| ఆకాశవాణి, ఆ నలుగురూ… |
|
నిన్నగాక మొన్న రావూరి భరద్వాజ, అటు మొన్న కె.చిరంజీవి , నిన్న పైడి తెరేష్ బాబు, నేడు తురగా జానకీరాణి…. ఇలా ఒకరికొకరుగా రాలిన ఆకాశవాణి తారలు. వీరందరిలో సానురూప్యత ఉంది . ఎవరి పంథాలో వారు ధిక్కార స్వరాలు. ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో వారిస్థాయిలో వారు నినదించిన కంఠాలు-కలాలు. రావూరి జ్ఞానపీఠపురస్కారమందుకున్నారు. జీవితమంతాకష్టాలకొలిమిలో కొనసాగిన నేపథ్యం . ఆ నేపథ్యమే వారిని జనం మనిషిగా మార్చింది. ఇక కె.చిరంజీవి రేడియో నాటక ప్రయోక్తగా, రచయితగా, మనసున్న మనిషిగా సమాజానికి తనదైన బాణీలో సేవలందించారు. నాటకరంగంలో ఎందరో ఆయనకు ప్రత్యక్ష పరోక్ష శిష్య గణం. తెరేష్ బాబు ‘దళితవాదం’తో హిందూ మహాసముద్రంలో అల్పపీడనం సృష్టించిన వాడు . తురగా జానకీరాణి ‘రేడియో అక్కయ్య’ గా ఆకాశవాణి ద్వారా అందరికీ సుపరిచితురాలు. అయితే సీ్త్రవాద రచయిత్రిగా, రాసిన దానిని ఆచరించిన వ్యక్తిగా సమాజశ్రేయస్సులో తాను ఎంచుకున్న బాటలో నడిచిన వ్యక్తి.
ఈ నలుగురూ …ఆకాశవాణి పొత్తిళ్ళ సాక్షిగా ఎదిగినవారు. ఆకాశవాణి తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించిన వారు . తెలుగు సాహిత్యంలో దళితవాదం , సీ్త్రవాదాలకు పైడి తెరేష్ బాబు , జానకీరాణీలు ప్రతీకగా నిలిచారు. చిరంజీవి సామ్యవాద రచయితగా జనం మనిషిగా ఎదురొడ్డారు. ఇక భరద్వాజ గురించి అందరికీ తెలిసిందే . పాకుడురాళ్ళతో ఆకాశవాణికి అందనంత ఎత్తుకు ఎదిగారు. సమాజంలో వస్తున్న మార్పులకు దీటుగా ‘ఆకాశవాణి’ ధ్వని నిరంతరం విన్పిస్తూనే ఉంటుందనడానికి 2014లో రాలిన ఈ నలుగురు ‘తారల’ చరిత్రే చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. సృజనశీలురకు , ప్రగతికాముకులకు, పురోగతిని వీక్షించే వారికి ‘ ఆకాశవాణి’ ఎప్పుడూ వెన్నంటే ఉంది . వారిని అల్లారు ముద్దుగా పెంచింది. వారి వారి భావాలకు బూజుపట్టకుండా గుండెలకు హత్తుకుంది . ప్రయోక్తల మనో భావాలకు , స్వేచ్ఛలకు బంధనాలు వేయలేదు . అందుకే అందరూ తారలయ్యారు. ఆకాశవాణి సాంస్కృతిక వారసత్వం నిలబ్టెటడంలో ధ్రువతారలయ్యారు. నియమనిబంధనలున్నా , ప్రభుత్వ విధానాలున్నా ‘ఆకాశవాణి’ఆకాశమే హద్దుగా తన ఒడిలో తన పిల్లలను ప్రగతి శీలురుగా తీర్చి దిద్దింది. ఒక సామాజిక దృక్పథాన్ని , తాత్విక చింతనను నేర్పింది. ఆకాశవాణి ప్రాంగణంలోని వృక్షాల సాక్షిగా అందరూ జ్ఞానోదయంపొందిన వారే . ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచే క్రమంలో వికసించిన వారే . అందుకు ఈ నలుగురూ అతీతులు కారు . మినహాయింపులేదు. పరిణామక్రమంలో ఆకాశవాణి అందించిన సేవలు అజరామమైనవి. . ఆసేవలు సమాజంలో విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని కోరుకుంటూ పరితపించిన ఈ నలుగురూధన్యజీవులు . వీరు ఎప్పటికీ చిరంజీవులే . ఆకాశవాణిని ప్రజల వాణిగా మార్చే ప్రస్థానంలో సేవలందించిన ‘నలుగురు’ ఆకాశవాణి ముద్దుబిడ్డలను స్మరించుకుంటూ.. – వలేటి గోపీచంద్ రాష్ట్ర కార్యదర్శి , ఆకాశవాణి, దూరదర్శన్‌ల కార్యక్రమాల సిబ్బంది సంఘం |
వీక్షకులు
- 1,107,445 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

