ఆశ్వయుజ కార్తీకమాసాలు శరదృతువు శోభను, పర్వదిన ప్రాశస్త్యాలను – ఆధ్యాత్మిక శోభలను సంతరించుకొని ఉంటాయి. శరదృతువు ఈ విశ్వమంతటినీ గిలిగింతలు పెడుతూ వుంటుంది.
పతనాలనుంచి కాపాడే శశాంక శేఖరుడు పరమ శివుడు. పోషక శక్తి ప్రదాత- అధిష్ఠాత, సమస్త ప్రాణులను సంరక్షించి జీవికను యిచ్చే విష్ణుమూర్తికి అత్యత ప్రీతికర మాసము కార్తీకమాసం. ఈ పవిత్ర మాసం స్నానమునకు- దీపమునకు- దానాలకు ప్రసిద్ధియైనది. ఆహ్లాదకరమైన ఈ శరదృతువులో చంద్రుడు పుష్టి కలిగి తన చల్లని కిరణముల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని అందిస్తాడు. ఈ మాసంలో శివుని మారేడు దళాలతో- జిల్లేడు పూలతోనూ, శ్రీ మహావిష్ణువును తులసీ జాజి పూవులతోను పూజించాలని శాస్త్రం చెబుతున్నది.
పరమేశ్వరుడైన శివునికి సోమవారం చాలా యిష్టం గనుక ఆ రోజున ఉపవసించడం ఎంతో మేలు. కార్తికంలో వనభోజనాలకు ప్రశస్తం గావున పలు రకాల వృక్షములున్న ప్రాంతంలో ఉసిరికచెట్టును పూజించి దాని క్రింద కూర్చుని పనస ఆకుల విస్తర్లలో భోజనం చేయాలని పురాణాలు తెలిపాయి. కార్త్తిక శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలి. ఈ మాసంలో ఏ సత్కార్యం చేసినా ‘కార్తిక దామోదర ప్రీత్యర్థం’ అని ఆచరించాలి.
ఋతుప్రభావంవలన- పరివర్తనాల వలన వాతావరణంలోని మార్పులను దృష్టిలో వుంచుకొని శారీరక- మానసిక – ఆధ్యాత్మిక ఆరోగ్యాలకూ వాటికీ వున్న సంబంధమును వైజ్ఞానిక దృష్టితో అర్థం చేసుకోవాలి. ఈ నెలలో నదులూ చెరువులు- బావుల నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారంవలన తేజస్సునూ, బలాన్ని సంతరించుకొని వుంటుంది. కావున ఇండ్లలో స్నానాలు చేయవద్దన్నారు. దేవుని ఆరాధనకు కావలసిన పుష్ప సమృద్ధిని ప్రకృతి ప్రసాదిస్తుంది. ఈ మాసం సాధనకు అనుకూలమైనది.
శరదృతువులోని పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అంటారు. ఈ జలస్నానం మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పైత్య ప్రకోపాలను తగ్గించే స్నానం యిది. అమృతతుల్యం. మానవాళికి ఉపయుక్తమైనది. నదీ ప్రవాహంలో ఓషధుల సారం ఉంటుందని కృష్ణయజుర్వేదంలో ఒక మంత్రం తెలుపుతుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడంవలన ఈ హంసోదకం స్నానపానాదులకు అమృత తుల్యమని మహర్షి చరకుడు తెలిపినాడు. నదులు ప్రవహించే వేళ ఆ నీటిలో తెలియకుండా విద్యుత్ శక్తి ఉంది. శరీరానికి శక్తినిస్తుంది. మూడు దోసిళ్ల నీరు తీసికొని తీరానికి చల్లి, తరవాత బట్టల పిండుకోవాలి. దీనినే ‘యక్షతర్పణం’ అంటారు. పొడి వస్త్రాలు ధరించి సంధ్యావందనం చేయాలి.
