తార్తార్ యుగం -1240-1480-తార్తారులు రష్యన్ సామంతులనుండి దండిగా కప్పం వసూలు చేసు కోవటమే పరమావధి గా ఉండటం వలన రష్యన్ సంస్థలతో ,జీవన విధాలలో జోక్యం కలిగించుకోలేదు .కానీ ఈకాలం లో సాహిత్యం మాత్రం పెద్దగా అభి వృద్ధి చెంద లేదనే చెప్పాలి .యౌపట్ కోలో వ్రత్ కదలు,మతోపదేశాలు ,సన్యాసుల జీవితాలకు సంబంధించినవి మాత్రమె వచ్చాయి .ఈకాలపు గొప్ప గ్రంథం-‘’జోడోష్ చిన’’.దీన్లో 1380లో కులికోవో దగ్గర తర్తారులు పొందిన మొదటి పరాభవం ,పరాజయాలు ఉన్నాయి .రచయిత’’సోఫ్రోనియా మతగురువు ‘’లే ఆఫ్ ఐగార్స్ ‘’కాంపెయిన్ అనే గ్రంధం చదివి ,దాన్ని అనుకరిస్తూ , రాశాడు .కవితా ప్రతిభ లేనివాడు .తార్తార యుగం చివర్లో ట్వైర్ వర్తకుడు అఫనసి నికిటన్ రాసిన ‘’జర్నీ బియాండ్ ది త్రీ సీస్’’-1466-72 పుస్తకం మాత్రం చాలా ముఖ్యమైనది .పర్షియా భారత్ దేశాలలో తాను చేసిన సముద్ర ప్రయాణ సాహస కృత్యాలను సుందర సరళ శైలిలో రాసి రీడబిలిటి తెచ్చాడు .ఈ యుగం చివర్లో మాస్కో రాజులు దేశ ఐక్యత కోసం కొంత పాటుపడ్డారు .ఫలించి చివరికి 1480లో మూడవ ఇవాన్ రాజు తార్తారులనుంచి రష్యాకు విముక్తి కలిగించాడు .దీనితో మాస్కో యుగం ప్రారంభమైంది .
మాస్కో యుగం -1480-1702-ఈ యుగం లో రష్యన్ సాహిత్యానికి మాస్కో కేంద్ర బి౦దు వైంది .సాహిత్యానికి రాజపోషణ లభించి కొన్ని ముఖ్యరచనలు వచ్చాయి నాల్గవ యువాన్ చక్రవర్తి -1530-1584 కూడా గొప్ప రచయితగా గుర్తింపు పొందాడు ఇతని చేతిలో ఓడిపోయి,పోలాండ్ లో తలదాచుకొన్నవైకో లోవిచ్ కుర్ బెస్కీ కూడా ఉత్తమ రచనలు చేశాడు .వీరిద్దరి రచనలలో బైజా౦టిక్ ప్రభావం ఎక్కువే .కుర్ బెస్కి రచనలలో ప్రామాణిక రష్యా దేశ చరిత్ర లభిస్తుంది .ఈ యుగం చివర్లో నవలా రచన మొదలైంది .ఇవి మతాచార్యుల ,పురాణాలకు సంబంధించిన నవలలు .
మాస్కో యుగం లో రష్యాకు , పాశ్చాత్య దేశాలతో మొదటిసారిగా పరిచయం కలిగింది .యూక్రేనియాన్ సాహిత్యం మూలంగా లాటిన్ రచనల గొప్పతనం మొదట్లో రష్యాకు తెలిసింది .లాటిన్ ఛందస్సుకు రష్యన్లు ఆకర్షింప బడ్డారు .పీటర్ చక్రవర్తి -1672-1725కాలం లో పాశ్చాత్య సంస్కృతి రష్యా అంతా వ్యాపించింది .సెయింట్ పీటర్స్ బర్గ్ యుగ సాహిత్య వికాసానికి దారి తీసింది .
