మానవత్వం పరిమళించిన వేళ
కరోనా లాకౌట్ లో జనం బయటికి రాలేక ,ముసలీ ముతకా ఇంట్లో అన్నం వండుకోలేక రిక్షావాలాకు కిరాయి లు లేక కాలేకడుపులతో అలమటిస్తున్న వేళ ఉయ్యూరులో వె౦ట్రప్రగడ ఆంజనేయులు, మా అబ్బాయి గబ్బిట రమణ ,శ్రీనివాస్ అనే స్వంతకారున్న ఉదారుడు, మిత్రులు కలిసి ఆలోచించిరోజుకొకరు స్పాన్సర్ గా పైవారికి ఇంటికే పప్పు ,కూర పెరుగు, మంచినీటిపాకెట్ ,అన్నం సంబారులతో ఒక పాకెట్ తయారు చేయించి ,రోజుకు కనీసం 50 మందికి ఆహార పాకెట్లు స్వయంగాఇళ్ళకు వెళ్లి అంద జేయటం ప్రారంభింఛి గత అయిదు రోజులుగా మానవత్వం చాటుతున్నారు .అందులో శ్రీను తనకారులో ఈ బాచ్ ను ఆహారపాకేట్ లతో సహా తీసుకు వెళ్లి డోర్ డెలివరి చేసి ఎంతో సాయపడుతున్నాడు .

ఇప్పటికే రెండు రోజులు అతనే స్పాన్సర్ .ఇవాళ సరస భారతి స్పాన్సర్ చేస్తుందని మా అబ్బాయి రమణ నాకు చెప్పి ,రావి చెట్టు బజారు లో ఉన్న కోటేశ్వరరావు కేటరింగ్ కేంద్రం దగ్గర నాతో ,ఒంటిమిట్ట డాక్టర్ శివకుమార్ గారితో
అర్హులకు పాకెట్లు ఇప్పించే పని మొదలుపెట్టించి ,పెద్దవంతెనదగ్గర రిక్షా వారికీ ,బసవయ్య చెరువు దగ్గరున్న ముస్లిం సోదర సోదరీమణులకు ,గురజాడ డొంకదగ్గర ఉన్న ఎరుకల ఏనాది వారికీ మాచేత ఈ బృందం ఆహార పొట్లాలు ఇప్పించి మాకూ ఆపుణ్య౦ లో వాటా దక్కెట్లు చేశారు .ఈఎరుకలకు వేసుకోవటానికి కళ్ళకు చెప్పులు కూడా కొనుక్కోలేని గర్భిణీ స్త్రీలు కూడా ఉండటం గమనించి ఆకుటు౦బాలవారికి 12 జతల చెప్పులు కూడా మాతో అందజేయటంమరో విశేషం .కేటరింగ్ అతను కోటేశ్వరరావు ,అతని పిల్లలు కుటుంబం ఈ వితరణకార్యక్రమం లో భాగస్వామి అయి, చాలాతక్కువ రేటులో ఆహార పాకెట్లు తయారు చేసి రోజూ అందివ్వటం మరో ముఖ్య విషయం .అందుకే ఉయ్యూరులో మానవత్వం పరిమళించింది అని పించింది .మాటల్లో కాక, చేతల్లో మానవత్వం చూపిన వీరందరికీ మనః పూర్వక అభినందనలు .మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-4-20-ఉయ్యూరు

