కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’?

కరోనా –ఆర్ధిక౦ గా ‘’క్యా కరోనా’’?
చైనా ఊహాన్ సిటి లో కిందటి డిసెంబర్ లో బయల్దేరిన కరోనా వైరస్ నాన్ స్టాప్ గా 110ప్రపంచ దేశాలను చుట్టేసింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది .దీని విస్తృత వ్యాప్తి వలన ప్రపంచఆర్ధిక పరిస్థితి ,మార్కెట్ వాణిజ్యం పై విపరీత మైన ఫలితాలు చూపి ,మనుషులను’’ శవాలు’’గా మార్చటమేకాక’’ పెను సవాలు’’గా మారింది .ముందు చూపుగా ఆర్ధిక సంస్థలు, బ్యాంకులు విశ్వవిపణి ని దృష్టిలో పెట్టుకొని కోతలు విధించాయి .దీనివలన ఆర్ధిక సహకార సంస్థలు ,అభి వృద్ధి సంస్థలు వెనకడుగు వేశాయి .అదే సమయం లో కరోనా వైరస్ వలన గ్లోబల్ ఎకానమీ పై ప్రభావం కలిగించి ,ప్రపంచవ్యాప్త మార్కెట్లు కుదేలైపోయాయి .స్టాక్ ధరలు ,బాండ్ ల ధరలు కుంచించుకు పోయాయి .కరోనా వైరస్ వలన ఎంతమంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు అనేదానికన్నా ,నివారణ చర్యలు చేబట్టటానికి ఆర్ధిక పరిపుష్టి పూర్తిగా దెబ్బతిని పోయినందుకు ఎక్కువ బాధపడాల్సి వస్తోంది .ఇదే పెద్ద నష్టం గా కనిపిస్తోంది .గ్లోబల్ రిసేర్చ్ లో ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ కు చెందిన ‘’బెన్ మేయో ‘’దీనిపై స్పందిస్తూ ‘’చైనా చేసినట్లు అన్ని దేశాలు లాకౌట్ ఇష్టం వచ్చినట్లు దామాషా ప్రకారం కాక ప్రకటిస్తే ప్రపంచ ఆర్ధిక స్థితి బలహీనమై ,విపరీతమైన భయం కలిగిస్తుంది. అంటే’’ పానిక్’’ గా మారుతుంది ,గ్లోబల్ ఎకానమీ పెరుగుదల 2020లో2.9గా ఉండాల్సింది ,2.4కు పడిపోతుంది ,ఉత్పత్తి రంగం దెబ్బతిని ఉత్పత్తి తగ్గుదల అవుతుంది .చైనా ఈ ప్రభావాన్ని పొందటం వల దానిప్రభావం ఇతరదేశాలపైనా పడింది .ఆసియా ఫసిఫిక్ ఎకనామీ లైన వియత్నాం సింగపూర్ దక్షిణ కొరియాలు దెబ్బతినిపోయాయి .
సేవా సెక్టార్లు విపరీతంగా దెబ్బతిని, బలహీనపడ్డాయి.ప్రపంచ మార్కెట్ లో అతిపెద్దదైన,విస్తృతమైన వినియోగదారు మార్కెట్ -కన్సూమర్ మార్కెట్ ఫిబ్రవరిలోనే కుంచించుకు పోయింది .గ్లోబల్ ఎకానమీ అనిశ్చితం లో ఉండటం లో ప్రపంచ వ్యాప్త ఆర్డర్లు లేకపోవటం కూడా ముఖ్యకారణం .దీనివలన విశ్వవ్యాప్త ఆయిల్ డిమాండ్ బాగా తగ్గిపోయి,ఆయిల్ ధరలు బాగా తగ్గిపోయాయి .ప్రొడక్షన్ కట్ కు ఒపెక్కూ దాని అనుబంధ సంస్థలకు ఒప్పందం పై భేదాభిప్రాయం ,జగడం రావటం తో ఇటీవల మళ్ళీ ఆయిల్ ధరలు ఇంకా తగ్గిపోయాయి .కాని భారత్ సహా ప్రభుత్వాలు వినియోగదారులకు మాత్రం ఊరట కలిగించకపోవటం శోచనీయం .’’కరోనా వైరస్ ఎపిక్ సెంటర్ ఐన చైనా ‘’క్రూడాయిల్ ను అత్యధికంగా దిగుమతి చేసుకొనే దేశం .ఇటలీ ,ఇతర యూరోపియన్ దేశాలు కరోనా వైరస్ భయంతో ఆయిల్ డిమాండ్ ను తప్పని సరిగా తగ్గించుకోవాల్సి వచ్చింది .
