ప్రపంచ దేశాల సారస్వతం
47-నౌరు దేశ సాహిత్యం
కరోనా సోకని 6వ దేశం నౌరు మైక్రో నేషియాలో ఆస్ట్రేలియాకు ఈశాన్య౦ లో ఉన్న ఐలాండ్ .కోరల్ రీఫ్ లకు తెల్ల ఇసుక బీచ్ లకు ప్రసిద్ధి .’’ప్లెజెంట్ ఐలాండ్ ‘’గా గుర్తింపు పొందింది తూర్పున అనిబెరా బే ఉంటుంది .అండర్ గ్రౌండ్ ఫ్రెష్ వాటర్ లేక్ మోకా వెల్స్ దగ్గర మోకా లైం స్టోన్ గుహల సమీపం లో ఉంటుంది .రాజధాని –ఎరేన్.కరెన్సీ –ఆస్ట్రేలియా డాలర్ . క్రీ.పూ వెయ్యేళ్ళ క్రితమే ఇక్కడ మైక్రో నేషియన్లు ,పోలి నేషియన్లు వచ్చి స్థిరపడ్డారు .19శతాబ్దిలోజెర్మని ఎంపైర్ స్వాధీనం చేసుకొన్నది .మొదటి ప్రపంచయుద్ధం లో జపాన్ సైన్యం చేరింది .యుద్ధం తర్వాత యు యెన్ వో ట్రస్టీ షిప్ లో ఉన్నది .ఫాస్ఫేట్ నిక్షేపాలు భూమికి దగ్గరలోనే పుష్కలంగా ఉన్న ఐలాండ్ .మైనింగ్ తేలిక .ఫాస్ఫేట్ ఖాళీ అయిపోగా ఎకానమీ దెబ్బతిని ,బతికి బట్టకట్ట టానికి ఇల్లీగల్ మనీ లాండరింగ్ సెంటర్ అయింది .ఆస్ట్రేలియా సాయం అర్ధించి,ఆస్ట్రేలియా పై ఆధార పడిన దేశం అయింది .1948లో చైనీస్ గువానో మైనింగ్ వర్కర్లు జీతాల విషయం లో సమ్మె చేయగా హింస చోటు చేసుకోగా ఎమర్జెన్సి విధించారు . 1966జనవరిలో దేశం స్వతంత్రం పొందింది . రెండేళ్ళ తర్వాత ప్రెసిడెంట్ ను ఎన్నుకొన్నారు .బ్రిటిష్ ఫాస్ఫేట్ కమీషనర్ల ఫాస్ఫేట్ నిలవలన్నీ కొనేసింది దేశం .1970లో నౌరు ఫాస్ఫేట్ కమిషన్ ఏర్పడి దేశానికి వెన్నెముకగా ,ఆర్ధికాభి వృద్ధికి నిలిచి ,ఇవాళ ప్రపంచం లోనే అత్యధిక సంపన్న మైన దేశం గా నిలబడింది .ఈ దేశం లో వేడి ,హుమిడిటిఎక్కువ.మాన్సూన్ వర్షాలు అతలాకుతలం చేస్తాయి .జీవావరణంఫాస్ఫేట్ మైనింగ్ వలన బహు తక్కువ . అరుదైన పక్షిజాతులు అంతరించిపోయాయి .60 రకాల ప్రత్యేకత కల వాస్క్యులార్ ప్లాంట్ స్పెసీస్ ఉన్నాయి.పాలిచ్చేస్థానిక జంతువులూ లేవు కాని స్థానిక కీటకాలున్నాయి .నౌకలవలన ఇక్కడికి కుక్క పంది ,పిల్లి ఎలుక ,చికెన్ వచ్చాయి .రీఫ్ డైవర్సిటి వలన ఫిషింగ్ ఇక్కడ బాగా పాప్యులర్ అయింది .స్కూబా డైవింగ్ ,స్నార్కెలింగ్ కు టూరిస్ట్ లు ఎగబడతారు .ఇక్కడి భాష –మైక్రో నేషియా భాషాజన్యమైన నౌరాన్ భాష ను 96శాతం ప్రజలు మాట్లాడుతారు .