Monthly Archives: June 2020

తిధుల ప్రకారం పుట్టిన రోజు

తిధుల ప్రకారం పుట్టిన రోజు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

బక దాల్భ్యుడు -14

బక దాల్భ్యుడు -14 బృహదారణ్యక ,ఐతరేయ ఆరణ్యకాలలో గాలవ మహర్షి అసలు పేరు వస్తుంది .అతడు విశ్వామిత్రుని కొడుకు .ఒకసారి విశ్వామిత్రుడు చాలాకాలం ఇ౦టికిదూరంగా ఉండాల్సి వచ్చినపుడు ,తన పిల్లలను పోషించటానికి విశ్వామిత్రుడి భార్య పిల్లలో మధ్యవాడిని అమ్మి మిగిలిన వారిని పోషించాలి అనుకొంటుంది .దర్భలతో తాడు పేని ఆ దురదృష్ట వంతుడి మెడకు తగిలించింది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -5 అపార పాండిత్య ,వ్యక్తిత్వ ప్రతిభతో విద్వజ్జన వందితుడైన వాగను శాసన(డిక్టేటర్ ఆఫ్ ఇంగ్లిష్ లిటరేచర్ ) బిరుదాంకితుడు ‘’డాక్టర్ శామ్యూల్ జాన్సన్ తొలి ప్రామాణిక ఇంగ్లిష్ డిక్షనరీ కూర్చాడు .’’ది రా౦బ్లర్ ,’’ది ఐడ్లర్ ,అనే ధార్మిక వ్యాస సంపుటులు ,’’దివానిటి ఆఫ్ ది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-49

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-49  భయంకర బలపరాక్రమ తేజస్సులతో ఉన్నదశకంఠ రావణుడిని వానర వీర హనుమాన్ చూసి ,భయం తొట్రు పాటూ ఏ మాత్రం లేకుండా ,అర్ధవంతమైన మాటలతో ‘’నేను రామదూతనైన ,వానర రాజు సుగ్రీవుని సందేశం తో లంకకు వచ్చాను .నీ సోదరునిలాగా సుగ్రీవుడు నీకు హితుడు .నిన్ను కుశలప్రశ్నలు అడిగాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -13

బక దాల్భ్యుడు -13 స్కంద పురాణం ప్రకారం ప్రజాపతి బ్రహ్మ ఇంద్రద్యుమ్న రాజును స్వర్గం లో కలిశాడు .ఆయనను చేసిన పుణ్యాలు ,పొందిన కీర్తి ని బట్టి ఒక వంద  కల్పాల కాలం భౌతికశరీరం తో స్వర్గం లో ఉండే ట్లు  అనుగ్రహించాడు .తరవాత అంతా భారత౦ లో ఉన్నదే .ఇక్కడ తాబేలు పేరు ‘’మంధరక’’ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -4

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -4 ఆనాటి కవులలో ముఖ్యుడు జాన్ మిల్టన్ .అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులతో ఆయనరాసిన ‘’పారడైజ్ లాస్ట్ ‘’కావ్యం పద్య కావ్య శిరో రత్నం .ఆయనే రాసిన’’లలేగ్రో ,ఇల్ పెన్స రోసో పద్యకావ్యాలు ,కోమస్ నాటకం ‘’లిసిడాస్’’అనే విషాద గీతం ఆయన ప్రతిబా సర్వస్వాలు .జీవిత చరమాంకం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -12

బక దాల్భ్యుడు -12 ధ్యాన కపటి –నిదానం ,తలవంచుకొని ఉండటం ,అకస్మాత్తుగా దాడి చేయటం కొంగ నైజాలు .ఇలాగే ఉండే వాడిని’’ బకవ్రతికుడు’’అంటారు ఇద్దరూ కపటులే.మౌని బకం అంటే ఆలోచనకోల్పోయి ధ్యానం చేసేవాడనీ అర్ధం .వంచన ,ధ్యానం కొంగ సహజాలు .ఆలోచనలో ఉన్నట్లు ధ్యానంలో ఉన్నట్లూ అనిపించినా అది తనను  నమ్మిన చేపలను  హాయిగా గుటకాయస్వాహా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-48

