హుధూదుదంతం
హుత్ అంటే పారిపోతున్దనుకొన్న హుధూద్ తుఫాను అందమైన విశాఖను విశోక నూ ప్రకృతి రమణీయ అరకును చెరుకు ముక్కలుగా ,ప్రశాంత విజయనగారాన్ని విలయ నగరం గా ,ఉత్తరాంధ్ర కధకు ఆటపట్టు చికాకోల్ ను చిక్కుల వలయం గ మార్చింది .కనీ వినే ఎరుగని భీభత్సాన్ని సృష్టించి బతికిన వారికీ ఎందుకు బతకాలనే నిరాశనే మిగిల్చింది .చీలి కోలుకొంటున్న నవ్యాంధ్ర నడుం విరిచింది .కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకొన్నా ప్రక్రుతి ముందు మానవుడు ఓడిపోవాల్సోచ్చింది .ఇది ‘’ఎంత్ టైం’’..కాని వీటిని తట్టుకొని నిలబడి అసమాన ధైర్యాన్ని జీవి తేచ్చను ప్రదర్శించిన సామాన్యులను అ ముందుగా అభినందించాలి .ఆతర్వాత ప్రజా ముఖ్యమంత్రి చంద్ర బాబును ,ఆయనకు ప్రతిక్షణం తోడ్పడిన సహ మంత్రులను వారికీ తోడ్పడుతున్న ప్రభుత్వాధికారులను యెంత ప్రశంసించినా సరిపోదు .కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముందు జాగ్రత్త చర్యలకు సహాయమందించి దేశీయ విపత్తుగా భావించి వెన్నంటి నిలచిన ప్రజా మోడీ అయన ప్రభుత్వమూ ఎన్ని అభిన్దనలకైనా అర్హమే .కునుకు లేకుండా చిమ్మ చీకటిలో ,ప్రళయ కాలపు చినుకుల మెరుపులా ఉరుముల కుండ పోత ధారల్లో ప్రజానీకం వణికే పోయారు .వారికి ఆపన్న హస్తం అందించటానికి విలయానంతరం అందరూ ముందుకు రావటం హర్షణీయం .ఇది మానవుడు సృష్టించుకొన్న విపత్తు కాదు .నెత్తిపై బలవంతాన పడిన తుఫాను పిడుగు .ఈల వేసి విజ్రుమ్భించి గోల చేసి నాశనం చేసి ,అన్నిటినీ ముంచి తేల్చి జన జీవితాన్ని పీల్చిపిప్పి చేసింది హుధూధు.ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కన్నీటి నివాళి .ఆస్తినష్టం అయినవారికి సానుభూతి .గుండె ధైర్యం తో బతుకు పోరాటం లో గెలిచి నిలబడ్డ వారందరికీ అభినందనలు .ఇలాంటి ప్రళయం మళ్ళీ రారాదని కోరుకొందాం .ఆపన్న హస్తాలు అందిస్తున్న సకల జనులకు ,ప్రభుత్వాలకు సంస్తలకు తీర రక్షణ దళాలకు ఎన్ని కృతజ్ఞతలు చెబితే ఈ ఋణం తీరుతుంది?వారి సద్య స్పందనకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు .ఆంద్ర జాతి ?కో త్తకాపురం కూర్చుకొనే వేల తట్టా బుట్టా సమకూర్చుకొనే సమయం లో కుండా చట్టీకూర్చుకొనే లోపే ఈ జల ఖడ్గ ప్రహారమా?ప్రకృతీ !ఇక నైనా శాంతించు .మా తప్పులేమైనా ఉంటె మన్నించు ఇంతకోపం, ప్రతీకారేచ్చ లకు తట్టుకోగలడా మానవుడు?ఆలోచించు .బిడ్డల తప్పులుంటే సరిదిద్దు .ఇంతటి క్రూర శిక్ష ఇక వద్దు వద్దు వద్దు .

