యెన్ టి అర్ పై ”మహా ఘనుడు ”సినిమా
| ఎన్టీఆర్ జీవిత కథ ‘మహాఘనుడు’ | |
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహాఘనుడు’. జె.కె.మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది. దావల కుమార్ రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. డి.అనీల్‌సుధాకర్, డి.క్రిష్ణారావు నిర్మాతలు. ఈ సినిమా విశేషాలను దర్శకుడు చెబుతూ ‘‘నందమూరి తారక రామారావుగారి సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించాం. దీంతో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ నెల 20 నుంచి రెండో షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరిస్తాం. అక్టోబర్ మూడో వారంలో ఆఖరి షెడ్యూల్ చేస్తాం. 2015జనవరిలో అన్నగారి వర్ధంతి సందర్భంగా సినిమాను విడుదలచేసి, ఆ రోజు అన్నగారి పేరున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాం’’ అని అన్నారు. ఎలాంటి విమర్శలు, వివాదాంశాలు లేకుండా కేవలం అన్నగారి గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా రూపొందిస్తున్నాం అని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: మురళీకృష్ణ మిరాకిల్, ఎడిటింగ్: బద్రి, సంగీతం: ఉదయ్‌ముద్గల, రాజు, పాటలు: అచ్చుల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ కృష్ణ.
|