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-48 గోరోచనవర్ణ నేత్రాలు ,మహాతేజస్వి ,వానర శ్రేష్టుడు అయిన హనుమను రావణుడు చూసి సందేహం కలిగి మనసులో ‘’ఇతడు సాక్షాత్తు నందీశ్వరుడు ‘’లాగా ఉన్నాడేమిటి ?’’అనుకొన్నాడు – ‘’’’శంకాహృతాత్మా దధ్యౌ స కపీన్ద్ర౦ తేజసావృతం –కిమేశ భాగావాన్న౦దీ భవే సాక్షా దిహాగతః’’ పూర్వం నేను కైలాసాన్ని పెకలిచినపుడు నాకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -3    అప్పుడే నాటకసాహిత్యానికి గొప్ప ఊపు వచ్చి ,ప్రేక్షకాదరణ పెరిగి  నాటకాలు వచ్చాయి కాని ఇవన్నీ గ్రీకు ప్రేరణతో వచ్చి విజయం పొందలేదు .అప్పుడే స్వతంత్ర ఆలోచన వచ్చి జాన్ లిలీ ,టామాస్ కిడ్ ,జార్జి పీల్ ,ధామస్ లాడ్జ్ ,రాబర్ట్ గ్రీన్ ,ధామస్ నాష్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -11

బక దాల్భ్యుడు -11 శ్రీ కృష్ణుని భార్యల దుర దృష్టాలకు దాల్భ్యుడు ముఖ్యకారణం చెప్పాడు .వారు అసలు అప్సరసలు .అగ్నిహోత్రుని కుమార్తెలు .వారంతా ఒకసారినారదమహర్షి ని తామంతా నారాయణుడిని భర్తగా పొందాలంటే ఏమి చేయాలని అడిగారు .అంటే వీరికి మొదట్లో కృష్ణునిపై ప్రేమ ఉన్నది .తర్వాత వాళ్ళు నారద శాపానికి గురయ్యారు .దీనికికారణం వాళ్ళు ఆయన్ను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-47

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-47   భయంకర మహా పరాక్రమ శాలి హనుమ మనసులో ‘’రావణుడు వచ్చి నాతో యుద్ధం చేస్తాడనుకొని అన్ని ప్రయత్నాలూ చేశాను .కాని ఉన్నచోటు కదలకుండా ఆసనం వీడకుండా కొడుకు ఇంద్రజిత్తు ను పంపి నన్ను బంధించి తెప్పించుకొన్న రాజనీతిజ్ఞుడు ‘’అనుకొని ఆశ్చర్యపడి,రోషం తో కన్ను లెర్రబడి రాక్షసరాజును … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -2 చాసర్ మహాకవి ఇంగ్లీష్ భాషను మహా కావ్య రచనకు అనుకూలంగా సంస్కరించి ,పునరుజ్జీవన ఉద్యమానికి ఊపిరులూది ,ఇతర యూరోపియన్ భాషలలోని మంచి సంప్రదాయాలను స్వీకరించి ,కొత్త అలంకారాలతో భాషకు నగలు సమకూర్చాడు .రసాలంకార కృతులకు మార్గ దర్శిగా నిలిచాడు .డి బుక్ ఆఫ్ ది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -10

  బక దాల్భ్యుడు -10 ద్వైతవన౦ లో  బకదాల్భ్యుడు స్వచ్చమైన వేదమంత్రవేత్తగానే కాక అతడు బ్రాహ్మణుల ప్రాముఖ్యం పై ఒక ఉపన్యాసం కూడా చేశాడు .ఇలా బ్రాహ్మణ విధానంగా ఉండే బకుని వామన పురాణం లో ధృత రాష్ట్ర విషయం లో బ్రాహ్మణ నీతులు కూడా చెప్పినవాడిగా చూపబడింది .జైమినేయ అశ్వమేధ౦  లో అతడు ఉత్తర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-46

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-46 తనకు మండోదరికి జన్మించిన  అక్ష కుమార మరణం తో కుంగినా , నెమ్మదిగా మనసు దిటవు చేసుకొని రావణుడు మేఘనాధుడు అనే తనకొడుకు ఇంద్రజిత్ తో ‘’అస్త్ర శస్త్ర కోవిదుడవు .నీపరాక్రమ౦ సురాసురులకు బాగా తెలుసు .బ్రహ్మను ఆరాధించి బ్రహ్మాస్త్రం పొందావు .దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనిపించుకొన్నావు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -8 ,9