కోవిద్-19 వ్యాప్తి భయం వలన ఇన్వెస్టర్లు వెనకడుగు వేయటంతో ,ఆర్ధికరంగం కుదేలై స్టాక్ ధరలు తగ్గిపోయాయి .మార్కెట్ సెంటిమెంట్ ను కరోనా వైరస్ ఉత్పత్తి స్టాక్ మార్కెట్ ,లతోపాటు ఆర్దికమార్కేట్ లపై ఒత్తిడి- స్ట్రెస్ కూడా పెంచి ప్రభావితం చేస్తుంది .బాండ్ ల విలువ బాగా తగ్గిపోతుంది .అమెరికా ట్రెజరికి ఆ దేశ ప్రభుత్వమే వెన్నెముక .కాని అనిశ్చిత మార్కెట్ వలన ఇన్వెస్టర్లు పారిపోతున్నారు .దీని ప్రభావంతో అమెరికా ట్రెజరీ కిందటివారం లో ఇది వరకు ఎన్నడూ లేనంతగా 1%కంటే క్రిందకు పడిపోయి,భయం కలిగించింది .గత పదేళ్ళలో దాని చారిత్రకపతనం 0.3% కు రావటం భీతికోల్పే విషయమే .దీనితో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ,మళ్ళీ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుంది అని ఆర్ధిక విశ్లేషకుల అంచనా .అమెరికా సెంట్రల్ బాంక్ అత్యవసరంగా 50 బేసిక్ పాయింట్లను గతవారం కోతకోసింది .దీనివలన టార్గెట్ ఫండ్ 1నుంచి 1.25% కు పెంచుకొన్నది .
ఇన్వెస్ట్ మెంట్ ,కంపెని షేర్లు కొనుగోలు అమ్మకాల వలన పెన్షన్ దార్లకు మదుపరులకు పెద్ద నష్టం కలిగింది .ఇండస్ట్రియల్ యావరేజ్ ,నిక్కీలుడిసెంబర్ 31తర్వాత భారీ పతనాన్ని చవి చూశాయి .ఒక్కరోజులోనే ఈపతనం రావటం ఇన్వెస్టర్లను ఆందోళన పరుస్తోంది .ఈ ఆర్ధికపతనాన్ని తగ్గించటానికి ప్రభుత్వాలు తీసుకొన్న తీసుకొంటున్న చర్యలు ‘’అరకోర’’ మాత్రమె తప్ప సమర్ధమైన స్థిరమైన చర్యలు కావు అంటున్నారు ఆర్ధిక నిపుణులు .దీనికి జవాబుగా ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తో సహా అన్ని దేశాల సెంట్రల్ బాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి .దీనివలన అప్పుతీసుకోవటం తేలిక అవుతుంది ,ఖర్చు ధారాళంగా పెట్టి ఆర్దికానికి కొమ్ముకాయవచ్చు అని భావన .అమెరికా సెనేట్ కూడా 2ట్రిలియన్ డాలర్ల కరోనా వైరస్ సహాయం ఆమోదించి వర్కర్లకు వ్యాపారస్తులకు వెసులుబాటు కలిగించింది .మన దేశప్రదానికూడా అలానే భారీ మొత్తాన్ని సాయంగా ప్రకటించాడు .కానీ ఇదంతా ‘’అత్యుల్లాసం ‘’,’’త్వరగా ఆవిరి అయ్యే ‘’(వోలటైల్ )విధానమే కాని శాశ్వతం కాదని అంతర్జాతీయ ఆర్ధిక నిపుణులు పెదవి విరిచారు .అమెరికాలో 3మిలియన్ల ప్రజలు కరోనా వైరస్ బాధితులుగా సహాయం కోరుతున్నారు .వీరికి ఇంకం టాక్స్ కట్టింగ్ లు పోను చేతికి ఎంతవస్తోందో బ్రాహ్మ పదార్ధం గా ఉన్నదట .మనకూ అదే పరిస్థితి.
