అమ్మకోరోజు
జీవితం లో వేగం అన్నిట్నీ దాటేస్తోంది
అస్తారు పదం గా అమ్మను చూసుకుంటూ
తరించాల్సిన వాళ్ళం అమ్మకు వో రోజు కల్పించి
తలుచు కుంటూ తరించామని సంబర పడుతున్నాం
వేగం మరీ పెరిగితే రా బోయే కాలం లో సమయం చాలక
అమ్మ గంట అని పెట్టుకొని గంట వాయిస్తామేమో
అంత సమయమూ లేక పొతే
ఇక అమ్మ నిమిషం ,అమ్మ సెకండు
గా స్మరిస్తూ బిజీ బిజీ అయి పోతామేమో
అమ్మ ఆంటే ఆప్యాయత ,మూర్తీభవించిన రూపం
అమ్మ ఆంటే త్యాగాల గని ,,ప్రేమ సాగరం
అమ్మ అమృతమయి ,ఆనంద దాయి
అమ్మ మన ముందుండి నడిపించే ప్రత్యక్ష దైవం
— అమ్మ ఋణం తీరనిది ,,తీర్చలేనిది
తీర్చాలనుకుంటే అమ్మకు అమ్మవై పుట్టు
అమ్మ మన పెన్నిధి ,ఆమె సన్నిధి దివ్యత్వమే
అమ్మ రోజు న మాత్రమే అమ్మని స్మరించి
ఊరుకుంటే అది క్రుతఘ్నతే తప్ప కృతజ్ఞత కాదు
అమ్మ ఆనందానికి ఆశ్రమం లో చేర్చటం కాదు
అమ్మ కనుసంననలో మెలిగి కంటికి రెప్ప లాగా కాపాడు .
మాతృత్వం అరుదైన వరం
దాన్ని అనంతం గా కాపాడి జన్మ చరితార్ధం చేసుకోవాలి
గబ్బిట దుర్గా ప్రసాద్

అమ్మ గురించి వ్రాసినది అమృతము పోలి ఉన్నది.. అద్భుతమైన సందేశం..
dhanyosmi..
LikeLike