బక దాల్భ్యుడు -8 చైకితాన్య లేక బ్రహ్మదత్త చైకితాన్య పేరు వైదిక సాహిత్యంలోఉపనిషత్తులు ,లేక బ్రాహ్మణాలలో  వినిపిస్తుంది.వారు ఒకరుకాదు ఇద్దరు అనిపిస్తుంది .ఛాందోగ్య ఉపనిషత్ -1.8-9లోమాత్రమే చైకితాన్య దాల్భ్య పేరు మిగిలినవాటిలో బ్రహ్మదత్త లేక దాల్భ్య  పేరు వస్తుంది .కనుక బ్రహ్మదత్తుడు చైకితాన్య దాల్భ్యుడి కొడుకు అయి ఉంటాడు .ఉద్గాత విషయ చర్చలొ  ఈపేరు వచ్చింది.ఈచర్చ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం ఆంగ్లభాష –యాంగిల్స్ ,సాక్సన్స్ అనే జర్మానిక్ జాతిప్రజలు క్రీ,శ 5వ శతాబ్దిలో ఉత్తర ఐరోపా నుంచి వచ్చి ,బ్రిటిష్ దీవుల్ని ఆక్రమించి స్థిరపడ్డారు .వీళ్ళ భాషనే ‘’ఆంగ్లో –శాక్సన్’’భాష అంటారు .దీనికే’’ ఓల్డ్ ఇంగ్లిష్’’ అనే పేరు పెట్టుకొన్నారు .11వ శతాబ్దిలో నార్మన్, ఫ్రెంచ్ దేశస్తులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-45

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-45 పంచ సేనానులు,వారి మహా సైన్యాలు హనుమ చేతిలో పంచత్వం పొందిన స౦గతి  విని ఆగ్రహావేశాలతో తన దృష్టిని  యుద్దోన్మత్తుడు, తనకుమారుడు అక్షకుమారునిపై నిలుపగా అర్ధం చేసుకొన్న అతడు బ్రాహ్మణుల ఆహూతులతో వృద్ధి చెందినదీప్తానలం  లాగా వేగంగా కదలివెళ్ళాడు హనుమపై యుద్ధానికి . ఆహూతులిస్తేనే అగ్ని ప్రజ్వరిల్లుతుంది .లేకపోతె … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-44

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-44  మంత్రి కుమారుల మరణ వార్తవిన్న రావణుడు కొంచెం కలవరపడినా బయట పడకుండా ,అంతకంటే వీరులు దీశాలురు నీతిమంతులు ఐన విరూపాక్ష యూపాక్ష ,దుర్ధర,ప్రఘస,భాసకర్ణుడు అనే అయిదుగురు సేనానాయులను పిలిచి ‘’మీకు తోడుగా అమేయ బలపరాక్రమ సైన్యం వెంటపెట్టుకొని ఆ కోతిపై యుద్ధం చేసి ,వాడిని ఎలాగైనా అదుపులోకి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సైన్స్ ఫిక్షన్ లో మొదటి బహుమతి పొందిన ‘’అమెరికన్ నల్లజాతి నగ’’- ఆక్టేవియా బట్లర్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

సైన్స్ ఫిక్షన్ లో మొదటి బహుమతి పొందిన ‘’అమెరికన్ నల్లజాతి నగ’’- ఆక్టేవియా బట్లర్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  01/06/2020 గబ్బిట దుర్గాప్రసాద్ ఆక్టేవియా ఎస్టేల్లా బట్లర్ 1947జూన్ 22 న అమెరికా కాలిఫోర్నియా లోని పస డేనియాలో పుట్టింది .తండ్రి జేమ్స్ బట్లర్ బూట్ పాలిష్ చేసేవాడు .ఏడేళ్ళకే తండ్రి చనిపోతే ,తల్లి ఆక్టేవియా మార్గరెట్ పెంచింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-43

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-43 రావణ ఆజ్ఞతో అగ్ని తేజులైన ఏడుగురు మంత్రి పుత్రులు హనుమపైకి వచ్చారు .రంగులతోరణాలు అనేక విధాలైన రథాలు తమతమ అసాధారణ చిహ్నాలతో ఉన్న పతాకాలు తో మేఘధ్వనికలిగిస్తూ వచ్చారు .మేలిమి బంగారు విల్లులతో టంకార ధ్వని చేస్తూ ,మెరుపులతో కూడిన మేఘాల్లా దూసుకొచ్చారు .వారి తల్లులకు కి౦కరులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఐ కాంట్ బ్రీద్’’

ఐ కాంట్ బ్రీద్’’ అంటూ నువ్వు అరచిన ఆ ఆరునిమిషాలు ప్రపంచంలో ప్రళయమే రేపింది బూటు కాళ్ళ కింద నలిగిన నీ గొంతు ప్రాణం కోల్పోయినా ప్రకంపనలే సృష్టించింది పోలీసులు ,సైన్యం ఆగ్రహాన్ని ఆపలేవని ప్రపంచం లో ఎన్నో సంఘటనలు రుజూ చేసి గుర్తు చేశాయ్, అయినా నిస్సిగ్గుగా జాత్యంకారం రెచ్చ గొడ్తున్న దేశాధినేత తన … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 107-చైనీస్ సాహిత్యం -4(చివరిభాగం )