ఈ తులామాసంలో గోష్పాదమంత జల ప్రదేశంలో అనంత శయనుడైన విష్ణువు నివసించి ఉంటాడని ధర్మశాస్త్రాలు చెబుతుంది. కార్తీక శుద్ధ విదియను యమద్వీతీయ అంటారు. లేదా భగినీ హస్త భోజనం అనగా ఈ రోజున సోదరి చేతి వంట తినాలి. యముడు విదియనాడు తన సోదరి యమున ఇంటిలో ఆమె వండి వడ్డించగా భోజనం చేశాడుగాన దీనికి ‘యమ ద్వితీయ’ అని పేరు. భోజనం పిదప సోదరికి వస్త్రాలంకారాలు సమర్పించాలి. నాల్గవ రోజు శుద్ధ చవితి నాగుల చవితి పర్వదినం. ఈ రోజున స్ర్తిలు పుట్టలలో పాలు పోసి చలిమిడి- వడపప్పు- నువ్వులతో చేసిన తీపి వుండలు- నైవేద్యాలుగా సమర్పిస్తారు. శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. కృతయుగంలో దేవదానవులు క్షీర సాగర మథనం చేసిన రోజు. మరొకటి కార్తీక పౌర్ణమి. ఈ వేళ ఉసిరికాయలమీద వత్తులుంచి దీపాలు పెడతారు. నదుల్లో వదులుతారు. పండితులకు దీపదానం చేస్తారు.
ఈ మాస నియమాలు:ఈ నెల రోజులు ఇంగువ-ఉల్లి-వెల్లుల్లి- ముల్లంగి- గుమ్మడి- శెనగ- పెసర- అల్చందలు- నువ్వులు నిషిద్ధం. మాంసాహారం నిషిద్ధం. కంచు పాత్రలో భోజనం చేయరాదు. ఆదివారం కొబ్బరికాయ, ఉసిరికాయ తినరాదు.
నాగుల చవితి
సుబ్రహ్మణ్య షష్ఠి, స్కందపంచమి, కుమారషష్ఠి లానే కార్తిక చతుర్ది కూడా నాగులకు విశేషమైందే. శ్రావణ పంచమి నాడు నాగుల పుట్టలో పాలు పోసి పూజించినట్లే కార్తిక చవితినాడు పుట్టలో పాలు పోయటం, నాగులను పూజించటం చేస్తారు. ఈ నాగుల చవితినాడు పొద్దునే్న చన్నీటిస్నానం ఆచరించి ఇంట్లో నాగపడిగకు కాని నాగ ప్రతిమకుకాని పూజ చేస్తారు. ఆ తరువాత చల్లని పానకాన్ని, వడపప్పు, చలిమిడి, పాలు, కొబ్బరికాయ లాంటి వాటిని తీసుకెళ్లి పుట్టకు సమర్పిస్తారు. పుట్టకు దారం చుట్టటం కూడా కొందరు చేస్తుంటారు. పుట్టకు కొంతమంది కోడిగుడ్లు కూడా సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల సంతానాభివృద్ధి జరుగుతుందని వారి నమ్మకం. నాగపుట్ట చుట్టూ నూకను చల్లుతూ ‘నాగరాజా నీవు నూక తీసుకొని మాకు మూకను ఇవ్వు’ అని ప్రార్థిస్తారు. మేము తెలియక చేసిన అపరాధాలను మన్నించమనీ ప్రార్థిస్తారు. ‘పడగ తొక్కతే పసివాడనుకో, నడుము తొక్కితే నీవాడనుకో, తోక తొక్కితే తొలిగిపో’ అని నాగులకు వేడుకొంటారు. నాగపూజ వలన నేత్ర, ఉదర, కర్ణ సంబంధ వ్యాధులనుకూడా దూరం అవుతాయ.
