సాహితీ బంధువులకు శుభాభినందనలు -సరస భారతి పద్నాలుగవ ప్రచురణ గా సరసభారతికి ఆత్మీయులు ,అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేస్తూ ,వారికి అభిమానులైన శ్రీ మాగంటి సుబ్బారావు గారికి(85) (తెనాలి )అంకితం ఇస్తున్న నేను నెట్ లో రాసిన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”ను మైనేనిగారి 80వ పుట్టిన రోజున 10-1-2015ఆదివారం ఉయ్యూరు లో శ్రీ సువర్చలాన్జనేయ స్వామి సన్నిధిలో సాయంత్రం జరిగె శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవసమయం లో లాంచనం గా ఆవిష్కరించి ,13-1-2015 బుధ వారం ధనుర్మాస సందర్భం గా భోగి నాడు మధ్యాహ్నం అరిగె స్వామి వారల కళ్యాణ సమయం లో పూర్తిగా ఆవిష్కరించి భక్తులకు అందజేస్తున్నామని తెలియ జే యటా నికి అందిస్తున్నాను . ఇది మైనేని వారు స్పాన్సర్ చేస్తున్న నాలుగవ పుస్తకం అని గుర్తు చేస్తున్నాను .
నెట్ లోనే నేను రాసిన ”దర్శనీయ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలు ”గ్రంధాన్ని అమెరికాలో ఉంటున్న మా మేనల్లుడు ఛి వేలూరి మృత్యుంజయ శాస్త్రి (జె వేలూరి-jay veluri) స్పాన్సర్ గా ఉండి స్వంత ఖర్చులతో ముద్రించటానికి ముందుకు వచ్చి తమ తల్లి దండ్రులైన శ్రీ వేలూరి వివేకానంద శ్రీమతి దుర్గ అంటే మా అక్కయ్యా బావ గార్లకు అంకితం ఇచ్చేట్లు ,ఆపుస్తకాన్ని 2015 మే -జూన్ నెలలలోవచ్చే వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి నాడు స్వామివార్ల కళ్యాణ మహోత్సవం లో ఆవిష్కరణ చేస్తే బాగుంటుందని అంగీకరింఛి ఇప్పుడే మెయిల్ ద్వారా తెలియ జేశాడు . ఇవి సరసభారతి ప్రచురిస్తున్న 14 ,15 పుస్తకాలు .నేను రాసిన తొమ్మిది ,పది పుస్తకాలు అని మనవి చేస్తున్నాను శ్రీ మైనేని గారికివారి కుటుంబానికి ,ఛి శాస్త్రికి ,వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియ జేస్తూ సరస భారతికి కొండంత అండగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలియ జే స్తున్నాను . ఇలాంటి సహృదయుల సహకారం తో సరస భారతి ప్రగతి పధం లో పయనిస్తోందని వినయం గా మనవి చేస్తున్నాను -దుర్గా ప్రసాద్

