సాహితీ బంధువులకు శుభకామనలు ఇవాల్టితోసరసభారతి పుస్తకాలను 6 ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా పరిచయం చేశాను వీక్షకులకు ధన్యవాదాలు
నిన్నరాత్రి అమెరికా షార్లెట్ నుంచి మా అమ్మాయి విజ్జి ఫోన్ చేసి వాళ్లకు దగ్గరలో ఉంటున్న ఒకావిడ (పేరేదో చెప్పింది కాని జ్ఞాపకం లేదు ) సరసభారతి బ్లాగు ను అనునిత్యం ఆసక్తిగా ఫాలో అవుతున్నానని ,పుస్తక పరిచయం ప్రాత్యక్ష ప్రసారం కూడా వదలకుండా చూస్తున్నాననిచెప్పిందని ఇంతగా కృషి చేస్తున్నవారెవరూ తనకు కనిపించలేదని చెప్పిందని చెప్పింది. ఐతే ఇండియాలోనూ అమెరికాలోనూ పిల్లలకు ”కరోనా సెలవ”లిచ్చారు కనుక వాళ్ళకోసం నన్ను మంచి నీతి ,కర్తవ్య౦,బాధ్యత ,మానసిక ఉల్లాసం కలిగించే కథలు చెబితే పిల్లలకుకూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారని చెప్పింది . ఐడియా . బాగానే ఉందని పించి ,ఇవాళ రెండు పుస్తకాల పరిచయం త్వరత్వరగా పూర్తిచేసి విరామం ప్రకటించాను .
రేపు 6-4-20 సోమవారం ఉదయం 10 గంనుండి .”కథా సుధ”శీర్షికతో ఉపయుక్త కథలను ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా చెబుతాను సుమారు 40నిమిషాలలో . దీనిని ఇటీవల ”గో రసం ”వారు శ్రీ శిస్టు సత్యరాజేష్ సంపాదకత్వం లో ప్రచురించిన ”బాలనేస్తాలు ”లోని కథలతో మొదలు పెడతాను -మీ- దుర్గాప్రసాద్ -5-4-20 ఆదివారం -ఉయ్యూరు