100పైగా దేశాలు కరోనా వ్యాప్తి భయం తో ప్రయాణాలపై, రవాణాపై ఆంక్షలు విధించటం ,విమానాల సంఖ్య, ఫ్లైట్ ల సంఖ్య తగ్గించటం తో బిజినెస్ వాళ్ళు టూర్లు ,హాలిడే ట్రిప్ లు రద్దు చేసుకోవటం తో రవాణా పరిశ్రమ చాలా పెద్ద దెబ్బే తిన్నది.యూరోపియన్ ఎయిర్ పోర్ట్ లనుండి అమెరికాకు ప్రయాణీకులను బాన్ చేశాడు ట్ర౦ప్ .చైనా వారిని గృహ నిర్బంధలో ఉంచటం తో ఇంగ్లాండ్ కు గత 12నెలలలో రావాల్సిన 4,15,000 విజిట్లు ఆగిపోయి గొప్ప నష్టం కలిగించింది బ్రిటన్ కు. అన్ని దేశాలవారికంటే చైనావారు ఇంగ్లాండ్ కు సరాసరి అత్యధిక ధర 1,680పౌండ్లు ఖర్చు చేసివచ్చే ఆదాయం’’ లాస్’’అయ్యారు .సూపర్ మార్కెట్ లు, ఆన్ లైన్ డెలివరి సర్వీసు ల వలన సరుకుల అత్యంత డిమాండ్ ఏర్పడిందని తట్టుకోవటం కష్టంగా ఉందని ముఖ్యంగా టాయిలెట్ పేపర్లు, బియ్యం ,ఆరంజ్ జూస్ లకు ఉన్న డిమాండ్ తీర్చటం కష్టతర మై పోతోందని బాధ పడుతున్నారు సప్ప్లియర్స్ .గుడ్డిలో మెల్ల గా వాతావరణ పొల్యూషన్ బాగా తగ్గిపోయింది ప్రయాణాల రద్దు మూలకంగా .చైనా ఉత్పత్తి మొదటి రెండునెలలలో దాదాపు 14శాతానికి పడిపోయిందట
అనిశ్చిత పరిస్థితులలో దేనిపై పెట్టు బడి పెట్టాలని సందేహం ఎక్కువగా ఉంటుంది .అన్నిటికన్నా బంగారం పై పెట్టుబడి ‘’సేఫ్’’ అని అందరి భావన.కాని ఈమార్చిలో ‘’బంగారు’’ కూడా ‘’కంగారు ‘’పడింది . ధర తగ్గిపోయి గ్లోబల్ వైడ్ గా ఇన్వెస్టర్లకు కన్నీళ్లు తెప్పించింది .ఇంకా ఎక్కువ కాలం లాక్ డౌన్లు, లాకౌట్లు పొడిగిస్తే ఆర్ధిక రేటు అత్య౦త నిరాశాజనకమై భయ పెడుతుందని ఆర్ధిక వేత్తల హెచ్చరిక .ముందు బాగానే ఉంటుంది .తర్వాతే మండిపోతుంది .పెద్ద నోట్లు రద్దు చేసిన మోడీ ని అవతార పురుషుడని ఆకాశానికి ఎత్తేశారు ఆతర్వాత నెలకే అందులోని డొల్లతనం బయట పడి ఈసడించారు .అలా మళ్ళీ కాకూడదని, కాదని భావిద్దాం. మనం మాత్రం ప్రకృతిని, పర్యావరణాన్నీ కాపాడుకొంటూ, శుచి, శుభ్రత పాటిస్తూ ఒకరికొకరం దూరం గా ఉంటూ, బుద్ధిగా ఉండి కరోనా మహమ్మారిని తరిమేద్దాం .
రేపు శ్రీరామనవమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.