1-‘’నీ బంధువుల్లో బీద వారెవరైనా ఉన్నారా?’’
‘’నాకు తెలిసిన వారెవరూ లేరు ‘’
‘’పోనీ డబ్బున్నవారున్నారా ?’’
‘’వారికి నేనెవరో తెలీదు ‘’
2’’-నా జేబులో పైసా లేకుండా నా జీవితం ప్రారంభించాను ‘’తండ్రి
‘’అదేం గొప్ప ! నేను పాకెట్ కూడా లేకుండా జీవితం ప్రారంభించా ‘’కొడుకు .
3-ప్రతి ఇంట్లో ఒక పుస్తకం ఉండాలి –చదువురాని వారు బొమ్మలు చూసుకో వచ్చు .చదువు వచ్చిన వారు వివేకం తెచ్చుకొంటారు .పని మనిషి దానితో హాయిగా బొద్దేమ్కలను చంపచ్చు. ‘’అన్నాడొక పుస్తకాచార్య .
4-విజిటర్ –మీ యజమానిని చూడాలి-
నౌకరు –దేనికి ?
విజిటర్ -ఒక బిల్లు —
నౌకరు-ఊరేళ్ళారు
విజిటర్ –కట్టటానికి వచ్చాను
నౌకరు –అయితే నిన్ననే వచ్చారు .ఇంటిలో ఉన్నారు కట్టండి .
5-నేను ప్రధాని అవుతాను –డాబూరావు
నేకేమైనా పిచ్చా?-డౌటేశ్వర్
‘’ప్రధాని అవ్వాలంటే ఆ లక్షణం అవసరమా ?డౌనాబేశ్వర్ .
6-‘’నాచివరి పెయిం టింగ్ ధార్మిక సంస్థకు విరాళం గా ఇవ్వాలని ఉంది ‘’చిత్రకారుడు
‘మంచిది .అంధుల సంస్తకిస్తే యాప్ట్ గా ఉంటుంది ‘’కళా విమర్శకుడు
7-ఆశ్చర్యానికి ,సస్పెన్స్ కు ఉన్న తేడాను ‘’అల్ఫ్రెడ్ హిచ్ కాక్ ‘’ఇలా చెప్పాడు –సినిమాలో అకస్మాత్తుగా బాంబు పేలిస్తే ఆశ్చర్యం అంటారు .బాంబు పేలుతుందని ఆడియన్స్ కు తెలిసినా హీరోకు తెలీక పొతే సస్పెన్స్ ‘’అంటారు .
8-హాలీ వుడ్ నటీనటుల కాలనీ ముందు పిల్లలు ఆడుకొంటూ ఒకడు ‘’నేను నాన్నను ‘’అన్నాడు .ఇంకోపిల్ల ‘’నేను అమ్మను ‘’అంది .ఇంకో కుర్రాడు ‘’అయితే నేను విడాకుల లాయర్ని ‘’అన్నాడట .
9-మీ ఆవిడ ఎవరికి వోటు వేస్తుంది ?
ఇంకెవరికి?నేనెవరికి వేస్తె ఆవిడా వారికే వేస్తుంది .
మీ రేవ్వరికి ఓటేస్తారు?
‘’ఇంకా మా ఆవిడను సంప్రదించలేదు ‘’
10- సినిమా నటిని పెళ్లి చేసుకొన్న ఒక అభాగ్యుడు హనీ మూన్ కు వెళ్దామని కొత్త భార్య అంటే ‘’నేను కూడ బెట్టిన డబ్బంతా ఈ హనీ మూన్ తో హుష్కాకి అయిపోతుంది ‘’అన్నాడు బేలగా
‘’అయితే ఏమిటి డియర్?హనీమూన్ మాలాటి వాళ్లకు రెండేళ్ళకో మూడేళ్ళకో కదా వచ్చేది ?అంది గోముగా ఆ వయ్యారి .
దసరా శుభా కాక్షలతో
సేకరణ
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-14-ఉయ్యూరు

