపోయి, నెప్పెట్టేడిస్తే, అమ్మ, ‘ఇంక చాల్లే, ఏడుపాపు’ అని గిన్నెడు పాలు తాగించి, చదువుకో అంటూ కోప్పడుతుంది. ఇలా అందరూ నన్ను విసిగించేస్తున్నారు. నాకు ఏ మాత్రం సొతంత్రం లేదు. ఈ కష్టాలన్నీ చెప్పుకుందామంటే, ఇప్పుడు బాపుతాతగారు కూడా లేరు. అప్పుడెప్పుడో రమణతాత గారి కోసం బాపుతాత గారు చాలా బాధ పడిపోతుంటే, నేనే బాపుతాత గార్ని ఓదార్చాను. ‘బాధ పడకండి, చెట్టంత వాడ్ని. మీ బుడుగుని, ఎప్పుడూ నేను మీ పక్కనే ఉంటాను. నాతో బోలెడు కబుర్లు చెప్పండి’ అని కూడా చెప్పాను. ఐనా నా మాటినకుండా బాపుతాత గారు కూడా వెళ్ళిపోయారు. అసలీ దేముడు మంచివాళ్ళని, మంచిగా నా బొమ్మలేసే బాపు తాత గారిని ఎందుకు తీసికెళిపోతాడో అర్థం కాదు’.
‘అర్థం కాదులేరా బుడుగూ! మనం చిన్నవాళ్ళం కందా?’ / ‘మరి మనం ఎప్పుడు పెద్దవాళ్ళం అవుతాం? తరవాత పెద్దయ్యాక, తాతగారి లాగ మనం కూడా వెళిపోతామా?’ / ‘లేదు. నువ్వూ, నేనూ మన హోల్ ఫేమిలీ అంతా ఎప్పటికీ, ఎన్ని యుగాలైనా ఇలాగే ఉంటాం. రమణతాతయ్య రాసిన రాతల్లో, మనం బాపు గీసిన బొమ్మలం. వాళ్ళవి బ్రహ్మ రాతలు. ఆ విధాత గీసిన గీతనించి ఎవరూ తప్పించుకోలేరు.
మనవి బాపు రమణల గీత రాతలు. వాళ్ళే మనవిధాతలు.
అందుకే మనం తెలుగువాళ్ళందరి హృదయాలలో ఎప్పటికీ చిరస్తాయిగా ఉండిపోతాం.
బాపుగారికి నివాళులర్పిస్తూ….
– పెయ్యేటి శ్రీదేవి
వీక్షకులు
- 1,107,436 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

