Category Archives: పుస్తకాలు

ప్రపంచ దేశాల సారస్వతం  26-  మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం  26-  మాలి (ఆఫ్ర్రికన్ )సాహిత్యం మాలి అధికారికంగా ” రిపబ్లిక్ ఆఫ్ మాలి ” అని పిలువబడుతుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం. భౌగోళికంగా పశ్చిమ ఆఫ్రికను క్రాటనులో భాగంగా ఉంది. వైశాల్యపరంగా మాలి ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా ఉంది. దేశవైశాల్యం 1,240,000 చదరపు కిలో మీటర్లు (480,000 చదరపు మైలు) ఉంది. … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం  25-లాటిన్ సాహిత్యం -2(చివరి భాగం )

ప్రపంచ దేశాల సారస్వతం  25-లాటిన్ సాహిత్యం -2(చివరి భాగం ) క్రీ.శ.14-117వరకున్నకాలం లాటిన్  సాహిత్యానికి ‘’రజత యుగం ‘’.  ఉత్తమ శ్రేణి వచన రచనలొచ్చాయి..తాసి తుస్ -35-118,సుయెతోనియుస్-75-160లు చరిత్రను వైజ్ఞానిక దృష్టితో పరిశీలించి రాశారు సంప్రదాయం పాటిస్తూ చరిత్రరాశాడు ప్లిని. ఈ యుగం లో వ్యాజస్తుతి ,నిందాత్మక రచనలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .సమాజాన్ని ఎడా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 24-పోలిష్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 24-పోలిష్  సాహిత్యం పోలిష్ భాష –ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం లో స్లోవోనిక్ వర్గానికి చెందింది పోలిష్ భాష .పోలాండ్ దేశం లోనే కాక ఈ దేశవాసులు వలస వెళ్ళిన అమెరికా ,ఫ్రాన్స్ లలోకూడా ఇదే వారికి భాష .ఇందులో ఏడు మాండలికాలున్నాయి .ఇవి గ్రాంధిక భాషకు దగ్గరగానే ఉంటాయి . సాహిత్యం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 23-డచ్ సాహిత్యం

డచ్ భాష -ఇండో యూరోపియన్ భాషా కుటుంబం లో జర్మానిక్ వర్గ పడమటి శాఖకు చెందింది డచ్ భాష .హాలండ్ లో ఎక్కువభాగం ,ఉత్తర ఫ్రాన్స్ లో కొన్నిభాగాలలో డచ్ మాతృభాష .దక్షిణాఫ్రికా బోయర్ల భాష ఐన ఆఫ్రికాన్స్ కూడా డచ్ భాషయే.ఇందులో ఒక మాండలికంగా ఉన్న ఫ్లెమింగ్ 1200 నుంచి స్వతంత్ర భాషా ప్రతిపత్తి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 22-  ఇటాలియన్  సాహిత్యం -2(చివరి భాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 22-  ఇటాలియన్  సాహిత్యం -2(చివరి భాగం ) నిత్య జీవిత సమస్యలతో బాందేల్లో నావెల్లాలు రాశాడు .దానినుంచే నవల పేరు వచ్చింది షేక్స్పియర్ నాటకాలకు ఇటాలియన్ నవలలే ప్రేరణ .నాటకాలు రాసినవారు రేసేల్లె ,జిరాల్డీ,స్పెరోనీ మున్నగువారు .మాకియవిల్లీ మాన్ద్రగోలా  బ్రూనో రాసిన ఇల కాండేలాయియో నాటకాలు ప్రసిద్ధాలు అరియోస్తో ‘’ఓర్లాండో పూరియోనో ‘’ప్రబంధం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -2(చివరిభాగం ) ఖసీదాలను ప్రాచీన పద్ధతిలో రాసే అబూ హమ్మాం -845అల్ బుహతురి -897ముఖ్యులు .సిరియా నుంచి బాగ్దాద్ వచ్చి రాజాశ్రయం పొంది ,అక్కడే ఉండి’’అల్-హసన్ ‘’అనే స్పుట గేయ సంకలనం సమకూర్చారు .అప్పుడే స్పెయిన్ లో మువా షాహ్,జజాల్ అనే ఇద్దరు కొత్త కావ్యశైలి కవిత్వం రాశారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  2-ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -1

