ప్రపంచ దేశాల సారస్వతం
45-మార్టిన్ ఐలాండ్ సాహిత్యం
ఈశాన్య కరేబియన్ సముద్రం లో సెయింట్ మార్టిన్ లేకా మార్టిన్ ఐలాండ్ ఉన్నది .కరోనా సోకని నాలుగవ దేశం .ఫ్రెంచ్ రిపబ్లిక్ ,నెదర్లాండ్స్ మధ్యలో రెండు భాగాలుగా ఉన్నా ,రెండు చోట్లా జనాభా సమానంగా ఉంటారు .దక్షిణంగా ఉన్న సింట్ మార్టిన్ డచ్ లో భాగం ఉత్తరాన ఫ్రెంచ్ భాగంగా ఉన్నది సెయింట్ మార్టిన్. ఈ భాగం యూరోపియన్ యూనియన్ లో ఉన్నది బీచ్ అతి సమీపం లో ఎయిర్ పోర్ట్ ఉంటుంది .జనాభా సుమారు 78వేలు మాత్రమె .ఈ రెండిటినీ కలిపే సెయింట్ మార్టిన్ అంటారు 1493లో నవంబర్ 11కొలంబస్ ఇక్కడకాలుపెట్టి ‘’సాన్ మార్టిన్ ‘’పేరుపెట్టాడు .తర్వాత మార్పులు చెంది సెయింట్ మార్టిన్ అయింది .1620లో డచ్ వారుఇక్కడి ఉప్పునీటి గుంటలనుంచి ఉప్పు తయారు చేశారు .1648లో ఫ్రెంచ్ డచ్ దేశాలమధ్య ఒప్పందం జరిగి రెండుభాగాలైంది .ఇక్కడ ట్రాపికల్ సవన్నా శీతోష్ణస్థితి ఉంటుంది .2017 హరికేన్ ‘’ఇర్మా ‘’అల్లకల్లోలం చేసి,తీవ్ర నష్టం కలిగించింది ఇరువైపులా .జిడిపి15,400 డాలర్లు .టూరిజానికి గొప్ప అనువైనది .2000సంవత్సరం లో ఒకమిలియన్ మంది టూరిస్ట్ లు వచ్చినట్లు తెలుస్తోంది. డచ్ వైపు ప్రాంతం రాత్రి విందు వినోదాలు ,జ్యువెలరి ,డ్రింక్స్ తో మత్తేక్కిస్తే ,ఫ్రెంచ్ వైపు ప్రాంతం ‘’నూడ్ ‘’బీచెస్,షాపింగ్ లతో ఆకర్షిస్తుంది .అధికారభాష ఫ్రెంచ్ .డచ్ ఇంగ్లీష్ కూడా ప్రజలు మాట్లాడుతారు .దేశం ‘’ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్’’ లో ఉండటం వలన అట్లాంటిక్ హరికేన్ల తాకిడి వేసవి చివర్లో ,ఫాల్ మొదట్లో ఎక్కువ.కరెన్సీ ‘’యూరో ‘’. ఉప్పు లేని మంచి నీటి సరఫరా ఉంటుంది .ఉప్పు ఉత్పత్తి ,టూరిజం ఈ దేశ ఆర్దికానికి ముఖ్యమైనవి .ఒకప్పుడు బానిసలతో యజమానులు ఉప్పు తయారు చేయించేవారు .టూరిస్ట్ లతాకిడి లేకపోతె కొంప కొల్లేరే .వేసవిలో రావాలంటే హరికేన్ తుఫాన్లభయం .అందుకే కరోనా కూడా ఇక్కడ కాలుపెట్ట టానికి భయ పడి ఉంటుంది .కనుక ఇక్కడి జనం బతికి పోయారు
సాహిత్యం –సెయింట్ మార్టిన్ రచయితలూ –షీలా సి విలియమ్స్ -1955అరుబాలో పుట్టి ఇక్కడికి వచ్చి౦ది.లసనా సేకౌ,విసిఫ్ఫీ స్మిత్ లోయీకీ మొరేల్స్, డేబ్బీ జాక్ ,చార్లెస్ బరోమియా హోడ్జ్,ఎస్తెర్ బాద్షాగుమ్బ్స్ ,ఎర్నా మే ఫ్రాన్సిస్ ,రాస్ చంగా ,రూబి బూట్ మొ దలైనవారు
లసానా యం సేకౌ-కవిత్వం మొనోలోగ్స్ ,చినకథలు మొదలైన 13రచనలు చేశాడు .సెయింట్ మార్టిన్ దేశ ప్రముఖ రచయితగా గుర్తి౦పు పొందాడు .అంతర్జాతీయంగా అనేక సాహిత్య సా౦స్క్రుతిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు .దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశాడు .సెయింట్ మార్టిన్ దేశ సాహిత్యం ‘’ది సాల్ట్ మెటఫర్’’గా వర్ణిస్తారు.ఉప్పును నిలవ చేయటానికి రోగ నివారణకు ఉపయోగిస్తారు కనుక అలా అంటారట .ఇక్కడ ఒక సామెత ఉన్నది ‘’మే యువర్ లైఫ్ బి ఆజ్ స్వీట్ ఆజ్ సాల్ట్ ‘’.అది దీవేనకూడా ఈ దేశం లో.సారా ఫ్లోరియన్ ‘’సాల్ట్ మెటఫర్’’అనే కవితా సంపుటి రాసింది . ఈమెకవిత్వాన్ని డిలాన్ ధామస్ కవిత్వం లా ఉంటుంది అంటారు ఇక్కడ’’ బ్రేర్ రాబి టేల్స్’’అనే జానపద కథలుతరతరాలుగా ప్రచారం లో ఉన్నాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-4-20-ఉయ్యూరు

