ఆధునిక మళయా కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -3

ఆధునిక మళయాళ కవిత్రయం లో ముఖ్యుడు  కుమారన్ ఆశాన్ -3

    .డా.పల్పు బెంగుళూరులో ఉంటున్నాడు .ఒక విద్యార్ధికి అయ్యే అన్ని ఖర్చులు భరించి విద్యనేర్పిస్తానని స్వామి తో  అనగా కుమారన్ ను అప్పగించారు స్వామి కుమారన్ ను అక్కడే ఉంచి చిదంబరం మధుర మొదలైన క్షేత్ర సందర్శనానికి వెళ్ళారు.ఆయన్ను ఆ  కుటుంబ సభ్యులు తమ ఇంటిలోని వాడుగా భావించారు .22వ ఏట చామరాజ సంస్కృత కాలేజిలో చేరాడు .హిందువులకు మాత్రమె ప్రవేశం లింగాయతులకూ కూడా ప్రవేశం లేదు .మైసూర్ రాజ్య దివాన్ శేషాద్రి అయ్యర్ డా పల్పుకు బాగా పరిచయం ఉండటమే కారణం .ఈయన ఒక్కడే అప్పుడు బ్రాహ్మణేతర విద్యార్ధి .ఈయన చేరటాన్ని చాలామంది వ్యతిరేకించారు .క్రమంగా వ్యతిరేకత తగ్గింది.నెలకు  రూపాయి ఉపకార వేతనమిస్తున్నారు .నీల కంఠీయం అధ్యయనం చేశాడు .మూడేళ్ళు చదివి తర్క శాస్త్రం ఐచ్చికం గా తీసుకొని న్యాయ విద్వాన్ పరీక్షకు తయారయ్యాడు .మూడు నెలలకొకసారి జరిగే పరీక్షలలో ప్రధముడుగా వచ్చేవాడు .ఫైనల్ పరీక్షలో కూడా అతడే వస్తాడని భావించి మిగిలిన వారు అసూయతో ఆందోళన చేశారు .చివరకు దివాన్ ఆతడిని కాలేజి నుంచి తీసి వేయక తప్పలేదు .అప్పుడే బెంగుళూర్ లో ప్లేగు వ్యాపించింది .విద్యాలయాలు మూసేశారు .పల్పు విదేశాలకు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాడు .తన స్నేహితుడు నంజు౦ డరావు కు ఆశాన్ ను అప్పగించి వెళ్ళాడు .ఈయన వద్దే ఉండిపోయాడు.

  ఆశాన్ మద్రాస్ లో ఒక పండితుడి వద్ద చదువుతూ ఆరు నెలలున్నాడు .ఇది పల్పు కు నచ్చక ఆయన్ను పై చదువులకు కలకత్తా పంపాడు .నెలనెలా అతనికి నంజుండ పది రూపాయలు పంపే ఏర్పాటు. రావు గారికి ఇతని వినయ విధేయతలు నచ్చి మరో మూడు రూపాయలు కలిపి 13రూపాయలు పంపేవాడు ఈ డబ్బంతా పల్పు తీరుస్తాడు ఆయనకు అదీ కండిషన్ .కలకత్తాలో సంస్కృత కళాశాలలో చేరి న్యాయశాస్త్రం తీసుకొన్నాడు .వ్యాకరణం కవిత్వం క్లాసులకూ హాజరయేవాడు తర్క తీర్ధ పరీక్షకు రెండేళ్ళు చదివాడు .రోజుకు 20గంటలు చదువులో గడిపేవాడు .గురువు కామాఖ్యనాద తర్క వాగీశన్ ఇతనిపైఅభిమానం తో సంస్కృత కవితా  రచన చేయమని సలహా ఇచ్చేవాడు.రాసే సమయం దొరికేదికాదు .కానీ మళయాళ పత్రిక లకు ‘’ఒరువంగ దేశికన్ ‘’అంటే ఒక బెంగాలీవిద్యార్ధి  అనే పేరుతొ రచనలు రాసేవాడు .