  21-ప్రపంచ దేశాల సారస్వతం 21-అరబ్బీ సాహిత్యం -1 అరబ్బీ భాష –క్రీ .పూ.4వేల సంవత్సరాల క్రితమే ఆరబ్ నాగరికత ఉందని ,క్రీ.పూ.6వేలు నాటికే అక్కడి నాగరకత ,సంస్కృతీ ఉచ్చ స్థితి లో ఉన్నాయని పురాతత్వ పరిశోధనవలన తెలుస్తోంది .అరెబిక్ భాష సెమెటిక్ భాషా కుటుంబానికి చెందింది .ఉత్తర అరబ్ దేశం లోనగర సంస్కృతికి నిలయమైన అరబ్బీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కమ్మని కాఫీ ఇచ్చిన చేత్తోనే ముకుంద కంద మాల అల్లిన’’ కాశిరాజు ‘’

కమ్మని కాఫీ ఇచ్చిన చేత్తోనే ముకుంద కంద మాల అల్లిన’’ కాశిరాజు ‘’ నాకు పరిచయం లేకపోయినా మళ్ళీ రెండు కవితా పొత్తాలుపంపారు శ్రీ కాశీరాజు లక్ష్మీనారాయణ పండిత కవి .ధన్యవాదాలు .రెండూ 2019జులై లో విడుదలైన తాజా పుస్తకాలే .మొదటిది ‘’కాఫీ శతకం ‘’రెండోది ‘’ముకుంద శతకం ‘’.మొన్న 6వ తేదీ అందగా ఇవాళ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

లేఖ సాహితి వారి మూడు ఆణిముత్యాలు

 లేఖ సాహితి వారి మూడు ఆణిముత్యాలు మిత్రులు ,శ్రీలేఖ సాహితి సంస్థ అధ్యక్షులుడా. శ్రీమాన్ తిరుకోవలూర్ శ్రీరంగస్వామి గతవారంనాకు సంస్థ ప్రచురించిన  మూడు పుస్తకాలు పంపారు . అంది, చదివే సావకాశం లేక 28రాత్రి హైదారాబాద్ వస్తూ నాతో తెచ్చుకొని ,ఆది సోమవారాలలో చదివాను .వాటి గురించి నాలుగు మాటలు రాయటం ధర్మం అని భావించి ప్రయత్నిస్తున్నాను . 1-తెలంగాణా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గుండె లోతుల్లోంచి ఉబికిన’’ తెలుగు బిడ్డ ‘

గుండె లోతుల్లోంచి ఉబికిన’’ తెలుగు బిడ్డ ‘’ స్వతహాగా తెలుగు పండితుడు , కవి  సరసభారతికి, నాకూ దశాబ్ద కాలం గా పరిచయము  న్నవాడు ,మా కార్యదర్శి శ్రీమతి శివ లక్ష్మి తమ్ముడు, చి .యల్లాప్రగడ వెంకట రామరాజు లోకాన్ని తనకళ్ళతో చూసి అనుభూతి పొంది రాసిన శతకం ఇది .మనకూ అలాగే కనిపిస్తుంది సత్యవాక్కులే … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కాశీ’’వారి వేంకటేశ్వర శతకం

  కాశీ’’వారి వేంకటేశ్వర శతకం శ్రీ కాశిరాజు లక్ష్మీ నారాయణ రచించి ,పోరంకి భద్ర గిరి-ధ్రువ కోకిల బృందం 2020 జనవరి లో ప్రచురించి  నాకు ఆత్మీయంగా పంపిన శ్రీ వేంకటేశ్వర శతకం ఇవాళ మహా శివ రాత్రి పర్వదినాన అందటం ,ఉదయం 11-30వరకు పూజాదికాలు ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,బిల్వార్చనాదులతో సరిపోవటం  భోజనం చేసి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 19-హిబ్రూ సాహిత్యం -2