ఎన్నెన్నో హుదుదూ కధనాలు
సాధారణ భూగోళ ఉష్ణోగ్రత ఇరవై ,పాతిక డిగ్రీలు ఉండాల్సింది యాభై డిగ్రీలకు చేరినందు వల్ల వచ్చిన పెను ముప్పు అన్నది నాసా .’’పంచెకట్టాయన’’భార్య విజయమ్మ ను నెత్తికెత్తుకోక ఓడించిన దాని ఫలితమే అన్నాడొక ఉస్త్ర పక్షి .లేదు గురూ –ఇదంతా బాబు ఉదయం కాకుండా రాత్రి ముహూర్తం లో ప్రమాణ స్వీకారం చేసిన ఫలితం అన్నాడొక పరివ్రాజకుడు .అసలు అయిపోయి తీరం దాటి వెళ్ళిపోయి తోక ముడుస్తున్దనుకొన్న ధూధూద్ ‘’బూమేరాంగ్’’ లాగా వెనక్కి తిరిగొచ్చి పిచ్చకొట్టుడు కొట్టింది గాలీ వానాతో అన్నాడొక వాతావరణజ్నుడు .అసలు మా ‘’ఇటలీ యమ్మను’’ ,కొడుకు ‘’బుచ్చిని ‘’ కేంద్రం లో అధికారం లేకుండా ,రాష్ట్రం లో నామ రూపాలు లేకుండా చేస్తే ప్రక్రుతి సహిస్తుందా?పగ బట్టి మరీ ప్రతీకారం తీర్చుకోంది అన్నాడు ఖద్దరు లాల్చీ ఆయన .రాష్ట్రం లో యెర్ర ఖండువా లేకుండా చేసిన దానికి ప్త్రతిఫలమన్నాడొక యెర్ర చొక్కా మేధావి . ‘’ఓదారుస్తా ‘’నంటూ ‘’గాలిమరాయన ‘’ హావ భావాల తో వికృత చేష్టలతో మళ్ళీ జనం లోకి దూకుడు .మెగాలు సూపర్లు ,లెజెండ్ లు మాటల వాళ్ళే అయ్యారు కాని క్షేత్రస్తాయిలో కనిపించలేదు .జనం పెరుపెట్టుకొన్న జన సేన నాయకుడు మాత్రం రంగం లోకి దిగి ముందుకొచ్చాడు సుభాష్ గబ్బర్ .
http://www.youtube.com/watch?v=KRe8GMzrsd4
‘’అసలు తుఫాను కన్ను (ఐ) ఒంటికన్ను .అది శుక్రాచార్యుడికి సంకేతం .రాక్షస పగ .అందుకే అంత భీభత్సం కన్నుకు వెలుపల గోడ (ఐవాల్)లో క్యుములో నింబస్ మేఘాలు నిండి కుంభ వృష్టి కురిపించి అనర్ధాన్ని కల్గిస్తాయి .ఐవాల్ తర్వాత ఉండే ‘’రెయిన్ బాండ్స్ ‘’మూడు వందల మైళ్ళ దాక వ్యాపించి గంటకు రెండు వందల కిలో మీటర్ల వేగం తో గాలులు వీస్తూ ,మేఘాలతో అల్లుకొని ఉండటం తో కుండపోత వర్షం పడుతుంది .తుఫాన్ కన్ను తీరం చేరగానే ఆ భాగం ప్రశాంతం గా ఉండి కాసేపు స్మశాన నిశ్శబ్దం ఏర్పడి ,వెంటనే ఐవాల్ తరుముకొచ్చి భీభత్సం సృష్టిస్తుంది .ఇదీ దాటి ,రెయిన్ బాండ్స్ కూడా దాటిపోతే తుఫాను బలహీనమై సమసి పోతుంది ‘’అని హుదూద్ సృష్టించిన విలయాన్ని తీరికగా తెలిపారు వాతావరణ శాస్త్ర వేత్తలూ మీడియా మనీషులు .అంటా అయిన తర్వాత .ఇది నాలుగవ కేటగిరీ తుఫాన్ అన్నారు తీరిగ్గా ఇప్పుడు .’’