ప్రపంచ దేశాలసారస్వతం1 07-చైనీస్ సాహిత్యం -4(చివరిభాగం ) ఆధునికులైన అయిదుగురు  చైనీస్ రచయితలూ వారి రచనలగురించి తెలుసుకొందాం. 1-చిక్సిన్ లియు -2015లో హ్యూగోఅవార్డ్అనే ప్రతిష్టాత్మక అవార్డ్ ను ‘’త్రీ బాడీ ప్రాబ్లెం ‘’ నవలకు  పొందాడు ఇతనిప్రభావం చాలా మంది యువ రచయితలపై ఉంది .ఇందులో ఎర్త్స్ పాస్ట్ ట్రయాలజి ,దిడార్క్ ఫారెస్ట్ ,డెత్స్ ఎండ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -7

బక దాల్భ్యుడు -7 ఋగ్వేదం 10.136.1లో కేశిని అగ్ని వాహకుడిగా ,విషవాహకుడుగా ,రెండులోకాల వాహకుడుగా చెప్పింది-‘’కేశిన్ ఆగ్నిం కేశి విషం ,కేశి భిభర్తి రోదశి’’.వ్రాత్యులను  విష బక్షకులుగా పేర్కొన్నారు చాలాచోట్ల .పిబి 17.1.9’’గరగిరో వా –‘’.ఇదేమంత్రం లో కేశి విషాన్ని రుద్రునితోపాటు అదే పాత్రతో తాగాడు -10.136.7.’’కేశి విషస్య పాత్రేన యద్ రుద్రేనా పిబత్ సహా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-42

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-42 తనబలపరాక్రమాలు చూపి చైత్య ప్రాసాదాన్ని నేలమట్టం చేసి తనవానర సేనా బల వివరాలు తెలియజేస్తూ ,అసలు కపి సైన్యం ఎంతుందో ఖచ్చితంగా రావణుడికి తెలియజేశాడు .అందులో కొందరు ఓఘం సంఖ్యకల ఏనుగుల బలం ఉన్నవారు అన్నాడు .ఓఘం అంటే సముద్రం అనే అర్ధం కూడా ఉంది .సముద్రం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం 107-చైనీస్ సాహిత్యం -3 6-ప్రామాణిక గ్రంథ యుగం -1368-1890-విదేశీ మంగోలులపై తిరుగు బాటు చేసి చైనీయులు 1368లో వాళ్ళను సాగనంపిన మింగ్ వంశనాయకుడు చక్రవర్తి అయ్యాడు .వీరి పాలన 1644వరకు సాగింది .పాలన సుస్థిరమై శాంతిభద్రతలతో దేశం ఉన్నందున మళ్ళీ లలితకళలకు వికాస కలిగింది .కాని సాహిత్యం లో చెప్పుకోదగిన వికాసం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -6

బక దాల్భ్యుడు -6 కేశి అంటే పొడవైన జుట్టు ఉన్నవాడు అనీ , ఆశ్వబలం ఉన్నవాడనిఅర్ధాలున్నాయి .దీర్ఘ కేశాలు పట్టరాని శక్తికి,బ్రహ్మచారికి  సంకేతం .యాగ బృందాలలో వీరికి గౌరవం ఎక్కువ .దాల్భ్య లేక దార్భ్య అంటే దాల్బునికుమారుడు లేక పవిత్ర దర్భకు చిహ్నం .దర్భశతాకిని యాగం చేయలేదు .జైమినేయ బ్రాహ్మణం లో కేశి కి మరోపేరుగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-41

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-41    రావణ కింకరులను హతమార్చిన హనుమ ఇకపై ‘’కిం కర్తవ్యమ్ ‘’అని ఆలోచించి ‘’అశోకాన్ని విరచి శోక వనం చేశాను .ఇక చైత్య ప్రాసాదాల పనిపట్టి నేలమట్టం చేయాలి ‘’అనిమేరుపర్వత శిఖరాయమాన చైత్య ప్రాసాదం ఎక్కి మారుతి మరోమార్తా౦డుడిలాగా ,పారియాత్రం అనే కులపర్వత౦ లాగా భాసి౦చాడు .లంక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment