సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62
హనుమ చెప్పిన విషయాలన్నీ ఓపికగా విన్న యువరాజు వాలిసుత అంగదుడు అందరినీ ఉద్దేశించి ‘’సీతాదేవిని తీసుకురాకుండా రాముని దగ్గరకు మనం వెళ్ళటం భావ్యం కాదు .ఇంతమంది మహావీరులం సీతాన్వేషణకు వెళ్లి ,ఆమెనుచూశాం కాని తీసుకు రాలేదు అని రామునికి చెప్పటం తగదనిపిస్తోంది .ఎగరటం లో పరాక్రమం లో కాని దేవదైత్యులలో హనుంతుడికి సాటి ఎవరూ లేరు .అలాంటి హనుమ లంకలో రాక్షస వీరులను మట్టుపెట్టగా,ఇకమనకు వేరే పని ఏముంది ?సీతను తీసుకొని వచ్చాక మాత్రమే రాముని చూడటానికి వెడదాం.’’అన్నాడు .అంగదుని మాటలు విన్న జాంబవంతుడు అతనితో ‘’రాజపుత్రా !నువ్వు చెప్పింది అయుక్తం కాదు .అయినా యుక్తమైనా సరే ,రామాజ్ఞ ప్ర కారమే మనం నడుచుకోవటం మన విధి .స్వత౦త్రి౦చి మనం ఏ పనీ చేయకూడదు .కనుక ఆ ప్రకారం కార్య సిద్ధి ఆయే ఉపాయం ఆలోచించాలిచాలన్నాడు .
‘’తస్య తద్వచనం శ్రుత్వా వాలిసూను రాభషత-‘’అయుక్తం తు వినా దేవీం ‘’ దృష్ట వద్భి శ్చవానరాః’’
‘’దృష్ట్వా దేవీ న చానీతా ఇతి తత్ర నివేదనం –అయుక్త మివ పశ్యామి భవద్భిః ఖ్యాత విక్రమైః’’
‘’తే ష్వేనం హతవీరేషు రాక్ష శేషు హనూమతా –కిమస్య దత్ర కర్తవ్యమ్ ‘’గృహీత్వా యామ జానకీం ‘’
‘’న తావ దేషా మతి రక్షమానో –యథా భవాన్ పశ్యతి రాజపుత్ర –యథా తు రామస్య మతి ర్నివి ష్టా-తథాభవాన్ పశ్యతు కార్య సిద్ధిం ‘’
ఇది 6శ్లోకాలు మాత్రమే ఉన్న 60వ సర్గ .
యువరాజు అంగదుడు ఆవేశ పరుడు .ఈ’’ ఎక్ష్పెడిషన్ ‘’కు తానే నాయకుడు .అతని ఆజ్ఞకు లోబడే హనువ వెళ్లి సీతను లంకలో చూసి వచ్చినా ,నాయకుడిగా తనకు రావాల్సిన కీర్తిరాదు . సీతను తీసుకురాకుండా చూసి వచ్చాం అని రాముడికి చెప్పటానికి మొహం చెల్లటం లేదు .అది తన నాయకత్వానికి’’ ఫెయిల్యూర్ ‘’అవుతుందని మధన, బాధ, అవమానం అతనిది .కనుక తక్షణ కర్తవ్య౦ .అక్కడ ఉన్న సమర్ధ వానర వీరులో కొందరుకానీ అందరూ కానీ లంకకు వెళ్లి ఎలాగైనా సీతనుతీసుకు రావాలి .అప్పుడే ఆమెతో కలిసి రామ దర్శనం చేయాలి .ఉడుకురక్తం ఆలోచన .అప్పుడే తన’’ ప్రిస్టేజ్’’ తన బాబాయ్ ముందు నిలుస్తుంది .లేకపోతే ‘’డామేజ్ ‘’అవుతుంది అనుకొన్నాడు కుర్రాడు ,యువరాజు కనుక .ఆపైన ఆలోచి౦చ లేకపోయాడు .ఇలాంటి సమయాలలోనే అనుభవజ్ఞుల ఆలోచన ,సలహా ‘’టంకం’’ అతికి నట్లు సరిగ్గా అతికి, పని చేస్తుంది
అందుకే జాబవంతుడు తన అనుభవ సారం అంతాపిండి వడగట్టి తానే అంగడుడికి,అందరి తరఫున ‘’మా౦ఛి డోసు’’లాంటి సలహా ఇచ్చి మారుమాట్లాడకుండా చేశాడు .అదే- నిర్ణయం తాము తీసుకోకూడదని ,యువరాజు అంగదుని తో సహా అందరు రామాజ్ఞకు బద్ధులుగా నడవాల్సిందే అని ఖరాఖండిగా చెప్పి,అంగదుడితోపాటు అందరి నోళ్లకు తాళం వేశాడు .లేకపోతే ఏమయ్యేది ?ఎవరికి వారు తమపరాక్రమ డబ్బాలు స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బాలు కొట్టుకొని,కృష్ణరాయబారం లో దుర్యోధన ,కర్ణ ,అశ్వత్ధామ , ద్రోణ క్రుపాదులు నిండు సభలో తమలో తాము’’ సిగపట్ల గోత్రం’’పట్టి ,రాయబారి ముందు పలుచనై పరువు పోయినట్లు జరిగేది . అటునుంచి ఆటే లంకకు పరిగెత్తేవారు .తర్వాత ఏమై పోతారో తెలీదు. రామ సుగ్రీవాదులకు సీతా దర్శన వార్త చేర వేసే వారు ఉండరు .ఒక వేల హనుమ అక్కడే ఉండిపోయినా వాళ్ళంతా తరిగి వచ్చేదాకా సుగ్రీవ రాములను చూడటానికి వెళ్ళే సాహసం చేసేవాడు కాదు . దు౦దుడుకు స్వభావి అంగదునినపై రాజు సుగ్రీవుడికి కోపం వస్తే ,అతన్ని రక్షించగలిగే వారెవరూ ఉండరు సుగ్రీవాజ్ఞ అంత తీక్ష్ణమైనది .ఇప్పటిదాకా చేసిన అన్వేషణ అంతా నిష్ఫలమై పోతు౦ది. ఆప్రమాదం జరక్కుండా ఎంతో ముందు చూపుతో రామకార్య సాఫల్యానికి ,హనుమ అన్వేషణ ఫలితానికి చక్కని’’ డ్రమాటిక్ ఫినిషింగ్ ‘’ఇచ్చాడు జా౦బవాన్ అని నాకనిపించింది .చిన్నసర్గ అయినా చాలా’’ పవర్ ఫుల్ ‘’సర్గ అని నేను అనుకొంటున్నాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ 29-6-20-ఉయ్యూరు