సెయింట్ పీటర్స్ బర్గ్ యుగం -1702-1837-పీటర్ చక్రవర్తి సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాన్ని నిర్మించి రష్యన్ సంస్కృతీ కేంద్రంగా చేశాడు .పాశ్చాత్య సంస్కృతిని వల౦బిస్తూ ,దాన్ని స్వంతం చేసుకొన్నప్పుడు మాత్రమె రష్యన్ జాతి ఉన్నతి చెందుతుంది అని గాఢ౦గా నమ్మి, తన జీవితాన్ని దానికోసం అంకితం చేశాడు . రష్యా వేష భాషలలో భావనలలో గొప్ప మార్పు తెచ్చాడు .పాశ్చాత్యులకు దీటుగా రష్యాను అన్ని విధాలా తీర్చి దిద్దటానికి విద్యా ,ఆర్దికాది రంగాలలో అనేక సంస్కరణలు తెచ్చాడు .దీనితో రష్యన్ లకు ఫ్రెంచ్ భాషతో పరిచయమేర్పడి,ఆ భాషాపదాలు .ఎన్నో ప్రక్రియలు వచ్చి చేరాయి .పీటర్ చనిపోయాక రాణి కేధరిన్ అదే మార్గం లో కృషి చేసింది ‘’రష్యన్ సాహిత్య పిత’’అని పేరు పొందిన మైకెలో వాస్లి విచ్ లో మెనో సావ్ -1708-1765 ఈయుగపు మేటి రచయిత ..ప్రసిద్ధ సైంటిస్ట్ గానే కాక సాహిత్యం లోనూ ప్రముఖుడు .రష్యన్ వ్యాకరణం మొదటి సారిగా రాసి ,రష్యన్ గీతాలకు ఛందస్సు కూడా అమర్చాడు .మరో ప్రముఖుడు –పెట్రోవిచ్ సుమరోకోవ్-1717-1774మొదటి రష్యన్ నాటకం రాశాడు .ఇతనికన్న గొప్ప వాడు అనిపించుకొన్నాడు –గన్ రిలా డేర్జవిన్ -1743-1816 గేయరచయితగా లబ్ధ ప్రతిస్టుడు..ఉత్తమకవిత్వానికిఅతని గేయాలు లక్ష్యంగా ఈనాటికీ భావింప బడుతున్నాయి .ఈయుగం లో వచన రచనలు కూడా బాగానే వచ్చాయి .వీటికి పశ్చిమ యూరోపియన్ భాషలే ప్రేరణ .ఇంగ్లిష్ రచయితలైన ఎడిసన్ ,స్టీల్ మొదలైన వారిని ఆదర్శం గా తీసుకొని రష్యన్ రచయితలూ వాస్తవిక వాదానికి బాటలు వేశారు .వీరిలో ప్రసిద్ధుడు –నికోలస్ నొవి కొవ్.-1744-1816.ఇతడి రచనలలో కేధరిన్ రాణిపై విమర్శ ఎక్కువగా ఉండటం తో నిషేధించారు .
పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం తో రష్యన్ భాషలో వచ్చిన మార్పు ను సుస్థిరం చేసి ,భాషకు ఒక నిర్దిష్ట రూపాన్ని చేకూర్చాడు నికోలాయ్ కరం జిన్-1765-1826.స్లావిక్ భాషలోనుంచి వచ్చిన పాత పదాలన్నీ తీసేసి కొత్తభావాలకు అద్దం పట్టే పదాలను పాశ్చాత్యభాషలనుంచి గ్రహించి భాషను సువ్యవస్థితం చేశాడు కరం జీన్.భాషతో పాటు శైలీ విన్యాసంలో కూడా పెద్ద మార్పు తెచ్చాడు .ఇతని ‘’పూర్ లీజా ‘’వంటి నవలలు,చరిత్రలు దేశమంతా ఆసక్తిగా చదివారు .దీనితో అనువాదాలు చేయటంకూడా తేలికైపోయింది .దీన్ని అందరూ సమర్ధించి ప్రోత్సహించి అనుసరించారు .ఇతని సమకాలికుడే –ఇవాన్ యాండ్రియోవిచ్ క్రై లావ్ కల్పనా సాహిత్యానికి బీజాలు వేశాడు .ఇతడు రాసిన 200ల కల్పనా కథలు ఈ నాటికీ రష్యాలో ఆసక్తిగా చదువుతున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-20-ఉయ్యూరు