                   ప్రపంచ దేశాల సారస్వతం               19-హిబ్రూ సాహిత్యం -2 అరబ్బులప్రభావంతో హిబ్రు సాహిత్యానికి స్వర్ణయుగం  సాడియా వెన్ జొసెఫ్-892-942  కవిత్వం తో ప్రారంభమైంది ..21వయసులో బహుముఖీన ప్రతిభతో మొదటి కోశం రాశాడు .అదే ప్రార్ధనలతో ఉన్న’’సిడ్డూర్’’ ప్రధాన గ్రంథం.హిబ్రు వ్యాకర్తలలో కూడా ఇతడే ప్రధానుడు .ఇతడు  రాసిన విశ్వాసాలు ,సిద్ధాంతాల గ్రంథం’’ఎమినోథ్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-14

కిరాతార్జునీయం-14 ద్రౌపది అర్జునుని సాగనంపుతూ ఇలా అంటోంది –‘’వేద వ్యాస హితవు ననుసరించి తపస్సు చేసి ఫలసిద్ధిపొంది ,శత్రు సంహారం చేసి మమ్మల్ని సంతోష పెట్టు .ఇదే నాకోరిక .నువ్వు కృత కృత్యుడవై వచ్చాక సంతోషం తో నిన్ను గాఢాలింగనం చేసుకొంటాను .కృత కృత్యుడు కాని వారిని కౌగిలించుకోవటానికి నా మనస్సు అంగీకరించదు.ఇలా యాజ్ఞ సేని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం భాష –సింహలీ భాష ఇండో –యూరోపియన్ భాషా కుటుంబానికి  చెందిన పాళీ భాషనుంచి పుట్టింది .సింహలి లిపి కూడా బ్రాహ్మీ లిపి నుంచే వచ్చింది.    సాహిత్యం –క్రీ పూ .3వ శతాబ్దం నాటికే సాహిత్య రచన ఉన్నా మొదటి రచనమాత్రం సీగిరియా దుర్గం లోని ఒక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-13

కిరాతార్జునీయం-13 అర్జునుడు ఇంద్రకీలాద్రిపై  తపస్సు చేయటానికి వెళ్ళబోగా దుఖం భరించలేని ద్రౌపదీ దేవి కన్నీరు నిండగా  ,నల్లకలవలపై మంచు బిందువుల సమూహం ఉన్నట్లు ,నేత్రాలు విప్పటానికి ప్రతిబంధకమై ,మూసుకొంటే కన్నీరు రాలి అమంగళకరం అవుతుందనే సందేహంతో మూసుకోలేకపోయింది .నిర్మామైన సహజప్రేమకల ఆమె చూపు ను దారిబత్తెంగా అర్జునుడు గ్రహించాడు .అర్జునుని చేరి  గద్గద కంఠం తో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సాహిత్యం 15-బర్మీస్ సాహిత్యం

ప్రపంచ దేశాల సాహిత్యం 15-బర్మీస్ సాహిత్యం భాష –చీనో-టిబెట్ భాషాకుటుంబానికి చెందింది .పదాలు దాదాపు ఏకాక్షరాలే. స్వరాన్ని బట్టి ఒకే పదానికి వేర్వేరు అర్ధాలు వస్తాయి .దీనిలోని మాండలీకాలు –అరకానీజ్ ,దాను ,ఇంథా,అ త్సి,లాషి ,మారు మొదలైనవి .భారతీయ పాళీబాష బర్మీయులకు పరమ పవిత్రభాషకనుక లిపిగా దానినేఉపయొగిస్తారు.   సాహిత్యం –ప్రాచీన సాహిత్యం శిలాఫలకాలలో దొరుకుతుంది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-11

కిరాతార్జునీయం-11 ఈ విధంగా శత్రువులచే పొందిన అపకారం, అవమానాలకు క్షుభితుడైన భీమసేనుడిని పరమ శాంత, రాజనీతి విషయాలతో యుధిష్టిరుడు ఊరడిస్తున్న సమయంలో కోరిన మనోరధం మూర్తీభవించి తనంత తానె వచ్చినట్లు  వేదవ్యాసమహర్షి అరుదెంచాడు .పరస్పర విరోధం కల పశు పక్ష్యాదులను తన శాంత దృష్టితో విరోధం పోగొట్టి ,ప్రేమకలిగిస్తూ ,సమస్త పాపక్షయ కర తేజస్సు వెదజల్లుతూ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-10

కిరాతార్జునీయం10 ధర్మరాజు’’ శాంతరసం’’ తో భీముని ‘’తలంటుతున్నాడు ‘’-‘’మనం శాంతంగా ఉంటె దుర్యోధనుడు రాజులందర్నీ తనవైపు త్రిప్పుకో కుండా ఉంటాడని అనుకో రాదు .యాదవులకు మనపై ఆదరం ఎక్కువ .మనకూ వారిపై ప్రేముంది .వాళ్ళు మానవంతులలో అగ్రేసరులు .వాళ్ళు మనల్ని వదలి దుర్యోధనుడిని ఆశ్రయించరు.వాళ్ళు ఖచ్చితంగా మన పక్షమే సందేహం లేదు .వారివలన మనకు అసాధ్యం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం 3

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం 3 సెల్జూకులు –వీరికాలం లో సుప్రసిద్ధ సాహిత్యోపాసకుడు వజీర్ అబుల్ హసన్ అనే నిజాముల్ ముల్క్ .ఈయన పాలనా కళా వైభవాన్ని ‘’సత్ నామా ‘’గ్రంథం లో వివరించాడు .పారశీ సాహిత్యమంతా సూఫీ సిద్ధాంతం పైనే ఆధార పడి ఉంది .ఈ ఉద్యమ మొదటికవి అబూ సయీద్ ఖైర్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-9

కిరాతార్జునీయం-9 భీముడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ఈ పాటికి నువ్వు ప్రయత్నం చేసి ఉ౦ టే శత్రువు ఆపదలపాలై ఉండే వాడు .నువ్వుకదిలితే నాలుగు దిక్కులా నాలుగు మహాసుద్రాలులాగా నీ సోదరులం సిద్ధంగా ఉన్నాం .నిన్నూ , మమ్మల్ని ఎదిరించేవాడులేడు.చివరగా ఒక్కమాట –బహుకాలం గా బాధలు భరించి విసిగి వేసారి  ఉండటం వలన నీలో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-8

కిరాతార్జునీయం-8 పౌరుషహీనుడికి అనర్ధాలు ఒకదానిపై ఒకటి దాపరిస్తాయి .నిరుద్యోగికి పౌరుషహీనుకి సంపదలు నిలవవు .సమయం కోసం ఎదురు చూడటం నిరర్ధకం .కపటబుద్ధి కి రుజుమార్గ ప్రవర్తన ఉండదు .13ఏళ్ళుగా అనుభవిస్తున్న ఐశ్వర్యాన్ని వదులుకొనే బుద్ధిహీనుడుకాడు మనశత్రువు .యుద్ధం చేయకపోతే మన రాజ్యం మనకు ఇవ్వడు ,ఎప్పుడో చేయటం కంటే ఇప్పుడే యుద్ధం చేసి మనరాజ్యం దక్కించుకోవాలి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం భాష –క్రీ.పూ 6వ శతాబ్ది నుంచి పారశీక భాష ఉన్నట్లు తెలుస్తోంది .ఇప్పుడు ఇరాను దేశం లో వాడుక భాష ,శాసనసభ విశ్వవిద్యాలయ బోధనకు,అధికార ప్రకటనలకు ,పత్రికలకు సామాన్య సాహిత్యానికీ  అదే భాష .అభయ మెనిడ్ రాజులచేత వాళ్ళ స్మారక చిహ్నాలలో రాయబడిన పాత పారశీకమే ఇది .బెహిస్తూన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కిరాతార్జునీయం-7

కిరాతార్జునీయం-7              ద్వితీయ సర్గ ద్రౌపది ధర్మారాజుతో చెప్పినమాటలలో సారం ఉన్నదని గ్రహించి భీముడు అన్నగారితో ‘’ప్రభూ !క్షత్రియ సంజాత ద్రౌపది మనపై ఉన్న అభిమానంతో బాగా ఆలోచించి మన అభి వృద్ధి కోరి బృహస్పతి అయినా ఇలా పలకగలడా అన్నట్లు యుక్తి యుక్తంగా ,సశాస్త్రీయంగా చెప్పింది.అవి ఆశ్చర్యజనకాలు కనుక ఆమె మాటలు గ్రాహ్యాలు .అగాధమైన … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 13-టర్కిష్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వత౦ 13-టర్కిష్ సాహిత్యం టర్కీభాష –టర్కీ బాష ను తుర్కి ,తర్కీష్ ,టర్క్ అనీ అంటారు .క్రీశ 6వ శతాబ్దానికే మధ్య ఆసియాలో ఈభాష వాడుకలో ఉందని శాసనాలు చైనా చరిత్ర చెబుతున్నాయి .అక్కడినుంచి ఇతరప్రాంతాలకు వెళ్లి వాటిని యించి స్థిరవాసం ఏర్పరచుకొని భాషావ్యాప్తి చేశారు  .ఇందియావంటి దేశాల్లో కాలక్రమలో అంతరించింది సోవియెట్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కిరాతార్జునీయం-6

కిరాతార్జునీయం-6 ద్రౌపది పలికినపలుకులు ములుకుల్లా తాకినా నిబ్బరంగా తన సహజశాంత స్వభావంతో యుధిష్టిరుడు ఇలా బదులు పలికాడు –‘’ద్రౌపదీ !నువ్వు ఇంతగా విచారి౦చటానికి  కారణం కనబడటం లేదు .నాకు ఏ ఆపదా లేదు .వ్యర్ధంగా విచారిస్తే నీకొచ్చే ఆపద ఏమిటో చెబుతావిను .నువ్వు ఇదివరకు  అంతః పురం లో   హంసతూలికాతల్పం పై శయనించి ఉంటె వైతాళికులు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 12-ధాయ్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వత౦ 12-ధాయ్ సాహిత్యం               ధాయ్ భాష ధాయ్ భాషనే సయమీస్ భాష అని అంటారు .చీనో –టిబెటన్ భాషా కుటుంబానికి చెందిన భాష .ఆ కుటుంబంలోని మిగాతాభాషల లాగానే  విశ్లేషిత పదరూపం లో ఉంటుంది .ఇందులో పదాలన్నీ ఏకాక్షరాలే .చైనా పదాల్లాగా వాక్యం లో పదాలు తమకున్న స్థానాన్ని బట్టి ,ఏ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కిరాతార్జునీయం-5

కిరాతార్జునీయం-5 ద్రౌపది ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతోంది ‘’దేవేంద్ర విభవ సమానులైన మీవంశంలో భరతుడు మొదలైన రాజుల చే చిరకాలం అవిచ్చిన్నంగా పాలింపబడిన భూమండలం నేడు నువ్వు మదపు టేనుగు పూలదండ ను పీకేసినట్లు నువ్వే నిష్కారణంగా కోల్పోయావు నీ ఔదాసీన్యం వలననే ఇన్ని కస్టాలుకలిగాయి .ఈ అనర్దాలన్నిటినీ పరిహరించటానికి ,శత్రు సంహారం చేసి ,మమ్మల్ని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం11-  జపనీస్ సాహిత్యం -6(చివరిభాగం )

11-  జపనీస్ సాహిత్యం -6(చివరిభాగం ) పైషో-షోవా యుగం (1912నుంచి ) మొదటిప్రపంచ యుద్ధం మొదలైన  దగ్గర్నుంచి జపాన్ లో  మత సంబంధ సాహిత్యం  ప్రచారం లో ఉంటూ ‘’కాగవాటో గొహికో’’అనే  క్రైస్తవవమంత్రి సాహిత్యం ద్వారా మానవ సేవ బోధించాడు .షిపెన్నోకోఎపే-1920,పై యావోఇరు మోనో -1921అనే ప్రసిద్ధ నవలలు రాశాడు .నాటకకర్త మొనోజో షుక్కెటుసోనో డేషి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-4

కిరాతార్జునీయం-4 ధర్మరాజుకు వనచరుడుఇంకా ఇలా చెప్పాడు ‘’రాజా !దుర్యోధనుని ఆజ్ఞను రాజులంతా పూలదండ లాగా శిరసావహిస్తూ ,అతడు ధనుస్సు ఎక్కు పెట్టటంకాని  ,కోపం తో ముఖం  చిట్లించటం కానీ చేయకుండా ప్రశాంతత కలిగిస్తున్నారు .రాజు మనసులో అనుకొన్న పని అతిశీఘ్రంగా నెరవేరుస్తున్నారు . ‘’స యౌవ రాజయ్ నవ యవ్వనోద్ధతం –నిధాయ దుశ్శాసన  మిద్ద శాసనం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -5

11-  జపనీస్ సాహిత్యం -5 1885 నుండి జపానీయులు పాశ్చాత్య వ్యామోహాన్ని తగ్గించుకొని స్వీయ సంస్కృతిని అవలంబించటం ప్రారంభించారు .ఎర్నెస్ట్ ఫెనోల్లాసా అనే పాశ్చాత్యుడు దేశీయ లలితకళల పునః పరిశీలనకు దారి చూపాడు .దేశీయ రచనలకు రచయితలూ ఆసక్తి చూపారు .ఒకరకంగా రాబోయే నవోదయానికి ఈ యుగం ఉషస్సు వంటిది .   మొయిజిసారస్వత చరిత్రలో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-3

కిరాతార్జునీయం-3 వనచరుడు ధర్మరాజుతో ‘’రాజా !ప్రజలను దండించటం ,క్రోధంగా చూడటం చేయకుండా విజ్ఞులకు తెలియ జేసి  వారికి నేరవిషయాలు తెలిపి న్యాయశాస్త్రపరంగా విమర్శ చేయించి శత్రు ,మిత్ర భేదం లేకుండా ఇంద్రియాలను వశంలో ఉంచుకొని తగినశిక్ష విధిస్తున్నాడు .దీనితో ప్రజలకు మరీదగ్గరై వారు మిక్కిలి భక్తి ప్రకటిస్తున్నారు .(అంటే ఈకాలం నాటి కౌన్సెలింగ్ చేయి౦చా డన్నమాట).తనరాజ్యం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం

ఈడో యుగం లో 31అక్షరాల టంకా పద్యం కంటే చిన్నదైన ‘’హైకూ ‘’లేక హొక్కుపద్యం బాగా ప్రచారం లో ఉంది .టంకా లోని చివరి 14 అక్షరాలూ తీసేస్తే హైకూ ఏర్పడుతుంది .ఒక రుతువునుకాని ,పరాశ్రయభావాన్నికాని వర్ణించటానికి దీన్ని వాడుతారు .జపాన్ సారస్వత గుణ సంపన్నత టంకా ,హైకూ లలో గోచరిస్తుంది .ప్రకృతి బాహ్య సౌందర్యాన్ని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-2

కిరాతార్జునీయం-2 ధర్మరాజు రహస్య ప్రదేశం లో కూర్చుని శత్రు సంహార విధానం పై ఆలోచిస్తుండగా  ఆ వనచరుడు దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’ప్రభూ !మీ అనుజ్ఞ ఐతే నాకు తెలిసిన విషయాలు విన్నవిస్తాను ‘’అనగానే అలాగే చెప్పమని ధర్మరాజనగానే వాడు ‘’రాజకార్యం కోసం నియమిప బడినవాడు ,ప్రభువుకు ఆగ్రహం కలిగితే తమకు ముప్పు జరుగుతుందని భయంతో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -3 ఈడో యుగం (1603-1868)-16వ శతాబ్ది చివరికి అంతర్యుద్ధాలు పూర్త యి ,శక్తి వంతమైన ప్రభుత్వమేర్పడి రాజాధాని రాజకీయ ,సాంస్కృతిక కేంద్రమైన ‘’ఈడో’’అంటే క్యోటో కు మారింది .ఈకాలపు సాహిత్యమే ఈడో యుగ సాహిత్యం .16వ శతాబ్ది ప్రారంభం లో జపాన్  పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఏర్పరచు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం

కిరాతార్జునీయం సాహితీ బంధువులకు పవిత్ర మాఘమాసం ప్రారంభ శుభ కామనలు.ఈ మాఘమాసంలో సంస్కృతంలో భారవి మహాకవి రచించిన ‘’కిరాతార్జునీయం ‘’కావ్యాన్ని ధారావాహికంగా రాయాలని ప్రయత్నిస్తున్నాను .పెద్దగా సంస్కృత శ్లోకాల జోలికి పోకుండా శ్లోక భావాలను తెలుపుతూ సరళంగా అందరికి చేరువ చేసే విధంగా రాయాలని ప్రయత్నం .అద్భుతశ్లోకాలకు అవసరమైన చోట్ల వివరణ ఇస్తాను . దీనికి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2 కామకూరా యుగం (1192-1332)12వ శతాబ్దిలో జపాన్ లో జరిగిన అంతర్యుద్ధం లో ‘’మినమోటోస్’’వర్గం జయించి రాజధానిని కామకూరాకు మార్చారు కనుకనే ఆపేరు ఈయుగానికి వచ్చింది .ఒకరకంగా సైనికయుగం ఇది .మతం మీద ఆసక్తిపెరిగి మతగ్రందాలే ఎక్కువగా వచ్చాయి .చైనా నుంచి దిగుమతి అయిన ‘’జెన్ మతం ‘’బాగా … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆ”పాత”మధురాలు 11 

ఆ”పాత”మధురాలు 11 మా అమ్మాయి చి సౌ విజయలక్ష్మి కి డెట్రాయిట్ దగ్గర ట్రాయ్ లో 2005 డిసెంబర్ 9న ఒక నిమిషం తేడాతో జన్మించిన ”ట్విన్స్ ”చి ఆశుతోష్ ,చి  పీయూష్  ల బాల్యచిత్రాలు 1-హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన ట్విన్స్ తో  మా అమ్మాయి విజ్జి    తర్వాత ఇంట్లో వాళ్ళిద్దరితో , 2-చిన్నారి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 10- ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 10-  ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం ) ఆలివర్ గోల్డ్ స్మిత్ వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలతో ప్రసిద్ధుడయ్యాడు.గోప్పకవికూడా . రాబర్ట్ బర్న్స్ స్థానిక రచయితగా ప్రసిద్ధుడు. డబ్లిన్ లో పుట్టిన ఎడ్మండ్ బర్క్ హౌస్ ఆఫ్ కామన్స్ కు విగ్ పార్టీ ప్రతినిధి,గొప్ప ఆరేటర్ ఫిలసాఫికల్ రచనలు చాలా చేశాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -1 జపనీస్ భాష జపనీస్-కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని కొందరు కాదు ఆ రెండిటికి  సంబంధమే లేదని కొందరు భావించారు .ఈ భాష సంయుక్త పద రూపం లో ఉండటం విశేషం .క్రీశ 1వ శతాబ్దికే ఈ భాష రూపొందింది .5వశతాబ్దం నాటికి చైనా భాషతో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 10-  ఐరిష్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 10-  ఐరిష్ సాహిత్యం -1 ఐర్లాండ్ దేశం లో ఐరిష్ ,లాటిన్ ఇంగ్లిష్ భాషలలో వచ్చిన సాహిత్యమే ఐరిష్ సాహిత్యం .పశ్చిమ యూరప్ లో గ్రీకు లాటిన్ లతర్వాత  చాలాప్రాచీనభాష ఐరిష్ భాష .5వ శతాబ్దిలో క్రైస్తవం వచ్చాక బాగా వ్యాప్తి చెందింది .అంతకు ముందు చాలాసరళమైన ‘’ఒఘన్ ‘’భాష శాసనాలలో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

9-స్కాటిష్ సాహిత్యం

9-స్కాటిష్ సాహిత్యం స్కాట్ లాండ్ దేశం లో స్కాటిష్ ప్రజల చేత రచి౦ప బడినదేదే స్కాటిష్ సాహిత్యం .ఇది ఇంగ్లిష్ ,స్కాతిక్ గేతిక్,స్కాట్స్ ,బ్రితోనిక్,ఫ్రెంచ్ ,లాటిన్ ,నార్మ్ మొదలైన స్కాట్ లాండ్ సరిహద్దులలో ఉన్న భాషలలో రాయబడిన సాహిత్యం .ఇవాళ స్కాట్ లాండ్ గా పిలువబడుతున్న దేశం లో మొట్టమొదట బ్రితోనిక్ భాషలో 6 వ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 8-  కొరియన్ సాహిత్యం -2 (చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 8-  కొరియన్ సాహిత్యం -2 (చివరిభాగం ) గోరియో పాటలు –హంజా పాత్రల నేపధ్యం లోని సాహిత్యంక్రమగా మారిపోయి గోరియా పాటలు వ్యాప్తిలోకి వచ్చాయి .ముందుగా మౌఖికంగా వ్యాప్తి అయి ,జోసేన్ పీరియడ్ లో వ్రాతరూపం పొందాయి .కొన్ని హన్గూయ్ లోకి మారాయి .వీటికవిత్వభాష  ను పయల్గొక్ లేక చాంగ్గా అంటారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 8- కొరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 8- కొరియన్ సాహిత్యం   ప్రపంచ దేశాల సారస్వతం 8-  కొరియన్ సాహిత్యం కొరియన్ భాష జపనీస్ –కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని చాలామంది అభిప్రాయం కానీ అది సరికాదు ఒక స్వతంత్ర భాష అని కొందరి భావన .మొదట్లో చైనీస్ లిపినే వాడుకొన్నా ,తర్వాత ద్వన్యాత్మక లిపిని అనుసరించారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 8-  స్కాండి నేవియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 8-  స్కాండి నేవియన్ సాహిత్యం .స్కాండినేవియన్ సాహిత్యాన్ని నార్డిక్ సాహిత్యం అంటారు .అంటే నార్డిక్ దేశాలైన ఉత్తరయూరప్ లోని డెన్మార్క్ ,ఫిన్లాండ్ ,ఐస్ లాండ్ ,నార్వే, స్వీడన్ ,స్కాండినేవియాకు చెందిన అసోసియేటెడ్ అటానమస్ టెర్రిటరీలు అయిన ఆలాండ్ ,ఫారో ఐలాండ్స్, గ్రీన్ లాండ్   దేశాలు .ఇందులో మెజారిటి దేశాలు ఉత్తర జర్మని భాష ను వాడుతాయి .ఫిన్లాండ్ ప్రజలలో ఎక్కువమంది యురాలిక్ భాషలు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 7- నార్వీజియన్ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 7- నార్వీజియన్ సాహిత్యం -2(చివరిభాగం ) నాలుగువందల ఏళ్ళ చీకటి స్కాండినేవియన్ యూనియన్ కాలం లో నార్వీజియన్ సాహిత్యం ఏమీ రాలేదు .తర్వాత డానో-నార్వీజియన్ అంటే 1387-1814కాలాన్ని ఇబ్సెన్ ‘’నాలుగువందల ఏళ్ళ చీకటి ‘’అన్నాడు .అప్పుడు కోపెన్ హాన్ యూనివర్సిటి ఒక్కటే యువతకు దిక్కు .ఇక్కడే అందరికి శిక్షణ ఇచ్చేవారు .గేబెల్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment