గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43
43- మహా రాజ కవి –భోజుడు
భోజరాజు వేదాంతి ,బహుశాత్రవేత్త .మధ్య భారతం లో మాల్వా సంస్థాన రాజు .పారమార్ వంశానికి చెందిన వాడు .1055వరకు రాజ్యపాలన చేశాడు .’’రాజా భోజా ఆఫ్ దార్ ‘’అని ఆప్యాయం గా పిలుస్తారు .భోజ అంటే సంపూర్ణమైన సర్వ సంపన్నమై సరళమైన వాడని అర్ధం .మహాభారత యుద్ధం లో భోజ వంశీయ రాజులు పాల్గొన్నారు .భోజుడు అనేక దేవాలయాలు నిర్మించాడు అందులో ముఖ్యమైనది భోపాల్ లో కట్టించిన ‘’భోజేశ్వర దేవాలయం ‘’.భోజేశ్వర పట్టణం ను భోపాల కు ముప్ఫై కిలో మీటర్ల దూరం లోబెట్వా నదీ తీరం లో నిర్మించాడు .భోజ శాల నిర్మించి అందులో అతిపురాతన తాళ పత్రా గ్రంధాలను సేకరించి ఉంచాడు .ఇది గొప్ప విద్యాకేంద్రం గా విలసిల్లింది. ఈనాటి దార్ లో భోజుడు నిర్మించిన సరస్వతీ దేవాలయం ఉన్నది .
భోజ రాజీయం
భోజుడు ఘూర్జర రాజ వంశానికి చెందిన వాడు .వేదాంతం కవిత్వం జంతుశాస్త్రం ,యోగ శాస్త్రం భాషా శాస్త్రం యోగ శాస్త్రం ధనుర్ శాస్త్రాలలో గొప్ప గ్రంధాలు రచించాడు .భోజుడికాలం లో మధ్య భారతం సువర్ణ యుగం గా పేరుపొందింది గుజరాత్ రాజు సోలంకి తో కలిసి సోమనాదాలయాన్ని నిర్మించాడు .1026-1042కాలం లో ఈ బృహత్ నిర్మాణం జరిగింది .భోజపురం నిర్మించాడు ఈనాటి భోపాల్ కూడా ఆయన కట్టించినదే .భోజ పట్నం లో ధనపాలుడు అనే జైన పరివ్రాజకుడు ఉండేవాడు .ఈయన బోధనలతో యజ్న యాగాదులలో పశు హింసను ఆపెయించాడు .అంతేకాదు భోజుడు వేటా డటానికీ ఫుల్ స్టాప్ పెట్టాడు .సైనిక బలాన్ని బాగా వృద్ధి చేసుకొని చాళక్య రాజుఅపై దండ యాత్ర చేసి ఓడించి రాజ్య వ్యాప్తి చేశాడు .సుల్తాన్ మహమ్మద్గజనీ తో సౌరాస్త్రలోని సోమనాధ దేవాలయం వద్ద భీకర పోరాటాలు చేశాడు .భోజ సైన్య ప్రతాపానికి గజని పలాయనం చిత్త గించాడు .శాకంబరి రాజు చః మానస్ ను ఓడించాడు .తర్వాత చండేలా రాజులు రాష్ట్రకూటులు మొదలైన వారంతా కలిసి భోజునిపై దండెత్తారు .సోలంకి రాజు భీమదేవుడి రాజ్యాన్ని ఆక్రమించాడు భోజుడు .భీముడు హయహయులతో చేతులుకలిపి భోజుని ఎదిరించాడు .హయహాయ రాజు కర్నాను సోలన్కిని ధైర్యం గా ఎదుర్కొని భోజుడు పోరాడాడు కాని ఒక బాణం వచ్చి తగిలి భోజుడు వీరమరణం పొందాడు .ఘజనీ ముఠాను సోమనాధ దేవాల సమీపానికి రానీకుండా తీవ్రం గ అడ్డుపడ్డాడు భోజమహా రాజు .భోజునిపై ఒక చాటువు ప్రచారం లో ఉంది –
‘’అద్య ధారా సదా ధారా సదాలంబ సరస్వతీ –పండితాః మండి తాః సర్వే భోజ భువనం గథెహ్ ‘’దీని అర్ధం ‘’ఇవాళ ధారా రాజ్యం ఎల్లప్పుడూ అండగా ఉంది సరస్వతీదేవి భూమిమీద కవులందరినీ సత్కరించే భోజునికోసం ఎదురు చూస్తోంది .
