| నవ్వించిన కథకుడికి కన్నీటి వీడ్కోలు – ఎలికట్టె శంకర్‌రావు |
|
అందమైన కథకుడు ఎన్.కె. రామారావు తుది శ్వాస విడిచారు. హాస్యప్రియుడు శాశ్వత మౌనం దాల్చారు. ఆయన మిత్రులకు, కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చారు. ఎన్.కె. రామారావుగా ప్రాచుర్యం పొందిన నారపరాజు కోదండ రామారావు స్వగ్రామం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ సమీపంలోని కందిబండ. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఆరు మాసాల ముందు ఆయన జన్మించారు. హుజూర్ నగర్, తెనాలి, విజయవాడ, నల్లగొండలలో విద్యాభ్యాసం చేశారు. న్యాయశాఖలో ఉద్యోగం చేసి తొమ్మిది సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశారు. రామారావుకు సాహిత్యం, సంగీతమంటే మక్కువ. ఆయన మంచి పాఠకుడు. మంచి శ్రోత.
సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం నల్లగొండలో కొంతమంది రచయితలు కలసి యువ రచయితల సమితిని ఏర్పాటు చేశారు. మేరెడ్డి యాదగిరి రెడ్డి, బోయ జంగయ్యతో పాటు రామారావు కూడా ఈ సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. కాంచనపల్లి చిన వెంకటరామారావు ప్రోత్సాహంతో కథలు రాయటం ప్రారంభించారు. ముప్ఫయ్ ఐదు కథలు రాశారు. పన్నెండు కథలతో విద్యుల్లత కథా సంపుటిని అందించారు. ఆ తర్వాత నవ్య వీక్లీ అప్పటి సంపాదకుడు శ్రీరమణ ప్రోత్సాహంతో మరిన్ని కథలు రాశారు. మా మిలట్రీ బాబాయి పేరుతో ఈ కథా సంపుటిని అందించాలనుకున్నారు. కానీ మధ్యలోనే వెళ్ళిపోయి ఆయన అభిమానులకు నిరాశను మిగిల్చారు. రామారావు తెలుగు సాహితీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీశ్రీ, రావిశాసి్త్రలతో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. జిల్లా రచయితల సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో జరిగిన సభలకు శ్రీశ్రీని తీసుకురావడం ఆయన ఘనతే. రావిశాసి్త్ర నల్లగొండకు రావడానికి కూడా ఆయనే కారణం. ఎన్.కె. రామారావుకు పాత పాటల సేకరణకు ఎంతో ఆసక్తి చూపించేవారు. ఆయనకు వింటేజ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తెలుగు హిందీ సినీ ప్రముఖుల మీద వ్యాసాలు కూడా రాశారు. అవన్నీ హాసం పత్రికలో అచ్చయ్యాయి. పెద్దలతోనూ ఆయన స్నేహాలు అద్భుతమైనవి. బాపు, రమణ, శ్రీరమణలకు ఆయన వీరాభిమాని. విఎకె రంగారావు మనసునూ ఆయన దోచుకున్నారు. బహుభాషావేత్త నోముల సత్యనారాయణ అన్నా ఆయనకు ప్రత్యేక గౌరవం. నల్లగొండలో ఆయన ఎక్కువగా సమయం వెచ్చించింది నోములతోనే. రామారావు మంచి చతురుడు. సాహితీ ప్రియులు ఆయన సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. రామారావు రూపంలోనే కాదు కథల్లో కూడా శిల్పం అంటే ఇష్టపడతారు. అలాంటి కథలనే రాసినారు. ఆయన కథలు గంభీరమైన విషయాలనూ చెప్పినాయి. గిలిగింతలు పెట్టే హాస్యాన్ని పంచినాయి. ఎన్.కె. రామారావు వెళ్ళిపోవడంతో తెలుగు కథ చిన్నబోయింది. సాహితీ మిత్రుల్లో విషాదం అలుముకుంది.
– ఎలికట్టె శంకర్‌రావు
|
వీక్షకులు
- 1,107,452 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