రైలు బోగీలే తల దాచుకొనే రక్షణ భూములయ్యాయి చాలా మందికి .ముందు జాగ్రత్తగా రైలు విమాన బస్ సర్వీసుల్ని రద్దు చేయటం తో పెను విలయం ,ప్రాణ నష్టం తప్పింది. .దీనికి ప్రభుత్వాన్ని మెచ్చాలి విమాన స్థలం పంటలు రాడార్ కేంద్రం ,ఇల్లు ,అపార్ట్ మెంటులూ నష్టాన్ని అనుభవించాయి .అపార్ట్ మెంట్లు తాతాకుల్లా ఊగిపోయాయి అంటే యెంత ఉపద్రవం వచ్చి మీద పడిందో అర్ధమవుతోంది .ప్రతిక్షణం ‘’మానిటర్’’ చేస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ సహాయ కార్యక్రమాలకు సూచన లిస్తూ ,పర్య వేక్షిస్తూ యంత్రాంగాన్ని నడిపించటం లో బాబు చూపిన తీరు బహుదా ప్రశంసనీయం .అందుకే ఆయన్ను ఏరి కోరి పదేళ్ళ తర్వాత ఆయన్ను ప్రజలు తమకు రక్షకుడు కావాలని ఎన్నుకొని పట్టం కట్టారు .దానికి ఋణం తీర్చుకొన్నాడు .ఇక్కడ కావలసింది సమన్వయము .దాన్ని సంపూర్తిగా సాధించాడు .రాత్రి ఒంటి గంటకే లేచి రోడ్డున పడే ముఖ్య మంత్రి ఎవరినైనా ఇంతవరకు మనం చూశామా?నీటి సరఫరా ఆహార సరఫరా ,విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మార్పిడి విద్యుత్ స్తంభాలను నెలకొల్పటం కమ్యూనికేషన్లు సప్లైలను వేగవంతం గా రప్పించటం పంపిణీ పబాబు ప్రాధమిక వైద్యం ,ముసలీ ముతకాకు ఆసరా ,ఇన్ని పనులు సమన్వయము తో సమయ స్పూర్తితో ,కునుకు లేకుండా ,అలసట ఎరుగకుండా చేయటం చంద్ర బాబుకే సాధ్యం .ఉక్కు మనిషి వజ్ర సంకల్పుడు ,ఏది ముందు ఏది వెనకా చేయాలో విజన్ ఉన్నవాడు .ఈ విపత్ సమయం లో నిజం గా ఆపద్బాన్ధవుడే అయ్యాడు బాబు .విశాఖ నుంచే పరిపాలన చేస్తూ మార్గ దర్శి గా ,మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా ,అనితర సాధ్యమైన కృషికి మారుపేరుగా నిలిచి అందరి చేతా మెప్పు పొందుతున్నాడు . బాబు చేతిలోనే నవ్యాన్ధ్రకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది .ఈ ఒడి దుడుకులు అధిగమించి జయ సంకేతం చూపించి భావి తరాలకు ఆదర్శం గా భవ్య దివ్య శుభ్ర ,స్వచ్చ ఆంద్ర ప్రదేశ్ నిర్మాణమవుతుందని భావిద్దాం .శుభం భూయాత్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-14-ఉయ్యూరు ,
http://telugusala.blogspot.in/2014/10/blog-post_15.html
హుధుద్ కి ధన్యవాదాలు..!
విశాఖ అణువణువూ శోధించింది..
మా ఊరు కొట్టుకుపోయింది కానీ మాలోని ఉత్సాహాన్ని కాదు..
విశాఖపట్నం నుంచి తుఫాను తెచ్చిన శోకాన్ని తరిమికొట్టడానికి..
వైజాగ్ ని పట్టిపీడిస్తున్న కష్టాలను గజగజలాడించడానికి..
మా నమ్మకం..
మా ధైర్యం..
మా బలం.. ముందు
హుధుద్ ఎంతో చిన్న..
చాలా చాలా చిన్న..
ఎంతో చిన్న.. ఎంతో ఎంతో ఎంతో చిన్న….