భోజుడు ఓడిపోయిన తర్వాత కవులు –
‘’అద్య ధారా నిరాధారా నిరాలంబ సరస్వతీ –పండితాః ఖండితాః భోజ రాజే దివం గతే ‘’దీనిభావం –‘’ఈ నాడు ధారా రాజ్యానికి రక్షకులే లేరు .సరస్వతీదేవికే సంరక్షణ లేదు .పండితులందరూ భోజుడు దివికి చేరగానే ఎక్కడివారు అక్కడే పారిపోయారు .భోజుడు మొత్తం 84 గ్రంధాలు రచించాడు .పరిపూర్ణమైన కవిత్వ గ్రంధాలు రాశాడు .భోజునిది గొప్ప కవిత్వం గా పేరు తెచ్చుకొన్నది .పతంజలి యోగ శాస్త్రానికి భాష్యం రాశాడు .సివిల్ ఇంజినీరింగ్ గురించి సమరాంగణ సూత్రధార రాశాడు .ఇందులో దేవాలయ ,నిర్మాణం కోటల నిర్మాణం ,విగ్రహ నిర్మాణం ఇళ్ళ నిర్మాణం మొదలైన సమస్త విషయాలున్నాయి .తత్వ ప్రకాశ అనే తాంత్రిక గ్తంధం ,రస రాజ మ్రుగాంకం అనే లోహశాస్త్ర గ్రంధం ,యుక్తి కల్ప తరు అనే నౌకానిర్మాణ శాస్త్రం ,న్యాయ శాస్త్రం పై ధర్మ శాస్త్ర వ్రుత్తి ,చంపూ రామాయణం మొదలైనవి భోజ రచనలు .అన్నీ సుప్రసిద్ధాలే బహు శాస్త్ర కోవిదుడు అయి నందు వల్లనే ఇలాంటి గ్రంధాలూ రాయగలిగాడు .
కవిపండిత పోషకుడై సాహిత్య ప్రేమికుడై నిరతాన్న దాత అయి ఆశ్రయించిన వారి కొంగుగుబంగారమై వర్ధిల్లిన రాజు భోజుడు .మన కృష్ణ దేవరాయల ఆస్థానం లో కవి పండితులున్నట్లే భోజాస్థానం లోను కాళిదాసాది కవులుండేవారు రాయలూ కవే . భోజుడూకవే .అందుకే రాయలను ఆంధ్రభోజుడు అన్నారు .భోజుని చంపూ రామాయణం వాల్మీకమే .దానిపై తన భక్తిని చాటుకొంటూ భోజుడు –‘’వాల్మీకి గీత రఘుపున్గవ కీర్తి లేశైః-తృప్తిం కరోమి కధమప్యాదునా బుదానాం ‘’-గంగా జలైర్భువిని భాగీరధ యత్న లబ్ధైహ్ –కిం తర్పణం నవిదధాతి నరః పిత్రూనాం’’అన్నాడు అంటే భగీరధుడు తన పితృదేవతలకు గంగాజలం తో తర్పణ లిచ్చి తరింప జేసినట్లు వాల్మీకి మహర్షి రాసిన రామ చరిత్రనే ఆధారం గా సజ్జనులకు తృప్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాను .’’
భోజునికవిత్వం రస రమ్యమైనది .వర్ణనలను అద్భుతం గా చేశాడు రుతువర్ణనలు గొప్పగా ఉంటాయి అనుప్రాస యమకాలన్కారాలను బాగా ఉపయోగించుకొన్నాడు .ఆపాత మధురమైన కవిత్వం తో విందు చేస్తాడు .గద్యమూ హృదయం గా రాశాడు. లలితం గా కర్ణ పేయం గా కవిత్వం ఉంటుంది .అలాంటి శబ్దాలనే ఎన్నుకొంటాడు .వైదర్భీశైలికే ఎక్కువ విలువ నిచ్చాడు శ్లేషనూ సమాదరించాడు .అంత్య ప్రాసలతో అలరిస్తాడు –
‘’ఏనాం పురాణ నగరీం నగరీతి సాలాం-సాలాభి రామ భుజ నిర్జిత యక్ష రాజః –హేలాభి భూత జగతాం రజనీ చరా –ణాంరాజా చిరాదయితి రావణ నామ దేయః ‘’.వాలి వధ తర్వాత తార విలాపం లో శోకాన్ని బాగా ప్రదర్శింప జేశాడు –
‘’నాహం సుకేతు తనయా నచ సప్త పాళీ –వాలీ నచ త్రిభువన ప్రదిత ప్రభావః
తారాస్మి వజ్ర హృదయా విశిఖర భేద్యా –ధన్వీ కదం భవసి రాఘవ మామ విధ్వా’’రాముడితో తార అన్నమాటలివి –రామా నేను తాటకను కాను సప్త తాళ వ్రుక్షాలనూ అంతకంటే కాను .త్రిభువన పరాక్రమ శీలి వాలినీ కాను .వజ్ర హృదయం ఉన్న తారను .నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు. నన్ను చంపే వరకు ధన్వి అనే పేరు నీకు సార్ధకం కాదు ‘’
రామాయణ చంపువు ను ‘’భోజ చంపు అంటారు’’. చంపు అంటే పద్యం వచనం కలిసిఉన్న కావ్యం అని తెలిసిందేకదా .ఆంద్ర దేశం లో పూర్వం గురుకుల విద్యలో రామాయణ చంపుతోనే విద్యార్ధి మొదలు పెట్టేవాడట .అంతటి ప్రశస్తి భోజుని చంపువుకున్నది ద్రావిడ కర్నాటకాలలో కూడా దీనికి వ్యాప్తి, ఆసక్తి ఎక్కువ .దేనీ నారాయణ ,రామ చంద్ర కామెశ్వర ఘనశ్యామ లు రాసిన టీకాలు ఉన్నాయి .
మరోకవితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-14-ఉయ్యూరు