నాగులను పూజించటం వల్ల వంశాభివృద్ధి, సౌభాగ్యసిద్ధి , సర్వాభీష్టాలు కలుగుతాయి. అసలు పిల్లలు పుట్టలేదని బాధడపడేవారు సైతం నాగ పూజ చేస్తేవారికి సంతానం కలుగుతుంది. శివపార్వతులు లోక కల్యాణంకోసం పుత్రార్థులై ఉన్నసమయంలో దేవతలు ఆటకం కలిగించినందుకు పార్వతి ఎంతో కోపగించుకొంది. ఆ సమయంలో బయల్వెడలిన శివతేజస్సును దేవతల కోరికపై అగ్ని ధరించాడు. అగ్ని వల్లకాక గంగకు శివరేతస్సును ఇవ్వగా గంగ కూడా భరించలేక రెల్లువనంలో శివరేతస్సును విడిచిపెట్టింది. అక్కడ శే్వతపర్వతం ఏర్పడింది. దాన్నుంచి శరవణం ప్రభవించింది. ఆ రెల్లు వనంలోని శివతేజస్సునుంచే బాలుడు ఉదయించాడు. ఆ బాలునికి కృత్తికలు పాలివ్వగా ఆరు ముఖాలనుంచి పాలు గ్రోలాడాబాలుడు. అందుకే కార్తికేయనామధారుడయ్యాడు. ఇతనికే సుబ్రహ్మణ్యుడన్న పేరు వచ్చింది. దేవమానవులను హింసించే రాక్షసాధముడైన తారకుణ్ణి సంహరించమని దేవతలు కోరగా దేవసైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్లి యుద్ధం చేసి తారకాసుర సంహారం చేశాడు. దేవతలు మెచ్చి దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం చేశారు. ఈ సుబ్రహ్మణుడి ప్రీత యర్థమే నాగుల చవితి పూజలు చేస్తుంటారు.
మనకు కనిపించే నాగులు ద్విజ్విహులుకావడానికి ఓ పురాణకథ ప్రచారంలో ఉంది. కశ్యపప్రజాపతికి కద్రువ వినతలు భార్యలు. తన సవతి అయన వినతతో కద్రువ ఓ సారి తాను చూచిన గుర్రపు తోక నల్లగా ఉందని పందెం కాసింది. వీరిద్దరిలో ఎవరి మాట తప్పు అయతే వారురెండవ వారికి దాసిగా ఉండాలని పందెం వేసుకొన్నారు. తాను నెగ్గాలనుకొన్న కద్రువ తన సంతానాన్ని వెళ్లి ఆ గుర్రపు తోకకు చుట్టుకొని ఉండి తనను గెలిపించమని కోరింది. తన కొడుకు వలన గెలిచిన కద్రువకు వినత దాసి అయంది. ఆ దాస్యత్వం పోగొట్టడానికి ఏం చేయాలని వినత కుమారుడైన గరుత్మంతుడు నాగులను కోరగా వారు ఇంద్రుని దగ్గర ఉన్న అమృతభాండాన్ని తెచ్చి ఇవ్వమనికోరారు. వారు చెప్పిన విధంగా – దేవతలతో యుద్ధం చేసి గెలిచి అమృత భాండాన్ని తీసుకొని రాబోతుండగా ఇంద్రుడు గరుత్మంతుని పట్టుదలా, నిజాయతీల మెచ్చుకుని నీవు ఈ అమృతభాండాన్ని నాగులకిచ్చి స్నానం చేసి శుచులై వచ్చి తీసుకోమని చెప్పమని చెప్పాడు. ఇంద్రుడు చెప్పినట్లుగానే గరుత్మంతుడు నాగులకు చెప్పి దర్భపైన అమృతభాండాన్ని పెట్టాడు గరుత్మంతుడు. నాగులు శుచులై వచ్చేలోపు ఇంద్రుడు అమృతభాండాన్ని తీసుకొని వెళ్లగా ఆ దర్భలను నాగులను నాకారట. దానితో దర్భలవల్ల నాలుక రెండుగా చీలినా అమృతభాండస్పర్శఉన్న దర్భల వల్ల వారికి అమృతత్వం వచ్చిందంటారు.
అనార్యుల నుంచి ఈ నాగారాధన ఉన్నట్లు చారిత్రికంగా తెలుస్తోంది. నాగ పత్రిమలు మొహంజదారో తవ్వకాల్లో బయల్పడ్డాయ. బౌద్ధ, జైనులు కూడా నాగులను ఆరాధిస్తారు. ఈజిప్టు, గ్రీక్, పర్షియా లాంటి దేశాల్లో అయితే సర్పాలను సస్యదేవతగా పూజించటం కనబడుత
—
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797