  కలకత్తాలో 1900లో ప్లేగు వలన కూడా ఫైనల్ పరీక్ష రాయలేకపోయాడు.కాలేజీలు మూసేస్తే నగరం వదిలేయాల్సి వచ్చి,బెంగుళూరు వెళ్లి డా పల్పుతోకలిసి తిరువనంతపురం చేరాడు .కేరళవదిలి వెళ్ళిన అయిదేళ్ళుఆయన కరీర్ లో నిష్ప్రయోజకమే అయింది .కానే బెంగాలీ కన్నడ తమిళ సాహిత్యాలలో గొప్ప పరిచయం కలిగింది . సంస్కృత ఆంగ్లాలలో  కృషిచేసే అవకాశం కలిగింది  .ఆశాన్ కలకత్తాలో ఉండగా  రవీంద్ర నాథ టాగూర్  వయసు 40.ఆయన కాల్పనిక కవితలు అప్పటికే విస్తృతంగా ప్రచారమయ్యాయి .బెంగాలీ సాహిత్యం పై కాలనికోద్యమ ప్రభావం బలంగా ఉంది .టాగూర్ పై’’ దివ్యకోకిలం ‘’ కవితరాసి తన ఆరాధన వ్యక్తం చేశాడు .దీన్ని 1922లో టాగూర్ కేరళ వచ్చినప్పుడు చదివి వినిపించి సమర్పించాడు .సంస్కృతం లో ‘’స్వాగత పంచకం ‘’రాసి టాగూర్ ఆల్వే లోనిఅద్వైతాశ్రమం సందర్శించినప్పుడు సమర్పించాడు .షెల్లీ కీట్స్ బ్రౌనింగ్ కవితలన్నీ పరామర్శించాడు .

  గరిసప్ప నది గురించి ఆశాన్ ఒక కావ్యఖండిక రాశాడు .పల్పును ఆయన కుటుంబాన్ని ఇక్కడే కలుసుకొన్నాడు .ఇది బెంగుళూరు వదిలిన 11ఏళ్లకు జరిగింది .కావ్యఖండికలో ఇదొక మధురస్మృతి .కలకత్తాలో ఒక బ్రాహ్మనణులింట్లో అద్దేకుండేవాడు.ఆకకుటుంబానికి  అతనంటే మహా ఇష్టం .కలకత్తా వదిలేటప్పుడు ఆకుటుంబం అంతా స్టేషన్ కు వచ్చి వీడ్కోలు చెప్పి ,రైలు కనుమరుగయ్యెవరకుఅలా చూస్తూనే ఉన్నారు వాళ్ళు .కొంతకాలం అక్కడే ఉంటె ఒక బెంగాలీ అమ్మాయిని తప్పక పెళ్లి చేసుకొనే వాడిని అని చెప్పేవాడు ఆశాన్ .

  కులం పిలిచింది

కలకత్తా వదిలి27వ ఏట  కేరళచేరి మళ్ళీ నారాయణ గురు ఆశ్రమ లో ఉన్నాడు .1902 లో ‘’నారాయణ ధర్మ పరిపాలనా యోగం ‘’సంస్థ ను రిజిస్టర్ చేశారు .స్వామి అధ్యక్షులు డా పల్పుఉపాధ్యక్షుడు ఆశాన్ కార్యదర్శిగా అందరూ ఏక గ్రీవంగా ఎన్నుకొన్నారు.కార్యాలయం త్రివేండ్రం లో పెట్టారు .ఆశాన్ తన శక్తియుక్తులన్నీ ధారపోసి కొద్దికాలం లోనే సంస్థను అన్ని విధాలా అభి వృద్ధి చేశాడు  .జీవితమంతా తన ఈజవ కుల అభి వృద్ధికి అంకితం చేయాలని భావించాడు .మత సాంఘిక విద్యా విషయాలపై సంస్థ దృష్టి కేంద్రీకరించింది .తనకులం వారు మూక ఉమ్మడిగా ఇతర మతాలలో చేరటం పల్పు,ఆశాన్ జీర్ణించుకోలేక పోయారు .’’తీయాలు తీయాలుగా ‘’ఉంటూ తలెత్తుకు తిరగాలి అని ప్రబోధించారు .సంస్థ ఆరవ వార్షిక సభలో పల్పుఅధ్యక్షోపన్యాసం లో 20వ వార్షిక సభలో ఆశాన్ అధ్యక్షోపన్యాసం లో ఈ విషయమే నొక్కి వక్కాణించారు .

