| అన్నంపెట్టే చేతులు.. | |
రోజూ బడికి వెళ్లే పిల్లలకు ఒక పూట వండి పెట్టడానికే ఎన్నో అవస్థలు పడతాం. అదే ప్రతి రోజు మధ్యాహ్నం బడి గంట కొట్టగానే – ప్రతి పిల్లాడి ముందు వేడి వేడి భోజనం సిద్ధం చేయడమంటే మాటలు కాదు. ఒక రోజు వండిన వంటను మరుసటి రోజు వండకుండా పద్దెనిమిది రకాల మెనూలతో పన్నెండువేల మందికి తిండి పెడుతోంది బుద్ధవరపు ఛారిటబుల్ ట్రస్ట్..
తలు గ్రామానికో, మండలానికో మహా అయితే జిల్లా వ్యాప్తంగానో సేవలందించడం మనం చూస్తూ ఉంటాం. కాని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులోని శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ తమ సేవలకు ఎల్లలు హద్దుకావని నిరూపించింది. పశ్చిమ ఆఫ్రికాలో సేవలను విస్తృతం చేసింది. ఈ స్థాయికి ఎదిగిన ట్రస్టుకు ప్రాణం పోసిన వ్యక్తి బుధ్ధవరపు వెంకట్రావు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు శ్రీనివాస నాగేశ్వర కుమార్ ట్రస్ట్ సేవలను ముమ్మరం చేశారు. మొదట్లో వైద్యశిబిరాలు పెట్టేదీ ట్రస్టు. ఆ తర్వాత – ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి సారించింది. పాఠశాల ఆవరణలోనే వండి వడ్డించే క్రమంలో కట్టెల పొయ్యలతో విద్యార్థులు పడుతున్న అవస్ధలను గుర్తించింది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని ఇచ్చేందుకు సంకల్పించింది. దీనితో పొలమూరులోనే అత్యాధునిక పరికరాలతో ఒక వంటశాలను నిర్మించారు. దీంతో పరిశుభ్రమైన వాతావరణంలో తిండిని వండేందుకు వీలవుతోంది. ప్రస్తుతం అనపర్తి, బిక్కవోలు, రాయవరం మండలాలలోని 145 పాఠశాలల్లో సుమారు 12,500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. మండలాన్ని మూడు గ్రూపులుగా విభజించి పది ఆటోల ద్వారా సమయానికి ఆహారం సరఫరా చేయడం ట్రస్ట్ ప్రత్యేకత. ’’ ప్రభుత్వం ఒకో విద్యార్థికి సగటున ఐదు రూపాయల దాకా ఇస్తుంది. ఐదు రూపాయలతో భోజనం పెట్టడం దాదాపు అసాధ్యం. మిగిలిన వ్యయాన్ని మేమే భరిస్తున్నాం. ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచితే ఇంకా ఎక్కువ మందికి ఆహారం అందించవచ్చు.’’ అని ట్రస్ట్ ఛైర్మన్ బుద్ధవరపు వెంకట్రావు వెల్లడించారు. అయితే మధ్యాహ్న భోజన సరఫరాకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన మొత్తం ఇప్పటికీ ట్రస్టుకు ఇవ్వడం లేదు. అయినా సరే విద్యార్థుల కడుపులు మాడకూడదన్న ఉద్దేశ్యంతో పొయ్యి వెలిగిస్తూనే ఉన్నారు ట్రస్టు నిర్వాహకులు. మధ్యాహ్న భోజనానికి తమిళనాడులో అయితే మన దగ్గర కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారు. వంటగది, పాత్రలను సైతం ప్రభుత్వమే సిద్ధం చేస్తోంది. కేంద్రప్రభుత్వం కూడా పిల్లల భోజనాలకు నిధులు చెల్లిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంత చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో అంత చొరవ చూపకపోవటం వల్ల చాలా ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలుకావటం లేదు. పర్యావరణ పరిరక్షణకు.. ప్రతి నెల పౌర్ణమి రోజున రాజమండ్రిలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ట్రస్ట్ నిర్వహిస్తుంది. హారతికి మన సంప్రదాయంలో ఒక విశిష్టత ఉంది. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు. ఒక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కూడా. ఇప్పటి దాకా నాలుగేళ్లుగా ఈ హారతిని నిర్వహిస్తున్నాం. రెండు అధికమాసాలతో కలిపి వచ్చే నెల ఆరవ తేదీ వచ్చే కార్తిక పౌర్ణమికి 50 హారతులు పూర్తవుతాయి. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం..’’ అని ట్రస్టీ కుమార్ వెల్లడించారు. స్వచ్ఛ గోదావరి అనే నినాదంతో గోదావరి ప్రక్షాళన తమ ప్రధానోద్దేశమని వివరించారు. ’’ఒకప్పుడు గోదావరికి ఏడు పాయలు ఉండేవని చెబుతారు. వాటిలో ఇప్పటికే రెండు కనుమరుగైపోయాయి. మిగిలిన వాటిలో కొన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకొని మురుగు కాలవలుగా మారిపోయాయి. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్ తరాల వారికి ఇవి కూడా మిగలవు..’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్రికాలోను సేవలు.. దేశంలోనే కాకుండా పశ్చిమ ఆఫ్రికా దేశాలలో కూడా బుద్దవరపు చారిటబుల్ ట్రస్ట్ సేవలను విస్తరించింది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో ట్రస్ట్ ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం అక్కడ పేదలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవలందిస్తుంది. గినియాలో వాటర్ ప్లాంట్ నిర్మించి అక్కడి ప్రజలకు స్వచ్చమైన నీటిని సరఫరా చేస్తున్నారు. మన దేశం మాదిరిగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పధకం ఏర్పాటు చేసి చిన్నారుల ఆకలి తీరుస్తోంది సంస్థ. అక్కడి ప్రజలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణనిస్తూ వారి జీవనోపాధికి బంగారు బాటలు వేస్తోంది. (ట్రస్ట్ ఫోన్ నెంబర్- 9391984999) కర్రి శ్రీనివాసరెడ్డి, అనపర్తి |
వీక్షకులు
- 1,119,999 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,721)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