ఇంగ్లీష్ కూడా వచ్చు ఇదే అధికారభాష .మతం –క్రిస్టియానిటి.దినపత్రిఅకలు లేవు పదిహేనురోజులకు ఒక ‘’మ్వివెన్ కో ‘’అనే పత్రిక వస్తుంది .ప్రభుత్వ టివి స్టేషన్ ఉంది .ప్రోగ్రాములు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లనుండి ప్రసారమౌతాయి .ఫుట్ బాల్ ,వెయిట్ లిఫ్టింగ్ జాతీయ క్రీడలు .వాలీబాల్ నెట్ బాల్,టెన్నిస్ కూడా ఆడుతారు . రెండేళ్ళ నుంచి రబ్బి సెవెన్ ఆడటం మొదలుపెట్టారు .అక్షరాస్యత శాతం 96శాతం పైనే .16వ ఏడు వరకు కంపల్సరి విద్య .యూనివర్సిటి కూడా ఉంది .జీవితకాలం సుమారు 60ఏళ్ళు .ఆడవారిలో ఊబకాయం ఎక్కువ .40శాతం ప్రజలు డయబెటేస్ వ్యాధి బాధితులే .కిడ్నీ ,హార్ట్ డిసీజ్ లూ ఎక్కువే .ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది ‘.చెక్కబోమ్మలతయారీ దేశీయ కళ.లీస్ట్ విజిటేడ్ కంట్రి’’గా ముద్రపడిన దేశం నౌరా .జనాభా 10వేలు మాత్రమె
నౌరూనియన్ సాహిత్యం – నౌరు దేశ సాహిత్యం పెద్దగా లభ్యం కావటం లేదు .లభ్యమైన ఒకపుస్తకం –స్టోరీస్ ఫ్రం నౌరు .వీటిని బెన్ బాం సాల్మన్ , ఎల్మినా క్వాడినా ,ఈస్టన్ థోమా ,పామెలా స్క్రివెన్,జేరిలిన్ జేర్మియ ,లూషియా బిల్ ,మాకెరిటా వాయ్ మొదలైన రచయితలు రాశారు.
స్త్రీ రచయితలలో జోయెన్నాఏకాం బడియా గోబురే ,మార్గరెట్ హెండ్రి ఉన్నారు.జోయన్నే నౌరో జూనియర్ కాలేజి గ్రాడ్యుయేట్ .ప్రభుత్వం ఎంపిక చేసి ఐటి టీచర్ నియమించింది .ఇంగ్లిష్ లో ధారాళంగా కవిత్వం రాసింది .ఆమె రాసిన ‘’ప్రేయర్ ‘’బాగా పాప్యులర్ అయింది .మరో రచయిత్రి మార్గరెట్ హెండ్రి-నౌరానా భాషలోనే రాసింది .దేశ జాతీయగీతం రాసి గొప్ప ప్రసిద్ధి చెందింది .దీనికి హెన్రి హక్ సంగీతం కూర్చాడు .
ఫ్రాన్స్ దేశం లావ్రే,మకువా లలోని కాసియానాలు మూసెయ్యటం ,NBAహై ఫైవింగ్ ఫాన్స్ ను షట్డౌన్ చేయటం ,ఆస్ట్రేలియా టాయ్ లెట్ పేపర్ హోర్డింగ్ అరికట్టటం ,ఫసిఫిక్ సముద్రయానం నిషేధించటం తో కరోనా నౌరు లో అడుగు పెట్టలేదు .దీనితో దేశం ఊపిరి పీల్చుకున్నది .
సశేషం
పరశురామ జయంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-20-ఉయ్యూరు
—