  సంస్థ కార్యదర్శిగా కేరళ అంటా తిరిగి సొసైటీలు నెలకొల్పి ఉపన్యాసాలిచ్చి  విభేదాలు  తొలగించి క్షణం తీరికా లేకుండా గడిపాడు ఆశాన్ .దీనితోపాటు వివేకోదయం పత్రిక సంపాదకత్వం ,ప్రచురణ బాధ్యతా ఆయనపైనే పెట్టారు . ఈ పత్రిక ను ‘’ఈజవ గెజిట్ ‘’అని ఆప్యాయంగా గౌరవంగా పిలిచేవారు .మొదటిసంచిక 1904లో వెలువడింది .కేరళ సాహితీ ప్రియులకు ఈపత్రిక గొప్ప వేదికగా మారింది .సాహిత్య సాంఘిక రాజకీయ రంగాలలో ఈ పత్రిక చిరస్మరణీయ కృషి చేసింది .యోగం సంస్థ వార్షిక సమావేశాలలో రెండు పారిశ్రామిక ప్రదర్శనలు కూడాపల్పుఆలోచనపై  ఏర్పాటు చేయించేవాడు ఆశాన్ . మొదటి సభ కొల్లాంలో 1904లో,రెండవది కన్నూరులో  జరిగాయి .

  కవితా రచనలు

యోగం కార్యదర్శి కాకముందే ఆశాన్ సౌందర్యలహరి అనువాదం శివస్తోత్రమాల ,మేఘసందేశం –అసంపూర్ణం ,విచిత్ర విజయం నాటకం ,ప్రబోధ చంద్రోదయం అనువాదం రాశాడు .విచిత్ర విజయం 1902 సెప్టెంబర్ 19ప్రారంభించాడు ఎప్పుడు పూర్తీ చేశాడో తెలియదు .జనంలో బాగా ప్రచారమైనా ప్రచురించటానికిఇష్ట పడ లేదాయన .మరణానంతరం  ప్రచురితమైంది .దీనికి ప్రచీనగాథ ఆధారం .రాలిన పూవు కావ్యం తో కవితా జగత్తులో కాలుపెట్టాడు .రసజ్ఞులను పులకి౦ప జేసింది .41శ్లోకాలున్నాయి .ఆధునిక మళయాళ చరిత్రలో ఇదొక మహత్తర సంఘటన . మార్కొత్ కుమారన్ నిర్వహించే ‘’మితవాది ‘’పత్రికలో ప్రచురితాలై విశేషంగా ఆకర్షించిన శ్లోకాలివి .సి ఎస్ సుబ్రహ్మణ్య పొట్టి దీనికి రాసిన ముందు మాటలు మహా గొప్పగా కావ్యవిలువను మరింత పెంచేవిగా ఉన్నాయి .సాహిత్య రాజపోషకుడు కేరళవర్మ తమ్పురాన్ ‘’పాఠ్య గ్రంధంగా ‘’నిర్ణయించటానికి తోడ్పడ్డాడు .వీణపూవుకావ్యం మళయాళ కవిత్వం లో గొప్ప మార్పు తెచ్చింది ఆరాధనీయమైంది .నూతన శైలికి నా౦దిపలికింది .నవ్యత్వం మార్దవం సున్నితత్వం తో దూసుకు పోయిన కావ్యం ఇది .రాలిన పూవుపైరాసిన కావ్యం. ఆ భావనే నూతనం .మనకరుణ కూడా కోస్తున్నపూలు చెప్పే మనోవ్యధపై లఘు కావ్యం రాశారు కదా . శ్రీ పాల్ఘాట్ లో 1908లో కొన్ని నెలలు నిర్బంధం లో ఉన్నప్పుడు దీన్ని రాశానని ఆశాన్ చెప్పాడు .విశేషాలు తర్వాత తెలుసుకొందాం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-2-22-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.