‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు!

‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు!

నేటి నాగరిక యుగంలో మహిళలకు బయటే కాదు,
ఇళ్లలోనూ హింస తప్పని పరిస్థితి నెలకొంది. మాంగల్య బంధంతో ఒక్కటై, జీవితాంతం కష్టసుఖాల్లో భార్యకు అండగా ఉండాల్సిన భర్తలు ‘పెళ్లినాటి ప్రమాణాల’ను విస్మరించి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి), జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) సమచారం ప్రకారం మన దేశంలో భర్తల లైంగిక హింస కారణంగా నరకం చవి చూస్తున్న గృహిణుల సంఖ్య అధికంగానే ఉంది. అయితే, కుటుంబం పరువు ప్రతిష్టలు, సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎంతోమంది బాధిత మహిళలు లైంగిక హింసను వౌనంగా భరిస్తున్నారే తప్ప పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.

భార్య ఆమోదం లేకుండా లైంగిక చర్యకు భర్త పాల్పడితే అది ‘అత్యాచారం’ అవుతుందని గతంలో ఉన్నత న్యాయస్థానాలు సైతం వ్యాఖ్యానించాయి. దాంపత్య బంధంలో లైంగిక హింసను ఎదుర్కొంటున్న గృహిణుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, భర్తలపై ఒక్క శాతం మేరకే కేసులు నమోదైనట్లు, ఇతరులపై ఆరు శాతం కేసులు నమోదైనట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. 2005 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను, జాతీయ నేర గణాంకాల సంస్థ 2013లో ప్రకటించిన సమాచారాన్ని సామాజిక నిపుణులు విశే్లషించగా అనేక ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. భర్తల వల్ల లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సందర్భంగా 6,590 ఫిర్యాదులు వచ్చాయి. ఇతరుల లైంగిక హింసకు సంబంధించి 157 ఫిర్యాదులు అందాయి. భర్తలే అత్యాచారాలకు పాల్పడినట్లు 372 కేసులు, ఇతరులకు సంబంధించి 91 కేసులు గత ఏడాది నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ చెబుతోంది. భర్త వల్ల లైంగిక హింసకు సంబంధించి 0.6 శాతం, ఇతరులకు సంబంధించి 5.8 శాతం కేసులు నమోదైనట్లు అధ్యయనంలో తేలింది. అధ్యయనం సందర్భంగా నిపుణులు ప్రశ్నించిన ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఇద్దరు లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి లక్ష మంది మహిళల్లో కనీసం 157 మంది లైంగిక హింసను భర్త నుంచి లేదా ఇతరుల నుంచి ఎదుర్కొంటున్నారు. లైంగిక జీవితంలో గృహిణులు హింసను ఎదుర్కోవడం గత 12 ఏళ్ల కాలంలో అధికమైనట్లు అధ్యయనంలో విశే్లషించారు. భార్య మనోభావాలను ఖాతరు చేయకుండా బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడుతున్న భర్తల సంఖ్య నానాటికీ పెరగడంతో దాంపత్య బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. పురుషాధిక్య భావజాలమే ఇందుకు కారణమని సామాజిక శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. పరిచయస్తులు, బంధువుల నుంచి కూడా మహిళలకు లైంగిక హింస ఎదురవుతోంది. ఆర్థిక స్వేచ్ఛ, ఉన్నత చదువులు చదివిన మహిళలు సైతం భర్తల నుంచి లైంగిక దాడులను భరిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, పిల్లల భవిష్యత్ తదితర అంశాల కారణంగా బాధిత మహిళలు నోరు విప్పేందుకు జంకుతున్నారు.
వివాహానికి ముందు, పెళ్లి తర్వాత మహిళలపై అత్యాచారాల సంఖ్య పెచ్చుమీరడం ఆందోళనకర పరిణామమని సామాజిక శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ‘లైంగిక హింస’ అని చెప్పేందుకు జంకుతున్న కొందరు మహిళలు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని భరించలేక ‘్భర్త క్రూరత్వం’ అని ఫిర్యాదు చేస్తున్నారు. నేరాల నమోదుకు దేశంలో ఇప్పటికీ అధునాతన వ్యవస్థ, శాస్ర్తియ పద్ధతులు లేనందున లైంగిక హింసకు సంబంధించి వాస్తవ సమాచారం పూర్తి స్థాయిలో వెలుగు చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలు, పోలీసులు రాజీ చేస్తున్నందున లైంగిక హింసపై నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగానే ఉంటోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా హక్కుల సంస్థ ‘జాగోరి’ ఇటీవల నిర్వహించిన సర్వేలోనూ అనేక ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. భర్త లేదా ఇతరుల కారణంగా లైంగిక హింసను ఎదుర్కొంటున్న మహిళల్లో 0.8 శాతం మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారని ఆ సర్వేలో తేలింది.
జాతీయ నేర గణాంకాల సంస్థ, పోలీసు శాఖ వద్ద నమోదైన కేసుల వివరాలే తప్ప ఇతర సమాచారం ఉండదు. లైంగిక హింసపై వాస్తవ సమాచారాన్ని రాబట్టాలంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మరింత విస్తృతంగా జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. కేసులు పెట్టేందుకు ముందుకురాని బాధిత మహిళల నుంచి వాస్తవ సమాచారం రాబట్టాలంటే అది ఆరోగ్య సర్వే సిబ్బంది వల్లే సాధ్యపడుతుంది. గృహహింస, లైంగిక హింస, మానసిక హింస, భౌతిక దాడులకు ఉన్న తేడాను అన్ని వర్గాల మహిళలకు వివరించ గలిగి, వారిలో మనోధైర్యాన్ని నింపగలిగితే వాస్తవ సమాచారం బహిర్గతమయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు అనుగుణంగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ‘ప్రశ్నావళి’ని సమూలంగా మార్చాలని మహిళా హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. భౌతిక దాడికి, లైంగిక హింసకు తేడా ఉన్న సంగతి తెలిసినప్పటికీ ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకురావడం లేదు. దాంపత్యంలో లైంగిక హింస గురించి సన్నిహితులతో చెప్పుకునేందుకు సైతం గృహిణులు సహజంగా ఇష్టపడరు. ఈ కారణంగానే వారు భర్తపైన లేదా ఇతర పురుషులపైన కేసులు పెట్టేందుకు సుముఖత చూపడం లేదు. లైంగిక విషయాల్లో ఘర్షణ పడే దంపతులకు ‘కౌనె్సలింగ్ కేంద్రాల’ను ఏర్పాటు చేస్తే పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉందని సామాజిక శాస్తవ్రేత్తలు సూచిస్తున్నాయి. లింగ నిష్పత్తి, అక్షరాస్యత ఆశాజనకంగా ఉన్న కేరళ, తమిళనాడు, కర్నాటక, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భర్తల లైంగిక హింసపై ఫిర్యాదు చేసే మహిళల సంఖ్య తక్కువగానే ఉంటోంది. లైంగిక విషయాల్లో కౌనె్సలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ స్పందించడం లేదు. విడాకులకు దరఖాస్తు చేసుకునే దంపతులకు న్యాయశాఖ పరిధిలో ‘కౌనె్సలింగ్’ ఇచ్చినట్లే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘లైంగిక విజ్ఞాన కేంద్రాల’ను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్న

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.